పశువుల కొట్టం దగ్ధం | - | Sakshi
Sakshi News home page

పశువుల కొట్టం దగ్ధం

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

● ఏడు మేకలు సజీవ దహనం

● ఏడు మేకలు సజీవ దహనం

సిరికొండ: మండలంలోని పోన్న గ్రామానికి చెందిన చౌహాన్‌ సంభాజీ పశువుల కొట్టం శుక్రవారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. కొట్టంలోని మూడు పెద్ద మేకలు, నాలుగు చిన్న మేకలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఇచ్చోడ నుంచి అగ్ని మాపక యంత్రంతో వచ్చిన సిబ్బంది మంట లు అదుపులోకి తెచ్చారు. తహసీల్దార్‌ తుకా రాం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా రు. అధికారులు పంచనామా నిర్వహించారు.

ఇసుక టిప్పర్‌ పట్టివేత

ముధోల్‌: మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రో ల్‌ బంక్‌ సమీపంలో ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం పో లీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను పరిశీలించగా వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవు. దీంతో టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మహిళను కాపాడిన పోలీసులు

భైంసాటౌన్‌: భర్తతో గొడవపడి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను పోలీసులు రక్షించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కుంటాల మండలం లింబా(పెద్ద) గ్రామానికి చెందిన తోత్రే మీరాబాయి భర్త బాలాజీతో గొడవపడి శుక్రవారం సాయంత్రం పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌ వద్దకు చేరుకుంది. నీటిలో దిగి ఆత్మహత్యకు యత్నిస్తుండగా గమనించిన స్థానికులు అడ్డుకుని ‘డయల్‌ 100’కు కాల్‌ చేసి విషయం తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కౌన్సిలింగ్‌ అనంతరం ఆమెను కుటుంబీకులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement