breaking news
tatiparthi
-
‘రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం’
సాక్షి, తాడేపల్లి: తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు ఉరి బిగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందాలను ఎండగట్టారు. తెలంగాణలో తనపై ఉన్న కేసులను కొట్టేయించుకోవడం కోసమే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారని చంద్రశేఖర్ ఆరోపించారు.తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి సీఎం చెప్పిన మాటలపై చంద్రబాబు ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాయలసీమను శాశ్వతంగా కరువులో ఉంచి, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ‘బ్రీఫ్డ్ మీ బ్రదర్’తో లాలూచీ పడ్డారని మండిపడ్డారు.తెలంగాణ రోజుకు 8 టీఎంసీల నీటిని తోడుకుపోతుంటే, ఏపీకి కేవలం 0.63 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండటం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమన్నారు. పగలు ప్రజల ముందు బీజేపీతో బంధం ఉన్నట్టు నటిస్తూ, రాత్రికి కాంగ్రెస్‌తో ‘హాట్ లైన్’ చర్చలు జరపడం బాబు నైజమన్న చంద్రశేఖర్.. ఏపీలో కాంగ్రెస్‌తో విరోధులుగా ఉంటూ, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతోనే అంటకాగుతున్నారని దుయ్యబట్టారు.ఓటుకు నోటు కేసు పత్రాలు తగలబడ్డాయన్న వార్తల వెనుక ఉన్న మర్మమేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు పనులపై చంద్రబాబు ‘క్యాట్ వాక్’లు చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ఘనత వైయస్సార్ కుటుంబానిదేనని... చంద్రబాబుది శంకుస్థాపనల డ్రామా మాత్రమేనని స్పష్టం చేశారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా వైఎస్సార్, వైఎస్ జగన్ కృషి కనిపిస్తుందని చంద్రశేఖర్ తెలిపారు.పుట్టిన గడ్డ సీమకైనా, పిల్లనిచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఇప్పటికైనా తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయవద్దని చంద్రశేఖర్ హితవు పలికారు. మరోవైపు రాష్ట్ర చరిత్రలో శాసనసభ వ్యవహారాలకు నేడు ఒక దుర్దినమని, మండలి చైర్మన్ సంతకాన్నే ఫోర్జరీ చేసే స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..ఇద్దరు నాయుడుల నాటకాలు..సీఎం, నీటిపారుదలశాఖ మంత్రి ఇద్దరు నాయుడు బ్రదర్స్ కలిసి.. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నాటకాలు ఆడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో చంద్రబాబు నానా తంటాలు పడుతూ క్యాట్ వాక్‌లు చేస్తున్నాడు. జీవితంలో నిజాలే చెప్పని చంద్రబాబు.. తాను ఎప్పుడూ అబద్దాలు చెప్పనంటూ పెద్ద అబద్దం చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఉపయోగం లేదని కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రం రోజుకూ 8 టీఎంసీల నీటిని తోడుకుని పోతూ.. ప్రాజెక్టులు నిర్మించుకుంటుంటే, మరోవైపు పైనున్న కర్ణాటక నీ హయాంలో నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును మరింత పెంటుకుంటూ.. అదనంగా 120 టీఎంసీల నీటిని వాడుకుంటోంది.తెలంగాణ రాష్ట్రం 8 టీఎంసీలు రోజూ తీసుకుంటుంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న నీటి సామర్ధ్యం 0.63 టీఎంసీలు మాత్రమే. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా?. వాటర్ బోర్డు వ్యతిరేకించినా, పక్క రాష్ట్రం కాదన్న వైయస్సార్సీపీ హాయంలో రూ.990 కోట్లు ఖర్చుపెట్టి రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. మీ స్వార్ధం కోసం రాయలసీమ భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం.పిల్లనిచ్చిన మామైనా- జన్మనిచ్చిన సీమైకైనా వెన్నుపోటే..ఇవాళ శ్రీశైలంలో 795 అడుగులు నీటిమట్టం ఉంటే మచ్చుమర్రి ద్వారా మనం 0.33 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాం. రెండోది 834 అడుగుల నీరున్నప్పుడు మాల్యాల దగ్గర 0.3 టీఎంసీలు మాత్రమే తీసుకునే పరిస్ధితి ఉంది. ఇంకా మీరు సిగ్గుపడరా? ఇన్నేళ్లు సీఎంగా పనిచేసిన మీరు జన్మనిచ్చిన రాయలసీమకు ఏం చేయలేదన్న బాధ్యత మీకు లేదా? కనీస ఇంగితం పనిచేయ లేదా? మీ స్వార్థరాజకీయాలు కోసం పిల్లనిచ్చిన మామైనా, జన్మనిచ్చిన రాయలసీమైనా మీకు ఒక్కటే. వెన్నుపోటు తప్పదు. ఇదే మీ స్వార్థరాజకీయం. మీ వైఖరిపై కచ్చితంగా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది.40 ఏళ్ల నుంచి ఉన్న తెలుగుగంగకు నిధులు కేటాయించి పనులు చేశారా? 3 టీఎంసీల నీళ్లు తీసుకుంటే.. రాయలసీమతో పాటు నెల్లూరు కూడా సస్యశ్యామలం అవుతుంది. దాన్ని కూడా మోసం చేశారు. రాయలసీమ నుంచి హంద్రీనీవా కాలువ పనుల్లోనూ మోసమే. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కిలోమీటర్ల మేర 15వేల క్యూసెక్కుల సామర్ధ్యం పెంచడం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసాం. రెండోది శ్రీశైలం కుడి గట్టు కాలుల కింది 30వేల క్యూసెక్కులు పెంచాం. తెలుగుగంగకు రూ.500 కోట్లు ఖర్చు చేసి, హంద్రీనీవా కాలువ వెడల్పు పెంచాం. నిప్పుల వాగు ద్వారా నెల్లూరుకు 30 వేల క్యూసెక్కులు వెళ్లేలా పనులు ప్రారంభించారు. మరోవైపు హంద్రీనీవా సుజల స్రవంతి సామర్ధ్యాన్ని 2వేల క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచేలా పనులు ప్రారంభించిన వైఎస్ జగన్ వాటిని త్వరిత గతిన పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. అవుకు 2 టన్నెల్స్ ద్వారా దాదాపు రూ.260 కోట్లు ఖర్చు చేసి 20వేల క్యూసెక్కుల నీళ్లని పంపించగలిగాం. మూడో టన్నెల్ పనులుకు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే మొదలుపెట్టాం.రాయలసీమ ప్రాజెక్టులన్నీ వైఎస్ జగన్ హయాంలోనే..27 టీఎంసీల సామర్ధ్యమున్న గండికోట రిజర్వాయరు పనుల్లో రూ.1000 కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బకాయిలు పెట్టి పారిపోయిన చంద్రబాబు... ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ఇవ్వలేదని సిగ్గులేకుండా వైయస్.జగన్ ని విమర్శిస్తున్నాడు. గండికోట ఆర్ అండ్ ఆర్ పూర్తి ఆర్ అండ్ ఆర్ వైయస్.జగన్ హయాంలో రూ.1000 కోట్లు చెల్లించే ప్రాజెక్టు ప్రారంభించారు. చిత్రావతి ఆర్ అండ్ ఆర్ రూ.280 కోట్లు ఇచ్చిన తర్వాతే 10 టీఎంసీలు నింపగలిగాం. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో కూడా లీకేజీ పనులు రూ.90 కోట్లతో పూర్తి చేసి 17 టీఎంసీల నీటిని నింపాం.వెలిగొండ ప్రాజెక్టూ వైఎస్సార్సీపీ ఘనతే..వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడల్లా ప్యాకేజీ ఇవ్వకుండా వైయస్. జగన్ ప్రాజెక్టుని జాతికి అంకితం ఇచ్చారని చెబుతున్నాడు. అసలు నీ హాయంలో ఏడుసార్లు పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసిన ఘన చరిత్ర నీదే చంద్రబాబూ. వెలిగొండను మేం ఆ విధంగా చేయలేదు. 2021 జనవరి 13 నాటికి వైయస్.జగన్ ప్రభుత్వంలో ఒక టన్నెల్ పూర్తి చేస్తే.. 2024 ఫిబ్రవరి నాటికి రెండో టన్నెల్ పూర్తి చేశాం. ఒక మిషన్ నిల్చిపోయిన ప్రాంతం తప్ప మిగిలిన పనంతా పూర్తి అయింది. మొదటి, రెండు టన్నెల్లను కలిపి జూన్‌లో నీరు విదుదల చేయడానికి మార్చి 6న వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్టు దగ్గరకి వచ్చారు. శ్రీశైలంలో 841 అడుగులు నీటిమట్టం ఉండదు కాబట్టి... జూన్‌లో వచ్చే నీటిని విడుదల చేస్తామని చెబుతూ.. రూ.950 కోట్ల ఆర్ అండ్ ఆర్ బాకీ ఉన్నాం. ఆ బకాయిలను జూన్ నాటికి చెల్లించి.. జూన్ నాటికి ఆ నీటిని నల్లమల సాగర్ కి తరలిస్తామని చెప్పారు.ఆ రోజు వైఎస్ జగన్ రెండు టన్నెల్స్‌ని, నల్లమల సాగర్ని జాతికి అంకితం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తాను వచ్చిన ప్రతిసారీ అబద్దాలు చెప్పడం అలవాటు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో చేసిన పని కేవలం 2 కిలోమీటర్ల లైనింగ్ వర్క్ మాత్రమే. రూ.4వేల కోట్లు పెట్టుబడి పెడితే తప్ప వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాదన్న మీరు జూన్ 2026లో ఎలా నీళ్లిస్తామని చెప్పారు. కారణం వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 840 అడగులు ఉండాలి అది జూన్ లోనే సాధ్యమవుతుంది కాబట్టి, మా హయంలో రెండు టన్నెల్స్ పూర్తి అయ్యాయి కాబట్టి.. మీకు నీళ్లివ్వడం సాధ్యమవుతుంది.ఇదే పని ఆరోజు మేం 2025లో చెబితే.. ఇవాల్టికి మీరు ఆ పని చేయలేకపోయారు. ఫీడర్ కెనాల్ తవ్వలేదు.. రెండో కెనాల్ లో కోర్టు కేసుల వల్ల ఉండిపోయిన మిషన్ ను కోర్టు కేసుల వల్ల... డిస్ మెంటల్ చేయలేదు. మరి ఎలా నీళ్లు వదులుతున్నారు. రెండేళ్లలో మీరు రెండు దఫాలుగా రూ.200, రూ.350 కోట్లు కేటాయిస్తే.. రెండేళ్లు కలిపి కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ.4 వేల కోట్లు అవసరం అని చెప్పిన మీరు రెండేళ్లలో కేవలం రూ.400 కోట్లే ఎలా ఖర్చు చేయగలిగారు. అటం ఆరోజు వైఎస్ జగన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం వల్లే మీకు ఇధి సాధ్యమైంది.కానీ చంద్రబాబు మాత్రం పత్రికల్లో 1996 మార్చిలో వెలిగొండ పనులకు శ్రీకారం చుట్టామని ప్రచారం చేసుకుంటూ... ప్రాజెక్టు ఫీజబులిటీ రిపోర్టు మాత్రం 2001లో ఇచ్చారని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. వైయస్.రాజశేఖర్ రెడ్డి అన్ని అనుమతులు తెచ్చి.. రూ.500 కోట్లతో పనులు ప్రారంభించారు. అంటే మీ హయాంలో ఏ పనీ జరగలేదని అర్ధం అవుతుంది. 9 సంవత్సరాల సీఎంగా ఉండి.. పశ్చిమ ప్రకాశం వాసుల కలల కొండ వెలిగొండ ప్రాజెక్టుకు ఉరలేసింది నువ్వు కాదా చంద్రబాబూ?తట్టెడు మట్టి కూడా తీయని చంద్రబాబు ప్రభుత్వం..రూ.3543 కోట్లు వెచ్చించిన వైఎస్సార్ 2004లో అన్ని అనుమతులు తెచ్చి 3వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న ఒక టన్నెల్ ని 11.5 కిలోమీటర్లు, 8వేల క్యూసెక్కుల సామర్ధ్యమున్న మరో టన్నెల్ ని దాదాపు 6 కిలోమీటర్లు పూర్తి చేశారు. రెండూ కలిపి రోజుకు ఒక టీఎంసీ సామర్ధ్యంతో నిర్మించారు. నల్లమలసాగర్ సామర్ధ్యం 53.5 టీఎంసీలు కాగా.. శ్రీశైలంలో 45 రోజుల పాటు మాత్రమే 845 అడుగులపైన నీటి నిల్వ ఉంటుంది.రోజుకొక టీఎంసీ తరలిస్తేనే 53 టీఎంసీలు నిల్వ సాధ్యం. ఇందుకు అవసరమైన సొరంగాల తవ్వకం పూర్తైంది. వెలిగొండలో ఇంకా చేయాల్సింది తీగలేరు కెనాల్, గొట్టేపాడు కాలువ, ప్రధాన కాలులను పూర్తి చేయాలి. ఎర్రగొండపాలెనికి నీరు రావాలంటే తీగలేరు కెనాల్ పూర్తి చేయాలి. ఒక తట్టెడు మట్టి కూడా తీయకుండానే మేమేం చేశామని చెప్పుకుంటున్నారు.నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో 30 మండలాల ప్రజల 15.25 లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ఇలాంటి బాగోతాలు చేయడం సిగ్గుచేటని చంద్రశేఖర్ మండిపడ్డారు. ఐరన్ రాడ్లకు రిబ్బన్లు కట్టి కటింగ్‌లు చేసిన చరిత్ర చంద్రబాబు సొంతమైతే.. బాధ్యతతో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేసిన చరిత్ర వైయస్సార్ దని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పగలు బీజేపీతో సంసారం, రాత్రి కాంగ్రెస్‌తో ప్రేమాయణం చేస్తూ... రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయొద్దని సూచించారు.పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టీటీపీ నాయకుడే కేసు వేసినా మేం పనులు ఆపకుండా రూ.990 కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణాలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఫైల్స్ తగలబడ్డాయి. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవన్నీ టీటీపీ స్వార్ధ రాజకీయం కోసమే జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంత ప్రజలకు భరోసానిచ్చేలా.. ఎత్తిపోతల నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలిస్తే 101 టీఎంసీలు ఎత్తిపోతల దగ్గర నుంచి తీసుకునే హక్కు మనకు ఉంది. 20 ఏళ్లలో ఎప్పుడూ 101 టీఎంసీల నీటిని వాడుకున్న చరిత్ర ఏపీకి లేదు.తెలంగాణా రాష్ట్రం 8 టీఎంసీలను 770 అడుగుల నుంచి 800 అడుగుల లూపే తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఏపీలో అతిపెద్ద భూభాగమున్నా.. 834 అడుగుల వరకు 0.3 టీఎంసీల మాత్రమే మనం తీసుకెళ్లగలం. మరి ఈ సోయ ప్రభుత్వానికి లేదా? తెలంగాణాతో ఎందుకు లాలూచీ పడుతున్నారు. చర్చను సజావుగా జరపకుండా అడిగిన ప్రశ్నలకు బదులివ్వకుండా సభను ఎందుకు తప్పదోవ పట్టిస్తున్నారు. ? అడిగిన ప్రశ్నలకు ఎందుకు బదులివ్వడం లేదని నిలదీశారు.రాష్ట్ర చరిత్రలో శాసనసభ వ్యవహారాలలో ఇవాల ఒక దుర్దినం. మండలి చైర్మన్ గారి సంతకాన్నే ఫోర్జరీ చేయడం దురదృష్టకరం. తనకు సంబంధం లేదని చైర్మన్ గారు చెబుతున్నారు. లఘు చర్చకు అనుమతించిన తర్వాత ముందే ప్రభుత్వం ప్రకటన ఎలా ఇస్తుంది? చర్చకు అనుమతించిన తర్వాత స్టేట్ మెంట్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చినట్లు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒక పేపర్ చూపించారు. చైర్మన్ నేను ఇవ్వలేదని చెబుతుంటే.. పది మంది మంత్రులు పేపర్ చూస్తూ ఛైర్మన్ పోడియం చుట్టుముట్టారు. అంటే దొంగలు ఎవరు? ఆయన హక్కులకి కూడా భంగం కలిగించడం కాదా? తాను సంతకం చేయడం లేదని చెబుతున్నా.. ఉందని వాదిస్తున్నారంటే తప్పు ఎవరు చేసినట్లు? ఇది రాజ్యంగ విరుద్దమైన పరిణామమని మండిపడ్డారు.చర్చకు మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అడిగితే చైర్మన్ అనుమతిచ్చారు. ఆయన స్టేట్ మెంట్ చదువుతుంటే ఆ విజువల్స్, వీడియో ఆడియో బయటకు రాదు.. కానీ మంత్రి పయ్యావుల కేశవ్ అర్ధరాత్రి అయినా చర్చిస్తామన్న వీడియో మాత్రమే బయటకు విడుదల చేశారు. చర్చ జరగక ముందే మంత్రులు ఎందుకు పోడియం చుట్టుముట్టారు. కావాలనే చేస్తున్నారని చైర్మన్ చెప్పినా వినలేదు. కూటమి నేతలు అధికార మదాన్ని ప్రదర్శించారు. చర్చ జరిగితే చంద్రబాబు కుటుంబానికే నష్టం కాబట్టి అధికార పార్టీ చర్చ నుంచి నుంచి పారిపోయిందే అధికార పార్టీ. రూ.321 నెయ్యి రేటు ఉంటే.. ఇందాపూర్ రూ.658 కి కట్టబెట్టడానికి మాత్రమే టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఒక స్కామ్ కోసం తీసుకొచ్చిన స్కీమే కల్తీ లడ్డూ అని తేల్చి చెప్పారు.అధికార పార్టీ చీకటి దందాలు, లూఠీ వ్యాపారాలు, ఆర్దిక లావాదేవీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. పక్క రాష్ట్రం ఉపముఖ్యమంత్రి చనిపోతే ఆ లింకులు కూడా హెరిటేజ్ కంపెనీకే బయటపడుతుంటే మా కంపనీ హెరిటేజ్ ఫైనాన్స్ చేస్తుంది.. ఆ విమానం కూలిపోతుందని కలగన్నామా అని చెబుతున్నాడు. వీఎస్ ఆర్ విమానాల్లో మీరే జల్సాలు చేస్తున్నారు. విమానయానశాఖా మంత్రి మీ పార్టీ నేత. చనిపోయిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు కుట్ర ఉందని దుమ్మెత్తి పోస్తున్నారు. దాన్ని ఖండించకపోగా లోకేష్ కామెడీ చేస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా ఆ లింకులు చంద్రబాబు దగ్గరకు వస్తున్నాయని తేల్చి చెప్పారు. -
‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్దాలు’
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ని చూసి ఊసరవెళ్లి కూడా ఉరేసుకుంటుందన్నారు. ఇక లోకేష్ పులకేసిని తలపించారని.. ఈ ముగ్గురు సొంత డబ్బా కొట్టుకోవటానికే అసెంబ్లీని వేదికగా చేసుకున్నారంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు.‘‘కల్తీ కారణంతో వెనక్కు పంపిన నాలుగు ట్యాంకర్లను తిరిగి ఎందుకు తీసుకున్నారు?. వైష్ణవి డెయిరీ సంగం డెయిరీ లోగోతో మజ్జిగ అమ్ముతున్నారు. వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి?. ఈ రాష్ట్రంలో పాలు, నీళ్లు అన్నీ కల్తీనే. పాలల్లో ఏం కలిసిందో ఎల్లో మీడియా ముందుగానే ఎలా రాస్తుంది?. లడ్డూ ఇష్యూలో కూడా ఇదే విధంగా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసింది. సీబిఐ రిపోర్టును కూడా తప్పుదారి పట్టించిన ఘనత చంద్రబాబు, ఎల్లో మీడియాది’’ అంటూ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘హెరిటేజ్ డెయిరీ ఎప్పుడూ ఆలయాలకు నెయ్యి సరఫరా చేయలేదని టీటీడీ నేతలు పచ్చి అబద్దాలు చెప్పారు. 2002లో రూ.117లకు టిన్ల ద్వారా హెరిటేజ్ నెయ్యి సరఫరా చేసింది.. కానీ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారు. బోలేబాబాతో సహా అందరు బాబాలకు చంద్రబాబే పెద్ద దిక్కు. ఇందాపూర్ డెయిరీని మ్యానుఫ్యాక్చరింగ్ నుండి కో-మ్యానిఫాక్చరింగ్ యూనిట్‌గా ఎలా మార్చారు?. వైష్ణవి డెయిరీ గేట్లకు రంగు మార్చితే మీ బాగోతాలన్నీ కనుమరుగు అవుతాయా?..హెరిటేజ్ భాగోతం బయట పడగానే నేషనల్ సేల్స్ మేనేజర్ని మార్చేశారు. తిరుమల కొండ మీద ఎలాంటి ఎన్నికలు జరగకూడదని వైఎస్సార్ హయాంలో జీవో తెచ్చారు.. కానీ దాన్ని కూడా రెండు కొండలకే వెంకటేశ్వర స్వామిని పరిమితం చేశారంటూ చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేశారు. తిరుమలకు ఏడు కొండలు కాదు రెండు కొండలేనంటూ జీవో ఉంటే అది చంద్రబాబు బయట పెట్టాలి. తిరుమలలో అన్యమత ప్రచారం చేసుకోవటానికి అనుమతి ఇస్తానని బైబిల్ మిషన్ సభలో చంద్రబాబు మాట్లాడారు. తిరుమల వెళ్లే బస్ టిక్కెట్ల మీద కూడా అన్యమత ప్రచారం చేయటానికి చంద్రబాబే జీవో ఇచ్చారు.నెల్లూరు జోన్లో ముద్రించిన టిక్కెట్ రోల్స్‌ని తిరుమలకు కూడా పంపారు. వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిన ఘనుడు చంద్రబాబు. నీచమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లు. చంద్రబాబు జీవితంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించ లేదు. అలాంటి వ్యక్తి వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్టు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు’’ అంటూ చంద్రశేఖర్ మండిపడ్డారు. -
‘ఏడేళ్ల చిన్నారిని డ్రమ్‌లో కుక్కేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది?’
తాడేపల్లి : ఏపీలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి కనబడుటం లేదా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టి. చంద్రశేఖర్. ఈ అఘాయిత్యాల గురించి అసెంబ్లీలో అడిగితే హోంమంత్రి సమాధానం చెప్పలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదంటూ సమాధానం చెప్పారన్నారు. మరి మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిని హతమార్చి డ్రమ్‌లో కుక్కేస్తే ప్రభుత్వం ఏం చేస్తందని నిలదీశారు. ఇది హోంమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కనబడుటం లేదని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్.. ‘ రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తానంటున్న చంద్రబాబు.. అసెంబ్లీలో తన పక్కనే కూర్చోపెట్టుకుంటున్నారు. బాలకృష్ణ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఆయన అనుచరుడు మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి?, నేరస్తులంతా క్యాష్‌ను సూట్ కేసులో పెట్టి రాజేష్ ద్వారా లోకేష్‌కి పంపుతారు. దాంతో కేసులు లేకుండా పోతున్నాయి. చిన్నపిల్లలను చెరబడుతుందే చంద్రబాబు, హోంమంత్రి తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కాసుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి కోటప్పకొండ దగ్గర కూడా పోలీసుల సమక్షంలో మద్యం విక్రయాలు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రభ కడితే పోలీసులు లాఠీలతో కొట్టారు. కరెంటు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారు. నియంత పోకడలు ఎల్లకాలం పని చేయవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇవ్వమని అడిగితే స్పీకర్ నన్న బెదిరించారు. చంద్రబాబు హెరిటేజ్‌దే ఇందాపూర్ డైరీ. ఊరుకొక మాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టారు’ అంటూ విమర్శించారు. ఇదీ చదవండి: మదనపల్లిలో మైనర్ బాలిక హత్య కేసు.. ఉద్రిక్తత -
లోకేష్‌ను లేపితే కాసులు, లేపకుంటే ఉంటే కేసులు.. పవన్ కళ్యాన్ గురించి మాట్లాడి వేస్ట్..
-
‘ఎల్లో మీడియా కథనాల కూర్పుగా గవర్నర్ ప్రసంగం’
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా కథనాలు కూర్పుగా గవర్నర్ ప్రసంగం ఉందని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లలో వచ్చే కథనాలనే పుస్తకంగా అచ్చేసి ఆయనతో చదివించారేమోనన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ప్రసంగమంతా చూస్తుంటే భ్రమలు, అబద్ధాలు, కాకి లెక్కలు, నిరాధార ఆరోపణలే కనిపిస్తాయని వివరించారు.ఒక్క మాటలో చెప్పాలంటే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన అట్టర్ ఫ్లాప్ సినిమాకి ప్రెస్‌మీట్ పెట్టి కలెక్షన్ల వర్షం కురిసిందని చెప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. విజనరీనని చెప్పుకునే చంద్రబాబు పాలనలో అడుగడుగునా వింత పోకడలే తప్ప విషయం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ నిలదీస్తుందని ప్రభుత్వం భయపడుతోందని, సభలో ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకూడదనే భయంతోనే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని చెప్పారు.ప్రతిపక్ష హోదా విషయంలో గవర్నర్ చొరవచూపాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. 164 మంది సభ్యులున్న కూటమికి 11 మంది వైఎస్సార్సీపీ సభ్యులకు సమాధానం చెప్పే దమ్ము లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు రావడానికి వైయస్సార్సీపీ సిద్ధంగా ఉందని తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అట్టర్ ఫ్లాప్ సినిమాకి కలెక్షన్ల వర్షం అన్నట్టుందికూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా గవర్నర్ ప్రసంగంలోనైనా వాస్తవాలు ఉంటాయనుకుంటే ఆయనతో కూడా పచ్చి అబద్దాలు చెప్పించారు. ఆయన ప్రసంగం చూస్తే నిత్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీ5, ఏబీయన్‌లలో వస్తున్న కథనాలను వింటున్నట్టు, చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలనే పుస్తకంగా అచ్చేసి గవర్నర్‌తో చదివించారేమోనని ఎవరికైనా అనుమానం కలుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఊసే లేదు. అవే అబద్ధాలు, కాకి లెక్కలు, నిరాధార ఆరోపణలు, ఏదో జరిగిపోతుందన్న భ్రమలు.. ఇవి మాత్రమే కాకుండా నిత్యం ఎల్లో మీడియాలో కనిపించే వైఎస్సార్సీపీ మీద ఏడుపులు, పెడబొబ్బలు.. స్థూలంగా గవర్నర్ ప్రసంగం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సినిమాకి కలెక్షన్ల వర్షం కురిసిందని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకున్నట్టుగా ఉంది.20 నెలల్లో రూ. 3.27 లక్షల కోట్ల అప్పులు చేసి పతనం వైపున రాష్ట్రాన్ని నడిపిస్తూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నట్టు గవర్నర్ తో చెప్పించడం హాస్యాస్పదంగా ఉంది. నిన్నటి వరకు చేసేందేమీ లేదు. ఈరోజు ఏం చేస్తాడో తెలియదు.. కానీ ఏరో స్పేస్ సిటీ, ఎలక్ర్టానిక్ సిటీ, క్వాంటం సిటీల పేరుతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. ఎవరో చేసిన హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ డెవలప్మెంట్ను ఇప్పటికీ తన గొప్పగానే చెప్పుకుంటున్నాడు.ఇళ్లు లేవు, పింఛన్లు లేవు, మహిళలకు రక్షణ లేదుపునర్నిర్మాణం, అభ్యుదయం, అభివృద్ధి అని పెద్ద పెద్ద మాటలు చెబుతున్న ప్రభుత్వం.. రెండేళ్లవుతున్నా విధ్వంస పాలన అంటూ వైయస్సార్సీపీ మీద నెపం నెట్టడం దౌర్భాగ్యం. గత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాలో రూ. 100 కోట్లు పెట్టి దిగిపోతే ఐదేళ్లు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో విజయవంతంగా నడిపించారు. రూపాయి అవినీతి లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. సంపద సృష్టిస్తానని ప్రజలకు నమ్మబలికి 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం.. సంపద సృష్టించడం పక్కనపెడితే రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసి శ్రీలంక హీనంగా మార్చేశాడు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ. 3.36 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం 20 నెలలకే రూ. 3.27 లక్షల కోట్ల అప్పులు చేసింది. అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, కంపెనీల ఏర్పాటు పేరుతో విశాఖలో భూముల పంపకం తప్పించి చంద్రబాబు చేసింది శూన్యం.చేసిన తప్పులు, హామీలు అమలు చేయలేని చేతకానితనాన్ని, జరుగుతున్న అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఆఖరుకి కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిని వివాదాల్లోకి పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటు. కూటమి నాయకుల దారుణాలను ప్రశ్నిస్తే మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ దాడులు చేశారు. శాంతిభద్రతల పతనం జరుగుతుంటే గవర్నర్ ప్రసంగంలో దాని ఊసే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర పోలీసు వ్యవస్థ దేశంలోని అత్యున్నత స్థానం నుంచి అట్టడుగు స్థాయికి పడిపోతే గవర్నర్ ప్రస్తావించలేదు. ఒక్క పింఛన్ కొత్తగా ఇవ్వకపోగా 5 లక్షల పింఛన్లు తొలగించారు. ఒక్క ఇంటి స్థలం మంజూరు చేయకపోయినా ఇంటి నిర్మాణాలు ఆపేశారు.ఫీజు రీయింబర్స్ బకాయిలు క్లియర్ చేయకపోయినా, ఆరోగ్యశ్రీతో వైద్యం అందకపోయినా, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోయినా.. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న బడాయి మాటలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి.. ట్రూఅప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు రెండింతలు పెంచేసి దోచుకుంటున్నారు. శ్రీశైలం చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భక్తుల మీద లాఠీ చార్జీ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగారు. ఆస్తుల కోసం ఆలయాల నేలమట్టం జరుగుతోంది.సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన నాయకుల పాలనలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా గవర్నర్ ప్రస్తావన ఎక్కడా లేదు. వక్ఫ్ భూములు, ఆలయాలకు చెందిన ఎండోమెంట్ భూములు కాజేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని దూరం చేస్తుంటే గవర్నర్ ప్రసంగంలో దాని ప్రస్తావనే కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్న ప్రతిపక్షం మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు.ప్రభుత్వాన్ని నిలదీయాలంటే సభలో సమయం ఇవ్వాలి కదాఎక్కడ చూసినా అన్యాయాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీ, అత్యాచారాలు రాజ్యమేలుతున్నాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. సభలో ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ.. ఆరు కోట్ల ప్రజలందరి తరఫున 175 నియోజకవర్గాల సమస్యలను సభలో బలంగా వినిపించాలంటే అసెంబ్లీలో సమయం కావాలి కదా. సమయాన్ని కేటాయించకుండా అసెంబ్లీకి రమ్మంటే ఎలా? దీనిపై గవర్నర్‌కి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా గొంతు వినిపించకపోతే అమాయకులకు న్యాయం జరిగేది ఎలా?వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే నిబంధన ఎక్కడైనా ఉందా? గవర్నర్ దీనిపై స్పందిస్తారని ఆశించినా ఫలితం కనిపించలేదు. పక్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మనకు రావాల్సిన నీటి వాటాను వినియోగించుకుంటుంటే చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నాడు. రాయలసీమ ప్రాంతానికి సంజీవని లాంటి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టేశాడు. వీటన్నింటిపై అసెంబ్లీలో చర్చకు రాకూడదని, చర్చకు వస్తే ప్రజలకు సమాధానం చెప్పే దమ్ములేక వైయస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి వెనకడుగు వేస్తున్నారు. వైఎస్ జగన్ హెచ్చరించినట్టుగానే దోచుకో పంచుకో తినుకో లాంటి పాలన నడుస్తోంది.జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలుఅసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని బలంగా నిలదీయాలని ఉంది. కానీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడిపోతోంది. దీనిపై గవర్నర్ గారు కూడా చొరవ చూపించాలి. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై ఇప్పటికే గవర్నర్‌కి వినతిపత్రం ఇచ్చినా చర్యలు కనిపించలేదు. అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప, నిర్మాణం జరగడం లేదు. పెట్టుబడుల పేరుతో చంద్రబాబు విలువైన భూములు బినామీలకు రాసిచ్చేస్తున్నాడు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేశారని తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. -
3 హత్యలు, 6 మానభంగాలు.. మీ ఇంట్లో మహిళ అయితే ఇలాగే మౌనంగా ఉంటారా?
-
ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం బాబూ?: తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా మండిపడ్డారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన మహిళకు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో జరిగిన అన్యాయంపై స్వయంగా బాధితురాలే చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.మహిళా లోకానికి మీ దృష్టిలో విలువ లేదా బాబూ?ఒక మహిళ మీ వద్దకు వచ్చి.. మీ ఎమ్మెల్యే నన్ను వేధిస్తున్నాడు, న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే కూడా స్పందించరా చంద్రబాబు? ఇదేనా మీ 40 సంవత్సరాల అనుభవం? ఇదేనా మహిళా లోకానికి మీ దృష్టిలో ఉన్న విలువ?. రాష్ట్రంలో చంద్రబాబు పాలన కీచక పర్వంగా మారింది. అరవ శ్రీధర్ పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా, వచ్చినది టీడీపీ నుంచే. ఆదిమూలం నుంచి అరవ శ్రీధర్ వరకు కీచకత్వం కొనసాగుతూనే ఉంది.3 హత్యలు, 6 మానభంగాలు.. ఇదేనా మీ పాలన?రాష్ట్రంలో పరిపాలన పక్కదారి పట్టింది. 10 విహారయాత్రలు, 3 హత్యలు, 6 మానభంగాలు… ఇదే ఈ రోజు రాష్ట్ర పాలన పరిస్థితి. రైల్వే కోడురు బాధిత మహిళ చేసిన ఆరోపణలు జుగుప్సాకరం. హోంశాఖను ‘వర్క్ ఫ్రమ్ హోం’ శాఖగా మార్చేశారు, హోం మంత్రి పోలీస్ వ్యవస్థను పాతాళానికి తొక్కేశారు.మీ ఇంట్లో మహిళ అయితే ఇలాగే మౌనంగా ఉంటారా?సంక్రాంతి సందర్భంగా నారావారి పల్లెలో ముఖ్యమంత్రికి బాధిత మహిళ స్వయంగా వెళ్లి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక వివాహిత మహిళ జీవితానికి సంబంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి ఇలాగేనా వ్యవహరించేది. అదే మీ ఇంట్లో మహిళ గురించి ఏమీ అనకపోయినా రాద్ధాంతం చేసే మీరు… రైల్వే కోడూరులో బాధిత మహిళపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?ఇది దద్దమ్మ ప్రభుత్వంకుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనను పంచాయితీ చేసి పక్కదారి పట్టించారు. అమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేసులోనూ చర్యలు లేవు. ఇదే టీడీపీ పాలన. ముఖ్యమంత్రిగా, టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు తన పాలన చూసి సిగ్గుపడాలి. బాధిత మహిళ గోడు వెళ్లబోసుకుంటే మాటల దాడులు చేయిస్తారా? ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిస్తారా? అరవ శ్రీధర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరిగినా పట్టించుకోని దద్దమ్మ ప్రభుత్వం ఇది.శాంతిభద్రతలు కాపాడలేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు? దేశంలోనే ఏపీ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయింది. అయినా గొప్ప ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకుంటున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి స్పందించకపోతే బాధిత మహిళ స్వయంగా బయటకు వచ్చి మాట్లాడుతుంది. సుగాలి ప్రీతికి జరిగిన ఘోరం, ఇవాళ రైల్వే కోడూరులో మహిళకు జరిగింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందే. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదుకోకపోతే ప్రతిపక్షంగా మేమే ఆమెకు అండగా నిలుస్తాం” అని తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రైల్వే కోడూరు ఘటనపై తక్షణమే చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్
-
ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?: తాటిపర్తి చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నేతలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక మాఫియాన్ని నడుపుతున్నారా?. రాష్ట్రంలో రాజకీయ రక్తపాతాన్ని పారిస్తున్నారు. రెడ్‌బుక్ పేరుతో తీవ్రమైన దారుణాలకు పాల్పడుతున్నారు. ఏపీలో కేవలం కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘హనీట్రాప్ చేసిన ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదుతో పీఎస్ఆర్ ఆంజనేయుల్ని జైల్లో పెట్టారు. అక్రమాలు బయట పెట్టిన ఐపీఎస్ అధికారి సంజయ్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. రెడ్‌బుక్ వైఎస్సార్సీపీ నేతలపైనే కాదు.. అధికారులపై కూడా ప్రయోగించి వేధిస్తున్నారు’’ అని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ‘‘కూటమి నేతలు.. భారీగా భూ దోపిడీ, ఇసుక, మైనింగ్ స్కాంలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఏపీలో ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ సర్కార్. కూటమి పాలనలో రాష్ట్రంలో అన్ని అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. కూటమి నేతలు ప్రైవేటీకరణ పేరుతో దోపిడీ చేస్తున్నారు. కూటమి నేతల దోపిడీని వైఎస్సార్సీపీ బయటపెడుతోంది. కూటమి నేతలు టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్‌ను మానసికంగా వేధించారు. సతీష్ మరణానికి కూటమి ప్రభుత్వమే కారణం. సతీష్ మృతిపై ఎల్లో మీడియా కట్టుకథలు చెబుతోంది...ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, పోస్టుమార్టం జరగక ముందే హత్య అని టీడీపీ నేతలు ఎలా చెప్పారు?. గొడ్డలి వేటు గాయాలతోనే సతీష్ రైలు ఎక్కాడా?. రక్తపు మరకలు ఎవరూ చూడలేదా?. హత్య జరుగుతుంటే జనం ఎవరూ చూడలేదా?. కట్టుకథలను టీడీపీ నేతలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు?. సతీష్ వీపు మీద గొడ్డలి వేటు ఉన్నట్టు ఎల్లో మీడియా ఎలా ప్రచారం చేసింది?’’ అంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు...చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం మాత్రం చేసుకుంటుంది. జగన్ తెచ్చిన ప్రాజెక్టులకు టీడీపీ స్టిక్కర్లు వేస్తున్నారు. గోమాంసం విచ్చలవిడిగా ఎగుమతి అవుతుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మహిళలపై జనసేన నేతలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పవన్ చోద్యం చూస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులను చంద్రబాబు దారుణంగా అవమానించారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ విలాసాలు చేస్తున్నారు. ప్రయివేటు వ్యక్తుల భూములను హెలికాప్టర్ నుండి చిత్రీకరించే పవన్‌కి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఆక్రమణ ఇల్లు కనపడలేదా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు. -
క్రెడిట్ ను దొంగతనం చేయడంలో మాత్రం తండ్రీకొడుకులు ఇద్దరూ ఇద్దరే
-
