పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభం

Mar 13 2026 7:37 AM | Updated on Mar 13 2026 7:37 AM

జన్నారం: మండలంలోని చింతగూడలో ని ర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని గురువారం ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సుతారి సుమలత ఎమ్మెల్యే దృష్టికి గ్రామ సమస్యలు తీసుకెళ్లగా, ఆయన స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎంపీడీవో ఉమర్‌ షరీఫ్‌ తదితరులున్నారు.

క్రీడా పోటీలు ప్రారంభం

మంచిర్యాలఅర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాల మైదానంలో మై భారత్‌ (మేరా యువ భారత్‌) ఆధ్వర్యంలో క్లస్టర్‌ బ్లాక్‌ స్థాయి క్రీడాపోటీలు గురువారం అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి. రెండ్రోజుల పాటు నిర్వహించనున్న పోటీలను కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ వై.నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. రన్నింగ్‌, షటిల్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ పోటీల్లో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి గోపాలకృష్ణ, కళాశాల అధ్యాపకులున్నారు.

నూతన నియామకం

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాలకు చెందిన బీజేపీ నాయకుడు, న్యాయవాది తులా ఆంజనేయులును పార్టీ తెలంగాణ మీడియా ప్యానలిస్ట్‌గా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నియమిస్తూ ఉ త్తర్వులు జారీ చేశారు. ఆంజనేయులు విద్యార్థి దశలోనే ఏబీవీపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. బీజేవైఎం మంచిర్యాల జిల్లా క న్వీనర్‌గా, అధ్యక్షుడిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలందించారు. తనను బీజేపీ మీడియా ప్యానలిస్ట్‌గా నియమించినందుకు గాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌కు ఈ సందర్భంగా ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement