‘ఏడేళ్ల చిన్నారిని డ్రమ్‌లో కుక్కేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది?’ | YSRCP MLA Tatiparthi Chandrasekhar Takes On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘ఏడేళ్ల చిన్నారిని డ్రమ్‌లో కుక్కేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది?’

Feb 17 2026 6:25 PM | Updated on Feb 17 2026 7:20 PM

YSRCP MLA Tatiparthi Chandrasekhar Takes On Chandrababu Govt

తాడేపల్లి :  ఏపీలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి కనబడుటం లేదా అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టి. చంద్రశేఖర్‌.  ఈ అఘాయిత్యాల గురించి అసెంబ్లీలో అడిగితే హోంమంత్రి సమాధానం చెప్పలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదంటూ సమాధానం చెప్పారన్నారు.  మరి మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిని హతమార్చి డ్రమ్‌లో కుక్కేస్తే ప్రభుత్వం ఏం చేస్తందని నిలదీశారు. ఇది హోంమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కనబడుటం లేదని మండిపడ్డారు. 

ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్‌.. ‘ రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తానంటున్న చంద్రబాబు.. అసెంబ్లీలో తన పక్కనే కూర్చోపెట్టుకుంటున్నారు. బాలకృష్ణ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఆయన అనుచరుడు మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి?, నేరస్తులంతా క్యాష్‌ను సూట్ కేసులో పెట్టి రాజేష్ ద్వారా లోకేష్‌కి పంపుతారు. దాంతో కేసులు లేకుండా పోతున్నాయి. చిన్నపిల్లలను చెరబడుతుందే చంద్రబాబు, హోంమంత్రి తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 

కాసుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి కోటప్పకొండ దగ్గర కూడా పోలీసుల సమక్షంలో మద్యం విక్రయాలు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రభ కడితే పోలీసులు లాఠీలతో కొట్టారు. కరెంటు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారు. నియంత పోకడలు ఎల్లకాలం పని చేయవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇవ్వమని అడిగితే స్పీకర్ నన్న బెదిరించారు. చంద్రబాబు హెరిటేజ్‌దే ఇందాపూర్ డైరీ. ఊరుకొక‌ మాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్‌లు పెట్టారు’ అంటూ విమర్శించారు.

 ఇదీ చదవండి: 

మదనపల్లిలో మైనర్‌ బాలిక హత్య కేసు.. ఉద్రిక్తత
 

Advertisement
 
Advertisement
Advertisement