క్రెడిట్ చోర్ ఎవరంటే అందరూ చెప్పేది చంద్రబాబు పేరే: తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో క్రెడిట్ చోర్ పదం విస్తృతంగా ఉందని.. క్రెడిట్ చోర్ ఎవరంటే అందరూ చెప్పేది చంద్రబాబు పేరేనంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇతరుల క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు, లోకేష్ విదేశాల్లో విలాసాలు చేస్తున్నారు. 2014-19లో కూడా విదేశాల్లో పర్యటనలు చేశారు. కానీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు’’ అని చంద్రశేఖర్ మండిపడ్డారు.‘‘ఎయిర్ బస్, ఆలీబాబా లాంటి సంస్థలు సహా 150 సంస్థలు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఎల్లో మీడియా వార్తలు రాశాయి. మరి ఆ పెట్టుబడులు ఏవీ?. ఒక్క సంస్థ కూడా ఎందుకు రాలేదు?. చంద్రబాబు తన జల్సాల కోసమే విదేశాల్లో విహరిస్తున్నారు. ఏపీలో దోచుకున్నదంతా చంద్రబాబు విదేశాల్లో దాచుకోవటానికే వెళ్తున్నారు. తన ప్రచార పిచ్చికి ఎల్లో మీడియాని వాడుకుంటున్నారు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన డేటా సెంటర్ చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు...2020లోనే జగన్ అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశారు. ఐటీ పార్కు నిర్మాణం ద్వారా 25 వేల ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందం కూడా చేశారు. సింగపూర్ నుండి సబ్‌సీ లైన్‌కు అప్పుడే శంకుస్థాపన చేశారు. అంతా అయిన తర్వాత చంద్రబాబు వచ్చి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న అదానీ పేరును చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?. అదానీ పేరు చెబితే జగన్ హయాంలో జరిగిన ఒప్పందాలు, పెట్టబడుల విషయాలు వెలుగులోకి వస్తాయని భయం’’ అంటూ చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే: తాటిపర్తి చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో రక్షిత తాగునీటిని అందించలేని ప్రభుత్వ నిర్లక్ష్యమే.. విద్యార్ధుల మరణానికి కారణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ ఓ బాధ్యత లేని విద్యాశాఖ మంత్రి కాగా.. చంద్రబాబు ఓ అసమర్థ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు విద్యార్ధులు చనిపోయారని.. ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని తేల్చి చెప్పారు.చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో విద్యావ్యవస్ధలో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడుతో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పించి విద్యాలయాలను దేవాలయాలుగా మార్పు చేస్తే... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూపాయి కాగితం ఖర్చుపెట్టిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్థతకు నిదర్శనమని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..మొద్దు నిద్రలో విద్యా వ్యవస్థ..రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొద్దునిద్రలో ఉంది. ప్రభుత్వరంగ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు అధ్వాన్న స్ధితిలోకి నెట్టబడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మరణ మృదంగాన్ని తలదన్నే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జూలై నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 11 మంది గిరిజన బిడ్డలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారు. గిరిజన తల్లిదండ్రులు కొండా కోనలను దాటించి గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించారు.విద్యావంతులుగా వస్తారనుకుని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు విగత జీవులుగా వస్తున్న పిల్లలను చూసి గుండె పగులేలా రోదిస్తున్నారు. ఇది ప్రభుత్వ చేతగాని తనానికి, అసమర్థతకు నిదర్శనం. ఈ పిల్లల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన చేస్తున్నాడని చెప్పడానికి, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనికిరాడు అని చెప్పడానికి జరుగుతున్న ఉదంతాలే నిదర్శనం.వైఎస్ జగన్ హయాంలో దేవాలయాలుగా విద్యాలయాలుఒక కుటుంబంలో రేపటి తరాన్ని నడిపించాల్సిన బిడ్డలను అర్ధాంతరంగా పోగొట్టుకోవడం అత్యంత బాధాకరం. జూలై నెలలో పదో తరగతి చదువుతున్న పిల్లవాడు చనిపోతే.. ఇవాళ వారం రోజుల్లోనే ఇద్దరు బాలికలు కేవలం సరైన తాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో మృత్యువాత పడడం దురదృష్టకరం. వైఎస్ జగన్ హయాంలో విద్యాలయాలను దేవాలయాలుగా మార్చారు.ప్రతి విద్యార్థి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలని ప్రతి స్కూల్లో ఫర్నీచర్, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి మంచినీళ్ల సరఫరా, డిజిటల్ క్లాస్ రూములు, ఇంగ్లిషు, తెలుగు మీడియంలో ముద్రించిన పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిషు మీడియం, టోఫెల్ విద్య అందించడంతో పాటు నూతనంగా తరగతి గదులు నిర్మించి వసతులు ఏర్పాటు చేశారు. నాడు-నేడు ద్వారా దాదాపు 50 వేల స్కూళ్లను అభివృద్ధి చేసి ప్రజలకందించారు. అదే విధంగా అమ్మఒడి పథకంలో రూ.2 వేలు మినహాయించి.. స్కూళ్లు అభివృద్ధి, మౌలిక వసతులను మెరుగుపర్చడానికి వాడితే ఆ రోజు అర్ధజ్ఞానం కలిగిన లోకేష్ అమ్మఒడి అర్ధవడి అయిందని మాట్లాడారు.హోం మంత్రి భోజనంలోనే బొద్దింకఇవాళ లోకేష్ కూడా అమ్మఒడిలో రూ.2వేలు కట్ చేసి... స్కూళ్ల అభివృద్ధికి, వసతుల కల్పనకు ఎక్కడైనా రూపాయి కాగితం వెచ్చించారా లోకేష్ ? ఏ స్కూల్ లోనైనా నాణ్యమైన భోజనం అందించారా? రాష్ట్ర ప్రజలు ఆలోచన్ చేయాలి. సాక్షాత్తూ ఈ రాష్ట్ర హోంమంత్రి భోజనం చేస్తున్న కంచంలోనే బొద్దింక ఆహారంలో వచ్చింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ 14 నెలల కూటమి పాలనలో అనేక సందర్భాల్లో కలుషిత ఆహారం తిని పెద్ద సంఖ్యలో పిల్లలు ఆసుపత్రిలో చేరిన సందర్బాలు ఉన్నాయి. ఇది చేతకాని పాలనకు పరాకాష్ట కాదా? ఇది అసమర్థ ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు కావాలా? 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రికి పరిపాలన మీద ఏమాత్రం శ్రద్ధ ఉందో ఈ ఘటనలు చూస్తేనే అర్ధం అవుతుంది.కేవలం చంద్రబాబు కుమారుడు అనే ఒకే ఒక్క అర్హత తప్ప.. ఏ అర్హతా లేని లోకేష్‌ని విద్యాశాఖ మంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టడంతోనే విద్యావ్యవస్థకు చెదలు పట్టడం మొదలైంది. వ్యవస్థను కొద్ది, కొద్దిగా చెదలు తిన్నట్టుగా కూటమి నేతలు తింటున్నారు. దీనంతటికీ కారణం మంత్రి నారాయణ. నారాయణ కాలేజీల సంస్థల చైర్మన్‌గా తన సంస్థలను పెంచి పోషించాలన్న దురుద్దేశమే కారణం.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు స్కూళ్లకు తరలిపోయారు. కారణం ప్రభుత్వమే ప్రైవేటు విద్యను ప్రోత్సహించడమే. ప్రభుత్వ విద్యాలయాలను నాశనం చేయడమే. వసతులు లేని ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్ధులు ఎందుకు ఉంటారు? అదే కారణంతో 5 లక్షల మంది ప్రైవేటుకు మారిపోయారు.చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారమివ్వాలిచనిపోయిన విద్యార్ధుల కుటుంబాలకు కనీసం రూ.25 లక్షలకు తగ్గకుండా ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్రను వీడాలి. లోకేష్ ఫ్యాక్టరీలు, కంపెనీల తీసుకుని రావడానికి ఢిల్లీ వెళ్లాడని పెద్ద, పెద్ద అక్షరాలతో అచ్చు వేస్తున్న పచ్చ మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలను రాష్ట్రానికి, దేశానికి తెలియజేయాలి. ఇది ఒక వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే? ఇంత చేతకాని వారికి పరిపాలించే అర్హత ఉందా? లోకేష్ ఏ రోజైనా ఈ ఏడాది కాలంలో ఈ సంస్కరణలను తీసుకురాగలిగాను, ఈ అభివృద్ధి చేశాను అని చెప్పగలిగాడా?ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్, వసతి దీవెన పెండింగ్, అమ్మఒడి పావు ఒడి చేశాడు. ఒక ఏడాది స్కీమ్ ఎగరగొట్టాడు. పేర్లు మార్చినంత మాత్రాన పనిమంతుడు కాలేవన్నవిషయాన్ని లోకేష్ గుర్తుంచుకోవాలి. పనితనం చూపించాలి. అడవిబిడ్డల ఘోషను, పాపాన్ని మూటగట్టుగుంటున్నావన్న విషయం గుర్తించుకో లోకేష్. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ కు సున్నామార్కులు వస్తాయి. తన శాఖలో సక్రమంగా పనిచేయలేని లోకేష్ అన్ని శాఖలను సంస్కరించాలని కుతూహలపడతాడు.మంచినీళ్లవ్వకుండా విలాసాలకు మంచినీళ్లలా ఖర్చుగిరిజన బిడ్డల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. ఒకే ఒక వసతి గృహం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు 135 మంది ఆసుపత్రికి వెళ్లారు. వారిలో నుంచి దాదాపు 25 మందికి పచ్చకామెర్లు ఉన్నట్లు తేలింది. దీనికి కారణం ఆ హాస్టల్ లో ఆర్వో ప్లాంట్ నిర్వహించకుండా, సురక్షిత మంచినీటిని అందించలేకపోవడమే కారణం. చివరికి చిన్నపిల్లలకు మంచినీళ్లు కూడా అందించలేని ఈ చేతకాని ప్రభుత్వం... గొప్పలు చెప్పడానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని సభలు పెట్టడానికి, వందలసార్లు హైదరాబాద్ కు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి మాత్రం విచ్చలవిడిగా ఖర్చుచేస్తోంది.ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కొలుకుల స్కూల్, పుల్లలచెరువు స్కూల్లో ఉపాధ్యాయులు లేరు. 170 మంది ఉపాధ్యాయులు వెళ్లిపోతే.. 26 మంది మాత్రమే వచ్చారని విద్యాశాఖ అధికారులకు చెప్పాను. అయినా స్పందన లేదు. లోకేష్ శాఖలో నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన వసతీ లేదు. చివరకు నాణ్యమైన భోజనం కూడా అందివ్వలేని అసమర్థ మంత్రిగా లోకేష్ నిలబడ్డం ఖాయం. 611 మంది చదువుతున్న స్కూళ్లో మంచినీళ్ల ఆర్వో ప్లాంట్ నిర్వహణకు ప్రభుత్వం వద్ద డబ్బులేదా? ఈ డబ్బంతా ఎటు పోతుంది. కూటమి ప్రభుత్వం తెచ్చిన రూ.2.11 లక్షల కోట్ల డబ్బుంతా ఎవడి జేబులోకి పోయింది. దోచుకున్న మద్యం డబ్బు ఎటు పోతుంది.వీధుల్లో వరదలా మద్యం- ఆదాయం మాత్రం టీడీపీ నేతల జేబుల్లో..ఇవాళ ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీ మద్యం రాకెట్ పట్టుబడింది. అతను కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే. రోడ్ల మీద, వీధుల్లో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది.. రాష్ట్ర ఖజనాకు మాత్రం ఆదాయం రావడం లేదని ఆరా తీస్తే... చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో బయటపడ్డ నకిలీ మద్యమే అసలు కారణం. ఇవాళ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న ప్రతీ మూడు సీసాల్లో ఒకటి నకిలీ మద్యం సీసాయే. నకిలీ మద్యం తాగి వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కల్తీ భోజనం తిని వందలాది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కచ్చితంగా మారాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కోసం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నారా లోకేష్ కు హితవు పలుకున్నాం. చాతగాని, చేవలేని ఎంత మంది నాయకులున్నా.. సమర్ధత గలిగిన వైయస్.జగన్ నాయకత్వం కాలిగోటికి సరిపోరు అన్న విధంగా కూటమి పాలన సాగుతోంది. వైయస్.జగన్ ఒంటరిగా 151 సీట్లు గెలిచి, ఎక్కడా ఏ రకమైన రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రతి గ్రామంలో నూతన భవనాలను నిర్మించి, నూతన వ్యవస్థలను నెలకొల్పారు. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే. .వాటిని కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెడుతోంది. వ్యవస్థల్లోకి ప్రైవేటు వ్యక్తులు వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇవాళ విద్యాశాఖను చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. విద్యాశాఖలో ప్రైవేటు వ్యవస్థ ఉండడం వల్ల ఏ విధంగా ప్రభుత్వవిద్యావ్యవస్ధ నాశనం అవుతుందో.. అదే విధంగా వైద్య వ్యవస్థ కూడా అలాగే మారబోతుందని వైయస్సార్సీపీ పదే పదే గళం వినిపిస్తుంది.చంద్రబాబు పాలనలో నీరుగారుతున్న వ్యవస్థలుచివరగా 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడు అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతిలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా నీరుగారిపోతున్నాయి. 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి.. ఈ రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థలు ఏదైనా ఉన్నాయంటే.. నకిలీ మద్యాన్ని భారీ ఎత్తున తయారు చేసే ఫ్యాక్టరీలే తప్ప.. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేనే లేదు అని తాటిపర్తి చంద్రశేఖర్ తేల్చి చెప్పారు.విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ..ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాలలో గ్రానైట్ క్వారీలున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీనరేజీ వసూళ్లుకు మంచి విధానం తెస్తే మాపై విషం కక్కారు. ఇవాళ కూటమి ప్రభుత్వం సీనరీ వసూళ్లు చేసే బాధ్యతను ఏ ఏం ఆర్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. ఈ సంస్థ ప్రతీ రోడ్డులోనూ చెక్ పోస్టులు పెట్టి, ఏ మట్టి ట్రాక్టర్, ఇసుక లారీ, మట్టి బండి వెళ్లినా వాళ్లకు కప్పం కట్టాల్సిందే.వీళ్ల పేమెంట్ చేసేది రెండేళ్లలో రూ.1135 కోట్లు అని వాళ్ల కరపత్రిక ఈనాడులో రాశారు. అందులోనే గత ఏడాది సీనరేజ్ రూ.450 కోట్లు అని రాశారు. అలాంటప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి ? ఒక కంకర లారీ లోడ్ కు రూ.5010 చెల్లించాలి. ఈ విధంగా దాదాపు రూ.6 కోట్లు ఒక రోజుకు వసూలు చేస్తున్నారు. వారికి ఏడాదికి వస్తున్న ఆదాయం ఎంత? వారు కడుతున్న అమౌంట్ ఎంత ? గతంలో ఎవరైనా ఇంటికి మట్టి తోలుకుంటే డబ్బులు కట్టాల్సిన పనిలేదు. ఇవాళ ఏ ఏం ఆర్ సంస్థకు మాత్రం కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. -
దమ్ముంటే జగన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి: తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: ఏడాదికి పైగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై ప్రతిపక్షనేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా ద్వారా సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్మూ, ధైర్యం కూటమి నేతలకు ఉందా? అంటూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ సవాల్ చేశారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రశ్నలకు బదులివ్వలేక వైఎస్సార్సీపీ పైనా, వైఎస్ జగన్ పైనా వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటని అన్నారు. అక్రమ కేసులతో, ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారంతో వైఎస్సార్సీపీని నిలువరించాలనుకోవడం చంద్రబాబు, లోకేష్‌ల అవివేకమని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం విషపు కత్తులకు తేనె పూసి, వాస్తవాలను వక్రీకరిస్తూ, అవాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్ముతూ ప్రజల్లో విష గుళికలు చల్లడం టీడీపీకి నిత్యకృతమైపోయింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ మా పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ప్రభుత్వానికి అనేక ప్రశ్నలను సంధించారు. వాటికి కూటమి దగ్గర సమాధానాలు లేక ఆయన మీద నిందలు మోపడానికి పచ్చ బ్యాచ్ సిద్ధమైపోయింది.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చుకోలేని దుస్థితిలోకి వెళ్లిన చంద్రబాబు. కొంతమంది దళిత సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను మీడియా ముందుకు పంపించి వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా అప్పులు తెచ్చిన ఈ డబ్బంతా ఏమైందని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ప్రభుత్వం తరఫున నాదెండ్ల మనోహర్, వర్ల రామయ్య, హోంమంత్రి అనిత వంటి వారు మాట్లాడినా ఏ ఒక్కరూ సూటిగా సమాధానం చెప్పలేకపోయారు.దళిత ద్రోహి చంద్రబాబుఒక పక్క దళితులకు అందాల్సిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ఎగ్గొట్టేస్తుంటే లబ్ధిదారుల తరపున ఆయన్ను ప్రశ్నించకుండా దళిత ఎమ్మెల్యేలు చంద్రబాబుని సంతృప్తి పరచడానికి సిగ్గులేకుండా జగన్‌ని తిట్టడానికి ప్రెస్మీట్లు పెడుతున్నారు. వైఎస్ జగన్ దళితులను ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కాదని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అసందర్భంగా మాట్లాడుతున్నాడు. మా నాయకులు వైఎస్ జగన్‌తో కలిసి వారింట్లోనే వారి డైనింగ్ టేబుల్ మీద ఆయనతో కలిసి నేను రెండుసార్లు భోజనం చేశాను.నీకు చంద్రబాబుతో కలిసి ఆయన ఇంట్లోకి వెళ్లే అవకాశం దక్కిందా అని ప్రశ్నిస్తున్నా.? వైఎస్ జగన్‌ని తిట్టడానికే నక్కా ఆనందబాబును చంద్రబాబు వాడుకుంటున్నాడు. సినిమాల నేపథ్యంలో ఏర్పాటైన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డ్రామా పార్టీ అని ఆనందబాబు చెప్పడం చూస్తుంటే ఆయన ఎంతటి అజ్ఞానో అర్థమవుతుంది. ఉన్నత చదువులు చదువుకున్న దళిత బిడ్డల్ని బహిరంగంగా రోడ్డు మీద అమానుషంగా లాఠీలతో కొడుతుంటే గలీజు బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటూ తాను పుట్టిన కులాన్నే అవహేళన చేసేలా ఆనందబాబు మాట్లాడాడు ఆయన సంస్కారానికి నిదర్శనం.దోపిడీని విజన్ గా ప్రచారం చేసుకుంటున్నారు..ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ సొత్తు అయినట్టు మేం తలచుకుంటే వైఎస్ జగన్ రాష్ట్రంలో తిరగలేడని మాట్లాడుతున్నారు. దమ్ముంటే తలచుకోమని సవాల్ చేస్తున్నా.. తెలుగుదేశం పార్టీకి పాలించమని ఐదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే వారికి చేతకాక ఏడాదిలోనే ఓటేసిన ప్రజలతోనే ఛీకొట్టించుకుంటున్నారు. ప్రజా సమస్యలపై వారి పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతోంది. ప్రెస్మీట్లో అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేక జగన్‌ని తిట్టిపోస్తున్న టీడీపీ నాయకులు పబ్లిక్ డిబేట్‌కి వస్తామని చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో నిజాయతీ కలిగిన పోలీస్ అధికారులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.ప్రభుత్వం చెప్పినట్టు చట్టవిరుద్ధంగా పనిచేయలేక సిద్ధార్థ కౌశల్ వంటి యంగ్ డైనమిక్ ఐపీయస్ అధికారి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. దీని గురించి వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు అసత్యాలను అస్త్రాలుగా చేసుకుని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ తాను మాత్రం ఆర్థికంగా బలపడుతున్నాడు. ఆయన ఎత్తుగడలను వైఎస్సార్సీపీ సాగనివ్వదు.బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో ఇప్పటికే కూటమి పాలన మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాం. పక్క రాష్ట్రాలు 12 శాతం జీఎస్టీ గ్రోత్ రేటును నమోదు చేస్తుంటే చంద్రబాబు మాత్రం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. సంపద సృష్టిస్తానని చెప్పి వికృత ఆలోచనలతో రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తున్నాడు. చంద్రబాబు చేతకానితనానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు మోసాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేసులకు భయపడి వైఎస్సార్సీపీ ఆపేది జరగదని గుర్తుంచుకోవాలి. -
కాకులను కొట్టి.. గద్దలకు మేపినట్లు.. వంగలపూడి అనితను ఏకిపారేసిన తాటిపర్తి చంద్రశేఖర్
-
లైవ్ లో అనిత వీడియో వేసి ఏకిపారేసిన తాటిపర్తి చంద్రశేఖర్
-
ఎవరు దొంగలు? ఎవరు అలా వ్యవహరించారు?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: తమ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శాసనసభలో స్పీకర్ చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో దొంగలు అంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినోళ్లు. వేలంపాటలో ప్రజా ప్రతినిధులను, సభ్యులను కొనుక్కున్నవాళ్లు. వైస్రాయ్ హోటల్లో క్యాంప్‌లు నిర్వహించిన వాళ్లు. స్పీకర్‌ను అడ్డు పెట్టుకుని పార్టీ పక్షనేతను పోటు పొడిచిన వాళ్లు. జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని కైవసం చేసుకున్న వాళ్లు. ఈ విషయాన్ని స్పీకర్ గమనించాలి. అలాగే ఆయన ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.‘మేమేమీ గోడలు దూకి అర్ధరాత్రులు, అపరాత్రుల్లో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టడం లేదు. మా నియోజకవర్గాల సమస్యలను ప్రశ్నల రూపంలో సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకు హాలు బయట, అందరి సమక్షంలో ఉండే రిజిస్టర్లో, అందరి ముందే సంతకం పెట్టాం తప్ప, అందుకోసం దొంగల్లా రాలేదు. ఎవరూ చూడకుండా సంతకం చేయలేదు. మేమేమీ దొంగలం కాదు, అలా వ్యవహరించడానికి!’.‘విపక్షంలో ఉన్నా, మా బాధ్యత మరవడం లేదు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం, వాటిపై చర్చ జరిగేలా చూడడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం. కానీ, మాకు ఆ అవకాశం దక్కకూడదని మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించలేదు. తగినంత సభ్యులు లేకపోతే, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవద్దని, ఎక్కడా లేకపోయినా, ఆ సాకు చూపి, మా పార్టీ వైయస్సార్సీపీని మీరు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు. అందుకే మా హక్కు కోసం కోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం’.‘ఇంకా సభకు హాజరు కాకున్నా, ప్రజా సమస్యలు ప్రతి వేదిక మీద లేవనెత్తుతూనే ఉన్నాం. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి చర్యలను ఎండగడుతూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నిలదీస్తున్నాం. అలా ప్రజల పట్ల మా బాధ్యతను ఏనాడూ మర్చిపోలేదు. అందుకే దొంగల్లా కాకుండా, దొరల్లా బాహాటంగా సభ వద్దకు వస్తున్నాం. ప్రశ్నలు సంధిస్తున్నాం. నియమానుసారం అందరి ముందే రిజిస్టర్లో సంతకం చేస్తున్నాం’.‘నిజం చెప్పాలంటే, సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది నోరెత్తడం లేదు. వారి నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించడం లేదు. అక్కడి ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదు. సభలో ఉండి కూడా అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న వారి కంటే, మేము చాలా బాగా పని చేస్తున్నాం. వారు సభకు హాజరై, సభలో ఉన్నా, వారితో ప్రజలకు ఏ ప్రయోజనం లేదు. కానీ, మేము సభకు హాజరు కాకున్నా, మా నియోజకవర్గాలు, ప్రజా సమస్యలు ప్రశ్నల రూపంలో సభలో ప్రస్తావించి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. దీన్ని కాదంటారా?’.‘బహుజన శాసనసభ్యులను దొంగలుగా సంబోధించడం హేయం. మరి గత అసెంబ్లీలో అప్పటి విపక్షనేత చంద్రబాబు రెండున్నర ఏళ్లు సభకు హాజరు కాలేదు. మమ్మల్ని దొంగలు అన్న మీరు, మీ పార్టీ అధినేత అయిన చంద్రబాబుని ఏమంటారు? సభకు హాజరు కాకున్నా, కనీసం రిజిస్టర్లో సంతకం కూడా చేయకున్నా, శాసనసభ్యుడిగా, విపక్షనేతగా, ఆ హోదాలో అంతకాలం పాటు, అన్నీ పొందిన మీ పార్టీ అధినేతను ఏమనాలి? మమ్మల్ని ఉద్దేశించి అన్న దాని కంటే ఇంకా ఎక్కువ పదం వాడతారా?’‘అయినా స్పీకర్ పదవిని మేము గౌరవిస్తాం. ఆయన ఎలా మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా సరే.. వాటన్నింటినీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’.. అని వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. -
వెలిగొండ ప్రాజెక్ట్‌పై కూటమి సర్కార్ కుట్ర: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: మూడు జిల్లాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్ట్‌కు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. ఏకంగా 53 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.ప్రెస్మీట్లో ఎమ్యెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏమన్నారంటే..:నాడు చిత్తశుద్దితో పనులు:ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రాంతంలో నెలకొన్న నీటి ఎద్దడి, కరవు పరిస్థితులను ఐక్యరాజ్యసమతి వంటి అంతర్జాతీయ సంస్థలే గుర్తించాయి. ఈ కరవు పరిస్థితులను మార్చేందుకు నిర్దేశించిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించింది. ఈ ప్రాజక్ట్ పనులు శరవేగంతో చేయడం వల్ల శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావడానికి నిర్మించిన రెండు టన్నెల్స్ పనులు పూర్తయ్యాయి. దానిలోని మట్టిని మాత్రం తొలగించాల్సి ఉంటుంది. అలాగే స్టోరేజీ చేసే కొండల మధ్య ఉన్న గ్యాప్‌లను పూడ్చడం జరిగింది. పునరావాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.గతంలో పునరాసానికి రూ.1.80 లక్షలు ప్రకటిస్తే, జగన్‌గారు వచ్చిన తరువాత రూ.12.5 లక్షలు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి వరకు ఎవరికైతే 18 ఏళ్ళు నిండి ఉంటాయో వారికి పరిహారం ఇచ్చి, ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సి ఉంది. ఇదే జరిగితే 53 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో నీరందుతుంది. శ్రీశైలంలో 45 రోజుల పాటు వచ్చే నీటిని ఇక్కడికి తీసుకువచ్చి, కరవును దాదాపు రూపుమాపవచ్చు.పాదయాత్ర. ప్రభుత్వాన్ని నిలదీస్తాం:వెలిగొండ ప్రాజెక్ట్‌లో గత బడ్జెట్లో అరకొర నిధులను మాత్రమే కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతోనే అసలు వెలిగొండను పూర్తి చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొడతాం. వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు సాధించేందుకు మేం చేపట్టే పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతారు.ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా రాజకీయాలను పక్కకుపెట్టి ఈ ప్రాజెక్ట్ సాధనకు ముందుకు రావాలి. తప్పుడు రాజకీయాలు చేస్తున్న నేతలను నిలదీయాలి. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఈ ప్రాంత ప్రజలకు తెలుసు కాబట్టి, తనను నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు తన పర్యటనను ప్రాజెక్ట్ వద్ద కాకుండా దూరంగా పెట్టుకుంటున్నారు. తన కుమారుడు నారా లోకేష్ కోసం ఆయన నియోజకవర్గంలో వందల కోట్లు కేటాయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఆస్తులు అమరావతికి.. పస్తులు ప్రకాశానికి’ అన్నట్లుగా వీరి వ్యవహారం ఉంది. -
చంద్రబాబూ.. ఇంత బరితెగింపా?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని.. విషం చిమ్మే నాయకుడంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని.. ఆయనకు ఎందుకింత కక్ష అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసింది విద్వేషపూరిత వ్యాఖ్యలు.. మేం తలుచుకుంటే వైఎస్సార్సీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హోంమంత్రి మాట్లాడుతున్నారు’’ అని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా?. పచ్చబిళ్ల పెట్టుకున్న వాళ్ల పనులు చేసిపెట్టమన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు కొనసాగింపే చంద్రబాబు వ్యాఖ్యలు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా.. లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు.‘‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. కులం, మతం చూడకుండా జగన్ పాలన చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో అంతా వివక్షే. రెడ్డి సామాజికవర్గంపై కక్ష సాధిస్తున్నారు. దళిత ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతున్నారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్, కేంద్రం స్పందించాలి’’ అని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.‘‘గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై ఎందుకు మీకింత పగ?. వెలిగొండ ప్రాజెక్ట్‌పై నిజాలు మాట్లాడే దమ్ముందా?. మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్‌కు నిధులు కేటాయించకుండా మాటలు చెబుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నాం. ఎర్రగొండపాలెనికి మీ శాఖ ద్వారా ఏం చేశారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. వెలిగొండను సందర్శించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని చంద్రశేఖర్ హితవు పలికారు. -
ఒకరు తీర్థయాత్ర.. ఒకరు విహారయాత్ర.. కొంచెం కూడా సిగ్గులేదా
-
చంద్రబాబు సర్కార్ పేదలకు ఏం చేసింది?: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్ పేదలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. నారా లోకేష్ సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీపై నారా లోకేష్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.‘‘ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. విద్యా శాఖలో లోకేష్ ఏం సంస్కరణలు చేశారో చెప్పాలి. స్కూళ్లలో డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయా?. ఇంగ్లీష్ మీడియంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉందా?. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. గవర్నమెంట్ బడుల్లో చదివే విద్యార్థులు అంటే చంద్రబాబు ప్రభుత్వానికి చిన్నచూపు’’ అంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి‘‘రాష్ట్రంలో చీటింగ్ ప్రభుత్వం పాలన చేస్తోంది. ఒక్క కేబినెట్ మీటింగ్‌లో కూడా ప్రజా సంక్షేమ పథకాల ఊసులేదు. లక్షా 19 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశారో చెప్పటం లేదు. అధికారంలోకి రాకముందు ఎన్నో చెప్పి, ఇప్పుడు ఒక్కటీ అమలు చేయడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ చేస్తూ ప్రజల గురించి ఆలోచించటం మానేశారు. లోకేష్ మంత్రి అయ్యాక విద్యాశాఖ భ్రష్టు పట్టింది. ఈ రోజు వరకు టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్ల మీద ఖర్చు పెట్టటం తప్పు అని ఎల్లోగ్యాంగ్ మాట్లాడుతోంది..ఇంగ్లీషు మీడియాన్ని పేద పిల్లలకు దూరం చేశారు. లోకేష్ మాత్రం విదేశాల్లో ఇంగ్లీషు మీడియం చదివారు, మా పేదలకు మాత్రం ఇంగ్లీషును దూరం చేస్తున్నారు. చంద్రబాబుకే సంపద సృష్టి తప్ప పేద ప్రజలకు కాదని తేలిపోయింది. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు. దళిత ఉద్యోగులు, అధికారుల మీద కక్షకట్టి చర్యలు తీసుకుంటున్నారు. లోకేష్‌కి మిడిమిడి జ్ఞానం. అందుకే విశాఖకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేయలేదంటూ మాట్లాడుతున్నారు. రైల్వే జోన్ కోసం స్థల సేకరణ నుండి వాల్తేరు డివిజన్ సాధించటం వరకు వైఎస్సార్సీపీనే పోరాటం చేసి సాధించింది. విశాఖకు మెట్రో రైలు డీపిఅర్ని సిద్ధం చేసింది మా ప్రభుత్వమే. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, పరిశ్రమలు మా హయాంలోనే వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం గీతం యూనివర్శిటీతో భూములను కబ్జా చేయించింది..రాజధానిలో తాత్కాలిక భవనాలను నిర్మించి దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దేశం మొత్తం మీద పెట్రోలు ధర చిత్తూరు జిల్లాలోనే అధికంగా ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలోనే అధికంగా ధర ఉందంటే అయన పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లోకి వచ్చి చూస్తే వారి ఆగ్రహం ఎలా ఉందో తెలుస్తుంది’’ అని చంద్రశేఖర్ చెప్పారు. -
PAC ఛైర్మన్ ను ప్రతిపక్షానికే ఇవ్వాలి
-
PAC పదవిలో కూడా రాజకీయమా? కూటమి నిర్ణయంపై ఎమ్మెల్యే చంద్రశేఖర్
-
పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని.. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే ఖర్చులపై పీఏసీ నిఘా ఉంటుందనే ఇలాంటి కుట్ర చేశారన్నారు.ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. అందుకే పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇస్తారు. 1985-86లో టీడీపీకి 30 సీట్లే వచ్చినప్పటికీ ఏరాసు అయ్యపరెడ్డికి పీఏసీ ఛైర్మన్ ఇచ్చారు. వంద సంవత్సరాల పీఏసీ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు ఛైర్మన్‌గా వ్యవహరించారు. తగిన సంఖ్యా బలం లేకపోయినా పీఏసీ ఛైర్మన్‌గా ఇచ్చారు. బోఫార్స్ కుంభకోణం కూడా ఇదే పీఏసీ బయట పెట్టింది. స్పెక్ట్రం స్కాంని కూడా పీఏసీ ఛైర్మన్ మురళీ మనోహర్ జోషి బయటకు తీశారు. కోల్గేట్ కుంభకోణం వంటి అనేక అంశాలను పీఏసీనే బయటకు తీసింది’’ అని చంద్రశేఖర్ గుర్తు చేశారు.‘‘అలాంటి వ్యవస్థను ఏపీలో లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అప్పుడు అడ్డూ అదుపు లేకుండా స్కాంలు చేయొచ్చని భావిస్తున్నారు. ప్రతిపక్షానికి పదవి ఇవ్వనప్పుడు నామినేషన్ల వ్యవహారం ఎందుకు తెచ్చారు?. మా పార్టీ తరపున నామినేషన్ వేయటానికి వెళ్తే ఒక్క అధికారి కూడా అక్కడ లేరు. మూడు గంటలసేపు అక్కడ కూర్చోపెట్టి అవమానపరిచారు. మా హయాంలో ప్రతిపక్షానికే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చాం. హుందాగా మేము వ్యవహరించాం. కానీ అలాంటి హుందాతనం కూటమి ప్రభుత్వంలో లేదుఇదీ చదవండి: ‘లోకేష్ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. అందుకే ఆయనకి పీఏసీ ఛైర్మన్‌గా రాకుండా అడ్డుకున్నారు. మూడు కమిటీల్లో ఒక్కదానికి కూడా ప్రతిపక్ష సభ్యులను లేకుండా చేశారు. తద్వారా అడ్డగోలుగా దోపిడీ చేయాలని భావించారు. చివరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చారు. తాలిబన్లు మాత్రమే ఆ పదవిని వారి దగ్గర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా తాళిబన్ల బాటలోనే నడుస్తోంది. రాష్ట్రాన్ని తాలిబన్ల బాటలో నడిపిస్తున్నారు. దళిత నేతలకు రాష్ట్రంలో రక్షణలేదు. నందిగం సురేష్‌ని మూడు నెలలుగా జైలులో పెట్టి వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాదిగలపై ఇలాంటి వివక్ష తగదు’’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
ఏపీలో YSRCP నాయకులపై కూటమి సర్కారు వేధింపులు
-
ఎవరు ప్రశ్నిస్తే వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారు: Tatiparthi Chandrasekhar
-
సంపద సృష్టిస్తానన్న బాబు అప్పులు సృష్టిస్తున్నాడు..!
-
కష్టాలను అధిగమించి ప్రత్యర్థితో పోరాడి గెలిచిన తాటిపర్తి
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15 సంవత్సరాలుగా నిజాయతీగల కార్యకర్తగా పనిచేసిన తాటిపర్తి చంద్రశేఖర్‌కు ఫలితం దక్కింది. మంగళవారం జరిగిన కౌంటింగ్‌లో ఎమ్మెల్యేగా ఆయన ఘన విజయం సాధించారు. సింగరాయకొండలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న ఆయనను గుర్తించిన ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి యర్రగొండపాలెం(ఎస్సీ) టికెట్ ఇచ్చి గౌరవించారు. ఆ గౌరవాన్ని నిలుపుకోవటానికి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి అయినా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి నాయకుల వరకు ఆయన కలుపుకొనిపోయారు. నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను ఆయన ఎంతో సహనంతో పరిష్కరించగలిగారు. అందరినీ సమన్వయ పరచడంలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అనతి కాలంలోనే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న నీటి సమస్యను వెనువెంటనే పరిష్కరించగలిగారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను తన సొంత నిధులతో మరమ్మతులు చేయించి ఆయా ప్రాంత ప్రజల మన్ననలు పొందారు. ప్రత్యర్థి టీడీపీ వర్గానికి చెందిన వారు అడుగడుగునా పెట్టిన కష్టాలను ఎదుర్కొంటూ ఆయన ఎన్నికల్లో ముందుకు సాగారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ చేస్తున్న కార్యక్రమాలకు అభ్యంతరం చెప్తూ ఆర్వోకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు చేయించడం లాంటి కష్టాలను సైతం అధిగమించి ప్రత్యర్థితో పోరాడిన ఆయనను నియోజకవర్గ ప్రజలు 5,477 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. తన స్వగ్రామమైన సింగరాయకొండలో చేసిన స్వచ్ఛంద సేవలు ఈ ఎన్నికల్లో బాగా పనిచేశాయని చెప్పవచ్చు. తాటిపర్తి చంద్రశేఖర్ వదిన, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు వనజ, ఆయన భార్య భాగ్యసీమ చౌదరి, కుమార్తె ఆకాంక్ష ఇంటింటికీ తిరిగి చేసిన ప్రచారం నియోజకవర్గ ప్రజలు గుర్తించి వారికి తగిన ఫలితాన్ని అందించారు. వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సచివాలయాల కన్వీనర్లు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవటానికి తమ స్థాయికి మించి కష్టపడ్డారని చెప్పవచ్చు. -
తాటిపర్తిలో రేషన్‌షాపు సీజ్
తాటిపర్తి(పెద్దాపురం) : విజిలెన్స్ అధికారులు సోమవారం తాటిపర్తి, తిరుపతి గ్రామాల్లో దాడులు నిర్వహించారు. తాటిపర్తిలో బీవీ చక్రావతికి చెందిన రేషన్ షాపు నం.44లో విజిలెన్స్ డీసీటీఓ బి.రత్నకుమార్, విజిలెన్స్ తహసీల్దార్ గోపాలరావు, పీసీ స్వామి తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత స్టాకు కంటే 55 క్వింటాళ్లు (110 బస్తాలు) బియ్యం తక్కువగా ఉండడాన్ని గుర్తించారు. నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చేసి, దుకాణాన్ని సీజ్ చేశారు. తిరుపతిలో స్టాకు సక్రమంగా ఉందని అధికారులు తెలిపారు.


