Mancherial
-
● మొక్కుబడిగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ● ఇంకా అందని క్రీడా సామగ్రి ● ఒక్కో శిబిరంలో పదిలోపే విద్యార్థులు
మంచిర్యాలటౌన్: ఏటా వేసవిలో విద్యార్థులకు వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. ఏటా ఏప్రిల్ 24వ తేదీ నుంచి క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించి మే 31తో ముగిస్తారు. ఇందుకు సంబంధించిన క్రీడా సామాగ్రితో పాటు, కోచ్‌లకు కొంత వేతనాన్ని సైతం ప్రభుత్వమే అందిస్తూ వస్తోంది. కానీ గతేడాది నుంచి వేసవి క్రీడా శిబిరాలు గతి తప్పాయి. 14 ఏళ్లలోపు విద్యార్థులకు అందించే ఈ క్రీడా శిక్షణ గతేడాది, ఈ ఏడాది ఆలస్యంగా మే 1వ తేదీన ప్రారంభించారు. శిక్షణకు అవసరమైన క్రీడా పరికరాలు గతేడాది మే 20న రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు ఇంకా అందలేదు. దీంతో కోచ్‌లు గతంలో వాడినవి, ప్రస్తుతం వారు ఇతర క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణకు సంబంధించిన క్రీడా పరికరాలతోనే శిక్షణను నెట్టుకొస్తున్నారు. ఏటా పది రకాల క్రీడల్లో శిక్షణను ఇస్తుండగా, ప్రతీ క్రీడలో 30 మందికి పైగానే విద్యార్థులు శిక్షణ పొందేవారు. కానీ ఈ ఏడాది పదిలోపే విద్యార్థులు శిక్షణకు వస్తున్నారు. కొత్త నిబంధనలతో ఇబ్బందిగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణను గాలికొదిలేసిన ప్రభుత్వం, కొత్త నిబంధనలతో ఇబ్బందిగా మారుస్తోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. క్రీడా శిక్షణ శిబిరానికి హాజరయ్యే విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్న నిబంధనతో విద్యార్థులకు ఇబ్బందిగా మారి, క్రీడా శిక్షణకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. వేసవి క్రీడా శిబిరాలను గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో నిర్వహిస్తుండగా, అర్బన్ ప్రాంతంలో మాత్రం విద్యార్థుల నుంచి నామమాత్రపు ఫీజు అంటూ ఒక ధర నిర్ణయించారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో అర్బన్ క్యాంపులు 11 ఏర్పాటు చేయగా అథ్లెటిక్స్‌కు రూ.100, బాక్సింగ్ రూ.100, బాస్కెట్‌బాల్‌కు రూ.300, ఫుట్‌బాల్‌కు రూ.100, వాలీబాల్‌కు రూ. 100, కరాటేకు రూ.100, కబడ్డీకి రూ.100, బ్యాడ్మింటన్‌కు రూ.500, ఫుట్‌బాల్‌కు రూ.100 చొప్పున ఫీజు తీసుకుని శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కానీ మొక్కుబడిగా వస్తున్న విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయక పోవడంతో వేసవి క్రీడా శిబిరాల్లో ఎంతమంది శిక్షణ పొందుతున్నారనే వివరాలు అధికారికంగా లేవనే సాకుతో, వారికి రావాల్సిన క్రీడా పరికరాలను అందించడంలో ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే శిక్షణకు సంబంధించి దాదాపు 20 రోజులు పూర్తికావస్తుండగా, ఎప్పుడు క్రీడా పరికరాలు వస్తాయనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి క్రీడా సామగ్రిని అందించడంతో పాటు, వేసవి క్రీడా శిక్షణ శిబిరాలపై దృష్టిసారిస్తే ఆసక్తి ఉన్న విద్యార్థులు వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణ పొంది, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.నిర్వహణపై కానరాని ఆసక్తి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి గతంలో విశేష స్పందన ఉండేది. విద్యార్థులు పోటీపడి మరీ శిక్షణకు హాజరయ్యేవారు. ప్రతీ శిబిరంలో 30కి పైగా విద్యార్థులు ఉండేవారు. విద్యార్థులకు అవసరమైన అల్పాహారం, పండ్లను సైతం పలు స్వచ్ఛంద సంస్థలు అందించేవి. శిక్షణ శిబిరాలన్నీ కూడా విద్యార్థులతో కిటకిటలాడేవి. గతేడాది నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలపై ప్రభుత్వం, అధికారులు ఆసక్తి చూపించడం లేదు. ఎంతో అట్టహాసంగా ప్రారంభం కావాల్సిన శిక్షణ శిబిరాలు, గతేడాది నుంచి కోచ్‌లే చడీ చప్పుడు లేకుండా ప్రారంభిస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం, క్రీడా పరికరాలు అందక పోవడంతో కోచ్‌లు సైతం ఆయా శిబిరాలకు చిన్నారులు వచ్చేలా చేయడం లేదు. ప్రతీ సంవత్సరం విద్యార్థులకు 50 రోజుల పాటు వేసవి సెలవులు వస్తే, వేసవి క్రీడా శిబిరాలతో వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకునే ఒక చక్కటి అవకాశాన్ని కోల్పోతున్నారు. కొందరు విద్యార్థులు మాత్రం పలు అసోసియేషన్లు అందించే శిక్షణకు ఫీజులు చెల్లించి నేర్చుకోవాల్సి వస్తోంది. -
ఘటనకు బాధ్యులపై చర్య తీసుకోవాలి
కోటపల్లి: మండలంలోని సిర్సాలో సిడం లచ్చన్న, సిడం రాకేశ్‌కు చెందిన ఇద్దరు ఆదివాసీల ఇళ్లు కాలిపోవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం డిమాండ్ చేశారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడి గి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన లచ్చన్న, రాకేశ్‌లు కన్న రాజేశ్ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. మే 5న బీరం భాస్కర్ రెడ్డి తన పెరట్లో వ్యర్థాలను కాల్చివేసి నిప్పులు ఆర్పకపోవడంతో అర్థరాత్రి నిప్పురవ్వలు ఎగిసిపడి ఇంటికి అంటుకోవడంతో ఇంట్లోని సామగ్రితో పాటు రూ.2లక్షల 77వేల నగదుతో పాటు 10 తులాల వెండి పూర్తిగా కాలిబూడిదైందన్నారు. ఇంత జరిగినా బీరం భాస్కర్‌రెడ్డి తనకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తూ అందరిని తప్పుదోవ పట్టిస్తున్నాడడన్నారు. ఘటన జరిగి పదిరోజులు కావస్తున్నా మంత్రి వివేక్ వెంకటస్వామి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పోలీసు అధికారులు కూడా నామామాత్రంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తలండి ముత్తయ్య, నాయకులు ఆత్రం సంపత్, కొర్తె సమ్మయ్య, మైసయ్య, సోయం దుర్గయ్య, రాజబాపు, తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ రహిత జిల్లాగా మారుద్దాం..
మంచిర్యాలటౌన్: జిల్లాను ఎయిడ్స్ రహితంగా మార్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత అన్నా రు. ‘అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్‌లైట్ మెమోరియల్ డే’ను పురస్కరించుకుని ఆదివా రం సాయంత్రం మంచిర్యాల ప్రభుత్వ జనర ల్ ఆస్పత్రి నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్, లిప్రసీ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్, డిప్యూటి డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్ మాట్లాడుతూ ఎయిడ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పి ంచడం, సమాజంలో వివక్షను రూపుమాపేందుకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెమో వెంకటేశ్వర్లు, సీహెచ్‌వో నాందేవ్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, డీపీఎంవో రాఘవయ్య, డీపీవో ప్రశాంతి, దిశ మేనేజర్ నీలిమ, డీఎండీవో రాఘవయ్య, ఐసీటీసీ కౌన్సి లర్లు శ్రీనివాస్, నర్మద, జగన్మోహన్, ఆంజనేయులు, నరేందర్, స్నేహ ఎన్జీవో సభ్యులు, లింక్ వర్కర్లు పాల్గొన్నారు. -
కష్టపడి చదివితే లక్ష్యాలు సాధించవచ్చు
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యార్థులు కష్టపడి చదివితే ఎంచుకున్న లక్ష్యాలను సాధించవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా ఏర్పా టు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్ర భుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లాలో ప్రథ మ, ద్వితీయ, స్థానాలలో నిలిచిన పదోతరగతి, ఇంటర్, క్రీడా విభాగాల విద్యార్థులను సత్కరించారు. ఒక్కొక్కరికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎస్.యాదయ్య, జిల్లా సమన్వయకర్తలు ముత్యబోయిన భరత్ కుమార్, జంబోజు సత్తయ్య, కే.విజయలక్ష్మి, కుమ్మరి కృష్ణమూర్తి, రాజ్‌కుమార్, ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ధాన్యం తరలింపును సమీక్షించాలి మంచిర్యాలరూరల్(హాజీపూర్): రైతులు నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తూ ధాన్యం తరలింపును కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట, నంనూర్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం సందర్శించారు. ధాన్యం నిల్వలు, తేమశాతం పరిశీలించారు. కలెక్టర్ వెంట గిర్దావర్ ప్రభు, నిర్వాహకులు, రైతులు ఉన్నారు. -
సర్కారు విద్యార్థులకు వర్క్‌బుక్స్
మంచిర్యాలఅర్బన్: సర్కారు బడిలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేస్తున్న ప్రభుత్వం వర్క్‌బుక్స్ కూడా అందించాలని నిర్ణయించింది. విద్యార్థులకు ప్రాక్టీస్, రివిజన్, పరీక్షలకు సిద్ధంకావడానికి ఇవి చాలా ఉపయోగపడుతాయి. పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించేందుకు దోహదపడతాయి. 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వర్క్‌బుక్స్ పంపిణీకి కసరత్తు పూర్తి చేశారు. జిల్లాలోని 814 పాఠశాలల్లో 60,943 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ వర్క్‌బుక్స్ ఉపయోగపడనున్నాయి. పంపిణీ ఇలా.. గతంలో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు వర్క్‌బుక్స్ ఉచితంగా ఇచ్చేవారు. ప్రస్తుతం ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు కూడా ఉచితంగా వర్క్‌బుక్స్ (అభ్యాస పుస్తకాలు) తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాద్యమాల్లో పంపిణీ చేయనున్నారు. ప్రతీ పాఠం చివరన ఉండే అవగాహన–ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత ప్రశ్నలకు సులువైన సమాధానాలుంటాయి. పాఠ్యపుస్తకాల బోధన తర్వాత విద్యార్థులకు పుష్కలమైన సాధన, అధ్యాయం ముగిశాక రివిజన్ వర్క్షీట్లు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల విద్యార్థులకు జూన్ నెలాఖారుకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. -
20న మెడికల్ షాపులు బంద్
నస్పూర్: ఈ నెల 20న జిల్లాలోని అన్ని రిటైల్, హోల్‌సేల్ మెడికల్ షాపులు బంద్ చేస్తున్నట్లు జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోటూరి చంద్రశేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి తొగరి సుధాకర్ తెలిపారు. నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం బంద్‌కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలకు భారీ డిస్కౌంట్లు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్‌కు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మందులు అత్యవసరమైన వారు 98662 23544, 92473 93239, 98497 05767 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రెజ రర్ గుడెల్లి రాజేంద్రప్రసాద్, కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి, ఏ.సమ్మయ్య, ఎస్.రమణారెడ్డి, జి.రవీందర్, టి.వెంకటేశ్, తిరుపతి, రమేశ్, కుమార్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి
కోటపల్లి: కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. ఆదివారం కోటపల్లి మండల కేంద్రంలోని ధాన్యం నిల్వ చేసే గోదాములతో పాటు శంకరాపూర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. గోదాములకు తరలించిన ధాన్యాన్ని వేగవంతంగా దిగుమతి చేసుకోవాలని, అవసరమైతే హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు. అనంతరం డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తేమశాతం చూసుకుని తాలు, తప్ప ఎలాంటి మట్టిగడ్డలు లేని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేందర్రావు, సీఐ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
బస్టాండ్ విస్తరణ ఎప్పుడో?
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల బస్‌స్టేషన్ విస్తరణలో జాప్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లో రద్దీ ఎక్కువగా ఉండడంతో కొన్నిసార్లు కూర్చునే సౌకర్యం కూడా లేకపోవడం, స్థలం సరిపోక బస్సులు ఆలస్యం కావడం జరుగుతోంది. అంతేకాకుండా ప్లాట్‌ఫాం లేక బస్సులు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రస్తుతం డిపోకు ఉన్న కొద్దిపాటి స్థలాన్ని సద్వినియోగం చేసుకునేలా కసరత్తు జరిగింది. మంచిర్యాల డిపో స్థలాన్ని (ప్రహరీని కొంతమేర పక్కకు జరిపి) బస్‌స్టేషన్ విస్తరించేందుకు అధికారులు పంపిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతేడాది మే నెలలో బస్‌స్టేషన్ విస్తరణ పనులు చేపడతారనే కూడా ప్రచారం జరిగినా ఆపై పనులు అటకెక్కాయి. విస్తరణపై పట్టింపేది? మంచిర్యాల బస్‌స్టేషన్ విస్తరణలో భాగంగా డిపో ను వేరేచోటకు తరలించేందుకు అధికారులు ప్రతి పాదనలు తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదించారు. క్వారీ రోడ్, నస్పూర్ మెయిన్ రోడ్‌తో పాటు పలుచోట్ల బస్‌డిపో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెంపల్లిలో ఆర్టీసీ అధికారులు స్థల పరిశీలన చేశారు. ఆ తర్వాత కాలంలో డిపో ప్రస్తావన మరుగున పడింది. డిపో తరలింపునకు ముందుగా గతేడాది బస్‌స్టేషన్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వ చ్చినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. బస్ డిపో ప్రహరీని 12 నుంచి 13 ఫీట్ల మేర వెనక్కి జరిపేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం డిపోలో ఉన్న స్కూటర్ షెడ్‌ను వెనకవైపు ఏర్పాటు చేయనున్నారు. నిర్మల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్డి, సెక్యూరిటీ రూంలు మాత్రం యధావిధిగానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన టారయిలెట్లను అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. వాహనాల స్టాండ్‌ను అక్కడి నుంచి తొలగించి ఆస్పత్రి వెనకవైపు ఉన్న ఖాళీస్థలానికి మార్చేందుకు ప్రతిపాదనలు రెడీ చే శారు. నెలలోపు ప్రహరీ తొలగింపు పనులు చేపడుతారని హడావుడి సాగినా మళ్లీ మొదటికి వచ్చింది. 51 ఏళ్లు గడిచినా మెరుగుపడని సౌకర్యాలు 32 బస్సులు, తొమ్మిది ప్లాట్‌ఫాంలతో 1975, ఫిబ్రవరి 6న మంచిర్యాల బస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. 3.21 ఎకరాల్లో డిపో, 1.34 ఎకరాల్లో బస్‌స్టేషన్ నిర్మించారు. ప్రస్తుతం డిపో పరిధిలో 148 బస్సులున్నాయి. ఇందులో 69 అద్దె బస్సులు ఉన్నాయి. మంచిర్యాల బస్‌స్టేషన్ మీదుగా రోజుకు 62 వేల కిలోమీటర్ల మేర బస్సులు నడపటం ద్వారా రూ.34 నుంచి 36 లక్షల(మహలక్ష్మీ పథకం కలుపుకుని) ఆదాయం సమకూరుతోంది. ఇందిరా మహిళా శక్తి కొత్త బస్సులు కూడా రానున్నాయి. బస్సులు పెరుగనుండడంతో మరింత ఇబ్బంది తప్పేలా లేదు. ప్రయాణికుల సంఖ్య, బస్సులు పెరిగినా ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో మాత్రం సౌకర్యాలు మెరుగుపడడం లేదు. -
క్రీడా సామగ్రి రావాల్సి ఉంది
వేసవి క్రీడా శిబిరాల నిర్వహణ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మొదలుకాగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. క్రీడా సామగ్రి రావాల్సి ఉంది. శిక్షణకు ఇబ్బంది లేకుండా గతంలో అందించిన క్రీడా పరికరాలను కోచ్‌లు వినియోగించి, శిక్షణ శిబిరాల్లో ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఆన్లైన్లో ప్రతీ విద్యార్థి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కొందరు విద్యార్థులు ఆన్లైన్లో నమోదుకు ముందుకు రావడం లేదు. కోచ్‌లు వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే, ప్రభుత్వం నుంచి త్వరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. – హన్మంత్ రెడ్డి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి, మంచిర్యాల -
ధాన్యం గోదాంలకు తరలించేలా చర్యలు
వేమనపల్లి: వరి ధాన్యం గోదాంలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం నిల్వ ఉంచేందుకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. చెన్నూర్, ఇతర మండలాల నుంచి పెద్దఎత్తున ధాన్యం గోదాంకు తరలిస్తున్నామన్నారు. అన్‌లోడింగ్‌కు హమాలీలు సహకరించాలని, క్రమపద్ధతిలో ధాన్యం అన్లోడ్ చేయాలన్నారు. నీల్వాయి మక్కల కొనుగోలు కేంద్రం పరిశీలించి నిల్వలకు సరిపడా లారీలు పంపిస్తామన్నారు. తీగల్‌పహాడ్ గోదాంకు మక్కలను తరలిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీటీ సాయికృష్ణ, ఆర్ఐ ఖాలిక్, లారీ కాంట్రాక్టర్లు రిషిక్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో విఫలం
నస్పూర్: సింగరేణి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతి నిధ్య సంఘం ఐఎన్టీయూసీ విఫలం అయ్యాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి ఆరోపించారు. ఆదివారం యూనియన్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి యాజమాన్యంతో కనీసం స్ట్రక్చర్ సమావేశం ఏర్పాటు చేసుకోలేని దీనస్థితిలో గుర్తింపు సంఘం ఉందన్నారు. మొదటి స్ట్రక్చర్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయించలేని స్థితిలో ఉందన్నారు. 14 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు. మెడికల్‌బోర్డు నిర్వహణ తేదీని వెంటనే ప్రకటించాలని, ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్న సుమారు రూ.53 వేల కోట్లను వెంటనే తిరిగి తీసుకురావాలని, డిపెండెంట్లకు నియామక పత్రాలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అపరిష్కృత సమస్యల పరిష్కారానికి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ఎప్పుడు సమ్మెకు పిలుపునిచ్చినా మద్దతుగా సమ్మెలో పాల్గొంటామన్నారు. సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు పానుగంటి సత్తయ్య, అవినాష్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
నిప్పంటుకొని ట్రాక్టర్ ట్రాలీ దగ్ధం
తాండూర్: మండలంలోని అచ్చలాపూర్ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ట్రాక్టర్ ట్రాలీ దగ్ధమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బామండ్లపల్లి సంతోష్ నల్లవాగు సమీపంలోని తన పొలం నుంచి ట్రాక్టర్లో గడ్డి తీసుకొని ఇంటికి వస్తుండగా విద్యుత్ తీగలు గడ్డికి తగిలి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ఇంజన్, ట్రాలీని వేరు చేశారు. సమాచారం అందుకున్న బెల్లంపల్లి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ట్రాలీ చాలా వరకు కాలిపోయింది. విద్యుత్ తీగల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
మువ్వల సవ్వడి
జన్నారం: వేసవి సెలవుల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు కొందరు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతిరోజూ నిత్య సాధనతో మువ్వల సవ్వడి చేస్తున్నారు. జన్నారం మండల కేంద్రంలో మొదట 10 మంది ఉన్న నటరాజ కళాక్షేత్రం డ్యాన్స్ క్లాస్‌లో ప్రస్తుతం 30 మంది వరకు చేరారు. ఇంకా పిల్లలు శిక్షణకు వచ్చే అవకాశం ఉందని మాస్టర్ నర్మదగౌడ్ తెలిపారు. సంప్రదాయానికి పట్టాభిషేకంఆధునిక పోకడలు, వెస్ట్రన్ డ్యాన్స్ క్లాసులు ఎన్ని ఉన్నా కూచిపూడి నృత్యానికి ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదని ఈ వేసవి శిక్షణ శిబిరాలు నిరూపిస్తున్నాయి. 5 ఏళ్ల చిన్నారుల నుంచి కాలేజీ విద్యార్థుల వరకు, సాయంత్రం వేళల్లో నృత్య అకాడమీల్లో సాధన చేస్తున్నారు. పాద విన్యాసాలు –హావభావాలు..కూచిపూడిలోని ప్రాథమికాంశాలైన అడుగులు (చతురస్ర, తిస్ర గతులు), హస్త ముద్రలు, ముఖంలో నవరసాలను పలికించే హావభావాలపై నృత్య మాస్టర్ నర్మదగౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. సంప్రదాయ నృత్యమైన కూచిపూడిలో మెలకువలు నేర్పిస్తున్నారు. పిల్లలు కంప్యూటర్, మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను డ్యాన్స్ క్లాసులకు పంపిస్తున్నారు.స్నేహితురాలి సాయంతో సైకిల్ నేర్చుకుంటున్న చిన్నారి -
‘రైతుల కష్టాలు పట్టించుకోని మంత్రి, ఎంపీ’
చెన్నూర్: చెన్నూర్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేయాలని మూడు రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పట్టించుకోవడంలేదని జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం స్థానిక మార్కెట్ యార్డులో రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు డీసీఎం సెంటర్ల వద్ద పక్షం రోజులుగా ఇబ్బందులు పడుతుంటే మంత్రి, ఎంపీ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన పాపాన పోలేదన్నారు. రైతులు సొంత ఖర్చులతో ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తీసుకువచ్చినా కోనుగోలు చేయడం లేదన్నారు. హమాలీ ఖర్చులు సైతం రైతులే భరించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రెస్‌మీట్‌ను అడ్డుకునేందు సీఐ బన్సీలాల్ ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌రెడ్డి, కౌన్సిలర్ కొప్పుల ప్రభాకర్, మాజీ కౌన్సిలర్లు రెవెల్లి మహేశ్, అనిల్, తుమ్మ రమేశ్, జోడు శంకర్, నాయకులు మానిశెట్టి శ్రీనివాస్, రుద్రంభట్ల సంతోశ్, భారతి, అయిత సురేశ్‌రెడ్డి, నాయబ్, తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు
చెన్నూర్: నియోజకవర్గంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. స్థానిక మార్కెట్ గోదాం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నూర్, కోటపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. మంత్రి, ఎంపీలు రైతులను పట్టించుకోవడం లేదని కొందరు బీఆర్ఎస్ నాయకులు అసత్యపు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటివి మానుకోవాలన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లా డి గోదాములను అద్దెకు తీసుకొని ధాన్యాన్ని తరలిస్తున్నారన్నారు. లారీలు అన్లోడ్ కావడం ఆలస్యమవుతుంటే కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపించడం తగదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో రైతులకు తెలుసన్నారు. మంత్రిపై అబద్దపు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అసత్యపు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్‌ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ కరుణసాగర్‌రావు, నాయకులు పెద్దింటి శ్రీనివాస్, కౌన్సిలర్లు అంబాటి శంకర్, సుశీల్‌కుమార్, చెన్నూరి రాజేశ్, పాతర్ల నాగరాజు, బాపాగౌడ్ పాల్గొన్నారు. -
‘బడి’బాట సాగేదెట్లా..!
మంచిర్యాలఅర్బన్/లక్ష్మణచాంద: సర్కారు బడుల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ఏటా విద్యాశాఖ ని ర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం–అమలు ప్రణాళిక(2026–27)పై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 14 నుంచి జూన్ 19వరకు బడిబాట నిర్వహించి బడీడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది. ఓ వైపు జనగణన విధులు.. మరోవైపు బడిబాటలో విద్యావారోత్సవాల నిర్వహణపై ఉపాధ్యాయులు తల పట్టుకుంటున్నారు. జనగణన విధులకు ఎంపిక కాని ఉపాధ్యాయులు బడిబాటలో పాల్గొనాలంటూ శుక్రవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయులతోపాటు సీనియర్ ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉండగా.. ఉపాధ్యాయులంతా జనగణన విధుల్లో ఉండగా బడిబాట ఎలా కొనసాగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. టీచర్లంతా జనగణన విధుల్లోనే..మంచిర్యాల జిల్లాలో 709 పాఠశాలల్లో 43,072 విద్యార్థులు చదువుతుండగా 2,755 మంది టీచర్లు బోధిస్తున్నారు. పాఠశాలలో హెడ్మాస్టర్, సీనియర్ ఉపాధ్యాయుడు మాత్రమే ఉండగా మిగతా వారందరికీ విధులు కేటాయించారు. టీచర్లు సరి పోకపోవడంతో కోటపల్లి మండల నుంచి ఉపాధ్యాయులకు మంచిర్యాల పట్టణంలో విధులు కేటాయించారు. దివ్యాంగ ఉపాధ్యాయులకు విధులు కేటాయించలేదు. కొన్ని చోట్ల సీనియర్ ఉపాధ్యాయులకు కూడా జనగణన విధులు వేశారు. ప్రధానోపాధ్యాయులు మాత్రం పాఠశాలకు పరిమితం అయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం నుంచి తదితర సమాచారం కోసం అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఎంపీపీఎస్ 132, జీపీఎస్ 4, ఎంపీయూపీఎస్ 5, టీడబ్ల్యూపీఎస్ 46 మంది ఏకోపాధ్యాయ టీచర్లున్నారు. వీరందరూ జనగణనలో ఉంటే బడిబాట ఎలా సాగుతుందో అధికారులకే తెలియాలి. గందరగోళం..ఈ ఏడాది బడిబాటపై గందరగోళం నెలకొంది. ప్రతియేటా జూన్ 6నుంచి 19వ వరకు పక్షం రోజు లపాటు కొనసాగుతుండగా ఈసారి 14 నుంచి జూ న్ 19వరకు బడిబాట కార్యక్రమం చేపట్టడంపై పెదవి విరుస్తున్నారు. 14న తల్లిదండ్రుల సమావే శం, 21న అంగన్వాడీ టీచర్లు, మదర్స్ కమిటీ సమావేశాలు, 28న యువత, స్థానిక నాయకులతో సమావేశం, మే 31న యూనిఫారాలు, పాఠ్యపుస్తకా లు, నోట్బుక్స్ల పంపిణీ, జూన్ 3నుంచి 19వరకు రెగ్యులర్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు వ చ్చాయి. జూన్ 3న గ్రామసభ, 4న అవగాహన ర్యా లీ, 5న సీఎస్‌డబ్ల్యూఎన్ పిల్లల గుర్తింపు, 6న బడిబయట పిల్లల గుర్తింపు, 8నుంచి 10వరకు ఇంటింటా ప్రచారం, 12న వెల్కమ్ డే, 15న సామూహిక అక్షరాభ్యాసం, 16న ఎఫ్ఎల్ఎల్ డే, 17న గర్ల్స్ చిల్డ్రన్స్ డే, 18న డిజిటల్ అవర్నెస్ డే, 19 స్పోర్ట్స్ నిర్వహించాలని సూచించారు. గత సంవత్సరంతో పోల్చితే కనీసం 10శాతం నమోదు సాధించాలని టీచర్లకు లక్ష్యం విధించారు. జనగణన జూన్ 9వరకు కొనసాగుతుండగా బడిబాట నిర్వహణ కూడా టీచర్లకు కత్తిమీద సాములా మారింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది 2026–27లో ఎన్రోల్మెంట్ టార్గెట్ విధించారు. ఇది ఎలా సాధ్యమవుతుందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యం చేరేందుకు చర్యలు బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ జిల్లాకు ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి కలెక్టర్ భవేష్ మిశ్రా సూచనల మేరకు అన్ని చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని ఆయా మండలాల వారీగా బడి బయట పి ల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. – భోజన్న, డీఈవో, నిర్మల్ ఉమ్మడి జిల్లా వారీగా లక్ష్యం ఇలా..జిల్లా పాఠశాలలు 2025–26 2026–27 ఎన్రోల్మెంట్ లక్ష్యం ఆదిలాబాద్ 693 57,896 64,018 ఆసిఫాబాద్ 704 40,531 44912 నిర్మల్ 713 47969 53100 మంచిర్యాల 709 43072 47715 -
ఈఏిపీసెట్లో ‘అల్ఫోర్స్’కు చారిత్రాత్మక ర్యాంకులు
కొత్తపల్లి(కరీంనగర్): ఈఏపీసెట్– 2026 ఫలితా ల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు చారిత్రాత్మక ర్యాంకులు సాధించినట్లు చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లోని అల్ఫోర్స్ టైనీటాట్స్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో డి.రిత్విక్ రాష్ట్ర స్థాయి 11వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలవగా, ఇంజినీరింగ్‌లో పి.చరణ్ 22వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. సీహెచ్.లక్ష్మీహాసిని 74, నిదా 157, పి.అక్షయ 251, ఎల్.అర్యన్రావు 252, మహ్మద్‌హుసేన్272, వి.రుచిత 293, ఏ.నాగసింధు 330, బి.అభిఘ్న 430, వి.సుహాసిని 439, వి.శ్రేయస్ రెడ్డి 487, జె.నయన్ 505, జి.చైత్ర 506, బి.లిఖిత్సాయి 538, ఎల్.అనంతసాయి 543, కె.అక్షిత 555, జి.లాస్యరెడ్డి 614, జి.హర్షిత 637, టి.హర్షిత 697, టి.సహస్ర 739, జె.జస్రిత సాయి 745, డి.విశ్వతేజ 772, ఎం.సిరిమణి 814, సయ్యద్ మలాజోద్దిన్ 836, షరిన్ ఫాతిమా 898, కె.ధనుష్ 904, పి.చందన 905, యన్.జస్వంత్‌సాయి 921, కె.అక్షయ 951, ఎల్.ప్రణయని 954, ఎన్.రత్నప్రకాశ్ 961 ర్యాంకు సాధించారని తెలిపారు. -
అగ్ని ప్రమాదంలో జొన్న పంట దగ్ధం
ఇంద్రవెల్లి: అగ్ని ప్రమాదంలో జొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలోని హర్కపూర్తండా గ్రామంలో జరిగింది. రైతు ఆడే విఠల్, సర్పంచ్ రాథోడ్ రోహిదాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పక్క చేనులో అగ్గి పెట్టగా మంటలు వ్యాపించి కోసి కుప్ప పెట్టిన జొన్న పంటకు అంటుకున్నాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో జొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. సుమారు 20 క్వింటాళ్ల జొన్న పంట కాలిపోయిందని రైతు వాపోయాడు. రెవెన్యూ అధికారులు కాలిపోయిన పంటను పరిశీలించి ప్రభుత్వం నుంచి పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కానిస్టేబుల్ ఆత్మహత్య మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంటపల్లెకు చెందిన అరవింద్ యాదవ్ (31) అనే కానిస్టేబుల్ శనివారం రాత్రి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే అరవింద్ యాదవ్ 2026 మార్చి 6న ఽవిధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. అప్పటి నుంచి సొంతూరు ఎర్రగుంటపల్లెలోనే తల్లి, చెల్లితో కలిసి ఉంటున్నాడు. సస్పెండ్ కావడంతో మానసిక వేధనకు గురై శనివారం రాత్రి 11 గంటలకు రామన్ కాలనీ సమీపంలోని ఏడు కానాల బ్రిడ్జ్ వద్ద రైల్వే ట్రాక్‌పై హిమసాగర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. వివాహిత .. ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని చిచ్‌ధరి ఖానాపూర్‌కు చెందిన కమలాబాయి (55) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై విష్ణువర్ధన్ ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలాబాయి జీవితంపై విరక్తి చెంది అఘాయిత్యానికి పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఇచ్చోడ: మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని గాంధీనగర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ గ్రామానికి చెందిన తయ్యూబ్ (45) తన భార్యతో కలిసి ఆదిలాబాద్ నుంచి తన స్వగ్రామం మాదాపూర్‌కు బైక్‌పై వెళ్తుండగా గాంధీనగర్ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక గుర్తు తెలియని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తయ్యూబ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్ర గాయాలపాలైన భార్యను స్థానికులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సుంకిడిలో పశువు చోరీ తలమడుగు: పశువుకు మత్తుమందు ఇచ్చి చోరీకి పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన గుమ్మడి ఆశన్నకు చెందిన ఆవుకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. మరో నాలుగు పశువులకు మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి ఆటో ట్రాలీలో ఎక్కించే సమయంలో సమీపంలో ఉన్న ఇళ్లలోని వ్యక్తులు గమనించడంతో అక్కడ నుంచి పరారయ్యారు. మత్తుమందు ఇంజక్షన్ ఇవ్వడంతో నాలుగు పశువులు స్పృహ కోల్పోయి ఉన్నాయి. గ్రామంలో పశువుల దొంగతనం జరగడం ఇది మూడోసారి. బాధితుడు ఆశన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు. ఇంట్లో దొంగతనం మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హమాలీవాడ కు చెందిన పెంచాల పద్మ ఇంట్లో దొంగతనం జరి గినట్లు స్థానిక సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పద్మ ఈ నెల 16న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువా పగులగొట్టి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. దొంగలు 10 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.10వేలు నగదు దోచుకెళ్లారు. బాధితురాలు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఉద్యోగ సోపానం..సావర్‌ఖెడా గ్రంథాలయం
కెరమెరి: మండలంలోని సావర్‌ఖెడాలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం విద్యార్థులు, నిరుద్యోగుల కు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆగస్టు త ర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన సుమారు 20 మందికి పైగా నిరుద్యోగులు వేసవిలో పోటీ పరీ క్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తక పఠనం చేస్తున్నారు. పీఎంశ్రీ పాఠశాల హెచ్ఎం కడేర్ల రంగయ్య బడి బాగుకు చేసిన సేవలు తెలుసుకున్న ‘సర్’ సినిమా డైరెక్టర్ నాగవంశీ గ్రంథాలయ ఏర్పాటుకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. గ్రామస్తులు, దాతల సహకారంతో.. గ్రామస్తులతో పాటు కెరమెరి ఎంఆర్సీలో విధులు నిర్వహస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్ అశ్విని, తదితరులు పుస్తకాల కొనుగోలుకు ఆర్థికసాయం అందించారు. వాటితో డైట్‌సెట్, బీఎడ్, పోలీస్ కానిస్టేబుల్, నీట్, ఆర్జేసీ, ఎస్ఎస్సీ, గ్రూప్స్, ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేశారు. -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. శనివారం స్థానిక కుమురంభీం కాంప్లెక్స్‌లోని ఎమ్మార్సీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల ఆదివాసీ సర్మేడిలు, వివిధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రధానమంత్రి జుగా పథకంలో భాగంగా ఉట్నూర్‌కు కేంద్ర గ్రంథాలయం మంజూరైందన్నారు. విద్యార్థులు, యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన పుస్తకాలు, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. గిరిజనుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వాట్సాప్ ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలు తెలపవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ రుత్విస్ సాయి కొట్టే, ఐటీడీఏ అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ నాయకులు, సర్మేడిలు, తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యకరమైన భవిష్యత్ నిర్మించుకోవాలి
నస్పూర్: ప్రజలు ఆరోగ్యకరమైన భవిష్యత్ నిర్మించుకోవాలని నగర మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్‌లో శనివారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మధుకర్ మాట్లాడుతూ జిల్లాలో డెంగీ జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని, డెంగీని నిర్మూలిద్దామని అన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అనిత, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ సుధాకర్‌నాయక్, అల్లాడి శ్రీనివాస్, కార్పొరేటర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
కాగజ్‌నగర్‌టౌన్: భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. నిర్మల్ జిల్లా బాసర రైల్వేస్టేషన్ మీదుగా నడిచే 07189/90 నాందేడ్–ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ అధికారులు ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న ధర్మవరం జంక్షన్లో ప్రారంభం కానుంది. 22న నాందేడ్ నుంచి రెగ్యులర్‌గా నడవనుంది. ఈ రైలులో 8 స్లీపర్, 6 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, 4 జనరల్ బోగీలు ఉంటాయి. ఇందులో దివ్యాంగులకు రాయితీ సౌకర్యం కల్పించారు.క్రమబద్ధీకరణ తర్వాత ఈ రైలుకు కొత్త నంబర్లు కేటాయించారు. 17635 నాందేడ్–ధర్మవరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతీ శుక్రవారం నాందేడ్‌లో బయలుదేరి 6:30 గంటలకు బాసర రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక్కడ రెండు నిమిషాల హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. 17636 ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతీ ఆదివారం ఉదయం 5:25కు బయలుదేరి 10:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 10:40కి బయలుదేరి సోమవారం తెల్లవారు జాము న 4:45 గంటలకు బాసరకు చేరుకుంటుంది. 4:47 గంటలకు నాందేడ్ బయలుదేరుతుంది. ఈ రైలు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, గూడురు, తిరుప తి, పాకాల మార్గం గుండా నడుస్తుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని భక్తులకు ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది. పెద్దపల్లి జంక్షన్‌తో కనెక్టివిటి17636 ధర్మవరం–నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తిరుపతి నుంచి వచ్చే భక్తులకు పెద్దపల్లి జంక్షన్లో ప్రతీ ఆదివారం రాత్రి 11:55కు పెద్దపల్లిలో దిగిన భక్తుల కు 10 నిమిషాల వ్యవధిలో రాత్రి 12:05 గంటలకు వచ్చే 17035 కాజీపేట్–బల్లార్షా ఎక్స్‌ప్రెస్ ఎక్కి రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌కు వెళ్ళవచ్చు. ఈ కొత్త రైలుతో పెద్దపల్లి జంక్షన్ నుంచి తిరుపతికి రైలు సౌకర్యం మరింత మెరుగుపడింది. ప్రతీ గురు, శుక్ర, శని, ఆదివా రాల్లో వరుసగా నాలుగు రోజులు వరంగల్–విజ యవాడ మీదుగా తిరుపతికి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. గురు, ఆదివారాల్లో రాత్రి 8గంటలకు 12762 కరీంనగర్–తిరుపతి బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, శుక్రవారం రాత్రి 10 గంటలకు 17635 నాందేడ్–ధర్మవరం వీక్లీ ఎక్స్‌ప్రెస్, శనివారం రాత్రి 10 గంటలకు 17633 నాందేడ్ తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. -
పశువుల అక్రమ రవాణాకు చెక్
మంచిర్యాలక్రైం: మూగజీవాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది. జిల్లాలో ఏడు ప్రత్యేక శాశ్వత, 15 తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా పశువులను కబేళాకు తరలించే వారిపై జీరో టాలరెన్స్ అమలు చేస్తోంది. నేరం చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా అత్యంత కఠినమైన శిక్ష విధించే విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో రాపనపల్లి చెక్‌పోస్టు, నెన్నెల మండలం టీ జంక్షన్, ఇందారం, గూడెం, ఇందన్పల్లి, మందమర్రి, రేపల్లెవాడ వద్ద ప్రధాన చెక్‌పోస్టులు ఉన్నాయి. ఒక్కో చోట ఐదుగురు పోలీసు సిబ్బంది(స్పెషల్ ఫోర్స్), పంచాయతీ కార్యదర్శి, పశువైద్యాధికారి, ఆర్టీఓ నుంచి ఒకరు మొత్తంగా తొమ్మిది మంది సభ్యుల బృందం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు జిలాల్లో 15 కేసులు నమోదు కాగా, 112 పశువులను గోశాలకు తరలించారు. ఎక్కడెక్కడి నుంచి.. మహారాష్ట్రలోని బల్లార్షా, చంద్రాపూర్, రాజురా, షిరోంచ, అహెరి, ఆలపెల్లి, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, కెరమెరి, కౌటాల, బెజ్జూర్ గిరిజన ప్రాంతాలు, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, నీల్వాయి గ్రామాల్లోని రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసినవి కొన్నయితే.. రహదారులపై రాత్రివేళ నిద్రిస్తు న్న ఆవులను దొంగిలించి అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల కబేళాలకు తరలిస్తున్నారు. గతంలో కౌటాల నుంచి జగిత్యాలకు డీసీఎం వ్యానులో ఆవులను తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పాతమంచిర్యాలకు చెందిన బొలిశెట్టి మల్లేష్‌కు చెందిన ఆవు ఇంటి ముందు కట్టేసి ఉండగా.. ఖరీదైన కారులో ఎక్కించుకుని పోయారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో ఓ పశువుల దొంగల ముఠా రోడ్లపై తిరుగుతున్న ఆవులను అపహరించుకెళ్లి రాత్రికి రాత్రే వధించి మాంసం విక్రయిస్తుందనే ఆరోపణలున్నాయి. -
చదువుతోపాటు సమాజంపై అవగాహన ఉండాలి
మంచిర్యాలఅర్బన్: చదువుతోపాటు సమాజంపై అవగాహన ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో కళోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను కళలపై ఆసక్తిని పెంపొందించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. భవిష్యత్‌లో మంచి పౌరులుగా, బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగాలని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తోలుబొమ్మలాట, కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఎనిమిది విభాగాల నుంచి 115 మంది విద్యార్థులు, 33 మంది గైడ్ టీచర్లు పాల్గొన్నారు. విజేతలు వీరే.. కళోత్సవ పోటీల విజేతలను ప్రకటించారు. జిల్లా పరిషత్ పాఠశాల ముత్యంపల్లి విద్యార్థి అక్షయ్ తోలుబొమ్మలాటలో ప్రథమ, ఒగ్గుకథలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల లక్సెట్టిపేట ప్రథమ, వెంకట్రావుపేట్ పాఠశాల ద్వితీయ, పేరిణి నృత్యంలో మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు ప్రథమ, ద్వితీయ, కోలాటంలో ఎంపీపీఎస్ అక్కేపల్లిగూడ ప్రథమ, పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ తీగలపహాడ్ ద్వితీయ, లంబాడా నృత్యంలో టీజీఎంఎస్ మందమర్రి ప్రథమ, ఎంపీపీఎస్ అక్కపెల్లిగూడ ద్వితీయ, చిత్రలేఖనంలో జెడ్పీఎస్ దేవాపూర్ ప్రథమ, టీజీ మోడల్‌స్కూల్ కాసిపేట ద్వితీయ, హస్తకళల విభాగంలో పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ బజార్ ఏరియా బెల్లంపల్లి ప్రథమ, జెడ్పీహెచ్ఎస్ ముత్యంపల్లి ద్వితీయ, దివ్యాంగుల విభాగంలో లంబాడీ నృత్యంలో భవిత సెంటర్ నస్పూర్ ప్రథమ బహుమతి సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, కో–ఆర్డినేటర్లు భరత్‌కుమార్, కె.కృష్ణమూర్తి, సత్తయ్య, రాజ్‌కుమార్, ఎంఈవోలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
దండేపల్లి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి బస్తాలను మిల్లులు, గోదాంలకు ఎప్పటికప్పుడు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులు, నిర్వాహకులకు సూచించారు. శనివారం ఆయన మండలంలోని కన్నెపల్లి, గూడెం, నంబాల, వెల్గనూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల అధికారులతో కలిసి సందర్శించారు. తూకం వేసే తీరు, బస్తాల తరలింపు, గన్నీ సంచులు సరిపడా ఉన్నాయా లేదా అనే వాటిపై ఆరా తీశారు. వెల్గనూర్‌లో వరుసక్రమం పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా తూకం వేస్తున్నారని, బస్తాలు తరలిస్తున్నారని పలువురు రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అలా చేస్తే ఉపేక్షించేది లేదని నిర్వాహకులను మందలించారు. తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. గోదాం పరిశీలించిన ఏసీపీ.. మండలంలోని లింగాపూర్ సమీపంలో వరి ధాన్యం నిల్వ గోదాంను మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ శనివారం పరిశీలించారు. గోదాం నిర్వాహకులతో మాట్లాడారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సీఐ రమణమూర్తి, ఎస్సై తహాసీనొద్దీన్ ఉన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలి లక్సెట్టిపేట: ప్రజలకు మెరుగైన సేవలందించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని ఐదవ, 12వ వార్డులు పరిశీలించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. అనంతరం రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
దాహం తీరే దారేది..!
మంచిర్యాలఅర్బన్: ఎండలు మండిపోతుండడంతో చల్లని నీరు కరువై ఆర్టీసీ ప్రయాణికులు, ఉద్యోగుల గొంతెండిపోతోంది. దాహంతో అల్లాడిపోతూ నీటి కోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. మంచిర్యాల బస్టాండ్, డిపోలో చల్లని తాగునీటి కోసం ఏర్పాటు చేసిన నాలుగు ఫ్రిజ్‌లు నెల రోజులు దాటినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రయాణికులు దాహార్తి తీర్చుకునేందుకు నీటి బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. మంచిర్యాల డిపోలో 148 బస్సులు ఉండగా, 468 మంది ఉద్యోగులు ఉన్నారు. బస్సులను రోజుకు 60వేల కిలోమీటర్లు తిప్పడం ద్వారా వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. దాదాపు రూ.25లక్షల ఆదాయం సమకూరుతోంది. డిపో కార్మికులు, బస్టాండ్‌లోని చెన్నూర్ పాయింట్ వద్ద ఫ్రిజ్‌లు ఏర్పాటు చేశారు. కార్మికులు, ఉద్యోగుల కోసం స్థానిక ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు ఒక ఫ్రిజ్‌ను అందజేశారు. ఇటీవల మరమ్మతులకు నోచుకోవడంతో పక్కన పడేశారు. బస్టాండ్‌లోని ఫ్రిజ్‌ను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినా మరమ్మతులకు గురైంది. అంతకుముందు బస్టాండ్, డిపోలోని సంస్థకు చెందిన ఫ్రిజ్‌లు మూలనపడ్డాయి. మరమ్మతులు చేయించకపోవడంతో చల్లని తాగునీరు అందడం లేదు. ఆర్వోప్లాంటు ఎక్కడ..? గతంలో ఎంపీ నిధులు రూ.10లక్షలు వెచ్చించి ఆర్వో ప్లాంటును బస్టాండ్‌లో చెన్నూర్ ప్లాట్ఫారం సమీపంలోని క్వాంటీన్ దగ్గర బోర్‌కు అమర్చారు. రూపాయి కాయిన్ వేస్తే బాటిల్లో చల్లని శుద్ధమైన నీరు వచ్చేది. చిన్నపాటి మరమ్మతులు, నిర్వహణ లేక 2023లో మూలనపడింది. ఇటీవల బస్టాండ్‌లో క్యాంటీన్ అద్దెకు తీసుకున్న యజమాని హోటల్, వాటర్‌బాటిల్ విక్రయాలకు అడ్డుగా ఉందనో ఏ మో గానీ అక్కడి నుంచి తొలగించినా అప్పటి అధి కారులు ‘మామూలు’గా వ్యవహరించారు. ఫ్రిజ్‌ల ద్వారా చల్లని నీరందించేందుకు అధికారులు శ్రద్ధ చూపకపోవడంపై కార్మికులు, ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్వో వాటర్‌ప్లాంటును ప్రయాణికులకు సౌకర్యార్థంగా పాత స్థలంలో ఏర్పాటు చేయాలని, ఫ్రిజ్‌లను మరమ్మతు చేయించి తాగునీరు అందేలా చూడాలని కోరుతున్నారు. కొత్త ఫ్రిజ్ ఏర్పాటు చేస్తాంబస్స్టేషన్, డిపోలో చల్లని శుద్ధ నీరందించే ఫ్రిజ్‌లు మరమ్మతుకు గురయ్యాయి. వాటిని రిపేరు చేయించేందుకు కొటేషన్ తీసుకుంటే ఎక్కువ డబ్బులు అవుతున్నాయి. దీంతో ఉన్నతాధికారుల సూచన మేరకు చల్లని నీరు అందించే కొత్త ఫ్రిజ్ కోసం ప్రతిపాదనలు పంపించాం. జన్నారం, లక్సెట్టిపేట, చెన్నూర్‌లో ప్రయాణికులకు ఫ్రిజ్ ద్వారా శుద్ధి చేసిన చల్లని నీరందుతుంది. – శ్రీనివాసులు, మంచిర్యాల డిపో మేనేజర్ -
20న మెడికల్ షాపుల బంద్
మంచిర్యాలటౌన్: ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోటూరి చంద్రశేఖర్‌రావు, తొగరు సుధాకర్ మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల విక్రయాలు ఆపాలని, కార్పొరేట్ సంస్థలకు భారీ డిస్కౌంట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ ఫార్మసీ వల్ల మందుల అమ్మకాలపై నియంత్రణ ఉండదని, నకిలీ, మత్తు కలిగించే మందులు ప్రిస్కిప్షన్ లేకుండా విచ్చలవిడిగా దొరికే అవకాశం ఉంటుందని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మద్దతుగా, తెలంగాణ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలోనూ మెడికల్ షాపులను ఒకరోజు బంద్ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కోశాధికారి జి.రాజేంద్రప్రసాద్, ఎం.బాలేశ్వర్రావు, గోవింద్‌రెడ్డి, జి. రాజు, కె.చంద్రశేఖర్, శ్రీనివాస్, ఎం.కిరణ్‌కుమార్, విష్ణు పాల్గొన్నారు. -
ధాన్యం తరలింపునకు లారీలు కేటాయించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: కొనుగోలు చేసిన ధాన్యం తరలింపునకు సరిపడా లారీలు కేటాయించాలని జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, మేనేజర్ శ్రీకళతో కలిసి ధాన్యం తరలింపునకు లారీలు కేటాయించే కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా తాలు, తప్ప, ఎలాంటి మట్టిగడ్డలు లేని ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్మిల్లలు, గోదాములకు తరలిస్తున్నట్లు తెలిపారు. సరిపడా లారీలు అందుబాటులో ఉంచాలని, లేనిపక్షంలో కాంట్రాక్టర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. కొనుగోలు కేంద్రం సందర్శన జైపూర్: వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు తెలిపారు. మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన స్థానిక తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించారు. కేంద్రం నిర్వహకులకు పలు సూచనలు చేశారు. అవసరాన్నిబట్టి హమాలీల సంఖ్య పెంచుకోవాలని తెలిపారు. -
ఆర్జీయూకేటీలో గ్రంథాలయ దినోత్సవం
గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్టుబాసర: బాసర ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవా ల్లో భాగంగా శనివా రం గ్రంథాలయ ది నోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవేశ పరీక్షలకు, ఇంజినీరింగ్, సైన్స్, సా హిత్య విషయాలకు సంబంధించి నూతన పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత ప్రభుత్వ ఐఐటీ స్థాయిల పరిశోధనా పత్రాలు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. డిజిటల్ గ్రంథాలయం ద్వారా 10 కోట్లకు పైగా పుస్తకాలు, ఆడియో–వీడియో వనరులు ఒక్క క్లిక్‌లో పొందేమని ఆయన వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలంటూ సలహా అందించారు. ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ. మురళీ దర్శన్ మాట్లాడుతూ డిజిటల్ వనరులను ఎలా ఉపయోగించుకోవాలో సాధనాత్మక సూచనలు ఇచ్చారు. పుస్తక ప్రదర్శనలో ఇంజనీరింగ్, శాస్త్ర, సాహిత్య, పోటీ పరీక్షల సంభంధిత తాజా నోట్లు, పుస్తకాలు ప్రదర్శనకు ఉంచారు. గ్రంథాలయాధికారి డాక్టర్ కే.అరుణ జ్యోతి స్వాగత ప్రసంగంలో పుస్తకదానానికి ప్రోత్సాహం ఇచ్చి ‘పుస్తకదానం చేయండి.. అక్షరజ్ఞానం పంచండి‘ అంటూ పాఠకులకు ఆహ్వానం పలుకారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ ప్లానింగ్ శేఖర్ శీలం, అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్.విఠల్, దేవరాజ్, గ్రంథాలయ సిబ్బంది అర్చన, సునీత, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఇతర రాష్ట్రాల వారిపై అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలక్రైం: ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చినా, ఇంట్లో పనిలో పెట్టుకున్నా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, పూర్తి వివరాలు సేకరించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో స్థానిక సీఐ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రతీ ఇంట్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. నంబర్ ప్లేటు, ప్రతాలు లేని వాహనాలను సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 55 మందిని గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఆధార్‌కార్డు తదితర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడిచేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. గంజాయికి బానిసైన వారిని డీ అడిక్షన్ సెంటర్‌కు పంపించాలని అన్నారు. మహిళల భద్రతకు షీ టీమ్, భరోసా సెంటర్లు పని చేస్తున్నాయని తెలిపారు. మహిళలు హింస, వేధింపులకు గురైతే 100 డయల్‌కు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్‌రావు, రమణమూర్తి, ఆకు ల అశోక్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు, కార్పొరేటర్లు నల్ల శంకర్, పూదారి ప్రభాకర్, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు. -
● వేసవిలోనే పల్లెకు చేరుతున్న వైనం ● ఏటేటా పట్టుబడుతున్నా ఆగని రవాణా ● నిషేధిత విత్తనాలపై పోలీసుల నిఘా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చేనులో కలుపు బెడద తప్పుతుందని కొందరు రైతులు నిషేధిత హెచ్‌టీ(హెర్బిసైట్ టాలరెంట్)/బీజీ3(బోల్‌గార్డ్ 3) పత్తి విత్తనాలకే మొగ్గు చూపుతున్నారు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు గుట్టుగా నిషేధిత విత్తనాలను జిల్లాకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఏటా వేసవిలోనే నిషేధిత విత్తనాలు క్వింటాళ్ల కొద్దీ లూజుగానే గ్రామాలకు చేరుతుంటాయి. ఈ సీజన్లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దు కావడం, పొరుగున ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా వస్తున్నాయి. ఇవేగాకుండా కర్ణాటక, ఆంధ్రా నుంచి సైతం తరలిస్తూ పట్టుబడ్డారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు ఇక్కడికి అక్రమ రవాణా చేయడంలో కీలకంగా మారారు. ప్రతీసారి సీజన్‌కు ముందే మండలానికో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ అధికారితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే వ్యవసాయ అధికారులు ధాన్యం కొనుగోళ్లలో తీరిక లేకుండా ఉండడంతో కేవలం పోలీసు అధికారుల తనిఖీల్లో పట్టుబడినవే వెలుగులోకి వస్తున్నాయి. కలుపు తప్పుతుందనే.. వర్షాధారంగా సాగు చేసే చేన్లలో గడ్డి బెడద, కూలీల బాధ తప్పుతుందని నిషేధం ఉన్నప్పటికీ మొగ్గు చూపుతున్నారు. మొదట విత్తనాలు సరఫరా చేసి కలుపు సమయంలో గ్లైసిల్ ద్రావణం సరఫరా చేస్తున్నారు. తొలకరిలో విత్తనం వేశాక మొలక దశలో గడ్డి మందు పిచికారీ చేసినా మొక్కకు ప్రమాదం ఉండదు. గడ్డి మాత్రమే ఎండిపోతుంది. దీంతో రైతులు సీజన్లో కూలీల ఖర్చు తప్పడంతోపాటు సమయం ఆదా, పెట్టుబడి తగ్గుతుందని గోప్యంగా కొనుగోలు చేస్తున్నారు. అనేక కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ హెచ్‌టీ విత్తనాలు దొరికితే విత్తుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బీజీ3 జన్యుమార్పిడి విత్తనాలపై నిషేధం అమల్లో ఉంది.ప్రమాదకరంరైతులకు అవగాహన కల్పిస్తున్నాం నిషేధిత హెచ్‌టీ విత్తనాలను వాడొద్దని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంకా ఎక్కడైనా అక్రమంగా తరలిస్తే పట్టుకునేందుకు టాస్క్‌పోర్స్ టీంలు ఏర్పాటు చేశాం. రైతులెవరూ నిషేధిత పత్తి విత్తనాలు వాడొద్దని కోరుతున్నాం. – సురేఖ, జిల్లా వ్యవసాయాధికారిజిల్లాలో పత్తి సాగు అంచనా 1.50లక్షల ఎకరాలు అవసరమయ్యే విత్తన ప్యాకెట్లు 3లక్షలునిషేధిత హెచ్‌టీ విత్తనాలతో మానవాళికి క్యాన్సర్ కారకాలు, పర్యావరణ కలుషితం ఏర్పడుతోంది. భూమి సారం కోల్పోవడంతోపాటు ఉపయోగపడే సూక్ష్మజీవులు, భూమి పోషకాలు తగ్గిపోతున్నాయి. ఏటేటా వాడకంతో భూమి నిస్సారమవుతోంది. పత్తి తీసేటప్పుడు కూలీలకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి విత్తనాలు వాడొద్దని రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నా పూర్తి స్థాయిలో నిషేధం అమలు కావడం లేదు. -
కష్టపడి సాధించాను..
విద్యతోపాటు పదేళ్లు కష్టపడి 2017లో బ్లాక్‌బెల్ట్ సాధించా. నా విద్యార్థి దశలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించాను. రష్యాలో జరిగిన ఇంటర్నేషనల్ కిక్‌బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న. నస్పూర్‌లో ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న. – బియ్యాల మౌనిక్, బ్లాక్‌బెల్ట్ 1వ డాన్, నస్పూర్ ఐదేళ్లుగా విద్యార్థులకు శిక్షణ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2001లో బ్లాక్‌బెల్ట్ పొందాను. బ్లాక్‌బెల్ట్ అనేది కరాటే క్రీడాకారులకు అరుదైన గుర్తింపు. ఎన్నో ఏళ్లు శ్రమిస్తే తప్ప బ్లాక్‌బెల్ట్ పొందలేరు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న. గత ఐదేళ్ల నుంచి రామకృష్ణాపూర్ పరిధిలో విద్యార్థులకు కరాటే, యోగాలో శిక్షణ ఇస్తున్న. – గీతాదేవి, బ్లాక్‌బెల్ట్, రామకృష్ణాపూర్ -
వరల్డ్ రికార్డులో పాల్గొన్న
చెన్నూర్‌లో 2000లో బ్లాక్‌బెల్ట్ పొందాను. 2007లో బ్లాక్‌బెల్ట్ 2వ డాన్ సాధించాను. బ్లాక్‌బెల్ట్ సాధించే క్రమంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పతకాలు సాధించాను. గోవా, చెన్నయ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు గెలుచుకున్న. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పాల్గొన్న. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న. – భారతి, బ్లాక్‌బెల్ట్ 2వ డాన్, మంచిర్యాల నా కల నెరవేరింది..నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బ్లాక్‌బెల్ట్ సాధించాను. కరాటే మాస్టర్ కావాలనే నా కల నెరవేరింది. 2018లో బ్లాక్‌బెల్ట్ సాధించి బెల్లంపల్లి ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తున్నాను. గతంతో పోలిస్తే ప్రస్తుతం కరాటే శిక్షణపై బాలికలు మక్కువ చూపుతున్నారు. – వేల్పుల శిరీష, బ్లాక్‌బెల్ట్ బెల్లంపల్లి -
జీవన ప్రామాణీకరణతో పింఛన్లు
మంచిర్యాలఅగ్రికల్చర్: బ్యాంకు ద్వారా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల జీవన ప్రామాణీకరణ కచ్చితత్వంతో చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అంజయ్యతో కలిసి బెల్లంపల్లి, మందమర్రి మంచిర్యాల పురపాలక సంఘాల సిబ్బందికి చేయూత పథకం లబ్ధిదారుల జీవన ప్రామాణీకరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల పురపాలక సంఘాల పరిధిలో 27,854 మంది పింఛన్‌దారులు లబ్ధి పొందుతున్నారని, వారి జీవన ప్రామాణీకరణను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జీవన ప్రామాణీకరణ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం అన్నాజీ, ఏపీఎం రాజ్‌కుమార్, పురపాలక సంఘ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
108 సేవలను వినియోగించుకోవాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే 108సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అనిత సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం 108 సిబ్బందితో వడదెబ్బపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎవరైనా వడదెబ్బ బారిన పడి స్పృహ కోల్పోతే అంబులెన్స్ వచ్చే వరకు చల్లటి ప్రదేశంలో ఉంచి, శరీరాన్ని తడి బట్టతో తుడవాలని కోరారు. 108 వాహనాల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ బి.సామ్రాట్ మాట్లాడుతూ జిల్లాలో 18 అంబులెన్స్‌లు, వడదెబ్బకు గురైన వారికి అవసరమైన ఐస్‌ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. -
● అవుట్‌టర్న్ రాకపోతే అదనం ● ధాన్యం కొనుగోళ్లలో కిలోల కొద్దీ కోత ● తేమ, తాలు పేరుతో రైతుల కష్టం దోపిడీ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు రెండు కిలోలపైనే తరుగు పేరుతో కోత విధిస్తున్నారు. ఒక్కో క్వింటాల్‌కు నిబంధనల మేరకు 17శాతం తేమతో బస్తాకు 40కిలోల చొప్పున తూకం వేయాలి. వీటిని అదనంగా గన్నీ సంచికి బదులు సంచీ లేదా మరో 600 గ్రాములు అదనంగా వేయాలి. కానీ అంతకుమించి ఒక్కో బస్తాకు 42కిలోలకు రైతులను ఒప్పించి తూకం వేస్తూ ధాన్యం తరలిస్తున్నారు. మిల్లర్లు తేమ, తరుగు పేరుతో బస్తాకు మరో కిలో చొప్పున 43కిలోల వరకు తీసుకుంటున్నారు. అలా అయితేనే ఒప్పుకుని మిల్లుల్లో ధాన్యం దించుకుంటున్నారు. ఇక వడ్లలో మిల్లింగ్ చేస్తే బియ్యం తక్కువగా వస్తుందని మరోసారి కోత పెడుతున్నారని కొన్ని చోట్ల రైతులు వాపోతున్నారు. దీంతో చాలాచోట్ల లారీల్లో ధాన్యం దించకుండా మిగిలిపోతోంది. ఇప్పటికీ జిల్లాలో 43కిలోల చొప్పున తూకం వేస్తున్నారు. రైతులకు చెల్లించే ధా న్యం విలువ, కేంద్రానికి త రలించిన వాస్తవ ధాన్యానికి వ్యత్యాసం వస్తోంది. ఒక్కో క్వింటాల్‌కు ఆ మేరకు చెల్లిస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. పోటెత్తుతున్న ధాన్యం జిల్లాలో ఈ సీజన్లో రెండు లక్షలకు పైగా మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఉండగా.. 334 కేంద్రాల నుంచి ఇప్పటివరకు 47వేల మెట్రిక్ టన్నులకు పైగా సేకరణ పూర్తయింది. ఇంకా కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతోంది. మొత్తం ఈ సీజన్లో 11మిల్లులకు ట్యాగింగ్ చేశారు. ఇవి కాక తొ మ్మిది రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పరిధిలోని గో దాములు, ఎనిమిది ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేస్తున్నా రు. అలాగే కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ధాన్యం తరలింపునకు అనుమతి ఉంది. మొదట సరిపడా మిల్లులు లేక తరలింపులో జా ప్యం జరిగింది. ప్రత్యామ్నాయంగా గోదాంలు, బ్లాక్ లిస్టుల మిల్లుల్లోనే నిల్వ చేయడంతో కొంత ఉపశమనం కలుగుతోంది. లేకపోతే మరింత ఇబ్బంది కలిగేది. అవుట్‌టర్న్ రావడం లేదని..జైపూర్ మండలం కిష్టాపూర్‌కు చెందిన రైతుల ధాన్యంలో మిల్లింగ్(అవుట్‌టర్న్ రేషియో) ప్రతీ వంద గ్రాముల వడ్లకు 61గ్రాముల లోపే బియ్యం వస్తున్నాయని మందమర్రి మండలం అందుగులపేట వెంకటేశ్వర అగ్రో రైస్ మిల్లులో దించుకునేందుకు అభ్యంతరం చెప్పారు. దీంతో లారీలు ధాన్యంతో రెండు రోజులుగా అక్కడే నిలిచిపోయాయి. అదనంగా మరో కిలో తరుగుకు ఒప్పుకుంటే దించుకుంటామని చెప్పారు. దీంతో కిష్టాపూర్‌కు చెందిన రైతులు నేరుగా కలెక్టరేట్‌కు వచ్చి అదనపు కలెక్టర్ రాములుకు ఫిర్యాదు చేశారు. -
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం
మంచిర్యాలక్రైం: గోరక్షక్ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడినా, వాహనాలు ధ్వంసం చేసినా సహించబోమని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా శుక్రవారం స్థానిక ఎం కన్వెన్షన్ హాల్లో గోరక్షక్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏడు శాశ్వత చెక్‌పోస్టులు, 15తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, ఒక పశువైద్యాధికారి, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ శాఖ నుంచి ఒకరు, పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే డయల్ 100, కమిషనరేట్ కంట్రోల్ రూం నంబరు 87126 56597కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్‌రావు, ఆకుల అశోక్, హనొక్, రమణమూర్తి, రవీందర్, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
నస్పూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పీ.చంద్రయ్య అన్నారు. శుక్రవారం మంచిర్యాల నగరంలోని 32వ డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని మేయర్ ధర్ని మధుకర్, కమిషనర్ అన్వేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం తర్వగా పూర్తి చేసుకోవాలని అన్నారు. డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారి, మున్సిపల్ సిబ్బంది, నాయకులు ఉన్నారు. -
ధాన్యం తరలింపులో ఆలస్యం చేయొద్దు
దండేపల్లి/జన్నారం/లక్సెట్టిపేట: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లులు, గోదాంలకు తరలించడంలో ఆలస్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన దండేపల్లి, లింగాపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, గోదాములు సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ లారీల కొరత ఉన్నచోట రైతులు ట్రాక్టర్, ఇతర గూడ్స్ వాహనాలు సమకూర్చుకుని మిల్లులు, గోదాంలకు ధాన్యం బస్తాలు తరలించుకుంటే కిరాయి డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామ కొనుగోలు కేంద్రం నంబరు–3 నుంచి తాలు తప్ప రావడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దండేపల్లి తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, జన్నారం తహసీల్దార్ బక్కయ్య, ఎంపీడీవో ఉమర్‌షరీఫ్, ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, లక్సెట్టిపేట తహసీల్దార్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు. డెంగీ వ్యాధి నివారణకు కృషి చేయాలి మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో డెంగీ వ్యాధి నివారణకు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ నెల 16న జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.అనిత, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, అధికారులతో కలిసి డెంగీ నివారణపై గోడప్రతులు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఓటరు సవరణకు కంట్రోల్ రూమ్ మంచిర్యాలఅగ్రికల్చర్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అందుబాటులో ఉంటుందని, సందేహాలు, సమాచారం కోసం 08736–250501 నంబరులో సంప్రదించాలని తెలిపారు. -
‘ఉపాధి’ కూలీల హాజరు మెరుగు
దండేపల్లి: జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం పొలాల పనులు పూర్తి కావడంతో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీల హాజరు రోజు రోజుకు మెరుగుపడుతోంది. జిల్లాలోని 16 మండలాల్లో ఉన్న 305 గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం చెరువుల పూడికతీత, ఫిష్పాండ్స్, ట్రెంచ్ తవ్వకాల పనులు సాగుతున్నాయి. ఈ నెల 14న హాజరు శాతం పరిశీలిస్తే.. జిల్లాలోని భీమిని మండలంలో అత్యధిక మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్లారు. గ్రామానికో 200 మందికి పైగా.. కన్నెపల్లి, భీమారం, బెల్లంపల్లి, కోటపల్లి, మందమర్రి మండలాల్లో ఒక్కో గ్రామానికి వంద మందికి పైగా పనులకు హాజరయ్యారు. పారిశ్రామిక ప్రాంతాల్లోనూ కూలీల హాజరు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ ప్రతీ గ్రామంలో 80నుంచి 100 మంది వరకు కూలీలు హాజరవుతున్నారు. జిల్లాలో హాజరు శాతం మెరుగవడంతో వారం రోజులుగా జిల్లా రాష్ట్రంలో 5 నుంచి 8వ స్థానాల మధ్య నిలుస్తోంది. ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూలీలు ఉదయమే పని ప్రదేశాలకు చేరుకుని పనులు చేస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 30,225 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. యాసంగిలో రైతులు సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలు చేతికి రావడంతో రైతులు ధాన్యం అమ్మే పనిలో ఉన్నారు. దీంతో రైతులు, రైతు కూలీలకు వ్యవసాయ పనులంటూ ఏమి లేకపోవడంతో ఉపాధి పనుల బాటపట్టారు. సమయపాలన పాటించాలి..ఉపాధి కూలీలు సమయపాలన పాటించాలి. ఉదయం 6గంటల వరకే పని ప్రదేశాలకు చేరుకోవాలి. వీలైతే ఇంకో అరగంట ముందే చేరుకుంటే అరగంట ముందు ఇంటికి రావచ్చు. ఉదయం 10గంటల నుంచి 11గంటల మధ్య ఇంటికి చేరుకోవాలి. ఇలా సమయపాలన పాటిస్తే కూలి గిట్టుబాటవుతుంది. ఎండ తీవ్రత ఉండదు. కూలీలు ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి. – కిషన్, డీఆర్డీవో -
తూకంలో మోసం
● మిల్లర్లు, ఎమ్మెల్యే ఏకమై దోచుకుంటున్నారు ● మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట తూకంలో మోసం అందరికీ తెలిసే జరుగుతోందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. శుక్రవారం హాజీపూర్ మండలం సబ్బేపల్లి, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఒక్కో బస్తా 43కిలోలు తూకం వేస్తున్నట్లు గుర్తించి హమాలీలను ప్రశ్నించారు. నిర్వాహకుల సూచన మేర కు తూకం వేస్తున్నట్లు వారు తెలిపారు. నిర్వాహకురాలిని ఆరా తీయగా 43కిలోల కన్నా తక్కువ తూకం వేస్తే మిల్ల ర్లు నిరాకరిస్తుండడంతో తప్ప డం లేదని తెలిపింది. ఒక్కో బస్తాకు రెండు కిలో ల వరకు అదనంగా తూకం వేయడంతో క్వింటాల్‌కు 7 నుంచి 10 కిలోల వరకు రైతులు నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేద ని, రైస్‌మిల్లర్లతో కుమ్ముకై ్క దోచుకుంటున్నారని విమర్శించారు. ఒక బస్తాకు గన్నీ బ్యాగు కన్నా ఎక్కువ తూకం వేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. మొక్కజొన్న పంటకు ఎకరానికి 26 క్వింటాళ్లు కాకుండా 40 క్వింటాళ్లు తీసుకోవాలని సూచించారు. కాంటా అయిన తర్వాత తరలించడానికి బ్యాగుకు రూ.2 తీసుకోవడం అవినీతికి నిదర్శనమని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. -
‘సర్’కు సిద్ధం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ‘సర్’కు రంగం సిద్ధమైంది. మూడో విడత రాష్ట్రంలో వచ్చే నెల 14నుంచి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 25నుంచి జూలై 24వరకు ఇంటింటికీ బీఎల్వో(బూత్ లెవల్ అధికారులు) సర్వే చేసి నిర్ధారణ చేయనున్నారు. కొత్తగా 18ఏళ్లు అక్టోబర్ ఒకటో తేదీ వరకు నిండిన వారందరికీ నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఇవన్నీ సమగ్రంగా రూపొందించాక తుది ఓటర్ల జాబితా రూపొందిస్తారు. జిల్లాలో మూడు ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లితోపాటు ఖానాపూర్ పరిధిలో ని జన్నారం మండలం ఉంది. ప్రధాన నియోజవకర్గాల్లో బీఎల్వోలు 747 మంది ఉన్నారు. జన్నారం మండలంలో 44వేల ఓటర్లు ఉండగా, ఇక్కడ 53మంది బీఎల్వోలు ఉన్నారు. వీరంతా ఇంటింటికీ తిరిగి ఓటర్లకు ఓ ఫాం ఇచ్చి పరిశీలించి ఈ మేరకు ఓటరు జాబితా రూపొందిస్తారు. ఇప్పటికే ఓటరు కుటుంబాలతో పోల్చడం మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇంకా చాలామంది చిరునామాలు దొరక్క మ్యాపింగ్ పూర్తి కావడం లేదు. వీరంతా స్థానికంగా లేని ఓటర్లా? అనేది ఇంటింటి ఓటరు సర్వేతో బయటపడనుంది. బోగస్ ఓట్ల ఏరివేత సమగ్ర ఓటరు సవరణతో అర్హులు మాత్రమే ఓటర్లుగా ఉండే అవకాశం ఉంది. జిల్లాలో చాలామందికి రెండేసి ఓట్లు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో కొందరు ఏళ్ల క్రితమే శాశ్వతంగా వలస వెళ్లినప్పటికీ ఇక్కడే ఓటు కొనసాగుతోంది. ఇంకా మరణించినవి కూడా తొలగించలేదు. దీంతో అడ్డగోలుగా బోగస్ ఓటర్లు ఉన్నారు. ఓటరు మ్యాపింగ్ సమయంలో చాలాచోట్ల ఓటర్ల జాబితా లో ఆయా చిరునామాల్లో స్థానికంగా లేరు. వీరికి సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. వీరంతా సమగ్ర సర్వేలో స్థానికంగా ఉన్నట్లు గుర్తింపు కార్డు చూపితే ఓటు కొనసాగుతుంది. లేకపోతే తొలగిస్తారు. జిల్లాలో ఓటరు మ్యాపింగ్ ఇప్పటికీ 70.32శాతమే పూర్తయింది. మరోవైపు ‘సర్’కు షెడ్యూల్ విడుదల కాగా, పూర్తి కాని చోట్ల ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఓట్ల సవరణలో వివాదం నెలకొనడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ప్రతీ బూత్ స్థాయిలో ఓ కార్యకర్తను జిల్లా వ్యాప్తంగా 747 మందిని నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఏర్పాట్లు చేసింది.జిల్లా ఓటర్లు మొత్తం ఓటర్లు 6,67,488 మ్యాపింగ్ పూర్తి 4.73లక్షలు పూర్తయిన శాతం 70.32శాతం బీఎల్వోలు 747మంది -
మొక్కజొన్న పంట దగ్ధం
సారంగపూర్: మండలంలోని కంకెట గ్రామానికి చెందిన రైతు బండారి గంగాధర్ రెండెకరా ల మొక్కజొన్న పంట అగ్నికి ఆహూతైంది. బా ధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర్ తన రెండెకరాల మొక్కజొన్న పంటను వారం క్రితం కోత కోయించి కుప్పలుగా వేశాడు. నూర్పిడి చేసేందుకు హార్వెస్టర్ దొరకలేదు. ఈక్రమంలో శుక్రవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో దాదాపు కుప్పలన్నీ కాలి బూడిదయ్యాయి. స్థానిక సర్పంచ్ సాహెబ్రా వు ఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దార్ విజ య్కాంత్రావుకు విషయం తెలిపారు. ఆర్ఐ న ర్సయ్య పంటనష్టం అంచనా వేశారు. దాదాపు రూ.2లక్షల నష్టం జరిగినట్లు నిర్ధారించారు. -
జాతీయస్థాయిలో రాణించేందుకే..
ఈ ఏడాది నేను అండర్–19 ఎస్జీఎఫ్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. హైదరాబాద్‌లో చదువుతూ బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందుతున్నాను. వేసవి సెలవుల్లో మంచిర్యాలకు వచ్చి శిక్షణ తీసుకుంటున్నాను. అమ్మానాన్న, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారం మరువలేనిది. – గుండ అనన్య, పాతమంచిర్యాల ఏటా శిక్షణకు హాజరవుతా ఏటా వేసవిలో నిర్వహించే బ్యాడ్మింటన్ శిక్షణకు తప్పనిసరిగా హాజరవుతున్నాను. చదువుతోపాటు ఆటల్లో రాణించేందుకు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇప్పటివరకు ఆరుసార్లు రాష్ట్రస్థాయిలో ఆడాను. జాతీయ స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్లోనూ పాల్గొన్నాను. వేసవి సెలవుల్లో శిక్షణ కొనసాగిస్తున్నాను. – ఆరాధ్య, గౌతమీనగర్, మంచిర్యాల రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధం చేశాం క్రీడల్లో రాణించాలని అనుకునే వారికి మేము ఉచితంగా బ్యాడ్మింటన్ శిక్షణ ఇస్తున్నాం. ప్రతీరోజు శిక్షణ పొందితే రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించే అవకాశముంటుంది. వేసవి శిక్షణ అనంతరం కూడా బ్యాడ్మింటన్‌లో శిక్షణ కొనసాగిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు మంచి అవకాశం ఏర్పడుతుంది. బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరానికి హాజరవుతున్నవారిలో నైపుణ్యం చూపిస్తున్న వారిని రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధం చేస్తాం. – వివేక్ వర్ధన్, బ్యాడ్మింటన్ కోచ్ -
పశువుల కొట్టం దగ్ధం
● ఏడు మేకలు సజీవ దహనం సిరికొండ: మండలంలోని పోన్న గ్రామానికి చెందిన చౌహాన్ సంభాజీ పశువుల కొట్టం శుక్రవారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. కొట్టంలోని మూడు పెద్ద మేకలు, నాలుగు చిన్న మేకలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఇచ్చోడ నుంచి అగ్ని మాపక యంత్రంతో వచ్చిన సిబ్బంది మంట లు అదుపులోకి తెచ్చారు. తహసీల్దార్ తుకా రాం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా రు. అధికారులు పంచనామా నిర్వహించారు. ఇసుక టిప్పర్ పట్టివేతముధోల్: మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రో ల్ బంక్ సమీపంలో ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం పో లీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను పరిశీలించగా వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవు. దీంతో టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళను కాపాడిన పోలీసులుభైంసాటౌన్: భర్తతో గొడవపడి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను పోలీసులు రక్షించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కుంటాల మండలం లింబా(పెద్ద) గ్రామానికి చెందిన తోత్రే మీరాబాయి భర్త బాలాజీతో గొడవపడి శుక్రవారం సాయంత్రం పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంది. నీటిలో దిగి ఆత్మహత్యకు యత్నిస్తుండగా గమనించిన స్థానికులు అడ్డుకుని ‘డయల్ 100’కు కాల్ చేసి విషయం తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కౌన్సిలింగ్ అనంతరం ఆమెను కుటుంబీకులకు అప్పగించారు. -
24 గంటల్లో ఖానాపూర్ హత్య కేసు ఛేదన
ఖానాపూర్: ఖానాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో న మోదైన మహిళ హత్య కేసును నిర్మల్ జిల్లా పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో మృతురాలి భర్తే హంతకుడిగా తేలింది. నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు నల్ల మౌనిక అదృశ్యమైనట్లు ఈ నెల 9న మామడ పోలీస్‌స్టేషన్‌లో మి స్సింగ్ కేసు నమోదు చేశారు. 14న ఖానాపూర్ మండలం తర్లపాడు అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యం కావడంతో కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నల్ల అరుణ్ తన భార్య మౌనికను అదనపు కట్నం వేధింపులు, కుటుంబ విభేదాలతోపాటు అక్రమ సంబంధం అనుమానం నేపథ్యంలో ప్లాన్ ప్రకారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. అనంతరం తనపై అనుమానం రాకుండా ఉండేందుకు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకెళ్లినట్లు చిత్రీకరించి ఘటనాస్థలాన్ని మార్చాడు. అనంతరం మృతురాలి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, ఇతర వస్తువులు దాచిపెట్టి మామడ పోలీస్‌స్టేషన్‌లో తన భార్య మిస్సింగైనట్లు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీ, టెక్నాలజీ ఆధారంగా.. ఈ కేసు ఛేదనలో సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, శాసీ్త్రయ దర్యాప్తు కీలక పాత్ర పోషించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు అరుణ్‌తో పా టు అతని తల్లిదండ్రులు శ్రీనివాస్, అదెల్లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి సుమారు ఐదు తు లాల బంగారు ఆభరణాలు, బైక్, సెల్‌ఫోన్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసిన ఆస్తుల విలువ సుమారు రూ.8లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన నిర్మల్ డీ ఎస్పీ శ్రీనివాస్, ఖానాపూర్ సీఐ అజయ్, ఎస్సై రా హుల్ గైక్వాడ్, దర్యాప్తులో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు. నిందితులపై బీఎన్ఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్లు, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ద ర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
బాగా నేర్పిస్తున్నారు
ఉచిత బ్యాడ్మింటన్ శిక్షణకు క్రమం తప్పకుండా హాజరవుతున్నాను. ఇక్కడ మంచి శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేలా అన్ని రకాల మెళకువలు నేర్పిస్తున్నారు. మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. సెలవుల అనంతరం సమయం దొరికినప్పుడల్లా బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుని రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తాను. – సిద్దు, మంచిర్యాల ఉచిత శిక్షణతో ప్రోత్సహిస్తున్నాం జిల్లాలో క్రీడాకారులుగా రాణించేందుకు పలువురికి ఆసక్తి ఉన్నా సరైన శిక్షణ లేక వెనుకబడి పోతున్నారు. దీంతో మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ఏటా వేసవిలో ఉచిత శిక్షణ ఇస్తున్నాం. బ్యాడ్మింటన్‌లో జిల్లాకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆసక్తి ఉన్నవారికి మేము ఇస్తున్న ఉచిత బ్యాడ్మింటన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. – పుల్లూరి సుధాకర్, మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ -
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
లోకేశ్వరం: భైంసా మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన షేక్ వాజీద్ మియా (42) మండలంలోని పంచగుడి గ్రామ సమీపంలోగల గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. వాజీద్ మియా కారు డ్రెవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సీమా బేగం–వాజీద్ మి యా దంపతులకు ఆరు నెలల క్రితం కుమార్తె పుట్టింది. పాప అనారోగ్యంతో పుట్టగా వివిధ ఆస్పత్రులు తిరిగి అప్పులు చేసి చికిత్స చేయించినా ఆమెకు నయం కాలేదు. ఈ క్రమంలో షేక్‌వాజీద్ మియా మద్యానికి బానిసయ్యాడు. గురువారం ఉదయం అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. గమనించిన తల్లి మౌళబీ కొడుకు వాజీద్ మియాను మందలించింది. దీంతో బయటకు వెళ్లిన వాజీద్ మియా రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. శుక్రవారం పంచగుడి వంతెన వద్ద గోదావరి నదిలో అతడి మృతదేహం కనిపించింది. పాప చికిత్స కో సం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలి యక వాజీద్ మియా పంచగుడి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అతడి మామ షేక్ మోగులా సాబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాసర వంతెన వద్ద మృతదేహం లభ్యం బాసర: బాసర గోదావరి నది నూతన వంతెన వద్ద శుక్రవారం కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీ సులు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని బాసర సీఐ కిరణ్ తెలిపారు. చేతికి సోనా వాచ్, ఒంటిపై తెల్లటి గీతల షర్టు ఉన్న ట్లు పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. -
ఇంట్లోనే ఆడుదాం..
చెన్నూర్‌రూరల్: వేసవి సెలవుల్లో చాలామంది పిల్లలు ఇంటిలోనే ఆటలు ఆడుతూ సరదాగా గడుపుతున్నారు. మండలంలోని ఆస్నాద గ్రా మంలో ఏళేశ్వరం నాగభూషణం ఇంట్లో చిన్నారులు క్యారం అడుతూ వేసవి సెలవులను సరదాగా గడుపుతున్నారు. ఇదే గ్రామంలోని ఓ ఇంటిలో నీడ పట్టున పిల్లలు లోడో గేమ్ ఆడుతున్నారు. ఇలాంటి గేమ్‌లు ఆడడంతో పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కంప్యూటర్లో చిత్రాలు గీస్తూ..కాగజ్‌నగర్‌టౌన్: వేసవి సెలవుల్లో పట్టణంలోని పలువురు చిన్నారులు కంప్యూటర్లో చిత్రాలు గీస్తూ ప్రతిభ చాటుతున్నారు. వేసవి సెలవుల్లో వీరు వినోదంతోపాటు విజ్ఞానం పొందుతుండగా వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
● కొనసాగుతున్న వేసవి శిబిరాలు ● ఉచిత శిక్షణ ఇస్తున్న మంచిర్యాల స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ● మెళకువలు నేర్పిస్తున్న కోచ్లుబ్యాడ్మింటన్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులుమంచిర్యాలటౌన్: వేసవి సెలవులను సద్వినియో గం చేసుకునేందుకు విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లా యువజన క్రీ డల శాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి నామమాత్రపు ఫీజు వసూలు చేసి శిక్షణ ఇస్తున్నారు. బ్యాడ్మింటన్‌కు ఒక్కరికి రూ.500 వ రకు తీసుకుంటుండగా విద్యార్థులు ఆసక్తి చూపించ డం లేదు. దీంతో స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ విద్యార్థులకు మంచిర్యాల క్లబ్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకువచ్చింది. ఇందుకు మంచిర్యాల క్లబ్ సహకారం అందిస్తుండగా, వీవీ బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ వివేక్ ఉద యం 8.30నుంచి 10వరకు, సాయంత్రం 5.30నుంచి 7గంటల వరకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. బాడ్మింటన్‌కు పెరిగిన ఆదరణ జిల్లాలో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న ఆటలో బ్యాడ్మింటన్ ఒకటి. ఇప్పటికే పలుసార్లు మంచిర్యాలలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఏటా వేసవిలో ఉచిత శిక్షణ శిబిరాలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. కొత్తవారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ రాణిస్తున్నారు. సీఎం కప్ పోటీల్లోనూ పలువురు జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. ముగ్గురు పతకాలు కూడా సాధించారు. -
‘రేలా’ పాటల కళాకారిణి రాంబాయి మృతి
లింగాపూర్: సిర్పూర్(యూ) మండలంలోని శెట్టిహాడప్నూర్ గ్రామపంచాయతీ పరిధికి చెందిన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ‘రేలా’ పాటల కళాకారిణి కనక రాంబాయి (80) వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతూ గురువారం తెల్లవా రుజామున కన్నుమూశారు. ఆమె మృతి ఆదివాసీ సమాజానికి, ముఖ్యంగా రేలా పాటల కళారంగానికి తీరని లోటు. గ్రామీణ వివా హాలు, దేవతల పూజా కార్యక్రమాలు జాతరలు, సామాజిక వేడుకల్లో రేలా పాటలతో ఆందరినీ ఆలరించి రాంబాయి ప్రత్యేక గుర్తింపు పొందారు. తన జీవితంలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేసిన ఆమె భావితరాలకూ రేలా పాటలు అందించాలని సంకల్పించారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాంబాయి మృతితో కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె అంత్యక్రియలు గురువారం సాయంత్రం శెట్టిహాడప్నూర్ గ్రామ సమీపంలోగల రాజులగూడలోని తన వ్యవసాయ భూమిలో నిర్వహించారు. -
ఉద్యోం ఇప్పిస్తానని మోసం
చింతలమానెపల్లి: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డ ఘటన మండలంలోని డబ్బా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు గౌత్రె మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. డబ్బా గ్రామానికి చెందిన దూలం చిలుక అనే మహిళ తన బావ బుర్స రంగయ్యకు కాగజ్‌నగర్ మండలంలో అటవీశాఖలో ఉన్నతోద్యోగం ఉందని, అతడు ఉద్యోగాలు ఇప్పిస్తాడని నమ్మించింది. రూ.2లక్షలు ఇప్పిస్తే ఉద్యో గం పెట్టిస్తామనగా నమ్మిన మోహన్ 2019లో రంగయ్యకు ఈ మొత్తాన్ని ముట్టజెప్పాడు. అనంతరం ఉద్యోగం ఇప్పించే ఉన్నతాధికారి కూతురు ఇంటివద్ద శుభకార్యం ఉందని, బంగారం ఇవ్వాలని కోరడంతో మోహన్ రూ.లక్షా 50వేల బంగారం కొని చ్చాడు. 2024 మేలో మరో రూ.2లక్షలు చెల్లించా డు. ఇలా పలు దఫాలుగా రూ.15,16,600 ముట్ట జెప్పాడు. అపాయింట్మెంట్ లెటర్ ఇస్తానని చివరగా రూ.4లక్షలు ఇవ్వాలన్నాడు. దీంతో మోహన్ తనకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలని పట్టుబట్టగా మోసం బయటపడింది. దీంతో 2025 ఫిబ్రవరిలో చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో మోహన్ వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని రంగయ్య చెప్పగా కేసు నమోదు కాలేదు. కా గా, ఇప్పటివరకు మోహన్‌కు డ బ్బులు చెల్లించకపోవడంతో అత డు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చే శాడు. కాగా, రెండుసార్లు చీఫ్ కన్జర్వేటర్, హైదరాబాద్ పేరిట రెండు లెటర్లను రంగయ్య బాధితుడికి ఇవ్వడం గమనార్హం. ఈమేరకు గత నెల 13న చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై కమలాకర్ విచారణ చేపట్టారు. బుర్స రంగయ్య, దూలం చిలు కను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చీ ఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హైదరాబాద్.. పేరిట త యారు చేసిన అపాయింట్మెంట్ లెటర్ కాగజ్‌నగర్‌లోని టైప్ ఇనిస్టిట్యూట్‌లో తయారు చేసినట్లు సమాచారం. సదరు ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు కౌటాల సీఐ సంతోష్‌కుమార్‌ను సంప్రదించగా కేసు విచారణలో ఉందని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు
పాతమంచిర్యాల: తెలంగాణ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం) ద్వారా జర్మనీలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవి కృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు, అభ్యర్థుల వయస్సు 22–38 సంవత్సరాల వరకు ఉండాలని జీఎన్ఎం అభ్యర్థులు కనీసం మూడేళ్ల అనుభవంతో పాటు ఇండియన్ నర్సు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు. మొత్తం ఖాళీలు 90 ఉన్నాయని, అర్హులైన వారు ఈ నెల 18 లోగా ఆన్లైన్లో germanytripplewin 2025 @gmail.com దరఖాస్తు చేసుకుంటే జూలై 8 నుంచి 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.2.2 లక్షల నుంచి 3 లక్షల వరకు వేతనం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9440049645, 9440052081, 9440051581 నంబర్లలో లేదా www.tomcom. telangana. gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. బాసర హుండీ ఆదాయం రూ.1.03 కోట్లుబాసర: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ హుండీని గురువారం లెక్కించగా 90 రోజుల ఆదాయం రూ.1,03,75,308 సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారం 40 గ్రాముల 200 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 550 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 24 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె.అంజనిదేవి, దేవాదాయ శాఖ నిర్మల్ పరిశీలకులు ఆర్.రవికిషన్, ఆలయ పర్యవేక్షకులు శివరాజ్, సంజీవ్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
నిప్పుల కుంపటి
నిర్మల్‌ఖిల్లా:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండగా మధ్యాహ్న సమయాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఆదిలాబాద్ జిల్లాలోని మావల ప్రాంతంలో అత్యధికంగా 44.7 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని మామడలో 44.6 డిగ్రీలు, కుమురంభీం జిల్లాలోని పెంచికల్పేట్లో 43.8 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులపాటు కూడా ఇదే తరహాలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వేడి తీవ్రత దష్ట్యా ప్రజలు ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, తలకు గుడ్డ లేదా టోపీ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రమాదవశాత్తు జొన్నపంట దగ్ధం
ఇచ్చోడ: మండలంలోని దుబార్‌పేట్‌లో సలాం నాగోరావుకు చెందిన జొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సలాం నాగోరావు దుబార్పేట్ శివా రులో నాలుగెకరాల్లో జొన్నసాగు చేశాడు. ఇటీవలే పంటను కోసి నూర్పిడి చేసేందుకు చేనులోనే కుప్పగా వేశాడు. గురువారం మధ్యాహ్నం పక్క పొలాల్లోని రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడంతో మంటలు వ్యాపించి నా గోరావు జొన్నకుప్పకు అంటుకున్నాయి. గమనించిన రైతులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించినా సిబ్బంది వచ్చేలోపే పంట కాలిబూడిదైంది. ఘటనలో దాదాపుగా రూ.3. 50 లక్షల నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. ఆర్ఐ రేఖ, జీపీవో పురుషోత్తం సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. -
బోగస్ పింఛన్ల ఏరివేత
పాతమంచిర్యాల: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పక్రియను పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పింఛన్ల పంపిణీలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేయడానికి సర్వే చేపడుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు ఈ నెల 15నుంచి జూన్ 15వరకు మున్సిపాల్టీలు, గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు. బ్యాంకుల ద్వారా పింఛన్లు పొందుతున్న వారి వివరాల సేకరణకు లైవ్‌నెస్ అథెంటికేషన్ యాప్‌ను ఉపయోగించి వారు బతికి ఉన్నట్లయితే పింఛన్ కొనసాగిస్తారు. లేనిపక్షంలో లబ్ధిదారుల జాబితా నుంచి పేర్లను తొలగిస్తారు. జిల్లాలో ప్రతీ నెల చేయూత పథకం ద్వారా 92,958 మందికి సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వీటిలో పోస్టాఫీసుల ద్వారా 70,285, బ్యాంకుల ద్వారా 22,673 అందిస్తుండగా.. 10 నుంచి 20 పింఛన్లు మండలాల్లోని గ్రామాల్లో అందజేస్తున్నారు. పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరగకుండా పోస్టాఫీసుల ద్వారా జరిగే పంపిణీలో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్(ఎఫ్ఆర్ఎస్), బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్‌తో ఇస్తున్నారు. కానీ బ్యాంకుల్లో పింఛన్లు తీసుకున్న వారికి ప్రతీ నెల ఎలాంటి సాంకేతికత ఉపయోగించకుండానే నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్లు అసలు లబ్ధిదారులు తీసుకుంటున్నారా లేక వారికి సంబంధించిన ఎవరైనా తీసుకుంటున్నారా అనే విషయాన్ని అధికారులు కనిపెట్టలేకపోతున్నారు. దీంతో చనిపోయిన వారి పేరున పింఛన్ సొమ్ము ఖాతాల్లో జమ అవుతూ వస్తోంది. బతికి ఉన్న వారు పింఛన్లు తీసుకుంటుండగా.. చనిపోయిన వారి పింఛన్ సొమ్ము ఖాతాల్లోనే ఉండిపోతోంది. లబ్ధిదారులు బతికి ఉన్నారా చనిపోయారా అనే వివరాలు అధికారులకు అందడం లేదు. దీంతో చాలాచోట్ల పింఛన్ లబ్ధిదారులు చనిపోయి సంవత్సరాలు, నెలలు గడుస్తున్నా పింఛన్ సొమ్ము వారి ఖాతాల్లోనే జమ అవుతోంది. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరు కావడం లేదు. జిల్లాలోని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, పాత మున్సిపాల్టీల పరిధిలో 22,673 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఎంతమంది జీవించి ఉన్నారు, ఎంతమంది మరణించారనే విషయాన్ని ధ్రువీకరించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ప్రత్యేక యాప్‌ను ఉపయోగించి మున్సిపల్ వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు బెల్లంపల్లిలోని 28వార్డులు, మందమర్రిలోని 24 వార్డులు, మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో వివరాలు నమోదు చేయనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మున్సిపల్, గ్రామీణాభివృద్ధి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
చెన్నూర్‌లో భారీ చోరీ
చెన్నూర్: పట్టణంలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు అయిత హిమవంతరెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు హిమవంతరెడ్డి ఈ నెల 4న కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లాడు.ఈ నెల 13న రాత్రి ఇంటికి వచ్చి చూడగా ముందు వెనుక తలుపునకు వేసిన తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం చెన్నూర్ సీఐ బన్సీలాల్, మంచిర్యాల క్లూస్ టీం సీఐ అశోక్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ నెల 5న రాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు దొంగలు గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌లు ధరించి ప్రహరీ దూకి ఇంట్లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా రెండు కిలోల వెండి, రూ.70 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
● ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
మెడికల్ బోర్డు నిర్వహించకుంటే సమ్మెనస్పూర్: యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు ఒక నెలలోపు మెడికల్ బోర్డు నిర్వహించకపోతే సమ్మెకు వెళ్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు. గురువారం ఆయన నాయకులతో కలిసి నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న హైదారాబాద్‌లోని సింగరేణి భవన్లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులతో డైరెక్టర్(పర్సనల్) గౌతమ్ పొట్రుతో జరిగిన సమావేశంలో కార్మికుల పెండింగ్ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిందని తెలిపారు. సొంతింటి పథకం, పెర్క్స్‌పై ఇన్‌కంటాక్స్ రద్దుపై వచ్చే స్ట్రక్చర్ సమావేశంలో చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న 337 మందికి పైగా డిపెండెంట్లకు నియామక పత్రాలను యాజమాన్యం త్వరలోనే అందజేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కందికట్ల వీరభద్రయ్య, శ్రీరాంపూర్, మందమర్రి బ్రాంచి సెక్రెటరీలు ఎస్కే బాజీసైదా, సలేంద్ర సత్యనారాయణ, జాయింట్ సెక్రెటరీ కంది శ్రీనివాస్, ఆఫీస్ బేరర్ సుధాకర్ పాల్గొన్నారు. -
ఇతర రాష్ట్రాల వారిపై ప్రత్యేక నిఘా
నస్పూర్: వివిధ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతాలకు వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. సీసీసీ నస్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సంఘం మల్లయ్యపల్లెలో కమ్యునిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ స్థానికంగా ఇళ్లు అద్దెకు ఇచ్చే యజమానులు పూర్తి వివరాలు తీసుకోవాలని తెలిపారు. ఆధార్ కార్డు, శాశ్వత చిరునామా, గతంలో ఎక్కడ పని చేశారు, కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎస్సైలు మేకల ప్రశాంత్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాపై నిఘా దండేపల్లి: బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. మంచిర్యాల–జగిత్యాల జిల్లాల సరిహద్దు దండేపల్లి మండలం గూడెం వద్ద అటవీ చెక్‌పోస్టును గురువారం ఆయన తనిఖీ చేశారు. ని బంధనలకు విరుద్ధంగా, అక్రమంగా పశువులు తరలించకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి, లక్సెట్టిపేట ఎస్సైలు తహాసీనొద్దీన్, సురేష్ పాల్గొన్నారు. త్వరగా అన్లోడ్ చేయాలి లక్సెట్టిపేట: రైస్‌మిల్లర్లు ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలని డీసీపీ భాస్కర్ అన్నారు. గురువారం మండలంలోని ధాన్యం కొనుగోలు రైస్‌మిల్లులను పరిశీలించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను త్వరగా అన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్‌కుమార్, సీఐ రమణామూర్తి, ఎస్సై గోపతి సురేష్, మిల్లు యజమానులు పాల్గొన్నారు. -
తాటిచెట్టు ఎక్కుదామా?..
చెన్నూర్‌రూరల్: వేసవిలో ఎండ తీవ్రతకు చిన్నారులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నీడ పట్టున ఉండి వివిధ ఆటలు ఆడుకుంటున్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంటున్నారు. మండలంలోని బావురావుపేటలో చిన్నారులు ఇంటి ఆవరణలో ఒకేచోట గుమిగూడి ఒకరి చేతిపై మరొకరు ఇలా చేతులు పెట్టి‘తాటిచెట్టు ఎక్కుదామా’ అంటూ ఆటలు ఆడుతూ కనిపించారు.కంప్యూటర్ విద్యపెంచికల్పేట్: వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని కిరణ్ మాడ్రన్ స్కూల్లో వేసవిలో విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యార్థులు కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్, పెయింట్, ఎక్సెల్ నేర్చుకుంటున్నారు. ప్రతీరోజు సుమారు 20 మంది విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కోటపల్లి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం మండలంలోని దేవులవాడ గ్రామానికి చెందిన ఇందారపు భాగ్యలక్ష్మి ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో హమాలీల కొరత ఏర్పడిందని, దీంతో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గం సమ్మక్క, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తాం.. మందమర్రిరూరల్: సింగరేణిలో నూతన గనులు తీసుకురావడంతో కొత్తగా ఉద్యోగావకాశాలు వస్తాయని, సింగరేణికి పూర్వవైభవం వస్తుందని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం ఏరియాలోని కేకే–5 గని వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ ఉద్యోగులు సమష్టిగా నిర్ధేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. శ్రమశక్తి అవార్డు అందుకున్న పవన్‌కుమార్, పుల్లూరి లక్ష్మణ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం రాధాకృష్ణ, గని మేనేజర్ శంభూనాథ్పాండే, తహసీల్దార్ సతీష్‌కుమార్ పాల్గొన్నారు. -
● పంటలకు పెరిగిన ధరలు ● వరికి నామమాత్రం.. మక్క, పెసరకు అంతంతే..!
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పంటలకు ధరలు పెంచుతూ రైతులకు తీపి కబురు అందించింది. 2026–27 ఖరీఫ్‌లో 14 రకాల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంచుతూ బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాలో పత్తి, వరి పంటలు అధికంగా సాగవుతుండగా.. పెంచిన ధరలు పత్తి పంటకు కాస్త ఊరటనిస్తోంది. వరి ధాన్యం ధర రైతులను నిరాశకు గురిచేస్తోంది. ఆ తర్వాత స్థానంలో సాగవుతున్న కంది, మొక్కజొన్న, పెసర పంటలకు నామమాత్రమే పెంపు ఉండగా నిరాశపరుస్తోంది. జిల్లాలో 3.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఆశించిన స్థాయిలో మద్దతు ధరలు పెంచకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. అధికంగా పత్తి, పొద్దుతిరుగుడు, నువ్వు పంటలకు పెంచారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(సీఏసీపీ) సూచించిన ధరలు సాగుకయ్యే ఖర్చు కన్నా తక్కువగానే ఉన్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు అనుగుణంగా ధరలు పెంచాలని గత కొద్ది రోజుల క్రితం సీఏసీపీకి విజ్ఞప్తి చేశారు. రైతు కమిటీల సిఫారసుల ప్రకారం సాగుకు చేసే ఖర్చుకు అదనంగా మరో 50శాతం కలిపి ధర ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. పత్తి, కంది పంటలకు క్వింటాల్‌కు రూ.10 వేలు, వరి, మొక్కజొన్న పంటలకు రూ.3 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏటేటా పెరుగుతున్న పెట్టుబడి.. ఏటేటా సాగు వ్యయం రెట్టింపు అవుతోంది. పెట్టుబడి, రాబడికి పొంతన లేని దుస్థితి ఏర్పడుతోంది. ఏటా పెరుగుతున్న పెట్టుబడి వ్యయం రైతులను అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేస్తోంది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వం చిన్నచూపుతో పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులకు సాగు భరోసా లేకుండా పోతోంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు, కూ లీ ధరలు, వ్యవసాయ యంత్రాల ధరలు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. ఎకరం వరి సాగుకు పెట్టుబడి రూ.30వేలు, పత్తికి రూ.40 నుంచి రూ.45వేలు, కందికి రూ.30వేలు, సోయాబీన్ రూ.20 నుంచి రూ.25వేలు, మొక్కజొన్న రూ.20 వేల వరకు వ్యయమవుతోంది. దీంతో ఈ ఏడాదైనా పత్తి క్వింటాల్‌కు రూ.10వేలు, వరికి రూ.3వేల వరకు మద్దతు ధర చెల్లించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెట్టుబడికి బ్యాంకు రుణాలు అందక అప్పు చేసి నష్టపోతున్నారు. జిల్లాలో 1.60లక్షల మంది సన్న, చిన్నకారు, కౌలు రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. 75శాతం వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నారు. గత ఏడాది భారీ వర్షాలు, వరదలతో నష్టపోయారు. కనీసం కొద్దిపాటి దిగుబడి వచ్చిన పంటలకు మద్దతు ధరతో ప్రభుత్వం రైతులకు అండగా నిలువడం లేదని వాపోతున్నారు. -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
జైనథ్: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన మెరుగు రాకేష్ (28) ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 12న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతుని అన్న ఉదయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసై ఒకరు..సారంగపూర్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు నిర్మల్ మండలంలోని నీలాయిపేట్కు చెందిన శనిగారపు లక్ష్మణ్ (40) 15 ఏళ్లక్రితం యాకర్పెల్లికి వచ్చి ఇక్కడే తన భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. బుధవారం సైతం అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో అతని భార్య దేవకీ మందలించింది. మనస్తాపానికి గురైన లక్ష్మణ్ ఇంటినుంచి బయటకి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. గురువారం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. మృతుని కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యంఖానాపూర్: ఈ నెల 9న అదృశ్యమైన పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన బొమ్మెన మౌనిక (28) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. ఖానాపూర్‌కు చెందిన మౌనికకు మామడ మండలంలోని లింగంపల్లికి చెందిన నల్ల అరుణ్‌తో రెండేళ్లక్రితం వివాహమైంది. ఈ నెల 9న అత్తవారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ తిరిగిరాలేదు. బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఖానాపూర్ మండలం తర్లపాడు శివారులోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ వాచర్ వెంకట్‌కు మృతదేహం కనిపించడంతో పోలీసులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందించాడు. మృతదేహంపై దుస్తులు చిరిగిపోయి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన సోదరి మృతికి ఆమె భర్త, అత్త, మామ కారణమని మృతురాలి సోదరుడు పవన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/జైపూర్/లక్సెట్టిపేట: జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి రైస్‌మిల్లు, జైపూర్ మండలం ఇందారం గ్రామంలో సుముఖ గోదాం, జైపూర్‌లోని జయలక్ష్మి రైస్‌మిల్లు, లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైతే హమాలీల సంఖ్య పెంచి ధాన్యాన్ని వేగంగా అన్లోడ్ చేయాలని రైస్‌మిల్లు యజమానులకు సూచించారు. రోజుకు కనీసం 10నుంచి 15లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి ప్రక్రియ సమన్వయంతో కొనసాగాలని, ఎక్కడా జాప్యం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ రాములు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ క్రాంతి, తహసీల్దార్లు పుష్పలత, దిలీప్‌కుమార్, ఏఓ కృష్ణ, గిర్దావర్ మంగ పాల్గొన్నారు. -
ముల్కలపేటలో ఒకరి హఠాన్మరణం
వేమనపల్లి: మండలంలోని ముల్కలపేటలో ఒకరు హఠాన్మరణం చెందిన సంఘటన చోటు చేసుకుంది. నీల్వాయి ఎస్సై జగదీష్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు కుమురంభీం జిల్లా దహెగాం మండలం గిరివెల్లికి చెందిన రాకేష్ (29)కు ముల్కలపేటకు చెందిన మౌనికతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. మూడురోజుల క్రితం గ్రామంలో జరిగి న ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు అత్తగా రింటికి వచ్చాడు. బుధవారం సైతం ఎస్టీ కాలనీలో మరో వివాహ భరాత్‌లో పాల్గొన్నాడు. రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారు జామున కడుపులో నొప్పి రావడంతో 108లో చెన్నూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తన కుమారుడి అకాల మరణానికి కారణం తెలపాలని తండ్రి వెంకన్న నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టమ్ నివేదిక, విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. -
వడదెబ్బతో మహిళ మృతి
కాగజ్‌నగర్‌టౌన్: మండలంలోని ఆరెగూడ గ్రామానికి చెందిన చాపిలే సుజాత (32) ఈ నెల 12న అదే గ్రామంలో కూలీ పనికి వెళ్ళింది. పని చేస్తుండగా మధ్యాహ్నం ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు మృతురాలి భర్త రమేశ్ తెలిపారు. విషయాన్ని ఆర్ఐకి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై తహసీల్దార్ మధూకర్‌ను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ చేసుకుని ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కారు ఢీకొని ఒకరు..నర్సాపూర్(జి): కారు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల మేరకు తానూర్ మండలం బేల్ తరోడాకు చెందిన దాసరి నడిపి పోశెట్టి (64) డొంగుర్గాంలోని తన కూతురు వద్దకు వెళ్లడానికి బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సులో వచ్చి అర్లి(కె)ఎక్స్ రోడ్డు వద్ద దిగి ఎన్‌హెచ్ 61 రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో నిర్మల్ నుంచి భైంసా వైపు వెళ్తున్న ఎగ్గాం గ్రామానికి చెందిన గంగాధర్ తన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పోశెట్టిని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో భైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుని కుమారు డు దాసరి భోజరాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భర్త వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదుఆదిలాబాద్టౌన్: భర్త తనను అదనపు కట్నం కోసం వేధిస్తూ, వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌మెయి ల్ చేస్తున్నాడంటూ ఓ మహిళ వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బాధితురాలి భర్త బెడ్రూమ్లో కలిసి ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా సెల్ఫోన్లో వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్ప డుతున్నాడు. అలాగే ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా సృష్టించి, తనతో కలిసి ఉన్న ఫొటోల ను పోస్టు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదనంగా రూ.2 లక్షల కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ, విషయం ఎవరికి చెప్పినా తనను, కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. దాదాపు ఎనిమిది రోజుల క్రితం ఆమె ఇంటి వద్దకు వచ్చి నాతో రావాలని, లేకపోతే నీ వీడియోలు వైరల్ చేస్తానని, ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అలాగే బంగారం తీసుకురావాలని గొడవ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. యువకుడిపై పోక్సో కేసుకుంటాల: మండలంలోని అందకూర్కు చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సిరివేని అశోక్ తెలిపారు. గ్రామానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు ఈ నెల13న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న బాలిక (15) వద్దకు వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు పట్టుకునే ప్రయత్నంతో యువకుడు పరారయ్యాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
సందడిగా సమ్మర్ క్యాంపులు
రెబ్బెన: ఏడాదిలో 11 నెలల పాటు చదువుతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా ఆటలపై పట్టు సాధించేందుకు కుస్తీ పడుతున్నారు. తమకు నచ్చిన ఆటపై పట్టు సాధించేందుకు క్రీడా శిక్షణ శిబిరాల్లో చేరుతున్నారు. నృత్యం, డ్రాయింగ్, స్విమ్మింగ్, కుంగ్‌ఫూ కరాటే, సంగీతం.. ఇలా ఏదో ఒక శిక్షణ శిబిరంలో చేరి వాటిలో మెలకువలు నేర్చుకుంటున్నారు. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా శిక్షకులు తర్ఫీదు ఇస్తున్నారు. క్రీడా శిక్షణ శిబిరాలతో ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడామైదానాలు విద్యార్థులతో సందడిగా కనిపిస్తున్నాయి. బెల్లంపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం సైతం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయడంతో గోలేటిలోని విద్యార్థులు తమకు నచ్చిన క్రీడలో మెలకువలు నేర్చుకునేదుకు శిబిరంలో చేరి ప్రతీరోజు సాధన చేస్తున్నారు. మూడు ఈవెంట్లలో శిక్షణ బెల్లంపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం ప్రతీ సంవత్సరం ఒక్కో ఏరియాకు ఒక్కో అంశంపై శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తుండగా ఈసారి ఏరియాలో ఫుట్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 5న ప్రారంభమైన శిక్షణ 30వ తేదీ వరకు కొనసాగనుంది. 25 రోజుల పాటు కొనసాగే శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శిక్షకులు ఆటలపై మెలకువలు నేర్పిస్తున్నారు. క్యాంపు సామర్ధ్యం 70 మంది కాగా ప్రతీరోజు 60 నుంచి 65 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం, సాయంత్రం గంట పాటు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వ్యాయామం, రన్నింగ్, సాయంత్రం గేమ్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. గోలేటిలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో సాధన చేస్తున్న విద్యార్థులుసౌకర్యాలతో పాటు స్నాక్స్ గోలేటి క్రీడలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం క్రీడాకారులకు అన్నిరకాల సౌకర్యాలతో కూడిన మైదానాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గోలేటిలోని సింగరేణి హైస్కూ ల్లో కొనసాగుతున్న క్రీడా శిక్షణ శిబిరంలో సైతం ఫుట్‌బాల్, వాలీబాల్ కోర్టులతో పాటు అథ్లెటిక్స్‌లో భాగంగా రన్నింగ్, ఇతర ఈవెంట్లలో సాధనకు అవసరమైన వసతులను కల్పించింది. శిబిరాలకు హాజరైన విద్యార్థులకు ప్రతీరోజు సాయంత్రం స్నాక్స్ సైతం అందిస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. -
అథ్లెటిక్స్ నేర్చుకుంటున్నా
ఇంతకు ముందు వేసవి సెలవులు వచ్చాయంటే చుట్టాల ఇంటికి వెళ్లి అక్కడే ఉండేవాళ్లం. దీంతో సమయం వృథా అయిపోయేది. కానీ ఈసారి మాత్రం సెలవులను వృథా చేయకుండా సింగరేణి ఏర్పాటు చేసిన క్రీడా శిక్షణ శిబిరంలో చేరి అథ్లెటిక్స్ నేర్చుకోవడం సంతోషంగా అనిపిస్తోంది. – హన్నత్, 9వ తరగతి విద్యార్థిని క్రీడలతో ఉపయోగం చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని సింగరేణి ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో చేరి అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నా. అథ్లెటిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం గ్రౌండ్‌కు వచ్చి సాధన చేస్తున్నా. – పి.శ్రావ్య, ఇంటర్ విద్యార్థిని -
పట్టుబట్టి ఐఎఫ్ఎస్ సాధించి..
జైపూర్: బీటెక్ చదువుతున్న క్రమంలో స్నేహితుడి తండ్రి వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన అతడిని కదిలించింది. రైతు ఆత్మహత్యలు ఉండకూడదని, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనే నిర్ణయం సివిల్స్ వైపు నడిపించింది. మండలంలోని కుందారం గ్రామానికి చెందిన దహగామ శశాంక్ సివిల్స్‌లో రెండుసార్లు విఫలమైనా నిరాశ చెందలేదు. పట్టుబట్టి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్)–2025 ఫలితాల్లో ఆల్ ఇండియా 78వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. రైతు కుటుంబం నుంచి వచ్చినా పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు. మండలంలోని కుందారం గ్రామానికి చెందిన దహగామ ఉమామహేశ్వర్ పర్యావరణవేత్త, రైతు, తల్లి నాగలక్ష్మి న్యాయవాదిగా పని చేస్తున్నారు. సమాజ సేవ కోసం ఉమామహేశ్వర్, నాగలక్ష్మి నాలుగు దశాబ్దాల క్రితం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో నివాసం ఏర్పర్చుకున్నారు. వీరి చిన్న కుమారుడు శశాంక్ పదో తరగతి వరకు ఎన్టీపీసీలోని గౌతంమోడల్ స్కూల్, ఇంటర్మీడియెట్ చుక్కరామయ్య కాలేజీలో, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్, అండ్ ఎంటెక్ ఏకకాలంలో పూర్తి చేశాడు. విద్యార్థి దశ నుంచే ప్రజాసేవపై ఆసక్తి పెంచుకున్న శశాంక్ జీఆర్ఈ(జీఎంఏటీ) పరీక్షల్లో 99శాతం ఉత్తీర్ణత సాధించినా విదేశాల్లో ఉన్నత విద్యను ఎంచుకోకుండా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశాడు. రెండు సార్లు సివిల్ సర్వీసెస్‌లో ప్రిలిమ్స్ చేరుకున్నా సాధించకపోవడంతో ఐఎఫ్ఎస్పై దృష్టి సారించాడు. దేశవ్యాప్తంగా 9.4లక్షల మంది అభ్యర్థులు యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా 2,116మంది పరీక్షల్లో అర్హత సాధించారు. వీరిలో 372మంది ఇంటర్వ్యూకు ఎంపిక కాగా 148మంది మాత్రమే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇందులో శశాంక్ దేశవ్యాప్తంగా 78వ ర్యాంకు, రాష్ట్రంలో తొలి స్థానంలో చోటు దక్కించుకోవడం గమనార్హం. శశాంక్‌ను రాష్ట్ర లాండ్ఆర్డర్ డీజీపీ మహేశ్ భగవత్ శాలువాతో సత్కరించి అభినందించారు.ప్రజాసేవే లక్ష్యం..ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్షలు సిద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. అడవుల సంరక్షణ, పర్యావరణాన్ని కాపాడుతూ భూగర్భజలాల సంరక్షణకు కృషి చేస్తా. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంతటి అత్యుత్తమ స్థాయికి రాణించాను. – శశాంక్ -
నల్లవాగు ప్రాజెక్ట్‌ను సందర్శించిన సబ్ కలెక్టర్
భీమిని: కన్నెపల్లి మండలం విరపూర్ గ్రామ పంచాయతీ పరిధి నల్లవాగు ప్రాజెక్ట్‌ను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ గురువారం సందర్శించారు. ప్రాజెక్ట్‌లో చేపలు పట్టుకునేందుకు గిరిజనులకు హక్కు కల్పించాలని, ముత్తపూర్ వారికి ఇచ్చిన లీజు రద్దు చేయాలని దుబ్బగూడెం, రెబ్బెన గ్రామాల ఆదివాసీ గిరిజనులు మంగళవారం ప్రగతిభవన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో సబ్ కలెక్టర్ ముత్తపూర్ మత్స్యకారులు, దుబ్బగూడెం, రెబ్బెన ఆదివాసీ గిరిజనులతో మాట్లాడారు. ఇరువురు ఎలాంటి గొడవలు పడవద్దని సూచించారు. అనంతరం కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. తహసీల్దార్ రాంచందర్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై భాస్కర్‌రావు, తదితరులు ఉన్నారు. -
నీట్ పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే
మంచిర్యాలటౌన్: నీట్ పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని మంచిర్యాల నగర మేయర్ దర్ని మధుకర్, కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నరేశ్ విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పేపర్‌ను లీక్ చేసిన దోషులను చట్టపరంగా శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో మరోసారి పరీక్షకు హాజరు కావాలనే ఆందోళన నెలకొందని అన్నారు. పరీక్షల సమయంలో జాగ్రత్తలను కేంద్ర ప్రభుత్వం విస్మరించడం వల్లనే దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
గ్లోబల్ బద్రీనాథ్ కాన్క్లేవ్లో గోసంపల్లి వాసి
ఖానాపూర్: సీనియర్ ఎగ్జిక్యూటివ్, ప్రముఖ సామాజిక కార్యకర్త ఏదులపురం సత్యనారాయణచారి ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ‘ది హిస్టారికల్ డివైన్ ల్యాండ్ ఆఫ్ ది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్– శ్రీ బదరికాశ్రమ’ అనే అంశంపై గ్లోబల్ బద్రినాథ్ కాన్క్లేవ్ జరుగనుంది. సదస్సుకు ఎంపికై న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లికి చెందిన సత్యనారాయణచారి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారతీయ జ్ఞాన వ్యవస్థ (ఐఓ) ప్రాచీనత, ఆధునిక సమాజంలో దాని ప్రాముఖ్యతపై సదస్సులో విస్తృత చర్చలు జరుగనున్నాయి. భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి పండితులు, పరిశోధకులు, నిపుణులు హాజరై భారతీయ తాత్విక సంప్రదాయాలు, వేద విజ్ఞానం, ఆధ్యాత్మికత, శాసీ్త్రయ దృక్పథంపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఇండో–టిబెటన్ సరిహద్దు ప్రాంతంలోని సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, ముఖ్యంగా ‘భారతదేశ చివరి గ్రామం’గా ప్రసిద్ధి చెందిన మానా గ్రామ ప్రాధాన్యంపై కూడా చర్చించనున్నారు. వ్యాస మహర్షి వేదాలను సంకలనం చేసిన పవిత్ర భూమిగా విశ్వసించే బద్రీనాథ్‌లో ఈ సదస్సు నిర్వహించడం విశేషంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ మేధో, సాంస్కృతిక ప్రతిభను చాటిచెబుతున్న సత్యనారాయణ చారిని పలువురు అభినందిస్తున్నారు. -
పెన్షనర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలి
నస్పూర్: ఉద్యోగులు, పెన్షనర్లకు పీఎఫ్, పెన్షన్ సెటిల్మెంట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్ భరత్‌కుమార్ అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో సింగరేణి, సీఎంపీఎఫ్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ప్రయాస్ కో ఆర్డినేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగి పీఎఫ్, పెన్షన్ సెటిల్మెంట్ల కోసం అందుబాటులోకి తెచ్చిన సీ–కేర్స్‌లో పెండింగ్స్ని జీరో పెండింగ్‌లోకి తేవడమే లక్ష్యంగా సీఎంపీఎఫ్ కార్యాలయం వారు తలపెట్టిన కార్యక్రమమే ప్రయాస్ అన్నారు. ఉద్యోగులు చిన్న చిన్న కారణాలకు పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసి వాటిని దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. తాను గతంలో అండర్ గ్రౌండ్ మైన్లలో ఇంజనీర్‌గా విధులు నిర్వహించానని, క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల సాధక బాధలు తెలుసన్నారు. జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో సీఎంపీఎఫ్ సమస్యల పరిష్కారం ఎంతో కష్టంగా ఉండేదన్నారు. ప్రస్తుతం సీఎంపీఎఫ్ అధికారులే ఉద్యోగుల వద్దకు రావడం శుభపరిణామం అన్నారు. సమావేశంలో సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్–2 గోవర్ధన్, గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచి కార్యదర్శి బాజీసైదా, డీజీఎం (పర్సనల్) అనిల్‌కుమార్, సీనియర్ పీవో సురేందర్, జీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, పిట్ కార్యదర్శి సందీప్, శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనుల సంక్షేమాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్కీ డ్రా ద్వారా ‘డబుల్’ ఇళ్ల కేటాయింపు
బెల్లంపల్లి: పట్టణంలోని కన్నాల శివారులో నేషనల్ హైవేను ఆనుకుని నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఎట్టకేలకు పంపిణీకి నోచుకున్నాయి. బుధవారం పట్టణంలోని పద్మశాలి భవన్లో సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి, కమిషనర్ తన్నీరు రమేశ్, తహసీల్దార్ ఎల్.కృష్ణ , ఏసీపీ వి.కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో లక్కీడ్రా ద్వారా 108 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించారు. బీసీ, ఇతర కేటగిరీలకు 71, ఎస్సీలకు 18, ఎస్టీలకు 6, మైనార్టీలకు 13 ఇళ్లు కేటాయించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్, చైర్పర్సన్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్లకోసం 763 దరఖాస్తులు రాగా 496 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. కాగా ప్రక్రియ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు అభ్యంతరం తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హమీద్ , కౌన్సిలర్లు ఆసాది మధు, హారిక, పద్మ, వంశీకృష్ణ, నిజాముద్దీన్, శ్రావన్, పున్నం చంద్రు, రాజం, రాయమల్లు, కుమారస్వామి, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
లలితముద్రలో తాండవ శివుడి శిల్పం లభ్యం
దిలావర్పూర్: మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన కదిలే పాపహరీశ్వర ఆలయ ప్రాంగణంలో 11 నుంచి 13వ శతాబ్దాల మధ్యకాలానికి చెందిన అద్భుతమైన నటరాజ రూప తాండవ శివుని శిల్పాన్ని గుర్తించినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డా.తుమ్మల దేవరావు బుధవారం తెలిపారు. ఈ శిల్పం శైవ శిల్పకళలో అరుదైన కళాఖండంగా నిలుస్తుందన్నారు. లలితముద్రలో ఆనంద తాండవం చేస్తున్న శివుని రూపం ఈ విగ్రహంలో అత్యంత సుందరంగా ప్రతిఫలించింది. విగ్రహానికి బహుభుజాలు ఉండగా, పై కుడి చేతిలో మరుకం, పై ఎడమ చేతిలో అగ్ని, కింది కుడి చేతిలో అభయముద్ర, కింది ఎడమ చేతిలో గజహస్త ముద్రలు చెక్కి ఉన్నాయి. తలపై అద్భుతమైన జటాజూటం మలచబడగా, అందులో గంగా, చంద్రుడు, సర్పాలు సుందరంగా ప్రతిష్ఠించబడ్డాయి. మెడలో హారాలు, కటి సూత్రం, చెవులకు పుష్పాభరణాలు, సర్పాల అలంకరణలు శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మెడ వెనుక భాగంలో అనుచర గణాల రూపాలు కూడా చెక్కి ఉన్నాయి. ఈ విగ్రహం కుడికాలిపై నిలబడి, ఎడమ కాలును ఎత్తి నృత్యం చేస్తున్న భంగిమలో కనిపిస్తుంది. ఒకవైపు లాస్య సౌందర్యం, మరోవైపు ఉగ్రరూప భావవ్యక్తీకరణ కలగలిపిన తీరు శిల్పానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కపాలాల రూపకల్పన ద్వారా శిల్పి శైవ తత్వంలోని రౌద్ర –ఆనంద స్వరూపాలను ప్రతిబింబించినట్లు తెలుస్తోంది. కల్యాణి చాళుక్యుల చివరి దశలో లేదా కాకతీయుల ప్రారంభ కాలంలో ఈ అపురూపమైన నటరాజ శిల్పాన్ని మలచి ఉండవచ్చని తుమ్మల దేవరావు అభిప్రాయపడ్డారు. -
పాఠశాలల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు కీలకం
మంచిర్యాలఅర్బన్: పాఠశాలల అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. విద్యాశాఖ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులుంటారని, వారికి నాణ్యమైన విద్య అందేలా చూడడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. డీఈవో యాదయ్య మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో మేయర్ ధర్ని మధు, డిప్యూటీ మేయర్ రమ్య, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు విజయలక్ష్మి, సత్తయ్య, రాజ్‌కుమార్, ఎంఈవోలు మాలవీదేవి, పద్మజా, తిరుపతిరెడ్డి, శైలజ, రాజు, విజయ్‌కుమార్, రిసోర్స్ పర్సన్లు జనార్దన్, సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా జరగాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట, ముల్కల్ల, హాజీపూర్ మండలం రాపల్లిలోని కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించారు. ధాన్యం నిల్వలు, తేమశాతం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాలకు పంట నష్టం జరగకుండా గోదాముల్లో నిల్వ చేసి కేటాయించిన మేరకు రైస్ మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరిపి మద్దతు ధర ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట గిర్దావర్లు ప్రభు, నిర్వాహకులు, రైతులు ఉన్నారు. -
టామ్‌కామ్ ద్వారా యువతకు ఉపాధి
మందమర్రిరూరల్: తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో టామ్‌కామ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం పట్టణంలోని సింగరేణి హైస్కూల్ పక్కన గల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో టామ్‌కామ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతకు టామ్ కామ్ సంస్థ ఆయా దేశాల భాషలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. జర్మనీ, జపాన్, ఇజ్రాయిల్ దేశాలతో పాటు గ్రీస్, యూరప్ దేశాలలో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. వారానికి 35 గంటల పనివిధానం, సుమారు రూ.2 లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు. నర్సింగ్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వంటి కోర్సులు చదివిన వారు దరఖాస్తు చేసుకుంటే జూన్ 10న శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, ఏరియా జీఎం రాధాకృష్ణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, టామ్‌కామ్ సంస్థ మేనేజర్ అనీల్‌కుమార్, తహసీల్దార్ సతీష్‌కుమార్, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. -
అగ్గి రగిలితే.. బుగ్గే..!
మంచిర్యాలక్రైం: జిల్లాలో తరుచుగా సంభవిస్తున్న అగ్నిప్రమాదాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. ప్రజలు వేసవిని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే అగ్గి రగిలితే మిగిలేది బుగ్గేనని అధికారులు పేర్కొంటున్నారు. కాగా మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, జన్నారం మండల కేంద్రాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. అగ్ని మాపక కేంద్రాలకు చుట్టూ 20 –25 కిలోమీటర్ల దూరంలో గ్రామాలున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగితే సమాచారం అందిన తర్వాత అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైర్ ఇంజన్ ఘటన స్థలానికి చేరుకునే సరికి 30–50 నిమిషాల వరకు సమయం పడుతోంది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. సిబ్బంది లేక ఇబ్బంది.. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు, 382 గ్రామ పంచాయతీలు, 6 మున్సిపాలీటీలు, ఒక నగర కార్పొరేషన్‌కు గాను నాలుగు ఫైర్స్టేషన్లు ఉన్నాయి. ఫైర్స్టేషన్లలో ఓ వైపు సిబ్బంది కొరత వెక్కిరిస్తుంటే, దీనికి తోడు జిల్లా కేంద్రంలోని ఫైర్స్టేషన్లో రెండు ఫైర్ ఇంజన్లు ఉండగా మిగితా స్టేషన్లలో ఒక్కో ఫైర్ ఇంజన్ మాత్రమే ఉంది. దీంతో ఒకే సారి రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదా లు జరిగితే ఫైర్ ఇంజన్ ఒక్క చోటుకే పరిమితమై మరో ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం ఒక్క ఫైర్ స్టేషనకు 16 మంది చొ ప్పున నాలుగు ఫైర్ స్టేషన్లకు 64 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 45 మంది మాత్రమే ఉన్నారు. అగ్ని ప్రమాదాలకు కారణాలు.. పట్టణాల్లో జరిగే 70 శాతం అగ్ని ప్రమాదాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్నాయి. దీనికి కారణం నాసిరకం విద్యుత్ తీగలు వాడడమే. తక్కువ ధరకు కొనుగోలు చేసిన నాసిరకం తీగలతో ఓవర్ లోడ్ విద్యుత్ సరఫరా జరిగినప్పుడు విద్యుత్ ప్రమాదం జరుగుతోంది. తీగలు తెగినప్పుడు జాయింట్స్ వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల విద్యుత్ జాయింట్ వేసిన చోట ఓవర్ లోడ్ విద్యుత్ సరఫరా జరిగినప్పుడు వేడికి కరిగిపోయి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఏళ్ల తరబడి వాడుతున్న విద్యుత్ తీగల్లో లోటుపాట్లను గుర్తించి మార్చుకోవడం మంచిది. పట్టణ కేంద్రాల్లో కొందరు స్క్రాప్ దుకాణాలను ఇళ్ల మధ్యనే ఏర్పాటు చేసుకొని దందా నడుపుతున్నారు. ఇందులో అట్టపెట్టెలు, ప్టాస్టిక్ డబ్బలు, న్యూస్‌పేపర్లు నిల్వ ఉంచుతుంటారు. అక్కడ అగ్నిప్రమాదం జరిగితే తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భీమిని మండలం పెద్దపేటకు చెందిన అరికెల విజయకు చెందిన ఇల్లు ఈ నెల 11న విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటి నిర్మాణం కోసం భూమిని అమ్మగా వచ్చిన రూ.12 లక్షల నగదు, తులం బంగారం, స్టడీ సర్టిఫికెట్లు, నిత్యావసర సామగ్రి దగ్ధమయ్యాయి. -
ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
అగ్ని ప్రమాదాలకు సంబంధించి ప్రజలు ప్రాథమికంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. విద్యుత్ షార్ట్ సర్క్యుట్ వల్ల ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. బీడీ, సిగరెట్లను కాల్చిన తర్వాత చేలల్లో, చెత్త ఉన్న చోట పడేయకూడదు. ఇళ్లలో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు నియంత్రించేందుకు స్టెబిలైజర్ వినియోగించాలి. గడ్డి వాములు, చెత్త, ప్లాస్టిక్ నిల్వలు నివాసాలకు దూరంగా ఉండాలి. అపార్ట్మెంట్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ సముదాయాల్లో అగ్నిమాపక నిబంధనలు పాటించాలి. – భగవాన్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మంచిర్యాల -
బార్దాన్ కొరత తీర్చాలి
దండేపల్లి: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో బార్దాన్ కొరత తీర్చాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. బుధవారం నాగసముద్రం, మాకులపేట గ్రా మాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. బార్దన్ లేక ఇబ్బంది పడుతున్నామని పలువురు రైతులు వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిపడా బార్దన్ లేక పోవడంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో నాగసముద్రం సర్పంచ్ సుగుణ, ఉప సర్పంచ్ రమణయ్య, బీజేపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవిగౌడ్, సంతోష్ పాల్గొన్నారు. -
మహిళను కాపాడిన పోలీసులు
బాసర: మనస్తాపంతో గోదావరి నదిలో దూకేందుకు యత్నించిన ఓ మహిళను బాసర పోలీసులు సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బాసర మండలం లబ్ధి గ్రామానికి చెందిన నికిత షిండే అనే మహిళ ఇంట్లో గొడవల కారణంగా బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో బాసర గోదావరి నది వద్దకు చేరుకుంది. ఆమెను గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. బాసర పోలీస్ బృందం మెరుపు వేగంతో అక్కడికి చేరుకొని నదిలోకి దూకేందుకు సిద్ధమైన బాధితురాలిని చాకచక్యంగా అడ్డుకున్నారు. ఆమెకు నచ్చజెప్పి, ధైర్యం చెప్పి ఆత్మహత్యాయత్నాన్ని విరమింపజేశారు. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన బాసర పోలీస్ సిబ్బంది నరేంద్ర చారి, శ్రీకాంత్‌లను సీఐ కిరణ్, ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేకంగా అభినందించారు. -
బాసర అభిషేకం లడ్డూ ప్రియం
బాసర: బాసర క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రసాదం ధరలు పెరిగాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు అభిషేకం లడ్డూ ధరను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.100గా ఉన్న 500 గ్రాముల లడ్డూ ధరను రూ.150కి పెంచారు. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. ముడిసరుకు ధరల పెరుగుదలతో.. ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, ఇతర ముడిసరుకుల ధరలు మార్కెట్లో భా రీగా పెరగడంతో, ఆలయ నిర్వహణ భారంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ధరలను పెంచక తప్పలేదని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. భక్తుల నుంచి మిశ్రమ స్పందన.. లడ్డూ ధరను 50శాతం పెంచడంపై భక్తుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సా మాన్య భక్తులపై భారం పడకుండా చూడాలని కొందరు కోరుతుండగా, నాణ్యమైన ప్రసాదం అందించే క్రమంలో ఈ పెంపు అనివార్యమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. జాతీయ కమిటీలో నంది రామయ్యకు చోటుఆదిలాబాద్టౌన్: ఏఐయూకేఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి నంది రామయ్య జాతీయ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు టేకం అయు, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగన్ సింగ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి సాయికుమార్, ముత్యాలరావు బుధవారం మాట్లాడారు. రైతాంగ సమస్యలపై నంది రామయ్య నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు. -
గోల్ షాట్‌బాల్ జాతీయ అధ్యక్షుడిగా రవికుమార్
ఆదిలాబాద్‌రూరల్: గోల్ షాట్ బాల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా సాయిని రవికుమార్ నియమితులయ్యారు. బుధవారం మండలంలోని చాందా (టి) శివారు ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా సాయిని రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా రామ్ పర్వేశ్ కుమార్, సీనియర్ ఉపాధ్యక్షుడిగా సుధాకర్ రావు, ఉపాధ్యక్షుడిగా యోగేష్ పాటిల్, జాయింట్ సెక్రటరీగా కరుణాకరన్, సెకండ్ జాయింట్ సెక్రటరీగా దేవిప్రియను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను అసోసియేషన్ ప్రతినిధులు శాలువాలతో సత్కరించారు. -
వరి ధాన్యం త్వరితగతిన తరలించాలి
పాతమంచిర్యాల: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు వరి ధాన్యం త్వరితగతిన తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి.రాములు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, డీఆర్డీవో కిషన్, జిల్లా రవాణా శాఖ అధికారి గోపి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ క్రాంతి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు, సెక్టార్ 1,2,3,4,లకు సంబంధించిన ట్రాన్సుపోర్టు గుత్తేదారులతో సమీక్ష నిర్వహించారు. రోజుకు 6 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, కనీసం 10–15 లారీల ధాన్యాన్ని మిల్ల ర్లు దిగుమతి చేసుకోవాలన్నారు. అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు. ధాన్యం తరలింపునకు రవాణా శాఖ ఆధ్వర్యంలో లారీలు ఏర్పాటు చేశామన్నారు.కొనుగోలు కేంద్రాలు పరిశీలన దండేపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్లు వడాల రాములు, చంద్రయ్య వేర్వేరుగా పరిశీలించారు. తూకం వేసిన బస్తాలను వెంటవెంటనే మిల్లులు, లేదా గోదాంలకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. దండేపల్లిలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలతో పాటు, ధాన్యం నిల్వ చేసేందుకు అల్లీపూర్ సమీపంలో గల రామ్‌లక్ష్మన్ మిల్లులోని గోదాంలను ఇద్దరు వేర్వేరుగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, ఆర్ఐ భూమన్న, ఐకేపీ సిబ్బంది ఉన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం తనిఖీ మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేఖ తనిఖీ చేశారు. లారీల సమస్య ఉందని చెప్పడంతో పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆమె వెంట ఏడీఏ కృష్ణ, ఏవో అంజిత్‌కుమార్ ఉన్నారు. -
శాస్త్రీయ నృత్యంపై ఆసక్తి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ‘భరత వేదముగా నిరత నాట్యముగా.. కదలిన పదమిది ఈశా..! అనే పాట వచ్చిందంటే చాలు.. శాసీ్త్రయ నృత్యం మదిలో మెదులుతుంది. శాసీ్త్రయ నృత్యమే కాదు ప్రస్తుతం శాసీ్త్రయ, సినీ, జానపదం.. ఇలా పాశ్చాత్య నృత్యాలు కూడా నేర్చుకుంటూ తన్మయత్వం పొందుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ ప్రపంచం నడుస్తుండటంతో నృత్యాలపై మక్కువ పెరుగుతోంది. ఈ వేసవి సెలవుల్లో నృత్య శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడంతో కూచిపూడి, భరత నాట్యం నేర్చుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఏర్పాటైన శాసీ్త్రయ నృత్య శిక్షణ శిబిరాలను చిన్నారుల నుంచి పెద్దల వరకు సద్వినియోగం చేసుకుంటూ శిక్షణ పొందుతున్నారు. కళారూపాలు, హస్తముద్రలు, ముఖ, కంటి, పాద విన్యాసాలపై గురువులు శిక్షణ ఇస్తుండగా భక్తి, పురాణ గాధల కళారూపాలకు సంబంధించి నృత్యాలపై సాధన చేస్తున్నారు. నామమాత్రపు ఫీజులతో వేసవిలో శిక్షణ అందిస్తుండగా ప్రస్తుతం జిల్లాలోని మార్కెట్రోడ్లో శ్రీనందిని నృత్యాలయం, శ్రీసరస్వతి శిశుమందిర్, మున్సిపాలిటీ వద్ద, బెల్లంపల్లి చౌరస్తా, కాలేజ్రోడ్లలోని నృత్యాలయాలతో పాటు పలు నృత్య శిక్షణ శిబిరాల్లో కూచిపూడి, భరత నాట్యంపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 30 నుంచి 100 మంది వరకు నృత్య శిక్షణ పొందుతున్నారు. -
హత్య కేసును ఛేదించిన పోలీసులు
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 11న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం మావల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మావల గ్రామానికి చెందిన బర్కుంటి శివన్న (52) పద్మనాయక గార్డెన్ రోడ్ సమీపంలో హత్యకు గురి కాగా ఆయన కుమారుడు విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మావల సీఐ కర్రె స్వామి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలంలో హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలతో ఉన్న రాయి, కొడవలి, రక్తపు ఆనవాళ్లు ఉన్న మట్టిని స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన నల్లావార్ పోశెట్టి హత్యకు ముందు మృతుడితో ఉన్నట్లు గుర్తించారు. మే 12న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆయన వద్ద నుంచి రక్తపు మరకలతో ఉన్న చొక్కా, తువ్వాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇద్దరు కలిసి స్క్రాప్ సేకరణ పనులు చేస్తూ తరచూ డబ్బుల పంపకం, బీడీల దొంగతనం విషయాల్లో గొడవపడేవారని తేలింది. స్క్రాప్ వ్యాపారాన్ని ఒంటరిగా నిర్వహించాలనే ఉద్దేశంతో నిందితుడు మద్యం మత్తులో ఉన్న శివన్నపై రాయితో దాడి చేసి హత్య చేశాడు. పోశెట్టిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, సీఐ కర్రె స్వామి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
ఒంటరి మహిళలే లక్ష్యం..!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న మహిళలను నమ్మించి బంగారం, నగదు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్ తెలిపారు. బుధవారం కేసు వివరాలను పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ గాంధీనగర్‌కు చెందిన కాళహస్తి శిరీష్‌కుమార్ కారు డ్రైవర్. ఇతనికి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన రాంపల్లి రజితతో మ్యాట్రిమోని ద్వారా పరిచయం ఏర్పడగా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ నెల 1వ తేదీన నగలు చేయిద్దామని రజితను తీసుకుని మంచిర్యాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో గుడిపేట శివారులో గల ఓ దాబా వద్ద బైక్ ఆపాడు. రజిత మెడలో ఉన్న బంగారు గొలుసు బరువు చూస్తానని చెప్పి తీసుకొని ఆమెను పక్కకు తోసేసి బైక్‌పై హైదరాబాద్‌కు పారిపోయాడు. దీంతో రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిరీష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా శిరీష్‌కుమార్ గతంలో ప్రకాశం జిల్లాలో మూడు ద్విచక్ర వాహనాల దొంగతనం కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడని, మ్యాట్రిమోని సైట్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఒంటరి మహిళను పెళ్లి చేసుకుని ఆమె నుంచి రూ.3 లక్షలు తీసుకుని పారిపోయిన కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడని సీఐ గోపతి రవీందర్ తెలిపారు. వివాహ సంబంధిత సైట్లలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే వారు పూర్తిస్థాయిలో విచారించిన మీదటే పెళ్లికి అడుగులు వేయాలని పేర్కొన్నారు. కేసు విచారణ వేగవంతం చేసి నిందితుడిని పట్టుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన హాజీపూర్ ఎస్సై కిరణ్‌కుమార్, కానిస్టేబుళ్లు బి.తిరుపతి, జి.సత్యనారాయణ, జి.చంద్రశేఖర్, పి.రాజేందర్‌లను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. -
ఆటో బోల్తా.. ఒకరు మృతి
భైంసారూరల్: మండలంలోని మాటేగాం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఎస్సై సుప్రియ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణంలోని ఓవైసీనగర్‌కు చెందిన ఎనిమిది మంది ఆటోలో నిర్మల్‌లో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వేగంగా వస్తున్న ఆటో మాటేగాం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో షేక్ పాషా (78) సంఘటన స్థలంలోనే మృతి చెందగా, డ్రైవర్ మారుతి, సల్మాన్, అస్మాబేగం, సుమేరా బేగం, రేష్మాబేగం, రబియా మాహేక్, రెహనా బేగంలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఎస్సై సుప్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు షురూ
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం 1,501 మంది విద్యార్థులకు గానూ 1,417 మంది హాజరుకాగా 84 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 1,377 మందికి గానూ 1302 మంది హాజరుకాగా 75 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విద్యార్థులు 124 మందికి గానూ 115 మంది హాజరుకాగా 9 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం 470 మంది విద్యార్థులకుగానూ 439 మంది హాజరుకాగా 31 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 449 మందికి గానూ 421 మంది హాజరుకాగా 28 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విద్యార్థులు 21 మందికి గానూ 18 మంది హాజరుకాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాలను డీఐఈవో అంజయ్య తనిఖీ చేశారు. -
ప్రశాంతంగా పాలిసెట్
బెల్లంపల్లి/నస్పూర్: పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి బుధవారం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. 4,600 మంది విద్యార్థులకు గానూ 4,327 మంది హాజరుకాగా 273 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 94.07గా నమోదైనట్లు బెల్లంపల్లి ప్ర భుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్ష నిర్వహణ కోఆర్డినేటర్, మెంటార్ ఎం.దేవేందర్ తెలిపారు. బెల్లంపల్లిలోని 4 పరీక్ష కేంద్రాల్లో 1,171 మందికి గానూ 1,119 మంది హా జరుకాగా 52 మంది గైర్హాజరయ్యారు. మంచిర్యాలలో 8 పరీక్ష కేంద్రాల్లో 2,365 మంది విద్యార్థులకు గానూ 2,206 మంది హాజరుకాగా 159 మంది గైర్హాజరయ్యారు. కుమురంభీం ఆసిఫాబాద్‌లో 4 పరీక్ష కేంద్రాల్లో 1,064 మంది విద్యార్థులకుగానూ 1,002 మంది హాజరుకాగా 62 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షల నిర్వహణను ప్రత్యేక పరిశీలకుడు ఎ.కాంతయ్య పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తులుమంచిర్యాలటౌన్: 2026–27 విద్యాసంవత్సరానికి గానూ హైదరాబాద్‌లోని పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అర్హులైన బాలురకు 3, బాలికలకు 3 సీట్లు కేటాయించడం జరిగిందని, జూన్ 1, 2019 నుంచి మే 31, 2020 మధ్య జన్మించినవారు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలన్నారు. ఆసక్తి కలవారు దరఖాస్తుతో పాటు బోనఫైడ్, తహసీల్దార్ జారీ చేసిన కుల, ఆదాయ, జననం, నివాస ధ్రువీకరణ పత్రాలు జతచేయాలన్నారు. గిరిజనులలో ఉపతెగల వారీగా సీట్లు కేటాయించడం జరిగిందని, గోండు, నాయక్ పోడ్ తెగలకు 2, కొలాం, కోయ, లంబాడా/సుగాలి, ఇతర తెగల వారికి ఒక్కొక్క సీటు కేటాయించినట్లు తెలిపారు. అర్హులైనవారు ఈ నెల 18లోగా జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలోని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ నెల 22 న డ్రా పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
తాండూర్: రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 9 నుంచి నిర్వహించిన రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆవుల అభిషేక్ 2 గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, లబాన్ నర్జరే గోల్డ్ మెడల్, కుబిడె పుష్పలత, రంగు సోహనిశ్రీ సిల్వర్ మెడల్, వినూత్న, సంయుక్తచారి, శ్రీవాస్తవ, శ్రీరిశ్వాన్ కాంస్య పతకాలు సాధించినట్లు అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ మారుపాక శ్రీలత తెలిపారు. విజేతలను తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్ అభినందించారు. -
ప్రశాంత వాతావరణంలో బక్రీద్ జరుపుకోవాలి
మంచిర్యాలక్రైం: రాష్ట్ర ప్రజలు ప్రశాంత వాతావరణంలో బక్రీద్ జరుపుకునేలా అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న నిర్వహించే బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మతాలకతీతంగా పరస్పర సహకారంతో పండుగ జరుపుకునేలా పోలీస్ శాఖ సమన్వంతో పని చేయాలని ఆదేశించారు. ప్రార్థన స్థలాలు, ఈద్గాలు, మసీద్‌లు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈద్గాలా వద్ద పార్కింగ్ సమస్య లేకుండా పర్యవేక్షించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు లేదా వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్ మానిటరింగ్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. మత పెద్దలతో ముందస్తుగా శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీలు ఎగ్గడి భాస్కర్, రాంరెడ్డి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు ప్రకాష్, రమేశ్, నాగేందర్‌గౌడ్, సీఐలు పాల్గొన్నారు. -
● నేటి నుంచి 33 అంశాలతో వివరాల సేకరణ ● పూర్తయిన మ్యాపింగ్ ప్రక్రియ ● జూన్ 10లోగా మొదటి దశ పూర్తి
మంచిర్యాలటౌన్: జిల్లాలో ఈ నెల 11 నుంచి జనగణన 2027 ప్రారంభించారు. మూడు రోజులపాటు ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన బ్లాక్‌ల వారీగా ఇంటింటికీ నంబరింగ్ ఇచ్చారు. వారి పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో మ్యాప్ చేస్తూ, గుర్తించిన ఇళ్లకు సెన్సెస్ హౌస్ నంబరింగ్ చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1,750 బ్లాక్‌లను గుర్తించగా, ఒక్కో బ్లాక్‌లో 180 నుంచి 200 ఇళ్ల వరకు ఉన్నాయి. గృహ సర్వే కోసం 1,572 మంది ఎన్యుమరేటర్లు ఉండగా, వారిపై పర్యవేక్షణ కోసం 276 మంది సూపర్వైజర్లను నియమించారు. వీరి సమక్షంలో ఈ నెల 14 నుంచి ఇంటింటికీ వెళ్లి జనగణన చేపట్టనున్నారు. జూన్ 10వ తేదీలోగా మొదటి దశ పూర్తి చేయనున్నారు. ఈ నెల 10 వరకు జిల్లాలో 8,700ల మంది సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇంటింటికీ వచ్చే ఎన్యుమరేటర్లకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వారికి వచ్చిన హెచ్‌తో ప్రారంభమయ్యే 11 అంకెల ఎన్యుమరేషన్ ఐడీని ఇస్తే సరిపోతుంది. ఆ ఐడీ ప్రకారంగానే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల ద్వారా కుటుంబ వివరాలను ధృవీకరిస్తారు. జనగణన ప్రక్రియ మొత్తం కాగిత రహితంగానే, పూర్తి డిజిటల్ విధానంలో చేయనున్నారు. మ్యాపింగ్‌లో ప్రతీ ఇల్లు నమోదు జనగణన ప్రక్రియ మొదటి దశలో భాగంగా ప్రతీ ఇంటిని, ప్రతీ కుటుంబాన్ని లెక్కించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ నెల 11 నుంచి 13 వరకు ఎన్యుమరేటర్లకు మ్యాపింగ్ చేపట్టే విధులు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇళ్లను 1,750 బ్లాక్‌లుగా విభజించి ఎన్యుమరేటర్లకు ఇవ్వగా వారి గైడ్ కోసం డిజిటల్ మ్యాప్‌లను అందించారు. గూగుల్ ఆధారంగా సేకరించిన ల్యాండ్ మార్కులు, వీధుల వివరాలు, ఇతరత్రా కట్టడాలు, రోడ్లు ఇలా అన్నింటినీ సరిచూసుకుంటూ వారికి ఇచ్చిన మ్యాప్‌లోని ప్రతీ ఇంటికి సెన్సెస్ హౌస్ నంబరింగ్ చేశారు. డిజిటల్ మ్యాప్‌కు ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు సరిపోల్చుతూ, మ్యాప్‌లో లేని అంశాలను నోట్ చేస్తూ మూడు రోజుల పాటు మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టారు. డిజిటల్ మ్యాప్ లేటెస్ట్‌ది కాకపోవడంతో, కొత్తగా కొన్ని ఇళ్లు, వీధులు నూతన మ్యాపింగ్ ప్రక్రియలో ఎన్యుమరేటర్లు గుర్తించారు. ప్రస్తుతం ఎన్యుమటరేటర్లు గుర్తించిన మ్యాపింగ్ ప్రకారం వారి పరిధిలో ఎంత ఏరియా ఉంది, ఎన్ని గృహాలు ఉన్నాయో పూర్తిగా నమోదు చేసుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెల 14 నుంచి నిజమైన ఇంటింటి గృహ సర్వే ప్రారంభించి, జూన్ 10 వరకు పూర్తి చేయనున్నారు.ప్రజలు సహకరించాలిజనగణనకు సంబంధించి హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, మ్యాపింగ్ పూర్తయ్యింది. ఇక ఇంటింటికీ వెళ్లి, ఇంటి యజమానితో పాటు, 33 రకాల ప్రశ్నలను అడిగి వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు. అంతా డిజిటల్ విధానంలోనే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వారు హెచ్ అక్షరంతో మొదలైన 11 అంకెల ఎన్యుమరేషన్ ఐడీని ఎన్యుమరేటర్లకు చెబితే సరిపోతుంది. ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలి. – పాపయ్య, సీపీవో, మంచిర్యాలజనగణన 2027లో మొదటి దశనే ఎంతో కీలకంగా మారనుంది. ప్రతీ ఇంటిని, ప్రతీ కుటుంబాన్ని ఈ గణనలో నమోదు చేయాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో మొదటి మూడు రోజుల పాటు ఒక్కో ఎన్యుమరేటర్‌కు కేటాయించిన పరిధిలో ఎన్ని ఇళ్లు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో హౌస్ లిస్టింగ్‌తో కూడిన మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేశారు. జిల్లాలో సమగ్ర గృహ సర్వే నిష్పక్షపాతంగా, ఖచ్చితంగా సాగేందుకు ఎన్యుమరేటర్లు చేస్తున్న మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు స్వయంగా పరిశీలించి సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. ఇళ్లు, కుటుంబాల గణనను మొదటి దశలో 33 అంశాలతో కూడిన ప్రశ్నావళితో పూర్తి చేయనున్నారు. రెండో దశ 2027 ఫిబ్రవరి 9 నుంచి 25 వరకు వ్యక్తిగత వివరాల సేకరణ చేపట్టడంతో పూర్తికానుంది. -
విద్యార్థుల సంఖ్య పెరిగింది..
వేసవి సెలవులు ఉండడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది కూచిపూడి నాట్యంపై ఆసక్తి చూపిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా శిక్షణకు వస్తున్నారు. వారికి నాట్యంలో ఉదయం మూడు గంటల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఉత్సాహంగా నృత్యంలో మెళుకువలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికే మంచి నృత్య కళాకారులుగా పేరు తెచ్చుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ పలువురు ప్రముఖుల ప్రశంసలు ఆవార్డులు అందుకున్నారు. – అన్నం కల్పన, కూచిపూడి గురువు, శ్రీనందిని నృత్యాలయం -
తాగునీటి సమస్యపై ఆందోళన
తాండూర్: మండల కేంద్రమైన తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ మేదరివాడ, అశోక్‌నగర్ కాలనీ వాసులు తాగునీటి సమస్యపై ఆందోళన చేపట్టారు. మంగళవారం ఆర్అండ్బీ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఎన్నోసార్లు మంచినీటి సమస్యపై విన్నవించినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలల క్రితం బోరు వేసినా మోటారు బిగించలేదని వాపోయారు. పంచాయతీ రాజ్ ఈఓ దివాకర్ ఆందోళనకారులతో మాట్లాడారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కారానికి హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. పంచాయతీ అధికారులు, సర్పంచ్ ముడిమడుగుల సురేష్ ట్యాంకర్ల ద్వారా కాలనీలో నీరు సరఫరా చేశారు. బోరుకు మోటారు బిగించి పైపులైన్‌కు అనుసంధానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మనోహర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పెట్టెం విష్ణుకల్యాణ్, నాయకుడు పురంశెట్టి అరుణ్ పాల్గొన్నారు. -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల నగరంలోని ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలన్ని హనుమాన్ నామస్మరణతో మారుమోగాయి. స్థానిక విశ్వనాథ స్వామి దేవస్థానంలోని ఆంజనేయ ఆలయంలో గణపతి పూజా, అభిషేకం, నివేదన, మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తమలపాకులతో హనుమాన్కు అభిషేకం చేశారు. గౌతమినగర్ కోదండ రామాలయం, గర్మిళ్ల భక్తాంజనేయస్వామి దేవాలయం, మారుతినగర్, హమాలీవాడ, తిరుమలగిరి కాలనీల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
కోటపల్లి: ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, రైతులు మంగళవారం మండలంలోని దేవులవాడ గ్రామంలో 63వ జాతీయ రహదారి ధర్నా నిర్వహించారు. మండలంలోని రాపన్‌పల్లి, లక్ష్మిపూర్ కొనుగోలు కేంద్రాలను మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ధర్నా చేపట్టారు. తహసీల్దార్ రాఘవేందర్రావు అక్కడికి చేరుకోగా బీఆర్ఎస్ నాయకుడు ఆయన కాళ్లు మొక్కి ధాన్యం కొనాలని వేడుకున్నాడు. రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వివేక్‌వెంకటస్వామి ధాన్యం కొనుగోళ్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏరినాగుల ఓదెలు, రెవెల్లి మహేశ్, తుమ్మ రమేశ్, దోమకొండ అనిల్, భారతీ, కొప్పుల ప్రభాకర్, మానిశెట్టి మల్లయ్య, సాయి పాల్గొన్నారు. -
‘డబుల్’ లక్కెవరిదో..!
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. బుధవారం 10.30గంటలకు లక్కీడ్రా నిర్వహణకు అధికార యంత్రాంగం పద్మశాలి భవన్లో ఏర్పాట్లు చేసింది. 2017 జూన్ 10న అప్పటి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరై రూ.968లక్షల అంచనా వ్యయంతో 160 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఏళ్లు గడిస్తే గానీ నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇందుకు అనేక కారణాలు తోడయ్యాయి. 106 ఇళ్లకు గాను పట్టణ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి 468మందిని అర్హులుగా రెవెన్యూ అధికారులు తేల్చారు. వీరి పేర్లను డ్రా తీసి ఇళ్లు అప్పగిస్తారు. ఎట్టకేలకు లక్కీ డ్రా తీయనుండడంతో లబ్ధిదారుల్లో ఆశలు, ఆసక్తితోపాటు ఉత్కంఠగా మారింది. వీడియో చిత్రీకరణ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు, అవకతవకలు అనే ఆరోపణలకు తావివ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహించి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తారు. ఇళ్లు మంజూరు చేయిస్తామని ఇప్పటికే పలువురు దళారులు, చోటామోటా నాయకులు లబ్ధిదారులకు ఆశలు కల్పించి డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగు చూశాయి. కొందరు నేరుగా, మరికొందరు మధ్యవర్తులు, దళారుల ద్వారా డబ్బులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఇంటికి రూ.3లక్షలు వసూలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడం అప్పట్లో దుమారం రేపింది. ఈ క్రమంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు రాకుండా వీడియోగ్రఫీ సమక్షంలో అర్హులైన లబ్ధిదారుల పేర్లను డబ్బాలో వేసి డ్రా తీయాలని నిర్ణయించారు. అందరి సమక్షంలో డ్రా తీస్తాం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను వడబోసి జల్లెడ పట్టాం. నిజమైన లబ్ధిదారులను సర్వే చేసి గుర్తించి తుది అర్హుల జాబితా తయారు చేశాం. 496 మంది అర్హులను గుర్తించి వీరి పేర్లను డ్రాలో వేసి ఎవరి పేరైతే వస్తుందో ఆ లబ్ధిదారుకు ఇళ్లు కేటాయించడం జరుగుతుంది. లక్కీడ్రా పారదర్శకంగా వీడియోగ్రఫీ సమక్షంలో జరుగుతుంది. – ఎల్.కృష్ణ, తహశీల్దార్, బెల్లంపల్లి -
ధాన్యం సేకరణ వేగవంతం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరిగింది. మంగళవారం 34వేల మెట్రిక్ టన్నుల సేకరణ జరుగగా, 26వేల మెట్రిక్ టన్నులు రవాణా జరిగింది. మొదట సరిపడా మిల్లులకు ట్యాగింగ్ లేక తూకం వేసిన ధాన్యం రవాణాలో జాప్యం చోటు చేసుకుంది. హమాలీల చార్జీలపై స్పష్టత లేక ధాన్యం నిలిచిపోయింది. ఓ వైపు అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయింది. రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ట్యాగింగ్ ఇచ్చిన 12 మిల్లులకు తోడు ఏఎంసీ గోదాములు అందుబాటులోకి రావడంతో గత మూడు రోజులుగా ధాన్యం రవాణా క్రమంగా పెరుగుతోంది. రంగంలోకి ఎమ్మెల్యే పీఎస్సార్ జిల్లాలో వరి సగానికి పైగా మంచిర్యాల నియోజకవర్గంలోనే సాగవుతోంది. ఇటీవల అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నివారించేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) నేరుగా అందరితో మాట్లాడుతూ వడ్లు త్వరగా దించుకునేలా ఏర్పాట్లు చేశారు. హమాలీల కొరత తీరేలా బీహార్‌తోపాటు స్థానికులను వినియోగిస్తున్నారు. జిల్లా కార్మిక శాఖ అధికారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు, మిల్లర్లు, ఐకేపీ, రవాణా కాంట్రాక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ జాప్యం జరుగకుండా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దండేపల్లి మండలంలో తడిసిపోయిన వడ్లను ఎమ్మెల్యే పీఎస్సార్ చొరవ తీసుకుని మిల్లర్లు తీసుకునేలా చేశారు. మొదట మిల్లర్లు తీసుకునేందుకు అయిష్టత చూపారు. దీంతో ఆయన చొరవ తీసుకుని బాయిల్డ్ మిల్లర్‌తో ఒప్పించి ఆ ధాన్యం తీసుకునేలా చేశారు. కొనుగోలు కేంద్రాలు : 334 సేకరణ లక్ష్యం అంచనా : 2లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ : 34,700 మెట్రిక్ టన్నులు రవాణా చేసింది : 26,300 మెట్రిక్ టన్నులు నగదు చెల్లింపులు : రూ.6.48కోట్లు రైతులు : 328మంది -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 14 పరీక్షల కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు 13నుంచి 20వ వరకు నిర్వహించనున్నారు. 5316 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం 3649 మంది, ద్వితీయ సంవత్సరం 1667 మంది పరీక్ష రాయనున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఐఈవో అంజయ్య మంగళవారం సందర్శించారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. -
‘మహాలక్ష్మి’.. పట్నం వెళ్లేదెట్ల..!
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తరచుగా నడిచే ఎక్స్‌ప్రెస్ బస్సులను కుదించడం వల్ల ప్రయాణం కష్టంగా మారింది. బస్సుల సంఖ్య తగ్గడంతో రద్దీ పెరిగి సీట్లు దొరకక చాలామంది నిల్చునే పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో గంటలపాటు వేచి చూడాల్సి వస్తోంది. బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత మహిళల సంఖ్య రెట్టింపైంది. బస్సుల సంఖ్యను మాత్రం తగ్గించడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. హైదరాబాద్‌కు రెండే బస్సులు మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత పల్లెవెలుగు(ఆర్డీనరీ), ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ముందు నాలుగు బస్సులు హైదరాబాద్‌కు నడిపేవారు. ఉదయం 4గంటలకు, సాయంత్రం 4.30, రాత్రి 7.30, 8.30గంటలకు బస్సుల రాకపోకలు సాగించాయి. పట్నం వెళ్లే ఏ బస్సులో చూసినా ప్రయాణికుల సంఖ్య రెట్టింపుగా ఉండేది. ఉదయం 4గంటల బస్సుకు సీట్ల కోసం మంచిర్యాల బస్‌స్టేషన్‌కు ప్రయాణికులు 3.30గంటలకు వచ్చేవారంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. లగ్జరీ, లహరీ బస్సుల కంటే ఈ బస్సుల్లోనే మహిళలు ప్రయాణించేవారు. ఇటీవల కాలంలో ఉదయం 4గంటలు, సాయంత్రం 4.30గంటలకు బస్సులను పూర్తిగా రద్దు చేసి రెండింటికి పరిమితం చేశారు. 200 కిలోమీటర్ల దూరానికి ఎక్స్‌ప్రెస్ బస్సులను రద్దు చేయాలనే ఆలోచనతో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే మిగతా బస్సులు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుబాటులోనే బస్సులు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు లగ్జరీ, లహరి, రాజధాని బస్సులు 38 నడుస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులను గ్రామీణ ప్రయాణికుల కోసం ఉపయోగిస్తున్నాం. గోదావరిఖని, కరీంనగర్ నుంచి ఎన్నో బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రెండు బస్సులు నడుస్తున్నాయి. – శ్రీనివాసులు, డీఎం, మంచిర్యాల ప్రయాణికులపై ప్రభావం మంచిర్యాల నుంచి హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గడంతో సమయం ఎక్కువ పడుతుంది. నేరుగా సర్వీసులు లేకపోవడం వల్ల గోదావరిఖని, కరీంనగర్‌కు వెళ్లి బస్సులు మారాల్సి రావడంతో ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు కష్టాలు ఎదురవుతున్నాయి. మంచిర్యాల నుంచి హైదరాబాద్ మార్గంలో బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఇదేం ‘పరీక్ష’!
భవిష్యత్‌లో డాక్టర్ కావాలనే ఎన్నో ఆశలతో నీట్ రాసిన విద్యార్థులపై ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది. పరీక్ష రద్దుతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండేళ్లు కష్టపడి పరీక్ష రాస్తే ఒక్కసారిగా రద్దు చేయడం మానసిక వేదనకు గురి చేస్తోందని వాపోయారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – మంచిర్యాలఅర్బన్/నిర్మల్రూరల్మానసిక ఒత్తిడి పెరుగుతుంది మళ్లీ నీట్ రాయమనడంతో మాపై మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. రెండేళ్లు కష్టపడి మొన్ననే పరీక్ష బాగా రాసాం. మార్కులు కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఒక్కసారిగా రద్దుచేసి మళ్లీ పరీక్ష రాయమంటే భయమేస్తోంది. హైదరాబాదులోని కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకున్నాం. మళ్లీ అక్కడికి వెళ్లి చదవాలంటే దూర భారంతోపాటు వ్యయప్రయాసలు పడాల్సిందే. ఒక రాష్ట్రంలో లీకై తే దేశ మొత్తం మంది విద్యార్థులను బలి చేయడం అన్యాయం. – మంగ్లారపు నక్షత్ర, నిర్మల్ రద్దుతో నిరాశ ఎంబీబీఎస్ సీటు సంపాదించుకోవాలని తల్లిదండ్రులు, నా కల. నేను రెండేళ్లుగా ఎంతో కష్టపడ్డాను. తీరా చూస్తే నీట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరంగా మారింది. నీట్ పేపర్ లీకేజీ కావడం అత్యంత బాధాకరం. ఇలాంటి చర్యల వల్ల మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. నీట్ పేపర్ లీకేజీ పునరావృతం కాకుండా చూడాలి. మళ్లీ పరీక్షలు రాయాలంటే కొంత మేర ఇబ్బందిగా చెప్పవచ్చు. – ప్రాణహిత, నీట్ విద్యార్థిని, మంచిర్యాలరాత్రింబవళ్లు కష్టపడ్డాను రెండేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టపడి చదివాను. తెల్ల కోటు వేసుకోవాలనే ఆశతో నీట్‌కు సిద్ధమయ్యాను. ఎన్టీఏ పరీక్ష రద్దుతో నిరాశ నెలకొంది. నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పడంతో ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యాను. తల్లిదండ్రులు కూడా ఇబ్బందికి గురయ్యారు. పేపర్ లీక్ అనేది బాధాకరం. మళ్లీ పరీక్ష రాయాలంటే ఎన్నో ఇబ్బందులుంటాయి. అంతా సంతోషంగా ఉంటామని అనుకున్నా నేపథ్యంలో పరీక్షలు రద్దుకావడం బాధాకరం. – నేహ అంజుం, నీట్ విద్యార్థిని మంచిర్యాల -
ఇద్దరు డ్రైవర్లపై కేసు
సిరికొండ: బొలెరో వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా కుంటగూడ, చింతగూడ గ్రామాలకు చెందిన ఒక్కో వాహనంలో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడ్డారు. డ్రైవర్లు పెందూర్ ఇంద్రు, కినక నాగోరావుపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గూడ్స్ వాహనంలో ప్రయాణికులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
గంజాయి కేసులో నలుగురు అరెస్టు
బెల్లంపల్లి: గంజాయి కేసులో నిందితులుగా ఉన్న నలుగురు యువకులను అరెస్టు చేసి డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో కె.శ్రీనివాసరావు తెలిపారు. గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న ఆరుగురు యువకులకు పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు. సదరు యువకులపై అనుమానం వచ్చి మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో నార్కోటిక్ పరీక్షలు చేయించగా ఎస్.కే జమీర్ (బెల్లంపల్లి బస్తీ), ఆర్ఎండీ తాజ్‌బాబా, ఎస్.కే.ఖలీం (వెజిటేబుల్ మార్కెట్ ఏరియా), తోట మణిదీప్ (65 డీప్ ఏరియా)కు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. సదరు యువకులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి డిఅడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. -
బాధితులకు న్యాయం అందించాలి
నస్పూర్: బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సత్వర న్యాయం అందేలా చూడాలని డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. మంగళవారం ఆయన సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌ను పరిశీలించి రిసిప్షన్, సీసీటీఎస్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును అడిగి తెలుకున్నారు. రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలు, పెండింగ్‌లో ఉన్న కేసుల రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎస్సై మేకల ప్రశాంత్ పాల్గొన్నారు. అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దు తాండూర్: పశువుల అక్రమ రవాణాకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. సోమవారం అర్ధరాత్రి మండలంలోని రేపల్లెవాడ శివారులో అంతర్జిల్లా చెక్‌పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీలను పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పశువుల అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. తాండూర్, బెల్లంపల్లి సీఐలు దేవయ్య, శ్రీనివాస్, తాండూర్ ఎస్సై ప్రసాద్‌రావు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో కూలీ మృతి
నార్నూర్: పెళ్లి వేడుక ముగిసి అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ప్రకృతి కన్నెర్ర జేసింది. ఒక్కసారిగా వీచిన సుడిగాలి కూలీ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నార్నూర్ మండల కేంద్రంలోని విజయ్‌నగర్ కాలనీలో మంగళవారం ఓ పెళ్లి (టీలా) వేడుక ఘనంగా జరిగింది. అమృత్ మోటే టెంట్‌హౌస్‌లో కూలీగా పనిచేస్తున్న మాలేపూర్ గ్రామానికి చెందిన భాగ్యవన్ నిఖిల్ (28) మరో నలుగురితో కలిసి మధ్యాహ్నం టెంట్ తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో భారీ సుడిగాలి వీయడంతో పైనున్న విద్యుత్ తీగలకు పైపు తాకడంతో షాక్‌కు గురైన నిఖిల్ కిందపడిపోయాడు. మరో కూలీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిఖిల్‌ను మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. -
ప్రమాదవశాత్తు నిప్పంటుకుని రైతు మృతి
లక్ష్మణచాంద: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని రైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల మేరకు కనకాపూర్‌కు చెందిన మంద గంగన్న (56) మంగళవారం ఉదయం తన చేనులోని మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న రైతు వరి పంట వ్యాపించాయి. దీంతో తన అన్న కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పి త్వరగా రమ్మన్నాడు. మంటలు ఎక్కువ కావడంతో భయాందోళన చెందిన రైతు ఆర్పివేసే క్రమంలో ఒడ్డుపై నుంచి జారి కిందపడడంతో నిప్పంటుకుని మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న అతని సోదరుని కుమారుడు జనార్దన్ పోలీసులకు సమాచారం అందించాడు. నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సై శ్రావణి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ముగిసిన గోల్ షాట్ బాల్ పోటీలు
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా (టి) శివారులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడురోజులుగా కొనసాగుతున్న గోల్ షాట్‌బాల్ జాతీయస్థాయి పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల్లో చాంపియన్‌గా బిహార్ జట్టు, రన్నరప్‌గా ఆంధ్రప్రదేశ్, తృతీయస్థానంలో మహారాష్ట్ర జట్టు నిలిచింది. విజేత జట్లకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు సాయిని రవికుమార్ మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం సాధన చేస్తూ జాతీయస్థాయిలో రాణించి దేశ ప్రతిష్టను నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కోశాధికారి రామ్ పర్వేశ్ కుమార్, ఉపాధ్యక్షులు సుధాకర్‌రావు, యోగేష్ పాటిల్, జాయింట్ సెక్రటరీలు కరుణాకరన్, దేవిప్రియ, బండ అనిల్, ఆదిత్య ఖందేష్కర్, డాక్టర్ రాహుల్ పుష్కర్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
నేతకానిగా మార్చాలని వినతి
వేమనపల్లి: తెలంగాణ రాష్ట్ర కుల గణన గెజిట్‌లో నేతానిగా ఉన్న గెజిట్‌ను నేతకానిగా మార్చాలని కోరుతూ తెలంగాణ నేతకాని మహర్ సేవా సంఘం నాయకులు మంగళవారం మంత్రి వివేక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పొరపాటుగా జరిగిన తప్పిదం తమ కులానికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఐకేపీలో ఎస్సీ కులానికి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నేతకాని మహర్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి సోదరి తిరుపతి, ఎన్ఎస్ఎఫ్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు మల్లేశ్ కొటారి, రాష్ట్ర నాయకులు విశ్వనాథ్, దాగం మల్లేశ్, తదితరులు ఉన్నారు. రైతు కూతురు డాక్టర్ నెన్నెల: మండలంలోని జెండావెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు ఏస్కూరి అంకయ్య కూతురు మంజూష మంగళవారం సూర్యాపేటలో ఎంబీబీఎస్ పట్టా తీసుకుంది. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి తనకు ఆసరాగా నిలిచేది విద్య ఒక్కటేనని గుర్తించి ఉన్నత విద్య లక్ష్యంగా కష్టపడి చదివి అనుకున్నది సాధించానని పేర్కొంది. మూడో తరగతి వరకు ఆదిల్‌పేట ఆదర్శ విద్యాలయంలో, 4 నుంచి పదోతరగతి వరకు మందమర్రి కార్మెల్ స్కూల్లో, ఇంటర్ గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో పూర్తి చేసింది. నీట్లో మంచి ర్యాంకు రావడంతో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. 70 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తానని మంజూష పేర్కొంది. మెడికల్ బోర్డు నిర్వహణకు యాజమాన్యం హామీనస్పూర్: గత కొన్ని నెలలుగా నిలిచి పోయిన మెడికల్ బోర్డును నెలలోగా నిర్వహిస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో గుర్తింపు సంఘం నాయకులతో డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పొట్రుతో జరిగిన సమావేశ వివరాలను వెల్లడించారు. కార్మికుల పలు పెండింగ్ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సొంతింటి పథకం, పెర్క్స్‌పై ట్యాక్స్ రద్దుపై స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి అమలు చేస్తామని, పెండింగ్‌లో ఉన్న 337 మందికి పైగా డిపెండెంట్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, గోల్డెన్ హ్యాండ్ షేక్, వీఆర్ఎస్ వంటివి అమలు చేయబోమని, తదితర సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిందన్నారు. సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య, తదితరులు పాల్గొన్నారు. -
‘తుడుందెబ్బ మహాసభ విజయవంతం చేయాలి’
ఆదిలాబాద్‌రూరల్: హనుమకొండలో ఈ నెల 17న నిర్వహించనున్న తుడుందెబ్బ ఐక్యత మహాసభ విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాం రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ కోరారు. మంగళవారం చించుఘాట్‌లో గ్రామ పటేల్ కుమ్ర రాజు, సార్మేడి ఆత్రం పరుశురాం అధ్యక్షతన గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభ కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని తుడుందెబ్బ ఉద్యమ శక్తులన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి ఆదివాసీ హక్కులను పోరాడి సాధించుకోవాలన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను వెంటనే తొలగించాలన్నారు. జీవో 49 శాశ్వతంగా రద్దు చేయాలని, ఫారెస్ట్ అధికారులు కోర్ ఏరియా, బఫర్ ఏరియా పేరుతో ఇందిరమ్మ ఇళ్లను అడ్డుకోవడం ఆపాలని, 1/59, 1/63, 1/70, పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పుస్నక్ భాస్కర్, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్క శేషారావు, తుడుందెబ్బ ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, నాయకులు వేడమ ముకుంద్‌రావు, మెస్రం తులసీరాం పటేల్, సెడ్మకి రాము పటేల్ పాల్గొన్నారు. -
బాల్య వివాహం అడ్డుకున్న అధికారులు
నెన్నెల: మండలంలోని గొల్లపల్లిలో ఈ నెల 13న జరగనున్న బాల్య వివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన ఓ బాలికకు ఆసిఫాబాద్ జిల్లా బూరుగూడకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. గ్రామస్తుల సమాచారం మేరకు ఐసీడీఎస్ సీడీపీవో స్వరూపారాణి, సూపర్వైజర్ సుజాత, డీటీ వెంకటేశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచన, చైల్డ్‌లైన్ సభ్యులు సౌజన్య పోలీసులతో కలిసి గ్రామానికి వెళ్లి బాలిక ఆధార్ కార్డు, భర్త్ సర్టిఫికేట్ , బోనోఫైడ్ను పరిశీలించారు. వయస్సు 15 ఏళ్లు ఉన్నట్లు తేలడంతో బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నతనంలో పెళ్లి చేస్తే జరిగే అనర్థాలు, చట్టాల గూర్చి వివరించారు. మైనర్లకు వివాహాలు చేస్తే తల్లిదండ్రులతో పాటు పెళ్లికి హాజరైన పెద్దలపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 18 ఏళ్లు దాటే వరకు పెళ్లి చేయమని తల్లిదండ్రులు అంగీకార పత్రం రాయించి ఇవ్వడంతో అధికారులు వెళ్లిపోయారు. -
ఆగిపో బాల్యమా..!
బాల్యం ఒక మధురానుభూతి. ఇక వేసవి సెలవులు వస్తే బాలల ఆనందానికి అవధులే ఉండవు. ఆటపాటలతో స్నేహితులతో ఆనందంగా గడుపుతున్నారు. కొందరు చిన్నారులు తమ అభిరుచులకు అనుగుణంగా వేసవి శిబిరాల్లో పెయింటింగ్, డ్యాన్స్, స్విమ్మింగ్ తదితర శిక్షణ పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు చెట్ల నీడలో క్రికెట్ వంటి ఆటలు ఆడుతున్నారు. మరికొందరు చెట్ల కొమ్మలకు చీరలు కట్టి ఊయల ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో చిన్నారుల సందడిని ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ కళాశాలల అభివృద్ధికి కృషిపెయింటింగ్ వేస్తున్న బాలుడుచెట్లనీడలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులుఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో రూ.4.50లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్‌ను ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. గతంలో కళాశాలకు వచ్చిన సమయంలో విద్యార్థులు, ప్రిన్సిపాల్ తాగునీటి సమస్య దృష్టికి తీసుకురాగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. విద్యా వారోత్సవాల సందర్భంగా కళాశాలలో యోగా, ధ్యానం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అతీఖ్ బేగం, యోగా గురువు తిరుపతి, లెక్చరర్లు, కౌన్సిలర్ పోచన్న తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నతంగా రాణించాలి తాంసి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భీంపూర్ కేజీబీవీలో రూ.2.30 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్,ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి,ఆత్మ చైర్మన్ నారాయణ, సర్పంచ్ రంజన, ఎంఈవో రాధాకృష్ణరెడ్డి, ఎస్వో రజిని, తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గోన గ్రామంలో ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహన్ని, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. సర్పంచ్ కమలాబాయి తదితరులు పాల్గొన్నారు. తాంసి మండలం కప్పర్ల జెడ్పీ పాఠశాలలో ఇటీవల పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపీ నగేశ్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి సన్మానించారు. అనంతరం పాఠశాలలో అదనపు గదులను ప్రారంభించారు. ఇందులో సర్పంచ్ అరుణ్, తహసీల్దార్ లక్ష్మి, హెచ్ఎం ఆనంద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఏడు గ్రామాల్లో అధికారుల సర్వే
ఇంద్రవెల్లి: హీరపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. అంతకు ముందు జీపీ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. అనంతరం ప్రజావాణిలో వచ్చిన 230 దరఖాస్తుల ఆధారంగా రైతుల పంటచేలలో సర్వే నిర్వహించారు. బోర్లు, బావులు, విద్యుత్ సౌకర్యం ఉన్న, లేని పంటచేలను గుర్తించారు. 35 మంది రైతుల పంటచేలలో బోర్లు, బావులతో పాటు విద్యుత్ సౌకర్యం ఉందని, 185 మంది రైతుల చేలకు విద్యుత్ సౌకర్యం, బోర్లు, బావులు లేవని నిర్ధారించారు. అర్హులైన రైతులకు సోలార్ పంప్ సెట్లు, బోరు బావులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాథోడ్ గణేశ్, విద్యుత్ శాఖ ఏఈ జాదవ్ రోహిదాస్, సర్పంచ్ తొడసం లక్ష్మీనాగోరావ్, పంచాయతీ కార్యదర్శి రజినీకాంత్, ఏఈవో సురేష్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
మారుమూల పల్లెలకు ఆర్టీసీ సేవలు
నేరడిగొండ: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో నియోజకవర్గంలోని పలు మారుమూల గ్రామాల కు నేటి నుంచి ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రా నున్నాయి. ఏళ్లుగా రవాణా సౌకర్యాల లేమితో ఇ బ్బందులు పడుతున్న ప్రజలు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించారు. ఉ న్నతాధికారులు, రవాణా శాఖ మంత్రి పొన్నంతో మాట్లాడి ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పి ంచేందుకు కృషి చేశారు. ఇచ్చోడ, సిరికొండ, తాంసి, సొనాల మండలాల్లోని మారుమూల ప్రాంతా లకు నేటి నుంచి ఆర్టీసీ బస్సులు నడవనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ప్రారంభం కానున్న బస్సు రూట్లు.. నేరడిగొండ–కుంటాల, నేరడిగొండ–బోథ్ (వయా వడూర్, దర్బాతాండ, ధన్నూర్, కుచులపూర్), సొనాల–వజ్జర్, ఆదిలాబాద్–బజార్హత్నూర్ (వ యా గుడిహత్నూర్, ముత్నూర్, దామాన్ గూడ, టెంబి, దేగామ, జాతర్ల), ఇచ్చోడ–సిరికొండ, ఇచ్చోడ–సిరిచెల్మ, ఇచ్చోడ–కోకస్మన్నూర్, ఇచ్చోడ–గుడిహత్నూర్ (వయా బజార్హత్నూర్, దేగా మ, ముత్నూర్), ఆదిలాబాద్–గిరిగావ్ (వయా సుంకిడి, కుచులపూర్), ఆదిలాబాద్–జామిడి (వయా బండల నాగపూర్, కప్పర్ల), ఆదిలాబాద్–గొల్లఘాట్, తాంసి గ్రామాలకు ఆర్టీసీ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. నిర్వాసితులకు నష్టపరిహారం నేరడిగొండ: మండలంలోని రాజురా గ్రామ ని ర్వాసితులకు నష్టపరిహారం కింద మంజూరైన రూ.19,78,116లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం అందజేశారు. తొమ్మిది మంది బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిర్వాసితులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఇందులోమాజీ ఎంపీపీ సజన్,ప్రతాప్ తదితరులున్నారు. -
పశువుల అక్రమ రవాణాపై నిఘా
జైపూర్: పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, సరిహద్దు భద్రత పటిష్టతపై మంచిర్యాల జిల్లా జైపూర్ అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం అంతర్రాష్ట్ర పోలీసు అధికారుల సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో పశువుల మార్కెట్లపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి అక్రమ ధాన్యం రవాణా, నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, రెవెన్యూశాఖలతో సమన్వయం చేసుకుని తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతరం సమాచార మార్పిడి కొనసాగాలని అన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకునేందుకు పోలీస్‌శాఖ అప్రమత్తంగా పని చేస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
త్వరలోనే కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు
రామకష్ణాపూర్: కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో అన్ని విభాగాలకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నో ఏళ్లుగా ఆర్కేపీ పట్టణంలో పార్టీ పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు జరుగలేదని తెలిపారు. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయిందని, రెండు మూడు రోజుల్లో అన్ని విభాగాలకు కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో బీఆర్ఎస్ నాయకులే కారణమని, హింసను ప్రోత్సహించినందునే పోలీసులు కేసులు నమోదు చేశారని అన్నారు. రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు ముంపు బాధిత రైతులకు రూ.33 కోట్లు నష్టపరిహారం అందించిన ఘనత మంత్రి వివేక్ వెంకటస్వామిదేనని తెలిపారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు నీలం శ్రీనివాస్‌గౌడ్, మల్లేష్, ప్రకాష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లగణన సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాలటౌన్: జనగణన 2027లో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం జనగణన ప్రారంభించగా, మంచిర్యాల నగరంలో జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల గణన ప్రక్రియను అధికారులు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్యుమరేటర్లకు కేటాయించిన ఇళ్ల జాబితా బ్లాక్‌లలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త వహించాలని, ప్రతీ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలని అన్నారు. భవిష్యత్ ప్రణాళికలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్, డీటీసీపీవో సంపత్, జనగణన అధికారులు హరిప్రసాద్, కృష్ణ, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. -
‘మున్నూరు కాపుల సంఖ్య తక్కువ చూపడం సరికాదు’
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరు కాపుల సంఖ్య తక్కువ చూపడం సరికాదని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇంచార్జీ ఇందూరి తిరుపతి అన్నారు. సోమవారం మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపులను ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ప్రకారం 13.80లక్షల వరకు ఉన్నట్లు చెబుతూ 3.9శాతంగా చూపించడం అన్యాయమని అన్నారు. జిల్లా ఇంచార్జీల పర్యవేక్షణలో తమ జనాభాను తామే లెక్కించుకుని సంఖ్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సంఘం జిల్లా కార్యదర్శులు చిట్ల సత్యనారాయణ, మిట్ట లక్ష్మణ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బోరిగం రాజారాం, నియోజకవర్గ అధ్యక్షుడు పల్లె భూమేశ్, మున్నూరు కాపు ట్రస్ట్ చైర్మన్ నల్ల శంకర్, గౌరవ అధ్యక్షుడు బొలిశెట్టి రాజలింగు, గొంగళ్ల శంకర్ పాల్గొన్నారు. -
‘బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలి’
మంచిర్యాలటౌన్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మైనర్ బాలికపై లైంగిక దాడి, అధికారం ఉందని ఆమైపెనే కేసుకు సంబంధం లేని నిర్మల్, కరీంనగర్లో కేసులు పెట్టడం దుర్మార్గమని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి కాపాడుతున్నారని, ఇటీవల సభలో ప్రధాని నరేంద్రమోదీ సీఎంను పార్టీలోకి ఆహ్వానించడమే నిదర్శనమని అన్నారు. కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్‌ను మంత్రి పదవి, బీజేపీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూసమస్యలు పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ పనుల బిల్లులు ఇప్పించాలని, పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తులు అందజేశారు. అధికారులు సమన్వయంతో దరఖాస్తులు పరిష్కరించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. బస్తాకు మూడు కిలోల కోత జైపూర్ మండలంలో ని ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తా కు మూడు కిలోల కోత విధిస్తూ తూకం వేస్తున్నా రు. దీంతో క్వింటాల్‌కు 8 కిలోల వరకు నష్టపోతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా కోతలు పెడుతూ రైతులను ముంచుతున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. – రైతులు, గ్రామం: కిష్టంపేట, మం: జైపూర్ -
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
రైతులకు ఇబ్బందులు కలుగకుండా స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. టెండర్ ధాన్యం మొత్తాన్ని 90రోజుల్లో చెల్లించేందుకు తగిన పూచీకత్తుతో ధాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. జిల్లాలో సరిపడా మిల్లులు అందుబాటులోకి వస్తే పొరుగు జిల్లాలకు పంపకుండా ఇక్కడి రైతుల ధాన్యాన్ని పూర్తిగా సేకరించే అవకాశం ఉంటుంది. – ఎర్ర చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ, జన్నారంగడువులోపు చెల్లిస్తాంటెండర్ ధాన్యం సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువులోపు మొత్తాన్ని చెల్లించేలా ప్రయత్నిస్తున్నాం. ఈ మేరకు యాసంగిలో కొనుగోళ్లకు రైతులకు ఇబ్బంది కలుగకుండా స్థానిక మిల్లులకు ధాన్యం కేటాయించాలి. – చిలువేరు శ్రీనివాస్, అదనపు కార్యదర్శి, జిల్లా మిల్లర్ల సంఘం -
● ఒక్కొక్కరికి ఒక్కో తీరు పరీక్ష ● ముగ్గురికి మూడు విధాలుగా ఫలితాలు ● మంచిర్యాల డిపోలో కార్మికుల ఆందోళన
ఆర్టీసీలో ‘బ్రీత్’ వివాదంమంచిర్యాలఅర్బన్: భద్రత దృష్ట్యా ఆర్టీసీలో నిర్వహిస్తున్న బ్రీత్ అనలైజర్ పరీక్ష వివాదాస్పదమైంది. ఒకరికి ఒకలా.. మరొకరికి మరోలా పరీక్షలు నిర్వహిస్తుండడం ఉద్యోగుల ఆందోళనకు దారితీసింది. మంచిర్యాల డిపోలో వారం రోజుల్లో ముగ్గురు కార్మికులకు పరీక్షలు నిర్వహించగా ఒక్కొక్కరికి ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం తెల్లవారుజామున కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. ఆల్కాహాల్ పరీక్షలో తమపై వివక్ష చూపారని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాయమల్లు తన కుటుంబ సభ్యులతో గేట్ ఎదుట బైఠాయించారు. ఆయనకు కార్మికులు సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు రోజు అద్దె బస్సు డ్రైవర్‌కు పరీక్షలు నిర్వహించగా మొదట, రెండోసారి మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో విధుల నుంచి పక్కనబెట్టారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో రాయమల్లు అనే కార్మికుడికి రీడింగ్‌లో నిర్ధేశించినదానికంటే ఎక్కువ వచ్చింది. రెండోసారి పరీక్షలు నిర్వహించకపోవడంపై తప్పుబట్టారు. ఇదే డిపోలో శనివారం రాత్రి విధులకు వచ్చిన ఓ ఉద్యోగి మద్యం తాగినట్లు నిర్ధారణ కావడం, రెండోసారి పరీక్షల్లో జీరో వచ్చినట్లు తేల్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుడు రెండోసారి కోరినప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయడం, వీడియో రికార్డు చేయాల్సి ఉంటుంది. రెండు నుంచి ఐదు నిమిషాల్లోపు పరీక్షలు ముగించాల్సి ఉంది. మొదటి పరీక్షలో వచ్చిన రీడింగ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా రెండోసారి పరీక్షల నిర్వహణలో నిబంధనలు పక్కనబెట్టడం చర్చనీయాంశంమైంది. డిపో స్థాయి అధికారికి కూడా ఆల్కాహాల్ పరీక్ష నిర్వహించిన ఉద్యోగి సమాచారం ఇవ్వలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పరీక్ష ఇలా.. ఆర్టీసీ సెక్యూరిటీ, విజిలెన్స్ విభాగం సంస్థలో కీలకమైంది. ప్రయాణికులు, ఉద్యోగుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ నుంచి ఉద్యోగుల పనితీరు పర్యవేక్షించడం, అక్రమాలు, తప్పులు గుర్తించడం బాధ్యత, డ్రైవర్లకు ఆల్కాహాల్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఉద్యోగి డ్యూటీకి వెళ్లే ముందు, అనుమానం వచ్చినప్పుడు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహిస్తారు. జీరో నుంచి 30 ఎంజీలోపు రీడింగ్ వచ్చిన వారికి మినహయింపు ఉంటుంది. ప్రతీ పరీక్షను రిజష్టర్‌లో నమోదు చేయాలి. తేదీ, సమయం, ఉద్యోగి పేరు, రీడింగ్ స్పష్టంగా ఉండాలి. అవసరమైతే డిజిటల్ రికార్డు, వీడియో తీయాలి. పాజిటివ్ వస్తే విధుల నుంచి తప్పిస్తారు. షోకాజ్ నోటీస్ ఇచ్చి నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు చేపడుతారు. రెండ్రోజుల్లో నిర్వహించిన మొదటిసారి పరీక్షల్లో ఇద్దరికి నిర్ధేశిత రీడింగ్ కంటే ఎక్కువ 50కుపైగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరికి రెండోసారి పరీక్షలు నిర్వహించకపోగా.. మరొకరికి మాత్రం ఐదు నిమిషాలు దాటిన తర్వాత నిర్వహించడం ఏమిటనేది అధికారులే తేల్చాల్సి ఉంది.తప్పిదమేదైనా ఉద్యోగిపై చర్యలేనా..?బ్రీత్ అనలైజర్ పరీక్షలు ప్రాథమిక పరీక్ష మాత్రమే. పరికరంలో సాంకేతిక లోపం వల్ల పొరపాట్లు జరిగే వీలుంటుంది. యంత్రాన్ని సమయానికి సరిచేయకపోతే తప్పు రీడింగ్ వస్తుందని చెబుతున్నారు. గాలి బలంగా, సరైన విధంగా ఊదకపోతే ఫలితం మారుతుంది. ముందుగా వాడిన మౌల్పీస్ వల్ల తప్పులు రావొచ్చు. సెన్సార్ సమస్యలు, బ్యాటరీ లోపంతో పరీక్షల్లో తేడా కనిపించవచ్చు. ఆర్టీసీలో బ్రీత్ అనలైజర్‌లో మద్యం తాగినట్లు నిరూపితమైతే కారణం ఏదైనా ఉద్యోగిపై చర్యలు తప్పడం లేదు. పరికరంలో తేడా ఉందా..? లేదా గమనించకుండా ఉద్యోగిపై వేటు పడుతుంది. ఒకసారి తప్పు.. రెండోసారి రైట్ వచ్చిందంటే లోపం ఉన్నట్లే కదా..? మిషన్ ఎందుకు పక్కనబెట్టడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మెడికల్ రిపోర్టు తర్వాతే తుది చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆర్టీసీలో అందుకు భిన్నంగా సాగుతోంది. బ్రీత్ అనలైజర్ పరీక్ష ఫైనల్ కాకుండా మెడికల్ టెస్ట్‌కు పంపించిన తర్వాతే చర్యలు చేపడితే బాగుంటుందని కార్మికులు కోరుతున్నారు. -
● బ్రీత్ అనలైజర్ లోపం, వివక్షపై ఆవేదన ● విధుల్లోకి తీసుకోవాలని కుటుంబంతో డ్రైవర్ బైఠాయింపు ● కార్మికుల సంఘీభావం ● సాయంత్రం వరకు డిపోకే పరిమితమైన బస్సులు
కార్మికుల ఆందోళనమంచిర్యాలఅర్బన్: బ్రీత్ అనలైజర్ పరికరంలో లోపాలు, వివక్ష చూపుతున్నారంటూ సోమవారం మంచిర్యాల డిపో కార్మికులు మెరుపు సమ్మె చేపట్టారు. మద్యం తాగకున్నా తాగినట్లు నిర్ధారించడాన్ని నిరసిస్తూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డ్రైవర్ తన కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులతో తెల్లవారుజామున డిపో గేటు ఎదుట బైఠాయించారు. 151 మంది డ్రైవర్లు, 199 మంది కండక్టర్లు సంఘీభావంగా విధులకు గైర్హాజరు కావడంతో 148 బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. డ్రైవర్ రాయమల్లుకు ఈ నెల 8న ఉదయం 7గంటలకు సెక్యూరిటీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా 57 వచ్చినట్లు నిర్ధారించారు. రెండోసారి పరీక్షలకు సెక్యూరిటీ నిరాకరించారని రాయమల్లు ఆరోపించారు. మరోసటి రోజు ఓ కార్మికుడికి పరీక్షలో 73 ఎంజీ రీడింగ్ వచ్చినా విధుల్లోకి తీసుకుని తనపై చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఆదివారం రాత్రి నైట్‌హాల్ట్ వెళ్లిన బస్సులన్నీ ధర్నాతో బస్టాండ్ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు బారులు తీరాయి. గోదావరిఖని, జగిత్యాల, ఇతర డిపోల బస్సులు బస్టాండ్‌కు రాకుండా ఐబీ చౌరస్తా నుంచి వెనుదిరిగాయి. పోలీసులు, ఆర్టీసీ అధికారులు సర్దిచెప్పినా ఆందోళన విరమించకపోవడంతో సీఐ ప్రమోద్‌రావు నేతృత్వంలో ఆందోళనకారులను తొలగించారు. రాయమల్లును పోలీసుస్టేషన్‌కు తరలించారు. మెరుపు సమ్మెతో డిపోకు దాదాపు రూ. 15లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. చర్చలు సఫలంతో బస్సుల రాకపోకలు.. డిపోలో ఉదయం 3.45 నుంచి నిలిచిపోయిన బస్సులు సాయంత్రం 5.45 గంటల తర్వాత రాకపోకలు సాగించాయి. ఆదిలాబాద్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం(ఓ) శ్రీహర్ష, డీఎం శ్రీనివాసులు జేఏసీ నేతలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సుల రాకపోకలు కొనసాగాయి. బ్రీత్ అనలైజర్ పరికరాన్ని పరీక్షకు పంపించి మిషన్ లోపం అని తేలితే కార్మికునిపై చర్యలు తీసుకోకుండా విధులకు పంపించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రిపోర్టు వచ్చే వరకు కార్మికునిపై ఎలాంటి చర్యలు ఉండవని అంగీకారం కుదరడంతో కార్మికులు విధులకు హాజరయ్యారు. -
ధాన్యం నిల్వలకు ఇబ్బందులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రభుత్వం వేలం వేసిన ధాన్యం(టెండర్ ప్యాడీ) బాకీ పడిన మిల్లర్లకు ఊరట కలుగుతోంది. 2022–23 రబీ ధాన్యాన్ని టెండర్ వేసినా సకాలంలో తరలించలేదు. ఈ ధాన్యం తిరిగి ఇవ్వలేదని మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు నిలిచిపోయాయి. ఇటీవల మంత్రివర్గ ఉప సంఘం ఆ ధాన్యానికి ఒక క్వింటాల్‌కు రూ.2236.81చొప్పున మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు చెల్లించాలని నిర్ణయించింది. ఒకవేళ మిల్లుల్లో ధాన్యం లేకపోతే మిస్సింగ్‌గా పరిగణిస్తూ, ఒక క్వింటాల్‌కు రూ.2441.90చొప్పున చెల్లించాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు జీవో విడుదల కాగా, జిల్లాలో ఏడుగురు మిల్లర్లకు ఊరట లభించింది. ఇప్పటికే రూ.కోటిలోపు బాకీ ఉన్న ముగ్గురు మిల్లర్లు ఆ మేరకు మొత్తాన్ని చెల్లించారు. మరో నలుగురు మిల్లర్లు తాజాగా ప్రభుత్వం ఇచ్చిన విలువ మేరకు మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం 90రోజుల గడువు ఇవ్వడంతో ఈ మేరకు ధాన్యం ఇస్తే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని చెబుతున్నారు. మిల్లులు పెరిగితే మేలు ఓ వైపు అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12మిల్లులకే అనుమతి ఇవ్వగా, వీటిలోనూ పూర్తి స్థాయిలో ధాన్యం రవాణా కావడం లేదు. యాసంగి ధాన్యం నిల్వలకు ఇబ్బందితోపాటు దిగుబడికి తగినంత నిల్వ సామర్థ్యం లేవు. ఏటేటా ధాన్యం దిగుబడి పెరుగుతోంది. ఈ సీజన్లో 2లక్షల మెట్రిక్ టన్నులకు పైనే వస్తుందనే అంచనా. జిల్లాలో మిల్లులు, గోదాం నిల్వలు పోను, మరో 60నుంచి 70మెట్రిక్ టన్నల ధాన్యానికి ఇబ్బందిగా మారింది. జిల్లా ధాన్యం 50వేల మెట్రిక్ టన్నులు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల మిల్లులకు పంపేందుకు అనుమతి ఉంది. దీంతో ఇక్కడి మిల్లులకు పని లేక మూతపడుతున్నాయి. తమకు ధాన్యం కేటాయిస్తే నిబంధనల మేరకు పని చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులకు మిల్ల ర్లు విన్నవిస్తున్నారు.జిల్లాలో మొత్తం రూ.108కోట్ల వరకు మిల్ల ర్లు ‘సీఎంఆర్’(కస్టం మిల్లింగ్ రైస్) బకాయిలు ఉండగా, ఇందులో టెండర్ ధాన్యం సంబంధించిన సుమారు రూ.20కోట్ల వరకు ఉంటాయి. మిగతావి సకాలంలో బియ్యం ఇవ్వని మిల్లులు ఉన్నాయి. 20పైగా మిల్లులపై ఆర్ఆర్(రెవెన్యూ రికవరీ) క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బాకీ మొత్తాన్ని 25శాతం జరిమానా, 12శాతం వడ్డీతో సహా చెల్లించాలంటూ ఆ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో జిల్లాలో సీఎంఆర్ మిల్లుల ట్యాగింగ్ తగ్గిపోయింది. కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని గోదాంలకు తరలిస్తున్నారు. అప్పటికీ నిల్వలకు సరిపోక ట్యాగింగ్ ఇవ్వని మిల్లులకు సైతం ధాన్యం పంపి తాత్కాలికంగా నిల్వ చేస్తున్నారు. -
ఇంటర్ ప్రవేశాలకు వేళాయె
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఇంటర్మీడియెట్ అడ్మిషన్లపై దృష్టి సారించింది. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మే 12నుంచి 31వరకు కాలేజీలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30తో మొదటి విడత అడ్మిషన్లు ముగియనున్నాయి. జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 97.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆయా కళాశాలల అధ్యాపకులు ఇదివరకే ఇంటింటా తిరిగి విద్యార్థుల నవివరాలు సేకరించి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ కళాశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రచారం చేశారు. జిల్లాలో 10 ప్రభుత్వ కళాశాలలు జిల్లాలో మంచిర్యాల, మందమర్రి, కాసిపేట, చెన్నూర్, బెల్లంపల్లి(బాలికలు), బెల్లంపల్లి, జైపూర్, జన్నారం, లక్సెట్టిపేట, లక్సెట్టిపేట(బాలురు)లో ప్రభుత్వ కళాశాలలున్నాయి. ఒక్కో సెక్షన్లో 44 మందినే చేర్చుకోవాలి. ఒక్కో కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్‌ల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తారు. రెండు మాధ్యమాల్లో కలిపి ఒక్కో గ్రూప్‌లో 88 సీట్ల చొప్పున మొత్తం 352 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. అదనపు సెక్షన్ ఏర్పాటు చేయాలంటే ముందుగా బోర్డు అనుమతి తప్పనిసరి. అడ్మిషన్లు పూర్తిగా ఎస్ఎస్సీ మార్కుల ఆధారంగా ఇవ్వాలని, ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల ఆధార్ నంబర్ తప్పనిసరిగా పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు అనుబంధిత(అఫిలియేటెడ్) కాలేజీల్లోనే అడ్మిషన్లు పొందాలని సూచించింది. నిబంధనలు పాటించాల్సిందే.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి. ప్రైవేట్ కళాశాలుల పునరుద్ధరణకు దరఖాస్తులు మాత్రమే అందించాయి. అన్ని అనుమతులు బోర్డు పరిశీలనలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న కళాశాలకు అఫిలియేషన్ అనుమతులు రెండు, మూడు రోజుల్లో మంజూరయ్యే అవకాశముంది. విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తింపు ఉందా.. లేదా.. అని చూసుకున్న తర్వాతే కళాశాలలో చేరాలి. – అంజయ్య, డీఐఈవో -
లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు గత ప్రభుత్వ హయాంలో 2023 మార్చి 17న లాటరీ ద్వారా 1600 మంది లబ్ధిదారుల్లో 330 మంది పేదలను ఎంపిక చేశామని, వారికే ఇవ్వాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు. డ్రా తీసే సమయంలో లబ్ధిదారులు కాకుండా ఇతరులు ఎవరిని కూడా జిల్లా కలెక్టర్ లోనికి అనుమతించలేదని, తనతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ఎవరూ లక్కీడ్రాలో పాల్గొనలేదని తెలిపారు. రెండున్నరేళ్ల నుంచి ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేదని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే మరోసారి లాటరీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయాలన్న ప్రతిపాదన చేయడం వల్ల గతంలో ఇళ్లను పొందిన లబ్ధిదారులకు అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. -
సమ్మర్ సెలవులు.. సృజనకు నెలవు
పీఎంశ్రీ బడుల్లో సమ్మర్ క్యాంపు షురూమంచిర్యాలఅర్బన్: జిల్లాలోని పీఎంశ్రీ సర్కారు పాఠశాలల్లో సోమవారం నుంచి సమ్మర్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుని వివిధ కార్యక్రమాల్లో రాణించేలా శిబిరంలో శిక్షణ ఇస్తారు. జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు విద్యతో పాటు సృజనాత్మకత, కళలు, క్రీడలు, జీవన నైపుణ్యాలు నేర్పిస్తారు. ఒక్కో పాఠశాలకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు రవాణా భత్యం ఇవ్వనున్నారు. ఆర్ట్ అండ్ క్రాప్ట్, యోగా, ధ్యానం, చెస్, డ్యాన్స్, ఇండోర్ గేమ్స్, గణితం, స్పోకెన్ ఇంగ్లిష్, సైన్స్ ప్రయోగాలతో పాటు పలు అంశాలపై తర్ఫీదు ఇవ్వనున్నారు. అట్టహాసంగా ప్రారంభం జిల్లా కేంద్రంలోని టీజీఎంఎస్‌లో సోమవారం సమ్మర్ క్యాంపు అట్టహాసంగా ప్రారంభమైంది. ఎంఈవో మాలవీదేవి శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగాతో పాటు కంప్యూటర్ బేసిక్ అంశాలపై ఇచ్చే శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ సత్తయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ బుచ్చన్న, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సైన్స్ సెంటర్లో 15 రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. విభిన్న రకాల్లో ఎక్స్పర్మెంట్స్ చేసి సైన్స్ విజ్ఞానంపై ప్రత్యేకమైన ఆసక్తి పెంచుకున్నారు. ఉపాధ్యాయులు, ట్రైనర్లు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించారు. సమ్మర్ క్యాంపులో కొత్త స్నేహితులను కలుసుకున్నారు. జట్టు భావన పెరిగింది. భవిష్యత్‌లో నూతన ఆవిష్కరణలు చేసి మంచి శాస్త్రవేత్తగా ఎదుగుతామన్న నమ్మకం వారిలో కలిగింది. సమ్మర్ సైన్స్ క్యాంపు ముగిసిన నేపథ్యంలో విద్యార్థులు నేర్చుకున్న అంశాలు వారి మాటల్లోనే.. – మంచిర్యాలఅర్బన్ -
హక్కులు సాధించిన చరిత్ర టీబీజీకేఎస్‌దే
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల హక్కులు సాధించిన చరిత్ర టీబీజీకేఎస్‌కు మాత్రమే ఉందని ఆ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సు రేందర్ రెడ్డి అన్నారు. సోమవారం శ్రీరాంపూర్ సీ హెచ్‌పీలో నిర్వహించిన బాయిబాట కార్యక్రమాని కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో పోయిన డిపెండెంట్ ఉద్యోగాలను తి రిగి ఇప్పించామన్నారు. క్వార్టర్లకు ఉచిత విద్యుత్, ఏసీ సౌకర్యం, ఇంటి నిర్మాణానికి వడ్డీలేని రుణం, తదితర హక్కులు సాధించామన్నారు. గత గుర్తింపు ఎన్నికల్లో కార్మికులకు అనేక హామీలు ఇచ్చి గెలిచిన సంఘాలు నేడు అమలు చేయకుండా మోసం చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా సీహెచ్‌పీకి చెందిన శ్రీనివాస్, కిరణ్, నూట శ్రీనివాస్, రాజ్‌కుమార్, ఆవునూరు శ్రీనివాస్, కుమ్మరి రాయలింగుతో పాటు పలువురు ఉద్యోగులు టీబీజీకేఎస్‌లో చేరగా వారికి కండువా కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేష్, పిట్ సెక్రెటరీ అందె రాజ్‌కుమార్, నాయకులు బుస్స రమేశ్, శ్రీనివాస చారి, కాసారపు లక్ష్మణ్, సంపత్, నరేష్, రమణారెడ్డి, అమరేందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ పల్లెలు మారేనా!
ఇంద్రవెల్లి: ఏళ్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆదివాసీ పల్లెల గతి మారనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మౌలిక వసతులు, రవాణా, విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డ ఆదివాసీల సమస్యలు త్వరలో పరిష్కారం కానున్నాయి. ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. ఈనెల 20 తర్వాత పర్యటించనున్నారు. ఆయన రాకతో హీరాపూర్ జీపీ పరిధిలోని ఏడు గ్రామాల అభివృద్ధి రూపురేఖలు మారుతాయని, వడగామ్ ప్రాజెక్టు మంజూరు చేస్తారని ఆదివాసీలు, ప్రజలు, రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, చే లల్లో సోలార్ పంపు సెట్లు, గ్రామాలకు రోడ్లు, హీరపూర్లో ఆరోగ్య సబ్ సెంటర్, పశు వైద్యశాఖ మంజూరవుతాయని ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శాఖలవారీగా అధికారులు సర్వే చేపట్టారు. రైతులు, కుటుంబాలు, జనాభా, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. అభివృద్ధి పనులు పూర్తిచేసి ముఖ్యమంత్రితో ప్రారంభించనున్నారు. వడగామ్ ప్రాజెక్టుపై గంపెడాశలు వడగామ్ ప్రాజెక్టు మంజూరుపై ఆదివాసీలు, ప్రజలు, రైతులు ఆశలు పెట్టుకున్నారు. 2005లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఈ ప్రాజెక్టుపై అధికారులతో ఏరియల్ సర్వే చేయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రానుండడంతో వడగామ్ ప్రాజెక్టు మంజూరు చేస్తారని గంపెడాశలు పెట్టుకున్నారు. అధికారంలో రాగానే వస్తానని.. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉన్న సమయంలో 2021 ఏప్రిల్ 20న హీరాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీలతో ప్రత్యేకంగా సమావేశమై వారితో భోజనం చేశారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం హోదాలో మరోసారి హీరాపూర్ గ్రామానికి వస్తానని వారికి మాటిచ్చారు. ఆ ప్రకారం ఏప్రిల్ 6న జిల్లా పర్యటనలో భాగంగా పిప్పిరి గ్రామంలో పర్యటించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్, మాజీ ఎంపీ సోయం బాపురావ్, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా అధికారులను పిలిచి..తాను మే నెలలో పర్యటిస్తానని చెప్పారు. అక్కడి సమస్యలపై గ్రామస్తులతో చర్చించి తనకు నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఖానాపూర్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ.. హీరాపూర్‌లో ఆదివాసీలతో సమావేశమయ్యారు. ఇటీవల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. ఐటీడీఏ పీవోతో హాజరై ఆదివాసీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 6న టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఈ గ్రామాన్ని సందర్శించి సోలార్ విద్యుత్ సరఫరాపై అధికారులతో చర్చించారు. ఐటీడీఏ ద్వారా రైతుల చేలల్లో వందశాతం సోలార్ పంపు సెట్లు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో హీరాపూర్ ఆవాస ఏడు గ్రామాల్లో రూపురేఖలు మారనున్నాయి. -
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
ఉట్నూర్‌రూరల్: గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వ చ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకో వాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధి కారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వి విధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నార్నూర్ మండలం జాండాకు చెందిన మడావి హను ఆర్థికసాయం అందించాలని, ఇంద్రవెల్లి మండలం వాల్గొండకు చెందిన కనక చందు బోర్వెల్ మంజూరు చేయాలని, ఇచ్చోడ మండలం నర్సాపూర్‌కు చెందిన శ్రీదేవి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చే యాలని, తిర్యాణి మండలం మార్కగూడకు చెందిన గోదావరి ఉపాధి కల్పించాలని అర్జీలు అందజేశారు. పీవో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. -
15న మెగా జాబ్‌మేళా
కై లాస్‌నగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 15న ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా భారీ మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంఽధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ పీవో సహకారంతో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేళాలో టెక్ మహీంద్రా, హెటెరో, అపోలో ఫార్మసీ, ముత్తూట్ ఫైనా న్స్, స్టార్టెక్ వంటి సుమారు 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఫార్మసీ విభాగాల్లో వందలాది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులని, ఆసక్తి గలవారు 15న ఉదయం 10 గంటలకు విద్యార్హత ధ్రు వీకరణ పత్రాలతో ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9989717139, 9494559027, 9553141962 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఆర్జీయూకేటీలో డిజిటల్ విప్లవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ సోమవారం డిజిటల్ తరగతి గదులు ప్రారంభించారు. స్మార్ట్ బోధనా వనరులు, హైక్వాలిటీ ఆడియో విజువల్ వ్యవస్థ, సమగ్ర డిజిటల్ మౌలిక వసతులతో తరగతి గదులను రూపొందించారు. ఒకేసారి సుమారు 300 మంది విద్యార్థులు లైవ్ తరగతుల్లో పాల్గొనే విధంగా వీటిని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా బోధనా విధానాల్లో మార్పులు తీసుకురావడం అత్యవసరమన్నారు. కార్యక్రమంలో భాగంగా బోధన, బోధనేతర సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధి, సాంకేతిక ఆధారిత విద్యా విధానాల అమలు, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతుల కల్పన దిశగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించవద్దు
నిర్మల్‌టౌన్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించవద్దని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీ చేసే విత్తనాలు నాణ్యమైనవన్నారు. ధర తక్కువగా ఉండడంతో పాటు దిగుబడి కూడా అధికంగా ఉంటుందన్నారు. అనుమతులు లేని ప్రైవేట్ విత్తన కంపెనీలు రైతులను ప్రలోభాలకు గురిచేస్తూ, నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్నాయన్నారు. సహకార, మహిళా సంఘాలు విత్తన సంస్థ యొక్క విత్తనాలు రైతులకు అందించాలని సూచించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ విత్తనాభివృద్ధి సంస్థ తయారుచేసే విత్తనాలు నాణ్యత పరీక్షల తర్వాత విపణిలోకి వస్తాయన్నారు. ఈ విత్తనాలు సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందుతారన్నారు. రైతులు ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు వినియోగించేలా డీలర్లు ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ వ్యవసాయ శాఖ అధికారులు అంజిప్రసాద్, శ్రీధర్, డీఆర్డీవో విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్లు భీమ్‌రెడ్డి, అబ్దుల్ హాది, ఆత్మ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, ఇతర అధికారులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు. -
శరీరం గొప్పతనం తెలుసుకున్నా..
మానవ శరీర అవయవాల పనితీరు గురించి మేక ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీసుకువచ్చి ప్రత్యక్షంగా చూపించారు. మానవుని అవయవాలు ఈవిధంగా ఉంటాయని తెలుసుకున్నాం. గుండెలో ఉండే గదులు, రక్తం పంపింగ్ చేసే విధానాన్ని ఉపాధ్యాయుడు నాగవర్మ చూపించారు. మూత్రం ఫిల్టర్ ఎలా అవుతుందో తెలిసి పోయింది. మానవ శరీరం గొప్పతనం తెలుసుకున్నాం. – ఎం.అనీష్, పదోతరగతి, మంచిర్యాల కిరణ చిత్రాలు గీయించారు ముందు తరగతుల్లో సై న్స్ నేర్చుకునేలా తర్ఫీదు ఇచ్చారు. సమతల దర్ప ణం, గోళాకార దర్పణా లను ఉపయోగించి కాంతి ధర్మాలైన పరావర్తనా న్ని వక్రీభవనాన్ని వివరించారు. మాతో కిరణ చిత్రాలు గీయించారు. ప్రతిబింబాలు ఎలా ఏర్పడుతాయో ప్రయోగపూర్వకంగా చూశాం. వక్రీభవన గుణకం వల్ల కొన్ని వస్తువులు ఒకదాంట్లో మరొకటి ముంచినప్పుడు కనిపించక పోవటానికి కారణం తెలుసుకున్నా. – యోగేశ్వర్, దోనబండ జెడ్పీహెచ్ఎస్ -
పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
బెల్లంపల్లి: పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష కోసం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్, బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవేందర్ సోమవారం సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, గంట ముందుగానే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలన్నారు. నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వివరాలు బెల్లంపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, బజారు ఏరియా బ్రాంచ్ హైస్కూల్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,171 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 619 మంది బాలురు, 552 మంది బాలికలు ఉన్నారు. మంచిర్యాలలో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జెడ్పీ హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సాయికుంట), జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గర్మిళ్ల), శ్రీ చైతన్య హైస్కూల్, అల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్ కేంద్రాల్లో 2,364 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో బాలురు 1,257 మంది, బాలికలు 1,107 మంది ఉన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల (బెండారా)ఆసిఫాబాద్, మాతృశ్రీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,064 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. -
ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం
మూఢ నమ్మకాల వెనుక ఉన్న నిజాలను సైన్స్ ద్వారా తెలుసుకున్నా. వాటిని నమ్మకుండా శాసీ్త్రయ దృక్పధంతో ఆలోచించడం అవసరమని తెలుసుకున్నా. బ్యాటరీ తీగను ఉపయోగించి మాతో మోటర్ తయారు చేయించారు. అది తిరిగినప్పుడు మా ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. బల్పులను శ్రేణిలో సమాంతరంగా ఎలా కలుపుతారో నేర్పించారు.– కె.స్రవంతి, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్, మంచిర్యాల సైన్స్ సూత్రం తెలుసుకున్నా ఫన్ ఆక్టివిటీస్‌తో పాటు రసాయన చర్యల రకాలు వివరించారు. ఆమ్లాలు, క్షారాలు ఏవిధంగా గుర్తించాలో నేర్చుకున్నా. సాంద్రత అనేది వస్తువు నీటిలో మునగటానికి కారణమని గుర్తించా. ఫన్ ఆక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆనందం వేసింది. స్వాములు, బాబాలు చేసే మ్యాజిక్ వెనుక ఉన్న సైన్స్ సూత్రం తెలుసుకున్నా. అవి మంత్రాలు, తంత్రాలు కాదని, వాటిని నమ్మకూడదని సైన్స్ శిబిరం ద్వారా తెలుసుకున్నా. –మణికార్తీక, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్, మంచిర్యాల -
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
తానూరు: మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన సావంత్ దేవానంద్ (35) అనే యువకుడు మద్యానికి బానిసై తన వ్యవసాయ చేనులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. సావంత్ దేవానంద్ గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసై పనులు చేయకుండా తిరుగుతున్నాడు. ఈనెల 8న తల్లిదండ్రులు, భార్య ఏదైనా పని చేయాలనడంతో వారితో గొడవ పడ్డాడు. అనంతరం భార్య మీరా, ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు గంగాబాయి –రావుసాబ్లు బంధువుల గ్రామం ముధోల్‌కు వెళ్లారు. మనస్తాపం చెందిన దేవానంద్ ఆదివారం చేనుకు వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై షేక్ జుబేర్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య మీరా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘జనగణనలో ఓబీసీల కాలమ్ చేర్చాలి’
పాతమంచిర్యాల: జనగణనలో ఓబీసీల కాలమ్ చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నాయకులు ఆదివారం జిల్లా కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓబీసీల కులగణన చేపట్టాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదా రు, మాజీ ఎంపీ హన్మంతరావు చేపట్టిన ఆమరణ నిరాహర దీక్షకు మద్దతు తెలిపారు. ఓబీసీల లెక్కలు లేని జనగణనతో ప్రయోజనం లేదని, జనగణనలో బీసీల సమగ్ర కుల గణన చేపట్టకపోవడం వలన దేశంలోని 80 కోట్ల మంది బీసీలు అర్థికంగా, సామాజికంగా రాజ్యాధికారంలో వాటాలకు నోచుకోలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గజెళ్లి వెంకటయ్య, జి.లక్ష్మణ్, శ్రీనివాస్, రాజేశం, నారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో దూకి యువకుడు..
బాసర: తాగుడుకు బానిసైన యువకుడు ఆది వారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘ టన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. మైలాపూర్ గ్రామానికి చెందిన సంగం రాజు (18) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది, గ్రామ సమీపంలోని చె రువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ కిరణ్ వెంటనే సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి సంగం పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
సాహస కృత్యాల్లో అడవి బిడ్డ
చిన్నప్పటి నుంచి ఆటల్లో ఉన్న మక్కువ అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. వివిధ రకాల పతకాలు సాధించడంతో పాటు అడ్వెంచర్ క్లబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచింది. వాటర్ ర్యాప్లింగ్ పోటీల్లో తనదైన ముద్రవేసి ఆదివాసీ మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కెరమెరి మండలం భీమన్‌గోంది గ్రామానికి చెందిన కన్నిబాయి. నేడు వాటర్ ర్యాప్లింగ్ దినోత్సవం సందర్భంగా కథనం.. – కెరమెరి కెరమెరి మండలంలోని భీమన్‌గోంది గ్రామానికి చెందిన మడావి భీంబాయి –జైతుల కూతురు కన్నిబాయి 1 నుంచి 10వ తరగతి వరకు ఆసిఫాబాద్‌లోని ఎస్టీ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసించింది. వాటర్ ర్యాప్లింగ్ పోటీల్లో పాల్గొంటూ ఎన్నో ఘనతలు సాధించింది. దీంతో ఆమెను అడ్వెంచర్ బ్రాండ్ అంబాసిడర్‌గా డబ్ల్యూఆర్‌డబ్ల్యూవోసీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ రంగారావు నియమించారు. కన్నిబాయి సాధించిన ఘనతలు.. జలపాతాలను రక్షిస్తూ.. వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ వరల్డ్‌కప్ ఆర్గనైజింగ్ కమిటీ (డబ్ల్యూఆర్‌డబ్ల్యూవోసీ) ప్రపంచంలో గల జలపాతాలను రక్షిస్తూ సాహస కృత్యాలకు అనుకూలంగా వాటిని మార్చే చర్యలు చేపడుతోంది. జలపాతాలను సర్వే చేయడం, జలపాతాల ఆవశ్యకత, ప్రాధాన్యతలను విద్యార్థులకు, యువతకు వివరించడం, జలపాతాలను ధ్రువీకరించడం, ట్రయల్ రన్ నిర్వహించడం, బ్రాండింగ్ చేయడం, జలపాతాల్లో ర్యాప్లింగ్ పోటీలు నిర్వహించడం వంటి పనులు చేస్తుంది. ఇప్పటి వరకు 100 జలపాతాలు సర్వే చేయగా అందులో 60 వరకు జలపాతాలు వాటర్ ర్యాప్లింగ్‌కు అనుకూలంగా ఉన్నాయని డబ్ల్యూఆర్‌డబ్ల్యూవోసీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ రంగారావు తెలిపారు. -
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని రాజీవ్‌నగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు మాత్రమే పంపిణీ చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఆదివారం అధికారులతో కలిసి ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడామన్నారు. ఇందిరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లపై ఉమ్మడి జిల్లా సమావేశంలో మంచిర్యాల నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల పరిస్థితిపై వివరించామన్నారు. మంత్రి స్పందించి మౌలిక వసతుల కల్పనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మూడు నెలల తరువాత లక్కీ డ్రా పద్ధతిలో అర్హులకు డబుల్ బెడ్రూంలు ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అర్హుల నుంచి ఎవరైనా డబ్బులు తీసుకుంటే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, తదితరులు పాల్గొన్నారు. -
స్కూటీపై నుంచి పడి ఒకరి మృతి
లక్సెట్టిపేట: స్కూటీపై నుంచి కిందపడి ఒకరు మృతి చెందిన ఘటన లక్సెట్టిపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. పట్టణంలోని బాబురావు వాడకు చెందిన జగటాల కమల్(39) ప్రతీరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానానికి ఎలక్ట్రిక్ స్కూటీపై వచ్చి వాకింగ్ చేసి, తిరిగి ఇంటికి వెళ్లేవాడు. రోజు మాదిరిగానే ఆదివారం వాకింగ్ పూర్తిచేసుకుని స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయాడు. ప్రమాదంలో అతని తలకు గాయాలు కాగా స్థానికులు గమనించి వెంటనే లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య అర్చన ఫిర్యాదు మేరకు ఏఎస్సై అన్వర్ కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. ఆటో బోల్తా పడి మరొకరు..కడెం: మండలంలోని ఉడుంపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన కథనం ప్రకారం.. లక్సెట్టిపేట్‌కు చెందిన హన్మండ్ల కొమురయ్య (68) కడెంలో తన కూతురు ఇంటికి వెళ్లి, శనివారం ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి సిరికొండ మండలం వాయిపేట్ మహంకాళీ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఉడుంపూర్ సమీపంలో గండి పోచమ్మ ఆలయం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కొమురయ్యను లక్సెట్టిపేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆటోలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారులున్నారు. కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బావిలో పడి ఒకరు..దస్తురాబాద్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని గోడిసీర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి భార్య అంజలి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోడిసీర్యాల గ్రామానికి చెందిన పోడెటి మహేందర్ (31)కు కొద్ది రోజుల నుంచి మతి స్థిమితం సరిగా లేదు. ఈ నెల 9న ఇంటి నుంచి బయలు దేరి వెళ్లిన ఆయన రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఓ వ్యవసాయ బావిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. గుండెపోటుతో ఒకరు.. కడెం: మండలంలోని పెద్దూర్‌కు చెందిన తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట్ల క్రాంతికుమార్ యాదవ్ (42) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. -
బయట ఎండలు.. ఇంట్లోనే ఆటలు
భలే భలే.. బొమ్మ ట్రాక్టర్ బొమ్మట్రాక్టర్తో ఆడుతున్న బాలుడు బండాట ఆడుతున్న చిన్నారులుదండేపల్లి: వేసవిలో ఎండను సైతం లెక్కచేయకుండా చిన్నారులు ఆటలు ఆడుతుంటారు. పెద్దలు ఇళ్లల్లో చేసే పనులను అనుకరించి ఆటలు ఆడుతుంటారు. వంటింట్లో చేసే పనులను పిల్లలు దండేపల్లి ఇంటి ఆవరణలో అన్నం, కూర ఆట ఆడుతుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. చెన్నూర్: వేసవికాలం వచ్చిందంటే చాలు చిన్నారులు ఆటల్లో నిమగ్నమవుతారు. నలుగురు పిల్లలు ఒకేచోట చేరితే వారికి నచ్చిన ఆటలు ఆడుతూ ఆనందిస్తుంటారు. చిన్న మట్టికుండ ఆకారం ఉండే గురిగేలో మట్టి పోసి మరో డబ్బాతో మట్టి కొలిచే ఆట ఆడుతున్నారు. దీన్నే మట్టిలో గురిగే అంటారు. చెన్నూర్‌లోని బట్టిగూడెం కాలనీలో చిన్నారులు ఈ ఆట ఆడుతూ కనిపించారు. బండాటమట్టిలో గురిగే ఆటలుచెన్నూర్రూరల్: వేసవి సెలవుల్లో చిన్నారులు ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. మరికొందరు చెట్లనీడన, ఇంటి పట్టున బండాట ఆడుతున్నారు. చెన్నూర్ మండలం శివలింగాపూర్ వద్ద ఇద్దరు చిన్నారులు ఒక పెట్టెకు తాడు కట్టి ఒకరు అందులో కూర్చోగా మరొకరు తాడుతో లాగుతూ ఆడుకుంటున్నారు.దండేపల్లి: వేసవి వచ్చిందంటే చాలు..పిల్లల లోకమే వేరు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఇంటి ఆవరణలే వా రికి ఆటస్థలాలు. దండేపల్లిలోని ఓ వీధిలో బాలుడు బొ మ్మ ట్రాక్టర్‌కు తాడు కట్టి అటు, ఇటు నడిపిస్తూ ఆడుకుంటూ కనిపించాడు. పెద్ద ట్రాక్టర్లతో చేసే పనులను పి ల్లలు తమ ఆటల్లో అనుకరిస్తూ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.అన్నం, కూర ఆట.. ఎండలు మండిపోతుండటంతో మైదానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలు నీడపట్టున ఉండి ఆటలు ఆడుతున్నారు. ఇంట్లో ఆడుకునే క్యారం, చెస్, అష్టాచెమ్మా తదితర ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఎండ సమయంలో ఇంట్లోనే ఆడుతూ, ఇంటినే ఒక స్టేడియంలా మార్చేస్తున్నారు. సెల్ ఫోన్లకు దూరంగా, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడుతున్న ఈ ఆటలు చిన్నారుల మేధస్సుకు పదును పెట్టడమే కాకుండా, ఎండలో తిరగకుండా వారిని నివారిస్తున్నాయి. – దండేపల్లి -
గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్
నార్నూర్: మండలంలోని మల్లంగి ఎస్సీగూడ గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్సై ఎస్. శ్రీసాయి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చలక్కర్ జయరాం తన ఇంటి పెరట్లో గంజాయి సాగు చేస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో 5 గంజాయి మొక్కలతో పాటు 700 గ్రాముల ఎండిన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 50 గంజాయి కేసులు నమోదు చేసినట్లు పో లీసులు వెల్లడించారు. 15 కిలోల ఎండు గంజా యి, 638 గంజాయి మొక్కలను స్వాధీనం చే సుకున్నామని, 103 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.67 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. -
చెన్నూర్ సమస్యలు పట్టించుకోని మంత్రి
రామకృష్ణాపూర్: చెన్నూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను మంత్రి వివేక్ వెంకటస్వామి పూర్తిగా గాలికి వదిలేశారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. బెయిల్ షరతుల మేరకు ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ మంత్రి, అధికారులు స్పందించటం లేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన తండ్రి కోవిడ్ సమయంలో వెంటిలేటర్‌పై ఉన్నప్పటికీ కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించి ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న వివేక్ జిల్లా రైతుల సమస్యలను పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. అకాల వర్షాలకు మామిడి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారన్నారు. ఇప్పటికై నా మంత్రి, అధికారులు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్థ్పై పోక్సో కేసు నమోదై 36 గంటలు దాటినా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే గనుక ఏ ఒక్క కాంగ్రెస్ అగ్రనాయకులు ఈ కేసు విషయమై మాట్లాడడం లేదన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి, నాయకులు మూల రాజిరెడ్డి, సుదర్శన్‌గౌడ్, మేడిపెల్లి సంపత్, తదితరులు ఉన్నారు. -
‘రాష్ట్ర మహాసభ విజయవంతం చేయాలి’
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలో ఈ నెల 15, 16 తేదీలలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వర్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైతాంగం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని వాణిజ్య, కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు అప్పగించేందుకు రైతు చట్టాలు తీసుకువచ్చిందన్నారు. రైతులు తిప్పికొట్టడంతో దొడ్డిదారిన అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహాసభలో రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, కార్యదర్శి వెంకన్న, సహాయ కార్యదర్శి లాల్‌కుమార్, ఉపాధ్యక్షుడు రాజు, నాయకులు రత్నం తిరుపతి, దొండ ప్రభాకర్, రమేశ్, రాజేశ్, కిష్టన్న, తదితరులు పాల్గొన్నారు. -
సరిపడా లారీలు పంపండి..
దండేపల్లి: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలను వెంటనే పంపించాలని ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌తో పాటు, రవాణా శాఖ అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. దండేపల్లి మండలంలోని పలు వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను డీఆర్డీవో కిషన్‌తో కలిసి ఆదివారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు, పలువురు రైతులు లారీల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే ఆయన లారీ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్, రవాణాశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. లారీలు ఎన్ని ఉంటే అన్ని పంపాలని, ఒకవేళ అందుబాటులో లేకుంటే రోడ్ల వెంట ఖాళీగా వెళ్తున్న వాటిని ఆపి, కొనుగోలు కేంద్రాలకు పంపించాలన్నారు. అకాల వర్షాలు కురిస్తే బస్తాలు తడిసిపోయేలా ఉన్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమస్యలుంటే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీవో జాగర్లమూడి ప్రసాద్, ఎంపీవో కే.వీ ప్రసాద్, ఐకేపీ సిబ్బంది ఉన్నారు. -
అమ్మప్రేమ అమృతం కన్నా గొప్పది
పాతమంచిర్యాల: అమ్మ ప్రేమ అమృతం కన్నా గొప్పదని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి వి.మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో మదర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులను సన్మానించి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన వారిని శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్ సల్ల రమ్య, మాతృమూర్తులు జ్యోత్స్న చంద్రదత్, మణిమాల, మంజుల కృష్ణారావు, సుమన చైతన్య, మంచిర్యాల మహిళా తరంగిణి అధ్యక్షురాలు చంద్రకళ, లీల, సరిత ఓజా, ఆశ్రమ నిర్వాహకులు సుధారెడ్డి, లయన్స్‌క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


