breaking news
Mancherial District Latest News
-
ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
కోటపల్లి: ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ అన్నారు. శనివారం సుపాక గ్రామంలో ప్రపంచ అదివాసీ దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివాసీల సభలో ఆయన మాట్లాడారు. అటవీ హక్కుల చట్టాలను తుంగలో తొక్కుతూ అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి 2023నూతన అటవీ సంరక్షణ చట్టం తీసుకవవచ్చారని అన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, నాయకులు నెర్పల్లి ఆశోక్, తలండి ముత్తయ్య, మడే వెంకటస్వామి, మల్లేశ్, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు సంకే రవి, కిసాన్‌మిత్ర జిల్లా కో అర్డినేటర్ సిడం రమేశ్, మత్య్సకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చందు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ తిరుపతి పాల్గొన్నారు. -
గిరిజనేతరుల చేతిలో వేల ఎకరాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీ భూములు సా గు చేస్తున్న వేలాది గిరిజనేతరులు తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బీసీ, ఎస్సీలు అటవీ భూముల ఆధారంగానే జీవి స్తూ సాగు చేసుకుంటున్నారు. గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్(అటవీ హక్కుల గుర్తింపు) కింద పట్టాలు ఇచ్చారు. కానీ గిరిజనేతరులకు అవకాశం లేదు. దీంతో ఏటా సీజన్లో ఆ భూముల్లో విత్తనాలు వేసే సమయంలో ఆక్రమణదారులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల తిరిగి స్వాధీనం చేసుకుని మొక్కలు నాటుతున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులను అటవీ అధికారులు సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు పాదయాత్ర చేపట్టగా, మధ్యలోనే పోలీసులు అడ్డుకుని తీసుకొచ్చారు. బీసీ, ఎస్సీలు అధికం అటవీ భూములను గిరిజనులతోపాటు బీసీ, ఎస్సీ ఇతర వర్గాలు వేలాది మంది సాగు చేస్తున్నారు. వీరికి సైతం పట్టాలు ఇవ్వాలని డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం పక్కన పెట్టింది. మూడేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 1.50లక్షల మంది గిరిజన రైతులకు 4.05లక్షల ఎకరాల్లో హక్కులు కల్పించారు. చట్టం ప్రకారం గిరిజనులకు మాత్రమే హక్కులు ఉన్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాల్లోనూ గిరిజనేతరులు సాగులో ఉన్నారు. రిజర్వు ఫారెస్టుతోపాటు పులుల సంరక్షణ కేంద్రమైన కవ్వాల్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా 1.29లక్షల ఎకరాలు ఆక్రమణలో ఉంది. గిరిజనేతరులతోపాటు కొన్ని చోట్ల గిరిజనులు సైతం కొత్తగా ఆక్రమణలకు పాల్పడుతుండడంతో అడవుల సంరక్షణ మరింత ఇబ్బందిగా మారిందని అధికారులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే.. నిజాం కాలం నుంచే అటవీ ఆక్రమణలు ఉన్నప్పటికీ గత 20ఏళ్లలో ఈ ఆక్రమణలు తీవ్రంగా పెరిగాయి. పత్తి సాగు మొదలైనప్పటి నుంచి గిరిజనులతోపాటు గిరిజనేతరులు సైతం పెద్ద ఎత్తున చెట్లను నరికి సాగులోకి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది సిబ్బంది అవినీతితో ఇష్టారీతిన ఆక్రమణలు జరిగాయి. మరికొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం, తదితర కారణాలతోనూ రిజర్వు ఫారెస్టుల్లో సాగు మొదలైంది. ఆ భూములే తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే సామాజిక సమస్యగా మారింది. దిందాలో ఒక్కొక్కొరు 40ఎకరాల వరకు.. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బందెపల్లి, దిందాలో పరిధిలో ఒక్కో కుటుంబం ఎకరం నుంచి 42ఎకరాల వరకు ఆక్రమించారు. ఇందులో పది నుంచి 30ఎకరాల వరకు సాగులో ఉన్నారు. ఇక్కడ 530ఎకరాల్లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారు. రిజర్వు ఫారెస్టులో 2600ఎకరాలు ఆక్రమణలో ఉంది. అయితే 600ఎకరాలను సాగుదారులకు వదిలేశారు. మిగతాది గిరిజనేతరుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా వివాదం రాజుకుంటోంది. -
ప్రజలు ఆందోళన చెందవద్దు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. శని వారం గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రాజెక్ట్ అధికారులతో కలిసి సందర్శించారు. వరదలు, వర్షాలకు సంబంధించి అత్యవసర సేవలకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం నంబర్ 08736–250501లో సంప్రదించాలని తెలిపారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. కడెం ప్రాజెక్ట్ నుంచి భారీ నీటి విడుదలతో వరద ఉధృతి పెరిగే అవకాశంతోపాటు రానున్న 36 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నందున రెడ్ అలర్ట్‌గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 90 మంది సభ్యులతో కూడిన 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ముందస్తుగా పునరావాస ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. ఎల్లంపల్లి డీఈ బుచ్చిబాబు, హాజీపూర్ తహశీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే ఉన్నారు. కాగా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు తెరుస్తున్నారనే సమాచారం తెలియడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. దెబ్బతిన్న రోడ్డు పరిశీలన కోటపల్లి: మండలంలోని లింగన్నపేట–ఎదులబంధం గ్రామాల మధ్య తుతుంగ వాగు ఉధృతికి రోడ్డు దెబ్బతిని పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్ శనివారం సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత రోడ్డు మరమ్మతు చేయాలని ఆర్అండ్బీ ఆధికారులను అదేశించారు. -
ఘనంగా వాజ్‌పేయి వర్ధంతి
చెన్నూర్: చెన్నూర్ బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రధానిగా చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, నాయకులు బత్తుల సమ్మ య్య, కొండపాక చారి, జాడి తిరుపతి, ఎతం శివకృష్ణ, కేవీఏం శ్రీనివాస్, వెంకటనర్సయ్య, మంచాల రాజబాపు పాల్గొన్నారు.కేకే–5 గనిలో మాక్ రిహార్సల్ మందమర్రిరూరల్: రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మందమర్రి ఏరియాలోని గనుల్లో పనులు కొంతమేరకు స్తంభించాయి. శనివారం కేకే–5 గని పైభాగంలో పాలవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. దీంతో గని అధికారులు మొదటి షిఫ్టు కార్మికులకు పలు సూచనలు చేశారు. సుమారు గంట సేపు గనిలో రక్షిత ప్రదేశానికి చేర్చి.. గనిలోకి వాగు నీరు ప్రవేశిస్తే తీసుకోవాల్సి న రక్షణ చర్యలపై మాక్ రిహార్సల్ ద్వారా వివరించారు. వరద గనిలోకి వస్తే సైరన్ మోగిస్తారని గని ఏజెంట్ రాంబాబు, మేనేజర్ శంభునాథ్ పాండే తెలిపారు. సుమారు 30ఏళ్ల క్రితం పాలవాగు వరద ఉధృతికి రంధ్రం ఏర్పడి గనిలోకి వరదనీరు ప్రవేశించింది. అప్పుడు అధికారులు కార్మికులను అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, వరద తీవ్రతను గమనించేందుకు పర్యవేక్షణ అధికారిని ఏర్పాటు చేశారు. -
కాలనీలు జలమయం
తాండూర్: నర్సాపూర్ దారిలో వెళ్లకుండా ఏర్పాట్లునెన్నెల: అప్రోచ్ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న ఎర్రవాగులక్సెట్టిపేట: పోతపల్లి దారిలో నీటి ప్రవాహంనెన్నెలలో నీట మునిగిన పత్తి పంటమంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షానికి పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో జలమయంగా మారాయి. హైటెక్ కాలనీలోని డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచి చెరువును తలపించాయి. ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లోని రోడ్లు జలమయం కాగా, పలు దుకాణాల్లోకి నీరు చేరింది. డ్రెయినేజీల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతోనే మురుగునీరు దుకాణాల్లోకి చేరిందని వాపోయారు. ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస థియేటర్‌కు వెళ్లే దారిలో ఒక వైపు మాత్రమే డ్రెయినేజీ ఉండడం, వరద నీరు వెళ్లక రోడ్డుపై నిలిచి, ఇళ్లలోకి చేరి వస్తువులు పాడయ్యాయి. సూర్యనగర్, చున్నంబట్టివాడ, పాతమంచిర్యాలలోని శ్రీలక్ష్మీ కాలనీ, బృందావనం కాలనీల్లోని రోడ్లు, ఇళ్లను వరద నీరు చుట్టిముట్టింది. సూర్యనగర్‌లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చున్నంబట్టి వాడలోని రోడ్లు నీట మునిగడంతో వాహనదారులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పాతమంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంటు నుంచి వరద నీరు సమీప కాలనీల్లోకి చేరింది. రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించగా, కాజ్‌వేపై వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో సమీప కాలనీ ప్రజలు భయాందోళన చెందారు. డీసీపీ భాస్కర్ రాళ్లవాగు, పట్టణంలోని లొతట్టు ప్రాంతాలను సందర్శించారు. రైల్వే అండర్‌బ్రిడ్జిలు, సీతారామ కాలనీ, బృందావనం కాలనీ, సూర్యనగర్ కాలనీల్లోని రోడ్లు వరదలో మునిగాయి. మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 8.30గంటల వరకు 53 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30గంటలకు భారీ వర్షం కురవడంతో మధ్యాహ్నం వరకు జనజీవనం స్తంభించింది. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహించి అతలాకుతలమైంది. చెరువులు, కాలువలకు గండ్లు పడడంతో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. కన్నెపల్లి, భీమిని, మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, కాసిపేట, నెన్నెల, కోటపల్లి మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కోటపల్లి మండలం జనగామ గ్రామంలో చెన్నూర్ కవిత ఇల్లు కూలింది. పత్తి, వరి పొలాల్లో వరద నీరు చేరడంతో చెరువులను తలపించాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరడంతో 11గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎడతెరిపి లేని వర్షానికి శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ఏరియాల్లోని ఓపెన్‌కాస్టుల్లో భారీగా వరద నీరు చేరి 20వేల మెట్రిక్ టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి రూ.కోట్ల నష్టం వాటిల్లింది. స్తంభించిన రాకపోకలు కన్నెపల్లి మండలంలో అత్యధికంగా 140.8 మిల్లీమీటర్లు, భీమిని మండలంలో 118.5మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కన్నెపల్లి, జజ్జరవెల్లి ఎర్రవాగు, చిన్నతిమ్మాపూర్ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణ, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. ఒర్రెలు, వాగులపై నిర్మించిన చెక్‌డ్యాంలు పొంగి పొర్లడంతో 57 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. కాసిపేట, భీమారం, వేమనపల్లి, నెన్నెల మండలాల్లో 24 గ్రామాలకు, కోటపల్లి మండలం ఎదులబంధం, తూతుంగ వాగు, నక్కలపల్లి ఒర్రె ఉప్పొంగడంతో 14గ్రామాలకు, భీమిని, కన్నెపల్లి మండలంలో ఎర్రవాగు, జన్కాపూర్ చెరువు, ఒర్రెలు పొంగి ప్రవహించడంతో 19గ్రామాలకు, నెన్నెల మండలం ఎర్రవాగు ఉప్పొంగడంతో దమ్మిరెడ్డిపేట, ఖర్జీ జంగల్‌పేట, కోనంపేట తదితర ఏడు గ్రామాలకు, చెన్నూర్ మండలంలో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి పరవళ్లు మహారాష్ట్రతోపాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది, గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎ త్తి లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. నీల్వాయి ప్రాజెక్టు నుంచి 100 క్యూసెక్కులు మత్తడి ద్వారా దిగువకు వెళ్తోంది. ‘ఎల్లంపల్లి’ 20 గేట్ల ఎత్తివేతమంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట వద్దనున్న ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్) ప్రాజెక్టు గేట్లు శనివారం ఎత్తారు. దీంతో దిగువన గోదావరి నదిలోకి నీరు పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను శనివారం 18.750 టీఎంసీల నీటిమట్టంతో ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి ఇన్‌ఫ్లో 1.62లక్షల క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల నుంచి 55వేల క్యూసెక్కులు మొత్తంగా 2.16లక్షల క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లిలోకి చేరుతోంది. దీంతో సాయంత్రం 6గంటల నుంచి అధికారులు మొదట 10గేట్లు ఎత్తారు. రాత్రి 7గంటల ప్రాంతంలో 20గేట్లకు పెంచా రు. గేట్లు ఎత్తడం ద్వారా 3.13లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 286 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంప్‌హౌజ్‌కు 12,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. కాగా, గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 15టీఎంసీల నీటిమట్టంతో ఉండగా గేట్లు ఎత్తలేదు.నెన్నెలలో ఇంట్లోకి చేరిన నీటిని బయటకు తోడేస్తున్న రైతుజిల్లాకు వర్షసూచన జిల్లాలో సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు 626.2 మిల్లీమీటర్లు కాగా 536.5 మిల్లీమీటర్లు కురిసింది. సగటున ఇంకా 14 శాతం లోటు నెలకొంది. భీమిని మండలంలో 34శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా ఇంకా 13 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. జిల్లాకు మరో నాలుగు రో జులపాటు ఆరెంజ్, ఎల్లో అలార్ట్ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది.ముల్కల్లలో జాతీయ రహదారిపై విరిగిపడిన చెట్టుతాండూర్: అచ్చలాపూర్‌లో ఇంట్లోకి చేరిన నీరుప్రాజెక్టుల్లో నీటిమట్టం వివరాలుప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుత నీటిమట్టం ఇన్‌ఫ్లో (మీటర్లలో) (మీటర్లలో) (క్యూసెక్కుల్లో) ర్యాలీవాగు 151.50 145.200 200గొల్లవాగు 155.50 150.100 140.772నీల్వాయి 124 124 900జన్నారం: శ్రీలంక కాలనీలో ఇంటిలోకి వరదనీరువర్షపాతం(మిల్లీమీటర్లలో) వివరాలు శుక్రవారం రాత్రి నుంచి ఉదయం వరకు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకుజన్నారం దండేపల్లి లక్సెట్టిపేట హాజీపూర్ కాసిపేట తాండూర్ భీమిని కన్నెపల్లి వేమనపల్లి నెన్నెల బెల్లంపల్లి మందమర్రి మంచిర్యాల నస్పూర్ జైపూర్ భీమారం చెన్నూర్ కోటపల్లి54.2 32.8 56.1 44.4 92.1 15.8 9.7 31.5 84.6 74.9 40.5 52.1 38.2 38.4 61.1 54.3 74.8 98.1 32.5 68.3 49.5 67.5 42.8 65.0 118.5 140.5 10.0 102.3 62.3 30.3 68.3 58.6 24.3 23.3 17.8 22.5 -
‘ఇన్స్పైర్’ అయ్యేదెలా..!
మంచిర్యాలఅర్బన్: బాలల ఆలోచనలకు పదును పెడితే అద్భుతం ఆవిష్కృతమవుతుంది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ మండలి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇన్స్పైర్ మనక్ పేరిట విజ్ఞాన మేళా నిర్వహిస్తోంది. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంది. 2025–26 విద్యాసంవత్సరానికి ఇన్స్పైర్ పోటీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కస్తూర్భా, గురుకుల విద్యాలయాల్లో ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉన్నా స్పందన కరువైంది. జిల్లాలో 335పాఠశాలలు ఉండగా ఇప్పటివరకు 26 స్కూళ్ల నుంచి 115 ప్రాజెక్టుల నామినేషన్లు మాత్రమే వచ్చాయి. జూలై ఒకటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, వచ్చే నెల 15తో గడువు ముగియనుంది. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు తీసుకొచ్చేందుకు చక్కని మార్గమైనా నామినేషన్లు అంతంత మాత్రమే వచ్చాయి. నిర్ధిష్ట గడువులోగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు స్పందిస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది. పాఠశాలకు ఐదు చొప్పున ప్రతీ పాఠశాల నుంచి తరగతికి ఒకటి చొప్పున ఐదు ప్రాజెక్టులు తయారు చేయాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్లో ఇన్స్పైర్ మనక్ కాంపిటీషన్ యాప్‌లో ప్రదర్శనకు సంబంధించిన వీడియో, ఆడియో, ఫొటోలు, పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలి. జిల్లా స్థాయి ప్రదర్శన ఆన్లైన్లోనే న్యాయ నిర్ణయ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక్కడ ఎంపికై న విద్యార్థులు రాష్ట్ర స్థాయికి అక్కడి నుంచి జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ల భిస్తుంది. మొదట విద్యార్థులు రూపొందించిన ప్రా జెక్టులను నిపుణులు పరిశీలించి జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికై న ఒక్కో ప్రాజెక్టుకు రూ.10వేల చొప్పున ప్రోత్సాహకం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికై తే రూ.25వేలు, జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చూపితే రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శనకు అవకాశం కల్పించే వీలుంది. ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రాజెక్టులు నమోదవుతున్నా ప్రైవేటు పాఠశాలల నుంచి ఆదరణ లేకుండా పోయింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, అవగాహన లేమితో కొంతమేర ఇన్‌స్పైర్‌కు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. బడిలో ఐడియా బాక్స్.. పాఠశాలల్లో దరఖాస్తుల స్వీకరణకు ఐడియా బాక్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో ఇన్‌స్పైర్‌పై అవగాహన కల్పించి వారి సృజనాత్మక ఆలోచనలు రాసి ఐడియా బాక్స్‌లో వేయాలి. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో భౌతిక, రసాయనశాస్త్ర, జీవశాస్త్ర, గణిత, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు నాణ్యమైన ఆవిష్కరణలపై శిక్షణ ఇచ్చారు. టీచర్లు విద్యార్థులు ఐడియా బాక్స్‌లో వేసిన ప్రాజెక్టు ఆలోచనలకు తుది మెరుగులు దిద్ది ప్రాజెక్టు రూపేణ తీసుకు రావాల్సి ఉంది. నెలన్నర గడుస్తున్నా ఆశించిన మేర నామినేషన్ల దరఖాస్తులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.గడువులోపు వచ్చేలా చర్యలువిద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఏటా ఇన్స్పైర్ మనక్ అవార్డు పోటీలు నిర్వహిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. నిర్ధిష్ట గడువులోగా అధిక దరఖాస్తులు వచ్చేలా విద్యాశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతాం. విస్తృ త ప్రచారం చేపట్టడం, మరోసారి టీచర్లకు అవగాహన కల్పించి కొత్త ఆవిష్కరణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చొరవ చూపి విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేలా కృషి చేస్తాం. – రాజగోపాల్, జిల్లా సైన్స్ అధికారి -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నెన్నెల: మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలో జలమయమైన ప్రాంతాలు, వాగులను శనివారం పరిశీలించారు. సుంకరివాడలోని నారాయణ, పురంశెట్టి రాకేశ్ ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని తొలగించాలని ఎంపీవో శ్రీనివాస్, కార్యదర్శి సురేశ్‌ను ఆదేశించారు. ఇళ్లలో నిలిచిన నీరు బయటకు వెళ్లేలా నూతనంగా వేసిన సీసీ రోడ్డు పక్క నుంచి కాలువ తీయాలని, నీళ్లు వెళ్లేందుకు అడ్డంగా ఉన్న మెట్లు తొలగించాలని సూచించారు. తహసీల్దార్, మండల పరిషత్, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ నిలిచిన నీటిని తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్తగూడంలో ఏర్పడిన కుమ్మరివాగు ప్రాజెక్టు ఎడమ కాల్వ గండిని సందర్శించి వెంటనే ఇసుక బస్తాలతో పూడ్చాలని ఇరిగేషన్ ఏఈని ఫోన్లో ఆదేశించారు. లంబాడితండా ఎర్రవాగును సందర్శించి పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో అబ్దుల్‌హై, ఇన్చార్జి తహసీల్దార్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు. -
వాగులో చిక్కుకున్న యువకులు
● తాళ్ల సహాయంతో కాపాడిన స్థానికులు కాసిపేట: మండలంలోని బుగ్గ చెరువు మత్తడిలో చిక్కుకున్న యువకులను స్థానికులు తాళ్ల సహాయంతో కాపాడారు. శనివారం మధ్యహ్నం 12గంటల ప్రాంతంలో బుగ్గగూడెంకు చెందిన మార్నేని సంజీవ్, మార్నేని సంతోష్, మార్నేని సాగర్, బద్ది అరుణ్, ఏదుల శశికుమార్ బుగ్గ చెరువు మత్తడి వాగు దాటి చేపలు పట్టేందుకు అవతలి ఒడ్డుకు వెళ్లారు. వర్షాలకు వాగు ఉధృతి పెరిగింది. దీంతో మొదటి మత్తడి దాటిన యువకులు అటు వైపు కొంత దూరంలో రెండో మత్తడి ఉండడంతో అలాగే ఉండిపోయారు. మార్నేని సంతోష్ ప్రమాదపు అంచున ఇటువైపునకు దాటగా.. మిగతా నలుగురు అటు వైపు ఉండిపోయారు. స్థానిక రైతులు గంటన్నరపాటు ప్రయత్నించి తాడు సహాయంతో ఒక్కొక్కరిని ఇవతలి వైపు దాటించారు. -
ప్రయాణికులను కాపాడిన సీఐ
ఖానాపురం: వరద నీటిలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని వరంగల్ జిల్లా దుగ్గొండి సీఐ సాయిరమణ కాపాడారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన బాస లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, రితిక, రితిన్ భద్రాచలానికి కారులో వెళ్తున్నారు. ఖానాపురం మండలంలోని చిలుకమ్మనగర్–కొత్తగూడ మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకుపోయారు. వెంటనే లక్ష్మీనారాయణ పోలీసులకు సమాచారం అందించారు. డీజీ కంట్రోల్ కార్యాలయం నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో సీఐ సాయిరమణ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు చిలుకమ్మనగర్‌కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సదరు కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీలు
రెబ్బెన: గోలేటిలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించే అంతర్ జిల్లాల బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి పేర్కొన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా పురుషులు, మహిళల క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. సుమారు 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులకు ఈనెల 17 నుంచి 21 వరకు సింగరేణి క్రీడామైదానంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ప్రతిభ చూపినవారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి మారం శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్‌రెడ్డి, భాస్కర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు చందర్ ఏఐటీయూసీ నాయకులు జగ్గయ్య, క్రీడాకారుడు నరేశ్ పాల్గొన్నారు. శిక్షణ శిబిరానికి ఎంపిక ఉమ్మడి జిల్లా పురుషుల జట్టుకు కె.సిద్దార్థ్, ఎం.తిరుపతి, పి.పవన్‌కుమార్, కె. తరుణ్, జి.గోపాల్, పి.శ్రీకాంత్, సాయి చరణ్, టి.దిలీప్‌కుమార్, పి.దేవరాజ్, ఎం.సూర్యకుమార్, ప్రేంకుమార్, సీహెచ్ గోపాలకృష్ణ, సీహెచ్ వరణ్ ఎంపికయ్యారు. మహిళల జట్టుకు ఏ.స్వప్న, కె.అంజలి, డి.శ్రావణి, జి.అనూష, కె.శ్రీస్పూర్తి కారుణ్య, టి.ప్రజ్వల శ్రీ, పి.వర్షిణి, సుజాత, సాయిదీక్ష, సంజన, అర్చన, వైష్ణవి, హారిక ఎంపికయ్యారు. -
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద పోటెత్తింది. శనివారం 1.04 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1083 అడుగులు ఉంది. 80.5 టీఎంసీలకుగాను 53.62 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ, మిషన్ భగీరథకు వదులుతున్నారు. గోదావరిలో భారీగా వరద నీరు చేరే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు సూచించారు. పశువుల, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయొద్దని పేర్కొన్నారు. – మామడ -
కడెం వరదలో వ్యక్తి గల్లంతు
కడెం/దస్తురాబాద్: చేపల వేటకు వెళ్లి కడెం వరదలో చిక్కుకుని ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కడెం మండలం కన్నాపూర్‌కు చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ (45) శనివారం కడెం గేట్లు ఎత్తడంతో కుమారుడు, మరో వ్యక్తితో కలిసి ప్రాజెక్ట్ గేట్ల దిగువన వెళ్లాడు. రెండు గేట్లు మూసివేయడంతో నీటి ప్రవాహం తగ్గిందని కర్రలతో చేపలు వేటాడేందుకు వెళ్లాడు. అరగంట తర్వాత ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు సైరన్ మోగించి మరో రెండు గేట్లు ఎత్తారు. సమీపంలో వందలాది మంది కేకలు వేసిన గంగాధర్ ఫోన్ చూస్తుండగా ఒక్కసారిగా చుట్టూ నీళ్లు చేరాయి. బయటకు రాలేక, కొద్ది దూరంలో బండపై నిల్చోని కాపాడండి అంటూ కేకలు వేశాడు. వరద ప్రవాహం పెరగడంతో అందరు చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయాడు. 3 కి.మీ మేర మునుగుతూ, తేలుతూ ఈదుతున్నాడు. పాండ్వపూర్ సమీపంలో కడెం వంతెనను దాటి వెళ్లడం అక్కడే ఉన్నవారు, కానిస్టేబుళ్లు నాగరాజు, వంశీ గమనించారు. చెట్లపొదల పక్క నుంచి కొట్టుకుపోతున్న అతన్ని కాపాడేందుకు పరిగెత్తి ప్రయత్నించారు. సుమారు 3 కి.మీ మేర బురదలో వెళ్లిన ఫలితం దక్కలేదు. అదేవిధంగా దస్తురాబాద్ మండలం భూత్కూర్ పంచాయతీ రాంపూర్ గోదావరి తీర ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టింది. ఎస్సై సాయికుమార్, తహసీల్దార్ విశ్వంబర్ అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ దొరకకపోవడం, రాత్రి కావడం, వరద ప్రవాహం పెరగడంతో గాలింపును నిలిపివేశారు. కడెం ప్రాజెక్ట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ఎఫ్ బృందం స్పందిస్తే వరదల్లో గంగాధర్‌ను బయటకు తీసుకువచ్చేవారని స్థానికులు వాపోయారు. గంగాధర్‌కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి నిమిత్తం బిస్కెట్లు, కేక్‌లు, చాక్లెట్లు తదితర బేకరీ ఐటెమ్స్‌ను షాపులకు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. కేకలు వేశాం కడెం గేట్లు దూరాన ఉన్న మేము బయటకు రావాలని కేకలు వేశాం. అతను గమనించలేదు. నేను పోతున్నా అంటూ గట్టిగా ఆరిచాడు. 20 నిమిషాల వ్యవధిలో వరదలో కొట్టుకుపోయాడు. – వినయ్, ప్రత్యక్ష సాక్షి -
మూగజీవాలను కాపాడిన హెడ్‌కానిస్టేబుల్
రామకృష్ణాపూర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని కార్మికవాడలకు భారీగా వరద నీరు చేరింది. ఆర్కే1 ఏరియా శివారులో పాలవాగుకు ఆనుకుని ఉన్న ఓ వ్యవసాయ భూమిలో పశువుల కోసం ఏర్పాటు చేసిన కొట్టం వరద నీటిలో ముని గిపోతుండగా ఆవుల ఆర్తనాదం విన్నవారు శనివారం పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ వెంటనే స్పందించి హెడ్ కానిస్టేబుల్ జంగును పంపించాడు. వరద ఉధృతిలో ప్రాణాలకు తెగించి ఒక కర్ర సహాయంతో ఈదుకుంటూ వెళ్లి మూగజీవా లను రక్షించాడు. హెడ్ కానిస్టేబుల్‌ను ఎస్సై, సీఐ శశిధర్‌రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. -
చిరుత సంచారం
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని సార్సాల పరిసరాల్లో చిరుత సంచరించింది. శుక్రవారం రాత్రి బూరం పోచన్నకు చెందిన గేదె దూడపై దాడి చేసి హతమార్చింది. అదే ప్రాంతంలో కుక్కపై దాడి చేసి చంపింది. శనివారం తెల్లవారు జాము ఓ మహిళకు చెందిన పశువులపై దాడికి యత్నించడంతో అవి తప్పించుకున్నాయని గ్రామస్తులు తెలిపారు. శనివారం ఫారెస్ట్ సెక్షన్ అధికారి సుభాన్, బీట్ అధికారి శ్రీవాణి, సిబ్బందితో సందర్శించి చిరుత పాదముద్రలను సేకరించారు. తక్షణ సహాయం కింద గేదె దూడ యజమానికి రూ.5 వేల పరిహారం అందజేశారు. చిరుతపులి సంచారంపై డప్పు చాటింపు చేశారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
గర్భిణుల తరలింపు
వేమనపల్లి: భారీ వర్షాలు దృష్ట్యా శనివారం వేమనపల్లి పీహెచ్సీ వైద్యాధికారి రాజేష్ ఆధ్వర్యంలో లోతట్టు గ్రామాల్లోని గర్భిణులను సు రక్షిత ప్రాంతాలకు తరలించారు. కళ్లెంపల్లి, జా జులపేట, సుంపుటం గ్రామాలకు చెందిన భారతి, శకుంతల, రోజును వేమనపల్లి పీహెచ్సీ నుంచి అంబులెన్స్‌లో చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇన్చార్జి హెల్త్ సూపర్వైజర్ రాంశెట్టి బాపు, ఏఎన్ఎం మంజుల, రాజ్యలక్ష్మి, ఈఎంటీ జనార్దన్, పైలెట్ సంపత్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కులం పేరుతో దూషించిన ఇద్దరిపై కేసుజన్నారం: కులం పేరుతో దూషించిన ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై గొల్ల పెల్లి అనూష తెలిపారు. ఆమె కథనం ప్రకారం..లక్సెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రామంటెంకి శ్రీనివాస్‌కు జన్నారం మండలం రేండ్లగూడ శివారులోని సర్వేనంబర్ 158/4లో ఎకరం పొలం ఉంది. రేండ్లగూడకు చెందిన బాల్త రాజమౌళి ఈ పొలాన్ని దున్నించాడు. ఈనెల 13న రామటెంకి శ్రీనివాస్, తండ్రి రాజలింగుతో కలిసి అక్కడికి వెళ్లి తిరిగివస్తున్నారు. పాతకక్షలు మనస్సులో పెట్టుకుని బా ల్త రాజమౌళి, బాల్త భూమక్కలు శ్రీనివాస్, రా జలింగును కులం పేరుతో దూషించారు. శ్రీని వాస్ ఫిర్యాదుతో శనివారం ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఆత్మహత్యకుంటాల: మండలంలోని లింబా(బి) గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గాండ్ల సాయినాథ్ (40) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. సాయినాథ్కు గత 20 ఏళ్ల క్రితం రజితతో వివాహమైంది. ఇప్పటివరకు సంతానం కాలేదు. దివ్యాంగుడు కాగా, మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. మతిస్థిమితంలేని వృద్ధుడుసిర్పూర్(టి): మండలంలోని నవేగాం గ్రామానికి చెందిన రాంటెంకి రుషి(60) శుక్రవారం పెన్‌గంగ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం.. రుషి గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతుండేవాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దహెగాం మండలకేంద్రం శివారులో పత్తి చేనులో అతని బట్టలు దొరకగా శనివారం ఉదయం పెన్‌గంగ నదిలో మృతదేహం ఆచూకీ లభ్యమైంది. మృతుడి పెద్దనాన్న కుమార్తె యశోదాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అడవిపంది దాడిలో వ్యక్తి మృతిభీమిని: అడవిపంది దాడిలో వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కన్నెపల్లి ఎస్సై భాస్కర్‌రావు, స్థానికులు తెలిపిన వివరాలు.. భీమిని మండలం వెంకటపూర్‌కు చెందిన దాగామ రామయ్య (70) కన్నెపల్లి మండలం సుర్జాపూర్ శివారులో శనివారం పత్తి చేనుకు వెళ్లి వస్తున్నాడు. ఈక్రమంలో అడవి పంది దాడిలో అతడు గాయపడ్డాడు. పక్క చేనులో ఉన్న రైతులు గట్టిగా కేకలు వేయగా అది పరిగెత్తింది. రామయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. అక్కడి నుంచి వెళ్లిన అడవి పంది గురుండ్ల చిరంజీవి, మేకల బాపులపై దాడి చేసి గాయపర్చింది. ఫారెస్ట్ అధికారులు సిబ్బంది, మరికొందరితో కలసి పట్టుకునేందుకు వెళ్లగా అందులో ఒకరిని గాయపర్చినట్లు తెలిసింది. మృతుడి కుమారుడు రాజేశం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
ఆదిలాబాద్: క్రీడాకారులంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని రాష్ట్ర బేస్‌బాల్ సంఘం అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో తెలంగాణ 5వ సీనియర్ రాష్ట్రస్థాయి బేస్‌బాల్ చాంపియన్‌షిప్ (మహిళలు–పురుషులు) పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటిని సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడాభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. పది రోజుల పాటు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని వివరించారు. పోటీల్లో రాష్ట్ర జట్టు విజేతగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.శ్వేత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించినవారికి గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం శుభపరిణామన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 700 క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి డా.కృష్ణ, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి జ్యోతి, ఉపాధ్యక్షుడు లోక ప్రవీణ్‌రెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, వ్యాయామ ఉపాధ్యాయులు దయానందరెడ్డి, హరిచరణ్, రామ్‌కుమార్, జిల్లాల నుంచి కార్యదర్శులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు పురుషుల విభాగంలో ఆదిలాబాద్ కరీంనగర్ జట్టుపై 6–1తో, హైదరాబాద్ నిర్మల్ జట్టుపై 7–1తో, మహబూబ్‌నగర్ సిద్దిపేట జట్టుపై 7–2తో విజేతలుగా నిలిచాయి. మహిళల విభాగంలో నిజామాబాద్ జట్టు సిద్దిపేటపై 9–0తో, కరీంనగర్ జట్టు మహబూబాబాద్ జట్టుపై 6–5తో, నల్గొండ జట్టు ఆసిఫాబాద్ జట్టుపై 7–4తో విజేతలుగా నిలిచాయి. -
‘హమాలీల సమస్యలు పరిష్కరిస్తా’
బెల్లంపల్లి: హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లిలోని అగర్వాల్ భవన్లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హమాలీ సంఘం నాయకులను సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం మాట్లాడుతూ.. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అసంఘటిత కార్మికుల మాదిరిగానే ఫీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం హమాలీలు పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతకుముందు బజారు ఏరియా ప్రాంతం నుంచి పుర వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గెల్లి రాజలింగు, నియోజకవర్గ అధ్యక్షులు, హమాలీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
అభినవ పోతన.. వరదన్న
చెన్నూర్: తెలుగు రాష్ట్రాల్లో సాహితీ రంగంలో వానమామలై వరదాచార్యులు కీర్తి గడించారు. ఓ వైపు సాహిత్యంలో, మరోవైపు రాజకీయంలో రాణించా రు. వరదన్న చేతి నుంచి జాలు వారిన రచనలు ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీర్తి, ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. వరదాచార్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పని చేశారు. నేడు వరదా చార్యుల జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. జననం.. విద్యాభ్యాసంవరదాచార్యులు వరంగల్ జిల్లా మడికొండలో 16 ఆగస్టు 1912లో సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు జన్మించారు. తండ్రి బక్కయ్యశాస్త్రి చెన్నూర్‌లో ఉపాధ్యాయునిగా పని చేశారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. వరదాచార్యులకు చదువు అబ్బలేదు. ఆయన సహజ కవి. 13వ ఏటా పద్యాలు, కవితలు, రచనలు ప్రారంభించారు. డిగ్రీలు లేని పండితుడు కావడంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్‌లోని దోమకొండ జనతా కళాశాలకు సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించారు. అనంతరం వానమామలై ఆంధ్ర సారస్వత పరిషత్‌లో విశారద రాసి ఉత్తీర్ణులయ్యారు. వరదాచార్యులు రాసిన ‘మణిమాల’ విశారద పరీక్షలో పాఠ్యాంశంగా ఉంది. అది చదివే పరీక్ష రాశారు. బాలల కోసం అనే బుర్రకథలు, నాటికలు రచించారు. దోమకొండ నుంచి చెన్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేయించుకుని 1961 నుంచి 1972 వరకు విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. కవి ప్రస్థానంలో..చెన్నూర్ పట్టణానికి చెందిన వానమామలై వరదాచార్యుల 50 ఏళ్ల కవి ప్రస్థానంలో ఎన్నో రచనలు చేశారు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, ఆంధ్రకవి, వసంత, మధుకవి, కవికోయిల, ఉత్ప్రేక్షా చక్రవర్తి, మహాకవి శిరోమణి, కవిశిరోవసంత లాంటి బిరుదులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. షష్టిపూర్తి సందర్భంగా భారతీ సాహిత్య సమితి కరీంనగర్ జిల్లా కోరుట్లలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గండపెండేరం, స్వర్ణకంకణం, రత్నాభిషేకం చేశారు. పూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వారణాసి వారు విద్యావాచస్పతి (డిలిట్) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇలా అనేక రాష్ట్రాల్లో మరెన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ఆయన అనేక రచనలు ముద్రితం కాగా, కొన్ని ముద్రణకు నోచుకోలేదు. రాజకీయ ప్రస్థానంలో..18 ఏళ్ల పాటు అధ్యాపకునిగా పని చేసిన వరదాచార్యులును అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం పీవీ నరసింహారావు 1972లో ఎమ్మెల్సీగా అవకాశమివ్వగా 1978 వరకు పని చేశారు. చెన్నూర్‌లో వేదపాఠశాల ఏర్పాటు చేసి అధ్యక్షునిగా పని చేశారు. 31 అక్టోబర్ 1984లో ఆయన తుదిశ్వాస విడిచారు. -
భార్యతో గొడవపడ్డందుకు చితకబాదిన ఎస్సై!
