‘జాబ్‌ క్యాలెండర్‌ను లోకేష్‌ జోక్‌ క్యాలెండర్‌గా మార్చేశారు’ | Tatiparthi Chandrasekhar Fires On Nara Lokesh | Sakshi
Sakshi News home page

‘జాబ్‌ క్యాలెండర్‌ను లోకేష్‌ జోక్‌ క్యాలెండర్‌గా మార్చేశారు’

Mar 20 2026 4:16 PM | Updated on Mar 20 2026 5:55 PM

Tatiparthi Chandrasekhar Fires On Nara Lokesh

సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ జాబ్ కేలండర్‌ని జోక్ కేలండర్‌గా మార్చారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కేలండర్‌లో డేట్‌లు ఉన్నాయి.. గానీ ఉద్యోగాల డేటా లేదు. తూతూమంత్రంగా 10 వేల ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపున్నారు. లోకేష్, చంద్రబాబే కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో చాలాసార్లు చెప్పారు. మాటల్లో మాత్రం గ్లోబల్ లెవల్లో మాట్లాడతారు. చేతల్లో మాత్రం ఏమీ ఉండదు’’ అంటూ తాటిపర్తి ధ్వజమెత్తారు.

‘‘నారా వారు కాదు.. నీరో వారని నిరూపించుకున్నారు. నిరుద్యోగ భృతి రెండేళ్లుగా ఇవ్వలేదు. లోకేష్ చదువుకున్న వ్యక్తి కాదు.. చదువుకొన్న వ్యక్తి. అందుకే నిరుద్యోగుల కష్టాలు ఆయనకు తెలియవు. అరచేతిలో వైకుంఠం చూపించటం తప్ప లోకేష్ చేస్తున్నది లేదు. అర్హత లేని లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రులు అయ్యారుగానీ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్

..వైఎస్‌ జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను చంద్రబాబు తీసేశారు. ఔట్ సోర్సింగ్‌లోనే 9 వేల ఉద్యోగాలు తొలగించారు. ఏపీ ఫైబర్‌లో 2 వేల మంది ఉద్యోగులను  తొలగించారు. రేషన్ వాహనాల్లో పని చేసే 2,900 ఉద్యోగులను తొలగించారు. బేవరేజ్ కార్పొరేషన్‌లోని 18 వేల మందిని తొలగించారు. తొలగించటమే తప్ప చంద్రబాబు ఇచ్చేదేమీ ఉండదు. గ్రూప్-2 కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నిరుద్యోగుల జీవితాలతో లోకేష్ బంతాట ఆడుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి పేరుతోనూ మోసం చేశారు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి కేటాయింపుల్లేవ్. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదు’’ అంటూ తాటిపర్తి చంద్రశేఖర్‌ దుయ్యబట్టారు.

నారా కాస్త నీరో లోకేష్ అయ్యాడు..లోకేష్ పై నిప్పులు చెరిగిన తాటిపర్తి

 

Advertisement
 
Advertisement
Advertisement