వేమనపల్లి: భార్యతో గొడవపడ్డందుకు తనను ఎస్సై చితకబాదాడని మండలంలోని సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య ఆరోపించాడు. ఈ మేరకు ఎస్సైపై ఆరే కుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశంతో కలిసి సీపీ, డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య నాలుగేళ్ల క్రితం నీల్వాయి కొత్త కాలనీకి చెందిన భారత ప్రమీలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ప్రమీల పుట్టింటికి వెళ్లడం, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన అనంతరం తిరిగి కాపురానికి రావడం జరుగుతుండేది. 20 రోజుల క్రితం అనారోగ్యంతో ప్రమీల పుట్టింటికి వెళ్లింది. దీంతో కిష్టయ్య గత ఆదివారం ఆమె వద్దకు వెళ్లి కాపురానికి రావాలని గొడవ పడ్డాడు. దీంతో ప్రమీలతోపాటు ఆమె తల్లిదండ్రులు నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై సురేశ్ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేశాడు. అయితే గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశ్ ద్వారా రూ.10వేలు ఇవ్వాలని ఎస్సై తనను డిమాండ్ చేసినట్లు కిష్టయ్య ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన భార్య, అత్తమామలు, మరికొందరి ముందే ఎస్సై తనను రోకలిబండతో తీవ్రంగా కొట్టాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ విషయమై మూడురోజుల క్రితం రూరల్ సీఐ బన్సీలాల్, ఏసీపీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. శుక్రవారం రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీకి పోస్టు ద్వారా ఫిర్యాదు కాపీ పంపించినట్లు పేర్కొన్నాడు. ఎస్సై సురేశ్‌తో తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
పాటాగూడలో తొలిసారి ఎగిరిన జెండా
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని పాటాగూడ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా రెపరెపలాడింది. ఇది మారుమూల గ్రామం కావడంతో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. జోడేఘాట్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ వాహనాలు వెళ్తుంటాయి. అవి కూడా వెళ్లని పక్షంలో వారికి కాలినడకే శరణ్యం. ఆ గ్రామంలో ఇప్పటివరకు బడి, అంగన్వాడీ కేంద్రం లేదు. దీంతో ఇప్పటివరకు జెండా ఎగురవేయలేదు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా చొరవతో ఇటీవల గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల ప్రారంభించారు. ఇందులో 14 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలలో సీఆర్టీ చంద్రకళ త్రివర్ణపతాకం ఎగురవేశారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తంజేశారు. -
గిరిజనుల అభివృద్ధికి నిరంతర కృషి
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ముందుగా పీవో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం, అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. 934 ప్రాథమిక పాఠశాలల్లో 12,017 మంది విద్యార్థులు చదువుతుండగా 1,449 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నట్లు తెలిపారు. 133 ఆశ్రమ పాఠశాలల్లో 31,749 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పెంచిన చార్జీల ప్రకారం నూతన ఆహార మెనూ అమలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు చెప్పా రు. ఉమ్మడి జిల్లాలో నాలుగు మినీ బాలికల గురుకులాలు, నాలుగు ఏకలవ్య పాఠశాలలు (కో–ఎడ్యుకేషన్), ఎనిమిది అప్‌గ్రేటెడ్ బాలికల జూని యర్ కళాశాలలు, నాలుగు అప్‌గ్రేటెడ్ జూనియర్ కళాశాలలు, ఒక బాలుర జూనియర్ కళాశాల, ఒక బాలికల జూనియర్ కళాశాల, రెండు మహిళా డిగ్రీ కళాశాలలు, ఒక పురుషుల డిగ్రీ కళాశాల ఉన్నట్లు తెలిపారు. గురుకులాల్లో 11,114 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 32 పీహెచ్‌సీలు, 186 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఎనిమిది సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా వీటి ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్ ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 42 మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. భూ బదలాయింపు చట్టం కింద ఈ సంవత్సరం 25 కేసులు నమోదు చేసి 12 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మిగతా 13 కేసులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. జీసీసీ ద్వారా ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ, ఐటీడీఏ ఆధ్వర్యంలో 17 పెట్రోల్ పంపులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా, మంజూరైన 11 పెట్రోల్ పంపులను ప్రారంభించి నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. మగతా ఆరు పంపులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏవో దామోదరస్వామి, ఏడీఎంహెచ్‌వో మనోహర్, పీహెచ్‌వో సందీప్, పీవీటీజీ ఏపీవో మనోహర్, డీపీవో ప్రవీణ్, అధికారులు, సిబ్బంది, ఆశ్రమ, గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సమరయోధుల ఆశయ సాధనకు కృషి
మంచిర్యాలక్రైం: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కమిషనరేట్‌లో స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఉత్తమ పోలీసు అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు రమేష్, మల్లారెడ్డి, శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్యకర్త స్థాయి నుంచే మంత్రినయ్యా
చెన్నూర్: తాను కార్యకర్త స్థాయి నుంచే మంత్రి స్థాయికి చేరుకున్నానని, చెన్నూర్‌ను పాత కొత్త అందరం కలిసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజ్, మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేశ్, కారెంగుల శ్రావణ్ తదితరులకు మంత్రి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతోపాటు పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలని, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకే పార్టీలో చేరికలు నిర్వహించామని తెలిపారు. తనతో పని చేసిన పాత నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడ్డదని, అందరినీ సమానంగా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై వచ్చిన వారిని పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్‌రావు, పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఫయాజ్, నాయకులు పాల్గొన్నారు. -
వికసిత్ భారత్‌లో భాగస్వాములు కావాలి
మంచిర్యాలటౌన్: దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీ య జెండాను ఆవిష్కరించాలని, వికసిత్ భార త్ దిశగా మోదీ చేస్తున్న కృషిలో ప్రజలు భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి తిరంగా బైక్ ర్యాలీని పట్టణ వీధుల గుండా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి, అమిరిశెట్టి రాజ్‌కుమార్, సత్రం రమేశ్, గాజుల ముఖేశ్‌గౌడ్, పట్టి వెంకటకృష్ణ, మోటపలుకుల తిరుపతి, బియ్యాల సతీశ్‌రావు, ఎనగందుల కృష్ణమూర్తి, బొలిశెట్టి అశ్విన్, కోడి రమేశ్, ముదాం మల్లేశ్, రంగ శ్రీశైలం, బోయిని హరి కృష్ణ, జయరామరావు, సప్పిడి నరేశ్, కర్రె లచ్చన్న, కర్రె చక్రి, బోయిని దేవేందర్, కోడి సురేశ్ పాల్గొన్నారు. -
● ఉత్తర తెలంగాణలో జిల్లాకు ప్రథమస్థానం ● అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం ● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు ● ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జెండాకు వందనం చేస్తున్న ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, జిల్లా ఉన్నతాధికారులుమంచిర్యాలఅగ్రికల్చర్: ఉత్తర తెలంగాణలో మంచిర్యాల జిల్లా ప్రథమ స్థానంలో దూసుకెళ్తోందని, అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే.. సన్నబియ్యం సరఫరా ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి రూ.13వేల కోట్ల వ్యయంతో 3.10కోట్ల మందికి అందిస్తోంది. జిల్లాలో 2,47,923 మంది కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేశాం. పోర్టబులిటి విధానం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా రేషన్ బియ్యం తీసుకునే వీలు కల్పించాం. కొత్త రేషన్‌కార్డులు జూలై 14నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించాం. పదేళ్ల తర్వాత పేదలకు రేషన్‌కార్డులు చేతికందాయి. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు 24,079 నూతన రేషన్‌కార్డులు అందించడంతోపాటు పాత కార్డుల్లో పిల్లల పేర్లు చేర్పులకు 41,677 దరఖాస్తులు పరిశీలించి 53,040మందిని చేర్చాం. రాజీవ్ ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీం. మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాం. జిల్లాలో 9,120మంది పేదలు చికిత్స పొందారు. ఇందుకు ప్రభుత్వం రూ.14.15కోట్లు ఖర్చు చేసింది. ఆడబిడ్డలకు అండగా.. ప్రజా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. ఆడబిడ్డలకు ఈ పథకం ద్వారా రూ.6,790 కోట్లు ఆదా అయ్యింది. జిల్లాలో ఉచిత రవాణా ద్వారా 2,24,03,654 మంది మహిళలకు లబ్ధి చేకూరింది. రూ.500కే వంట గ్యాస్ సరఫరా ద్వారా మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించి జిల్లాలో 1,22,837 మంది లబ్ధిదారులకు రూ.14.63 కోట్లు రాయితీ మంజూరు చేశాం. గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా జిల్లాలో ప్రతీ నెల లక్ష నివాసాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ 1,25,759 మంది వినియోగదారులకు నెలకు రూ.4.96 కోట్లు ఖర్చు చేస్తూ ఇప్పటివరకు రూ.71.38 కోట్లు లబ్ధి చేకూర్చింది. భూభారతి.. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభార తి చట్టాన్ని ప్రవేశపెట్టి రైతులకు అనుకూలంగా అప్పీలు వ్యవస్థను పొందుపర్చింది. జిల్లాలో ప్రతీ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా వచ్చిన 51,503 దరఖాస్తుల్లో 26,744 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పరిశీలనలో ఉన్నాయి. విద్యారంగం బలోపేతం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాం. జిల్లాలో 510 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తి చేసి మిగతా వాటిల్లో పురోగతిలో ఉన్నాయి. 688 పాఠశాలలకు స్కూల్ ఫెసిలిటీ గ్రాంటు రూ.1,64,30,000 ఐదు నెలలకు ఇచ్చాం. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 40 శాతం డైట్, 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచి నూతన మెనూ అమలు చేస్తూ పౌష్టికాహారం అందించి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం.. మున్సిపాలిటీలు.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఐదు బల్దియాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మంచిర్యాలలో రూ.10.22 కోట్లతో రాష్ట్రంలోనే అత్యుత్తమంగా మహాప్రస్థానం నిర్మించాం. అమృత్ 2.0 పథకం కింద బల్దియాలకు రూ.275 కోట్లు మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ భవనాల నిర్మాణం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవన నిర్మాణం, నర్సింగ్ కళాశాల, వైద్య విద్య కోసం రూ.40 కోట్లతో భవన నిర్మాణం, రూ.3.50 కోట్లతో మందుల నిల్వ గిడ్డంగి నిర్మించాం. గుడిపేటలో రూ.216 కోట్ల వ్యయంతో అధునాతన వైద్య కళాశాల నిర్మాణం జరుగుతుంది. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్‌సింగ్, ఏసీపీ ప్రకాష్, సబ్ కలెక్టర్ మనోజ్, ఐఎన్టీయూసీ నాయకుడు జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు.విద్యార్థిని నృత్యంఇందిరా మహిళా శక్తి..రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా దండేపల్లి మండలంలో శంకుస్థాపన చేసి మరొకటి ఏర్పాటుకు మందమర్రి మండలాన్ని గుర్తించాం. మహిళలకు పెట్రోల్‌బంక్‌లు, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ, ఇందిరా శక్తి స్టాళ్లు, మీసేవ కేంద్రాలను ప్రారంభించింది.పేదలకు ఇందిరమ్మ ఇళ్లు..తొలి విడతగా ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. అన్ని శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. జిల్లాలో 10,377 ఇళ్లు మంజూరు కాగా 6,373 ఇళ్లు మార్కవుట్, 1,870 ఇళ్లు బేస్మెంటు, 164 గోడలు, 24 స్లాబ్ నిర్మాణ స్థాయిలో ఉన్నాయి. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15.49కోట్లు జమ చేశాం. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీల్లో 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్–1లో 15, గ్రూప్–2లో 18, గ్రూప్–3లో 26 కులాలను చేర్చాం.అలరించిన విద్యార్థుల నృత్యాలుస్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. దేశభక్తి గీతాలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు విద్యార్థులను అభినందించి బహుమతలు అందజేశారు. -
కార్మికుల హక్కులు సాధించిన టీబీజీకేఎస్
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులకు చరిత్రలో నిలిచిపోయే హక్కులను టీబీజీకేఎస్ సాధించిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన నస్పూర్ కాలనీలో టీబీజీకేఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షులు బండి రమేష్ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దివాకర్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల సమస్యలను పరిష్కరించామని, ఏ సమస్య వచ్చినా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి ప్రయోజనాలు చేకూర్చారని తెలిపా రు. కారుణ్య ఉద్యోగాలు ఇప్పించారని అన్నా రు. టీబీజీకేఎస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు యన్.విజిత్‌రావు, యూని యన్ కేంద్రం ఉపాధ్యక్షుడు నూనె కొముర య్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, జాయింట్ సెక్రెటరీ సత్తయ్య, మాజీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు అన్వేష్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుబ్బయ్య, నాయకులు మేరకు పవన్, బేర సత్యనారాయణ, అత్తి సరోజ, వంగ తిరుపతి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
దొంగ ఓట్లతో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నం
మంచిర్యాలటౌన్: దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ విమర్శించారు. దొంగ ఓట్లను ఆధారాలతో సహా బయటపెట్టినా ఎన్నికల సంఘం, బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఓట్ చోర్.. గద్దె చోడ్(ఓట్ల దొంగలు గద్దె దిగండి) ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల నగరంలోని వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా మీదుగా గురువారం సాయంత్రం మాస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మట్లాడుతూ ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓటర్లు ఉండడం, ఓటర్లుగా ఉన్నవారిని మృతిచెందినట్లుగా చిత్రీకరించడం వంటివి బీజేపీ చేపట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
రాంనగర్ వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణం
బెల్లంపల్లి: వర్షాకాలంలో వరద నీరు ముంచెత్తి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న రాంనగర్ వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం పట్టణంలోని రాంనగర్ వాగు వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. వాగుపై సరైన వంతెన లేకపోవడంతో వరద నీరు ఇళ్లలోకి వస్తోందని, ఏటా తమకు వరద కష్టాలు తప్పడం లేదని స్థానికులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే ఏమాత్రం జాప్యం చేయకుండా కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు కాంట్రాక్టర్‌తో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమేష్‌ను ఆదేశించారు. చైన్ మిషన్ ద్వారా వాగులో పూడిక తీయించి వరద ముప్పును నివారించాలని సూచించారు. రాంనగర్ బస్తీ వాసులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ‘ఎల్లంపల్లి’లో పెరిగిన నీటిమట్టం మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట వద్ద ఉన్న ఎల్లంపల్లి(శ్రీపాద సాగర్) ప్రాజెక్ట్ నీటిమట్టం మూడు టీఎంసీల మేర పెరిగింది. ఎగువ ప్రాంతాలు, కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తున్న వరద నీటితో నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను గురువారం 15.750 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. కడెం ప్రాజెక్ట్ నుంచి 5,775 క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల నుంచి 4,100 క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 277 క్యూసెక్కులు, నంది పంప్‌హౌజ్‌కు 9,500 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. -
ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఆగుతుంది..
బెల్లంపల్లి: మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లలో ఏపీ సంపర్క్‌క్రాంతి ట్రైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదలకు రైల్వే అధికారులు ఎట్టకేలకు సానుకూలత వ్యక్తం చేశారు. ఈ నెల 2న ‘సాక్షి’లో ‘రైళ్లు ఆగవా..’ శీర్షికన ప్రచురితమైన కథనంలో ఆయా స్టేషన్లలో హాల్టింగ్ ఎత్తివేసిన వైనాన్ని ప్రస్తావించడం తెలిసిందే. స్పందించిన రైల్వే అధికారులు హజ్రత్ నిజాముద్దీన్(న్యూఢిల్లీ) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును దిగువ మార్గంలో ఆయా రైల్వేస్టేషన్లలో నిలుపుదలను పునరుద్ధరిస్తూ రైల్వే రిజర్వేషన్ పోర్టల్ ఐఆర్సీటీసీలో అప్డేట్ చేశారు. ఈ నెల 21 నుంచి నిలుపుదలకు పొందుపర్చారు. రైల్వే ప్రయాణికుల సమస్యలు, రైళ్ల హాల్టింగ్ ఎత్తివేతపై రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తోడ్పడిన ‘సాక్షి’కి, రైల్వే ఉన్నతాధికారులకు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు ఫణి, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. -
● 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ ● టెక్నాలజీ, అభివృద్ధి, విద్య, వైద్యరంగాల్లోనూ ఘనత ● వందేళ్ల భారతంలో అభివృద్ధిపై యువత అభిప్రాయం ● వందేళ్ల భారత్ ఎలా ఉండాలి అనే అంశంపై ‘సాక్షి’ టాక్ షో
న్యాయ వ్యవస్థలో మార్పు రావాలిన్యాయవ్యవస్థలో న్యా యం జరిగేందుకు ఏళ్లుగా బాధితులు ఎదు రు చూడాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా మార్పులు రావాలి. దేశం ఇప్పటికీ టెక్నాలజీలో దూసుకుపోతూ ఎన్నో రకాల రీసెర్చ్లకు కేంద్ర బిందువుగా మారుతోంది. టెక్నాలజీలో యువతకు మంచి అవకాశాలు కల్పించాలి. – దానిష్ మినహాజ్, బీఎస్సీ సెకండియర్, మంచిర్యాలమంచిర్యాలటౌన్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047నాటికి వందేళ్లు పూర్తవనుండగా.. ఆ నాటికి మన దేశం ప్రపంచాన్ని శాసించే స్థాయిలో అన్ని రంగాల్లోనూ నంబర్ వన్ స్థానంలో ఉంటుందని యువత అభిప్రాయ పడింది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘వందేళ్ల భారతం ఎలా ఉండాలి’ అనే అంశంపై ‘సాక్షి’ గురువారం మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో టాక్‌షో నిర్వహించింది. కళాశాల ప్రిన్సిపాల్ పి.ఉపేందర్‌రెడ్డి, డిగ్రీ విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశానికి ఏదో చేయాలనే తపనతో విద్యార్థులు, యువత ముందుకు వచ్చే అవకాశం ఉందని, వందేళ్లలో దేశ పురోగాభివృద్ధి బాగుంటుందని, ప్రపంచాన్ని శాసించే సూపర్‌పవర్‌గా భారత్ ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశానికి యువతనే వెన్నెముక, ప్రభుత్వం సరైన అవకాశాలు కల్పిస్తే దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రభుత్వం యువతకు పూర్తి సహకారం అందించడంతోపాటు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తేనే దేశాభివృద్ధికి దోహాదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇంచార్జి రాజు, పీడీ నూనె శ్రీనివాస్, లెక్చరర్లు మహేశ్, చంద్రశేఖర్, సుమలత, శ్వేత, సుధాకర్, గోపి, విద్యార్థులు పాల్గొన్నారు. టెక్నాలజీలో మరింతగా రాణించాలిభారతదేశం టెక్నాలజీలో ఎంతగానో ఎదిగింది. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే టెక్నాలజీలో మరింతగా రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వంటి వాటిలో యువత రాణించేలా చూస్తే మన దేశాన్ని వారే అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు. – కే.సాయివిగ్నేష్, బీబీఏ సెకండియర్, మంచిర్యాలఅభివృద్ధి సాధించాలిదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్య, ఉద్యోగం, వైద్యం, కోర్టుల్లో జరిగే న్యాయం సత్వరంగా అందడంతోపాటు మారుతున్న కాలానుగుణంగా ప్రభుత్వం ఆలోచించాలి. స్కిల్ డెవలప్మెంట్ అనేది చిన్ననాటి నుంచే విద్యతోపాటు అందించాలి. – ఎన్.భూమిక, ఎంఎస్‌టీసీఎస్, ఫస్టియర్, మంచిర్యాలటెక్నాలజీ, విద్య అందాలిస్వాతంత్య్రం సాధించిన 78 ఏళ్లలోనే దేశ జీడీపీతోపాటు ఎంతగానో అభివృద్ధి సాధించింది. మరో 22 ఏళ్లలో దేశం ప్రపంచంలోనే గొప్పదేశంగా మారేందుకు అవకాశాలున్నాయి. టెక్నాలజీ, ప్రతీ ఒక్కరికి ఉచితంగా విద్య అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎంతోమంది విద్యావంతులు తయారై దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారు. – సిహెచ్.కౌశిక్, ఎంఎస్టిడిఎస్ ఫస్టియర్, మంచిర్యాల -
పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్య సేవలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)ల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం హాజీపూర్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, మందుల నిల్వలు, ల్యాబ్ రిజిష్టర్లు, పరిసరాలు పరిశీలించి రోగులతో మాట్లాడారు. కర్ణమామిడిలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలించారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి స్వప్న, పీహెచ్సీ వైద్యాధికారి లహరి పాల్గొన్నారు. వార్షిక పాస్ సద్వినియోగం చేసుకోవాలి మంచిర్యాలఅగ్రికల్చర్: జాతీయ రహదారుల సంస్థ కల్పించిన వార్షిక పాస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జాతీయ రహదారుల సంస్థ మంచిర్యాల పీఐయూ డిప్యూటీ మేనేజర్ హర్షకుమార్ గుప్తా, అధికారులతో కలిసి వార్షిక పాస్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడతూ దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై వర్తించేలా ఈ నెల 15 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధం మంచిర్యాలటౌన్: ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తిలక్‌నగర్ చెరువును డీసీపీ ఏ.భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాబో యే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 90 మంది సభ్యులతో మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, శిక్షణ పొందిన పోలీసులు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముల్కల్ల గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కోటపల్లి మండలం దేవులవాడకు చెందిన నిట్టూరి శశిపాల్ (36) గురువారం ఉదయం ముల్కల్ల శివారులో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో త్రీవగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుని తండ్రి లస్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ను ప్రక్షాళన చేయాలిమంచిర్యాలటౌన్: జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ను ప్రక్షాళన చేయాలని, హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అక్రమాలపై విచారణ చేపట్టాలని ఓల్డ్ మంచిర్యాల క్రికెట్ క్లబ్(ఓఎంసీసీ) అధ్యక్షుడు బొలిశెట్టి కిషన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీ మైదానంలో గురు క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం అండర్–17 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురు అకాడమీ నిర్వాహకులు దుర్గాప్రసాద్, ఎంఏ విజయ్, వివేక్, తూముల ప్రభాకర్, ఆమ్రోస్, ఎడ్ల మల్లేశ్, ఎలుక శ్రీనివాస్, రమేశ్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం క్రికెట్ క్రీడాకారుల కోసం రూ.20 వేల మ్యాట్‌ను కిషన్, ప్రభాకర్ అందించారు. ఎరువుల కోసం బారులుచెన్నూర్: చెన్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనం వద్ద ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. గురువారం ఎరువులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం మేరకు పెద్ద సంఖ్యంలో తరలివచ్చారు. వరుసలో ఎక్కువ సమయం ఉండలేక తమ వంతుగా చెప్పులు ఉంచారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు సక్రమంగా ఎరువులు పంపిణీ జరిగేందుకు బందోబస్తు నిర్వహించారు. యూరియా కోసం రైతుల ఆందోళన భీమిని: యూరియా సక్రమంగా పంపిణీ చేయ డం లేదని మండలంలోని వెంకటపూర్‌లో జై భీమ్ పరస్పర సహాయక సహకార మార్కెటింగ్ సంఘం ఎదుట రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. రైతులు మాట్లాడుతూ ఈ కేంద్రం నుంచి ఇప్పటివరకు ఒక లోడు మాత్రమే పంపిణీ చేశారని తెలిపారు. నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏడీఏ సురేఖ, ఎస్సై భాస్కర్‌రావు రైతులతో మాట్లాడగా ఆందోళన విరమించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మకాలు చేపట్టాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఏడీఏ సురేఖ తెలిపారు. భీమిని ఏవో యమునాదుర్గా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యానికి దూరం.. చారిగాం
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చారిగాం గ్రామం ఉంది. ఈ గ్రామంలో 234 మంది జనాభా, 112 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారంతా మద్యం నిషే ధానికి కట్టుబడి ఉంటున్నారు. గ్రామంలో గుడుంబా తయారీ, బెల్టుషాపుల ఏర్పాటు చేయవద్దని మూడున్నర దశాబ్ధాల క్రితమే పెద్దలు తీర్మాణించారు. ఇప్పటికీ అవే ఆచారాలను పాటిస్తున్నారు. గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. ప్రధానంగా కూరగాయాలు సాగుచేసి పట్టణంలోని మార్కెట్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. 35 ఏళ్లుగా గ్రామస్తులు మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. స్థానిక యువత బయట తాగినట్లు తె లిస్తే ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి వారిచే మాలధారణ చేయిస్తున్నారు. మరోసారి మద్యం జోలికి వెళ్లకుండా వారికి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎలాంటి గొడవలు, అల్లర్లకు తావులేకుండా మంచి నడవడికతో ఉంటున్నారు. అదో మారుమూల కుగ్రామం. ఆ గ్రామంలో అందరి జీవనాధారం వ్యవసాయమే. ప్రతీరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. మహాత్మాగాంధీ సూచనలు నమ్మిన కాగజ్‌నగర్ మండలంలోని చారిగాం గ్రామస్తులు మద్యపాన నిషేధాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
అధిక తేమతో పంటలకు చేటు
చెన్నూర్‌రూరల్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పంటచేలల్లో నీరు నిలిచింది. నీరు ఎక్కువైతే తేమ ఏర్పడి పంటలకు నష్టం వాటిల్లనుంది. అధిక తేమతో పంటలు నష్టపోకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసా ద్ సూచిస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... వర్షాలకు పత్తి చేనులో నీరు నిలిస్తే వెంటనే కాలువలు తీసి నీటిని బయటకు పంపించాలి. వర్షాలు తగ్గిన వెంటనే భూమిలో తేమను తగ్గించు కోవడానికి అంతర సేద్యం చేయాలి. బురద పదనులో ఎకరాకు 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేసుకోవాలి. అలాగే ఎకరానికి సీ ఓసీ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒకరోజు తర్వాత కిలో స్వర్ణపాల్ను 150 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. పంటను వేరుకుళ్లు తెగులు ఆశిస్తే 3 గ్రాముల ఆక్సిక్లోరైడ్ లేదా ఒక గ్రాము కార్బండిజమ్‌ను లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లలో తడపాలి. మొక్కజొన్న అధిక తేమను తట్టుకోలేదు. సాధ్యమైనంత త్వరగా అంతరకృషి చేసుకోవాలి. ఎకరాకు 25 కిలోల యూ రియా, 10 కిలోల పొటాష్ ఎరువును మొక్కల మొదళ్ల దగ్గర వేసుకోవాలి. కాండం తొలిచే పురుగు ఉంటే కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఎకరానికి 3 కిలోలు ఆకు సుడుల్లో వేయాలి. పెసర, మినుము పైర్లకు అధిక తేమతో పేనుబంక, లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరప పంట మిరప చేనులో నీరు నిలిస్తే వెంటనే నీటిని కాలు వల ద్వారా తొలగించాలి. నారుకుళ్లు తెగులు ఆశిస్తే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా రెండు గ్రాముల రిడోమిల్ లీటరు నీటికి కలిపి వారంలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే అధిక తేమ నుంచి పంటలను కాపాడుకోవచ్చు. -
ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది
మా తాతల కాలం నుంచి గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. అదే ఆచారం ఇప్పటి వరకూ కొనసాగుతోంది. గ్రా మంలో అందరం కలిసి మెలిసి ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఇక్కడే అందరం కలిసి ప రిష్కరించుకుంటాం. ఆంజనేయ స్వామి గు డిలో పూజలు నిర్వహిస్తాం. అందరం కలిసి పండుగలు ఆనందంగా జరుపుకుంటాం. – మొర్ల పోచయ్య, చారిగాం స్నేహభావంతో ఉంటాం గ్రామంలోని యువకులమంతా కలిసి మెలిసి స్నేహభావంతో ఉంటా ం. గ్రామంలో ఏమైనా సమస్య ఉంటే యువకులమంతా ఒకేచోట చేరి పరిష్కరించుకుంటాం. గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. బెల్టుషాపులు పెట్టరు. ఇదే ఆచారాన్ని అందరం పాటిస్తాం. – మొర్ల శంకర్, చారిగాం -
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు
మంచిర్యాలఅగ్రికల్చర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్‌తోపాటు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు గురువారం ముస్తాబయ్యాయి. కలెక్టరేట్ ఆవరణలో టెంట్లు, శామియానాలు, అతిథులకు కుర్చీలు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ పతాకావిష్కరణ, వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు తెలియజేసే స్టాళ్లు ఏర్పాటు, ముఖ్య అతిథి ప్రసంగం, సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకు గౌరవ వందనం సమర్పణ, ప్రగతి నివేదిక సందేశం, ప్రశంసాపత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలు ఉంటాయి. జిల్లా నుంచి మంత్రి ఉన్నా.. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా.. గతంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండావిష్కరణకు ప్రభుత్వ సలహాదారుకు సర్కారు అవకాశం కల్పించింది. ప్రస్తుతం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా గడ్డం వివేక్‌వెంకటస్వామి ఉన్నారు. అయినప్పటికీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఎగురువేసే అవకాశం ఇతర ప్రాంతానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావుకు కల్పి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కు చెందిన మంత్రికి అవకాశం కల్పించకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత
కోటపల్లి: బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను గురువారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బన్సీలాల్ వివరాలు వెల్లడించారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా బొలెరోలో ఎలాంటి ఆధారాలు లేకుండా మహారాష్ట్రకు తరలిస్తున్న 62 బస్తాల యూరియా పట్టుబడడంతో వ్యవసాయాధికారి సాయికృష్ణరెడ్డికి సమాచారం అందించామన్నారు. అతను వచ్చి యూరియాను పరిశీలించి అక్రమంగా తరలిస్తున్నారని చెప్పడంతో వాహనాన్ని కోటపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టామన్నారు. చెన్నూర్ పట్టణంలోని అస్నాద్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాపు నుంచి యూరియా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి వాహన డ్రైవర్‌పై రాజమల్లు, షాపు యజమాని బాపురెడ్డిపై ఫెర్టిలైజర్ కంట్రోల్ అర్డర్ 1983 చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
శిశువు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన గర్భిణి సువర్ణకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త కరణ్ బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలీవరీ చేస్తామని చెప్పి చేర్చుకున్నారు. అదే రోజురాత్రి మగశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ చనిపోయినట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. మంచిర్యాలకు రెఫర్ చేయకుండా వైద్యులు అశ్రద్ధ చేసి తమ బిడ్డ మృతి చెందడానికి కారకులయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా మగశిశువు స్టిల్బర్త్తో పుట్టాడని, తల్లిగర్భంలో ఉన్నప్పుడు మలం తినడంతో మృతి చెందినట్లు తెలిపారు. -
విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
రామకృష్ణాపూర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. మందమర్రి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్మెల్ డిగ్రీ కాలేజీ భవనాన్ని కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాభివృద్ధే ధ్యేయంగా అనేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని అన్నారు. కాకా అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఐదువేల మంది విద్యార్థులకు ఎలాంటి డొనేషన్లు తీసుకోకుండా విద్యనందిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి వరకు పంపించి నాలుగు నెలలు గడుస్తోందని, అయినా కేంద్ర ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తోందని అన్నారు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఆంథోని, ఆదిలాబాద్ బిషప్ ప్రిన్స్ ఆంథోని, బిషప్ జోసఫ కున్నత్, ఫాదర్ రెక్స్, ఫాదర్ జిజో తదితరులు పాల్గొన్నారు. -
‘ఎల్లంపల్లి’కి వరద
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట గ్రామ శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు 14టీఎంసీల నీటిమట్టంతో ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి 11,500 క్యూసెక్కుల, ఎగువ ప్రాంతాల నుంచి 7,600 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 330 క్యూసెక్కులు, ఎస్టీపీపీకి 121 క్యూసెక్కులు వదులుతున్నారు. నేడు పాఠశాలలకు సెలవు మంచిర్యాలఅగ్రికల్చర్: భారీ వర్షాల వాతావరణ సూచన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు సెలవు పాటించాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బహుజన రాజ్య స్థాపననే లక్ష్యం
పాతమంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపించడమే లక్ష్యమని డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఎసీ ఆవిర్భావ సభకు ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొరల రాజ్యాన్ని కూల్చి బహుజన రాజ్యం నిర్మించడం కోసమే మా భూమి రథయాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరిచి రాజకీయ చైతన్యాన్ని బహుజనుల్లో నింపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎదునూరి రమేష్, సదానందం, సుదమళ్ల హరికృష్ణ, పడాల రామన్న, జెఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ పాల్గొన్నారు. -
‘వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవాలి’
పాతమంచిర్యాల: ఇంగ్లండ్, అమెరికాలతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు వెంటనే రద్దు చేసుకోవాలని అఖిల భారత కేత్ మజ్ధూర్ సంఘ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లాల్‌కుమార్ అన్నారు. బుధవారం బహుళ జాతి కంపెనీల అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దొండ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుపతి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంకె రవి, ఉపాధ్యక్షుడు చందు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాలక్రైం: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్–2025 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కమిషనరేట్‌లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులు, విద్యార్థులు, వివి ధ శాఖల ఉద్యోగులు, మహిళలతో మాదక ద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా సరఫరా, సాగు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, యాంటీ నార్కోటిక్ సీఐ రాజ్‌కుమార్, సీసీఆర్బీ సతీష్, పీసీఆర్ సీఐ రవీందర్, సీసీఎస్ సీఐ బాబురావ్ పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ఓరియంట్లో గుర్తింపు ఎన్నికలు
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు నగారా మోగింది. ఈ నెల 19న ఎన్నికల నిర్వహణకు ఆదిలాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 15రోజుల్లో ఎన్నికలు నిర్వహించి, ఈ నెల 20న పూర్తి వివరాలు అందించాల్సి ఉండగా.. 19న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఎన్నికలు నిర్వహించి సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల్లో 257మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 266మంది జాబితా సిద్ధం చేయగా..పలువురి అభ్యంతరాల మేరకు నూతన ఉద్యోగులు తొమ్మిది మందికి ఓటు హక్కు నిరాకరించారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొనేందుకు ఐదు యూనియన్లు అర్హత సాధించాయి. ఈ నెల 14న మధ్యాహ్నం 12గంటల్లోపు ఆసక్తి లేని యూనియన్లు తమ అభిప్రాయం తెలియజేస్తే పోటీలో లేకుండా బ్యాలెట్ పేపర్‌పై గుర్తు తొలగిస్తామని, లేనిపక్షంలో గుర్తు కొనసాగుతుందని కార్మిక శాఖ అధికారులు ప్రకటించారు. నాలుగేళ్లుగా ఎన్నికల కోసం ఎదురు చూస్తుండగా.. ఐదు రోజుల్లోనే ఎన్నికల నిర్వహణ ముగియనుండడంతో కార్మికులు, కార్మిక సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
జన్నారం: ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం జన్నారం అటవీ డివిజన్ గుండా భారీ వాహనాల రాకపోకలను జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్‌తో కలిసి ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. భారీ వాహనానికి అటవీశాఖ ఇస్తున్న రూ.150 రశీదును లారీ యజమానికి అందజేశారు. అనంతరం జన్నా రం వరకు లారీలో ప్రయాణించారు. ఈ సందర్భంగా వ్యాపారులు, అటవీశాఖ అధికారులు ఎమ్మెల్యే ను సన్మానించారు. మండల కేంద్రంలోని అంబేడ్క ర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాకపోకలపై నిషేధం ఎత్తివేతకు కృషి చేస్తానని ఏడాది క్రితం హామీ ఇచ్చానని, అప్పటి నుంచి ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి, అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వైల్డ్‌లైఫ్ బోర్డు స మావేశంలో అధికారులపై ఒత్తిడి తెచ్చానని, చివరికి రాకపోకలపై నిషేధం ఎత్తివేయడం శుపరిణా మమని అన్నారు. పగటిపూట రాకపోకలు సాగించే వాహనాల డ్రైవర్లు, యజమానులు అటవీ శాఖ ని బంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. అతివేగంగా వెళ్లి వన్యప్రాణులకు హాని కలిగించవద్దని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు అనవసర ఆరోపణలు చేశారని అన్నారు. రేంజ్ అధికారి సుష్మారావు, డీఆర్వో సాగరిక, ఎస్సై అనూష, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మ న్ ఫసీఉల్లా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముజా ఫర్ అలీఖాన్, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, నాయకులు ఇసాక్, శంకరయ్య, రియాజోద్దీన్, శాఖీర్అలీ, ముజ్జు, స్వామి, అజార్ పాల్గొన్నారు. -
ఎరువుల కోసం బారులు
చెన్నూర్/కోటపల్లి: ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారు. చెన్నూర్ ప్రాథమిక సహకార సంఘం గోదాం వద్ద రైతులు ఎరువుల కోసం ఎదురు చూశారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మహిళా రైతులు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. 4గంటలకు ఒక లారీ ఎరువులు వచ్చినా పంపిణీ చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. ఎరువులు పంపిణీ చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని చెల్లాయిపేటకు చెందిన రైతు మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోటపల్లిలో బుధవారం యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు ఉదయాన్నే రైతువేదిక వద్ద బారులు తీరారు. ఏడీఏ ప్రసాద్ యూరియా బస్తాలు అందజేశారు. యూరియా లభిస్తుందో లేదోననే బెంగతో ఒక్కసారిగా రైతులు ఎగబడడంతో తోపులాట జరిగింది. -
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
భీమిని: భీమిని, కన్నెపల్లి మండలాల్లో ముంపు ప్రాంతాలను కలెక్టర్ కుమార్ దీపక్ సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి బుధవారం పరిశీ లించారు. కన్నెపల్లి మండలం సాలీగాం పీపీ రావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ఇళ్లలోకి నీరు చేరగా.. వారు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఏర్పాటుతో తమకు నష్ట పరిహారం రాలేదని బాధితులు మొర పెట్టుకున్నారు. నష్ట పరిహారం రాని వారి జాబితా తయారు చేసి పంపించాలని తహసీల్దార్ శ్రవణ్‌కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. మేరీమాత పాఠశాలలో పునరావాసం, సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. భీమిని మండలం ఖర్జీభీంపూర్, రాజారాం గ్రామాలకు వెళ్లే రోడ్డు కోతకు గురి కాగా పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. చిన్నతిమ్మాపూర్, తంగళ్లపల్లి గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ఎంపీడీవోలు గంగామోహన్, శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్లు బికార్ణదాస్, శ్రవణ్‌కుమార్, ఎస్సైలు విజయ్‌కుమార్, భాస్కర్‌రావు పాల్గొన్నారు. -
సాంకేతిక అభ్యసనం విద్యార్థులకు వరం
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వం ముందు చూపుతో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత అభ్యసనం కల్పించిందని, సాంకేతిక అభ్యసనం విద్యార్థులకు ఒక వరమని డీఈవో యాదయ్య అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాలో ఎంపిక చేసిన ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గణితం బోధించే ఉపాధ్యాయులకు సాంకేతిక అభ్యసనంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా అన్ని ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు అందిస్తామని, వాటి ద్వారా నాణ్యమైన బోధన, స్వీయ అభ్యసన సులభతరం అవుతుందని తెలిపారు. శిక్షణ అంశాలను ఉపాధ్యాయులకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, క్వాలిటీ కో–ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు. కేజీబీవీల నిర్వహణకు ముందస్తు బడ్జెట్ ఇవ్వాలి మంచిర్యాలఅర్బన్: కేజీబీవీ, యూఆర్ఎస్ల నిర్వహణకు ముందస్తు బడ్జెట్ ఇవ్వాలని డీఈవో యాదయ్యకు స్పెషల్ ఆఫీసర్లు వినతిపత్రం అందజేశారు. గ్యాస్ రిఫిల్ క్రెడిట్ బేస్‌లో పంపిణీ చేయాలని, ఎస్‌వోలకు రూ.32,500 వేతనంతో చాలా ఇబ్బందిగా మారిందని, విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.30వేల నుంచి రూ.60వేల వరకు ప్రతీ పాఠశాలకు బడ్జెట్ రిలీజు చేయాలని కోరారు. కేజీబీవీల ఎస్వోలు ఏ.సుమలత, ఫణిబాల, మయూరి, కనకలక్ష్మీ, జె.స్వప్న, మౌనిక, రజిత, సునీత, సరిత తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ పొడిగింపేనా?
● ఫిబ్రవరిలో ఆరు నెలలు పెంచిన ప్రభుత్వం ● నేటితో ముగియనున్న సొసైటీ పాలకవర్గాల గడువు ● జాతీయ పతాకావిష్కరణపై చైర్మన్ల ధీమాఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వివరాలుకై లాస్‌నగర్/నిర్మల్‌చైన్‌గేట్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14న ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీటి గడువు ముగిసినప్పటికీ డీసీసీబీ చైర్మన్ల విజ్ఞప్తి మేరకు ఆరునెలల పాటు అదనంగా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు సైతం గురువారంతో ముగియనుంది. ప్రస్తుతం వీటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో సొసైటీ పాలకవర్గాల గడువు పెంపు మరోసారి అనివార్యం కానుంది. ప్రత్యేకాధికారులను కూడా నియమించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పంద్రాగస్టు వేడుకల్లో తామే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని సొసైటీ చైర్మన్లు ధీమా వ్యక్తం చేస్తుండటంతో పాలకవర్గాల గడువు మరోసారి పొడిగింపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండోసారి పదవీకాలం పొడిగింపు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)కు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించింది. సొసైటీ పరిధిలో ఎన్నికై న చైర్మన్లతో అదే నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించారు. వీరితో పాటు పలువురు డైరెక్టర్లను సైతం ఎన్నుకున్నారు. కాగా ఈ సొసైటీలకు ఎన్నికలు జరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతో ఐదేళ్ల గడువు పూర్తయ్యింది. దీంతో వాటి కాలపరిమితి ముగియడంతో రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లంతా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ పదవీకాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆరునెలల పాటు పదవీకాలాన్ని పొడిగించింది. తాజాగా ఈ గడువు నేటితో ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో మరోసారి తమ పదవీకాలాన్ని పొడిగించాలని డీసీసీబీ చైర్మన్లతో పాటు సొసైటీ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో మరోసారి మూడు లేదా అరునెలల పాటు పదవీకాలం పొడిగిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవీ కాలం ముగియడంతో 15వ తేదీన జరిగే పంద్రాగస్టు వేడుకల్లో చైర్మన్ల హోదాలో జాతీయ పతాకావిష్కరణ చేసే అవకాశం ఉండదు. అయితే ప్రభుత్వం ఎలాగైనా తమ పదవీకాలాన్ని పొడిగిస్తుందనే ధీమాలో ఉన్న సొసైటీ చైర్మన్లు తామే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.సహకార సంఘాలు : 77 డీసీసీబీ : 01 డీసీఎంఎస్ : 01 సొసైటీల పరిధిలోని సభ్యులు : 55 వేలు అన్నదాతకు వెన్నుదన్నుగా ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 55 వేలకు పైగా రైతులు ఉన్నారు. వారికి వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలను క్షేత్రస్థాయిలో అందజేస్తూ సొసైటీలు వారికి అండగా నిలుస్తున్నాయి. పలు సొసైటీలు ధాన్యం కొనుగోళ్లను సైతం చేపడుతున్నాయి. ఈ సొసైటీలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. అవకాశముంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఇటీవలే ఆరు నెలల పాటు సొసైటీల గడువును ప్రభుత్వం పొడిగించింది. మరోసారి సైతం పదవీకాలాన్ని పొడిగించేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. – బి.మోహన్, జిల్లా సహకార శాఖ అధికారి, ఆదిలాబాద్ -
అప్పుల బాధతో లారీ డ్రైవర్ ఆత్మహత్య
కాసిపేట: అప్పులబాధతో లారీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చో టు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కాసిపేట పోలీస్‌స్టేషన్ పరి ధిలోని సోమగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహమ్మద్ రంజాన్(41) ఇటీవల లారీని కొనుగోలు చేయడంతో అప్పులపాలయ్యాడు. ఈనెల 12న శ్రీరాంపూర్‌లో ఆర్టీసీ బస్సుతో యాక్సిడెంట్ అయిందని కుటుంబ సభ్యులతో చెప్పి బాధపడ్డాడు. ఇప్పటికే అప్పుల పాలైన తాను యాక్సిడెంట్‌తో మరింత అప్పులు పెరుగుతుండడంతో మానసికంగా కుంగిపోయి బుధవారం ఉదయం తన ఇంటిముందు రేకులకు లుంగీతో ఉరేసుకున్నాడు. మృతుని కుమారుడు హసన్బాబా ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు..నేరడిగొండ: మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సోలాంకి శ్రీకాంత్ (26) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చే సుకున్నట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఫాస్టాగ్ తరహాలో టైగర్ జోన్ ఎంట్రీ ఫీజుకడెం: టోల్గేట్ మాదిరిగా ఫాస్టాగ్ తరహాలో చెక్‌పోస్ట్‌ల వద్ద సెస్ వసూలు చేసేందుకు అట వీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కవ్వాల్ టైగర్ జోన్ గుండా ప్రయాణించే వాహనాలకు చెక్ పోస్ట్‌ల వద్ద ఎన్విరాల్మెంట్ సెస్ వసూలు చేస్తున్నా రు. గతంలో టైగర్‌జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతులు లేవు. ఇటీవలే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. పాండ్వపూర్ లోని చెక్‌పోస్ట్ వద్ద టైగర్‌జోన్‌లోకి ఎంట్రీ అయ్యే వాహనాలు ఇప్పటి వరకు సిబ్బంది సెస్ వసూలు చేసేవారు. ఫాస్టాగ్ తరహాలో ఏర్పాటు చేయబోతున్న చెక్‌పోస్ట్‌తో వాహనదారులు వెంటవెంటనే వెళ్లేందుకు వీలుంది. -
‘నవోదయ’లో ప్రవేశానికి గడువు పొడిగింపు
కాగజ్‌నగర్‌టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికిగానూ ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న అర్హత పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ బు ధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనికోరారు. ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు సత్కారంఆసిఫాబాద్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2025 కోసం బుధవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాసంచాలకుల కార్యాలయంలో జాతీయ స్వతంత్య్ర జ్యూరీ నిర్వహించారు. కుమురంభీం జిల్లా నుంచి జన్కాపూర్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు ముఖాముఖిలో పాల్గొన్నారు. రాష్ట్ర నుంచి 160 మంది దరఖాస్తు చేసుకోగా ఆరుగురిని ఎంపిక చేశారు. ఇందులో వెంకటేశ్వర్లు ఒకరు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు పాఠశాల విద్యాప్రగతిని, విద్యార్థుల ప్రగతిలో వినూత్న సేవలను వివరించారు. అనంతరం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఉపాధ్యాయుడిని శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు మదన్మోహన్, ఆర్జేడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీ వ్రంగా గాయపడిన వెన్నెల నారాయణ (51) చికి త్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడకు చెందిన నారాయణ మంగళవారం ఉదయం తన మోటార్ సైకిల్‌పై అడెల్లి పోచమ్మ దర్శనానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో స్థానిక శర్మ దాబా వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారి రాజు, ఏఎస్సై రంగారావు తెలిపారు. ఆగి ఉన్న లారీని ఢీకొని సింగరేణి కార్మికుడు..రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రిలోని గాంధీనగర్‌కు చెందిన సాయి వెంకటేష్ (28) అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు .శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే–7 గనిలో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటేష్ బైక్‌పై మంచిర్యాల నుండి మందమర్రి వైపు వెళ్తుండగా బొక్కలగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుని తండ్రి బానేష్ గతంలోనే అనారోగ్యంతో మృతి చెందగా తల్లి అన్నపూర్ణ అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. గూడ్స్ రైలు ఢీకొని ఒకరు..సిర్పూర్(టి): ఆరెగూడ సమీపంలో డౌన్‌లైన్‌పై ఆపోజిషన్ డైరెక్షన్లో రైల్వే కాంట్రాక్ట్ లేబర్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గూడ్స్ రైలు రివర్స్‌లో వచ్చి ఢీకొనడంతో షేక్ జంషేద్ (44) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం 5.40 గంటలకు షేక్ జంషేద్, ప్రవీణ్, పర్వేస్ నైట్ పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రవీణ్‌కు చేయి విరగడంతో హైదరాబాద్‌కు తరలించారు. కాగజ్‌నగర్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ కె.సురేష్ గౌడ్ విచారణ జరిపారు. షేక్ జంషేద్ మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకరిపై వేధింపుల కేసుజైనథ్: అదనపు కట్నం కోసం వేధించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన రంగ బాలరాజు గౌడ్ కుమార్తె స్రవంతికి అంకోలి గ్రామానికి చెందిన బాలాజీతో 2018లో వివాహమైంది. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో రెండు సంవత్సరాల క్రితం స్రవంతి పుట్టింటికి వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. వారం రోజుల క్రితం బాలాజీ జైనథ్‌కు వచ్చి చంపుతానని బెదిరించడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
వివాహానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
● బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ● ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి ● మృతుల్లో ఒకరు కానిస్టేబుల్వెల్గటూర్: అప్పటివరకూ స్నేహితుడి వివాహ వేడుకలో అందరితో కలిసి ఆనందంగా గడిపిన ఆ యువకులు.. ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన ముచ్చకుర్తి అనిల్(26), మేడి గణేశ్(26) ఇద్దరు స్నేహితులు. ద్విచక్రవాహనంపై ఎండపల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. రాత్రిపూట స్వగ్రామమైన ఇటిక్యాలకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. వెల్గటూర్ మండలం పాశిగామ స్టేజీ వద్ద లక్సెట్టిపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. అదే సమయంలో రోడ్డుపైకి ఓ గేదె రావడంతో బస్సు గేదెను ఢీకొంది. బస్సు డ్రైవర్ గేదెను తప్పించే క్రమంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. అనిల్ ఇటీవలే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉద్యోగం చేస్తున్నాడు. గణేశ్ హైదరాబాద్‌లో వండర్ లాలో పనిచేస్తున్నట్లు సమాచారం. గణేశ్‌కు సోదరి ఉంది. తల్లిదండ్రులు గ్రామంలో కూలీ పని చేసుకుని జీవిస్తున్నారు. అనిల్ తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం ముంబయి వలస వెళారు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
చిన్నారిపై వీధికుక్క దాడి
లక్ష్మణచాంద: మండలంలోని ధర్మారంలో బాలు ని పై వీధికుక్క దాడి చే యడంతో గాయాలయ్యా యి. గ్రామానికి చెందిన మల్లెల శ్రీకాంత్–శిరీష దంపతుల కుమారుడు కౌశిక్ మంగళవారం ఇంటిముందు ఆడుకుంటుండగా వీధికుక్క వచ్చి దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు బాలుడిని నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలుఆదిలాబాద్రూరల్: భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్‌రావు బుధవారం తీర్పునిచ్చినట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టల్‌వాడకు చెందిన జాదవ్ ఆనంద్‌రావు మద్యం సేవించి ఇంటికి వచ్చి తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇదేక్రమంలో తలపై సుత్తెతో కొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దంపతుల కుమారుడు మహేష్ 18 డిసెంబర్ 2024న పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై విష్ణువర్ధన్ కేసు నమోదు చేశారు. కోర్టు డ్యూటీ అధికారి సంతోష్ 10 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెల్లడించారు. -
ఇంటిస్థలం కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు
ఆదిలాబాద్‌రూరల్: మావల శివారు ప్రాంతంలోని సర్వేనంబర్ 170లో నకిలీ ఇంటి పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. బుధవారం మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన స్వామికి 2013 బీపీఎల్ కింద ప్రభుత్వం 905 నంబర్ గల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో బాధితుడు స్వామి గుడిసె వేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం 2015లో అనుమతులు సైతం తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఇంటి నిర్మాణం చేపట్టలేకపోయాడు. రహెమాన్‌ఖాన్ ఆ స్థలంలో ఉన్న గుడిసెను తొలగించి వెంకటమ్మకు రూ. 2.30 లక్షలకు విక్రయించాడు. వెంకటమ్మ ఆ స్థలాన్ని కిష్టన్నకు రూ.3.50 లక్షలకు విక్రయించింది. బాధితుడు స్వామిని బెదిరింపులకు గురిచేయడంతో ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో సుంకరి సంతోష్, రహిమాన్ ఖాన్, తాటి లక్ష్మణ్, కిష్టన్న, పవన్ నాయక్, సుంకరి వెంకటమ్మ, శరత్, వంశీకృష్ణపై కేసు నమోదు చేశా రు. ఇందులో నలుగురిని అరెస్టు చేయగా కిష్టన్న పవన్ నాయక్, సుంకరి వెంకటమ్మ, శరత్ పరారీలో ఉన్నారు. సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గంజాయి సేవిస్తున్న ముగ్గురిపై.. నెన్నెల: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కొందరు యువకులు బొప్పారం అడవిలో గంజాయి సేవిస్తున్నారని అందిన సమాచారం మేరకు వెంటనే దాడి చేయగా మంచిర్యాల గద్దెరాగడికి చెందిన ఐటీఐ విద్యార్థి పాల్తెపు ప్రణయ్ దొరికిపోయాడు. అతడిని సోదా చేయగా 1.5 గ్రాముల గంజాయి లభించింది. గంజాయితో పాటు పల్సర్ బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించారు. ప్రణయ్‌తో పాటు పారిపోయిన నెన్నెల మండలం గన్పూర్ గ్రామానికి చెందిన పోతురాజుల అకాశ్, గొల్లపల్లికి చెందిన సల్లూరి పెత్రుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ప్లాట్ ఇస్తానని మోసం చేసిన ఒకరిపై..ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ యజమాని సయ్యద్ షాహిద్‌పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. 2008లో నార్నూర్‌కు చెందిన ఎక్బాల్ ఖాన్ షాహిద్ వద్ద రూ.50 వేలకు ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్లాట్ కొనుగోలు చేశాడు. రూ.20వేలు అడ్వాన్స్ ఇవ్వగా రూ.30 వేలు కిస్తులుగా చెల్లించాడు. ఆ తర్వాత ప్లాట్ ఇవ్వకుండా 2016లో మరో వ్యక్తికి విక్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఉద్యోగాల పేరిట మోసగించిన నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: ఎస్కే మైక్రోఫైనాన్స్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలంలోని శంకర్‌గూడకు చెందిన జవాడే కృష్ణ అలియాస్ జాదవ్ కృష్ణ ఎన్ఆర్ఐ అంటూ సామాజిక సేవ పేరుతో పరిచయాలు పెంచుకొని మైక్రో ఫైనాన్స్, ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్వాడీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. 2024 డిసెంబర్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్‌లో మైక్రో ఫైనాన్స్ పేరుతో కార్యాలయాలను ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా 300 మంది నుంచి రూ.20 వేల చొప్పున మెంబర్షిప్ చేయించాడు. రెండు కార్యాలయాల్లో ఐదుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నిరుద్యోగుల నుంచి రూ.69 లక్షలు వసూలు చేశాడు. ఆరునెలల పాటు కనిపించకపోవడంతో జూలైలో నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శంకర్‌గూడలో రూ.9 లక్షల నగదు, రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇంట్లోనే దాచిపెట్టి రూ.15 లక్షలతో పరారయ్యాడు. నిందితుడిని భోరజ్ చెక్‌పోస్టు వద్ద అరెస్ట్ చేసి రూ.9లక్షల నగదుతో పాటు 10.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఐదు సెల్ ఫోన్లు, ఒక ఖరీదైన వాచ్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి విడతల వారీగా వసూలు చేసి మోసం చేసిన డబ్బుల్లో రూ.6లక్షలు ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ యజమానికి ఇచ్చాడని, మరో రూ.6లక్షలు మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భవన యజమానికి, రూ.3.5 లక్షలు ఆదిలాబాద్, ఉట్నూర్ కార్యాలయాల నిర్వహణకు, రూ.2.1 లక్షలు నిందితుడి తమ్ముడి అవసరాల నిమిత్తం ఇచ్చినట్లు తెలిపారు. మిగితా డబ్బులు జల్సాల కోసం, తప్పించుకోవడానికి ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిందితుడు కరోన సమయంలో ముంబాయ్‌లో ఫేక్ రెమిడి ఇంజక్షన్లను విక్రయించాడని, నాగ్‌పూర్‌లో రుణాల పేరిట అక్కడి ప్రజలను మోసం చేశాడని తెలిపారు. నిందితుడిపై ఉట్నూర్‌లో 3, ఇంద్రవెల్లిలో 3, నార్నూర్‌లో 2, మావల పోలీసు స్టేషన్లో 3, ఆదిలాబాద్ వన్‌టౌన్‌లో 2, జైనథ్‌లో 3 చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఉట్నూర్ సీఐ ఎం.ప్రసాద్, ఐటీకోర్ ఎస్సై గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ -
కడెం కెనాల్లో పడి ఒకరు మృతి
దండేపల్లి: మద్యం మత్తులో కడెం కెనాల్లో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సేదం నర్సయ్య (48) కూలీ పని నిమిత్తం దండేపల్లి మండలంలోని కుంటలగూడకట్టకు చెందిన తన బంధువైన బొబ్బిలి బక్కవ్వ ఇంటికి వచ్చాడు. మంగళవారం మద్యం సేవించి కడెం కెనాల్ సమీపంలో ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆతరువాత కొద్దిసేపటికి అతను కనిపించక పోవడంతో బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం వెతుకుతుండగా బుధవారం కుంటలగూడకట్ట సమీపంలోని కడెం కెనాల్ లో చెట్లపొదలకు తట్టుకుని మృతదేహం దొరికింది. మద్యం మత్తులో ప్రమాద వశాత్తు కెనాల్లో జారిపడడంతో ఈతరాక నీటిలో మునిగి మృతి చెందాడని మృతుని బంధువు భూమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
ఐచర్ ఢీకొని వ్యక్తి మృతి
● న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించిన కుటుంబ సభ్యులుతానూరు: భైంసా–నాందేడ్ రహదారిపై బెల్‌తరోడా ఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం ఐచర్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. మహలింగి గ్రామానికి చెందిన బన్సోడే ప్రభుదాస్ (35) భార్య లక్ష్మి, కుమారుడు అరుతో కలిసి భైంసాకు వెళ్లాడు. బుధవారం స్వగ్రామానికి వెళ్లేందుకు బెల్‌తరోడా ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగారు. భార్య, కుమారుడిని అక్కడే కూర్చోబెట్టి మక్కబుట్టా తీసుకువచ్చేందుకు రోడ్డు దాటుతుండగా భైంసా నుంచి నాందేడ్ వైపు అతివేగంగా వెళ్తున్న ఐచర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ఆపకుండా వెళ్తుండడంతో స్థానికులు వెంబడించి మహారాష్ట్ర సరిహద్దులోని రాఠి గ్రామ శివారులో పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై షేక్ జుబేర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. న్యాయం చేయాలని రహదారిపై బైఠాయింపు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు రహదారిపై బైఠాయించారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం చోటు చేసుకుందని, పరిహారం అందేవరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. -
● ఆర్టీసీకి కలిసి వచ్చిన వరుస సెలవులు ● ‘పౌర్ణమి’ రోజున రూ.2.89 కోట్ల ఆదాయం ● రీజియన్ వ్యాప్తంగా రూ.9.26 కోట్ల ఆమ్దాని
మంచిర్యాలఅర్బన్/ఆదిలాబాద్: వరుస సెలవులు, పండుగలు ప్రజా రవాణా సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీపౌర్ణమి, 10న ఆదివారం కలిసి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 7నుంచి 11వరకు రీజియన్ వ్యాప్తంగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 101 నమోదవడం రద్దీ తీరుకు నిదర్శనం. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఆరు డిపోల పరిధిలో ఐదు రోజుల వ్యవధిలో ప్రతీ కిలోమీటర్‌కు రూ.66.48 ఆదాయం వచ్చింది. మొత్తం 639 బస్సులు 13,93,000 కిలోమీటర్లు తిరిగి 18.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. జూలై నెలలో ఒక్క సాధారణ రోజు ఇన్కమ్ రూ.1.85 కోట్లుగా ఉంది. అయితే రాఖీ పండుగ ఒక్కరోజే రీజియన్ వ్యాప్తంగా రూ.2.89 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. గతేడాది ఈ పండుగకు రూ.1.57 కోట్ల ఆదాయం రాగా ఈ సారి అదనంగా మరో రూ.1.32 కోట్లను ఆర్జించి ఆర్టీసీ రికార్డు సృష్టించింది. మొత్తంగా ఐదు రోజుల్లో రీజియన్ పరిధిలో రూ.9.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా నిర్మల్ డిపో రూ. 2.49 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ‘మహాలక్ష్మి’లే అధికం..తమ సోదరులకు రాఖీ కట్టేందుకు దూర ప్రయాణమైనా మహిళలు ఆర్టీసీలో ప్రయాణించడం సంస్థకు లాభించింది. ఐదు రోజుల వ్యవధిలో మొత్తం 18.84 లక్షల మంది ప్రయాణించగా, అందులో 12.60 లక్షల మంది ‘మహాలక్ష్మి’లే ఉన్నారు. అత్యధికంగా పౌర్ణమి రోజున 4.27 లక్షల మంది ప్రయాణించగా, ఇందులో 2.93 లక్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులున్నారు. ఇక ఆక్యూపెన్సీ రేషియో విషయానికి వస్తే ఉట్నూరు డిపో పరిధిలో అత్యధికంగా 109 ఉండగా, నిర్మల్ 106, భైంసా 102, ఆదిలాబాద్ 101, మంచిర్యాల 97, ఆసిఫాబాద్ 95గా నమోదయ్యాయి. ముందస్తు ప్రణాళికతో..వరుసగా రెండు పండుగలు, ఆదివారం కూడా తోడవడంతో రద్దీని ముందే పసిగట్టిన ఆర్టీసీ అధి కారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగా రు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలతోపాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. తదనుగుణంగా యాజమాన్యం ప్రత్యేక బస్సులు నడిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు 118 స్పెషల్ సర్వీస్‌లను ఏర్పాటు చేశారు. రద్దీకి అ నుగుణంగా 7, 8వ తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉ మ్మడి ఆదిలాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు 46 బ స్సులు ఏర్పాటు చేయగా, 10 నుంచి 12వ తేదీ వర కు రీజియన్ నుంచి హైదరాబాద్‌కు 72 బస్సులను ఆపరేట్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోనికి తీసుకొని ఈసారి వారికి ప్రత్యేక భోజన వసతి కల్పించారు. ఫలితంగా ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడంతోపాటు ఆర్టీసీకి ఆమ్దాని వచ్చింది. రీజియన్ పరిధిలో ఇలా.. (ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు)అగ్రస్థానంలో నిర్మల్ డిపో.. ఐదు రోజుల్లో నిర్మల్ డిపో రూ.2.49 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది రూ.1.25 కోట్లతో సరిపెట్టుకోగా, ఈసారి రెట్టింపు సమకూర్చుకో వడం విశేషం. గతంలో రూ.కోటి 80 వేల ఆదాయంతో నిలిచిన ఆది లాబాద్ ఈసారి పుంజుకుని రూ.2.15 కోట్లకు చేరుకుంది. డిపో బస్సులు ప్రయాణించిన ఆదాయం కి.మీ(లక్షల్లో) (రూ.కోట్లలో) ఆదిలాబాద్ 3.22 2.15 భైంసా 1.47 0.90 నిర్మల్ 3.47 2.49 ఉట్నూర్ 0.77 0.53 ఆసిఫాబాద్ 1.69 1.06 మంచిర్యాల 3.31 2.13 రీజియన్ 13.93 9.26సమష్టి కృషి ఆర్టీసీ ప్రతీ ఉద్యోగి సమష్టి కృషితోనే మంచిర్యాల డిపోకు ఆదాయం సమకూరింది. పండుగవేళ కూడా ప్రతి ఒక్కరూ విధిగా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వర్తించారు. మహిళా ఉద్యోగులూ రాఖీ రోజున డ్యూటీలు చేయాల్సి వచ్చింది. వీరందరి కృషితోనే ఐదు రోజుల్లో రూ.2,12,73,888 ఆదాయం ఆర్జించాం. ఆదాయం రావడానికి కృషి చేసిన ప్రతీ ఉద్యోగికి ఈ నెల 13న స్వీట్లు పంపిణీ చేస్తాం. –శ్రీనివాసులు, డీఎం, మంచిర్యాల -
భూ సమస్యలు పరిష్కరించాలి
భీమిని: భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. మంగళవారం ఆయన కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. భూ భారతిలో మండలంలో దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారని ఆరా తీశారు. ఆయా గ్రామాల్లోని పెండింగ్ సమస్యలపై విచారణ చేపట్టి పరిష్కరించాలని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని తెలిపారు. తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ పోచయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంటు
● డీఏ బిల్లు తయారీకి లంచం డిమాండ్ ● రూ.6వేలు తీసుకుంటుండగా పట్టివేత ● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు మంచిర్యాలక్రైం: డీఏ బిల్లు తయారీకి లంచం డిమాండ్ చేసిన ఆరోగ్యశాఖ జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు వివరాలు వెల్లడించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీనివాస్ కోటపల్లి మండలం అంగరాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్చార్జి జూనియర్ అసిస్టెంట్‌గానూ పని చేస్తున్నాడు. అంగరాజుపల్లిలోనే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పని చేసిన తోట వెంకటేశ్వర్లు ఇటీవల ఉద్యోగ విరమణ పొందాడు. రెండు నెలల డీఏ బిల్లు చేసేందుకు శ్రీనివాస్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడు. లంచం ఇస్తే బిల్లు చేస్తానని చెప్పడంతో రూ.6వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఒప్పందం ప్రకారం కలెక్టరేట్‌కు సమీపంలోని ఓ హోటల్ వద్ద వెంకటేశ్వర్లు నుంచి శ్రీనివాస్ రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కలెక్టరేట్లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో పూర్తి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఏసీబీ డీఏస్పీ మధు మాట్లాడు తూ లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి అంటూ టోల్ ఫ్రీ నంబర్ 1064, మొబైల్ నంబర్, 9440446106 నంబర్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు తక్షణ సహాయం, సౌకర్యార్థం ప్రతీ జిల్లాలో పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, 24 గంటలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో విద్యుత్, నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి -
లక్ష్య సాధనపై సింగరేణి దృష్టి
● సంస్థ స్థితిగతులపై ఉద్యోగులకు అవగాహన ● ఉత్పత్తి పెంపునకు చర్యలు ● మల్టీడిపార్టుమెంటల్ సమావేశాలు శ్రీరాంపూర్: సింగరేణిలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పని సంస్కృతిని మెరుగుపర్చేందుకు యాజమాన్యం దృష్టి సారించింది. బొగ్గు మార్కెట్లో పోటీ నెలకొనడం, గనులన్నీ పాతవి కావడం, సంప్రదాయ పని విధానం, కొత్తగనులు రాకపోవడం, యంత్రాల వినియోగం తగ్గడం వెరసి సంస్థ సవాళ్లు ఎదుర్కోంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీని గట్టెక్కించి ఉజ్వల భవిష్యత్‌కు పునాది వేయడం కోసం అధికారులు సంస్థ స్థితిగతులపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు. వనరుల సద్వినియోగం వల్ల సంస్థ లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఇందుకోసం ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్‌ల్లో మల్టీడిపార్టుమెంటల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమైన సమావేశాలు ఈ నెల 18వరకు కొనసాగుతాయి. భూగర్భగనులు, ఓసీపీలు, డిపార్టుమెంట్లపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, లాభనష్టాలు, యంత్రాల పనితీరు, బొగ్గు నాణ్యత, గత సంవత్సరం సాధించిన ఉత్పత్తి ఉత్పాదకత ఎలా ఉంది, భూగర్భగనుల్లో వస్తున్న నష్టాలు, ఓసీపీలో వస్తున్న లాభాలతో సమం చేస్తుండడంపై కంపెనీ, ఏరియా స్థాయితోపాటు గనులవారీగా గణాంకాలు తీసి వివరిస్తున్నారు. నష్టాలు తగ్గించడానికి ఏం చేయాలి, ఏ చర్యలు తీసుకుంటే ఉత్పత్తి పెరుగుతుందో తెలియజేస్తున్నారు. సద్వినియోగంతోనే ఉపయోగంబొగ్గు ఉత్పత్తిలో భూగర్భ గనుల్లో ఎస్డీఎల్ యంత్రాల వినియోగం పెంచాలని సూచిస్తున్నారు. ఒక ఎస్డీఎల్ యంత్రం రోజు 133 టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 100 టన్నుల వరకే సాధిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. వంద శాతం ఉత్పత్తి సాధిస్తే ఉత్పత్తి పెరిగి నష్టం తగ్గుతుందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తి చేస్తే రూ.9,468 ఖర్చవుతుంది. దీన్ని విక్రయిస్తే రూ.4864 వస్తుంది. ఈ లెక్కన టన్ను బొగ్గు ఉత్పత్తి చేస్తే కంపెనీకి రూ.4602 నష్టం వస్తున్నట్లు లెక్కలేసి చెబుతున్నారు. డ్రిల్మిషన్ల పనితీరు, ప్రస్తుతం పనిగంటలు, లక్ష్యం ఎంత వివరిస్తున్నారు. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే షవల్స్ పనితీరు మెరుగుపర్చాలని, డంపర్లు 18 గంటల పని చేయాలని, బొగ్గు నాణ్యత పాటించకపోవడం వల్ల రూ.కోట్లు ఫెనాల్టీ చెల్లించాల్సి రావడం అంశాలు తెలియజేస్తున్నారు. స్పేర్స్ కొరత.. నాసిరకం పరికరాలుఅధికారులు ఎంత చెప్పినా కంపెనీ పరంగా చర్యలు తీసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని కార్మికులు పేర్కొంటున్నారు. భూగర్భ గనుల్లో చాలా వరకు ఎస్డీఎల్ యంత్రాలు సర్వే ఆఫ్ అయినవే ఉన్నాయి. వాటితోనే పని చేస్తున్నారు. దీనికి తోడు స్పేర్స్ కొరత తీవ్రంగా ఉంది. స్పేర్స్ సమయానికి బ్రేక్డౌన్ల వల్ల నష్టం జరుగుతోంది. మరికొన్ని సందర్భాల్లో నాసిరకం ఆయిల్స్, విడిభాగాలు లేకపోవడం వల్ల యంత్రాలు మొరాయించి ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయని కొందరు అధికారులే పేర్కొంటున్నారు. ఓసీపీల్లో కాంట్రాక్టర్లు ఓబీ లక్ష్యాలను తీయకపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. అనుభవం, సామర్థ్యం లేని సంస్థలకు ఓబీ పనులు అప్పగించడం, టెండర్లలో విధానపర లోపాలు, ఓబీ వెలికితీతకు సరిపడా యంత్రాలను సమకూర్చుకోకపోవడం వెరసి సంస్థ ఉత్పత్తి లక్ష్యాలపై ప్రభావం చూపుతుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యాలు పెరగడం, యూనియన్ నేతలు, కార్యకర్తలు కొందరు పూర్తి స్థాయిలో గనుల్లోకి దిగి పనిచేయకుండా ఉచిత మస్టర్లు పొంది సంస్థకు నష్టం చేస్తున్న సందర్భాలూ లేకపోలేదు. ఈ వ్యవస్థాగత లోపాలను సరిచేయాల్సిన బాధ్యత కూడా యాజమాన్యంపై ఉంది. -
‘అత్యవసర సేవకులే కాదు.. ప్రాణదాతలు’
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు అంతరాయం లేకుండా అందిస్తున్న అత్యవసర సేవకులే కాదు.. రక్తదానం చేసి ప్రాణదాతలు కూడా అయ్యారని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే అ న్నారు. మంగళవారం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ భవనంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమి యా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తుల సహాయర్థం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాల రక్తనిధి కేంద్రానికి ప్రతీ సంవత్సరం విద్యుత్ శా ఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కే.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రక్తనిధి కేంద్రంలో నిల్వలు అట్టడుగు స్థాయికి చేరా యని, స్వచ్ఛంద సేవాసంస్థలు, యువత ముందుకు రావాలని తెలిపారు. జేఏసీ చైర్మన్ సత్తిరెడ్డి, రమేష్, డీఈ ఎంఎం ఖైసర్, బెల్లంపల్లి డీఈ రాజన్న, ఏడీఈ మోహన్‌రెడ్డి, రాజశేఖర్, రవికుమార్, కాటం శ్రీనివాస్, శరత్, ఏఈ మంచాల శ్రీరివాస్, క్రిష్ణ పాల్గొన్నారు. -
కొత్త ప్లాంటు పనులపై సమీక్ష
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో డైరెక్టర్(ఈఅండ్ఎం) డీ.సత్యనారాయణరావు పర్యటించారు. మంగళవారం ఎస్టీపీపీ ప్రాణహిత గెస్ట్‌హౌస్‌లో అధికారులతో 800 మెగావాట్ల ప్లాంటు ప నులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయంలో మూడో యూని ట్ ప్లాంటును ఏర్పాటు చేయాలని అన్నారు. మిథనాల్ ప్లాంటు నిర్మాణ పనులను పర్యవేక్షించి త్వరి తగతిన పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్లాంటు పరిసరాల్లో సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్టీపీపీ ఈడీ సీహెచ్.చిరంజీవి, హెచ్‌వోడీ(పీపీడీ) కే.విశ్వనాథరాజు, జీఎం(ఎస్టీపీపీ) శ్రీనివాసులు, జీఎం(పీసీఎస్, ఓఅండ్ఎం) నరసింహరావు, ఏజీఎం(ఫైనాన్స్) మురళీధర్, ఏజీఎం(ఈఅండ్ఎం) మదన్మోహన్, ఏజీఎం(సోలార్) శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్‌కు ఘన సన్మానంశ్రీరాంపూర్: సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) డీ.సత్యనారాయణరావును ఏరియా అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ నెలాఖరుతో రిటైర్డ్ కాబోతున్న ఆయన మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌ను సందర్శించిన సందర్భంగా సన్మానం చేశారు. ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, వర్క్‌షాప్ డీజీఎం రవీందర్, అధికారులు పాల్గొన్నారు. -
కదిలే స్పీడ్ బ్రేకర్లు..!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో రోడ్ల పై పశువులు సంచరిస్తూ వాహనదారులకు ప్రాణసంకటంగా మారాయి. వాహనాల వేగా నికి ఒక్కసారిగా బ్రేక్‌లు వేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పాతమంచిర్యాల, నగరంలోని జాతీయ రహదారులపై పశువులు గుంపులుగా తిరుగుతున్నాయి. తోళ్లవాగు నుంచి శ్రీనివాసగార్డెన్, ఐబీ చౌరస్తా నుంచి వేంపల్లి, లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి బైపాస్ రోడ్డు మీదుగా వైశ్యాభవన్ వరకు పశువులు నిత్యం రోడ్లపై మకాం వేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. జిల్లా కేంద్రం కావడం, వివిధ ప్రాంతాల ప్రజలు పనుల నిమిత్తం వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 8న రాత్రి మంచిర్యాలలోని శ్రీనివాసకాలనీకి చెందిన శీకా మణిబాబుతోపాటు మరో నలుగురు ఓమిని వ్యాన్‌లో కరీంనగర్ నుంచి వస్తుండగా పాతమంచిర్యాల వద్ద రోడ్డుపై పడుకుని ఉన్న ఆవుని ఢీకొన్నారు. దీంతో వ్యానులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆవు యజమాని కార్తీక్‌పై మంచిర్యాల పోలీసుస్టేషన్లో 9న కేసు నమోదైంది. ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కార్పొరేషన్ అధికారులు స్పందించి పశువులు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
చట్టప్రకారం నడుచుకుంటేనే సహకారం
● అటవీ భూములు సాగు చేస్తే చర్యలు ● కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి: గిరిజనులు చట్టప్రకారం నడుచుకుంటేనే సహకారం అందించి జీవనోపాధి కల్పిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని లింగాపూర్ అటవీ బీట్‌లో కొద్ది రోజులుగా సమీప గ్రామాల గిరిజనులు చెట్ల పొదలు తొలగించి సాగుకు ప్రయత్నిస్తున్నారు. అటవీ, పోలీసు అధికారులు నచ్చజెప్పినా వినిపించుకోవడం లేదు. దీంతో వారందరితో మాట్లాడేందుకు మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్ డీఎఫ్ఓ శివ్‌ఆశిష్‌సింగ్, డీసీపీ భాస్కర్‌తో కలిసి తాత్కాలిక గుడిసెల్లో ఉంటున్న గిరిజనుల వద్దకు వెళ్లారు. కలెక్టర్ మాట్లాడుతూ 2005కంటే ముందు పోడు వ్యవసాయం చేసుకుంటూ అందుకు తగిన ఆధారాలున్న వారికి మాత్రమే పోడు పట్టాలు ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత అక్రమంగా అటవీ భూముల్లో చెట్లు తొలగించి సాగు ప్రయత్నాలు చేసే వారికి ఎలాంటి పట్టాలు ఇవ్వబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆక్రమిత అటవీ భూముల్లో వెదురు, పండ్లతోటలు పెంచుకునే అవకాశం కల్పిస్తామని, మొక్కలు నాటి సంరక్షించినందుకు కూలి చెల్లించడంతోపాటు వాటిని విక్రయిస్తే వచ్చే ఆదాయాన్ని సంబంధిత గిరిజనులకే చెందేలా చూస్తామని అన్నారు. కొందరు గిరిజనులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో కలెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎఫ్‌వో, డీసీపీ సూచించారు. గిరిజనులు ఆలోచించి అభిప్రాయాన్ని తెలియజేయాలని అన్నారు. ఏసీపీ ప్రకాశ్, తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, సీఐ రమణమూర్తి, ఎస్సైలు తహాసీనొద్దీన్, సురేష్, అనూష, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా, గిరిజనులతో మాట్లాడేందుకు అధికారులంతా అడవిలో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లారు. -
అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన ఇద్దరిపై కేసు
రామకృష్ణాపూర్: అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరిపై కేసు న మోదు చేసినట్లు మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మంగళవారం పో లీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లలో అశ్లీల వీడియోలు పోస్ట్ చేసినట్లు నేషనల్ సెంటర్ ఫర్ మి స్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ) సంస్థ వారు గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్‌కు సమాచారం ఇచ్చారు. వారు ఆ కేసును తమకు అప్పగించడంతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. -
కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలోని కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏటీడీవో క్రాంతికుమార్ అన్నారు. మంగళవారం కొలాం హబిటేషన్ గ్రామాలైనా కొత్తపల్లి–హెచ్ కొలాంగూడ, భీంపూర్ కొలాంగూడ, బొజ్జుగూడలలో నూతనంగా ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలాం గిరిజన పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. సీఆర్టీలను నియమించి విద్యాబోధన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పీఎం జన్మన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం బలిరాం, ఎస్సీఆర్పీ రాజబాబు, విజయ్‌కుమార్, సీఆర్టీ రోహిదాస్ చౌహాన్, రామేశ్వర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
తాంసి: మద్యం మత్తులో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొన్నారిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గుమ్ముల నరేశ్ (31) కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. ఈక్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణకు గ్రామంలో పలువురి వద్ద అప్పులు సైతం చేశాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి.ప్రభాకర్ మృతదేహన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టెబుల్ తెలిపారు. జీవితంపై విరక్తితో ఒకరు..భైంసారూరల్: జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కుంబి గ్రామానికి చెందిన ఉప్పులవార్ మాధవరావు (49) గ్రామంలో గొర్రెల కాపరిగా పనిచూస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉరేసుకుని ఒకరు..కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ఓ లాడ్జిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన నరేందర్(40)కు పదిహేనేళ్ల క్రితం వాంకిడి మండలానికి చెందిన సంతోషితో వివాహమైంది. ఏడాదిక్రితం అతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మానసికంగా బాధపడుతూ ఊర్లు తిరుగుతుండేవాడు. ఈక్రమంలో కాగజ్‌నగర్‌కు వచ్చి లాడ్జిలో బస చేశాడు. మంగళవారం గదిలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకున్నాడు. మృతుని సోదరుడు భూంపల్లి ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని జీఎస్ ఎస్టేట్‌లో నివాసముంటున్న ఆనంద్ త్రిపాఠి ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ఈ నెల 6న ఇంటికి తాళం వేసి మధ్యప్రదేశ్‌కు వెళ్లాడు. సోమవారం సాయంత్రం అతని స్నేహితుడు శివకుమార్ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా కిటికి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు. లోపలికి వెళ్లిచూడగా తాళం పగులగొట్టి ఉండడంతో విషయాన్ని స్నేహితుడికి సమాచారం అందించాడు. లాకర్లో ఉన్న రూ.10వేల నగదు, రిస్ట్ వాచ్, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు పేర్కొన్నాడు. శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. జఠాశంకర ఆలయంలో..ముధోల్: మండల కేంద్రంలోని జఠాశంకర ఆలయంలో మంగళవారం చోరీ జరిగినట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని దొంగ ఆలయంలో ఉన్న హుండీ పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్ళాడు. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆలయానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. -
మస్తిష్క నియంత్రణ అమరిక ఫలితంగానే...
గర్భస్థదశలో శిశువు ఉన్నప్పుడు ఏర్పడిన జన్యు ప్రభావంతోనే ఎడమచేతివాటంగా జన్మిస్తారు. కొందరిలో వంశపారంపర్యంగా, పరిసర కారకాల ప్రభావంతో కూడా ఏర్పడుతుంది. వారు ప్రతీపనిని ఎడమచేతితో చేసేందుకు ప్రయత్నిస్తారు. మస్తిష్కనియంత్రణ అమరిక ఫలితంగా కూడా ఎడమ చేతివాటం ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. వీరు అందరిలోకన్నా భిన్నత్వాన్ని, మేధాశక్తిని అధికంగా కలిగి ఉంటారని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సమాజంలో ప్రత్యేక నైపుణ్యాలతో పేరు ప్రతిష్టలు పొందిన వారిలో చాలామంది ఎడమచేతివాటం వారే. – అప్పాల చక్రధారి, సీనియర్ పిల్లల వైద్యనిపుణులు, నిర్మల్ -
కాలినడకన వెళ్లి..చికిత్స అందించి
నార్నూర్: ఏజెన్సీలో కొలాం గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. సదరు వైద్యసిబ్బంది మంగళవారం మండలంలోని కొత్తపల్లి (హెచ్) కొలాంగూడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీంపూర్ బొజ్జుగూడ (కొలాంగూడ) గ్రామానికి కాలినడకన వెళ్లి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చికిత్స అందించారు. 15 రోజులకు ఒకసారి కొలాం గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు అందిస్తామని స్టాఫ్‌నర్స్ జంగుబాయి తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆమె వెంట ఎల్టీ గంగాదేవి, పారామెడికల్ అసిస్టెంట్ సావిత్రిబాయి, ఆశ కార్యకర్త లక్ష్మీబాయి, తదితరులు ఉన్నారు. -
గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ పంజాబీ దాబా వద్ద మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. రెబ్బెన మండలం ఖైర్‌గాంకు చెందిన గన్నా శ్రవణ్‌కుమార్, మహారాష్ట్రలోని రాజూరకు చెందిన అరున్ రామారావు ముమారే వద్ద నుంచి 60 గ్రాముల (10 ప్యాకిట్లు) గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు సంజీవ్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. -
తొడసం కై లాస్‌కు సన్మానం
ఉట్నూర్‌రూరల్: రాష్ట్రపతి ఆహ్వానం అందుకున్న తొడసం కై లాస్‌ను ఆదివాసీ బిరుదుగోండి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాంజీగోండ్ భవన్లో మంగళవారం సన్మానించారు. గోండిభాషలో మహాభారత్ గ్రంథాన్ని రచించి ఏఐ ద్వారా అనేక పాటలు సృష్టించిన తొడసం కై లాస్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు వారు పేర్కొన్నారు. ఆర్చరీ (విలువిద్య)లో అనేక మందికి శిక్షణనిచ్చి, ఇటీవల పురస్కారం అందుకున్న చించుఘాట్ గ్రామానికి చెందిన కాత్లే మారుతిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మర్సుకోలా తిరుపతి, ప్రధాన కార్యదర్శి తొడసం శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు పెందూర్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. -
కుడి.. ఎడమైతే!
● నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ● అందరిలో ప్రత్యేకతగా.. ● ఉమ్మడి జిల్లాలోనూ ఎడమచేతివాటం వ్యక్తులు ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు నిర్మల్ జిల్లాలోని గుండంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సిలారి మధు, విద్యార్థులు. ఉపాధ్యాయుడితో పాటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న దాదాపు పదిమంది విద్యార్థులు ఎడమ చేతివాటం కలిగి ఉన్నారు. పాఠ్యాంశ బోధనలోనూ ఎడమవైపు చేతిద్వారానే అనువుగా ఉంటుందని చెబుతున్నారు. మిగతా వారితో పోల్చితే ఎడమచేతివాటం కలిగిన విద్యార్థులు విద్య, విద్యేతర విషయాల్లో చురుగ్గా ఉన్నారని వారు పేర్కొంటున్నారు.నిర్మల్‌ఖిల్లా: కుడిఎడమైతే పొరపాటు లేదోయ్...అన్నాడో సినీ కవి.. అంటే వ్యక్తిలోని భిన్నత్వాన్ని బట్టి ప్రత్యేకతను ఆపాదిస్తాం. ఎడమ చేతివాటం అనేది జన్యు ప్రభావ ఫలితంగా ఏర్పడిందని వైద్య పరిశోధనలు సైతం రుజువు చేస్తున్నాయి. సమాజంలోని మనుషులలో ప్రతిఒక్కరూ భిన్నమైన గుణాన్ని కలిగి ఉంటారు. అందులో కొందర్ని మాత్రం ప్రత్యేకతను బట్టి సులభంగా గుర్తిస్తాం. చిన్ననాటి నుంచే జన్యు ప్రభావ ఫలితంగానే కుడి, ఎడమ చేతివాటాలు సంభవిస్తాయని సైన్స్ చెబుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎడమ చేతి వాటం కలిగినవారు పలువురు ఉన్నారు. నేడు ప్రపంచ ఎడమ చేతివాటం వ్యక్తుల దినోత్సవం (వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే)గా జరుపుకుంటున్న నేపథ్యంలో సాక్షి కథనం. ప్రోత్సహిస్తేనే మంచిది.. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెడతారు. ఈ సమయంలోనే కుడి, ఎడమ చేతివా టాలను గుర్తించవచ్చు. ఎడమ చేతి వాటాన్ని తల్లిదండ్రులు ఒక చెడు అలవాటుగా భావించి మాన్పించేందుకు ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
వేధింపులతో మహిళ మృతి
తలమడుగు: వేధింపులతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు తలమడుగు మండలంలోని కజర్ల గ్రామానికి చెందిన మొట్టె మానస(25)కు అదే గ్రామానికి చెందిన గంపల ప్రశాంత్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ప్రశాంత్ ఆర్మీలో ఉద్యోగం చేస్తుండడంతో మానసను జమ్మూకశ్మీర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ భర్త, అత్తామామలు శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఆరోగ్యం క్షిణించింది. దీంతో మహిళ కుటుంబ సభ్యులు కజ్జర్లకు తీసుకువచ్చి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చేర్పించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి పూర్ణచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు..మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడ సమీపంలో రహదారిపై ఈ నెల11న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయికుంటకు చెందిన రామటెంకి రాజవ్వ (84) మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వృద్ధురాలు సోమవారం చున్నంబట్టి వాడ సమీపంలో రోడ్డు దాటుతుండగా మంచిర్యాల వైపు నుంచి శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. రాజవ్వకు తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కూతురు మల్లక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బ్యాంక్ సిబ్బందిపై దాడి!ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ షాపు యజమాని బ్యాంక్ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. మంగళవారం బ్యాంక్ రుణానికి సంబంధించి రికవరీ కోసం వెళ్లగా బ్యాంక్ ఉద్యోగులు, షాపు యజమానికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో షాపు యజమాని కత్తెరతో దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్‌ను వివరణ కోరగా.. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. అదుపుతప్పి వ్యాన్ బోల్తాబెల్లంపల్లి: బెల్లంపల్లి శివారులోని నేషనల్హైవే బైపాస్ రోడ్డుపై మంగళవారం తెల్లవారు జా మున సరుకుల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో రోడ్డుపక్కన బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డా డు. ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలే వీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
ఎన్ఆర్ఐ కృష్ణపై కేసు నమోదు
ఇంద్రవెల్లి: రిమ్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసగించిన మండలంలోని శంకర్‌గూడకు చెందిన ఎన్ఆర్ఐ, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ చైర్మన్ జవాడే కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన డిగ్రీ విద్యార్థి తుంగపిండి ఉదయ్‌కుమార్‌కు కృష్ణతో పరిచయం ఏర్పడింది. మే నెలలో వారింటికి వెళ్లి రిమ్స్‌లో ఏఎన్ఎం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మీ అమ్మకి ఇప్పిస్తానని చెప్పడంతో జూన్ 3న ఉదయ్‌కుమార్ తన తల్లితో కలిసి ఆదిలాబాద్‌లోని రామ్‌నగర్‌లో ఉన్న డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి రూ.2.30 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం పలుమార్లు కార్యాలయానికి వెళ్లగా అక్కడ కృష్ణ కనిపించలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎసై తెలిపారు. వినాయక మండపం కూల్చివేతబెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 21 వార్డు బూడిదగడ్డ బస్తీలో నిర్మిస్తున్న వినాయక మండపాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ కృష్ణ , వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరావు పరిశీలించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అనుమతి లేకుండా మండపం నిర్మించడం సరికాదని నిర్వాహకులకు సూచించారు. కడెం ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేతకడెం: ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్‌కు మంగళవారం రాత్రి 4,812 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరడంతో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు రెండు వరద గేట్లను ఎత్తి 12,833 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.775 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. యూరియా కోసం రైతుల వెతలుతాండూర్: ఖరీఫ్ సీజన్లో వివిధ రకాల పంటలు సాగుచేసిన మండల రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటల సాగు అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా కాకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. మండల సహకార సంఘానికి ప్రస్తుతం 12 టన్నుల (260 బస్తాలు) యూరియా మాత్రమే సరఫరా అయ్యింది. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో అన్నదాతలు గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంద్రవెల్లి: మండల కేంద్రంలోని పీఏసీఎస్, హక రైతు సేవ కేంద్రం, ఫర్టిలైజర్ దుకాణాల్లో గత 10 రోజులుగా యూరియా కొరత ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు మానేసి దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. కొన్నిషాపుల్లో యూరియా ఉన్న అవసరంలేని మందులతో లింకులుపెట్టి వాటిని అంటగడుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి యూరియా కొరతలేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
సింగరేణిని పరిరక్షించుకోవాలి
● ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్‌ప్రసాద్ శ్రీరాంపూర్: సింగరేణిని పరిరక్షించుకోవాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ ప్రసాద్ అ న్నారు. మంగళవారం నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, సంస్థ పరిరక్షణకు సేవ్ వర్కర్స్...సేవ్ సింగరేణి కార్యక్రమంలో భాగంగా ఈనెల 14న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, 22న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీ స్ను ముట్టడించనున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న పలు నిర్ణయాలు కా ర్మికులకు ఇబ్బందిగా మారాయన్నారు. పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించడం, కారుణ్య ఉద్యోగాల కల్పనలో ఇబ్బందులకు గురి చేయడం, 3,600 మందిని విజిలెన్సు కేసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కంపెనీలో కార్మికుల సంఖ్యను కుదించినట్లు అధి కారులను ఎందుకు తగ్గించడం లేదన్నారు.సమావేశంలో ఆ యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపల్లి సమ్మయ్య, జెట్టి శంకర్రావు, ఉపాధ్యక్షులు గరి గే స్వామి, కలవేన శ్యాం, ప్రధాన కార్యదర్శి ఏ నుగు రవీందర్‌రెడ్డి, నాయకులు జీవన్‌జోయల్, తి రుపతి రాజు, అశోక్, మెండె వెంకటి పాల్గొన్నారు. -
● గల్ఫ్ దేశాలకు వెళ్లి జిల్లా యువత అష్టకష్టాలు ● పర్యాటకవీసాలపై నైపుణ్యరహిత పనుల్లో చేరిక ● చట్టాలపై అవగాహన లేక చేయని నేరానికి జైలుకు ● క్షేమసమాచారం తెలియక బాధిత కుటుంబసభ్యుల ఆందోళన
ఉపాధివేటలో ఆగిన గుండె ● ఉజ్బెకిస్తాన్‌లో వలస కార్మికుడి మృతి నిర్మల్‌ఖిల్లా: ఉపాధివేటలో విదేశాలకు పయనమైన జిల్లాకు చెందిన యువకుడి గుండె అక్కడే ఆగింది. దస్తూరాబాద్ మండలం మున్యాల్ గ్రామ పంచాయతీ పరిధి కొత్తపెద్దూర్ గ్రామానికి చెందిన సంగ సురేశ్ (33) ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గల్ఫ్ దేశం వెళ్లేందుకు సురేశ్ కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన సబ్ ఏజెంట్‌ను సంప్రదించి రూ.2.50 లక్షలు ముట్టజెప్పాడు. సదరు సబ్ఏజెంటు మొదట 9 రోజులు ఢిల్లీలో ఉంచి అక్కడి నుంచి టూరిస్ట్ వీసా మీద ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంటుకు పంపాడు. అక్కడ క్లీనింగ్ పని కోసం 15 రోజులు శిక్షణ పొందాడు. అనంతరం డ్యూ టీలో చేరిన నాల్గొవ రోజు (గత నెల 21) గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో సురేశ్ మృతి చెందినట్లు కంపెనీప్రతినిధులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కాగా అక్కడి ఏజెంట్ మృతదేహాన్ని కార్గోలో పంపడానికి డబ్బు ఖర్చువుతుందని, ఢిల్లీ వరకు మాత్రమే పంపగలమ ని రోజుకో మాట చెబుతూ కాలయాపన చేస్తున్నట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు. కలెక్టర్, రాష్ట్ర ఎన్ఆర్ఐ సభ్యులకు వినతి.. తాజాగా సోమవారం మృతుడి భార్య సంగ మమత, ఇద్దరు పిల్లలు, మామ జింక భూమన్నలతో కలిసివచ్చి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు సమస్య విన్నవించా రు. స్పందించిన కలెక్టర్ వివరాలు తీసుకొని మృతదేహం త్వరగా ఇండియా పంపేలా చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అ నంతరం రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ స భ్యుడు స్వదేశ్ పర్కిపండ్లకు వివరాలతో కూ డిన పత్రాలు అందించి మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు. ఏజెంట్‌కు కట్టిన నగదు తిరిగి ఇప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించారు. నిర్మల్‌ఖిల్లా: ఉన్న ఊరిలో పనులు లేక కుటుంబాలను పోషించుకునేందుకు గ్రామీణ పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు దేశం కాని దేశం వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. కంపెనీ వీసాలు దొరక్క విజిట్ వీసాలపై వెళ్లిన వారి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఉపాధి వేటలో ఎలాగైనా గల్ఫ్ దేశం వెళ్లాలన్న యువకుల బలమైన కాంక్షను ఆసరాగా చేసుకున్న నకిలీ ఏజెంట్లు తాత్కాలిక, పర్యాటక వీసాలను అంటగట్టి రూ.లక్షలు దోచేస్తున్నారు. అలా వెళ్లిన జిల్లా వలస కార్మికులు నైపుణ్య రహిత పనుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. గల్ఫ్ దేశాల చట్టాల ప్రకారం వీసా లేకుండా పనిచేయడం నేరం కావడంతో అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వారి జాడ, క్షేమ సమాచారం స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియక తల్లడిల్లుతున్నారు. జిల్లాలో ఇలాంటి కేసులు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఏజెంట్ల వలలో చిక్కి.. కంపెనీ ఉద్యోగాల పేరిట అధిక వేతనాల ఆశ చూపుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెంట్లు గ్రామీణ మధ్యతరగతి యువతకు ఎరవేస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఉన్నతంగా స్థిరపడిన వా రిని చూసి యువత తామూ అలాగే ఎదగొచ్చని ఆశపడుతూ అప్పుచేసి రూ.లక్షలు ముట్ట చెబుతున్నా రు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోతున్నా రు. గత ఆరు నెలల కాలంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన జిల్లాకు చెందిన పలువురు యువకులు అక్కడి పోలీసులకు చిక్కడంతో ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. నైపుణ్య రహిత పనుల్లోనే.. విదేశాలకు వెళ్లాలన్న తపనతో రూ.లక్షలు వెచ్చించి అక్కడ నైపుణ్య రహిత పనులైన భవన నిర్మాణ రంగం, ఆఫీస్ బాయ్, క్లీనింగ్ తదితర పనులు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, ఉన్నతచదువులు లే కపోవడం, నైపుణ్య రంగాల్లో అనుభవం లేకపోవ డం కూడా ఇందుకు మరో కారణంగా గల్ఫ్ సంక్షేమ సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా వివిధ వృత్తి పనుల్లో అనుభవం కలిగి ఉండాలని, అలాంటి పనుల నిమిత్తమే రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారావిదేశాలకు ఉపాధి కోసం వెళ్లాలని సూచిస్తున్నారు.ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలు.. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన పన్నాల శ్రీనివాస్ సౌదీ అరేబియా దేశం వెళ్లి గత మేలో పనిలో చేరాడు. అక్కడి యజమాని తన వ్యవసాయ క్షేత్రానికి పంపగా ఒకసారి భార్య పిల్లలకు ఫోన్ చేశాడు. అనంతరం అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి క్షేమ సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సోన్ మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన కిస్టాపురం లక్ష్మన్న సబ్ ఏజెంట్ ద్వా రా రూ.2లక్షలు వెచ్చించి దుబాయ్‌కి లేబర్ సప్లయ్ కంపెనీ వీసా ద్వారా వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సరైన వేతనం కూడా లేకపోవడంతో స్వదేశానికి రప్పించే ఏర్పాటు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన గొర్రె రాజేందర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆయన వేతన ఖాతాలో అక్రమ నగదు బదిలీ కాగా కేసులో ఇరుక్కున్నాడు. స్వదేశానికి తిరిగి రాలేక అక్కడి పోలీసుల అదుపులో ఉన్నాడు. తమ కొడుకుని ఎలాగైనా ఇండియాకు రప్పించాలని తండ్రి గంగన్న, కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన సాయినాథ్, సారంగాపూర్ మండలం దేవితండాకు చెందిన జాదవ్ మధుకర్ గల్ఫ్ దేశాల్లో వివిధ రకాల కేసుల్లో ఇరుక్కొని అష్టకష్టాలు పడుతున్నారు. కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గొర్రెకర్ శ్రీనివాస్ దుబాయ్‌లో సైబర్ నేరం కేసులో కటకటాలపాలవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి నకిలీ ఏజెంట్లను నమ్మి విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లొద్దు. వృత్తిపరమైన శిక్షణతో కూడిన పనులకు మాత్రమే వెళ్లాలి. రిజిస్టర్డ్ ఏజెంట్లు, కంపెనీల ద్వారా వీసా రుసుము చెల్లించిన తర్వాతనే పయనమవ్వాలి. ప్రవాసీ భారత బీమా యోజన ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. గల్ఫ్ దేశాల నియమ, నిబంధనలు, చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి. – మంద భీమ్‌రెడ్డి, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ ప్రతినిధి, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్‌చైర్మన్ -
● గతేడాది కంటే సగటున ఒకమీటరు దిగువకు నీటిమట్టం ● లోటు వర్షపాతంతో పైకి చేరని భూగర్భ జలాలు ● వర్షపు నీటిని ఒడిసిపడితేనే నీటి లభ్యత మెరుగు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భ జలాలు గతేడాది కంటే ఈ ఏడాది ఇంకా దిగువనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ సీజన్లో ఆశించిన మేర వర్షపాతం అందించలేదు. జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే నమోదవుతోంది. దీంతో భూగర్భ జలాలు సైతం భూమి లోపలే ఉంటున్నాయి. వర్షాకాలం ఆరంభమై మూడునెలలు కావస్తున్నా గోదావరి నదిలోకి ఇంకా వరదలు రాలేదు. దీంతో నీటివనరుల్లో ప్రవాహం లేదు. వాగులు, వంకలు గరిష్ట నీటితో పారలేదు. చాలా వరకు చెరువులు పూర్తిస్థాయిలో నిండలేదు. గత నెల, ఈ నెలలో వానలు కురిసినప్పటికీ భారీ వర్షాలు లేక నీటి వనరుల్లో సరిపడా నీరు లేదు. దీంతో భూగర్భజలాలు పైకి రావడం లేదు. జిల్లాలో ఫిజోమీటర్లు ఏర్పాటు చేసిన చోట్ల నీటి లభ్యతను లెక్కించి ఏ ప్రాంతాల్లో ఎంత మేర నీళ్లు ఉన్నాయని భూగర్బ జలాల అధికారులు నమోదు చేస్తుంటారు. ఈ లెక్కల ప్రకారం గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది జిల్లాలో సగటున సుమారు ఒకమీటరు లోపలే నీరు ఉండడం గమనార్హం. అత్యధికంగా చెన్నూరు, కోటపల్లి మండలాల్లో సగటును రెండు మీటర్ల లోతుకు ఊట పడిపోయింది. మిగతా మండలాల్లోనూ అన్నింటిలో సగటున లోతు ఒక మీటరు ఉంది. వరద రాక.. నీరు ఇంకక ఈసారి వర్షాలు ఆశించిన మేర కురియకపోవడంతో వరదలు వచ్చి చెరువులు, కుంటలు ఉప్పొంగలేదు. దీంతో వరదలు వస్తేనే మళ్ళీ నీటివనరులు నిండి భూమిలోకి నీరు ఇంకే అవకాశం ఉంటుంది. అలా ఇంకిన నీరే భూగర్భ జలాలుగా నిల్వ కానున్నాయి. వీటినే సాగు, తాగునీటికి అవసరమైనప్పుడు వీటిని వెలికితీసుకునే అవకాశం ఉంది. జిల్లా పరీవాహక ప్రాంతాలకు గోదావరి, ప్రాణహిత నదులు, చిన్న, మధ్యతరహా నీటి ప్రాజెక్టులు, చెరువులు, అటవీ, కొండ ప్రాంతాలు నీటి ఇంకుడుకు ప్రధాన ప్రాంతాలుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో నీరు ఇంకే అవకాశం లేక వృథాగా నీరు వెళ్ళిపోతోంది. ఇంకుడు గుంతలు, సామూహిక గుంతల నిర్మాణం చేపడితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ సారి వర్షాలు తక్కువగా ఉండడంతో నీరు భూమిలోకి ఇంకకపోవడంతో గతంతో పోలిస్తే తక్కువగా ఉంది. అయితే ఆందోళనకర పరిస్థితులేమి లేవని, ఈ నెలలో వర్షాలు కురిస్తే, సాధారణ స్థితికి చేరుకుంటుందని భూగర్భ జలాల అధికారులు పేర్కొంటున్నారు. వాన నీటిని ఒడిసి పట్టి ఇంకుడు గుంతల్లో నీటిని ఇంకేలా చేస్తే నీటి కొరత తీరి, భూమి పైపొరల్లోనే నీరు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.ఫిజోమీటర్లు ఉన్న ప్రాంతాల్లో భూ గర్భ జలాల సగటు (మీటర్లలో)మండలం గ్రామం గతేడాది జూలై ఈ ఏడాది జూలై బెల్లంపల్లి బెల్లంపల్లి 15.5 15.98 భీమిని రాంపూర్ 0.76 2.08 చెన్నూర్ చెన్నూర్ 6.85 8.01 చెన్నూర్ కొమ్మెర 1.53 2.62 దండేపల్లి మ్యాదిరిపేట 4.56 4.48 హాజీపూర్ హాజీపూర్ 4.86 5.12 జైపూర్ జైపూర్ 1.77 2.92 జైపూర్ కుందారం 8.75 8.58 జన్నారం ఇందన్పల్లి 4.32 3.44 కన్నెపల్లి జన్కాపూర్ 0.02 0.01 కాసిపేట కొండాపూర్ 1.61 3.75 కోటపల్లి కోటపల్లి 15.08 17.52 లక్సెట్టిపేట లక్సెట్టిపేట 0.32 0.98 మందమర్రి మందమర్రి 3.84 4.50 మందమర్రి పొన్నారం 15.41 16.66 నెన్నెల నెన్నెల 5.94 6.76 తాండూరు తాండూరు 14.21 15.54 వేమనపల్లి నీల్వాయి 0.01 0.59 జన్నారం జన్నారం 4.28 5.85 జన్నారం తపాలాపూర్ 2.96 3.09 భీమారం భీమారం 7.84 8.11 మంచిర్యాల మంచిర్యాల 4.22 6.39 నస్పూర్ నస్పూర్ 4.40 6.70 వేమనపల్లి లక్ష్మీపూర్ 3.92 4.25 కన్నెపల్లి నాయకిన్పేట్ 5.78 7.44 మొత్తం సగటు 5.54 6.45 -
వాగు దాటి.. వైద్యం అందించి
నార్నూర్: వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులపై వంతెనలు లేని గ్రామాల వాసులు ప్రమాదకరంగా వాగులు దాటాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాగా సోమవారం గాదిగూడ మండలంలోని ఆర్జుని గ్రామ పంచాయతీ పరిధి మారుగూడ గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. గ్రామానికి వెళ్లే మార్గం మధ్యలో పెద్దవాగు ఉండగా వైద్య సేవలు అందించేందుకు ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది హెచ్ఈ రవీందర్ రాథోడ్, ఏఎన్ఎం సులోచన, అరవింద్, గంగాధర్‌లు ప్రమాదకరంగా వాగు దాటారు. దాదాపు కిలోమీటరు కాలినడకన వెళ్లి వైద్యశిబిరం నిర్వహించారు. వారి వెంట ఉపాధ్యాయులు మెస్రం శేఖర్, జాదవ్ జ్యోతి, శ్యావ్రావు తదితరులు ఉన్నారు. -
భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఎత్తివేత
జన్నారం: జన్నారం గుండా పగటిపూట భారీ వాహనాల రాకపోకల నిషేధం ఎత్తివేస్తున్నట్లు వైల్డ్‌లైఫ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఏలుసింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని ఎఫ్‌డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్నారం మీదుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు భారీ వాహనాలు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గతంలో మాదిరి భారీ వాహనాలకు రూ.150 పర్యావరణ శిస్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాహనాల అనుమతి తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో రేంజ్ అధికారులు సుష్మారావు, శ్రీధరచారి, దయాకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి 20వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మామడ: ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 20వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1079.80 అడుగుల నీటి మట్టం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.49 టీఎంసీలుగా ఉంది. కాగా సరస్వతీ కాలువ కింద సాగు చేసిన పంటల కోసం 800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బాసర గోదావరిలో భక్తుల మొక్కులుబాసర: వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నూతనంగా నీరు ప్రవహిస్తుండడంతో శ్రావణమాసం పురస్కరించుకొని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదారమ్మకు దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద నీరు భారీగా వస్తోంది. ‘కార్మికుల శ్రమను దోచుకుంటున్న సంఘాలు’మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, టీబీజీకేఎస్ సంఘాలు యాజమాన్యంతో కుమ్మకై ్క సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. ఆదాయ పన్ను రద్దు, సొంతింటి కల, ప్రైవేటీకరణ అడ్డుకుని కొత్తగనులు ఏర్పాటు, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి వాగ్దానాలు ఇచ్చి గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు, నాయకులు సీతారామయ్య, జనక్‌ప్రసాద్‌లు కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ అవినీతి వాటాలతో తోడుదొంగలుగా మారారని విమర్శించారు. డిమాండ్ల సాధనలో సింగరేణి కార్మికవర్గం, కాంట్రాక్ట్ కార్మికులు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
విద్యార్థిని ఆత్మహత్య
జైపూర్: అనారోగ్య సమస్యలతో, హాస్టల్లో ఉండలేక ఇంటికి వచ్చిన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేలాల గ్రామానికి చెందిన దామెరకుంట శ్రావణి –రవి దంపతులకు వైష్ణవి, లక్ష్మీప్రసన్న ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు లక్ష్మీప్రసన్న(13) జైపూర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. ఆమె కొద్ది రోజులుగా పంటినొప్పి, చెవి నొప్పితో బాధపడుతోంది. ఆమెకు చికిత్స చేయించేందుకు నెల క్రితం తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చూపించారు. అనారోగ్య సమస్యలకు తోడు చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి ఇనుపరాడ్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ వెల్లడించారు. ‘దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి’ ఉట్నూర్‌రూరల్: ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పీవో దరఖాస్తులు స్వీకరించారు. బేల మండలం నుంచి హరిత, ఇంద్రవెల్లి మండలం జాలంతండాకు చెందిన కుమ్మర రేణుక, గాదిగూడ మండలంలోని జరీ గ్రామానికి చెందిన కుడిమేత అశ్విని, ఆత్రం భగవంతురావు ఇంద్రవెల్లి మండలం మర్కాగూడకు చెందిన సంగీత తదితరులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్జీలు సమర్పించారు. పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్ఆదిలాబాద్రూరల్: 20 ఆటోల చోరీల్లో నిందితుడిగా ఉన్న జైనూర్‌కు చెందిన సయ్యద్ అలీ అనే వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆటో చోరీలకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులు ఉండగా, అందులో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిలో సయ్యద్ అలీ అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. -
ట్రిపుల్‌ఐటీలో ఉత్తమ విద్య
● ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ బాసర: ఆర్జీయూకేటీ అందించే ఉత్తమ విద్య, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక వనరులను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బాసర క్యాంపస్‌లో నూతన విద్యార్థుల తల్లిదండ్రులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అకడమిక్ జ్ఞానంతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధించేందుకు కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు ప్రతీరోజు కనీసం 5 నిమిషాలు పిల్లలతో మాట్లాడి, వారి విద్యాప్రగతి, మానసిక స్థితి, లక్ష్యాలపై చర్చించాలని సూచించారు. అసోసియేట్ డీన్స్ డా. విటల్, డా. నాగరాజు, డాక్టర్ మహేశ్, శ్రీనివాస్, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. మెటా గేట్ అకాడమీతో ఒప్పందం ఆర్జీయూకేటీలోని మెటలర్జీ –మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మెటా గేట్ అకాడమీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ సమక్షంలో ఓఎస్డీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ మురళీధర్షన్, మెటా గేట్ అకాడమీ డైరెక్టర్ శ్రీ ఎన్. గురుప్రసాద్ సంతకాలు చేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు గేట్ ఉచిత శిక్షణ అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. మెటలర్జీ విభాగాధిపతి శ్రీ కిరణ్ కుమార్, అసోసియేట్ డీన్లు డాక్టర్ మహేశ్, డాక్టర్ విట్టల్, అధ్యాపకులు డాక్టర్ ఆర్.అజయ్, వి.అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కార్మిక సమస్యలపై పోరాడుతాం’
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని బీఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన సీసీసీ కార్నర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగులతో చేయించాల్సిన బొగ్గు ఉత్పత్తిని కూడా కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారన్నారు. బొగ్గు ఉత్పత్తి 50 శాతం పర్మినెంట్ ఉద్యోగులు, సంస్థ ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలు ప్రకటించి కార్మికులకు వాటా చెల్లించాలన్నారు. యూనియన్ రాష్ట్ర నాయకులు మండ రామాకాంత్, పులి రాజిరెడ్డి, అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, శ్రీరాంపూర్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు సత్తయ్య, కార్యదర్శి రాజేందర్, నాయకులు కమలాకర్, కిరణ్‌కుమార్, మహేందర్, నాగేశ్వర్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యూట్యూబర్ పేరిట మోసం
కౌటాల: యూట్యూబ్ స్టార్ హర్షసాయి అనుచరుడని ఆన్లైన్లో మోసాలకు పాల్పడిన మొహమ్మద్ తౌఫిక్ఖాన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు కౌటాల సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో కేసు వివరాలు వె ల్లడించారు. హర్యానాలోని మేవార్ జిల్లా లోహికాకాల గ్రామానికి చెందిన మొహమ్మద్ తౌపిక్ ఖాన్ అదే రాష్ట్రానికి చెందిన సహచరులు ముబారక్ ఖాన్, వసీమ్‌ఖాన్, అహ్మద్ ఖాన్, ఇమ్రాన్‌లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. యూట్యూబర్ హర్షసాయి పేరుతో నకిలీ నంబర్లు, వాట్సాప్ వాడుతూ ప్రజలకు ఆర్థికసాయం, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫోన్ పే, ఇతర ఆన్లైన్ మధ్యమాల ద్వారా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. గత మేలో జిల్లాలోని బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన ఆత్రం సాయిని నమ్మించి రూ. 28వేలు వసూలు చేశారు. అనంతరం అతని ఫోన్ నంబర్ కలవకపోవడంతో మోసపోయానని గుర్తించి సాయి బెజ్జూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు పై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని హర్యానాలో పట్టుకున్నారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందుతుడి వద్ద నుంచి సెల్‌ఫోన్, సిమ్‌లు, ఆన్లైన్ లావాదేవిల రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో శ్రమించిన ఎస్సైలు సర్తజ్పాషా, తేజస్విని, కానిస్టేబుల్ వినోద్, సందీప్‌ను సీఐ అభినందించారు. -
‘దేశీదారు’ పట్టివేత
ఆదిలాబాద్‌టౌన్: అక్రమంగా తరలిస్తున్న 530 దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. సోమవారం ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన అలిశెట్టి అభిలాష్ అనే వ్యక్తి రూ.24వేల విలువ గల మద్యం సీసాలను మహారాష్ట్ర నుంచి ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నాడు. కొరట గ్రామ శివారులో ఎకై ్సజ్ అఽ దికారుల రాకను గమనించి బైక్‌తో పాటు మ ద్యం సీసాలను వదిలి పరారయ్యాడు. అభిలా ష్పై కేసు నమోదు చేశామని, త్వరలో నిందితుడిని జైలుకు పంపిస్తామన్నారు. సిబ్బంది తానాజీ, ధీరజ్, హన్మంతు పాల్గొన్నారు. -
ఇంటర్ ప్రవేశాలకు మరో అవకాశం..!
కళాశాలల్లో జనరల్, వొకేషనల్ విద్యార్థుల ప్రవేశాలు ఇలా...కళాశాల జనరల్ వొకేషనల్ మొత్తంమంచిర్యాల 197 246 443 మందమర్రి 93 71 164 కాసిపేట 92 49 141 చెన్నూర్ 175 0 175 బెల్లంపల్లి(గర్ల్స్) 176 0 176 బెల్లంపల్లి 222 215 437 జైపూర్ 107 0 107 జన్నారం 99 0 99 దండేపల్లి 83 0 83 లక్సెట్టిపేట్ 274 181 455 మొత్తం 1518 762 2280మంచిర్యాలఅర్బన్: ఇంటర్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తుల గడువును మూడోసారి పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 లోపు దరఖాస్తులు అందజేయాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. జూన్ 1నుంచి ప్రారంభమైన ప్రవేశాలు జూలై 31తో ముగియగా ఆగస్టు 20 వరకు అడ్మిషన్ల గడువు పొడిగించింది. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో దరఖాస్తుల గడువు మరోసారి పెంచినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ విద్య పూర్తిగా ఉచితం.. పాఠ్యపుస్తకాలు..స్కాలర్షిప్లు పొందవచ్చంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన తీరుపై అవగాహన కల్పించారు. ఇంటర్ విద్యాశాఖ అధికారులు ప్రతీ కళాశాల ప్రిన్సిపాల్‌తో ప్రత్యేకంగా సమావేశమై క్షేత్రస్థాయిలో ఏయే చర్యలు చేపట్టాలో అవగాహన కల్పించారు. గతేడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులపై శ్రద్ధ చూపుతామని తల్లిదండ్రులకు భరోసానిస్తున్నారు. ప్రవేశాల సంఖ్య పెరిగేలా చర్యలు ముమ్మరం చేశారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా... పదో తరగతి ఫలితాలు వెలువడక ముందునుంచి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపు ప్రక్రియ వేగవంతం చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో బోధన, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఎంసెట్ శిక్షణ, రోజువారీగా స్టడీ అవర్ నిర్వహణ, సొంత భవనం, విశాలమైన ఆటస్థలం, ఆహ్లాదకరమైన వాతావరణం, స్టడీ మెటీరియల్, స్కాలర్షిప్..ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే సాధ్యమంటూ పాఠశాలల వారీగా వెళ్లి సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు అవగాహన కల్పించడంతో క్రమంగా ఇంటర్లో ప్రవేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో మూడోసారి గడువు పొడిగించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఐఈవో అంజయ్య విద్యార్థులకు సూచించారు. ఈ నెల 20 వరకు గడువు పెంపు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచనలక్సెట్టిపేట్లో అత్యధికంగా ప్రవేశాలు..లక్సెట్టిపేట్‌లో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఆధునిక హంగులతో నూతనంగా భవనం నిర్మించారు. జిల్లాలో గతంలో 170 మంది కూడా దాటని విద్యార్థుల సంఖ్య ఈఏడాది 455కు చేరింది. జిల్లా కేంద్రమైన మంచిర్యాల ప్రభుత్వ కళాశాలలో 443 మందితో తర్వాత స్థానంలో నిలిచింది. బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 437 మంది అడ్మిషన్లు పొందారు. ఇలా ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య పెరుగుతుండడంతో మూడోసారి అవకాశం కల్పించారు. దీంతో మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే అవకాశం లేకపోలేదు. -
ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణమంచిర్యాలఅగ్రికల్చర్: సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, మంచిర్యాల అటవీ డివిజన్ అధికారి సర్వేశ్వర్‌తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నస్పూర్ మండలం సంగుమల్లయ్యపల్లెకు చెందిన ఎం.వెంకటేశం రికార్డుల నుంచి తన కూలిపోయిన ఇంటినంబర్ తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశాడు. ఈ సందర్భంగా మందమర్రి పట్టణానికి చెందిన దుర్గం మోహన్ తాను నెన్నెల శివారులో కొనుగోలు చేసిన భూమిని తనపేరుపై పట్టా చేయాలని కోరుతూ అర్జీ అందజేశాడు. భీమారం మండలం సుంకరిపల్లి కాలనీకి చెందిన దినసరి కూలీ దుర్గం భాగ్య ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరింది. నస్పూర్ శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన కోట మల్లయ్య 35 ఏళ్లుగా నివా సం ఉంటున్న ఇల్లు ఇటీవల వేరొకరి పేరుమీద మార్పు జరిగిందని దీనిని సవరించాలని కోరుతూ అర్జీ అందజేశాడు. నస్పూర్ మండలం ఆర్కే 6 క్రిష్ణాకాలనీకి చెందిన హరీష్ సీ టైప్ క్వాటర్ల వద్ద పగిలిపోయిన సెప్టిక్ ట్యాంక్‌కు మరమ్మతులు చేపట్టాలని కోరాడు. లక్సెట్టిపేట మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు మామిడి రాజశేఖర్ ఇంటర్ పూర్తి చేసి ఎల్టి శిక్షణ తీసుకున్నానని, ఏదైనా ఉపాధి చూపించాలని కోరుతూ అర్జీ అందజేశాడు. హాజీపూర్ మండలంలోని గుడిపేటకు చెందిన ఎంబడి జ్యోతి తన భర్త చనిపోయాడని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అర్జీ అందజేసింది. నస్పూర్ శివారులోని సర్వేనంబర్ 42లో ఉన్న టీఎన్జీవో ప్లాట్లలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఆధ్వర్యంలో ఫిర్యాదు అందజేశారు. ఆయా శాఖల అధికారులు అర్జీలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.అక్రమ పట్టా రద్దు చేయాలి బెల్లంపల్లిరూరల్: ఇళ్ల స్థలాలను అక్రమంగా చేసుకున్న పట్టాలు రద్దు చేసి తమపేరిట పట్టా జారీ చేయాలని కోరుతూ బెల్లంపల్లి మండలం మాలగురిజాలకు చెందిన బాధితులు ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్‌ను వేడుకున్నారు. గ్రామానికి చెందిన దుర్గం అంకులు, ఏగోలపు లక్ష్మి, గోమాస రామస్వామి, కలాలి ధర్మయ్య మాట్లాడుతూ సర్వే నంబర్ 162లో అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, అదే గ్రామానికి చెందిన కామెర నారాయణ గోమాస పోశం వద్ద మూడుగుంటల భూమిని కొనుగోలు చేసి 13 గుంటలుగా పట్టా పొందాడన్నారు. తాము నివసిస్తున్న ఇంటి స్థలాల్లో నూతన ఇంటి నిర్మాణలు చేపట్టకుండా అడ్డుకుని భయబ్రాంతులకు చేస్తున్నారన్నారు. అక్రమంగా ఉన్న 10 గుంటల పట్టాను రద్దు చేసి తాము నివసిస్తున్న ఇంటి స్థలాలకు పట్టా మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. -
నులి పురుగుల నిర్మూలనకు కృషి చేయాలి
● కలెక్టర్ కుమార్‌దీపక్ మంచిర్యాలఅర్బన్: నులి పురుగుల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కుమార్‌దీపక్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో లక్షా 58వేల 480 మంది పిల్లలకు మాత్రలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఈవో యాదయ్య, డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, ఉప వైద్యాధికారి అనిత, ప్రోగ్రాం అధికారి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు మంచిర్యాలఅగ్రికల్చర్: రైతుల అవసరాల మే రకు జిల్లాలో యూరియా అందుబాటులో ఉందని, పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయధికారి భుక్యా ఛత్రునాయక్, ఉద్యానవన శాఖ అధికారి అనితతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ యూరియా కృత్రిమ కొరత సృష్టించడం, పక్కదారి పట్టించడం వంటి అంశాలపై ప్రత్యే క నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 31లోగా వరి సాగు పూర్తి చేయాలని, సాగు ప్రారంభం కాని పక్షంలో ఇతర పంటలు సాగు చేసేలా రైతులను అవగాహన కల్పించాలన్నారు. పత్తిలో అంతర పంటగా మునగ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. -
వందేభారత్.. నష్టాల ప్రయాణం
● రెండు జిల్లాల్లో ఒక్క హాల్టింగ్ కూడా లేని రైలు.. ● ఆక్యుపెన్సీ సాధించడంలో విఫలం ● పట్టించుకోని రైల్వే అధికారులు ● విజ్ఞప్తులతోనే సరిపెడుతున్న ప్రజా ప్రతినిధులుబెల్లంపల్లి: మహారాష్ట్రలోని నాగ్‌పూర్–సికింద్రాబాద్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు వందశాతం ఆక్యుపెన్సీ లక్ష్య సాధనలో వెనుకంజలో ఉంది. డిమాండ్ ఉన్న రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికుల ఆదరణ కరువవుతోంది. ఈ మార్గంలో వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని ఎంతగానో ఆరాటపడిన ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్ తర్వాత సేవాగ్రామ్ (వార్దా), చంద్రపూర్, బల్లార్షా రైల్వేస్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించిన రైల్వే అధికారులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఏ ఒక్క రైల్వేస్టేషన్‌లోనూ నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయకపోవడం రైలు ప్రయాణికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. చంద్రపూర్–బల్లార్షా మధ్య కేవలం 13 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఆప్రాంతంలో నిరభ్యంతరంగా హాల్టింగ్‌కు పచ్చజెండా ఊపి పదుల కిలోమీటర్ల దూరం ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని రైల్వేస్టేషన్లను విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల మూడు ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు జిల్లా కేంద్రమైన పెద్దపల్లి రైల్వే జంక్షన్‌లోనూ హాల్టింగ్‌కు ఉత్తర్వులు జారీ చేయాలన్న ప్రయాణికుల డిమాండ్‌ను రైల్వే అధికారులు పెడచెవిన పెట్టారు. బల్లార్షా తర్వాత రామగుండం, కాజీపేట జంక్షన్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. రామగుండంలో ఈ రైలు ఎక్కే ప్రయాణికులు అంతంత మాత్రమే. కాజీపేటలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులో ఉండటం వల్ల వందేభారత్ రైలు సక్సెస్ కాలేకపోతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆక్యుపెన్సీ సాధనలో వెనుకంజ వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు గతేడాది ప్రారంభం కాగా ఇప్పటికీ వందశాతం ఆక్యుపెన్సీ సాధించలేదు. అనాలోచిత నిర్ణయాలతో రైలును ఆదిలో 20 కోచ్‌లతో ప్రారంభించారు. అయితే ప్రయాణికుల ఆదరణ ఆశాజనకంగా లేక పోవడంతో క్రమంగా ఆక్యుపెన్సీ తగ్గుతూ వచ్చింది. ఫలి తంగా గత ఫిబ్రవరి మూడో వారంలో కోచ్‌లను ఒక్కసారిగా 20 నుంచి 8కి కుదించారు. పరిమిత సంఖ్యలో కోచ్‌లు ఉండటంతో ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో క్రమంగా 70 శాతం వరకు పెరగడం కాస్త ఊరటనిస్తుండగా వందశాతం సాధించే దిశగా పరుగులు పెట్టలేకపోతోంది.వందేభారత్ రైలు -
రెడ్ల సంక్షేమానికి కృషి
చెన్నూర్‌రూరల్: రెడ్డి కుల సంక్షేమానికి కుల బాంధవులంతా కృషి చేయాలని రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. కిష్టంపేట గ్రామంలోని బీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి శ్రీనివాస్‌రెడ్డితోపాటు జిల్లా అధ్యక్షుడు గుర్రాల మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీధర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రెడ్లందరూ ఏకం కావాలన్నారు. పేద రెడ్డి కులస్థులకు సహాయం చేయాలని కోరారు. అనంతరం అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన రెడ్డి జాగృతి సంఘం నాయకులు గొడిసెల బాపురెడ్డి, పోటు రాంరెడ్డి, బొమ్మ సత్తిరెడ్డి, రత్న లక్ష్మీనారాయణరెడ్డి, పోటు సత్యనారాయణరెడ్డి, వెన్నపురెడ్డి బాపురెడ్డి, మహిళలు పాల్గొన్నారు. -
ఖాకీలపై క్రమశిక్షణ
మంచిర్యాలక్రైం: పోలీస్.. అంటే నాటులో సింహం.. ఈ కనిపించని కొందరు నాలుగో సింహాలు.. గాడితప్పుతున్నారు. పోలీస్ పవర్ ఉపయోగించి సెటిల్మెంట్లు, వసూళ్ల దందాలకు పాల్పడుతున్నారు. భూకబ్జాలు చేస్తున్నారు. పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారు. ఇలాంటి వారిపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కొరడా ఝళిపిస్తున్నారు. కఠిన చర్యలతో క్రమ‘శిక్ష’ణ నేర్పుతున్నారు. అప్రతిష్ట తెచ్చే అధికారులపై తీసుకుంటున్న చర్యలు ఇప్పడు ఆ శాఖలో కలకలం రేపుతున్నా యి. ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, శాఖాపరమైన చర్యలు చేపడుతుండడంతో పోలీసుల్లో గుబులు మొదలైంది. అక్రమాలకు పాల్పేందుకు జంకుతున్నారు. ఇక గతంలో పోలీసులపై ఫిర్యాదు చేయడానికి జంకిన బాధితులు ఇప్పుడు నేరుగా కమిషనర్‌ను సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఫిర్యాదులపై సత్వర విచారణ, చర్యల కారణంగా కమిషనరేట్ పరిధిలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.జైపూర్ పోలీస్ స్టేషన్లో వరుస ఘటనలు..జైపూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనలు శాఖలో చర్చనీయాంశంగా మారాయి. ఓ హెడ్ కానిస్టేబుల్ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, అదే మహిళతో పరిచయం ఉన్న ఓ హోం గార్డ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ కక్షతో హోంగార్డ్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని సస్పెండ్ చేశారు. అయితే, హోంగార్డ్ కుటుంబ సభ్యులు అసలు విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంతో, విచారణ జరిపి హెడ్ కానిస్టేబుల్‌ను కూడా సస్పెండ్ చేశారు. అదే స్టేషన్లో మరో కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్‌ను వేధించి, అసభ్యకరమైన సందేశాలు పంపడంతో, బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కాని స్టేబుల్‌ను సీపీ సస్పెండ్ చేశారు. ఒకే పోలీస్ స్టేషన్లో వరుస ఘటనలు శాఖలో కలకలం రేపాయి.అవినీతి, అక్రమాలపై నిఘా..పోలీస్ శాఖలో అవినీతి, వివాహేతర సంబంధాలు, భూ సెటిల్మెంట్లు, అక్రమ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసులపై సీపీ నిఘా పెట్టారు. క్రైం మీటింగ్‌లలో క్రమశిక్షణ, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వక వ్యవహారం, శాఖకు మచ్చ తెచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల, దండేపల్లి, బెల్లంపల్లి, చెన్నూర్, కోటపల్లి పోలీస్ స్టేషన్లలో రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఎస్సైలు, సీఐలు, కానిస్టేబుళ్లపై క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి సెటిల్మెంట్లు చేస్తున్నవారి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల ముందు వీరిపై బదిలీ వేటు, శాఖాపరమైన చర్యలు తప్పవని తెలుస్తోంది.పోలీస్ శాఖ ప్రతిష్ట కాపాడేలా..పోలీస్ శాఖకు అప్రతిష్ట తెచ్చే వారిపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాల ద్వారా నిఘా ఉంచారు. ఈ విభాగాలు సేకరించిన సమాచారం సీపీకి అందుతోంది. చాపకింద నీరులా విచారణలు సాగుతున్నాయి. శాఖ ప్రతిష్టను కాపాడేందుకు నిరంతర నిఘా కొనసాగుతోంది. ఇటీవల ముగ్గురు పోలీసు ల సస్పెన్షన్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రమశిక్షణ, నిబద్ధత, జవాబుదారీతనంతో పనిచేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పదేపదే హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్లు, సమస్యాత్మక ప్రాంతాలను పర్యటించి, ఒకే చోట దీర్ఘకాలం పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ, అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలుపోలీస్ శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వా రు ఎంతటి వారైనా.. శాఖపరమైన చర్యలు తప్పవు. పోలీసులు ప్రజలకు జవాబు దారీగా, మార్గదర్శకంగా ఉండాలి. పోలీస్ శాఖలో ప్రక్షళన చేస్తున్నాం. చట్టానికి పోలీసులు అతీతులు కారు. నేరం చేస్తే శిక్ష తప్పదు. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
లాభాల లెక్క తేలేదెన్నడో?
సింగరేణి కార్మికులుశ్రీరాంపూర్: సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల లెక్క తేల్చకుండా నానుస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు దాటినా లాభాలు ప్రకటించకపోవడంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోగా, 69.01 మిలియన్ టన్నులు సాధించింది. ఏప్రిల్ 1, 2025న లెక్కలను సమీక్షించిన యాజమాన్యం నాలుగు నెలలు గడిచినా లాభాల వివరాలను వెల్లడించలేదు. వాటా కోసం కార్మిక సంఘాల డిమాండ్.. సింగరేణి లాభాలను ప్రకటించిన తర్వాత, ఆ లాభాల్లో నిర్దిష్ట శాతాన్ని కార్మికులకు వాటాగా చెల్లించడం ఆనవాయితీ. కానీ, లాభాల ప్రకటనలో జాప్యం కారణంగా కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రతీ ఆర్థిక సంవత్సరం లాభాలు ప్రకటించిన తర్వాత, కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి లాభాల వాటా ప్రకటించాలని కోరుతున్నారు. ఈసారి కూడా లాభాల ప్రకటన ఆలస్యం కావడంతో కార్మికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి లక్ష్యాలు, లాభాల లెక్కింపు సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, క్రయవిక్రయాలు ఆర్థిక సంవత్సరం ఆధారంగా జరుగుతాయి. ఈ లెక్కల ఆధారంగానే లాభాలను నిర్ధారిస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల లక్ష్యంలో 69.01 మిలియన్ టన్నులు సాధించినప్పటికీ, లాభాల వివరాలు బయటకు రాకపోవడం కార్మికులను కలవరపెడుతోంది. ‘‘ఈసారైనా త్వరగా లాభాలు ప్రకటిస్తారని ఆశించాం, కానీ ఇంకా ఎలాంటి సమాచారం లేదు’’ అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాల ప్రకటన జాప్యంతో కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీ లాభాలను త్వరగా ప్రకటించి, కార్మికులకు వాటా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు దాటినా తేల్చని సింగరేణి లాభాల్లో వాటా కోసం కార్మికుల ఎదురు చూపు యాజమాన్యం తీరుపై అసంతృప్తిలాభాలు ప్రకటించాలికంపెనీ వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి. అందులో కార్మికులకు వాటా చెల్లించాలి. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే లాభాలు ప్రకటించకుండా యాజమాన్యం జాప్యం చేయడం సరికాదు. వాటా డబ్బులు సమయానికి చెల్లిస్తే పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులకు పనికొస్తాయి. – ఎస్కే.బాజీసైదా, ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి35 శాతం వాటా చెల్లించాలిఈసారి బొగ్గు ఉత్పత్తి పెరిగినందున లాభాల వాటా కూ డా పెంచి ఇవ్వాలి. లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలి. ఆర్థిక సంవత్సరం ముగిసి నా లుగు నెలలు గడిచినా లాభాలను ప్రకటించకపోవడం గుర్తింపు సంఘం వైఫల్యమే. – వి.అనిల్‌రెడ్డి, హెచ్ఎమ్మెస్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు -
విద్యారంగానికి నిధులేవి..?
మంచిర్యాలఅర్బన్: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించడం లేదని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజ్ ప్రశ్నించారు. మంచిర్యాల మార్క్స్ భవన్లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రం ఆదివా రం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తోందన్నారు. విద్యారంగ సమస్యలు చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించలేదని విమర్శించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్మెంట్, కాస్మొటిక్ చార్జీ లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా డీఈవో, ఎంఈవో, టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సూచించారు. ఆగస్టు 23, 24 తేదీల్లో మంచిర్యాలలో నిర్వహించే విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, సహయ కార్యదర్శి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు సికిందర్, రాజ్‌కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి గిరిజన ఉద్యోగుల కమిటీ అధ్యక్షుడి ఎన్నిక
జైపూర్: సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా ధరావత్ పంతులానాయక్ ఎన్నికయ్యారు. గోదావరిఖనిలో గిరిజ న ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం11 ఏరియాల గిరిజన ఉద్యోగుల సమావేశం జరిగింది. ఇందులో ఎస్టీపీపీలో డీజీఎం డి.పంతులానాయక్ను సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఆయన ఇప్పటికే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పలువురు ఉద్యోగులు, అధికారులు పంతులు నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.అధ్యక్షుడిగా ఎన్నికై న పంతులానాయక్ -
‘లాభాల ప్రకటనపై మౌనం ఎందుకు?
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలను ప్రకటించకుండా తాత్సారం చేస్తుంటే, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మౌనం వహించడంలో ఆంతర్యం ఏమిటని సీఐటీయూ బ్రాంచి అధ్యక్షుడు ఎస్.వెంకటస్వామి ప్రశ్నించారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. లాభాల వాటాపై ఎప్పుడూ గొప్పలు చెప్పే ఏఐటీయూసీ ఆగస్టు వచ్చినా లాభాల ప్రకటనపై యాజమాన్యంపై ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. లాభాల విషయంలో గుర్తింపు సంఘం వైఖరిపై కార్మికులు గుర్రుగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికై నా ప్రత్యేక చొరవ తీసుకుని లాభాలు ప్రకటించేలా ఒత్తిడి తేవాలన్నారు. సమావేశంలో నాయకులు వడ్లకొండ ఐలయ్య, సంజీవ్, ప్రవీణ్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు ‘సంకటహరణ’
● నానో ఎరువులు ప్రోత్సహించేలా ఇఫ్కో చర్యలు ● ఎరువుల కొనుగోలుతో ఉచిత బీమా ● రైతులందరికీ ప్రయోజనందండేపల్లి: అన్నదాతకు ఎవుసం భారంగా మారుతోంది. ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లప్రభావంతో దిగుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు చేతికి వచ్చిన పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ఎరువులు, కూలీల ధరలు పెరుగుతున్నంతగా పంటల మద్దతు ధర పెరగడం లేదు. అయినా రైతుకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. ఇలాంటి పరిస్థితిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. బోనస్ చెల్లిస్తున్నాయి. పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో–ఆపరేటివ్ లిమిటెడ్(ఇఫ్కో) తన నానోప్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులను ప్రోత్సహించేందుకు రైతులకు ఉచిత బీమా కల్పిస్తోంది. ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ‘సంకటహరణ’ ప్రమాద బీమా పథకాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ పథ కం కింద రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఇఫ్కో ఎరువులను కొనుగోలు చేయడం ద్వారా బీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. ఈ మేరకు ఇఫ్కో ప్రతినిధులు, వ్యవసాయాధికారులు నానో యూరి యా ప్లస్, నానో డీఏపీ ఎరువుల వాడకంతోపాటు సంకటహరణ బీమా పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. బీమా అర్హతలు.. సహకార సంఘాల ద్వారా ఇఫ్కో సంస్థ అందించే నానోప్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులు కొనుగోలు చేయవచ్చు. వయో పరిమితి లేకుండా ప్రతీ రైతుకు బీమా వర్తిస్తుంది. ప్రతీ నానో ఎరువు బాటిల్‌పై రూ.10 వేల బీమా కవరేజ్ లభిస్తుంది, గరిష్టంగా రూ.2 లక్షల వరకు బీమా పరిమితి ఉంటుంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 100% పరిహారం, రెండు అవయవాలు కోల్పోతే 50%, ఒక అవయవం కోల్పోతే 25% పరిహారం అందుతుంది. ఈ బీమా ఎరువులు కొనుగోలు చేసిననాటి నుంచి 12 నెలలు చెల్లుబాటు అవుతుంది. కొనుగోలు సమయంలో జాగ్రత్తలు.. ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు రశీదుపై కొనుగోలు తేదీ, కొనుగోలుదారుని పేరు, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా, కొనుగోలు చేసిన ఇఫ్కో ఎరువుల సంఖ్య, నామినీ పేరు, కొనుగోలు దారుని సంతకం లేదా వేలిముద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రమాదం జరిగిన సందర్భంలో బీమా పరిహారం పొందడానికి అసలు రశీ దు తప్పనిసరి. దీంతోపాటు, విక్రయాల రిజిస్టర్ జిరాక్స్, పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ, డాక్టర్ చికిత్స నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఈ క్లెయిం పత్రాలు ప్రమాదం జరిగిన రెండు నెలల్లోగా సికింద్రాబాద్‌లోని ఇఫ్కో బీమా కంపెనీకి పంపించాలి.రైతులకు ప్రయోజనకరంసహకార సంఘాల ద్వారా ఇప్కో సంస్థ నానో యూరియా ప్లస్, నానో డీఏపీలను రైతులకు విక్రయిస్తుంది. వీటి ద్వారా రైతులకు ఎన్నో లాభాలున్నాయి. పైగా ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ఆసంస్థ ఉచిత ప్రమాద బీమా అందిస్తోంది. ఇది రైతులందరికీ ప్రయోజనకరం. సద్వినియోగం చేసుకోవాలి. – అంజిత్‌కుమార్, ఏవో, దండేపల్లి -
ఆశాజనకంగా పత్తి
బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గంలో పత్తి పంట ఆశాజనకంగా సాగవుతోంది. మొన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడగా, ఇటీవల అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నియోజకవర్గంలో భీమిని, బెల్లంపల్లి రెండు వ్యవసాయ డివిజన్లు ఉండగా వీటి పరిధిలో దాదాపు 60 వేల ఎకరాల్లో పత్తి సాగుచేస్తున్నారు. ఇటీవలి వర్షాలకు భీమిని, కన్నెపల్లి, నెన్నెల, బెల్లంపల్లి, వేమనపల్లి, తాండూర్ మండలాల్లో అక్కడక్కడా చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రేగడి నేలల్లో నీటితడి ఆరకపోవడం, లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు నీట మునగడం కూడా పంటలను ప్రభావితం చేస్తున్నాయి. భా రీ వర్షాలు లేక పోవడంతో పంట నష్టం ఈసారి బాగా తగ్గిందని వ్యవసాయ అధికారులు పే ర్కొంటున్నారు. తెగుళ్ల నివారణ కోసం క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తుండడంతో చీడపీడల బెడద కాస్తా తగ్గిందని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సింగరేణి మాజీ కార్మికుడు..
తాండూర్: రోడ్డు ప్రమాదంలో సింగరేణి మాజీ కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొత్త గుడిసెల కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు గణపతి రాజయ్య (60) ఆదివారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తూ కొత్తపల్లి వైపు వెళ్తుండగా బైక్‌పై వచ్చిన దెబ్బటి శ్రావణ్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు రాజయ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్రావణ్‌ను మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. గుండెపోటుతో అంగన్వాడీ టీచర్.. ఉట్నూర్‌రూరల్: మండలంలోని రామ్ లింగంపేటకు చెందిన అంగన్వాడీ టీచర్ సీహెచ్ విజయ (64) గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమగ్ర బాలభ్యుదయ పథకంలో కొన్ని దశాబ్దాలుగా అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం చాతిలో నొప్పివస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందిందని ఆమె భర్త స్వామి తెలిపారు. పేద కుటుంబానికి చెందిన విజయ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
● ఐదుగురికి తీవ్రగాయాలుసారంగపూర్: మండలంలోని చించోలి(బి) శివారు లో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం ఆదిలాబాద్ డిపోకు చెందిన ప్రైవేటు ఆర్టీసీ బస్సు నిర్మల్‌వైపు వెళ్తుండగా నిర్మల్ వైపు వస్తున్న ఇదే డిపోకు చెందిన మరో బస్సును వేగంగా ఢీకొట్టింది. ఘటనలో వెనుకవైపు నుంచి ఢీకొట్టిన బస్సులో ప్రయాణిస్తున్న లక్ష్మణచాందకు చెందిన తోకల సునీత, ఆశీన్, ఆదిలాబాద్‌కు చెందిన కార్తీక్ గౌడ్, ఉట్నూర్‌కు చెందిన ఇందిరా, సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన కాంతాబాయికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీకాంత్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారకుడైన బస్సు డ్రైవర్ సిందే అజయ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
24 గంటల్లోనే దొంగ పట్టివేత
● వివరాలు వెల్లడించిన ఏసీపీ రవికుమార్ రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గద్దెరాగిడి పద్మావతికాలనీలో భారీ చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సీసీపుటేజీ ఆధారంగా 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. భూపాలపల్లిలో ఉంటున్న సింగరేణి కార్మికుడు మేకల రాజయ్య గద్దెరాగిడిలో నూతనంగా ఇల్లు నిర్మించాడు. శుక్రవారం కొత్తింట్లో వరలక్ష్మీ వ్రతం చేశారు. కుటుంబసభ్యులు, బంధువులు రాత్రి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున రాజయ్య లేచి చూసేసరికి ఇంట్లోని బ్యాగులు చిందరవందరగా పడి ఉన్నాయి. బ్యాగులో దాచిన దాదాపు 40 తులాల బంగారు ఆభరణాలు, ఓ సెల్‌ఫోన్ చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీపుటేజీలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి పలుచోట్ల కనిపించడంతో పాత నేరస్థుడు జాడి సురేష్‌గా గుర్తించారు. ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసింది తానేనని ఒప్పుకోవడంతో బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌కు చెందిన సురేష్‌పై గతంలోనూ పలు చోరీ కేసులున్నాయని, ముఖ్యంగా శుభకార్యాలు జరిగే ఇళ్లపై ఎక్కువగా దృష్టి సారిస్తాడన్నారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, మందమర్రి ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు. దొంగను పట్టుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించిన పలువురు పోలీసులకు ఏసీపీ రివార్డులను అందించారు. -
ప్రమాదవశాత్తు కాలువలోపడి ఒకరు..
సోన్: ప్రమాదవశాత్తు కాలువలోపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన బొడ్డు సుధాకర్ (37) ఆదివారం వరుసకు సోదరుడైన బొడ్డు పెద్ద లస్మన్నతో కలిసి పంటచేనుకు వెళ్లాడు. సరస్వతి కాలువలో లస్మన్న ఏర్పాటు చేసిన మోటార్ నుంచి నీళ్లు రాకపోవడంతో సుధాకర్ ఫుట్‌బాల్ పైపుకు తట్టుకున్న చెత్తను తీసివేసే క్రమంలో కాలుజారి కాలువలోపడి మృతి చెందాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్చార్జి ఎస్సై నర్సయ్య తెలిపారు. -
నిర్మల్ ఏజెంట్లను స్ఫూర్తిగా తీసుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ ఎల్ఐసీ ఏజెంట్లను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని కరీంనగర్ డివిజన్ అధ్యక్షుడు రాజయ్య పేర్కొన్నారు. పట్టణంలోని మంజులపూర్లో నూతనంగా నిర్మించిన సంఘ భవనాన్ని ఆదివారం ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోళ్ల మురళీధర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం బ్రాంచ్ కార్యాలయంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నారాయణ, భాస్కర్, క్యాషియర్‌గా వినోద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్ బ్రాంచ్ ఏజెంట్లు ఐక్యంగా ఉండి ఒక సొంత భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా నాయకులు ధర్మపురి, ఖానాపూర్ నాయకులు లింగన్న, నిర్మల్ నాయకులు రామారావు, రమేశ్, శ్రీనివాస్, జహీర్, గంగాధర్, రాజమోహన్ రెడ్డి, వసంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘నులి’పేద్దాం..!
● నులిపురుగులతో ఆరోగ్యానికి చేటు ● 19 ఏళ్లలోపు వారిపై తీవ్ర ప్రభావం ● నివారణకు నేడు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ● ఉమ్మడి జిల్లాలో 7,24,227 మంది గుర్తింపు రక్తహీనత.. పోషక లోపం.. ముఖ్యంగా 19 ఏళ్లలోపు పిల్లలపై నులి పురుగులు, ఏలికపాములు, కొంకి పురుగుల ప్రభా వం అధికంగా ఉంటుంది. ఇవి సంక్రమిస్తే పి ల్లల్లో రక్తహీనతకు గురవుతారు. పోషకాహార లోపం కనిపిస్తుంది. కడుపునొప్పితో పాటు శ రీరం బలహీనతగా అనిపిస్తుంది. ఆందోళనకు గురవుతారు. క్రమంగా బరువు కూడా తగ్గుతా రు. ఏకగ్రాత లోపిస్తుంది. నేర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు. తదితర లక్షణాలు కనిపిస్తే నులి పురుగులు సంక్రమించినట్లుగా భావించాలని వైద్యులు పేర్కొంటున్నారు. మంచిర్యాలటౌన్/లక్ష్మణచాంద/ఆదిలాబాద్‌టౌన్/కౌటాల: చిన్నారులను పట్టిపీడించే ఆరోగ్య సమస్యల్లో నులి పురుగులు ప్రధానమైనవి. ఈ పురుగులు పిల్లల పొట్టలో చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను శాసిస్తుంటాయి. రక్తహీనత, పోషకలోపంతో పాటు పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయడం, చెప్పులు తొడుక్కోకుండా తిరగడం, ఆడుకోవడం, భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రపర్చుకోకపోవడంతో తరచూ పిల్లలు కడపునొప్పి, విరేచనాల బారిన పడుతుంటారు. చిన్నారుల పొట్టలో ఏళ్ల తరబడి తిష్టవేసి ఆరోగ్యాన్ని హరించే నులి పురుగులతో జాగ్రత్తలు తప్పనిసరని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వీటిపై ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ముందు జాగ్రత్తలు తీసుకోకపోయినా ప్రాణాంతకంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. నులి పురుగుల నివారణలో భాగంగా ప్రభుత్వం ఏటా రెండుసార్లు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 11న జాతీయ నులి పురుగుల నివారణ దినంగా జరుపుతున్నారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న చిన్నారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7,24,227 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వారందరికీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. నులి పురుగులు అంటే.. నులి పురుగులు అనేవి మానవుల్లో పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్నజీవులు. ఇవి పిల్లలు ఆరుబయట మట్టిలో ఆడుకోవడం, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం, అపరిశుభ్ర పరిసరాలతో నులి పురుగులు చిన్నారుల చెంతకు చేరుతాయి. నులిపురుగులు కలిగిన చిన్నారులు నులి పురుగుల గుడ్లు కలిగిన మలంతో నేలను కలుషితం చేస్తాడు. ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందుతాయి. మిగతా పిల్లలు ఆరుబయట మట్టిని ముట్టడం, లేదా ఈ నులిపురుగుల గుడ్లు చేరిన ఆహారం తీసుకోవడం వల్ల ఇతర పిల్లల కడుపులోకి వెళ్లి అక్కడ వృద్ధి చెందడం మొదలు పెట్టి అక్కడే తిష్టవేస్తాయి. 19 ఏళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై ఈ నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి. చప్పరించి మింగాలి అల్బెండజోల్ మాత్రలను మధ్యాహ్న భోజనం తరువాత అందించనున్నారు. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు అరమాత్ర, 2 నుంచి 3 సంవత్సరాల వారికి ఒక మాత్రను పొడి చేసి నీటితో మింగించాలి. 3 నుంచి 19 ఏళ్ల వారు ఒక మాత్రను చప్పరించి మింగాలి. ఇది నేరుగా మింగే మాత్ర కాదు. నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. సోమవారం మాత్రలు తీసుకోని వారికి ఈ నెల 18న మరోసారి మాత్రలు వేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 1–19 ఏళ్లలోపు విద్యార్థులు జిల్లా విద్యార్థులు మంచిర్యాల 1,58,400 నిర్మల్ 1,91,998 ఆదిలాబాద్ 2,06,127 ఆసిఫాబాద్ 1,67,702తప్పనిసరిగా వేయించాలి 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. – రాజేందర్, జిల్లా వైద్యాధికారి, నిర్మల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆహారంపై ఈగలు, దోమలు, కీటకాలు వాలకుండా చూడాలి. పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి. స్వచ్ఛమైన నీటినే తాగాలి. చేతి గోర్లను చిన్నగా కత్తిరించుకోవాలి. భోజనానికి ముందు, తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. కాళ్లకు చెప్పులు లేదా బూట్లు ఉంటేనే బయటకు వెళ్లాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – హరీశ్‌రాజ్, జిల్లా వైద్యాధికారి, మంచిర్యాల ఏర్పాట్లు పూర్తి చేశాం జిల్లా వ్యాప్తంగా నేడు అ న్ని ప్రభుత్వ, ప్రేవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆల్బెండజోల్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు తప్పనిసరిగా 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ మాత్రలు వేయించాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలను వేయించాలి. – సీతారాం, డీఎంహెచ్‌వో, ఆసిఫాబాద్ -
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆల య అర్చకులు వేకువజామున శ్రీమహాలక్ష్మీ, సరస్వతి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన, హారతి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ఆలయంలో అమ్మవారి దర్మనానికి బారులు తీరా రు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకారం, కుంకుమార్చన పూజలు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ‘నవోదయ’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానంకాగజ్నగర్టౌన్: పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న నిర్వహించనున్న పరీక్షకు ఈ నెల 13లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆధార్‌కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్, పాస్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఆదివాసీలకు అధికారుల కౌన్సెలింగ్
జన్నారం: అడవిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న జైనూర్, సిర్పూర్ మండలాలకు చెందిన పలువురు ఆదివాసీ గిరిజనులకు ఆదివారం అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీధరచారితో పాటు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై అనూష, దండెపల్లి ఎస్సై తహసీనొద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ ఇందన్పల్లి అటవీ రేంజ్, కవ్వాల్ అటవీ సెక్షన్, సొనాపూర్ బీట్ పాలఘోరి ప్రాంతానికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అటవీభూమిలో నివాసం ఉండటం చట్టవిరుద్ధమని, ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సీఐ సూచించారు. అయితే పూర్వీకుల నుంచి ఈ భూమి మాదే అని కాగితాలున్నాయని, అందుకే నివాసం ఉంటున్నామని వారు పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్, ఐటీడీఏ పీవో, తహసీల్దార్‌కు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు ఆదివాసీలు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నస్పూర్: చిన్ననాటి నుంచి దేశానికి సేవ చేయాలని కన్న కలలు నెరవేరకుండానే రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడు మృత్యుఒడిలోకి చేరిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన చిలువేరు సాగర్(23), మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుష్నపల్లి గ్రామానికి చెందిన ఆకుల రాకేశ్, నిజామాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని ఓ డిఫెన్స్ అకాడామీలో శిక్షణ పొందుతున్నారు. ముగ్గురు స్నేహితులు కలిసి ఆదివారం సాయంత్రం ఓ ఫంక్షన్‌కు వెళ్లేందుకు గిఫ్ట్ కొందామని బైక్‌పై బయల్దేరారు. స్థానిక రాయల్ గార్డెన్ చౌరస్తా సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ కట్టడంపై పడింది. దీంతో సాగర్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాకేశ్, విష్ణువర్ధన్‌ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాకేశ్ పరిస్థతి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు. సీసీసీ నస్పూర్ ఎస్సై ఉపేందర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
పశువుల చోరీ కేసులో ఒకరి అరెస్టు
ముధోల్: ముధోల్‌లో ఇటీవల జరిగిన పశువుల చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ అవినాష్‌కుమార్ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల హంగీర్గ భోజన్న అనే రైతుకు చెందిన పశువులు దొంగిలించబడ్డాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ నైలు, ఎస్సైలు బిట్లా పెర్సీస్, జుబేర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. సీసీ కెమెరాల ఆధారంగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మహ్మద్ ఫైజాన్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరుగురు నిందితులు కేసులో ఉన్నారని, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ముఠా సభ్యులు ముందుగా పశువులకు మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడుతున్నారన్నారు. పశువుల మాంసానికి మహారాష్ట్రలో డిమాండ్ ఉండడంతో ఈ పనులకు పాల్పడుతున్నారని తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ నైలు, ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిర్ పాల్గొన్నారు. -
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని భగవంతంవాడకు చెందిన నులిగొండ మల్లేశ్ కూతురు అనుషా (23) డిగ్రీ వరకు చదివి ఇంటివద్దే ఉంటోంది. నాలుగేళ్ల క్రితం డిగ్రీ చదువుతున్న సమయంలో అదే కళాశాలలో చదువుతున్న జైపూర్ మండలం కుందారంకు చెందిన రంగుల శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరుకావడంతో అనుషా తల్లితండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇదే అదనుగా భావించిన శ్రీకాంత్ నగలు, నగదు తెస్తేనే పెళ్లి చేసుకుంటానని, లేదంటే వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా తమవద్ద ఉన్న ఫొటోలు బయటపెడతానని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి మృతికి కారణమైన రంగుల శ్రీకాంత్, తండ్రి కిష్టయ్య, తల్లి రాజేశ్వరి, అన్నయ్య రమేశ్‌పై బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వెండి కిరీటం బహూకరణకుంటాల: ప్రాచీన శ్రీకృష్ణ దేవాలయంలోని కృష్ణుని విగ్రహానికి కుంటాల గ్రామానికి చెందిన చిప్ప కృష్ణవేణి–సాయినాథ్ సీనియర్ సైంటిస్ట్ దంపతులు ఆదివారం రూ.1.45 లక్షల విలు వైన వెండి కిరీటాన్ని బహూకరించారు. 12 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండితో కిరీటం తయారు చేయించినట్లు దాత తల్లిదండ్రులు గంగామణి, హన్మాండ్లు తెలిపారు. -
పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చెన్నూర్‌రూరల్: వర్షాలు కురవడంలో ఆలస్యమైన సమయాల్లో, వర్షాలు అధికంగా ఉన్న సమయాల్లో, వర్షాలు ముఖం చాటేసినప్పుడు పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ వివరించారు. కొన్ని సమయాల్లో అంతరపంటలు వేసుకోవాలని సూచించారు. వర్షాలు ఆలస్యంగా వచ్చిన సమయంలో.... రుతుపవనాలు ఆలస్యమైన సమయాల్లో పత్తిలో స్వల్పకాలిక బీజీ–2 రకాలను ఎన్నుకోవాలి. 1–3 వంతు నత్రజని, 1–3 వంతు పొటాషియం, పాస్పరస్ మొత్తాన్ని దుక్కిలో వేసుకోవాలి. ఇలా చేయడంతో మొక్క లేత దశలో పెరుగుదల బాగా ఉంటుంది. తరచూ అంతరకృషి చేయాలి. ఇలా చేయడం వలన మొక్కకు కావాల్సిన తేమ అందుతుంది. కలుపు ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. దీంతో భూమిలోని తేమకు, పోషకాలకు మధ్య పోటీ ఉండదు. తేమ ఉన్నప్పుడే.. వర్షాలు కురవడంలో ఆలస్యమైతే నేలలో సరిపడా తేమ ఉన్నప్పుడే ఎరువులు వాడాలి. లేదంటే 2 శాతం యూరియా ద్రావనాన్ని 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పిచికారీ చేయాలి. తరచూ అంతరకృషి చేయడం వల్ల పంట కలుపు లేకుండా అలాగే మొక్కకు కావాల్సిన తేమ అందుతుంది. రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచాలి. వర్షాలు అధికంగా కురిసిన సమయంలో.... వర్షాలు అధికంగా కురిసిన సమయంలో నీటిని కాలువల ద్వారా బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలి. బూస్టర్‌గా 30 కిలోల నత్రజనిని హెక్టారుకు అందించాలి. అంతరకృషి చేసి నేలను తెరిచినట్లయితే ఎక్కువగా ఉన్న నీరు ఆవిరై పోతుంది. హీలియంతున్ ఉదృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు డైప్లూటెంజురాన్ను హెక్టారుకు 250–300 గ్రాములు పిచికారీ చేయాలి. పెరుగుదల అతిగా ఉంటే కొనలను తుంచివేయాలి. కాయకుళ్లు తెగులు రావడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి దానిని అదుపులో ఉంచుకోవడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేసుకోవాలి. వర్షాలు ఆగిన సమయాల్లో వర్షాలు ఆగిన సమయాల్లో మొక్కకు పోషకాలు అందించాలి. ఇందుకు గానూ 2 నుంచి 3 సార్లు 2 శాతం యూరియా ద్రావణాన్ని ఆకులపైన పిచికారీ చేయాలి. తరచూ అంతరకృషి చేసి కలుపు నివారణతో పాటు మొక్కకు కావాల్సిన తేమను అందజేస్తూ ఉండాలి. అంతర పంటలుగా పెసర, సోయాబీన్, మినుము వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలి. వర్షాలు ముఖం చాటేస్తే.. వర్షాలు అసలే కురియకపోతే ఆగస్టు తర్వాత పత్తిని విత్తకూడదు. ఇలాంటి సూచనలు పాటించినట్లయితే రైతులు నష్టపోకుండా ఉంటారు. -
ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందిద్దాం
● గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ ● కలెక్టర్ కుమార్ దీపక్ ● ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పాతమంచిర్యాల: అడవులనే ఆయువు పట్టుగా చేసుకుని జీవం సాగించే ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతోందని, విద్య, వైద్యం అందించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. గిరిజన మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, జిల్లాలోని ప్రతీ గిరిజన ప్రాంతానికి రోడ్డు రవాణా వసతి కల్పించి ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. నాయకులు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా గిరిజన బాలికలు కలెక్టర్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి వైశ్యభవన్ సభా ప్రాంగణం వరకు ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డీటీడీవో జనార్ధన్, ప్రో గ్రాం కన్వీనర్ అలం బాపు, గిరిజన నాయకులు జేక శేఖర్, అడ జంగు, సోయం జంగు, భార్గవ్, రా జ్‌కుమార్, పెంద్రం హన్మంతు, ఆత్రం రవీందర్, చిలుకయ్య, మడావి శంకర్, నైతం లక్ష్మణ్, గిరిజన సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే కార్మిక సమస్యలు పరిష్కారం
● హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ రెబ్బెన: పోరాటాల ద్వారానే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అన్నారు. శనివారం గోలేటి టౌన్‌షిప్‌లోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బెల్లంపల్లి ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇప్పటి వరకు డైరెక్టర్ స్థాయి అధికారులతో కమిటీ సమావేశాలు జరిపినా కార్మికులకు సంబంధించిన ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. సొంతింటి పథకం అమలు, ఆదాయపు పన్ను మాఫీ వంటి దీర్ఘకాలిక సమస్యలను ఎన్నికల్లో గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఎన్నికై 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. యాజమాన్యంతో ములాఖత్ అయి కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని, ఇచ్చిన హామీలపై గనులపై నిలదీయాలని పిలుపునిచ్చారు. జూలై 31న జరిగిన మెడికల్ బోర్డులో కార్మికులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కార్మికులందరికి రీ మెడికల్ నిర్వహించి అన్‌ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సారయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు, ఏరియా కార్యదర్శి శివారెడ్డి, ఏరియా ఆర్గనైజర్లు ఎస్కే ఇనూస్, మరిశెట్టి దత్తు, పిట్ కార్యదర్శి ఎండీ ఆరీఫ్, ఖైరిగూడ పిట్ కార్యదర్శి రామకృష్ణ, నాయకులు తిరుపతి, బాలేష్, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు. -
గద్దెరాగిడిలో భారీ చోరీ
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి గద్దెరాగిడిలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. సింగరేణి కార్మికుడి ఇంట్లో 40 తులాల బంగారం, ఐఫోన్ అపహరించుకెళ్లారు. బాధితుల కథనం ప్రకారం.. భూపాలపల్లిలో సింగరేణి కార్మి కుడిగా పనిచేస్తున్న మేకల రాజయ్య గద్దెరాగిడిలో నూతన ఇంటి నిర్మాణం చేపట్టారు. వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఇతర శుభకార్యాలు ఉండడంతో గురువారం ఇక్కడికి వచ్చారు. రాజయ్య దంపతులతోపాటు సమీప బంధువు సింధు, శ్రీనివాస్ దంపతులు కూడా వచ్చారు. రాజయ్య భార్య స్వరూపకు చెందిన 30తులాల బంగారు ఆభరణాలు, ఆమె చెల్లి కూతురు సింధు, శ్రీనివాస్ దంపతులకు చెందిన 10 తులాల బంగారు ఆభరణాలు వేర్వేరు పర్సులో పెట్టి నిద్రకు ఉపక్రమించారు. కాగా, రాత్రి మూడు గంటల ప్రాంతంలో రాజయ్యకు మెలకువ వచ్చి చూడగా పర్సులు చిందరగా పడి ఉన్నాయి. బంగారు ఆభరణాలు, ఐఫోన్ చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, ఆర్కేపీ ఎస్సై రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించి.. ఇంటి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నూతన ఇంటి కిటికీలకు గ్రిల్ లేకపోవడంతో దొంగలు లోనికి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చోరీ ఘటన పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది. 40తులాల బంగారం, ఐఫోన్ అపహరణ -
ఈవో కార్యాలయం ప్రారంభం
బాసర: బాసర ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆలయ కార్యనిర్వహణాధి కారి కార్యాలయాన్ని శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో గోమాతతో భవన ప్రవే శం, వాస్తుపూజ, మహా హోమంతో పాటు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి నూ తన కార్యాలయంలో అధికారులంతా విధులు నిర్వహిస్తారని ఆలయ ఏఈవో సుదర్శన్ గౌడ్ తెలిపారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పా ఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, ఆల య సీనియర్ అసిస్టెంట్లు, పీఆర్వో నారాయణ పటేల్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కొండచిలువ కలకలం..ఆసిఫాబాద్‌అర్బన్: పట్టణంలోని దస్నాపూర్ కాలనీలో శుక్రవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో భయాందోళన చెందిన స్థానికులు జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్‌కుమార్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారి సిబ్బందిని అప్రమత్తం చేసి కాలనీకి పంపించారు. జిల్లా అటవీశాఖ అధికారి సీసీ ఇసాక్ ఆధ్వర్యంలో బీట్ అధికారులు కిషోర్, ఎం.వెంకటేష్, మారుతి, పి.వెంకటేష్ గంటపాటు శ్రమించి దానిని ఒక సంచిలో బంధించి అటవీప్రాంతంలో వదిలేశారు. సమయానికి స్పందించిన అటవీ శాఖ అధికారులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా శ్రావణ పౌర్ణమి జాతర
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం శ్రావణపౌర్ణమి జాతర ఘనంగా జరిగింది. జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యదేవుణ్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 196 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణాలు రద్దీగా కనిపించాయి. ఆలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారు. సత్యనారాయణస్వామిని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. సామూహిక సత్యనారాయణవ్రతాలు.. -
బస్టాండ్లలో పండుగ రద్దీ
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో శనివారం ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు కిటకిటలాడాయి. రాఖీ పండుగ కావడంతో దూరప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే ప్రయాణికులతో మంచిర్యాల బస్‌స్టేషన్ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. బస్సులన్నీ మహిళ ప్రయాణికులతో నిండిపోయాయి. బస్సు వచ్చిందంటే చాలు సీట్ల కోసం పరుగులు తీశారు. బస్సుల సమాచారం అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఇంకోవైపు ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించారు. హైదరాబాద్‌కు వెళ్లే బస్సులన్నీ ముందస్తు రిజర్వేషన్లతో నిండిపోయాయి. బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాశారు. రద్దీకి అనుగుణంగా ఆయా రూట్లలో బస్సులు నడిపినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. -
రాఖీ సంబరం
సెల్ఫీ విత్ రాఖీనస్పూర్/నెన్నెల: జిల్లాలో రాఖీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. శనివారం అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టారు. నస్పూర్‌లో శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 గని కార్మికుడు జాడి రాజ్‌కుమార్ తన అక్కాచెల్లెలు మమత, మళ్లీశ్వరిలతో కలిసి మొక్కకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణ, ఇంటి ఆవరణలో పెంచిన మొక్కలకు రక్షణగా ఉంటామని తెలియజేయడానికి రాఖీ కట్టినట్లు తెలిపారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నెన్నెల మాజీ ఎంపీపీ రమాదేవి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సింగతి శ్యామల ఆయన నివాసంలో రాఖీ కట్ట శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నయ్య వారికి కానుకలు అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్‌రెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు.రాఖీ పండుగ సందర్భంగా సెల్ఫీ విత్ రాఖీ పేరిట ఫొటోలను ‘సాక్షి’ ఆహ్వానించగా విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు రాఖీ వేడుకల ఫొటోలను పంపించారు. – మరిన్ని ఫొటోలు 9లోuయశ్వంత్‌కు రాఖీ కడుతున్న సోదరీమణులు, మంచిర్యాల -
నిషేధిత గుట్కా పట్టివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాపల్లి స్టేజీ వద్ద శనివారం పోలీసుల తనిఖీల్లో భారీగా నిషేధిత గుట్కా పట్టుబడింది. హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచి ర్యాల వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని అనుమానంతో తనిఖీ చేశారు. నిషేధిత గుట్కా బ్యాగులు గుర్తించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన 30బ్యాగుల గుట్కా విలువ సుమారుగా రూ.1.70 లక్షలు ఉంటుందని, గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, గంగాధర్, సత్యనారాయణ, తిరుపతి పాల్గొన్నారు. -
నాగోబాకు నొవోంగ్ పూజలు
ఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్ నాగోబా మురాడి వద్ద మెస్రం వంశీయులు శనివారం నొవోంగ్ పూజలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మెస్రం వంశ పెద్దలు ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన చిరు ధాన్యాలతో నైవేద్యం తయారుచేసి నాగోబాకు సమర్పించారు. అనంతరం తమ గ్రామాలకు వెళ్లి నొవోంగ్ పూజలు చేయనున్నట్లు తెలిపారు. నొవోంగ్ పూజల చేస్తేనే ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన చిరుధాన్యాలను తెంపడం జరుగుతుందని మెస్రం వంశ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్రావ్, మెస్రం వంశ పెద్దలు కోసేరావ్, హనుమంత్‌రావ్, దేవ్‌రావ్, లింబారావు, నాగ్నాథ్, ఆనంద్‌రావ్, తుకారాం, తదితరులు పాల్గొన్నారు. -
చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆటో
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని హరితవనం పార్కు సమీపంలో చెట్ల పొదల్లోకి ఆటో దూసుకెళ్లి బోల్తా పడింది. సిర్పూర్ మండలం చిలాటిగూడకు చెందిన ప్రయాణికులు మహారాష్ట్రలోని మహుర్ గ్రామానికి దైవదర్శనం కోసం ఆటోలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం మావల సమీపంలో ఆటో చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న దేవ్‌రావు, మారుతి, మంగావతి, నాగోబాయికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ కిషన్, పైలట్ ముజఫర్ క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
లాభాల వాటా ప్రకటించాలి
జైపూర్: లాభాల వాటా ప్రకటించాలని ఇందారం ఐకే1ఏ గనిపై సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం గని మేనేజర్ కోటయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐకే1ఏ పిట్ సెక్రెటరీ సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సాధించిన లాభాలను వెంటనే ప్రకటించాలని, కార్మికులకు 35 శాతం లాభాల వాటా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2023–24 ఆర్థిక సంవత్సరం కార్మికులకు పంపిణీ చేయగా, మిగిలిన డబ్బులతో ఎంతమేరకు అభివృద్ధి చేశారో చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, ఖాదీర్ పాషా, వినయ్, శ్రీనాథ్ పాల్గొన్నారు. -
తండాల్లో తీజోత్సవం
● గిరిజన గ్రామాల్లో మొదలైన సందడి ● పెళ్లికాని యువతులు నిర్వహించే పండుగతొమ్మిదో రోజు.. తొమ్మిదో రోజును ‘తీజ్ తోడేరో దాడో’ అని పిలుస్తారు. ఆ రోజు యువతులంతా ఇంటింటికీ వెళ్లి తీజ్‌లను తెంపడానికి అందరూ రావాలని ఆహ్వానిస్తారు. వారంతా వచ్చిన తర్వాత మంచె పైనున్న తీజ్ బుట్టలను కిందికి దించుతారు. కులదేవతలను పూజిస్తూ ‘తీజ్’ నారును తెంపుతారు. దానిని వరుసగా కూర్చున్న మగవారి తలపాగలో పెడతారు. ఆడవారైతే కొంగుకు కట్టుకుంటారు. మరికొందరు ఇంటి గుమ్మానికి కడుతారు. అనంతరం జొన్నరొట్టెలు చేసి డప్పు వాయిద్యాలతో తీజ్ నిమజ్జనానికి బయలు దేరుతారు. సమీపంలోని చెరువులు లేదా బావుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ రోజు ప్రక్రియను ‘తీజ్ ఎరాయోరో’ పిలుస్తారు. దీనిని ఒకరకంగా లంబాడీ బతుకమ్మగా కూడా భావిస్తారు. గోర్బంజారాలు నిర్వహించే ఈ పండుగలో వారి సంస్కృతి ఉట్టిపడుతుంది. పంచకట్టు, ఖమీజ్ రుపాట్ ధరించి పురుషులు, టుక్రి, కాంచ్లీ, చేతులకు బలియాలు వేసుకుని యువతులు, సంస్కృతికి తగ్గట్టుగానే తయారవుతారు. గడ్డి బతుకమ్మను తెచ్చి ఆడపడుచులు సోదరుల కాళ్లు కడుగుతారు. ఆపై పారే నీటిలో గడ్డి బతుకమ్మలను వదులుతారు. కెరమెరి : తీజ్.. గిరిజన తండాల్లో తేజాన్ని నింపే పండుగ. గిరిజన యువతులు తమ ఆశలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ తొమ్మిది రోజుల పాటు ఉత్సాహంగా నిర్వహించుకునే ఉత్సవం. ఆటపాటలు, విందులు, వినోదాలు, వినూత్న ఆచారాలతో బతుకమ్మ తరహాలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ వేడుకలు గిరిజన బంజారా (లంబాడా) తండాల్లో రక్షాబంధన్‌కు ప్రారంభమై కృష్ణాష్టమికి ముగుస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో నిమగ్నం.. గిరిజన లంబాడాలు తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాఖీ పౌర్ణమి నుంచి లంబాడా గిరిజనులంతా ‘తీజ్’ పండుగ జరుపుకోవడంలో నిమగ్నమయ్యారు. యువతులు కుల దేవతలను కొలుస్తూ బుట్టల్లో ఎర్రమట్టి నింపి అందులో గోధుమలు చల్లారు. వీటినే తీజ్ బుట్టలు అంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ‘తీజ్ భరాయిరో’ అని పిలుస్తారు. ఆ రోజు నుంచి యువతులంతా నియమ నిష్టలు పాటిస్తున్నారు. గ్రామ ప్రజలకు మంచి జరగాలని, తమకు మంచి భర్త రావాలని కోరుకుంటూ ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ప్రతీరోజు మూడు పూటలా సమీపంలోని బావుల వద్దకు వెళ్లి నీటిని తీసుకువచ్చి బుట్టలపై చల్లుతున్నారు. ఆరు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏడో రోజు ‘ఢమోళీ’ సందడి ఏడో రోజున ప్రతీ ఇంట్లో బియ్యపు పిండితో రొట్టెలు చేస్తారు. వాటిని బెల్లం, నెయ్యితో కలుపుతారు. ఈ మిశ్రమాన్నే చూర్మా అంటారు. ఈ చూర్మాను తీజ్ బుట్టలున్న ఇంటి ఆవరణలో నెలకొల్పిన కులదేవుడు ‘సేవాభయ్య’కు నైవేద్యంగా సమర్పిస్తారు. అదే రోజు ఇంటి సింహద్వారానికి ఎదురుగా జొన్నలతో నింపిన గోనె సంచులు, వాటి ముందు నీళ్ల కడవ ఉంచి అందులో వేప మండలు పేరుస్తారు. ఆ కడవ ముందు జొన్నపిండితో ముగ్గులు వేస్తారు. వాటి మధ్య వెండితో తయారు చేసిన ‘మేరామయాడి’ తల్లి విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించి పూజలు చేస్తారు. మేరామయాడి దేవత మాంసాహారి కావడంతో ఆమెకు మేకపోతును బలిస్తారు. ఆరోజు రాత్రి యువతులు ఇంటింటికీ వెళ్లి చూర్మా సేకరిస్తారు. వరసైన వారికి పూస్తూ నృత్యం చేయడంతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ కోలాహల ప్రక్రియనే ‘ఢమోళీ’గా వర్ణిస్తారు. ఎనిమిదో రోజు ‘ఘంగోర్’ వివాహం ఎనిమిదో రోజు యువతులంతా చెరువు వద్దకు వెళ్లి మట్టిని తీసుకొస్తారు. ఆ మట్టితో ఆడ, మగ బొమ్మలను తయారు చేస్తారు. ఆడ బొమ్మకు గాంగ్రి, మగ బొమ్మకు ధోవతి, లాల్చితో వేషధారణ చేస్తారు. వాటిని మేళతాళాలతో తీజ్లు ఉన్న చోటుకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ ఆ బొమ్మలకు ఘనంగా వివాహం జరిపిస్తారు. అక్కడే లాప్సీ (పాయసం) తయారు చేసి ఉత్సవ ప్రతిమలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ‘గణ’ అంటే వారి కులదేవత ‘మేరామయాడి’ అని ‘గోర్’ అంటే కుల దేవుడు సేవాభయ్యా అని గిరిజనులు పిలుస్తుంటారు. వారిరువురికి ఈ రోజు పెళ్లి చేసినట్లు చెప్పుకుంటారు. సంతోషంగా.. శ్రావణమాసంలో నిర్వహించే తీజ్ పండుగంటే మాకు ఎంతో ఇష్టం. బుట్టల్లో ఉన్న గోధుమలకు తొమ్మిది రోజులు నీళ్లు చల్లి చివరి రోజు ఉత్సవం జరుపుకుంటాం. ఇలా జరుపుకోవడం వల్ల అన్నికార్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతున్నారు. పాడి పంటలతో పాటు ఇంటిల్లిపాది, గ్రామస్తులు సుఖశాంతులతో ఉంటారు. – జే.దివ్యరాణి, చందుగూడ, కెరమెరి -
ఆదివాసీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలి
● ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ● అధికారికంగా ఆదివాసీ దినోత్సవం ఉట్నూర్‌రూరల్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉట్నూర్‌లోని కుమురంభీం కాంప్లెక్స్‌లో ఉన్న సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అధికారిక వేడుకలకు హాజరయ్యారు. ముందుగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీతో కలిసి భీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, ప్రపంచ ప్రసిద్ధి పొందాయన్నారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా పీవీటీజీ గిరిజనులు, ఒంటరి మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా 180 అంబులెన్స్‌లను పీవీటీజీ గ్రామాల్లో ఏర్పాటు చేశామన్నారు. పీవో మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. పీవీటీజీ గిరిజనులకు ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా విద్య, వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆదివాసీల సంప్రదాయ బద్ధమైన పూజలు, గుస్సాడీ నృత్యాలు, డోలు వాయిద్యాలతో కుమురంభీం ప్రాంగణం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో ఏపీవో మెస్రం మనోహర్, పేసా కోఆర్డినేటర్ వసంత్‌రావు, సర్మేడీలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ఆదివాసీలు పాల్గొన్నారు. ఆదివాసీ గ్రామాల్లో.. మండల కేంద్రంతో పాటు ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లోని ఆదివాసీ నాయకులు కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ఆదివాసీల హక్కులను కాపాడుకుందాం
● రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి ● దండేపల్లిలో ఆదివాసీ దినోత్సవ వేడుకలుదండేపల్లి: ఆదివాసీల హక్కులను కాపాడుకోవాలని రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. దండేపల్లిలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాళ్లపేటలో కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి దండేపల్లి వరకు ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. దండేపల్లి అంగడిబజారులో ఆదివాసీ జెండాను తిరుపతి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు కనక జంగు, ఆదివాసీ సంఘాల నాయకులు రాంపటేల్, సోము, కాంతరావు, జలపతి, అర్జున్, రవి, అనంత్, నరేందర్, కిషన్, విక్రమ్, ఎల్లయ్య, లాల్సాబ్, రాజేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కంటెయినర్ ఢీకొని యువకుడి మృతి
● రాఖీ కట్టించుకొని ఇంటికి వస్తుండగా ప్రమాదం ● బాసరలో పండుగపూట విషాదం బాసర/నవీపేట: రాఖీ పండుగను పురస్కరించుకుని ఓ సోదరుడు అక్కతో రాఖీ కట్టించుకొని స్కూటీపై తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్(ఎం) శివారులో చోటు చేసుకుంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన వర్గంటి సాయినాథ్, కవిత దంపతులకు కుమార్తె సాయిప్రియ, కుమారుడు సాయిబాబు అలియాస్ బబ్లూ (19) ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా శనివారం బబ్లూ నిజామాబాద్‌లోని గాజుల్‌పేట్‌లో ఉంటున్న కవిత వద్దకు చిన్నాన్న కుమారుడైన అరవింద్‌తో కలిసి స్కూటీపై వెళ్లాడు. అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి వస్తుండగా అబ్బాపూర్(ఎం)–జగ్గారావు ఫారమ్ మధ్యలో ముందుగా వెళ్తున్న కంటెయినర్‌ను ఓవర్ టేక్ చేస్తూ వెనుక నుంచి ఢీకొన్నారు. ఈ ఘటనలో బబ్లూ కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అరవింద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి మేనమామ బలగం రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
● జిల్లాలోనూ ఫెర్టిలిటీ సెంటర్లు ● పదికి పైగానే ఆస్పత్రుల నిర్వహణ ● ‘సృష్టి’ మోసంతో తనిఖీకి బృందాలు
చర్యలు తీసుకుంటాంజిల్లాలో అనుమతులు లేకుండా ఎలాంటి ఆసుపత్రిని నిర్వహించినా శాఖపరంగా చర్యలు తీసుకుంటాం. సంతాన సాఫల్య కేంద్రాలుగా నిర్వహించుకునేందుకు పూర్తిస్థాయి అనుమతులు తీసుకున్న తర్వాతనే ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించాలి. అనుమతులు తీసుకోకుండా బోర్డులు ఏర్పాటు చేసినా, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ హరీశ్‌రాజ్, జిల్లా వైద్యాధికారిమంచిర్యాలటౌన్: తల్లి కావాలన్న కలను సాకారం చేసుకునేందుకు పిల్లలు లేని దంపతులకు వరంగా మారాల్సిన సంతాన సాఫల్య కేంద్రాలు ప్రభుత్వ అనుమతి పొందకుండానే నిర్వహణ సాగిస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకే పరిమితమైన ఫెర్టిలిటీ సెంటర్లు జిల్లాలోనూ వెలుస్తున్నాయి. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రం మంచిర్యాలలో రెండు ఆస్పత్రులకు మాత్రమే ఫెర్టిలిటీ అనుమతులు లభించగా.. అందులో ఒక ఆస్పత్రికి ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్), మరో ఆస్పత్రికి ఐయూఐ(ఇంట్రా యూటిరైన్ ఇన్సెమినేషన్) విధానానికి మాత్రమే అనుమతి లభించింది. మరో రెండు ఆస్పత్రులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా.. రాకముందే గత కొంతకాలంగా నిర్వహిస్తుండడం గమనార్హం. ఇవి కాకుండా 10కి పైగా గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రసూతి ఆస్పత్రుల ముందు సంతాన సాఫల్య కేంద్రం బోర్డులు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. ఆయా ఆస్పత్రులు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం, కనీసం దరఖాస్తు కూడా చేయకుండానే ఆస్పత్రుల ముందు బోర్డులు ఏర్పాటు చేసి.. ఆస్పత్రి లోపల నోటీసు బోర్డులో మాత్రం ఐవీఎఫ్ సేవలు అందుబాటులో లేవని చిన్నపాటి అక్షరాలతో పెడుతున్నారు. సంతాన సాఫల్య కేంద్రం బోర్డులు చూసి పిల్లలు లేని దంపతులు ఎంతో ఆశతో ఆస్పత్రులకు వెళ్తే వారికి ప్రసూతి ఆస్పత్రుల్లో అందించే చికిత్స మాత్రమే అందిస్తున్నారు. నగరాల్లోని ఆస్పత్రులతో కలిసి... హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో వెలిసిన ఫెర్టిలిటీ ఆసుపత్రులకు జిల్లాలోని పిల్లలు లేని దంపతులు వెళ్లేందుకు కొన్ని ఆస్పత్రులు సంతాన సాఫల్య కేంద్రాల బోర్డులను ఏర్పాటు చేసుకుని, ఆసుపత్రికి వచ్చిన దంపతులను నగరాల్లోని ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు సమాచారం. ప్రతీ నెలలో ఒకరోజు ఉచిత కన్సల్టెన్సీల పేరిట నగరాలకు చెందిన ఫెర్టిలిటీ కేంద్రాల ఆధ్వర్యంలో శిబిరాలను సంతాన సాఫల్య కేంద్రాల పేరిట బోర్డులను ఏర్పాటు చేసిన ప్రసూతి ఆసుపత్రుల్లో నిర్వహించి, ఆయా దంపతుల వివరాలు సేకరిస్తున్నారు. వారికి మొదటగా వారి ఆసుపత్రుల్లోనే చికిత్స అందించడం, ఆ తర్వాత పిల్లలు కావాలంటే నగరంలోని ఆసుపత్రులకు పంపిస్తున్నారు. వీరికి జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు సైతం సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు గైనకాలజిస్టులు ఎలాంటి ఫెర్టిలిటీ నిర్వహణ అనుమతులు తీసుకోకుండానే, సంతాన సాఫల్య కేంద్రాలుగా చికిత్స అందిస్తున్నా వైద్య, ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.జిల్లాల్లో తనిఖీలు షురూఇటీవల సికింద్రాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన మోసంతో ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఫెర్టిలిటీ సెంటర్లతోపాటు అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో తనిఖీలకు టాస్క్‌ఫోర్స్ బృందాలను నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో తనిఖీలు పూర్తి చేసింది. ఇక శుక్రవారం నుంచి జిల్లాల్లో తనిఖీలు మొదలు కాగా.. వరంగల్ జిల్లాలో తనిఖీలు చేశారు. మంచిర్యాల జిల్లాలో రెండింటికి మాత్రమే ఫెర్టిలిటీకి అనుమతులు ఉండగా, అనుమతులు లేకుండా పదికి పైగా ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. అందులో మరో రెండు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని, రాకముందే నిర్వహిస్తున్నారు. మిగిలిన ఆసుపత్రులకు అనుమతులు లేవు. పిల్లలు లేని దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫెర్టిలిటీ కేంద్రాలపై తనిఖీ బృందం చర్యలు తీసుకుంటుందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
అడవి బిడ్డలు.. సంస్కృతి రక్షకులు
● సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ● యాస.. భాష పరిరక్షణకు చర్యలు ● భావితరాలకు అందించే యత్నం ● నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంఇంద్రవెల్లి/ఉట్నూర్‌రూరల్: సంస్కృతి, సంప్రదాయాలకు ఆదివాసీ గిరిజనులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొండ, కోనల నడుమ ప్రకృతితో మమేకమవుతున్నారు. ప్రకృతిని దైవంగా భావించి జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార, వ్యవహారాలను పాటిస్తూ వాటిని భావితరాలకు అందిస్తున్నారు. ఏ పని చేసినా, ఈ కార్యం తలపెట్టినా ముందుగా ప్రకృతి దేవతలకు పూజలు చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. వనదేవతలకు పూజలు చేశాకే సాగు పనులు ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలాం, తోటి, నాయక్‌పోడ్, గోండు, పర్ధాన్, అంధ్, లంబాడీ తెగలుగా ఉన్న ఆదివాసీ గిరిజనులు ప్రతీ పండుగ, కుల దేవతల పూజలు, పెళ్లి వేడుకలు ఇలా ఏవైనా వారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వైభవంగా నిర్వహిస్తారు. ఆదివాసీ తెగలు.. పండుగలుగోండు, కొలాం, పర్ధాన్, తోటి ఆదివాసీ తెగలవారు కుల దేవతలతోపాటు ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు. ఏ పూజ చేసినా.. తరతరాలుగా గ్రామస్తులంతా సామూహికంగా చేసే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆషాఢ మాసం ప్రారంభంలో అకాడి (వన దేవత) పూజలతో మొదలుకుని నాలుగు నెలలపాటు యేత్మసుర్ దేవతలను ఆరాధిస్తారు. శ్రావణ మాసానికి ముందు గావ్ సాత్ పేరుతో పోచమ్మ తల్లికి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో నెలపాటు గ్రామ దేవతలు శివ బోడి, నొవోంగ్ పూజలను ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి సందర్భంగా యేత్మసుర్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ వేషధారణలతో వారంపాటు సంప్రదాయ వాయిద్యాల మధ్య డండారీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. వైశాఖ, పుష్య మాసాల్లో సంవత్సరానికి రెండుసార్లు కులదేవతలైన జంగుబాయి, పెర్సాపేన్, భీందేవుడి పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. పుష్యమాసంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన, రాష్ట్రంలో రెండో పండుగైన నాగోబా మహాపూజ, నాగోబా జాతరను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెస్రం వంశీయులు ఘనంగా నిర్వహిస్తారు. అంద్ సమాజ్ ఆదివాసీలు తమ కులగురువు శ్రీశ్రీ సంత్ సద్గురు పులాజీబాబాను ఆరాధిస్తారు. వారివారి గ్రామాల్లో నిర్మించిన ధ్యాన్ మందిరాల్లో ప్రతీ సంవత్సరం వార్షికోత్సవ పూజలు చేస్తారు. నాగుల పంచమి మరుసటిరోజు శీరల్ దేవత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అంధ్ ఆదివాసీ సమాజ్ వారి వివాహాలు పులాజీబాబా ధ్యాన్ మందిరాల్లో సామూహికంగా జరిపిస్తారు. నాయక్‌పోడ్ ఆదివాసీ భీమన్న దేవుడిని ఆరాధ్యదైవంగా కొలిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లంబాడా గిరిజనులు కులగురువు సంత్ సేవలాల్ మహరాజ్‌ను ఆరాధించడంతో పాటు ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి తరువాత వారంపాటు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. ప్రతిరోజూ గ్రామాల్లోని ఆలయాల్లో సేవాలాల్, జగదాంబదేవిని ఆరాధిస్తారు. యాస.. భాషకు డిజిటల్ రూపం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు మాట్లాడే యాస.. భాష.. సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపర్చడానికి బోలి చేతో (భాష–చైతన్యం) ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చెరిగిపోకుండా భావితరాలకు అందించడానికి గోండి, కొలామీ భాషలో వికీపీడియా, విక్షనరీలను అంతర్జాలంలో భద్రపర్చి భావితరాలకు భాష, సాహిత్య సంపదను అందించడానికి కార్యశాల నిర్వహిస్తూ ఆదివాసీ యువకులను ప్రోత్సహిస్తోంది. – ఆత్రం మోతీరాం, బోలిచేతో ఫౌండేషన్ బోర్డు సభ్యుడువాయిద్యాలు.. ప్రత్యేకతలుగోండులు పెర్స్పెన్ పండుగలో దండారీ డప్పు ల దరువులతో తుడుం వాయిద్యాన్ని నిర్వహిస్తుంటారు. కొలాంలు పోలకమ్మ పండుగ, భీమయ్యక్ ఉత్సవం (సట్టి దెయ్యాల్), దండారీ, దసరా పండుగల్లో మోగిస్తుండగా, గోండులు జంగుబాయి, పెర్స్పెన్, దండారీ ఉత్సవాల్లో తుడుంను డోలుకు సహ వాయిద్యంగా మోగిస్తుంటారు. అలాగే డెంసా నృత్యాలు చేస్తుంటారు. ఆదివాసీ లకు ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతి, సంప్రదాయాలు వారసత్వంగా వస్తున్నాయి. తుడుంను పురుషవాద్యంగా భావిస్తారు. ఈ సంగీత వాద్యాన్ని పూజా కార్యక్రమంలో ఉంచి పూజిస్తారు. ఆదివాసీల చైతన్యానికి ‘తుడుం’ ఒక సంకేతంగా నిలిచింది. ఆదివాసీ ఉద్యమాల్లో ర్యాలీ, ధర్నా లాంటి నిరసన కార్యక్రమాల్లో ‘తుడుం’ మోగిస్తుంటారు. గోండి పూజారులైన ప్రధాన్‌లు, తోటి తమ తెగ ఆచారాన్ని పాటిస్తూ జరిపే మత క్రతువులు, కర్మకాంఢలు, వివాహాలు, చావుల సందర్భంలో దీనిని వాయిస్తారు. గోండి సంప్రదాయాలు, గౌరవానికి ఇది సంకేతం. కిక్రితో పాటు ‘పెప్రే’ అనే రెండు సన్నాయి వాయిద్యాలు, డక్కి అనే చర్మవాయిద్యం అన్నీ కలిసి సామూహికంగా వాయిస్తారు. డోలు లేని ఆదివాసీ ఊరు ఉండదు. డోలు వాయిద్యానికి ప్రత్యేకమైన జానపద గేయాలు, నృత్యాలు ఉంటాయి. హోలీ, వివాహ వేడుకలకు డోలు నృత్యాలతో కళాకారులు అలరిస్తుంటారు. ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల సందర్భంగా దీనిని వాయిస్తారు. డోలును వివాహ వేడుకల సందర్భంగా రాత్రి వేళ నృత్యాలు చేయడానికి వినియోగిస్తుంటారు. ఒక్కో సందర్భంలో ఒక గ్రామంతో మరో గ్రామం మధ్య పాటల పోటీలు జరుగుతుంటాయి. డోలు వాయిస్తూ పురుషులు సీ్త్ర వేషధారణలో, ఒకరు జోకర్‌గా నృత్యాలు చేస్తుంటారు. -
వాతావరణం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు బలంగా వీస్తాయి.
పంపించాల్సిన నంబరు 90100 57302మా అన్నే వస్తున్నడు.. చెన్నూర్: ఉద్యోగరీత్యా మా అన్న హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రతీయేడు రాఖీ కట్టడానికి హైదరాబాద్ వెళ్తాను. ఈయేడు మా అన్నే మా ఇంటికి వస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. అన్ని రాఖీ పండుగల కంటే ఈసారి పండుగను మరింత సంతోషంగా జరుపుకుంటాం. – సుమలత, చెన్నూర్ కస్తూర్భా కళాశాల ప్రిన్సిపాల్ప్రతీ సంవత్సరం ఇక్కడే.. పాతమంచిర్యాల: హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వచ్చి అన్నయ్యకు రాఖీ కడుతాను. మేము ఇద్దరం అక్కాచెల్లెళ్లం నిర్మ ల, ప్రమీల. మా ఇద్దరు అన్నయ్యలు శ్రీనివాస్ గోదావరిఖనిలో, దామోదర్ గోదావరిఖనిలో ఉంటారు. వారికి రాఖీ కట్టడానికి పండుగకు ఒక్కరోజు ముందే మంచిర్యాలకు చేరుకుంటాను. దురదృష్టావశాత్తు పెద్దన్నయ్య శ్రీనివాస్ ఇటీవల మృతిచెందాడు. అన్నాచెల్లెళ్ల అనుబంధం మాటల్లో చెప్పలేనిది. – ప్రమీల, హైదరాబాద్ -
గోండి, కొలామి భాష పరిరక్షణలో..
ఆదిలాబాద్ రూరల్: మావల మండలం వా ఘాపూర్ గ్రామానికి చెందిన గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కై లాస్ గోండి, కొలామి భాషల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి రోబోటిక్ టెక్నాలజీ కంప్యూటర్ ద్వారా యాంకర్‌ను తయారు చేసి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నారు. గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబా డా భాషల్లో వందలాది పాటలు రాసి ఏఐ లో పొందుపర్చారు. మహాభారత గ్రంథాన్ని తెలుగు లిపితో గోండి భాషలో అనువదించారు. 18 పర్వాలు నాలుగు నెలలపాటు అనువదించి వంద పుస్తకాలు ప్రచురితం చేశారు. మన్‌కీబాత్‌లో పీఎం మోదీ కై లాస్‌ను ప్రశంసించారు. అప్పటి కలెక్టర్లు దివ్యదేవరాజన్, దేవసేన, ప్రస్తుత కలెక్టర్ రాజర్షిషా కై లాస్‌ను అభినందించారు. -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కోటపల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక అరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. మందుల నిల్వలు, వార్డులు, పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం బొప్పారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలను సందర్శించి మూత్రశాలలు, హాజరుపట్టిక పరిసరాలను పరిశీలించారు. మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను తయారు చేయాలని ఎస్వో హరితను ఆదేశించారు. తహసీల్దార్ రాఘవేందర్రావు, కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు. అమృత్ 2.0 పనులు పూర్తి చేయండి చెన్నూర్: అమృత్ 2.0 పథకంలో నిర్మిస్తున్న ట్యాంక్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ట్యాంక్ పనులను పరిశీలించారు. పనులు పూర్తయ్యే వరకు ఇంటింటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని సూచించారు. -
ఆర్ఎంపీ క్లినిక్‌ల్లో ఆకస్మిక తనిఖీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ క్లినిక్‌లను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర యగ్గన్న శ్రీనివాస్ నేతృత్వంలోని టీజీఎంసీ బృందం శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లో ఇటీవల ఓ ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్న ఓ యువకుడు వైద్యం వికటించి మృతిచెందినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీజీఎంసీకి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో టీజీఎంసీ సభ్యులు ఆర్ఎంపీ కేంద్రాలను శుక్రవారం రాత్రి వరకు తనిఖీ చేశారు. కనీస విద్యార్హతలు, లైసెన్స్ లేకుండా వైద్యులమని ఎలా చెప్పుకుంటున్నారని, ఇంజక్షన్లు, మందులు, గర్భవిచ్ఛిత్తి ఇంజక్షన్లు ఎందుకు ఉన్నాయంటూ మందలించినట్లు సమాచారం. ఓ క్లినిక్‌లో రెండు పడకలు ఏర్పాటు చేసి రోగికి యాంటీబయోటిక్ ఇంజక్షన్ కూడా ఇస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో డాక్టర్ సంతోష్, డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘రక్షా బంధన’మై..!
రాఖీ కట్టి ఒక్క రూపాయే తీసుకుంటారుబెల్లంపల్లి: నా చదువంతా హాస్టళ్లలో కొనసాగింది. పండుగలకు ఇంటికి దూరంగా ఉండేవాడిని. అక్కాచెల్లెళ్ల ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా నిలుస్తున్న రాఖీ పండుగకు కూడా తోబుట్టువులకు అందుబాటులో ఉండేవాడిని కాదు. కానీ ఆ పండుగ నాకెంతో ప్రత్యేకమైంది. నేనెంత దూరం వెళ్లి చదువుకుంటున్నా సరే మా అక్క లక్ష్మిమౌనిక, మా బాబాయి, పిన్నిల కూతుళ్లు ఇద్దరు కలిసి వచ్చి చేతికి రాఖీ కట్టి నిండు మనస్సుతో ఆశీర్వదించడం క్రమం తప్పక వస్తున్న ఆనవాయితీ. ఈ తీపి జ్ఞాపకాలు ఎన్నడూ మర్చిపోలేను. రాఖీ కట్టినందుకు మా అక్కాచెల్లెళ్లు నా నుంచి కట్నకానుకలు ఏమీ ఆశించేవారు కాదు. డబ్బు ఇవ్వడానికి సిద్ధపడితే ససేమిరా ఒప్పుకునే వారు కాదు. నా తృప్తి కోసం ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒక్కొక్కరు ఒక్కో రూపాయి చొప్పున తీసుకుని సంతోషపడేవారు. నేటికీ అదే కొనసాగుతోంది. నా జీవితంలో రాఖీ పండుగకు ఎంతో అనుబంధం ఉంది. 2023లో నాగ్‌పూర్‌లో ఇన్‌కంట్యాక్స్ అధి కారిగా శిక్షణ పొందుతున్న సమయంలో పండుగ వచ్చింది. మా ముగ్గురు అక్కాచెల్లెళ్లు నాగ్‌పూర్‌కు వచ్చి నా చేతికి రాఖీ కట్టి దీవించారు. ఆ వేళ యాధృచ్చికంగా యూపీఎస్సీ ఫలితాలు వెల్లడై ఐఏఎస్‌గా సెలక్ట్ అయ్యాను. ఆ తీపి గుర్తు నేనెన్నడు మర్చిపోలేను. – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఐఈఎస్‌ఎస్‌డీ మనోజ్ -
అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ప్రసన్నాంజనేయనగర్కు చెందిన గంగాధరి వాణి(44) అనే మహిళ అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం దేవాపూర్‌కు చెందిన శంకర్‌తో వాణి వివాహం జరిగింది. కొంతకాలంగా శంకర్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో వాణి టైలరింగ్ పని చేస్తూ ఇంటి భారాన్ని మోసింది. తనకు వచ్చే డబ్బులు సరిపోకపోవడం, అప్పులు ఉండడంతో మనోవేదనకు గురై ఈనెల 6న మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. గమనించిన భర్త వెంటనే గ్రామంలోని కంపెనీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరిస్థితి విషమించగా కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుండగా రాత్రి మృతిచెందింది. మృతురాలికి 11 ఏళ్ల కొడుకు విజ్ఞతేజ్ ఉన్నాడు. మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో ఒకరు.. రెబ్బెన: అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది మండలంలోని నంబాలకు చెందిన రత్నం నారాయణ (47) శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే నారాయణ పదేళ్లుగా షుగర్‌తో బాధ పడుతున్నాడు. ఇటీవల మరికొన్ని అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. అనారోగ్య సమస్యలు భరించలేక చనిపోవాలని ఉందని తరచూ కుటుంబ సభ్యులతో చెబుతూ బాధపడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి తనకు అస్వస్థత ఉన్నట్లు భార్య ప్రమీలకు తెలిపాడు. వెంటనే కుటుంబ సభ్యులు నారాయణను రెబ్బెన పీహెచ్‌సీకి తరలించారు. ప్రఽథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ మృతి వాంకిడి: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన చాప్లే వెంకటేశ్ (30) కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. దీంతో కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 3న సాయంత్రం మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోగా బుధవారం ఇంటికి తీసుకువచ్చారు. కాగా, గురువారం సాయంత్రం అస్వస్థతకు గురైన అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య లలిత, ముగ్గురు కూతుళ్లు, కుమారుడున్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జన్నారం: జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై అనూష తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రోటిగూడకు చెందిన గాలి నాగేశం (40) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లి పని దొరకక ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చడానికి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. అయినా అప్పు తీరకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 5న మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ, కూతురు, కొడుకు ఉన్నారు. విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
శివసాగర్ చెరువులో ఎస్డీఆర్ఎఫ్ బృందం సాధన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం శుక్రవారం జిల్లా కేంద్రంలోని శివసాగర్ చెరువులో సాధన చేశారు. కమాండెంట్ వెంకటరాములు ఆధ్వర్యంలో సాధన చేస్తున్న బృందానికి మంచిర్యాల అగ్నిమాపక శాఖ సిబ్బంది సహకారం అందించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడే అధునాతన పరికరాలను ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా వినియోగించాలనే పలు అంశాలతోపాటు కఠిన సమయాల్లో ఆపదలో ఉన్నవారిని ఏ విధంగా రక్షించాలనే అంశాలపై సాధన చేశా రు. మంచిర్యాల జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్‌రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వర్రావు, ఆర్ఐ అశోక్, ఆర్ఎస్సై సురేశ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
బాలికల గురుకులంలో చొరబడిన నలుగురి అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం అర్థరాత్రి అక్రమంగా చొరబడి విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేసిన నలుగురిని శుక్రవారం తాళ్లగురిజాల పోలీసులు అరెస్ట్ చేశారు. తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామానికి చెందిన దుగుట సంజయ్, కోనూరి కిరణ్, కన్నెపల్లి మండలం చర్లపల్లి, ఎల్లారం గ్రామాలకు చెందిన గొల్లపల్లి కిరణ్, కొజ్జన కిరణ్ మద్యం మత్తులో బాలికల గురుకుల విద్యాలయంలో అక్రమంగా చొరబడ్డారు. కేకలు వేస్తూ, బూతులు తిడుతూ విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కోనూరి కిరణ్ పట్టుబడగా ముగ్గురు పారిపోయారు. అక్రమంగా విద్యాలయంలో చొరబడిన ఘటనపై విద్యాలయ ప్రిన్సిపాల్ నిరుపమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో యువత ఇష్టారీతిన వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరిగి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రాత్రి వేళ గస్తీ, భద్రతను ముమ్మరం చేసినట్లు తెలిపారు. -
● ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేసినవే ● కొన్ని చోట్ల నడపలేక కేంద్రాలు మూసివేత ● అవకాశమివ్వాలని నిరుద్యోగుల వినతులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో మీ సేవ కేంద్రాల ఏర్పాటు ఉంటుందా? లేదా? అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అవసరమైన చోట్ల తమకు అవకాశం కల్పించాలని విన్నవిస్తున్నారు. పౌరులకు సులభంగా, వేగంగా ఎలక్ట్రానిక్ సేవలు అందించాలని మీ సేవలు నిర్వహిస్తున్నారు. గత నిబంధనల ప్రకారం కొత్తవి ఏర్పడే అవకాశం ఉండగా, ఇటీవల సవరించిన నిబంధనలతో కొత్త కేంద్రాల ఏర్పాటు అవకాశాల కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ఓఎస్ఎస్(వన్ స్టాప్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్), టీజీటీఎస్(తెలంగాణ టెక్నాలజీ సర్వీస్), తెలంగాణ ఆన్లైన్(టీజీఆన్‌లైన్) కింద మీ సేవలు సెంటర్లు నడుస్తున్నాయి. ఆయా శాఖల్లోని అధికారిక సేవలన్నీ ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. పౌరులకు మున్సిపల్ వ్యవసాయ, ఆర్టీఏ, విద్యుత్, పోలీసు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, టీ వాలెట్, దేవాదాయ శాఖలు ఇతర సేవలతోపాటు దాదాపు మూడు వందలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. 19కేంద్రాలు రద్దు జిల్లాలో ఉన్న మీ సేవ కేంద్రాలు చాలా వరకు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. రాజకీయ పలుకుబడితో కొందరు దక్కించుకున్నారు. అయితే తర్వాత సరిగా నడపలేక, ప్రస్తుతం 139 మీ సేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిలో చాలా వరకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నిర్వాహకులకు రెవెన్యూ సంబంధిత ఒక్కో డాక్యుమెంట్‌కు గరిష్టంగా రూ.12వరకు కమీషన్ వస్తోంది. ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తూ నెట్టుకొస్తునారు. కొన్ని చోట్ల ఆదాయం రాక మూత పడుతున్నాయి. ఇప్పటికే 19కేంద్రాలు రద్దయ్యాయి. జిల్లాలో చివరి సారిగా 2017లో కొత్త కేంద్రాలకు అనుమతి ఇవ్వగా, మరోసారి ఎక్కడెక్కడ అవసరం ఉందో స్థానిక తహసీల్దార్ల నుంచి నివేదిక తీసుకున్నాక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మారిన నిబంధనలు కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 5వేల జనాభాకు ఒక మీ సేవ ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో 8వేల జనాభా, మూడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. నిర్వాహకులు డిగ్రీ, కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. జిల్లా ఈ గవర్నెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్త మీ సేవ కేంద్రాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపిక చేసి మంజూరు చేస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉండే ఈ సొసైటీకి అదనపు కలెక్టర్, సీపీతో సహా కార్మిక, గ్రామీణ, పౌరసరఫరాల, పంచాయతీ, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు సభ్యులుగా ఉంటారు.జిల్లాలో మీ సేవ కేంద్రాలు ప్రభుత్వ 3 టీజీటీఎస్ 121 టీజీఆన్‌లైన్ 10 ఓఎస్ఎస్ 5 మొత్తం 139కొత్తవి వద్దంటున్న నిర్వాహకులు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తే తమ అవకాశాలను దెబ్బతిస్తాయని ప్రస్తుత నిర్వాహకుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. హాజీపూర్, లక్సెట్టిపేట, చెన్నూరు మండలాల్లో కొందరు కోర్టుకు వెళ్లడంతో కొత్త కేంద్రాల ఏర్పాటు నిలిచిపోయింది. మరోవైపు సేవ దృక్పథంతో కాకుండా అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలు, అధికంగా ఫీజుల వసూళ్ల కారణంగా నిర్వాహకులకు జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల తాండూరులో జరిమానాలు వేశారు. కనీసం రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా, మూడోసారి వరకు తప్పు చేస్తే సెంటర్ రద్దు చేసే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి రెవెన్యూ వ్యవహారాల్లో అధికంగా వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
ఆర్టీసీకి రాఖీ కట్నాలు..!
● ప్రయాణికులపై అదనపు చార్జీల భారం ● రూ.100కు రూ.50 పెంపు..! ● రద్దీతో అదనపు బస్సులుమంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ బస్‌స్టేషన్ శుక్రవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. తెల్ల వారితే శనివారం రాఖీ పండుగ కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారింది. కాగజ్‌నగర్, గోదావరిఖని, చెన్నూర్ రూట్లలో రద్దీ ఎక్కువగా కనిపించింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోవడంతో కొందరు నిల్చుండి గమ్యస్థానానికి పయనమయ్యారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన ఆర్టీసీ అవకాశం దొరికినప్పుడల్లా ప్రయాణికులపై చార్జీల భారం మోపుతోంది. హైదరాబాద్ జేబీఎస్, మియాపూర్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రోజువారీ బస్సులతోపాటు శుక్రవారం మరో 12 బస్సులు నడిపించింది. పండుగ నేపథ్యంలో స్పెషల్ సర్వీసుల్లో అదనపు చార్జీల భారం మోపింది. సాధారణ రోజుల్లో నడిచే బస్సు చార్జీల కంటే రూ.100కు రూ.50 పెంచింది. సాధారణ రోజుల్లో సూపర్‌లగ్జరీ బస్సు చార్జీ రూ.530 ఉంటే స్పెషల్ సర్వీసుల్లో టికెట్ చార్జీలు రూ.740కు పెంచారు. ఈ లెక్కన ఒక్కో ప్రయాణికుడు రూ.210 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మంచిర్యాల నుంచి జేబీఎస్‌కు రూ.390 ఉండగా.. అదనంగా రూ.160వరకు పెంచారు. శుక్రవారం రెండు స్పెషల్ సర్వీసులు నడిపించారు. పండుగ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం అప్ ఖాళీగా వెళ్లి డౌన్(హైదరాబాద్ నుంచి) ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం జరుగుతుందని, పండుగ సమయంలో స్పెషల్ బస్సుల్లోనే చార్జీలు పెంపు వెసులుబాటు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. -
పాము కాటుకు యువకుడి మృతి
దహెగాం: పాము కా టుకు గురైన యువకు డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో ని పంబాపూర్ గ్రా మంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంబాపూర్ గ్రామానికి చెందిన కంబాల మహేశ్ (22) ఈనెల 2న ఇంట్లో ఉండగా లగ్గాం గ్రామానికి చెందిన బాబా అనే వ్యక్తి ఫోన్ చేసి బాత్రూమ్లో పాము ఉంది కొట్టడానికి రావాలని పిలిచాడు. దీంతో మహేశ్ వెంటనే బాబా ఇంటికి వెళ్లి బాత్రూమ్ డోర్ తీస్తున్న క్రమంలో పాము కాటు వేసింది. వెంటనే మహేశ్ కుటుంబీకులకు విషయం తెలుపగా దహెగాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహేశ్ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి పెదనాన్న పోశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. -
పోడు కోసం పోరు
తాండూర్: దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటు న్న తమకు వాటిపై హక్కులు కల్పించాలని రైతులు పోరుబాట పట్టారు. కుమురంభీం ఆసిఫాబాద్ జి ల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన సుమారు 40 మంది రైతులు మూడురోజు ల క్రితం చేపట్టిన పాదయాత్ర గురువారం రాత్రి తాండూర్‌కు చేరుకుంది. మండలంలోని రేపల్లెవాడ సమీపంలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సేద తీరిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున రైతులు తమ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా గ్రామ శివా రులోని సుమారు 1,200 ఎకరాలను సాగు చేసుకుంటూ 600 కుటుంబాలవాళ్లం జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అటవీశాఖ అధికా రులు సాగు చేసుకోకుండా అడ్డుకున్నారని వాపోయారు. తమకు న్యాయం చేసి భూ హక్కు పత్రాలు ఇచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి, అధికారులకు తమ గోడు చెప్పుకొంటామని వారు పేర్కొన్నారు. -
మారని బతుకులు
ఉట్నూర్ మండలం వంకతుమ్మ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు ఉట్నూర్‌లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ఇలా గ్రామానికి తిరిగిరావడం నిత్యకృత్యం. అలాగే ఈ గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో వాగు దాటాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో వీరిది దయనీయ పరిస్థితి. 2013లో జరిగిన రెండు ఘటనలు ఇప్పటికీ ఆ గ్రామస్తులు మరిచిపోలేరు. ఓ నిండు గర్భిణికి పురుటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వాగు దాటడం ఆలస్యం కావడంతో ఆమె మృత్యువాత పడింది. అదే ఏడాది పాము కాటుకు గురైన మారుతిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో వాగు ఉప్పొంగిన క్రమంలో ఆయన మృతిచెందాడు. -
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యం
● ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా పనిచేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండి ప్రమాదా లను నివారించాలని సూచించారు. పల్లెబాట, పొలంబాట, పట్నంబాట నిర్వహించి విద్యుత్ ప్రమాదాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదకరంగా, శిథిలావస్థలో ఉన్న స్తంభాలు, లూస్లైన్లు, వంగిన పోల్స్, ఎత్తు తక్కువ, పిచ్చిమొక్కలతో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి సరిచేయాలన్నారు. సీఈ ఆపరేషన్ అశోక్, ఎస్ఈ ఉత్తం జాడే, డీఈ ఎంఎం ఖైసర్, బెల్లంపల్లి డీఈ రాజన్న, ఎస్‌ఏవో రాజేశం, ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
గూడెంలో ముగిసిన పవిత్రోత్సవాలు
దండేపల్లి: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో ఈ నెల 5న ప్రారంభమైన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. చివరిరోజు మహాపూర్ణాహుతి, పవిత్ర అవరోహణము, స్నపణ తిరుమంజనము, కుంభ ప్రోక్షణ, హా రతి, మంత్రపుష్పము, మహాదాశీర్వచనము, తీర్థ ప్రసాద వితరణ కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో యాజ్ఞికులు అభిరా మ చార్యులు, ప్రధాన అర్చకులు రఘుస్వామి, వేదపండితులు నారాయణశర్మ, భరత్‌శర్మ, అర్చకులు సంపత్‌స్వామి, సురేష్‌స్వామి, ఆల య ఈవో శ్రీనివాస్, సిబ్బంది చంద్రశేఖర్, సత్యనారాయణ, తిరుపతి పాల్గొన్నారు. -
పంట పొలాల్లోకి మొసళ్లు..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంనూర్ శివారు గోదావరినది తీర ప్రాంతాల్లోని పొలా ల్లో మొసలి పిల్లలు తిరుగాడుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో ఇప్పటికే మొసళ్లు ఉన్నట్లు ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇటీవల ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన మొస లి పిల్లను అటవీ అధికారులు బ్యాక్ వాటర్‌లో వదిలారు. రెండు రోజులుగా నంనూరు శివారులోని పొలాల్లో రైతులకు మొసలి పిల్లలు కనిపిస్తుండడంతో వాటిని జాగ్రత్తగా నీళ్లలోకి వెళ్లేలా చూస్తున్నారు. -
చేనేత కార్మికుడికి రాష్ట్రస్థాయి పురస్కారం
నెన్నెల: మండలంలోని కుశ్నపల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు లిక్కి శంకరయ్యకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం దక్కింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అందించే అవార్డును రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, పట్టు పరిశ్రమల కమిషనర్ శైలజా రామయ్యార్ చేతుల మీదుగా అందుకున్నారు. రూ.25 వేల నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేశారు. కళా నైపుణ్యంతో మగ్గంపై టస్సర్ పట్టువస్త్రం తయారు చేస్తూ చేనేత సంస్కృతిని ఇప్పటికీ కాపాడుతున్నందుకు గానూ శంకరయ్యకు ఈ గౌరవం దక్కింది. -
స్థానికం అంతా సిద్ధం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సమరానికి అంతా సిద్ధమైంది. తాజాగా గుజరాత్‌లోని జామ్ నగర్, ద్వారక జిల్లాల నుంచి 970 బ్యాలెట్ బాక్సులను పంచాయతీ అధికారులు గురువారం జిల్లాకు తీసుకొచ్చారు. ఎలక్షన్ ఆమోదం ఉన్న ఈ బ్యాలెట్ బాక్సులను వాటిని నస్పూర్‌లోని సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్‌లో బందోబస్తు మధ్య సురక్షితంగా భద్రపర్చారు. జిల్లాలో ఇప్పటికే 3,700 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. వీటికి అదనంగా ఈ బాక్సులు తీసుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రెండు నెలల క్రితమే తొలి విడత ఆర్వో(రిటర్నింగ్ ఆఫీసర్ల) శిక్షణ పూర్తయింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి మరోసారి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, సౌకర్యాల కల్పన పూర్తయ్యాయి. జిల్లాలోని ఓటర్ల జాబితా సిద్ధం అయ్యింది. జాప్యంతో మరోమారు మార్పులు చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. తుది జాబితా వెలువడనుంది. జిల్లాలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అటు పంచాయతీ రాజ్, పరిషత్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రెండు నెలల నుంచే కసరత్తు మొదలైనప్పటికీ రిజర్వేషన్లు తేలక ముందుకు సాగలేదు. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేదానిపై స్పష్టత రావడం లేదు.తేలని రిజర్వేషన్ల పంచాయితీపల్లెలు, పట్టణాల్లో పాలక వర్గాలు లేక స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదల కాక పాలన సజావుగా సాగడం లేదు. పాలక వర్గాలు లేక ఏడాదికి పైగా అవుతోంది. హైకోర్టు సైతం సెప్టెంబర్‌లోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంపుదల చట్టంపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో గత చట్టాన్ని సవరిస్తూ రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీ స్థాయిలో పోరాడుతోంది. రిజర్వేన్ల పెంపుపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తేలని, చెప్పలేని పరిస్థితి ఉంది. రెండు నెలల క్రితమే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. రెండు దశల్లో నిర్వహణ అంటూ ప్రచారం జరగడంతో ఆశావహులంతా సిద్ధమయ్యారు. స్థానిక నాయకులు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం మొదలైనప్పటికీ రిజర్వేషన్లు తేలకపోవడంతో స్థబ్దుగా మారింది. మరోవైపు పంచాయతీ, పరిషత్ ఎన్నికలు పూర్తయితే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో పట్టణాల్లో ఉన్న నాయకులు, పోటీ చేసే అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తేనే, పంచాయతీలు, వార్డులు, పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.జిల్లా ; వివరాలుగ్రామ పంచాయతీలు; 306వార్డులు; 2,680ఎంపీటీసీలు; 129ఎంపీపీలు; 16జెడ్పీటీసీలు; 16జిల్లా పరిషత్; 01పోలింగ్ కేంద్రాలు; 2,680బ్యాలెట్ బాక్సులు; 4,670 -
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి తెలపాలి
నస్పూర్: బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తమ స్పష్టమైన వైఖరి తెలియజేయాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వనం సత్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గురువారం సీసీసీలోని నర్సయ్య భవన్లో బీసీ హక్కుల సాధన సమితి మండల సమావేశం నిర్వహించారు. నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దన్నారు. బీజేపీ ప్రభుత్వం కుల గణన చేయకుండా 11 సంవత్సరాలుగా కాలయాపన చేస్తోందని విమర్శించారు. అనంతరం మండల అధ్యక్షుడిగా బొడ్డు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా జోగుల ఆంజనేయులు, కోశాధికారిగా కొత్తపల్లి మహేశ్, తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులను, 17 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొట్టె కిషన్‌రావు, జోగుల మల్లయ్య, లింగం రవి, ముస్కె సమ్మయ్య, దొడ్డిపట్ల రవీందర్, సదానందం, పోశం, తదితరులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
● బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్బాధ్యతల స్వీకరణ..మంచిర్యాలఅగ్రికల్చర్: బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. బుగ్గలో ప్రత్యేక పూజలుబెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండలం క న్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీబుగ్గ రాజేశ్వరస్వామి ఆలయంలో సబ్ కలెక్టర్ మనోజ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఆలయ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ శ్రీదేవి, కన్నాల మాజీ సర్పంచ్ స్వరూప, సిబ్బంది పాల్గొన్నారు. బెల్లంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం ఇ స్తానని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఇనుకొండ ఈశ్వర సత్యసాయి దుర్గ (ఐఈఎస్‌ఎస్‌డీ) మనోజ్ అన్నా రు. గురువారం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టా రు. అంతకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, చి న్ననా టి జ్ఞాపకాలు, తదితర అంశాలు పంచుకున్నారు. కుటుంబ నేపథ్యం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం తండ్రిగారి స్వస్థలం. తల్లిదండ్రులు ఇనుకొండ గంగాభవాని, వెంకటేశ్వర్లు. సోదరి లక్ష్మీ మౌనిక. తండ్రి పోలీసు శాఖలో ఏసీబీ సీఐగా పనిచేస్తున్న క్రమంలో రాజమండ్రికి బదిలీ అయిన సమయంలో అక్కడ జన్మించాడు. విద్యాభ్యాసం మంచిర్యాల జిల్లా తాండూర్లోని విద్యాభారతి పాఠశాలలో 4, 5 తరగతులు, మెట్పల్లిలో ఆరోతరగతి, 7 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. 2013 నుంచి 2015 వరకు గుంటూరులోని భాస్యం విద్యాసంస్థలో ఇంటర్, 2015లో పోటీ పరీక్షకు హాజరై వరంగల్‌లో నీట్లో సీటు సాధించాడు. 2019లో కంప్యూటర్ సైన్స్ గ్రూపులో బీటెక్ పూర్తి. 2021లో సివిల్స్ రాయగా ఐఆర్ఎస్కు ఎంపికకావడంతో ఇన్‌కంట్యాక్స్ అధికారిగా ఉద్యోగం వచ్చింది. నాగ్‌పూర్‌లో ట్రైనింగ్ చేస్తుండగా 2022లో ఐఏఎస్ పాసయ్యా. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ వరకు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి. 2024 నుంచి 2025 మార్చి వరకు సంగారెడ్డిలో ట్రెయినీ కలెక్టర్‌గా విధులు. 2025 ఏప్రిల్, మేలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో అసిస్టెంట్ సెక్రెటరీగా బాధ్యతలు. జూన్, జూలైలో రెండు నెలల పాటు మరోసారి ముస్సోరిలో శిక్షణ. గత జూలై 25న ఐఏఎస్ శిక్షణ పూర్తికాగానే బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా పోస్టింగ్. బెల్లంపల్లి ప్రాంతంపై అవగాహన నాన్న తాండూర్ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేసిన సమయంలో ఆయనతో కలిసి ఆయా ప్రాంతాలన్నీ తిరిగా. ఆ జ్ఞాపకాలు నేటికీ నాకు చాలా బాగా గుర్తున్నాయి. ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన ఉంది. -
ఆటలకు వేళాయె..
● ఈ నెల చివరిలో ఎస్జీఎఫ్ పోటీల నిర్వహణ ● వేదికలు ఖరారుమంచిర్యాలఅర్బన్: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని భావించిన రాష్ట్ర ప్రభుత్వం బాలబాలికలు క్రీడల్లో రాణించేలా ఏటా ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్ ఫెడరేషన్) పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఆగస్టులో నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా క్రీడల నిర్వహణకు సంబంధించిన వేదికలను కూడా ప్రకటించింది. పోటీలను మూడంచెల పద్ధతిలో నిర్వహించనున్నారు. అండర్–14, 17 విభాగంలో పాఠశాలల విద్యార్థులకు మండల, జోనల్, జిల్లా స్థాయిలో విడతల వారీగా పోటీలు తలపెట్టనున్నారు. జిల్లాస్థాయిలో జరిగే పోటీల నిర్వహణకు వేదికలతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపాళ్లను కన్వీనర్లుగా ప్రకటించారు. జోనల్, స్టేట్‌మీట్ వేదికలు ఖరారు కావాల్సి ఉంది. ముందుగా అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడి నుంచి జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. క్రీడా పోటీలు ఇలా.. జిల్లా స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలకు వేదికలు ప్రకటించారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ పోటీలు (జెడ్పీహెచ్ఎస్ భీమారం), బాక్సింగ్ (మోడల్‌స్కూల్, రాజీవ్‌నగర్), రెజ్లింగ్ (మధర్‌థెరిస్సా స్కూల్, మంచిర్యాల), టెన్నిస్ (జెడ్పీహెచ్ఎస్, నెన్నెల), బాస్కెట్ బాల్ (కార్మెల్ హైస్కూల్, మంచిర్యాల), చదరంగం (జెడ్పీహెచ్ఎస్, ఆకెనపల్లి), కబడ్డీ, అండర్–17 (ట్రినిటీ హైస్కూల్), అండర్–14, 17 (జెడ్పీహెచ్ఎస్, అచ్చలాపూర్), టేబుల్ టెన్నిస్ (జెడ్పీహెచ్ఎస్, ముల్కల్ల), వాలీబాల్, అండర్–17 బాలురు (జెడ్పీహెచ్ఎస్, జన్నారం), వాలీబాల్ అండర్–17 బాలికలు (లక్సెట్టిపేట్), వాలీబాల్ అండర్ 14, 17, బాలురు, బాలికలు (జెడ్పీహెచ్ఎస్, రెబ్బనపల్లి), ఉషూ, హ్యాండ్‌బాల్, అండర్–17 (సదన డిఫెన్స్ అకాడమి, మంచిర్యాల), త్రోబాల్ (జెడ్పీహెచ్ఎస్, కన్నెపల్లి), హ్యాండ్‌బాల్, అండర్–14 (జెడ్పీహెచ్ఎస్, నస్పూర్), బాస్కెట్‌బాల్ (జెడ్పీహెచ్ఎస్, బెల్లంపల్లి), పెన్సింగ్ (స్పింగ్ ఫీల్డ్ స్కూల్, మంచిర్యాల), ఖోఖో (జెడ్పీహెచ్ఎస్, భీమారం), సాఫ్ట్‌బాల్ (జెడ్పీహెచ్ఎస్, బెల్లంపల్లి), లాన్‌టెన్నిస్, టెన్నికాయిట్ (జెడ్పీహెచ్ఎస్, నెన్నెల) టగ్ ఆఫ్ వార్ (ఆక్స్ఫర్డ్ స్కూల్, మంచిర్యాల), క్రికెట్ (ట్రినిటీ హైస్కూల్, పల్లవి మోడల్ స్కూల్ మంచిర్యాల), ఫుట్‌బాల్ (హెవెన్ ఆఫ్ హోప్ స్కూల్)లో పోటీలు నిర్వహించనున్నారు. ఇతర క్రీడాపోటీలకు వేదికలు కేటాయించాల్సి ఉంది. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు చివరలో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీ మహ్మద్ యాకూబ్ తెలిపారు. పోటీలకు సంబంధించి వేదికలు ఖరారు చేశామని, కన్వీనర్లను కూడా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.