breaking news
Mancherial District News
-
రూ.15 వేల పింఛన్ ఇవ్వాలి
తలసేమియా, సికిల్‌సె ల్, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు ఆరో గ్యశ్రీ వర్తింపుతోపాటు వికలాంగులుగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా చేసిన పోరాటానికి గతంలో ప్రభుత్వం వికలాంగ ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు ముందుకు వచ్చింది. పింఛన్ డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించి దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్ ఆగస్టు 15నుంచి ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన హర్షణీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రతీ నెల రూ.15 వేల పెన్షన్‌ను ఇచ్చినట్లే ఇక్కడ కూడా ఇవ్వాలి. – కాసర్ల శ్రీనివాస్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
అమ్మపాలు అమృతం
మంచిర్యాలటౌన్: పుట్టినప్పటి నుంచే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం. బిడ్డను ఆరోగ్యంగా ఉంచేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయి.. ప్రతీ బాలింత తన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి.. అమ్మపాలు అమృతం..అని జిల్లా శిశు, మహిళా, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలింతలు, గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. బిడ్డకు అమ్మ పాలు అమృతం. పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. తల్లిపాలతో శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సి ందే. పుట్టిన బిడ్డకు తల్లిపాటు పడితే శిశువుతో పాటు, తల్లికీ లాభాలున్నాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంతటి విశిష్టత కలిగిన తల్లిపాల ప్రాముఖ్యతను చాటేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏటా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. పుట్టిననాటి నుంచి ఆర్నెల్ల వరకు బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే ముర్రుపాలను కచ్చితంగా శిశువుకు పట్టాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందుతా యి. ఇందులో మాంసకృత్తులు, విటమిన్ ‘ఏ’ ఉంటుంది. బిడ్డ పుట్టిన గంట నుంచి 6 నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. తల్లి పాలు తేలికగా అరుగుతాయి. శుభ్రంగా ఎటువంటి క్రిములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, అస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత నుంచి బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. దీనివల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం, పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. పాలివ్వడం వల్ల తల్లికి లాభమే... తల్లులు చనుబాలు ఇవ్వడం వల్ల గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. చనుబాలు ఇచ్చినందు వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భధారణకు పూర్వం ఉన్న బరువును తిరిగి పొందగలుగుతారు. బిడ్డకు పాలు పట్టించడం వల్ల రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావు. తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియో పొరొసిన్(ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది. తల్లి శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది.తల్లిపాలతోనే బిడ్డకు ఆరోగ్యంతల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి. నాణ్యమైన ప్రొటీన్లు, ఒమెగా 3,.6 అలాగే 9 బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి. ఈ పాలలో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టోజ్ వల్ల క్యాల్షియం నిల్లలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. తొలి నెలలో శిశువులను వివిధ రకాల అంటు వ్యాధుల బారినుంచి కాపాడుతాయి. బిడ్డ మనోవికాసానికి తోడ్పడుతాయి. బిడ్డ మృదువైన మల విసర్జనకు, మలబద్ధకం సమస్య నివారణకు తోడ్పడుతాయి. జీర్ణ మండలాన్ని వృద్ధి చేస్తాయి. తల్లిపాల ద్వారా బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధుల బారి నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. ఎలర్జీ, అస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులు దరిచేరవు. బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ.జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలుప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులు గర్భిణులు బాలింతలు మంచిర్యాల 244 2,406 1,110 839 లక్సెట్టిపేట 203 2,165 642 502 చెన్నూర్ 245 2,976 901 764 బెల్లంపల్లి 283 2,974 996 856 మొత్తం 975 10,521 3,649 2,961 -
పర్యాటకంపై పట్టింపేది?
ఇచ్చోడ: ప్రకృతి అందాలు, పచ్చని అడవులు, జాలువారే జలపాతాలకు ఆదిలాబాద్ జిల్లా పేరుగాంచింది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడినవి ఎన్నో ఉన్నాయి. వర్షాకాలంలో కుంటాల, గాయత్రి, పొచ్చెర, కోర్టికల్, పెద్దగుండం జలపాతాల అందాలు చూసేందుకు దూరప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. చాలాచోట్ల రోడ్లు, సౌకర్యాలు లేవు. బస చేయడానికి వసతులు లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెబు తున్నా నిధులు మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తోంది. గతంలో రాష్ట్ర పర్యాటక, అటవీశాఖల ప్రిన్సిపాల్ సెక్రెటరీలు కుంటాల జలపాతాన్ని సందర్శించారు. రోప్‌వే ఏర్పాటు, కుంటాల దిగువ భాగం కడెం నదిలో పర్యాటకులకు బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చారు. ఇప్పటికి నిధులు మంజూరు కాలేదు. సరైన రోడ్లు లేక..పొచ్చెర మినహా గాయత్రి, కనకాయి, కొర్టికల్, పెద్దగుండం, ఘన్పూర్ జలపాతాలకు వెళ్లడానికి సరైన రోడ్లు లేవు. గాయత్రి వద్ద 2016, 2022లో రెండు సార్లు హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో రాపెల్లింగ్ పోటీలు నిర్వహించారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పర్యాటకులు రావడం లేదు. దాదాపు 4 కి.మీ కాలినడకన వెళ్తే కానీ అక్కడికి చేరుకోలేం. కనకాయి, పెద్దగుండం, ఘన్పూర్ జలపాతాలకు రోడ్లు లేకపోవడంతో సందర్శించడానికి రావడం లేదు. కుంటాల జలపాతం వద్ద పర్యాటకులు ఇలా వచ్చి అలా వెళ్తూ..రాష్ట్రంలో ఎత్తైన జలపాతంలో కుంటాల ఒ కటి. రెండు ఎత్తయిన కొండల మధ్య ఉన్న జలపాతం అందాలు చూడాలంటే దాదాపు 408 మెట్లు కాలినడకన కిందికి దిగాలి. వ యస్సుపైబడినవారు జలపాతాన్ని చూడకుండా వెనుదిరుగుతున్నారు. రోప్‌వే ఏర్పా టు చేస్తేనే వీటిని అందాలు చూడవచ్చు. గైడ్లు, జలపాతం వద్ద ప్రమాద హెచ్చరికబోర్టు లేకపోవడంతో ప్రమాదాలకు గురైన ఘటనలున్నాయి. గత రెండేళ్ల క్రితం రూ.2 కోట్లతో పర్యాటకుల బస చేయడానికి రిసార్టుల నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండేళ్లు కావస్తున్న పనులు పూర్తికాలేదు. హైదరా బాద్‌తోపాటు దూరప్రాంతాల నుంచి వచ్చేవారు నిర్మల్ లేదా ఆదిలాబాద్‌లో హోటళ్లలో బస చేసి కుంటాలకు రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. -
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి: గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనకు కారకులైన బా ధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆశ్రమ పాఠశాలకు వెళ్లి ఫుడ్ ఫాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు అందించకపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు. ఇలాంటి ఘట నలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కొట్టే రాకేష్, యాసిన్, విజయ్, సుమంత్, అరుణ్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు. -
● సత్ఫలితాలిస్తున్న ఆపరేషన్ స్మైల్/ ముస్కాన్ ● నాలుగేళ్లలో 586 మందికి విముక్తి
మంచిర్యాలక్రైం: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బందీగా ఉన్న బాలకార్మికులకు విముక్తి కల్పిస్తున్నారు. కార్మిక శాఖ, పోలీస్, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో బాల కార్మికులను గుర్తించి చెరలో ఉన్న బాల బాలికలను విడిపించి వారి భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. జిల్లాలో నాలుగేళ్ల కాలంలో 586 మంది బాలబాలికలకు బాసటగా నిలిచారు. ఇందులో 451 మంది బాలురు, 135 మంది బాలికలు ఉన్నారు. ఇందులో కొందరిని తల్లిదండ్రుల చెంతకు, మరికొంతమందిని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చేర్పించి విద్యాబోధన చేస్తున్నారు. బాల కార్మికులు ఎక్కడ ఉన్నారంటే.. చిన్నతనంలో తల్లిదండ్రుల ఆలనా పాలనకు నోచుకోని చిన్నారులతో పాటు తప్పిపోయిన పిల్ల లు, అనాఽథలు బాల కార్మికులుగా మారి..దుర్భరమైన జీవితాలను సాగిస్తున్నారు. అలాంటి వారికి ఆపరేషన్ స్మైల్/ముస్కాన్ ద్వారా ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ప్రధానంగా వస్త్ర దుకాణాలు, ఇటుక బట్టీలు, బేకరీలు, హోటళ్లు, భవన నిర్మాణ ప్రదేశాలు, సినిమా హాళ్లు, కిరాణా దుకాణాలు, ఇళ్లల్లో బాలలతో పనులు చేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 41 కేసులు నమోదు కాగా 38 మందిని అరెస్ట్ చేశారు. నిరంతర పర్యవేక్షణ అవసరం.. ఆపరేషన్ స్మైల్/ముస్కాన్ ద్వారా కాకుండా మిగతా అన్నిరోజుల్లో బాలకార్మిక వ్యవస్థపై నిఘా ఉంచాలని పలువురు కోరుతున్నారు. అంతేకాకుండా బాలకార్మికులుగా గుర్తించిన వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పాఠశాలల్లో చేర్పించి వదిలేస్తున్నారు. ఆ తర్వాత వారు సక్రమంగా బడికి వెళ్తున్నారా? లేదా? అనేది పర్యవేక్షించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రత్యేక తనిఖీలతో సరిపెట్టకుండా నిరంతరం బాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మారని తీరుబాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరిస్తున్నా.. ఆపరేషన్ స్మైల్/ముస్కాన్ కార్యక్రమం ద్వారా ఏటా రెట్టింపు సంఖ్యలో బాలకార్మికులు పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఒక్కటే కాకుండా కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖ అఽధికారులు కూడా కృషి చేయల్సిన అవసరం ఉంది. -
మూడు గంటల్లో 32 కి.మీ పరుగు
నిర్మల్‌టౌన్: స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఖానాపూర్ సైక్లింగ్ క్లబ్ నిర్వాహకుడు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్‌కుమార్ ఆదివారం వినూత్న రీతిలో రన్నింగ్ చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. ఖానాపూర్ నుంచి నిర్మల్ జిల్లా కేంద్రం వరకు ఉన్న 32 కిలోమీటర్ల దూరాన్ని ఆ యన కేవలం 3 గంటల్లోనే పరుగెత్తి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, రోజులో కొంత సమయాన్ని వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ లేదా వ్యాయామం కోసం కేటాయించాలని సూచించారు. ఈ సుదీర్ఘ పరుగును విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ కిరణ్‌కుమార్‌ను ఖానాపూర్, నిర్మల్ సైక్లింగ్ క్లబ్ సభ్యులు, స్థానిక యువత, క్రీడాకారులు అభినందించారు. -
వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
చెన్నూర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని 1, 8 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. బిల్లులు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, తహసీల్దార్ మల్లికార్జున్, డిప్యూటీ తహసీల్దార్ సనత్ కుమార్, ఎంఈవో సత్యనారాయణ, వైస్ చైర్మన్ వినయ్‌కుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. -
లేబర్కోడ్ల రద్దుకు పోరాడాలి
పాతమంచిర్యాల: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా నాలుగో మహాసభ ని ర్వహించారు. ముందుగా సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య జెండా ఆవిష్కరించారు. అనంత రం పట్టణంలోని వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేళ్ల పో రాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాల ను కార్పొరేట్‌కు అనుకూలంగా మలిచారన్నారు. ఈ నెల 6 నుంచి 8 వరకు కరీంనగర్లో రాష్ట్ర మ హాసభ, డిసెంబర్లో బెంగళూర్‌లో జాతీయ మహా సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతా రామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అక్బర్ అలీ, ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు ఖలిందర్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గం ఎన్నిక ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అక్బర్ అలీ, ప్రధాన కార్యదర్శిగా మేకల దాసు, గౌరవ అధ్యక్షుడిగా మిట్టపల్లి వెంకటస్వామి, ఉపాధ్యక్షులుగా ముస్కె సమ్మయ్య, మిట్టపల్లి పౌలు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఖలిందర్ అలీఖాన్, కార్యదర్శులుగా తోక ల సరస్వతి, అఫ్రోజ్‌ఖాన్, కోశాధికారిగా దాగం మల్లేశ్ ఎన్నికయ్యారు. ఎన్నికయ్యారు. -
చీకటి దందాకు తెర
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా అక్రమ దందాకు తెరలేపారు. ఆర్మీ క్యాంటీన్ల నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకువచ్చి జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లో వాటిని అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం ఎకై ్సజ్ అధికారులకు తెలిసినప్పటికీ వారికి చిక్కకుండా చీకటి దందాను కొనసాగిస్తుండగా, ఎట్టకేలకు ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 97 బాటిళ్లతోపాటు వాహనం సీజ్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ శాఖాధికారులు చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా దందాపట్టణంలోని వికలాంగుల కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇచ్చోడ మండలంలోని జున్ని గ్రామానికి చెందినవాడు. గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన మరో రిటైర్డ్ ఉద్యోగి అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు స మాచారం. జిల్లాకేంద్రంలో నివాసం ఉండే వ్యక్తి గత పదేళ్లుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఇంటి వద్ద బాటిళ్లను డంప్ చేయడం, గాంధీ పార్క్ రెండో గేటు వద్ద అవసరం ఉన్నవారికి తీసుకువచ్చి విక్రయిస్తుంటాడు. ఎవరికి తెలియకుండా తన బైక్ డిక్కీలో తెచ్చి వాటిని రెండింతలకు అమ్ముతాడు. మద్యం షాపులకు సెలవు ఉన్నరోజు సదరు వ్యక్తికి ఫుల్ గిరాకీ. దీంతో వైన్స్‌షాపుల యజమానులతో పాటు ఎకై ్సజ్ శాఖకు ఆదాయం నష్టం వాటిల్లుతుంది. నిబంధనల ప్రకారం డిఫెన్స్ బాటిళ్లను ఆర్మీ, రిటైర్డ్ ఉద్యోగులకు క్యాంటీన్లో విక్రయిస్తారు. వీటిపై కూడా అమ్మవద్దని రాసి ఉంటుంది. ఈ బాటిళ్లపై ట్యాక్స్, జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. సదరు వ్యక్తులు తెలిసిన ఆర్మీ ఉద్యోగుల నుంచి ఐడీకార్డులు తీసుకుని మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి వాటిని అక్రమంగా తరలిస్తారు. వీరు తీసుకువచ్చే బాటిళ్లు సగం ధరకు అక్కడ లభిస్తే జిల్లా కేంద్రంలో వైన్స్‌షాపుల్లో లభించే ధరకు వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.ఎలా పట్టుబడ్డారంటే..గత కొన్నిరోజులుగా వీరిపై ఎకై ్సజ్ అధికారులు నిఘా పెట్టారు. భోరజ్ మండలంలోని భోరజ్ చెక్‌పోస్టు వద్ద మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి అక్రమంగా కారులో 97 బాటిళ్లు తీసుకువస్తున్నారు. వీటిలో ఆఫ్టర్డార్క్, డివార్స్, బ్లాక్‌డాగ్, పీటర్స్కాచ్ వివిధ బ్రాండ్స్ బాటిళ్లు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారు ల వాహనతనిఖీల్లో వీరి బండారం బయటపడింది. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చే శారు. అయితే ప్రస్తుతం వారికి స్టేషన్ బెయి ల్ ఇవ్వడంపై జిల్లా కేంద్రంలో చర్చ సాగుతోంది. ఎకై ్సజ్ సీఐ.. వారిని సోమవారం రిమాండ్‌కు పంపుతామని చెబుతున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు నిబంధనల ప్రకారం ఫారెన్, ఆర్మీ, ఇతర రాష్ట్రాల మద్యం జిల్లాలో అమ్మడానికి అనుమతి లేదు. డిఫెన్స్ బాటిళ్లు ఆర్మీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే క్యాంటీన్లో విక్రయిస్తారు. వీటిని వీరు మాత్రమే వినియోగించాలి. అమ్మడానికి వీలులేదు. ఎక్కడైన నిబంధనలు ఉల్లంఘించి అమ్మితే కేసులు నమోదు చేస్తాం. – ఎల్.జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
మంత్రి అడ్లూరిని కలిసిన ఐటీడీఏ పీవో
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతా ల్లో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంత్రికి వివరించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజల సంక్షేమానికి, సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాలు మరింత బలోపేతం కావాలన్నారు. ప్రభుత్వ ఫలా లు ప్రతీ గిరిజనుడికి చేరేలా చూడాలన్నారు. -
పెళ్లింట విషాదం
కోటపల్లి: పక్షం రోజుల్లో కూ తురు పెళ్లి.. కుటుంబం ప నుల్లో బిజీగా ఉన్న తరుణంలో ఇంటి పెద్ద మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో నింపింది. మండలకేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలకేంద్రానికి చెందిన కత్తర్ల శంకర్(49) గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి నిద్రపోయాడు. ఈ క్రమంలో ఆయనకు ఎవరో ఫోన్ చేస్తుండగా ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. భార్య పద్మ వచ్చి గమనించి నిద్రలేపగా స్పందించడం లేదు. వెంటనే అందించిన సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని శంకర్‌ను పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు. ఈనెల 16న పెద్ద కూతురు సాయికీర్తన వివాహం జరగాల్సి ఉండగా ఇంటి పెద్ద మృతితో విషాదచాయలు అలుముకున్నాయి. -
తల్లిపాలే ఇవ్వాలి
తల్లిపాలను పట్టడం వల్ల బిడ్డలో రోగ నిరోధక శక్తి పెంపొంది, ఆరోగ్యంగా ఉంటారు. పుట్టిన నాటి నుంచి బిడ్డ తాగినన్ని రోజులు తల్లి పాలు ఇవ్వాలి. ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి. ఆతర్వాత పౌష్టికాహారం అందిస్తూ, తల్లిపాలు ఇవ్వాలి. – డాక్టర్ నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో ప్రాముఖ్యతను వివరిస్తున్నాంఏటా ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాల విశిష్టతను తెలిపేలా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు తల్లి పాల విశిష్టతను తప్పకుండా తెలుసుకోవాలి. – రౌఫ్‌ఖాన్, జిల్లా సంక్షేమాధికారి -
సదరం శిబిరాలు నిర్వహించాలి
మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని తలసేమియా, సికిల్‌సెల్ బాధ/తులకు అత్యంత అవసరమైన హైడ్రాక్సీ యూరియా ట్యాబ్లెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చి ఊరట కల్పించింది. పెన్షన్ ఇస్తున్నట్లు చేసిన ప్రకటనతో బాధితులపై కొంత వరకై నా ఆర్థిక భారం తగ్గుతుంది. బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలి. సదరం ద్వారా సర్టిఫికేట్ల జారీలోనూ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తే న్యాయం జరుగుతుంది. – రంజిత్ కుమార్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి -
వంతెనలు పునరుద్ధరించాలి
మంచిర్యాలటౌన్: భారీ వర్షాలకు కూలిన వంతెనలు పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అధికా రులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రాళ్లవాగుపై ఉన్న క్వారీ రోడ్డు బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు కోతకు గురైన ప్రాంతాన్ని, రంగంపేట్ వెళ్లే దారిలో కాజ్‌వేను ఆదివారం పరిశీలించారు. అనంతరం రాళ్లవాగు వద్ద జరుగుతున్న పైప్‌లైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. త్వరగా పూర్తిచేసి ప్రజలకు తా గునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నా రు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జి.అన్వేష్, మేయర్ దర్ని మధుకర్, డీఈ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నరేష్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఎంసీసీ యాజమాన్యంపై ఆగ్రహంమంచిర్యాలరూరల్(హాజీపూర్): క్వారీ దుర్గాదేవి జాతర విషయంలో ఎంసీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు కలిగిన ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే గఢ్‌పూర్ గ్రామ పంచాయతీతో పాటు ఎంసీసీ యాజమాన్యం కూడా సంయుక్తంగా కనీస వ సతులు కల్పించాల్సి ఉండగా ఎంసీసీ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. హుండీ ఆదాయాన్ని పంచా యతీ స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఎంసీసీ భూములను అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట మేయర్ ధర్ని మధుకర్, కార్పోరేటర్ తూముల నరేశ్ ఉన్నారు. -
దశాబ్దాల కల సాకారం..
జైపూర్: మండలంలోని వివిధ గ్రామాల్లో వాగులపై వంతెనల నిర్మాణానికి ఎట్టకేలకు ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో ఆయా గ్రామాల ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. హైదరాబాద్ రాజీవ్ రహదారి నుంచి టేకుమట్ల క్రాస్ రోడ్డు ద్వారా ఇందారం, టేకుమట్ల, షెట్పల్లి మీదుగా కుందారం, కిష్టాపూర్, వేలాల, పౌనూర్, శివ్వారంతో పాటు పలు గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా టేకుమట్ల పెద్ద వాగు, కుందారం, కిష్టాపూర్ వద్ద ఏళ్ల క్రితం నిర్మించిన లోలెవల్ వంతెనలపై వర్షాకాలం వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఎట్టకేలకు మూడు వాగులపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11కోట్లు మంజూరు చేసింది. దీంతో దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న బ్రిడ్జిల నిర్మాణ కల సాకారం కానుంది. 15 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పడడంతో పాటు వర్షాకాలం వరద కష్టాలు తొలగనున్నాయి. రవాణా సౌకర్యం మెరుగు.. జైపూర్ మండలంలోని టేకుమట్ల క్రాస్ రోడ్డు మీదుగా షెట్పల్లి నుంచి శివ్వారం రోడ్డు మార్గంలో మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, హైదరాబాద్‌కు నిత్యం రాకపోకలు రాకపోకలు సాగిస్తుంటారు. టేకుమట్ల పెద్ద వాగుపై ఏళ్ల క్రితం లోలెవల్ వంతెన నిర్మించారు. కాలక్రమేనా రోడ్డు ఎత్తుకావడం బ్రిడ్జి కిందకు ఉండడంతో భారీ వర్షాలకు వాగు ఉపొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఇదేమార్గంలో కుందారం సమీపంలో చిన్నకల్వర్టు, కిష్టాపూర్ వద్ద మరో కల్వర్టు నిర్మించారు. చిన్నపాటి వర్షానికి వరద నీరు వాటిపై నుంచి ప్రవహించడంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతున్నాయి. మూడు చోట్ల వంతెనల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగు పడనుంది. -
ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ‘చేయూత’
మంచిర్యాలటౌన్: తలసేమియా, సికిల్‌సెల్ ప్రాణా ంతక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ‘చేయూత’ అందించనుంది. బాధితులు ప్రతీ పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించుకోవడంతోపాటు ప్రతీరోజు మందులు వాడాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1500 మందికిపైగా బాధితులు ఉండగా.. మంచి ర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఉచితంగా రక్తం ఎక్కిస్తారు. ఈ వ్యాధుల బారిన పడిన వారిని కాపాడేందుకు రక్తంతోపాటు మందులు అత్యవసరం. ప్రతీ నెల ఒక్కో వ్యాధిగ్రస్తుడికి రూ.6వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. తమను దివ్యాంగులుగా గుర్తించి పింఛన్లు ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తలసేమియా, సికిల్‌సెల్, హిమోఫీలియా వ్యాధులను దివ్యాంగుల జాబితాలో చేర్చి సదరం ద్వారా సర్టిఫికెట్లు ఇస్తుండగా.. పింఛన్లపై ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు ప్రకటన వెలువడింది. దీంతో బాధితుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటి కే ఉమ్మడి జిల్లాలో వ్యాధిబారిన పడిన వారు చికిత్స పొందుతుండగా.. సదరం ద్వారా దివ్యాంగుల ధ్రు వీకరణ పత్రం పొందిన వారు కొందరే ఉన్నారు. సరైన అవగాహన లేక ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం పింఛన్ ప్రకటనతో సదరం శిబిరాలు ఏర్పాటు చేసి త్వరగా ధ్రు వీకరణ పత్రాలు మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలో 600 మందికిపైగా బాధితులు ఉండగా, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం పొందిన వారిలో తలసేమియా వ్యాధి గ్రస్తులు 11మంది, సికిల్‌సెల్ 215, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులు 11 మంది మాత్రమే ఉన్నారు. -
విద్యుత్ షాక్‌తో హత్య కుట్ర భగ్నం
ఆదిలాబాద్‌రూరల్: విద్యుత్ షాక్‌తో ఒకరి హత్యకు చేసిన కుట్రను ఆదిలాబాద్‌రూరల్ పోలీసులు భగ్నం చేశారు. పోలీసుస్టేషన్లో సీఐ రహీం పాషా వివరాలు వెల్లడించారు. మండలంలోని అంకోలికి చెందిన సుడగొణి సుధాకర్‌గౌడ్‌ను వ్యక్తిగత కక్షతో హత్య చేయాలని ప్రధాన నిందితుడు మడిగం స్వామి కుట్ర పన్నాడు. బడే రమేశ్, పుల్లేడు గంగన్నలకు డబ్బు ఆశ చూపి సహకారం తీసుకున్నాడు. పథకం ప్రకారం అర్ధరాత్రి సమయంలో బాధితుడి ఇంటి పైకప్పు ద్వారా విద్యుత్ తీగను బెడ్ వరకు ఏర్పాటు చేసి, ప్లగ్‌కు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అదే సమయంలో సుధాకర్‌గౌడ్ బయటకు రావడంతో నిందితులు పరారయ్యారు. సాంకేతిక విచారణ ఆధారంగా రమేశ్, గంగన్నను అరెస్ట్ చేసి వారి నుంచి కరెంట్వైరు, నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వా ధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న స్వామి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన ఎస్సై విష్ణువర్ధన్, అధికారులు, సిబ్బందిని అభినందించారు. -
‘జైల్‌భరో విజయవంతం చేయాలి’
పాతమంచిర్యాల: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కోరారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో రైతు కార్మిక సంఘాల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లు, పెట్టుబడిదారుల కోసం లేబర్ కోడ్లు తీసుకువచ్చిందన్నారు. అందులో భాగంగానే 10 గంటల పని విధానం జీవో తీసుకువచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు చేపట్టిన కార్యక్రమానికి రైతులు, కూలీలు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. -
దులీప్ ట్రోఫీకి హిమతేజ ఎంపిక
ఆదిలాబాద్: తనదైన ఆటతీరుతో సత్తా చా టుతూ జిల్లా కేంద్రానికి చెందిన కొడిమె ల హిమతేజ మరో అరుదైన ఘనత సా ధించాడు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రంజీ ట్రోఫీకి ఎంపికై న తొలి క్రికెటర్‌గా నిలిచిన ఈ యువ ఆటగాడు విజయ్ హజారే, బుచ్చిబాబు టోర్నీల్లోనూ అత్యధిక పరుగులు సాధించి ప్రతిభ చాటాడు. తాజాగా నిర్వహించిన టీజీ–20 టోర్నీలోనూ పరుగుల వరద పారించి బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. తాజాగా ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీకి సౌత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జేసీ అ కాడమీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో కేక్ కట్ చేసి హిమతేజకు వీడియోకాల్ ద్వా రా శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి మా ట్లాడుతూ జిల్లా క్రికెటర్.. దులీప్ ట్రోఫీకి ఎంపిక కావడం గర్వకారణమని కొనియాడా రు. రాబోయే రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కోచ్ జయేంద్ర పటాస్కర్, కౌన్సిలర్ గంట జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు క్వారీ దుర్గాదేవి జాతర
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హజీపూర్ మండలం గఢ్‌పూర్ శివారు ఎంసీసీ క్వారీ గుట్టల్లో కొలువై ఉన్న దుర్గాదేవి జాతర ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం దుర్గాదేవి దర్శనాలతోపాటు కుంకుమార్చనలు, తీర్థప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జాతర కోసం తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని పేర్కొన్నారు. డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ట్రాఫిక్ మార్గాలు..మంచిర్యాలటౌన్: క్వారీ జాతరకు వెళ్లే భక్తులు ఇబ్బంది లేకుండా ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసి, ట్రాఫిక్ మార్గాలను నిర్ణయించినట్లు మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎంసీసీ నుంచి క్వారీకి వెళ్లేదారిలో రాళ్లవాగు బ్రిడ్జి వద్ద కోతకు గురైన అప్రోచ్ రోడ్డును సీఐ ప్రమోద్‌రావుతో కలిసి పరివీలించారు. మేయర్ మాట్లాడుతూ జాతరకు వెళ్లే భక్తులు డీసీపీ కార్యాలయం పక్క నుంచి కార్మెల్ స్కూల్, గ్రీన్‌సిటీ మీదుగా వెళ్లాలని, తిరిగివచ్చే వారు ఆండాళమ్మ కాలనీ, రంగంపేట మీదుగా పాతమంచిర్యాల నుంచి రావాలని సూచించారు. కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి యువరాజ్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేశ్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి ఉన్నారు. -
వర్షపాతం వివరాలు(మిల్లీమీటర్లలో)
నెల కురువాల్సింది కురిసింది శాతం జూన్ 160 140.9 16 లోటు జూలై 313.5 464.6 26 అధికం జిల్లాలో సాగైన పంటలు(ఎకరాల్లో) పంట సాగు పత్తి 1,69,344 వరి 14,762 కంది 1,178 పెసలు 175 మొక్కజొన్న 44 మినుము 04 కూరగాయలు 519 మొత్తం 1,86,026 -
ఉధృతంగా పెన్‌గంగ..
సిర్పూర్(టి): ఎగువన మహారాష్ట్రలో నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం, మహారాష్ట్ర వార్ద నదిపై ఉన్న గేట్లు ఎత్తేయడంతో నది ఉగ్రరూపం దాల్చింది. శనివారం వరద ఉధృతి పెరుగుతుండడంతో మండలం మీదుగా ఉన్న రెండు అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వెంకట్రావ్‌పేట్–పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలో హైలెవల్ వంతెనపై వరద చేరడం, సిర్పూర్(టి)–మాకిడి అంతర్రాష్ట్ర రహదారిలో హుడ్కిలి సమీపంలోని లోలెవల్ వంతెన వరద నీటిలో మునిగింది. దీంతో హుడ్కిలి, జక్కాపూర్, మాకిడి గ్రామాలతోపాటు మహారాష్ట్ర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు వంతెనల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రయాణాలు సాగించకుండా చర్యలు చేపట్టారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా ల, జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థా యి కిడ్స్, జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మారయ్య ఆధ్వర్యంలో ఇటీవల మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో గురుకుల విద్యార్థులు అండర్–8 విభాగంలో గణేశ్, అండర్–10లో రిత్విక్, కార్తిక్, అండర్–12లో సాయిచరణ్, అండర్–16 విభాగంలో యశ్వంత్ ప్రతిభ కనబర్చా రు. ఈనెల 7, 8 తేదీల్లో హన్మకొండ జవహర్లాల్ నెహ్రూస్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పో టీలకు అర్హత సాధించారు. ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, పీడీ, పీఈటీ వీరిని అభినందించారు. -
ఆపదలో ఆపన్నహస్తం
జన్నారం: జన్నారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1991–92 విద్యాసంవత్సరం మండలంతోపాటు పరిసర గ్రామాల వారు చదివారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇప్పటికీ విద్యార్థులంతా కలుస్తుంటారు. రేండ్లగూడకు చెందిన ఓ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా.. అతడి కూతురు వివాహానికి కొంత సహాయం అందించారు. చర్లపల్లి గ్రామంలో మరో స్నేహితుడు మృతిచెందగా కుటుంబ సభ్యులకు కొంత సహాయం చేశారు. ఇటీవల పొనకల్‌కు చెందిన స్నేహితుడు అనారోగ్యంతో మృతిచెందగా రూ.31 వేలు అందజేసి కుటుంబానికి ధైర్యం ఇచ్చారు. -
జల్సాలకు అలవాటుపడి బైక్‌ల చోరీ
కాజీపేట: జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం బైక్‌ల చోరీకి పాల్పడుతు న్న అంతర్ జిల్లా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్యాంసుందర్ తెలిపారు. కాజీపే ట పీఎస్‌లో శనివారం ఈమేరకు వివరా లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ మండలం మల్లికార్జుననగర్ కు చెందిన తోటపల్లి రాజు ఇటీవలి కాజీ పేట రైల్వే పరిసర ప్రాంతాల నుంచి వరుసగా బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారంతో రాజును గు ర్తించి అరెస్ట్ చేసి, అతని నుంచి నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఎస్సైలు బి.శివ, తాళ్లపల్లి యాదగిరి, మౌనిక, క్రైం టీం సభ్యులు క్రాంతికుమార్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
బాలల హక్కులపై అవగాహన ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వీరయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, అదనపు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోషా, స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్(ఎకై ్సజ్) బి.కృష్ణతేజలతో కలిసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ, పోక్సో చట్టంపై ఏర్పాటు చేసిన ఒక్కరోజు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలల హక్కుల పరిరక్షణ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు. -
మణుగూరు బ్లాక్ సింగరేణికి కేటాయించాలి
నస్పూర్: మణుగూరు డీప్ సైడ్ ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ నాయకులు శనివారం జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం శ్రీనివాస్‌కు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ మణుగూరు డీప్ సైడ్ ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయిస్తే సంస్థ, కార్మికుల భవిష్యత్, ఉద్యోగాల కల్పనకు మరింత భరోసా కలుగుతుందని అన్నారు. బొగ్గు బ్లాకును సింగరేణికి కేటాయించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంశెట్టి నరేందర్, కేంద్ర నాయకులు సీహెచ్.భీంరావు, గరిగ స్వా మి, పి.తిరుపతి రాజు, పేరం రమేశ్, జీవన్ జోయ ల్, రవీందర్‌రెడ్డి, ల్యాగాల శ్రీనివాస్, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, జీవన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
రహదారులతోనే గ్రామాల అభివృద్ధి
నెన్నెల: గ్రామాల సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన రహదారుల నిర్మాణమే ప్రధాన ఆధారమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం జోగాపూర్ టీ రోడ్డు నుంచి మైలారం మత్తడి వాగు బ్రిడ్జి వరకు రూ.1.70 కోట్లతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గట్టు మల్లేష్, డీసీసీ ఉపాధ్యక్షుడు హరీష్‌గౌడ్, నాయకులు తోట శ్రీనివాస్, మల్లాగౌడ్, శంకరయ్య, గట్టు శివలింగయ్య, రాజ్‌కుమార్, గజేందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నార్వాయిపేట గ్రామ సర్పంచ్ కున్సోతు నారాయణ మాజీ ఎంపీపీ తారాచంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు. -
నిషేధిత గడ్డిమందు తరలిస్తున్న నలుగురి అరెస్టు
తాండూర్: భీమిని పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల నిషేధిత గడ్డిమందు తరలిస్తున్న నలుగురిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తాండూర్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో భీమిని ఎస్సై కోటేశ్వర్ తన సిబ్బందితో కలిసి భీమిని మండలం రాంపూర్ శివారులో తనిఖీ నిర్వహించారు. ఇన్నోవా కారులో తరలిస్తున్న గడ్డి మందును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా వెంకటాపూర్ శివారులో తనిఖీ నిర్వహించగా రెండు బైక్‌లపై గడ్డి మందు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు క్యాన్ల, 10 ప్యాకెట్ల గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 క్యాన్లలో రూ.1.04 లక్షల విలువ కలిగిన 210 లీటర్ల గడ్డి మందు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన కాగజ్‌నగర్ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన గుండ రాజు, బట్టుపల్లికి చెందిన పార్వతి కిరణ్, భీమిని మండలం వెంకటాపూర్‌కు చెందిన రుకుం వెంకటేశ్, పల్లె రవీందర్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇన్నోవా కారు, రెండు బైక్‌లు స్వా ధీనం చేసుకున్నామన్నారు. నిందితులు మహారాష్ట్రలోని రాజురాలో గడ్డి మందును కొనుగోలు చేసి భీమిని మండల పరిధిలోని రైతులకు అమ్మడానికి ప్రయత్నించగా వారిని చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత పత్తి విత్తనాలు, గడ్డి మందును ఎవరైన విక్రయిస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ దేవయ్య, ఎస్సైలు కోటేశ్వర్, ప్రసాద్‌రావు పాల్గొన్నారు. -
మాది యాభై ఏళ్ల స్నేహం
చెన్నూర్: మాది యాభై ఏళ్ల స్నేహం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ల్లో నేను గస్తీ నూరియా అనే స్నేహితుడు ఇద్దరం కలిసి చదువుకున్నం. చిన్ననాటి నుంచి మా స్నేహం కొనసాగుతోంది. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని మాట ల్లో చెప్పాలేం. నూరియా నాకు ఏమైన సమస్య వస్తే భుజం మీద చెయ్యి వేయడమే కాదు. నీకు నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చి ముందు ఉండేవాడు. నూరియా ఇండస్ట్రీయలిస్ట్. నేను మంత్రి అయినా సమయం దొరికితే కలుసుకుంటాం. మేమిద్దరం కలిస్తే సమయం ఏర్పడదు. నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత బాధ్యత పెరిగింది. పండుగ వేడుకలు, ఇతర శుభకార్యాల్లో కలుసుకుంటాం. మేమిద్దరం కలిస్తే చిన్ననాటి ముచ్చట్లే ఎక్కువగా ఉంటాయి. ఆ రోజులను గుర్తు చేసుకుని నవ్వుకుంటాం. స్నేహం మంచి కోరిదిగా ఉండాలే తప్ప స్వార్థంతో చేసేది కాదు. ప్రస్తుతం యువత స్నేహం పేరుతో మోసాలకు గురవుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ ఫ్రెండ్షిప్తో మోసపోతున్నారు. ఫేస్బుక్లో ఆకర్షితులై స్నేహం చేసి మోసపోవద్దు. యువత జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. -
నిందితులకు శిక్షపడేలా చూడాలి
ఆదిలాబాద్‌టౌన్: దర్యాప్తు పకడ్బందీగా నిర్వహించి బాధితులకు న్యాయం చేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి బి.సి శశికుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఉ మ్మడి జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన దర్యాప్తు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. ఆలస్యం జరిగితే ప్రజలకు కోర్టులపై విశ్వాసం కోల్పోతారని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే నేరస్థలంలో సాక్ష్యాలు సేకరించి దర్యాప్తు చేపట్టాలన్నారు. నిర్దిష్ట సమయంలో చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేయాలన్నారు. బాధితులకు న్యాయం చేసి వారికి రావల్సిన నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో పీపీ ముస్కు రమణారెడ్డి, అదనపు ఎస్పీ సురేందర్‌రావు, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏసీపీ, డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్, అశోక్, లైజన్ అధికారులు రమేశ్, ఈశ్వర్‌సింగ్, రాఘవేందర్, ఉమాదేవి, గంగాసింగ్, పరశురాం, పండరి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
చెరవీడిన బాల్యం
మంచిర్యాలక్రైం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం సత్ఫాలితాలనిస్తోంది. ఈ ఏడాది జూలై 1న జిల్లాలో ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ 31తో ముగిసింది. కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్, శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ, ఎన్జీవో అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహించారు. 127 మంది బాలబాలికలను చెరవిడిపించి విముక్తి కల్పించారు. ఇటుక బట్టీలు, బేకరీలు, ఆటోస్టోర్స్, ఇళ్లల్లో పని చేస్తున్న వారిని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహల్లో చేర్పించారు. ఇందులో 102 మంది బాలలు, 25 మంది బాలికలు ఉన్నారు. ఆరు కేసులు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. బాలబాలికలను పనిలో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రకటించారు. -
‘ఎల్లంపల్లి’ని సందర్శించిన మంత్రులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం సందర్శించారు. ఆయన వెంట సమాచార, సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి, ఎస్సీ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్కుమార్ఠాకూర్ ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను సందర్శించి నీటిమట్టం వివరాలు తెలుసుకుని గేట్ల ఎత్తివేత సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాజెక్ట్ దిగువ ప్రాంతంలో ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా పరిస్థితులు సమీక్షించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోందని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. నీటిమట్టం, పనితీరు, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ అధికారులు వివరించారు. మంత్రులకు ఘనస్వాగతంమంచిర్యాల జిల్లాకు విచ్చేసిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులకు జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్ పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. -
బస్సు కిందపడి ఒకరి ఆత్మహత్య
మంచిర్యాలరూరల్(హాజీపూర్): బస్సు కింద పడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన హాజీపూర్ మండలం రాపల్లి స్టేజీ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్‌కు చెందిన ఆసాది లింగయ్య(55) ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఆటోలో మంచిర్యాల వైపు వెళ్తున్నాడు. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసిన లింగయ్య ఒక్కసారిగా బస్సు కిందకు దూకాడు. తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య జయశీల, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కుమారుడు సునీల్, కుమార్తె సుజాత ఉన్నారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. లింగయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనస్థాపానికి గురై బస్సు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉరేసుకుని భర్త సిర్పూర్(టి): భార్యతో జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిర్పూర్(టి) ఎస్సై సాగర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లోనవెల్లి గ్రామానికి చెందిన బెండారి పితాంబర్(53), పవిత్ర దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. గ్రామంలో వారికి 12 ఎకరాల భూమి ఉంది. పదెకరాల భూమి కౌలుకు ఇస్తూ రెండెకరాలు సొంతంగా వ్యవసాయం చేసుకుంటుండేవాడు. ఈసారి 12 ఎకరాల భూమి తామే స్వతహాగా చేసుకుందామని భార్య..భర్త పితాంబర్కు చెప్పింది. తనకు ఆరోగ్యం బాగాలేదని 12ఎకరాల భూమి వ్యవసాయం చేయడం సాధ్యం కాదని చెప్పగా శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన పితాంబర్ శనివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఫుడ్ ఫాయిజన్ ఘటన ఇంకా మరువకముందే శనివారం మరో ఘటన చోటు చేసుకుంది. గురిజాలకు వెళ్లేదారిలో ప్రభుత్వ గిరిజన బా లుర ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, ఏఎన్ఎం సైతం అస్వస్థత కు గురైన ఘటన కలకలం రేపింది. మధ్యా హ్న భోజనం చేసిన విద్యార్థులు కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకుని కడుపునొప్పితో బాధపడగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి ఏఎన్ఎం భవానీ చికిత్స తీసుకుని డిశ్చార్జీ కాగా విద్యార్థుఽలు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో అకిరానందన్, రుషి , యశ్వంత్ ,నేశ్వంత్, విష్ణు, మణిచరణ్, విక్కీ ఉన్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. -
‘ఎల్లంపల్లి’ గేట్లు మూసివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/వేమనపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు మూసివేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను శనివారం 19.950 టీఎంసీల నీటిమట్టంతో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో 5 వేల క్యూసెక్కులు, కడెం ప్రాజెక్ట్ నుంచి 5వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 285 క్యూసెక్కులు, నంది పంప్‌హౌజ్‌కు 15,750 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లు మూసివేశారు. వేమనపల్లిలో ప్రాణహిత నది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులను కలుపుతూ నిండుగా ప్రవహిస్తోంది. -
స్నేహానికి గుర్తుగా.. పోస్టుకార్డు
దండేపల్లి: సెల్ఫోన్లు అందుబాటులోకి రావడంతో దేశ, విదేశాల్లో ఉంటున్న మిత్రులు సైతం ప్రతీ రోజు మాట్లాడుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం దూర ప్రాంతాల్లోని మిత్రులు తమ యోగక్షేమాలను ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలియజేసేవారు. దండేపల్లికి చెందిన బొమ్మెన మహేష్‌కు సంగారెడ్డిలో ఉండే తన చిన్ననాటి మిత్రుడు ప్రవీణ్‌కుమార్ 1996లో తన యోగాక్షేమాలతోపాటు మిత్రులు ఎలా ఉన్నారని తెలుసుకునేందుకు అప్పట్లో ఒక పోస్టుకార్డు రాశారు. ఆ పోస్టుకార్డును స్నేహానికి ప్రతీకగా ఇప్పటికీ భద్రపర్చానని, దానిని చూసిన ప్రతీసారి తన మిత్రుడితోపాటు బాల్యం గుర్తుకు వస్తుందని మహేష్ తెలిపాడు. -
లోటు నుంచి అధికం
మంచిర్యాలఅగ్రిలకల్చర్: జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వర్షపాతం లోటు నుంచి ఒక్కసారిగా అధిక శాతానికి చేరింది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలు జిల్లా కరువు కోరల్లో నుంచి బయటపడేసినట్లు అయ్యింది. చెరువులు, కుంటలు, ప్రధాన ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు చేరుతోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు 8.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు శనివారం కాస్త తెరిపి ఇవ్వడంతో రైతులు పొలం పనులు, కలుపు, ఎరువులు, చీడపీడల మందుల పిచికారీలో బిజీగా మారారు. జలాశయాల కింద వరిసాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది 3.51 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా.. సరైన సమయంలో వర్షాల్లేక ఆ అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పటివరకు 1.86లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. జూలై 29న 80.6మిల్లీమీటర్లు, 30న 102.8, 31న 79.7మిల్లీమీటర్లు మొత్తంగా 263.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై 28వరకు జిల్లా సగటున 26శాతం లోటు ఉండగా.. 26శాతం అధికానికి చేరుకుంది. దండేపల్లి మండలం మినహా అన్ని మండలాల్లో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదైంది. ఆరుతడి పంటలకు సరిపడా వర్షం కురువడంతో మొక్కజొన్న, పత్తి పంటలు జీవం పోసుకుని కళకళలాడుతున్నాయి. మరోవైపు వరినాట్లు జోరందుకున్నాయి. కొందరు రైతులు సేంద్రియ ఎరువులు కలియదున్నడం, పొలం గట్లు చెక్కడం, జంబుకొట్టి నాటు వేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే వరినార్లు ముదిరినా తప్పనిసరి పరిస్థితుల్లో నాట్లు వేస్తున్నారు. మరికొందరు ఇప్పుడే నారుపోస్తున్నారు. -
త్వరలో టేకుమట్ల వాగుపై బ్రిడ్జి పనులు
జైపూర్: టేకుమట్ల పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, ఇప్పటికే రూ.7కోట్లతో టెండర్ పూర్తయిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి తెలిపారు. మండలంలోని టేకుమట్ల వాగు వద్ద శుక్రవారం వరద ఉధృతిని ఆయన పరిశీలించారు. నీటి ప్రవాహం, 11గ్రామాలకు రాకపోకలు సాగించే రోడ్డు మార్గంలో బ్రిడ్జి ప్రాముఖ్యతను స్థానిక నాయకులు మంత్రికి వివరించారు. డీసీసీ ఉపాధ్యక్షులు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యర్శిఽ గోనె నర్సయ్య, సర్పంచ్ బల్ల వెంకటేశ్, సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కిట్టు.. బోధన మెరుగయ్యేట్టు
లక్ష్మణచాంద: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధన, గణితం, సైన్స్ పాఠ్యాంశాలపై మరింత పట్టు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకం కింద గణితం, సైన్స్ పరికరాల కొనుగోలుకు పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు గణితం కిట్లకు రూ.5 వేలు, సైన్స్ కిట్లకు రూ.5 వేల చొప్పున ఒక్కో పాఠశాలకు రూ.10 వేలు విద్యాశాఖ మంజూరు చేసింది. పరికరాల కొనుగోలుకు కమిటీ ప్రతీ పాఠశాలలో గణిత, సైన్స్ పరికరాల కొనుగోలు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా, గణితం, సైన్స్ ఉపాధ్యాయులు, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు ఉంటారు. పాఠశాలకు మంజూరైన నిధులతో కమిటీ అభిప్రాయం మేరకు గణితానికి రూ.5 వేలు, సైన్స్‌కు రూ.5 వేలు వెచ్చించి అవసరమైన కిట్లను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ప్రయోజనం గణిత, సైన్స్ పరికరాలు కొనుగోలు చేయడం వల్ల ప్రయోగాత్మక బోధన జరిగి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. విద్యార్థులలో సృజనాత్మక, శాసీ్త్రయ దృక్పథాలు పెంచడంలో కిట్లు కీలకంగా మారతాయి. ఈ నిధులతో పీఎంశ్రీ పాఠశాలల్లో గణిత, సైన్స్ క్లబ్‌లను మరింత బలోపేతం చేసి, ప్రాజెక్టు ఆధారిత విద్యను అమలు చేస్తారు. ప్రత్యక్ష బోధన సైన్స్, గణితం పాఠ్యాంశాలను ప్రత్యక్షంగా తరగతి గదిలో విద్యార్థులకు చూపిస్తూ ఉపాధ్యాయుడు బోధన చేయడంతో ఆ పాఠ్యాంశాలను విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అయితే పాఠశాలలకు వచ్చిన డిజిటల్ ప్యానెల్ బోర్డులతో ప్రతీ పాఠ్యాంశాన్ని వీడియోలు, చిత్రాలు, పటాలు చూపిస్తూ బోధించడానికే ఉపాధ్యాయులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యక్షంగా బోధన పరికరాలు, ప్రయోగ పరికరాలు ఉపయోగిస్తూ బోధన చేయడంతో విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుంది. గణిత, సైన్స్ కిట్లను వినియోగిస్తూ ప్రయోగాత్మక, ప్రత్యక్ష బోధనను ఉపాధ్యాయులు చేస్తే ప్రభుత్వం కిట్లను అందించిన లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు, మంజూరైన నిధులు జిల్లా పాఠశాలలు మంజూరైన నిధులు మంచిర్యాల 22 రూ.2.20 లక్షలు ఆదిలాబాద్ 21 రూ.2.10 లక్షలు నిర్మల్ 19 రూ.1.90 లక్షలు కుమురంభీమ్ 16 రూ.1.60 లక్షలు -
‘ఇందూ గార్డెన్’ అక్రమమే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మందమర్రి రూరల్: ఏజెన్సీ పరిధిలో కొనసాగుతున్న మందమర్రి శివారు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇందూ గార్డెన్ యాజమాన్యానికి మరోసారి ఉట్నూరు ఐటీడీఏ పీవో కోర్టులో చుక్కెదురైంది. గతంలో ఫంక్షన్ హాల్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా స్థానిక తహసీల్దార్ అమలు చేయాలంటూ ఆదేశాలిచ్చింది. 2016లో ఆదివాసీ నాయక్‌పోడ్ సేవా సంఘంతో సహా మొత్తం తొమ్మిది మంది వేర్వేరుగా గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ)కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై ఫంక్షన్ హాల్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లగా, ఎస్డీసీకే మరోసారి విచారణ చేసి తేల్చాలంటూ ఆదేశాలు ఇచ్చింది. మరోసారి విచారణ అనంతరం ఎస్డీసీ గతేడాది డిసెంబర్ 21న తుది ఉత్వర్వులు ఇచ్చారు. సర్వే నంబరు 350/2/4 పరిధిలో నిర్మాణాలతో సహా మొత్తం 2.10ఎకరాలను స్వాధీనం చేసుకోవాలంటూ స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై మరోసారి అప్పీల్‌కు వెళ్లగా అప్పీల్‌దారు వాదనను తోసిపుచ్చుతూ ఫంక్షన్ హాల్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ ఉట్నూర్ ఐటీడీఏ, పాజెక్ట్ ఆఫీసర్ కోట్టు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. అయితే ఈ కేసులో అప్పీలుదారుడు తన తండ్రి 1968లో సాదాబైనామాలో ఈ భూమిని కొనుగోలు చేశామని వాదించారు. కానీ రికారుల్లో ఆ భూమి దశాబ్దాలుగా గిరిజనుల పట్టాదారులుగా ఉన్నట్లు తేలింది. రిజిస్టర్డ్ సేల్ డీడ్‌తో కొనుగోలు చేసినట్లు మున్సిపల్ రికార్డుల్లో రుజువైంది. 1968నుంచే తన ఆధీనంలో ఉందని చెబుతూ మళ్లీ 2016లో కొనుగోలు చేసినట్లు చూపడం విరుద్ధంగా మారింది. దీంతో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూమిని ఆక్రమించడం లేదా బదిలీ చేసుకోవడం 1959/1970 నిబంధనలకు విరుద్ధంగా భావిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రైబల్ కోర్టు తీర్పుపై స్పందిస్తూ గత పదేళ్లుగా తాము చేస్తున్న పోరాటానికి విజయం దక్కిందని ఆదివాసీ నాయక్ పోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గంజి రాజన్న, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా నిర్మాణాలు మందమర్రి పట్టణం, శివారు ప్రాంతాల్లో ఏజెన్సీ చట్టాన్ని తుంగలో తొక్కుతూ అడ్డగోలుగా నిర్మాణాలు వెలుస్తున్నాయి. స్థానికంగా రాజకీయ అండదండలు, పలుకుబడితో అనేక నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు మున్సిపల్ పరిధిలోనూ అక్రమ నిర్మాణాలకు జరిమానాలు వేస్తూ ఇంటి నంబర్లు ఇస్తుండడంతో ప్లాట్లలో నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఏజెన్సీలో రియల్ వ్యాపారులు సైతం అన్ని అనుమతులు ఇప్పిస్తామంటూ జాతీయ రహదారి పొడువునా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. అయితే కొనుగోలు చేశాక అనేక మంది చిక్కుల్లో పడుతున్నారు. మందమర్రిలో అక్రమంగా వెలుస్తున్న కట్టడాలను నియంత్రించాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత
కాసిపేట: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం మండలంలోని పల్లంగూడ గ్రామ పంచాయతీలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుస్స విజయ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సుకుమారి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి విక్రమ్‌రావు, ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్తయ్య, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రత్నం ప్రదీప్, ఉపసర్పంచ్ శేఖర్, పాల్గొన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల నిరసన కాసిపేట: మండలంలోని మల్కెపల్లి గ్రామ పంచాయతీ నూతన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వినోద్ తీరును నిరసిస్తూ సర్పంచ్ కొట్నాక రఘు, వార్డు సభ్యులు నిరసన తెలిపారు. ఎన్నోసార్లు క్యాంపు కార్యాలయంలో కలిసి ప్రారంభానికి రావా లని కోరినా స్పందించని ఎమ్మెల్యే పక్కనే ఉన్న పల్లంగూడ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి వెళ్లడం తమ పంచాయతీ ప్రజలను అవమానించడమేనని తెలిపారు. ఉపసర్పంచ్ జంజిరాల సందీప్, వార్డు సభ్యులు పార్వతిబాయి, ప్రేమలత, అనూష, ప్రవీణ్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సర్పంచ్ సొంత పార్టీ అయినా ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు వర్గం కావడంతో ప్రారంభోత్సవం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
● రాళ్లవాగుకు ఇరువైపులా నిర్మాణాలు ● తొలగింపు లేకపోవడంతో అడ్డగోలుగా కబ్జాలు ● కోర్, బఫర్ తేడా లేకుండా వెలిసిన కట్టడాలు ● వానొస్తే సమీప ప్రాంతాలకు వరదతో వణుకు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కేంద్రం మంచిర్యాలలోని రాళ్లవాగు ఆక్రమణలతో కుంచించుకుపోతోంది. వరదల సమయంలో ఆక్రమణ నిర్మాణాలపై హడావుడి చేస్తూ ఆ తర్వాత అంతా మర్చిపోవడంతో ఇబ్బంది తలెత్తుతోంది. ఇప్పటికే ఈ వాగుకు ఇరువైపులా కోర్, బఫర్ జోన్ తేడా లేకుండా ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారు. కొందరు తమ భూమి వాగు వరకు ఉందంటూ కాగితాలపై చూపిస్తూ వాగులోనే మట్టి, బండలతో నింపేస్తూ చదును చేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో కొద్దిపాటి వరదకు లోతట్టు ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతోంది. గోదావరి పూర్తి స్థాయిలో నిండితే రాళ్లవాగు వరద వెనక్కి తట్టే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం గోదావరిలో వరద లేకపోవడంతో ఇంకా ముప్పు ఏర్పడలేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ కాలనీ, రామ్‌నగర్, పద్మశాలీకాలనీ, గ్రీన్‌సిటీ, రంగంపేట, పాత మంచిర్యాల, రాళ్లపేట కాలనీలకు నీరు చేరింది. అనేకమంది తమ ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. రూ.కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృత్తం కాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. -
డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎన్యూమరేషన్ ఫారా ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవా రం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డిజిటలైజేషన్ తర్వాత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని, ధ్రువపత్రాలు సమర్పించడం ద్వారా ఓటు హక్కును పొందవచ్చని తెలిపారు. డబుల్, డెత్, షిఫ్ట్ అయిన వారి ఓట్లను నిబంధనల ప్రకారం తొలగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. -
టీచర్లకు మధ్యాహ్న భోజనం
మంచిర్యాలఅర్బన్: పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న టీజీ బ్రేక్‌ఫాస్ట్(అల్పాహారం), మధ్యాహ్న భోజన పథకం ఇక నుంచి ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ సిబ్బందికి కూడా వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి విద్యార్థులతోపాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం తక్షణమే విస్తరిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని 709 పాఠశాలల్లో 43,805 మంది విద్యార్థులతోపాటు 3,499 మంది టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి వర్తింపజేయనున్నారు. అవసరమైన మార్పులు చేయాలని మధ్యాహ్న భోజన పథకం(ఎండీఎం) అధికారులకు సూచించారు. ఉపాధ్యాయులకు సమయం ఆదాతోపాటు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం వల్ల పాఠశాలల్లో మంచి వాతావరణం ఏర్పడుతుందని విద్యాశాఖ భావిస్తోంది. పోర్టల్‌లో మార్పులు ఉపాధ్యాయులు, సిబ్బంది భోజనం, టిఫిన్ వినియోగ వివరాల నమోదుకు ఎండీఎం, టీజీ బ్రేక్‌ఫాస్ట్ పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. రోజువారీ బ్రేక్‌ఫాస్ట్, తీసుకున్న సిబ్బంది సంఖ్య రోజువారీగా భోజనం చేసిన టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది అనేది తేదీవారీగా వినియోగ రికార్డు పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆర్జేడీ, డీఈవో, ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, సెంట్రలైజ్డ్ కిచెన్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు ఇచ్చారు. పారదర్శకత కోసం.. టీచర్లు, నాన్టీచింగ్కు ఇవ్వడం వల్ల ఎలా ఉందని అంచనా వేయడానికి ఉపయోగపడనుంది. ఎవరు భోజనం చేస్తున్నారు, ఎంతమంది అనేది స్పష్టత రానుంది. ఎంతమందికి వండాలి అనేది తేలిపోనుంది. అవసరానికి మించి సరుకులు తీసుకోవడం లేదా లెక్కల్లో తేడాలు రావడం నివారణకు దోహదపడనుంది. పోర్టల్ లాగిన్‌లో మార్పులు చేసిన వెంటనే బయోమెట్రిక్, రోజువారీ వినియోగ రికార్డుల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్య ఆధారంగా బడ్జెట్, రేషన్ కేటాయింపులు ఉంటాయి.సెంట్రలైజ్డ్ కిచెన్ పనులు వేగవంతంపాఠశాలల్లో ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం మొదట అందిస్తారు. బ్రేక్‌ఫాస్ట్ పథకం అమల్లోకి రాగానే విద్యార్థులు, టీచర్లు, సిబ్బందికి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే జిల్లా కేంద్రమైన మంచిర్యాల మెడికల్ కాలేజీ ఆవరణలో పాఠశాలల్లో బ్రేక్పాస్ట్ అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ పనులు వేగంగా సాగుతున్నాయి. నిర్మాణం చివ రి దశకు చేరుకోవడంతో ఆగస్టులో విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. అత్యాధునిక యంత్రాలతో పరిశుభ్రమైన వాతావారణంలో ప్రతిరోజూ వేలాది మంది పిల్లలకు నాణ్యమైన టిఫిన్ తయారీ, సరఫరా బాధ్యతలను హరేకృష్ణ మూవ్మెంటు చారిటబుల్ ట్రస్టు(ఇస్కాన్ సంస్థ)కు అప్పగించారు. పనులు పూర్తికాగానే అల్పాహార పథకం అమల్లోకి రానుంది. దీంతో ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు రోజువారీ పోషకాహార లోపం తీరడమే కాకుండా హాజరుశాతం కూడా పెరుగనుంది. -
పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమైనవి
మంచిర్యాలటౌన్: అప్పుడే పుట్టిన బిడ్డకు ఎదిగే వరకు తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేష్టమైనదని, ఆరోగ్యకరంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంపొందుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్‌రాథోడ్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతపై ఈ నెల ఒకటి నుంచి ఏడు వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలతోపాటు, బస్తీ దవాఖానా, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సూపరింటెండెంట్ విశ్వేశ్వర్‌రెడ్డి, డీపీవో ప్రశాంతి, బసుమతి, సుమన్ పాల్గొన్నారు. -
తెరిపిచ్చిన వాన
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం శుక్రవారం కాస్త తెరిపినిచ్చింది. దీంతో రైతులు పొలం బాట పట్టగా.. సాధారణ ప్రజానీకానికి ఊరట లభించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 79.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం 473.2 మిల్లీమీటర్లు కాగా 596.8 మిల్లీమీటర్లు కురిసింది. 26శాతం అధికంగా నమోదైంది. దండేపల్లి మండలంలో 23శాతం లోటు నెలకొంది. కాసిపేట, బెల్లంపల్లి 60 నుంచి 83శాతం అత్యధికం, ఎనిమిది మండలాల్లో అధికం, ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలతో వేల ఎకరాల్లో మొలక దశలో ఉన్న పత్తి పంట నీట మునిగింది. పంట ఎదిగే దశలో ఉండడంతో వరద నీరు వెళ్తుందని తద్వార పంట నష్టం ఉండదని వ్యవసాయ అధికారులు తెలిపారు. కన్నెపెల్లి, కాసిపేట, బెల్లంపల్లి, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో 845 ఎకరాల్లో పత్తి పంటలోకి వరద నీరు చేరిందని ప్రాథమికంగా గుర్తించారు. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, బెల్లంపల్లి మండలాల్లో 53 విద్యుత్ స్తంభాలు, 2 ట్రాన్స్ఫార్మర్లు నెలకొరిగాయి. దీంతో విద్యుత్ శాఖకు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఇళ్లు, గోడలు కూలి రూ.45 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఉప్పొంగిన ప్రాణహిత వేమనపల్లి/కోటపల్లి/చెన్నూర్‌రూరల్/భీమారం: వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వేమనపల్లి పుష్కరఘాట్‌తోపాటు రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. ముల్కలపేట బొందచేను ఒర్రె, కళ్లెంపల్లి రహదారి వరకు వరద నీరు పోటెత్తి ప్రవహిస్తోంది. లోతట్టు గ్రామాలైన కళ్లంపల్లి, ముక్కిడిగూడం, గాజులపేట, సుంపుటం, వేమనపల్లి, కల్మలపేట, రాచర్ల, కేతన్‌పల్లి శివారు, కోటపల్లి మండలంలో వేల ఎకరాల పత్తి పంట మునిగింది. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో పడవల రాకపోకలు నిలిపివేశారు. చెన్నూర్ మండలం సుందరసాల గ్రామ సమీపంలో అన్నా రం బ్యారేజీ నీటితో కళకళలాడుతోంది. కత్తెరసాల గ్రామ సమీపంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. -
పెండింగ్ సీఎంఆర్ పూర్తి చేయాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్డ్ రైస్(సీఎంఆర్) సరఫరా సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు అన్నారు. శుక్రవారం హాజీపూర్‌లోని ఎస్ఆర్ఎం రైస్‌మిల్‌ను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ పురోగతిపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్ సీఎంఆర్‌ను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి ప్రభుత్వానికి అ ప్పగించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయడం ప్రతీ మిల్లర్ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. మండల గిర్దావర్ ప్రభు, మిల్లుల యాజమాన్యం పాల్గొన్నారు. -
బడుల సెలవుపై గందరగోళం!
మంచిర్యాలఅర్బన్: ‘భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు వర్తిస్తుంది.. సెలవుకు బదులుగా ఆగస్టు నెల రెండో శనివారం పాఠశాల పనిదినంగా నిర్వహించాలి.. ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలు ఎలాంటి మార్పులేకుండా షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి..’అని గురువారం కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఇంచుమించుగా ఉదయం 9గంటల 8 నిమిషాలకు జిల్లా విద్యాశాఖ పంపిన సందేశం ఇది.. జరిగిందేమిటి? వర్షాల నేపథ్యంలో గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో జారీచేసిన ఆదేశాలు గందరగోళానికి దారితీశాయి. విద్యాశాఖ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసినప్పటికీ నిబంధనలు బేఖాతారు చేస్తూ క్షేత్రస్థాయిలో బడులు నడిపారు. జిల్లాలో 704 పాఠశాలలుంటే కేవలం 40 లోపు పాఠశాలలు మాత్రమే సెలవులు పాటించగా మిగిలిన బడులు నడిపినట్లు తెలుస్తోంది. సెలవుపై సందేశం ఆలస్యంగా వచ్చిందన్న సాకుతో విద్యార్థుల భద్రతను పక్కనబెట్టి మధ్యాహ్నం వరకు పాఠశాలలు నడిపారు. చివరకు సెలవు పాటించకుంటే చర్యలు తప్పవని అధికారుల సందేశాలతో దిగివచ్చి మధ్యాహ్నం తర్వాత కొన్ని మండలాల్లో సెలవులు ప్రకటించగా మరికొన్నింట్లో సాయంత్రం వరకు నడిపారంటే అధికారుల ఆదేశాలు ఏమేర పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. టీచర్లు, సంఘాల అభ్యంతరం.. ఉపాధ్యాయులు ఇప్పటికే పాఠశాలలకు చేరుకుని ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పూర్తి చేసినందువల్ల సెలవు అవసరం లేదని టీచర్లు అభిప్రాయపడ్డారు. ఉదయం 9.15 గంటల ప్రాంతంలో సెల్ సందేశం ఆలస్యంగా వచ్చేసరికి మెజారిటీ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పూర్తయింది. వర్షంలో వచ్చిన పిల్లలను వెంటనే వెనక్కి పంపించడం సురక్షితం కాదని పేర్కొన్నారు.రెండో శనివారం బడి నడపడమే కారణమా? డీఈవో ఉత్తర్వుల ప్రకారం గురువారం ఇచ్చిన సెలవు భర్తీ చేసేందుకు ఆగస్టు నెల రెండో శనివారం పనిదినంగా ప్రకటించారు. ఆరోజు సెలవు కోల్పోవడం ఇష్టంలేని కొందరు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు డీఈవో ఆదేశాలను పట్టించుకోకుండా ఉదయమంతా బడి నడిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కాంపౌండ్ వాల్‌ను ఢీకొని ఒకరు మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హమాలివాడకు చెందిన నిమ్మల విజయ్‌కుమార్ (39) బైక్‌పై వెళ్తూ స్కూల్ కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టి మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విజయ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. హమాలివాడలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా భారీ వర్షంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి స్కూల్ కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయ్‌కుమార్‌కు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. -
లోలెవల్ బ్రిడ్జిని పరిశీలించిన సీపీ
బెల్లంపల్లి: పట్టణంలోని రాంనగర్ లోలెవల్ బ్రిడ్జిని రామగుండం సీపీ అంబర్ కిశోర్‌ఝా, సబ్ కలెక్టర్ మనోజ్, డీసీపీ భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, కమిషనర్ రమేశ్, సీఐలు కె.శ్రీనివాసరావు, హనోక్ పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీటి ప్రవాహం పెరగడంతో ప్రమాదకరంగా మారిన జాతికుంట చెరువు కట్టను మున్సిపల్ చైర్పర్సన్ సందర్శించి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 వార్డు కాంట్రాక్టర్ బస్తీలో మూడిళ్లు నేలమట్టమయ్యాయి. 13 వార్డులోని పలు ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పోశమ్మ చెరువు నిండి చంద్రవెళ్లికి వెళ్లే ప్రధాన రోడ్డుపై నుంచి వరద నీరు పోటెత్తడంతో గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతేనే బయటకు రావాలిమంచిర్యాలక్రైం: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం ఒక ప్రకటనలో కోరారు. ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే 100కు సమాచారం అందించి పోలీసుల సహాయం పొందాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లతో ప్రమాదం పొంచి ఉందని, అలాంటి ఇళ్లలో ఉంటున్న వారు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసుల హెచ్చరికలను పాటించాలన్నారు.మంచిర్యాలఅగ్రికల్చర్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి జిల్లా జలమయం అయ్యింది. రికార్డు స్థాయిలో గురువారం ఒక్కరోజే 102.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్, నస్పూర్, మంచిర్యాల, కాసిపేట, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో 100 నుంచి 160 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు కాలనీల్లోని డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చడంతో దిగువ ప్రాంతాల్లోని రోడ్లు, తాత్కాలిక వంతెనలు తెగిపోయాయి. కల్వర్టుల పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పలుచోట్ల జనజీవనం స్తంభించింది. వాగులు ఒర్రెలు ఉప్పొంగడంతో 39 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని పత్తి, కంది పంట చేలను వరద నీరు ముంచెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ర్యాలీవాగు, నీల్వాయి ప్రాజెక్టులు మత్తడి దుకుతున్నాయి. ప్రాణహిత వరద ప్రవాహం పెరిగింది. లోటు నుంచి అధికం జిల్లా సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు 467.3 మిల్లిమీటర్లు కాగా 512.2 మిల్లిమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 11 శాతం అధికంగా వర్షం కురిసింది. రెండు రోజుల్లో లోటు నుంచి అధికానికి చేరింది. ఒక్క దండేపల్లి మండలంలో 42 శాతం లోటు నెలకొనగా బెల్లంపల్లి మండలంలో 69 శాతం అత్యధికంగా, కాసిపేట, మందమర్రి, మంచిర్యాల, తాండూర్ మండలాల్లో 30 నుంచి 43 శాతం అధికంగా, మిగితా 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అధికారులు అప్రమత్తం జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. వాగులు, వంకలు దాటేందుకు సాహసించవద్దని సూచిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి గోదావరిలోకి నీటి విడుదలతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఆదేశిస్తున్నారు. మత్తడి దూకిన నీల్వాయి ప్రాజెక్ట్ వేమనపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నీల్వాయి ప్రాజెక్ట్ మత్తడి దూకి ప్రవహిస్తోంది. చామనపల్లి పెద్దవాగు, మామాడ ఒర్రె ప్రమాదకరంగా ప్రవహించాయి. ఎంపీడీవో కుమారస్వామి, సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య, తహసీల్దార్ సాయికృష్ణ, ఒర్రెవద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటచేలు చెరువులను తలపించాయి. -
ఇంటర్‌లోనే ఉపాధికి బాట
నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్లేస్మెంట్ విభాగాలు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 47 ప్రభుత్వ ఇంటర్ కాలేజీలు ఉండగా వీటిలో సుమారు 13వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థులకు నాణ్యమైన కెరీర్ మార్గదర్శనం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. ఉపాధి అవకాశాలకు వారధిలా.. విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించి, ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు దక్కేలా కళాశాలలో ఒక అధ్యాపకుడికి ప్లేస్మెంట్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆసక్తి ఉన్న అధ్యాపకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే జిల్లాస్థాయి కోఆర్డినేటర్లు వారికి ప్లేస్మెంట్ కోఆర్డినేటర్లుగా ఎంపిక చేస్తారు. కోఆర్డినేటర్లు తమ ప్రాంతంలోని పరిశ్రమల ప్రతినిధులతో సంబంధాలు కొనసాగించడం, నైపుణ్యాలను విద్యార్థులకు సమకూర్చడం, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అందేలా చూడటం తదితర విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వారు ఆయా కళాశాలల్లో విద్యార్థుల వివరాలు, వారి ఆసక్తులు, ఉన్నత విద్య లక్ష్యాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రత్యేక డేటాబేస్ రూపొందిస్తారు. విద్యార్థులకు కెరీర్ ప్రణాళికపై నిరంతర మార్గదర్శనం అందించే బాధ్యత కూడా వారిదే. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై అవగాహన ప్లేస్మెంట్ విభాగాల ద్వారా ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి.. ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పారామెడికల్, వ్యవసాయం, పాలిటెక్నిక్, స్కిల్ డెవలప్మెంట్ తదితర రంగాలపై నిపుణులతో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఫార్మా వంటి కంపెనీల సమన్వయంతో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఇందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేయనున్నారు. విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు, కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇంటర్వ్యూ పద్ధతులు, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లా వివరాలు..ప్రయోజనం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధికంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నారు. వీరిలో చాలా మందికి ఉన్నత విద్య, స్కాలర్షిప్లు, ఉద్యోగ అవకాశాలపై సరైన సమాచారం అందుబాటులో ఉండదు. ప్లేస్మెంట్ విభాగాలు ఏర్పాటు ద్వారా అలాంటి విద్యార్థులకు సరైన దిశానిర్దేశం లభించడంతో పాటు భవిష్యత్ కెరీర్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశం కలగనుంది.గ్రామీణ విద్యార్థులకు -
గేట్లు ఎత్తి.. దిగువకు నీటి విడుదల
మామడ: మండలంలోని పొన్కల్ గోదావరి వద్ద ఉన్న సదర్మాట్ బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టంతో జలకళ సంతరించుకుంది. గురువారం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజీ రెండు గేట్లు ఎత్తి గోదావరి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 1.580 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 9300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అడ 6, వట్టివాగు 4 గేట్లు.. ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ప్రాజెక్టుల్లో చేరుతోంది. కుమురం భీం (అడ) ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 40,238 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం సామర్థ్యం 10.393 టీఎంసీలు (238 మీటర్లు) కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 6.001 టీఎంసీలు వాటర్ లెవల్ 237.70 మీటర్లు ఉంది. వరద నీరు రావడంతో ఇన్‌ఫ్లో 30,423 క్యూసెక్కులు కాగా ఆరు గేట్లు 2 మీటర్లు ఎత్తి 40,238 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 2.480 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 36,000 క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గుండి, ఆసిఫాబాద్ వాగులు మరింత ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మత్తడి వాగు ప్రాజెక్టు నాలుగు గేట్లు.. తలమడుగు: తాంసి, తలమడుగు మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మత్తడివాగు ప్రాజెక్టు ఐదు గేట్లు ఉండగా అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మత్తడి వాగు ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 0.571 టీఎంసీలు కాగా ఇన్‌ఫ్లో 38,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అధికారులు అవుట్‌ఫ్లో 38,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చెన్నూర్/చెన్నూర్ రూరల్: జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. చెన్నూర్ మండలంలోని అక్కెపల్లి వాగుపై ఉన్న లోలెవల్ కాజ్వే వద్ద వాగు ఉధృతిని ఆయన పరిశీలించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అఽధికారులపై మంత్రి ఆగ్రహం.. భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న మున్సిపాలిటీలోని 7 వార్డులో గల ఒడ్డెపల్లి కాల్వను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి కాల్వపై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్తే ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయల నగర పంచాయతీ నిధులతో వంతెన నిర్మాణం చేపడుతానని మంత్రి హామీ ఇచ్చారు. కూలిన ఇళ్ల గోడలు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని సుందరసాలలో గుండ భాస్కర్‌రెడ్డి, నర్సక్కపేటలో నగరం బుచ్చయ్య, వేముల రాజయ్య, పాగెపల్లిలో పాగె దాదయ్య ఇంటిగోడలు కూలి పోయాయి. -
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
బాసర: విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని, వాటి సాధన కోసం క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి, సమయపాలన, నైతిక విలువలతో ముందుకుసాగాలని ప్రొఫెసర్ సాయికుమార్ పేర్కొన్నారు. గురువారం ఆర్జీయూకేటీ, బాసరలో నిర్వహిస్తున్న పీయూసీఐ ఓరియంటేషన్ కార్యక్రమం 2026లో ఆయన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ఆర్జీయూకేటీలోని నాణ్యమైన విద్య, ఆధునిక ప్రయోగశాలలు, సాంకేతిక వనరులు, పరిశోధనా అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం అకాడమిక్ మార్కులకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యతను పెంపొందించుకుంటూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వీసీ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రతిభను ప్రపంచ స్థాయి నైపుణ్యంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఆర్జీయూకేటీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ, అకాడమిక్స్‌తో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, వారి కలల సాకారానికి యాజమాన్యం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందన్నారు. పీయూసీఐ ఓరియంటేషన్ కార్యక్రమం 2026 సమన్వయకర్త డా. గుజ్జరి శంకర్ ఆధ్వర్యంలో నూతన విద్యార్థులకు విశ్వవిద్యాలయ విద్యా విధానం, క్యాంపస్ సౌకర్యాలు, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలు, క్లబ్‌లు, సాంకేతిక, వ్యక్తిత్వ వికాస అవకాశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
భారీ వర్షాలకు కూలిన పశువుల పాకలు
నేరడిగొండ: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని కుంటాల(కె) గ్రామంలో రైతు రాథోడ్ సచిన్ కుమార్‌కు చెందిన పశువుల పాక కుప్పకూలింది. ఈ ఘటనలో పాకలో ఉన్న ఓ ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పశువైద్యాధికారి రాథోడ్ జీవన్‌కు సమాచారం అందించగా గురువారం గాయపడిన ఎద్దుకు చికిత్స అందించారు. భారీ వర్షాల సమయంలో పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని రైతులకు సూచించారు. పశువుల కొట్టం కూలి మూగజీవాలు మృతినార్నూర్: గాదిగూడ మండలం పిప్రి గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో గురువారం కురిసిన భారీ వర్షాలకు పశువుల కొట్టం కూలిపోయింది. కొట్టంలో కట్టి ఉంచిన ఆవు, దూడ, మేక శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాయి. గ్రామానికి చెందిన కొడప మారు కుటుంబం జీవనోపాధికి ఆధారంగా ఉన్న పశువులను కొట్టంలో కట్టి ఉంచగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పశువుల కొట్టం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరైంది. -
జలపాతాల పరవళ్లు
బజార్హత్నూర్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల కనకాయి జలపాతం, బండ్రేవ్ జలపాతాలు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నేరడిగొండ: మండలంలోని కుంటాల, కొర్టికల్ జలపాతాలు జలకళ సంతరించుకున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఈ జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండకోనల మధ్య నుంచి పాలధారల వలే జాలువారుతున్న జలపాతాల అందాలు పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. నార్నూర్: మండలంలోని మాన్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పారాఖప్పి జలపాతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతోంది. కొండల మధ్య నుంచి తెల్లని నురగలు చిమ్ముకుంటూ ఉధృతంగా కిందికి దూకుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. జలపాతం వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రజలు, యువకులు జలపాతం సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
వైష్ణవ్జీ.. రైలు వేయండి
నిర్మల్: జిల్లావాసుల రైలు కల సాకారమయ్యే దిశగా పట్టాలు పడుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇంకెన్ని దశాబ్ధాలు మొర పెట్టుకోవాలంటూ ‘విన్నపాలు.. ఎన్నిసార్లు..’ శీర్షికన ఈనెల 13న ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈమేరకు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిశారు. ఉత్తర తెలంగాణ ప్రజలు, ప్రధానంగా రైల్వేలైన్ లేని నిర్మల్‌వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ –నిర్మల్ –ఆదిలాబాద్ రైల్వేలైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు. కలిసి వెళ్లి.. సుదీర్ఘంగా వివరించి.. జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని ఎంపీ నగేశ్, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావుపటేల్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇలా కలిసిన ప్రతిసారీ రైల్వేమంత్రి ఏదో నామమాత్రంగా సమాధానమిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం పక్కాగా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ సారథ్యంలో నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్ ఎంపీలు ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఆదిలాబాద్, ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేశ్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్‌లు బృందంగా కలిసి వెళ్లారు. మంత్రి కార్యాలయంలోనే భేటీ అయ్యారు. ఈ రైల్వేలైన్ నిర్మాణ ఆవశ్యకతపై సుదీర్ఘంగా అశ్వినీవైష్ణవ్‌కు వివరించారు. ఈ ప్రాంతంలో వరుసగా బీజేపీ ఎంపీని గెలిపించడంతో పాటు ఈ లైన్ నిర్మాణం చేపట్టాల్సిన నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారన్న విషయాన్నీ మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అశ్వినీవైష్ణవ్ గ్రీన్‌సిగ్నల్..! రైల్వేలైన్ కోసం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా వచ్చి చేసిన ప్రతిపాదనపై కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు పురోగతిపై అనుకూలంగా ఆయన సంకేతాలు ఇచ్చినట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కదిలించిన ‘సాక్షి’ కథనాలు.. దేశంలోని ఉత్తర –దక్షిణ ప్రాంతాలను కలుపుతున్న గ్రాండ్‌ట్రంక్ రైల్వేలైన్‌కు ప్రత్యామ్నాయంగానూ ఆర్మూర్ –నిర్మల్ –ఆదిలాబాద్ రైల్వేలైన్ ఉపయోగపడుతుందని, దాదాపు 7లక్షల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని చాలా సందర్భాల్లో ‘సాక్షి’ వి భిన్న కథనాలు ప్రచురించింది. కొన్నేళ్లుగా పదేపదే కేంద్రానికి వినతులు ఇవ్వడంపై ఈనెల 13న ప్రచురితమైన ‘విన్నపాలు.. ఎన్నిసార్లు..’ కథనం ప్రజా ప్రతినిధులను కదిలించింది. ఈమేరకు కలిసికట్టుగా బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం నేరుగా కేంద్ర రైల్వేమంత్రిని కలిసి ప్రాజెక్టుకు ఆమోదం కోరడంలో కీలకమైంది. సానుకూలంగా స్పందించారు.. రైల్వేలైన్ నిర్మాణం కోసం బీజేపీ ప్రజాప్రతినిధులంతా మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను ఢిల్లీలో కలిశాం. ఈ ప్రాంత ప్రజల కోరికతో పాటు రైల్వేలైన్ ఆవశ్యకత వివరించాం. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి డీజీపీ సి.వి.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో 24/7 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. శిథిల భవనాలను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జలాశయాలు, వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రహదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టామన్నారు. వాగులు, నదులు, కల్వర్టుల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. డీసీపీ ఎ.భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యం మెరుగుపర్చాలి
ఉట్నూర్‌రూరల్: విద్యాజ్యోతి సమగ్ర ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్‌లోని స్థానిక బీఈడీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుల సామర్థ్య పెంపు శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఐటీడీఏ పీవో మంద మకరందు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ఆధునిక బోధనా విధానాలు, సృజనాత్మక కార్యకలాపాలు, సమర్థవంతమైన తరగతి నిర్వహణ, విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే మార్గాలు అనుసరించాలన్నారు. క్యాంప్ అధికారి, స్థానిక బీ.ఎడ్. కళాశాల ప్రిన్సిపాల్ రాథోడ్ మాణిక్ రావు, సహాయ క్యాంప్ అధికారి జాదవ్ విఠల్, ఏసీఎంవో జగన్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. భారీ వర్షాలు కురుస్తున్నందున ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. కంట్రోల్ సెంటర్ సిబ్బంది, వైద్య బృందాలు 24 గంటలపాటు అందుబాటులో ఉండాలని, సర్పంచ్‌లు, పటేళ్లు, ఎంపీడీవోలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అన్ని సమాచార మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేయాలన్నారు. అలాగే పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 5226 లేదా 08731 –275226 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు
కౌటాల: జిల్లాతోపాటు మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరదనీటితో పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. తాటిపెల్లి వద్ద వార్దా, గుండాయిపేట గ్రామానికి సరిహద్దులోని పెన్‌గంగ నది సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది వరదతో పుష్కర ఘాట్లను తాకుతోంది. వరద పెరగడంతో గంగపుత్రులు చేపల వేట నిలిపివేశారు. వార్దా, పెన్‌గంగ నదులు ఉప్పొంగడంతో మహారాష్ట్రకు నాటు పడవల రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌటాల సీఐ బి.సంతోష్‌కుమార్ సూచించారు. -
ఇదేం ఆస్పత్రి.. ఇలాగేనా ఉండేది..!
● కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహం కోటపల్లి: ‘ఇదేం ఆసుపత్రి.. ఇలాగేనా ఉండేది. ఇలా ఉంటే రోగులు ఎవరు వస్తారు. ఆస్పత్రిలో ప్రసవాలు ఎందుకు కావడం లేదు. సిబ్బంది ఏం చేస్తున్నారు..’ అంటూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోటపల్లి ఆసుపత్రి నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఆసుపత్రి అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో నీరు నిల్వ ఉండడంతోపాటు సరైన సౌకర్యాలు కనిపించపోవడంతో సిబ్బందిని ప్రశించారు. బోర్డులో ప్రసవాల సంఖ్య, గర్భిణుల వివరాలు నమోదు చేయకపోవడంపై ప్రశ్నించారు. సరైన సమాచారం లేకుండా ఎలా పని చేస్తున్నారని నిలదీశారు. స్లాబ్ నుంచి నీరు లీక్ కావడంపై కాంట్రాక్టర్ ఎవరని ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి సౌకర్యాలు పరిశీలించారు. మండలంలోని అర్జునగుట్ట సమీపంలో ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం, సమీప పరిస్థితులు తెలుసుకున్నారు. వర్షాలతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. నదిలో నీటి ప్రవాహ తీవ్రతను పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, సీఐ కృష్ణ, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హరిత పాల్గొన్నారు. -
డీసీసీబీ సీఈవోగా విశ్వేశ్వరరావు
కై లాస్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన సీఈవోగా చండా విశ్వేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పని చేసిన శ్రీధర్‌రెడ్డి గతేడాది సెప్టెంబర్‌లో నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలువురు ఇన్‌చార్జీలతో పాలన సాగింది. రెగ్యులర్ నియామకం కోసం ఇటీవల ప్రక్రియ నిర్వహించగా ఆరుగురు అధికారులు హాజరయ్యారు. వారిలో మెదక్ జిల్లా సహకార బ్యాంక్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న విశ్వేశ్వర్‌ను నియమిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇన్చార్జి సీఈవో రవి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
కమిషనర్ వర్సెస్ చైర్పర్సన్
రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల సమయంలోనే వివాదాలకు కేంద్ర బిందువైన క్యాతనపల్లి మున్సిపాల్టీలో మరోసారి రాజకీయ, పాలనపరమైన వివాదం తెరపైకి వచ్చింది. కమిషనర్, చైర్పర్సన్ వర్గం మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగి పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. కమిషనర్, బీఆర్ఎస్ నాయకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం చైర్పర్సన్, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడం, నాలాలు పొంగిపొర్లడంతో కమిషనర్ మురళీకృష్ణ సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం ఆయా వార్డుల్లో పర్యటించి పరిశీలించారు. ఈ పర్యటనపై చైర్‌పర్సన్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి భర్త, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజరమేష్ కమిషనర్‌ను ఫోన్లో ప్రశ్నించారు. సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. అనంతరం మొదటి వార్డులో ఓ ఇంటిని కమిషనర్ పరిశీలిస్తుండగా.. రాజరమేష్, రామిడికుమార్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అక్కడికి వెళ్లారు. తమ వార్డుల్లో పర్యటిస్తున్న సందర్భంలో సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చైర్పర్సన్ దళితురాలు కావడం వల్లే చిన్నచూపు చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో కమిషనర్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటమాట పెరిగి పరస్పర దూషణల వరకు వెళ్లింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు తనను రాజరమేష్, నాయకులు రామిడికుమార్, మరికొందరు అనుచిత పదజాలంతో దుర్భాషాలాడారని, విధులకు ఆటంకం కలిగించారని కమిషనర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్ దళితురాలు కావడం వల్లే సమాచారం ఇవ్వకుండా కమిషనర్ చిన్నచూపు చూస్తున్నారని, బీఆర్ఎస్ కౌన్సిలర్లను పట్టించుకోకుండా అనుచితంగా మాట్లాడారని బీఆర్ఎస్ నాయకులూ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకుల కౌంటర్.. కమిషనర్ ప్రజల సమస్యలు తెలుసుకుంటుంటే చైర్పర్సన్ భర్త, బీఆర్ఎస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించడమేమిటని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్, పల్లె రాజు, యాకూబ్అలీ, గోపురాజం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. కాగా, కమిషనర్ ఫిర్యాదు మేరకు విధులకు ఆటంకం కలిగించిన బీఆర్ఎస్ నాయకులు రాజరమేష్, రామిడికుమార్పై కేసు నమోదు చేసినట్లు మందమర్రి సీఐ పర్స రమేష్ తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుపై విచారణ చేపడుతామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన కమిషనర్ వైఖరిని నిరసిస్తూ చైర్‌పర్సన్‌తోపాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. చైర్పర్సన్ సంధ్యారాణి మాట్లాడుతూ కమిషనర్ చెన్నూర్‌లో అక్రమాలకు పాల్పడడంతో ఇల్లందుకు బదిలీ చేస్తే పైరవీలు చేసుకుని మళ్లీ క్యాతనపల్లికి వచ్చారని అన్నారు. చెన్నూర్‌లో ఆయనను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ క్యాతనపల్లికి ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ప్రతీ విషయంలో పాలకవర్గాన్ని, సిబ్బందిని కమిషనర్ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ వైఖరిపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
జ్వరం.. దగ్గు.. జలుబు
మంచిర్యాలటౌన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. డయేరియా, జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య 500 వరకు ఉండగా, ఈ నెల 20 నుంచి భారీగా పెరుగుతోంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటోంది. డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో ఒకరికి వైరల్ జ్వరం వస్తే ఒకరి నుంచి మరొకరికి వస్తుండడంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని గ్రామాలు, పట్టణా ల్లో డ్రెయినేజీలు నిండిపోవడం, రోడ్ల పక్కన చెత్త వేసి రోజుల తరబడి ఉంచడం, వర్షపు నీరు లోత ట్టు ప్రాంతాల్లో నిలిచి ఉండడం వల్ల వ్యాధులకు కారణం అవుతున్నాయి. వర్షాలతో నీరు కలుషితం కావడం కూడా ఒక కారణంగా వైద్యులు చెబుతున్నారు. కొత్తనీరు విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని, వేడిగా వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలని, ఈగలు వాలకుండా చూడడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం వల్లనే జ్వరాలు వస్తుండగా, కలుషిత నీరు, ఆహారంతో డయేరియా బారిన పడుతున్నారు. తేదీ రోగులు 20 1,180 21 778 22 1,027 23 1,060 24 956 25 747 27 1,302 28 951 29 730 -
ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు..
జిల్లాలో వర్షపాతం వివరాలు (మి.మీటర్లలో)మండలం వర్షపాతం కాసిపేట 123.5 హాజీపూర్ 107.4 చెన్నూర్ 105 మందమర్రి 104.4 మంచిర్యాల 103.1 బెల్లంపల్లి 96.5 నస్పూర్ 94.2 లక్సెట్టిపేట 93.7 జన్నారం 92.8 జైపూర్ 91.8 భీమారం 85.5 వేమనపల్లి 76.4 కోటపల్లి 72.2 దండేపల్లి 53.1 తాండూర్ 51 నెన్నెల 36.4 భీమిని 32.7 కన్నెపల్లి 31.3ఎల్లంపల్లి జలాశయంమంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటి ధాటికి దిగువ ప్రాంతాల్లోని రోడ్లు, తాత్కాలిక వంతెనలు తెగిపోయాయి. కాజ్వే, కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో వివిధ గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జిల్లాలో 80.6మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాసిపేట, హాజీపూర్, మందమర్రి, మంచిర్యాల, చెన్నూర్ మండలాల్లో వంద మిల్లీమీటర్లకు పైబడి వర్షం కురిసింది. బుధవారం రోజంతా కురుస్తున్న వర్షంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జిల్లా సరిహద్దు ప్రాంతం వేమనపల్లి, కోటపల్లి అర్జునగుట్ట వద్ద ప్రాణహిత వరద ప్రవాహం పెరిగింది. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. నెన్నెల, వేమనపల్లి, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడం, వరద తీవ్రతతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని పత్తి చేరులోకి నీరు చేరడంతో పత్తి మొలకలు నీట మునిగాయి. కోటపల్లి మండలం ఆలుగా మ గ్రామంలో ఇంటి పైకప్పు కూలి నలుగురు గాయపడ్డారు. శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ప్రాంతాల్లోని ఓపెన్ కాస్టుల్లోకి వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. రూ.3కోట్ల మేర నష్టం వాటిల్లింది. అన్నదాతల్లో హర్షం గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా భారీ వర్షాలు లేక పంటల సాగు సమయం ఎత్తిపోతుండడంతో ఆందోళనకు గురయ్యారు. వరి పొలాలు బీడుగా వదిలేశారు. ఆలస్యమైనా వర్షం పడుతుండడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఇదే అత్యధిక వర్షం కావడం గమనార్హం. జలాశయాల్లోకి నీరు చేరుతుండడంతో వరినాట్లకు సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకు జిల్లా సగటు 26శాతం లోటు నెలకొనగా ప్రస్తుతం 10శాతం లోటుతో సాధారణ స్థాయికి చేరింది. తాండూర్, బెల్లంపల్లిలో 22 నుంచి 36శాతం అధికంగా, ఐదు మండలాల్లో 20 నుంచి 56శాతం లోటు, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.మత్తడి దూకుతున్న ర్యాలీవాగు ‘ఎల్లంపల్లి’కి భారీగా వరదమంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మొన్నటి వరకు 8టీఎంసీల నీటిమట్టంతో ఉండగా.. గత మూడు రోజుల్లో ఏకంగా రోజుకో టీఎంసీ చొప్పున మూడు టీఎంసీల నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.500టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 76 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ సుజల స్రవంతి పథకానికి 275 క్యూసెక్కులు, నంది పంప్‌హౌస్‌కు 12,600 క్యూసెక్కులు తరలిస్తున్నారు. జిల్లాలోని నీల్వాయి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 0.836 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.732 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 1630 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గొల్ల వాగు 155.50 మీటర్లు కాగా ప్రస్తుతం 140.6 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో 1125 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ర్యాలీవాగు పూర్తి స్థాయి నీటిమట్టం 151.5 మీటర్లు కాగా ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో 151.7 మీటర్లు చేరి మత్తడి దూకుతోంది. ఇన్‌ఫ్లో 900 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.కుంగిన ఏసీసీ క్వారీ బ్రిడ్జి మంచిర్యాలటౌన్: మంచిర్యాలలోని ఎంసీసీ(ఏసీసీ) నుంచి గఢ్పూర్కు వెళ్లే దారిలో ఉషోదయ స్కూల్ దాటిన తరువాత రాళ్లవాగుపై నిర్మించిన బ్రిడ్జి కుంగిపోతోంది. భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బ్రిడ్జి కోతకు గురవుతూ ఒకవైపు కూలుతోంది. దీంతో అప్రమత్తమైన మంచిర్యాల సీఐ ప్రమోద్ బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు నిలిపివేశారు. ఆండాళమ్మ కాలనీ నుంచి రంగంపేట్ మీదుగా మంచిర్యాలకు రావడం, మంచిర్యాల నుంచి అదే రోడ్డులో గఢ్పూర్కు వెళ్లాలని ప్రజలకు సూచించారు. పాతకాలం నాటి బ్రిడ్జి కావడంతో వరద ఉధృతి పెరిగితే కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలిమంచిర్యాలక్రైం: మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలను స్థానిక డీసీపీ ఎగ్గడి భాస్కర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాళ్లవాగు కాజ్‌వేపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాళ్లవాగు నుంచి పాత మంచిర్యాల, రాళ్లపేటకు రాకపోకలు నిలిపివేశారు. నీల్వాయి, కోటపల్లి ప్రాంతాల వైపు ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, కమిషనరేట్ పరిధిలో 30 మంది ప్రత్యేక శిక్షణ పొందిన వారు ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే 100 డయల్‌కు సమాచారం అందించాలని అన్నారు. పోలీస్ సిబ్బంది 24గంటలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు, తహసీల్దార్ రైమతుల్ల హుస్సేన్ పాల్గొన్నారు. -
డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు హత్య
భైంసా: కుంటాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని దౌనెల్లి గ్రామానికి చెందిన పున్న మహేందర్(26) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మోసపూరితంగా బ్యాంకు ఖాతా నుంచి బదిలీ చేసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు కక్ష పెంచుకొని హత్య చేసిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 18, 2026న దౌనెల్లి గ్రామ శివారులోని బావి వద్ద మహేందర్‌ను మైనర్ వెనుక నుంచి తోసివేయడంతో అతను బావిలో పడి మృతి చెందాడు. ఏప్రిల్ 23న బావిలో మృతదేహం లభించడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహేందర్ తల్లి ఎస్పీని కలిసి తన కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరడంతో, ఎస్పీ ఆదేశాల మేరకు కేసును ప్రత్యేక దృష్టితో పునఃపరిశీలించారు. ఈ క్రమంలో అనుమానితుల కదలికలు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి విచారణ చేపట్టారు. దర్యాప్తులో మహేందర్ బ్యాంకు ఖాతా నుంచి మైనర్ బాలుడు మోసపూరితంగా కొంత మొత్తాన్ని తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న మహేందర్ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న మైనర్ బాలుడు మహేందర్‌ను బావి వద్దకు తీసుకెళ్లి వెనుక నుంచి తోసివేయడంతో మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. జూలై 29న మైనర్‌ను అదుపులోకి తీసుకొని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఏఎస్పీ బుధవారం తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కుంటాల ఎస్సై నరేశ్, పోలీసు అధికారులు, సిబ్బందిని ఏఎస్పీ సాయి కిరణ్ అభినందించారు. -
కాపర్ వైర్ చోరీ నిందితుడు అరెస్ట్
భైంసా: పట్టణంలో కాపర్ వైర్ చోరీ కేసును పోలీసులు ఛేదించి ప్రధాన నిందితుడితో పాటు ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకున్నారు. భైంసారూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా శివాజీచౌక్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీరాం జనార్ధన్ ఈ నెల 27న తన ఇంటికి తాళం వేసి వెళ్లి, 28న తిరిగి వచ్చేసరికి ఇంటి వెనుక భాగంలోని గోడ దూకి లోపలికి ప్రవేశించిన దుండగులు ఇంట్లో ఉన్న కరెంట్ వైరింగ్‌ను కత్తిరించి సుమారు 10 కిలోల కాపర్ వైర్ చోరీ చేశారు. దీంతో బాధితుడు భైంసా టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యేక బృందాల సహాయంతో భైంసా పట్టణానికి చెందిన స్క్రాప్ వ్యాపారి షేక్ నజీర్‌ను అరెస్ట్ చేశారు. కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు బాలలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఫిర్యాదుదారుడి ఇంటి నుంచి చోరీ చేసిన 7 కిలోల కాపర్ వైర్, కరిగించి తయారు చేసిన 30 కిలోల కాపర్ వైర్, 7.2 కిలోల కాపర్ వైర్ బండిల్స్, మరో బాలుడి వద్ద ఉన్న 4 కిలోల కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ అభినందించారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలులక్ష్మణచాంద: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన నిత్యానంద రెడ్డి(24) అంత్యక్రియలు బుధవారం మండలంలోని నర్సాపూర్(డబ్ల్యూ) గ్రామంలో కుటుంబ స భ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య జరిగాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన గన్ను శ్రీనివాస్ రెడ్డి –విశ్వరూప దంపతుల కుమారుడు నిత్యానంద రెడ్డి మూడేళ్ల క్రితం అమెరికాలోని డెట్రాయిట్కు వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 18న బైక్ పై వెళ్లే సమయంలో బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే చికిత్స పొందుతూ ఈనెల 23న మృతి చెందాడు. బుధవారం మృతదేహం స్వగ్రామం చేరడంతో గ్రామంలో విషాధచాయలు అలు ముకున్నాయి. అంత్యక్రియల్లో నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావుతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్రు నరేశ్ రెడ్డి పాల్గొన్నారు. -
సీ్త్రనిధి రాష్ట్ర డైరెక్టర్‌గా పొట్టపల్లి మహిళ
లక్ష్మణచాంద: రాష్ట్ర స్థాయిలో సీ్త్రనిధి డైరెక్టర్‌గా మండలంలోని పొట్టపల్లి గ్రామానికి చెందిన గంగామణి ఎంపికయ్యారు. రాష్ట్ర సీ్త్రనిధి సహకార పరిమితి సొసైటీ మహిళా బ్యాంకు 5 డైరెక్టర్ల స్థానాలకు మంగళవారం హైదరాబాద్‌లోని సెర్ప్ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలను బుధవారం ప్రకటించారు. ఎన్నికల్లో ఒక డైరెక్టర్‌గా మండలంలోని పార్పెల్లి గ్రామానికి అనుబంధ గ్రామం పొట్టపల్లి గ్రామవాసి, నిర్మల్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి ఎంపికయ్యారు. వీరిని రాష్ట్ర మంత్రి సీతక్క అభినందించారు. -
జలపాతాల వద్ద జాగ్రత్త..!
నార్నూర్: జలపాతాల వద్ద ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉండటంతో మండలంలోని గుండాల గ్రామ శివారులోని కుండాయి జలపాతం వద్ద బుధవారం నార్నూర్ ఎస్సై శ్రీసాయి ఆధ్వర్యంలో హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతం వద్ద నీటి ప్రవాహం పెరగడంతో పర్యాటకులు, యువత ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా సూచిక ఏర్పాటు చేశారు. జలపాతాన్ని సందర్శించే వారు రాళ్లపైకి ఎక్కడం, లోతైన నీటిలోకి దిగడం, సెల్ఫీల కోసం అంచుల వరకు వెళ్లడం, మద్యం సేవించి జలపాతం పరిసరాల్లో సంచరించడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. స్థానికులు కూడా సందర్శకులకు భద్రతా సూచనలు తెలియజేస్తూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ కళాశాలలో పాముకాటు కలకలం
నస్పూర్: సీసీసీ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులను పాముకాటు వేసిన ఘటన కలకలం రేపింది. కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం... కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకునే మెకానికల్ మొదటి సంవత్సరం విద్యార్థి ఎండీ రెహన్, సివిల్ మొదటి సంవత్సరం విద్యార్థి యశ్వంత్‌లు బుధవారం ఉదయం టిఫిన్ చేయడానికి మెస్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో యశ్వంత్ ఓ పాము తన కాలుపై నుంచి వెళ్లిందని అరిచాడు. పక్కనే ఉన్న ఎండీ రెహన్ పామును తరిమే ప్రయత్నం చేయగా పాము అతడిని తాకుతూ వెళ్లింది. విద్యార్థులను పాము కాటు వేసిందనే అనుమానంతో తోటి విద్యార్థులు కళాశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వెంటనే 108లో విద్యార్థులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు తెలిపారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్, మైనింగ్ హెచ్ఓడీలు విద్యార్థుల వెంట ఎంజీఎంలో ఉన్నారని తెలిపారు. -
గల్ఫ్ మోసాలపై అప్రమత్తత అవసరం
నిర్మల్‌ఖిల్లా: ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిక్రూట్మెంట్ మోసాలు, వేతన దోపిడీ, చట్టపరమైన పరిష్కార మార్గాలపై హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన భాగస్వామ్య వర్క్‌షాప్‌లో సమగ్రంగా చర్చించారు. సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రెంట్ స్టడీస్ (సీఐఎంఎస్), మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఆసియా (ఎంఎఫ్ఏ) సంయుక్త ఆధ్వర్యంలో రాయల్ రేవ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ రిక్రూట్మెంట్ సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, సౌదీ కేస్ హ్యాండ్లర్లు, వలస కార్మికుల సంక్షేమ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా నుంచి ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర సభ్యుడు స్వదేశ్ పరికిపండ్ల, కెనడా ఎంబసీ మాజీ సలహాదారు సంపత్ కుమార్ హాజరై సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు కేస్‌స్టడీలను విశ్లేషించారు. ఉమ్మడిజిల్లా ఘటనలపై నివేదన.. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న పలువురు కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం, అక్కడికి చేరుకున్న తర్వాత ఉద్యోగ ఒప్పందంలోని నిబంధనలను ఏకపక్షంగా మార్చివేయడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బాధిత కార్మికుల్లో 90 శాతం మందికి ఉద్యోగ ఒప్పంద ప్రతులు, నెలవారీ వేతన స్లిప్‌లు లేకపోవడం వల్ల కోర్టులు, ట్రిబ్యునళ్లలో తమ హక్కులను నిరూపించుకోవడం కష్టంగా మారుతోందని వివరించారు. జిల్లానుంచి విజిట్ వీసాలపై ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం వల్ల చట్టపరమైన రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని, నర్సింగ్, వైద్య రంగానికి చెందిన నైపుణ్య కార్మికులు ముందస్తు ధ్రువీకరణ లేకుండా వెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వలస కార్మికులకు సమస్యలు తలెత్తిన తర్వాత మాత్రమే కాకుండా, ముందస్తు అవగాహన కల్పించి మోసాలు జరగకుండా నిరోధించే వ్యవస్థను బలోపేతం చేయాలని వర్క్‌షాప్‌లో నిర్ణయించారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు ఉద్యోగ ఒప్పందాలు, వేతన రికార్డులు, ఇతర కీలక పత్రాలను తప్పనిసరిగా భద్రపరుచుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. -
ఆరు గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదన
ఆదిలాబాద్‌టౌన్/తలమడుగు: కిడ్నాప్‌నకు గురైన నాలుగేళ్ల చిన్నారిని కేవలం ఆరు గంటల్లోనే గుర్తించి జిల్లా పోలీసులు మరోసారి తమ సమర్థత చాటుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ చిన్నారిని బుధవారం పోలీసు కార్యాలయంలో తల్లిదండ్రులకు అప్పగించి వివరాలు వెల్లడించారు. తలమడుగు మండలం రూయ్యడి గ్రామానికి చెందిన ఆత్రం కప్లీబాయి –జంగుల నాలుగేళ్ల చిన్నారి గంగామణిని ఈనెల 28న అదే గ్రామానికి చెందిన నైతం నాగుబాయి ఆదిలాబాద్ పట్టణానికి తీసుకొచ్చి, బస్టాండ్ ప్రాంతంలో తనకు పరిచయమున్న గుమ్మడివార్ భారతికి అప్పగించింది. బిడ్డ కనిపించకపోవడంతో తల్లి ఆత్రం కప్లీబాయి తలమడుగు పోలీస్ స్టేషన్లో సాయంత్రం ఫిర్యాదు చేయగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ రహీం పాషా, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, తలమడుగు ఎస్సై రాధికతో పాటు ప్రత్యేక పోలీసు బృందాలు ఆదిలాబాద్, తాంసి తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలోని సీసీ ఫుటేజీలను పరిశీలించి సాంకేతిక ఆధారాలతో అదేరోజు రాత్రి ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మివాడలో చిన్నారిని గుర్తించారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన నైతం నాగుబాయి, అలాగే చట్టవిరుద్ధంగా చిన్నారిని తన వద్ద ఉంచుకున్న గుమ్మడివార్ భారతిని అరెస్టు చేశారు. చిన్నారిని సురక్షితంగా రక్షించడంలో కీలకంగా పనిచేసిన రూరల్ సీఐ రహీం పాషా, ఎస్సైలు రాధిక, విష్ణువర్ధన్తో పాటు గాలింపు బృందంలోని పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కుమార్తె క్షేమంగా తిరిగి రావడంతో చిన్నారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రాజెక్టుల్లోకి చేరుతున్న నీరు
జలపాతాలు.. పరవళ్లు తిర్యాణి/ బోథ్: ఉమ్మడి జిల్లాలో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతలమాదర, గుండాల(బాహుబలి), ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర జలపాతాలు వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నీటిధారలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండి భద్రతా నియమాలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. గుండాల జలపాతంలో వరద ఉధృతి పెరగడంతో పర్యాటకుల సందర్శనకు అనుమతి లేదని ఫారెస్టు రేంజ్ అధికారి రమాదేవి తెలిపారు. పొచ్చెర జలపాతంచింతలమాదర జలపాతంగుండాల జలపాతంభైంసా: జిల్లా వ్యాప్తంగా బుధవారం వర్షాలు కురవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సార్ఎస్పీ)కి వరదనీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, కాలువల్లో నీటి ప్రవాహం కనిపించింది. ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో ఆ నీరు క్రమంగా ప్రాజెక్టులోకి చేరుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి ఎస్సార్ఎస్పీలో నీటి మట్టం 1065.40 అడుగులు నమోదు కాగా, నీటి నిల్వ 16.545 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలోకి సెకనుకు 3,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 751 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఈరోజుతో పోలిస్తే ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. గత ఏడాది జూలై 29న ఎస్సార్ఎస్పీ నీటి మట్టం 1075.00 అడుగులు, నీటి నిల్వ 32.897 టీఎంసీలుగా ఉంది. సదర్మాట్ ఆనకట్టకు జలకళ ఖానాపూర్: మండలంలోని మేడంపల్లి గ్రామ శివారులో ఉన్న సదర్మాట్ ఆనకట్టకు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు భారీగా చేరుతోంది. ఆనకట్ట పూర్తిస్థాయిలో నిండిపోవడంతో అదనపు నీరు మత్తడి పైనుంచి ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తోంది. స్వర్ణ ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన ఇన్‌ఫ్లో సారంగపూర్: వుండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు ఈ ఏడాది తొలిసారి వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా నిన్నటి వరకు 1170 అడుగులు ఉంది. అయితే మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన ఒక మోస్తారు వర్షానికి వరదనీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 3అడుగులు పెరిగి ప్రస్తుతం 1173.8 అడుగులకు చేరుకున్నట్లు ఏఈ వేణుగోపాల్ తెలిపారు. కడెం ప్రాజెక్ట్‌కు వరదకడెం: ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం ప్రాజెక్ట్‌కు 22,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700(3.495టీఎంసీలు) అడుగులు కాగ, ప్రస్తుతం 689.150 (1.484టీఎంసీలు) అడుగుల నీటిమట్టం ఉంది. వరదల నేషథ్యంలో సీఈ జగదీశ్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో పెరిగితే వరద గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందును నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్, డీఈ వీరన్న, ఏఈఈ మురళీ తదితరులు ఉన్నారు. -
ముగిసిన వ్యాస పౌర్ణమి ఉత్సవాలు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో మూడు రోజులుగా నిర్వహించిన వ్యాస పౌర్ణమి (గురుపూజ) ఉత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం వ్యాస మహర్షికి మహాభిషేకం, రుద్రాభిషేకం, బలిప్రదానం నిర్వహించారు. అనంతరం యాగశాలలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. గురు పరంపరను కొనసాగిస్తున్న మఠాధిపతులు, వేద పండితులను ఆలయ ఈవో అంజనీదేవి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్‌లు శాలువాలు, ఫలపుష్పాలతో ఘనంగా సత్కరించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రవచనకర్త శశికాంత్ జోషి వ్యాస పౌర్ణమి వైభవం, బాసర క్షేత్ర విశిష్టతపై భక్తులకు ప్రవచనం అందించారు. అనంతరం శశికాంత్ జోషిని ఆలయ అధికారులు సత్కరించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ పూజలు.. వ్యాస పౌర్ణమి ఉత్సవాలకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ చారి, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ దత్తాత్రేయ ఆలయాన్ని, శిశు మందిర్ పాఠశాలను సందర్శించారు. అనంతరం బాలాలయంలో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు కలిసి ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి, ఆశీర్వచనం అందజేశారు. -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
తాండూర్/కాసిపేట: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం తాండూర్ మండలం కొత్తపల్లి, మండల కేంద్రమైన కాసిపేటలోని రైతువేదికల్లో విత్తన మేళాలను ఆయన సందర్శించారు. రాయితీ విత్తనాలు, ఎరువులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలు సాగు చేయాలని, పప్పు దినుసుల పంటలు సాగు చేస్తే అధిక లబ్ధి పొందడమే కాక భూసారం కూడా పెంపొందుతుందని తెలిపారు. కాసిపేట కేజీబీవీ లో అదనపు తరగతి గదుల నిర్మాణం, భోజనశాల పనులు పూర్తి చేయాలని సూచించారు. తాండూర్ మండలం ద్వారకాపూర్ గ్రామంలో సమగ్ర భూసర్వే అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో సబ్ కలెక్టర్ మనోజ్, తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి సుష్మ, కాసిపేట ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్, ఏఈఓ సాగర్ పాల్గొన్నారు. -
బాలిక అదృశ్యం
తలమడుగు: మండలంలోని రూయ్యాడి గ్రామానికి చెందిన బాలిక ఆత్రం గంగామణి (4) ఈనెల 27న అదృశ్యమైనట్లు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రాధిక తెలిపారు. దర్యాప్తులో రుయ్యాడి గ్రామానికి చెందిన నైతం నాగుబాయి బాలికను ఆదిలాబాద్ బస్టాండ్‌కు తీసుకువచ్చి ఓ మహిళకు అప్పగించినట్లు సీసీ కెమెరాలో రికార్డయినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేస్తామని డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్‌లో ఒకరు..ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన దేశెట్టి వెంకటేష్ (47) అదృశ్యమయ్యాడు. పట్టణంలోని సైకిల్షాప్లో పనిచేస్తున్న ఆయన రోజులాగే సోమవారం షాప్‌కు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి తిరిగిరాలేదు. చుట్టుపక్కలా గాలించినా ఆచూకీ లభించకపోవడంతో అతని కుమారుడి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. ఖైరిగూర ఓసీకి ప్రథమ బహుమతిరెబ్బెన: రక్షణ పక్షోత్సవాల్లో బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీ విశేష ప్రతిభ కనబర్చి మూడు ప్రథమ బహుమతులతో పాటు ఒక విభాగంలో ద్వితీయ బహుమతిని సాధించింది. బహుమతి ప్రదానోత్సవాన్ని సోమవారం రాత్రి ఆర్జీ–1 ఏరియాలో నిర్వహించగా ఖైరిగూర ఓసీపీ రక్షణ, ప్రథమ చికిత్స, ట్రస్ట్ ఏరియా మైన్స్ విభాగాల్లో ప్రథమస్థానంలో నిలవగా, పర్యావరణం విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. సింగరేణి డైరెక్టర్లు సూర్య నారాయణ, వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ చేతుల మీదుగా ఏరియా జీఎం శ్రీరమేష్, ఖైరిగూర ఓసీపీ ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్. తిరుపతి, ప్రాజెక్టు ఇంజినీరు వీరన్న, మేనేజర్ శంకర్, పిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికతకు ప్రతీక బాసర క్షేత్రం
బాసర: జ్ఞానం, విద్య, ఆధ్యాత్మికతకు ప్రతీకగా విరాజిల్లుతున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం ఎంతో విశిష్టమైనదని వేద పండితుడు శశికాంత్ జోషి అన్నారు. గురుపౌర్ణమి (వ్యాస పౌర్ణమి) ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం బాసర క్షేత్ర వైభవంపై ఆయన ప్రవచనం చేశారు. క్షేత్రంలోని విశిష్టతలు, ఉప ఆలయాల ప్రాశస్త్యం, గోదావరి నది పవిత్రత, అమ్మవారి ఆరాధనతో కలిగే ఆధ్యాత్మిక ఫలితాలను భక్తులకు వివరించారు. దుర్బుద్ధి తొలగి మంచి గుణాలు అలవడాలంటే జ్ఞానం అవసరమని, ఆ జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి అమ్మవారి సన్నిధి బాసరలో ఉండటం క్షేత్రం ప్రత్యేకత అన్నారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విద్యాభివృద్ధి, జ్ఞానసంపద కలుగుతుందన్నారు. ఆలయ సమీపంలోని బొర్రా గణేశుడిని ప్రార్థిస్తే సకల విద్యల్లో ప్రావీణ్యం కలుగుతుందన్నారు. పూర్వకాలంలో పుష్కర జలాలను తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేసేవారన్నారు. గురుపౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో స్థాపిత దేవతా పూజ, మూలమంత్ర హోమం, వేద పారాయణం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. -
బోనాలు.. ఉపాధి జాతర
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో బోనాల సందడి కొనసాగుతోంది. ఆషాఢ మాసం నెల రోజులపాటు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, కళాకారులు ఆటపాటలు, డీజే హోరు వాడవాడలా మార్మోగుతుంది. బోనాల జాతర సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే కాకుండా చిన్న తరహా వ్యాపారులు, కళాకారులు, చేతివృత్తుల కుటుంబాలకు నెల రోజులపాటు ఆశాజనకమైన ఆదాయం అందిస్తోంది. ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా జాతర అనేక రకాల వృత్తుల వారికి ఆర్థికంగా ఊరటనిస్తూ వ్యాపార రంగానికి సరికొత్త వెలుగునిస్తోంది. ఆఫర్ల ధమాకా ఆషాఢ మాసంలో బట్టల వ్యాపారం జోరుగా సాగుతోంది. సాధారణంగా ఈ మాసంలో శుభకార్యాలు లేక వ్యాపారాలు మందగిస్తాయి. ఇందుకు భిన్నంగా ప్రముఖ షాపింగ్ మాల్స్, వస్త్ర వ్యాపారులు ఆ షాఢం ఆఫర్ల విక్రయాలతో మార్కెట్ కిటకిటలాడుతోంది. ఒకటి కొంటే ఒకటి ఉచితం, 50నుంచి 80 శాతం రాయితీ ఇస్తుండడంతో జనం విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. బోనాల పండుగ, రాబోయే శ్రావణ మాస పూజలు, పేరంటాల కోసం మహిళలు ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు. దారిపోచమ్మకు మొక్కులు..బస్తీల్లో పోచమ్మ తల్లి ఉత్సవాల నేపథ్యంలో మేకలు, కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆపదలు తొలగి ఊరంతా ఆయురారోగ్యాలతో సల్లంగా ఉండేలా చూడు పోచమ్మ తల్లి అంటూ ప్రార్థిస్తూ వివిధ బస్తీల్లో భక్తులు, ప్రమాదాల నివారణకు రహదారి వెంట వెలిసిన దారి పోచమ్మకు వాహనదారులు కోళ్లు, మేకలతో మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో మేకలు, కోళ్ల వ్యాపారం జోరుగా సాగుతోందని వ్యాపారులు తెలిపారు. -
పూజల పేరిట చోరీ.. ఇద్దరు మహిళల అరెస్టు
భైంసారూరల్: మండలంలోని కోతల్గాంలో పూజల పేరిట ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడినట్లు భైంసారూరల్ సీఐ ప్రవీణ్ తెలిపారు. గ్రామానికి చెందిన చందుల్వార్ దత్తాత్రి సోమవారం వ్యవసాయ పనుల నిమిత్తం పంటచేలకు వెళ్లాడు. భిక్షాటనకు వచ్చిన భైంసాకు చెందిన ముద్దేవార్ శాంతాబాయి, సాయవ్వ ఇద్దరూ కలిసి దత్తాత్రి ఇంటికి వచ్చారు. మీ ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగా ఉండడంలేదని, పూజలు చేస్తే సమస్య తొలగిపోతుందని అతని భార్య కవితను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించారు. దేవుడి గదిలో దీపం వెలిగించి పూజలు చేస్తుండగా ఇంటికి వచ్చిన దత్తాత్రి తమకు ఎలాంటి పూజలు అవసరం లేదని వారిని మందలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వా త దేవుడి గదిని పరిశీలించగా అక్కడ ఉన్న రూ.15 వేల విలువైన ఐదు తులాల రెండు వెండి కడియాలు కనిపించలేదు. బాధితుడు పోలీసులకు ఫిర్యా దు చేయడంతో కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్సై సుప్రియ పాల్గొన్నారు. -
దాడి కేసులో ఇద్దరి రిమాండ్
తాండూర్: భూ తగాదాలో మండలంలోని బోయపల్లికి చెందిన మాసాడి భాస్కర్‌పై దాడి చేసిన ఘటనలో ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై ప్రసాద్‌రావు తెలిపారు. ఈ నెల 12న భాస్కర్‌పై కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. దాడి చేసిన పూసాల ప్రశాంత్, సిద్ధం శివగణేశ్‌ను అరెస్ట్ చేసి మంగళవారం బెల్లంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
జన్నారం డివిజన్లో పీసీసీఎఫ్ పర్యటన
జన్నారం: రాష్ట్ర అటవీశాఖ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి(పీసీసీఎఫ్) వినయ్‌కుమార్ మంగళవారం జన్నారం అటవీ డివిజన్లో ప ర్యటించారు. ఇందన్పల్లి రేంజ్‌లోని భర్తన్పే ట్ వాచ్‌టవర్ వద్దకు వెళ్లి అడవులను పరిశీ లించారు. జన్నారం పర్యావరణ అధ్యయన కేంద్రం సందర్శించి అటవీశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అడవుల రక్షణ, వన్యప్రాణులు, పర్యాటక అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. టైగర్ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతరాం, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్‌డీవో రామ్మోహన్, రేంజ్ అధికారులు ఖాదర్‌వలీ, లక్ష్మీనారాయణ, వికాస్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఓవర్ టు పైలట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టుతో పాటు ఇండియన్ ఎయిర్‌పోర్స్‌కు చెందిన శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. ప్రైవేట్ పైలట్ శిక్షణ సంస్థలు రెండు ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నాయి. అలాగే ఆరు ఎంఆర్ఓ (నిర్వహణ), రిపేర్(మరమ్మతు), ఓవర్‌హాల్ (సమగ్ర తనిఖీ) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. – సాక్షి, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనుండగా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రంతోపాటు ఎంఆర్వో ఇతరత్రా సదుపాయాలతో ఏర్పాటు కానుంది. ఇందుకోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2009 ఎకరాల భూసేకరణకు రూ.2278 కోట్లు మంజూరు చేస్తూ ఈ నెల 25న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. భూసేకరణ, ప్రతి పాదిత ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డంకులు తొలగించేందుకు వివిధ పనుల కోసం నిధులు వెచ్చిస్తారు. ప్రైవేట్ అకాడమీల దృష్టి..ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుతో పాటు వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుండగా ఇక్కడ ప్రైవేట్ అకాడమీలు కూడా శిక్షణకు ముందుకు వస్తున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివిధ ప్రైవేట్ అకాడమీలను సంప్రదించగా వారు ఈ ప్రాంతంలో ఏర్పాటుకు ఆసక్తి కనబర్చుతూ తమ దరఖాస్తులు అందజేశారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారా వాటిని కేంద్ర రక్షణ శాఖకు అందజేశారు. అకాడమీలు ఇలా..పైలట్ శిక్షణ ఆసక్తి కనబర్చే వారికి విమానం నడపడం నేర్పిస్తారు. దాంతో పాటు పైలట్ లైసెన్సులు, రేటింగ్‌ల కోసం శిక్షణ ఇవ్వడానికి విమానయాన అధికార సంస్థ (డీజీసీఏ, ఈఏఎస్ఏ) నుంచి అధికారిక ఆమోదం పొంది ఉండాలి. అలాంటి సంస్థలే శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. -
ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి తగ్గింపునకు ప్రతిపాదనలు
జన్నారం: టైగర్‌జోన్ పరిధి నుంచి ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి ప్రస్తుతం పది కిలోమీటర్ల దూరం ఉందని, దీన్ని ఒక కిలోమీటరులోపు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదించినట్లు జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ వో) రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన జన్నారంలో విలేకరులతో మాట్లాడారు. ఎకో సెన్సిటివ్‌జోన్ నిబంధనతో పరిసర ప్రాంతాల నుంచి ఇసుక తోడడం నిషేధించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఒక కిలోమీటరుకు కుదిస్తే గోదావ రి నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయదని అన్నారు. అట వీశాఖ నిబంధనల ప్రకారమే నడుచుకోవా ల్సి ఉంటుందని, స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎఫ్డీఓ రామ్మోహన్, రేంజ్ అధికారులు పాల్గొన్నారు. -
సిబ్బందే వైద్యులు!
దండేపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు రెగ్యులర్ వైద్యులు ఉండగా.. ఒకరు ఉన్నత చదువులు, మరొకరు డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో రెండు పోస్టులూ ఖాళీ ఏర్పడ్డాయి. అటెండర్, డాటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులూ ఖాళీ ఉన్నాయి. ఓ కాంట్రాక్టు వైద్యురాలిని నియమించగా.. ఆమె రానప్పుడు సిబ్బందే వైద్యసేవలు అందించాల్సి వస్తోంది. 24గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. వైద్యులు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కో రోజు పల్లె దవాఖానాల్లోని ఎంఎల్‌హెచ్‌పీలను అందుబాటులో ఉంచుతున్నారు. కాంట్రాక్టు వైద్యురాలు మంగళవారం కలెక్టరేట్లో సమావేశానికి వెళ్లగా.. రోగులకు సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. అటెండర్ లేకపోవడంతో స్వీపర్ దాయమ్మ గాయాలతో వచ్చిన వారికి డ్రెస్సింగ్ చేసి కట్టుకట్టి పంపించింది. పీహెచ్సీ ఇంచార్జి డీడీవో తాళ్లపేట పీహెచ్సీ డాక్టర్ స్నేహితను సంప్రదించగా, సమావేశానికి వెళ్లడంతో అందుబాటులో లేరని తెలిపారు. కాలి గాయానికి డ్రెస్సింగ్ చేస్తున్న స్వీపర్వైద్య పరీక్షలు చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ -
రుషభనాథుని శిథిల శిల్పం గుర్తింపు
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని చాందా (టి)శివారులో 9వ శతాబ్దం నాటి తొలి జైన తీర్థంకరుడు రుషభనాథుని శిథిల శిల్పాన్ని తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు రొడ్డవార్ పృథ్విరాజ్ మంగళవారం గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జైన మతానికి సంబంధించిన అనేక పురాతన విగ్రహాలు ఒక్కొక్కటిగా లభ్యం అవుతున్నాయన్నారు. ఇప్పటి కే ఇక్కడ 17వ తీర్థంకర కుంతనాథ, పార్శ్వనాథ వి గ్రహాలు లభించాయన్నారు. వీటితో పాటు జైన మ తానికి సంబంధించిన సుమారు 50 వరకు శిథిల వి గ్రహాలు లభించడం ప్రత్యేకమన్నారు. ఆయన వెంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అక్షయ, షె రిల్, సాయిరాజ్ కాంబ్లే, శ్రేయ, మమత ఉన్నారు. రుషభనాథుని శిథిల శిల్పం -
అనుమతి..‘దారేది’!
చెన్నూర్: స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు కావస్తున్నా నేటికీ రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు అనుసంధాన రోడ్లు లేక ఆయా గ్రామాల ప్రజలు దుర్భర జీవనం సాగిస్తున్నారు. 1980లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం గ్రామీణ రోడ్లకు శాపంగా మారింది. ఈ చట్టంలో పొందుపర్చిన పర్యావరణ అనుమతులు రోడ్ల నిర్మాణాలకు గుదిబండగా మారాయి. ఈ చట్టం ఏర్పాటుకు ముందే నిర్మించిన రోడ్లు తప్ప నేటికీ కొత్త దారుల నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. కొన్ని రోడ్లకు నిధులు మంజూరైనా అటవీశాఖ అనుమతి లభించక నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో మెరుగైన వైద్యం, విద్య సౌకర్యాలు అందక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వర్షాకాలంలో అవస్థలు వర్ణణాతీతం. ముందుకు సాగని నిర్మాణాలు... మల్లంపేట నుంచి నక్కలపల్లి వరకు బీటీ రోడ్డు లేక అవస్థలు పడుతున్నాం. నక్కలపల్లి వెళ్లే దారిలో రోడ్డు డ్యాం లేక వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టాన్ని సవరించే విధంగా ఎంపీలు కృషి చేయాలి. గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలి. – తొట అశోక్, నక్కలపల్లి మినహాయింపు ఇవ్వాలి.. గ్రామీణ రోడ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వాటా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేని పరిస్థితి ఉంది. పార్లమెంటు సభ్యులు సమావేశాల్లో ఈ క్లాజును సవరించి గ్రామీణ రోడ్లకు మినహాయింపు ఇవ్వాలి. మెరుగైన రోడ్డు, విద్య, వైద్య సౌకర్యాలు మెరుగు పర్చాలి. –పోటు రాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, కోటపల్లి -
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: పశువులను రోడ్లపై వదిలిపెడితే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసు శాఖ, మున్సిపల్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ, వాహనదారులకు ప్రమాదకరంగా మారిన 22 పశువులను గుర్తించి ఇచ్చోడ గోశాలకు తరలించారు. గోశాలలో పశువులు ఉన్నన్ని రోజుల నిర్వహణ ఖర్చును సంబంధిత య జమానులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా పశువులను రోడ్లపై వదిలిపెట్టిన దుర్గానగర్‌కు చెందిన కై లాష్, ఖానాపూర్‌కు చెందిన అహ్మద్ ఖాన్, సాజిత్ ఖాన్‌తో పాటు మరికొందరు యజమానులపై ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో రోడ్లపై సంచరించే పశువుల కారణంగా చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక ఘటనలో కూరగాయల వ్యాపారి కొట్టడంతో ఆవు మృతి చెందగా, ఆ ఘటన శాంతిభద్రతల సమస్యలకు దారితీసిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
‘సాయ్’ హాకీ అకాడమీకి ఎంపిక
ఉట్నూర్‌రూరల్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాకీ అకాడమీకి ఉట్నూర్ గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థులు 9 మంది ఎంపికై నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎంపికై న పెందుర్ ధనరాజ్, ఉర్వెత జంగు, బుక్య కిరణ్, ఆత్రం శంభు, రాథోడ్ ధనరాజ్, జాదవ్ సాయి ప్రసాద్, చౌహాన్ సాయిరామ్, ఆత్రం జగ్జీవన్, కోట్నాక్ అజయ్‌కుమార్‌ను మంగళవారం ఐటీడీఏ పీవో మంద మకరందు అభినందించారు. ఐటీడీఏ తరపున అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో గోడం చందన్, ఏపీవో పీవీటీజీ భాస్కర్, ఏసీఎంవో జగన్, ఎస్వో పార్థసారథి, హెచ్ఎం ఉత్తం, తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ చొరవతో పాఠశాలలో చేరిన విద్యార్థులు
ఇంద్రవెల్లి: కలెక్టర్ రాజర్షిషా చొరవతో బడీడు పిల్ల లు పాఠశాలలో చేరారు. మంగళవారం ఉట్నూర్ పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి వద్ద తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తున్న పిల్లలను చూసిన కలెక్టర్ జిల్లా విద్యాధికారి మిల్కాకు ఫోన్ చేసి బాలకార్మికులను వెంటనే పాఠశాలలో చేర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన డీఈవో మండల అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంద్రవెల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌రెడ్డి, ఐసీడీఎస్ కోఆర్డినేటర్ పురుసోత్తం సాయినగర్‌కు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం సునీతను ఇంద్రవెల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరోతరగతిలో సునీల్‌ను ఎంపీపీఎస్‌లో 5వ తరగతిలో చేర్పించారు. -
విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం కావాలి
ఉట్నూర్‌రూరల్: విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకై క లక్ష్యం కావాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘విద్యాజ్యోతి–సామర్థ్యాభివృద్ధి–సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. తరగతి గదిలో కార్యకలాపాల ఆధారిత బోధన, ఉత్తమ బోధనా పద్ధతులు, వాస్తవ జీవిత ఉదాహరణలను ఉపయోగించి పాఠ్యాంశాన్ని దృశ్య రూపంలో అర్థమయ్యేలా బోధించాలన్నారు. విద్యార్థుల్లో లక్ష్య నిర్దేశం పెంపొందించి, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం , సమగ్ర వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా కృషి చేయాలన్నారు. ఐదు రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో చందన్, ఏపీవో పీవీటీజీ భాస్కర్, డీటీడీవో నిర్మల్ నిహారిక, ఏసీఎంవో జగన్, ఎస్వో పార్థసారథి, జీసీడీవో ఛాయ, బీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ మానిక్‌రావు, రిసోర్స్ సభ్యులు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన తెలుగు, ఆంగ్లం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏజెన్సీలో కేటుగాళ్లు!
ఉట్నూర్‌రూరల్: ఒక రోజు ఉట్నూర్.. మరుసటి రోజు ఇంద్రవెల్లి.. మరొక రోజు ఇచ్చోడ.. ఇంకోరోజు గుడిహత్నూర్.. ఇలా ఏజెన్సీలో ఏ ప్రాంతాన్ని వదలకుండా రోజుకో కొత్త మోసానికి పాల్ప డుతున్నారు. ఏజెన్సీ ప్రాంత అమాయకులే లక్ష్యంగా కేటుగాళ్లు పన్నుతున్న మాయాజాలంలో చిక్కి నిరుద్యోగులు, సామాన్యులు నిలువునా మునిగిపోతున్నారు. ఎన్ఆర్ఐ పేరుతో కృష్ణ మోసాల నుంచి మొదలుకొని, ఇంద్రవెల్లిలో విదేశాలకు పంపిస్తామంటూ చేసిన మోసం వరకు అంతా మోసాల దందాగా సాగుతోంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసులు ఛేదించినప్పటికీ ఎక్కడో ఓ చోట ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలా ఒకరిని మించి ఒకరు వినూత్న రీతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదులతో స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకుని జైలు పాలు చేస్తున్నప్పటికీ, కొత్త మోసగాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. బయటపడిన సంఘటనలు కొన్ని మాత్రమే కాగా, పరువు పోతుందనో, భయంతోనో పోలీసుల వరకు వెళ్లని బాధితుల కథలు మరెన్నో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు -
నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2026–27 విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన పీయూసీ 1 విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం మంగళవారం రెండో రోజు కొనసాగింది. క్యాంపస్‌లోని ఎస్ఏసీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు విశ్వవిద్యాలయ విద్యా విధానం, క్రమశిక్షణ, పరీక్షల నిర్వహణ, క్యాంపస్ జీవనం, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రొఫెసర్ కే.గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి ప్రపంచస్థాయి నైపుణ్యాలు కలిగిన నిపుణులుగా తీర్చిదిద్దడమే ఆర్జీయూకేటీ లక్ష్యమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశోధనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఇక్కడ లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. -
ఉద్యోగాల పేరుతో రూ.70 లక్షల టోకరా
నార్నూర్: ప్రభుత్వ ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని నమ్మించి అమాయక నిరుద్యోగుల వద్ద నుంచి సుమారు రూ.70 లక్షలు వసూలు చేసిన నలుగురు నిందితులను నార్నూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తొడసం గజానంద్ వద్ద రూ.4 లక్షలు తీసుకుని నకిలీ నియామక పత్రం ఇచ్చినట్లు రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో నార్నూర్‌కు చెందిన చహకాటి లింబారావు, ఉట్నూర్‌కు చెందిన జాడి ప్రవీణ్ కుమార్, కెరమెరికి చెందిన రామ్టెకి ఉదయ్ కిరణ్, జైనూర్‌కు చెందిన జాడి రవీందర్ ప్రభుత్వ ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జన్నారం ప్రాంతానికి చెందిన ముగ్గురు, ఇంద్రవెల్లికి చెందిన ఇద్దరితో పాటు మొత్తం సుమారు 25 మంది నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఇంకా బాధితులు ఉంటే ముందుకు వచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. -
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
మందమర్రిరూరల్: దేశంలో గోహత్యను పూర్తిగా నిషేధించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గోరక్షణ జిల్లా సేవకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని కామాఖ్యపురం వారాహిదేవి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గోమాత సంరక్షణే ధ్యేయంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మందమర్రి పట్టణంలో 60 వేల సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. సేకరించిన సంతకాల ప్రతులను రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లకు అందజేస్తామని తెలిపారు. సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మంథిని సతీష్, భవానీ, గోరక్షకులు సూరిబాబు, వెంకటేశం, నర్సయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో వ్యాసపౌర్ణమి ఉత్సవాలు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వ్యాస (గురు)పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం గురు ప్రార్థన, వ్యాసపౌర్ణమి ఉత్సవ సంకల్పం, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, నాందీముఖం నిర్వహించారు. అనంతరం నవగ్రహ, యోగిని, వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండల స్థాపన, ప్రధాన కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, స్థాపిత దేవతా పూజలు, హోమాది వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు మురళీశర్మ, దీక్షిత్, వేద పండితులు అంకుశర్మ, నవీన్ శర్మ, శ్రీనివాస్ శర్మ, ఈవో అంజనాదేవి, ఏఈవో గంగ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
బాసర: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్థన్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో నూతనంగా చేరిన పీయూసీఐ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయ విద్యావిధానం, క్రమశిక్షణ, పరీక్ష సరళి, క్యాంపస్ వసతులు, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓరియెంటేషన్ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గుజ్జరి శంకర్, ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్, అసోసియేట్ డీన్ శేఖర్ శీలం, ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ డాక్టర్ మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
దొంగను పట్టిచ్చిన సీసీ కెమెరా
మంచిర్యాలక్రైం: ఇంటర్నెట్ సెంటర్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా దొంగను పట్టిచ్చింది. మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు సోమవారం తన చాంబర్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన మహ్మద్ మొయిన్ ఇంటర్నెట్ సెంటర్లో ఈ నెల 25న దొంగతనం జరిగింది. కంప్యూటర్, మానిటర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటర్నెట్ సెంటర్లోని సీసీ కెమెరా ఆధారంగా దొంగను బెల్లంపల్లికి చెందిన మహ్మద్ మద్గుంగా గుర్తించారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని హమాలీవాడ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు యజమానిని శాలువాతో సన్మానించారు. -
సోలార్ ప్రాజెక్టు గ్రిడ్‌కు అనుసంధానం
ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పిప్రి శివారులో రైతు పొద్దుటూరు ప్రేమలతాదేవి, కిష్టారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం రెండు మెగావాట్ల పీఎం కుసుం సోలార్ ప్రాజెక్టును ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఎస్ఈ జే.సుభాష్, డీడీఈ తిలక్, సమీప 33/11 కేవీ తరోడ సబ్‌స్టేషన్ వద్ద గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీఎం కుసుమ్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్‌కుమార్, విష్ణు, శ్రీకాంత్, టి.మధుసూదన్‌రావు, ప్రదీప్‌కుమార్‌రెడ్డి, డీపీ వర్మ, సునీల్, పి.విక్రంపాటిల్, పి.రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
లక్సెట్టిపేట: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు మహేష్(35) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ ఇటీవల వ్యాన్ కొనుగోలు చేసి నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. వ్యాన్ నెల వాయిదా డబ్బులు చెల్లించేందుకు ఇతరుల వద్ద అప్పులు చేశాడు. వ్యాన్ కుదువ పెట్టి రూ.3లక్షలు అప్పులు చేశాడు. అయినా అప్పులు తీరకపోవడం, వ్యాన్ లేకపోవడం, భార్య అనారోగ్యానికి గురై పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి భార్య వనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై వృద్ధుడు.. లక్సెట్టిపేట: పట్టణంలోని బోయవాడకు చెందిన లింగయ్య(67) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్యకు ఆరుగురు అన్మదమ్ములు ఉండేవారు. గతంలో ఇద్దరు చనిపోగా ఇటీవల మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో తాను కూడా చనిపోతే బాగుండు అని అంటూ ఉండేవాడు. ఆదివారం సాయంత్రం మద్యంమత్తులో గోదావరి రోడ్‌లోని తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. వృద్ధుడి ఆత్మహత్య లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రామానికి చెందిన రాందేని మల్లేశం(73) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేశం గత కొద్ది రోజులుగా మోకాళ్ల నొప్పులు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. మృతుడి భార్య గురులక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. -
చోరీకి పాల్పడ్డ నిందితుడి అరెస్ట్
బోథ్: ఇంటి తాళం పగులగొట్టి నగదు చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బోథ్ ఎస్సై వి. పురుషోత్తం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న పట్టణంలోని న్యూ కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటికి తాళం వేసి పనికి వెళ్లింది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని పెట్టేలో దాచుకున్న రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 26న బోథ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన కృష్ణకాంత్ జాదవ్‌గా గుర్తించారు. కూలీ పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో బాధితురాలి ఇంటి తాళం పగులగొట్టి చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని ఎస్సై పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.5వేలు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
విద్యార్థే కేంద్రంగా ఆర్జీయూకేటీ అభివృద్ధి
బాసర: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందించడమే లక్ష్యంగా బాసర ఆర్జీయూకేటీని ముందుకు తీసుకెళ్తున్నామని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. క్యాంపస్‌లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, పరిశోధన, స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వీసీగా బాధ్యతలు స్వీకరించాక మీ ముందున్న సవాళ్లు ఏమిటి? ఎలా అధిగమించారు?వీసీ: విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది మధ్య పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించడం. కార్యాలయాలకే పరిమితమై నిర్ణయాలు తీసుకోకుండా.. నేరుగా విద్యార్థుల వద్దకే వెళ్లి వారి సమస్యలను ఆలకించడం, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడటం, అధ్యాపకులతో సమగ్రంగా చర్చించడం అనే నూతన శైలిని ఆచరణలోకి తెచ్చా. రాత్రివేళల్లో హాస్టళ్లను సందర్శించాలనే ఆలోచన ఎందుకొచ్చింది?వీసీ: రాత్రివేళల్లో నేరుగా పర్యటించడం వల్ల వారి భద్రత, ఆరోగ్యం, మెస్ భోజన వసతి, పరిశుభ్రత, వారి మానసిక స్థితిగతులను క్షేత్రస్థాయిలోనే తెలుసుకునే వీలుంటుంది. ఒక విద్యార్థి మిమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చా? వీసీ: విద్యార్థుల ఫిర్యాదులు, సమస్యలు పక్కా వ్యవస్థ ద్వారా పరిష్కారం కావడమే సరైన పద్ధతి. అత్యవసర సందర్భాల్లో విద్యార్థులు తమ సమస్యలను నేరుగా నా దృష్టికి తెచ్చేలా సులువైన సమాచార వ్యవస్థలను అందుబాటులోకి తెస్తున్నాం. తల్లిదండ్రుల విశ్వాసాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?వీసీ: క్యాంపస్ విద్యా పురోగతిపై వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం, పారదర్శకమైన నిర్వహణ, విద్యార్థుల క్షేమానికి ఇచ్చే ప్రాధాన్యత వారిలో నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యక్షంగా వారితో మాట్లాడి భరోసా ఇస్తున్నాం. ఆర్జీయూకేటీకి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు మీ ప్రణాళిక ఏమిటి?వీసీ : నాణ్యమైన విద్యాబోధన, పరిశోధన పరిశ్రమల అనుసంధానం, నవకల్పనలు (స్టార్టప్ సంస్కృతి), డిజిటల్ పరిపాలన, సామాజిక బాధ్యత ఆధారంగా క్యాంపస్‌ను ముందుకు తీసుకెళ్తున్నాం. గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దడమే మా ప్రధాన ధ్యేయం. ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు ట్రిపుల్ ఐటీని వేదికగా మార్చే ఆలోచన ఉందా? వీసీ: కచ్చితంగా ఉంది. విద్యార్థులు ఉద్యోగాలు వెతుక్కునే వారీగా మాత్రమే కాక, నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థాపకులుగా ఎదగాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్ ఫండింగ్ మద్దతు, ఇండస్ట్రీ కనెక్టివిటీ, పరిశోధనా వాతావరణాన్ని విస్తృతంగా పెంచుతున్నాం. ‘ఓపెన్ డోర్ పాలసీ’ అమలు చేస్తున్నారా? వీసీ: విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తమ సమస్యలను, విలువైన సూచనలను ఎటువంటి భయాందోళనలు లేకుండా వ్యక్తం చేసే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. ‘సంభాషణే ఏ సమస్యకై నా తొలి పరిష్కారం’అనే సూత్రంతో అందరికీ నిరంతరం అందుబాటులో ఉండే సుపరిపాలనగా తీర్చిదిద్దుతున్నాం. -
చిన్నారి నోట్లో ఇరుక్కున్న టూత్ బ్రష్
కాసిపేట: మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన వేల్పుల సతీష్ కూతురు అమన్వితశ్రీ(2) నోట్లో దవడలకు టూత్ బ్రష్ చిక్కుకోవడంతో నరకయాతన అనుభవించింది. సోమవారం సాయంత్రం నోట్లో బ్రష్ వేసుకుని ఆడుకుంటున్న సమయంలో కిందపడడంతో చర్మాన్ని చీల్చుకుంటూ దవడలో ఇరుక్కుపోయింది. కాసిపేట పీహెచ్‌సీకి అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో మంచిర్యాల మాతాశిశు కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వరంగల్ ఏంజీఎంకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించగా.. బ్రష్‌ను తొలగించారు. బైండోవర్ ఉల్లంఘించిన ఒకరికి జరిమానాఇచ్చోడ: బైండోవర్ నిబంధనలు ఉల్లఘించిన నైతం సంజీవ్‌కుమార్ అనే వ్యక్తికి రూ.25 వేల జరిమానా విధించినట్లు ఇచ్చోడ ఎస్‌హెచ్‌వో నరేశ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముఖరా బి గ్రామానికి చెందిన నిందితుడు నైతం సంజీవ్‌కుమార్ గతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నందున కేసు నమోదు చేసి బైండోవర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ మద్యం విక్రయిస్తుండడంతో తహసీల్దార్‌కు నివేదిక అందజేయగా తహసీల్దార్ ఇమ్రాన్ సోమవారం ఆయనకు జరిమానా విధించినట్లు తెలిపారు. పాము కాటుతో మహిళ మృతిఆదిలాబాద్రూరల్: పాముకాటుతో మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన గజ్జల దేవ్బాయ్ (65) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవ్బాయ్ కుమారునితో కలిసి కొత్తగూడ గ్రామంలో నివాసం ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఆమెను పాము కాటు వేసింది. రక్తస్రావం జరగడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి కేసులో తొమ్మిది మంది అరెస్టుఆసిఫాబాద్: పోలీసుల పెట్రోలింగ్‌లో భాగంగా తిర్యాణి మండలంలో 170 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేశామని డీఎస్పీ అశోక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్లడించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన మిడిదొడ్డి కృష్ణ, దుర్గం ప్రశాంత్, ఉల్లిపిట్ట గ్రామానికి చెందిన ముంజం భరత్ గంజాయి సేవించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీరి ద్వారా సుంగాపూర్‌కు చెందిన మల్కాడి కృష్ణ, ముంజం శ్రీరామ్, బొర్లకుంట కృష్ణంరాజు, దుర్గం జీవన్, వైరాగడే పుష్పరాజ్, చునార్కర్ నితిన్, బొర్లకుంట సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. గంజాయి వినియోగం, రవాణా నేరమని అన్నారు. ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు. -
గ్రీవెన్స్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉట్నూర్ మండలం సాలెవాడ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామానికి అంగన్వాడీ మంజూరు చేయాలని, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం చిత్రు తనకు భూ పట్టా ఇప్పించాలని, ఆసిఫాబాద్ మండలం మాణిక్గూడ గ్రామానికి చెందిన భీము తనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ పీఈటీ ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు ఇచ్చారు. వీరితో పాటు మరికొందరు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఐటీడీఏ పీవో నిత్యం బిజీగా ఉంటూ గిరిజన ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిమగ్నమయ్యే ఐటీడీఏ పీవో మంద మకరందు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దీక్ష స్వీకరించారు. -
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
భీమిని: శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. సోమవారం కన్నెపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులు పరిశీలించి, రిసెప్షన్ సెంటర్లోని సిబ్బందితో మాట్లాడారు. కేసుల వివరాలను ఎస్సై విక్రమ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై విక్రమ్ పాల్గొన్నారు. -
వార్డెన్‌ను బెదిరించి వసూళ్లు
ఉట్నూర్‌రూరల్: సమాజంలో ఏది తప్పు, ఏది ఒప్పు కొడుకుకు చెప్పి సన్మార్గంలో పెట్టాల్సిన తండ్రే, కొడుకును వెంట బెట్టుకుని బెదిరింపులు, వసూళ్లకు పాల్పడిన ఘటన ఉట్నూర్ పట్టణంలో వెలుగుచూసింది. సీఐ ఎం.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పాత ఉట్నూర్‌కు చెందిన నేతావత్ రాందాస్, నేతావత్ జైల్‌సింగ్ అనే తండ్రీకొడుకులు గత కొద్ది రోజులుగా ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ కాల్స్ చేసి ఒక కార్యక్రమం పేరుతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ నెల 26న హాస్టల్‌కు వెళ్లిన నిందితులు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని బెదిరించారు. గత ఆరు నెలల్లో రెండు సార్లు రూ.3వేల చొప్పున రూ.6వేలు వసూలు చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వారిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు. బెదిరింపులు, బలవంతపు వసూళ్ల వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై విజయ్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
తండ్రి చితికి నిప్పుపెట్టిన కూతురు
తాండూర్: తండ్రి చితికి నిప్పంటించి కొడుకులు లేరనే లోటును తీర్చింది. పుట్టెడు దుఃఖంలోనూ దహనసంస్కారాలు నిర్వహించింది. మండలంలోని బోయపల్లి గ్రామానికి చెందిన ఇప్ప కమలాకర్(40) ఆదివారం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన మొదటి భార్య శోభ కూడా మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. వీరికి కూతురు కీర్తన ఉంది. ఆ తర్వాత కమలాకర్ మరో వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలాకర్ తుది శ్వాస విడిచాడు. సోమవారం కమలాకర్ స్థానికులు దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారుడు లేకపోవడంతో కూతురు కీర్తన ఆ బాధ్యతను తీసుకొని తండ్రికి తలకొరివి పెట్టింది. కూతురే అన్నీ తానై అంతిమ సంస్కారాలు నిర్వహించడం అక్కడున్న వారిని కలిచివేసింది. -
వడ్ల పైసలు రాలే..
జూన్‌లో ీతొర్రెం రాజక్క, పుప్పిరెడ్డి పార్వతి, ఏ చిన్నన్న కలిసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో 1053 బస్తాల వడ్లు అమ్ముకున్నాం. ఇంతవరకు పైసలు రాలేదు. కొనుగోలు సమయంలో బస్తాకు నాలుగు కిలోల అదనంగా తూకం వేశారు, వేయి బస్తాలకు పైసలు రావాల్సి ఉంది. తూకం వేసిన నగదు ఇవ్వాలంటే ట్యాబ్ ఎంట్రీ చేయడం లేదు. సైట్ బంద్ అయ్యిందని, అమ్మిన వడ్ల పైసలు చెల్లించడం లేదు. ఇప్పటికి రెండు సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – బాధిత రైతులు, గ్రామం: మంగనపల్లి, మం: వేమనపల్లి -
వన్యప్రాణులకు సహజసిద్ధమైన గడ్డి
జన్నారం: కవ్వాల్ అడవుల్లో జీవ వైవిధ్యం, శాఖాహార జంతువుల మనుగడకు అత్యంత కీలకమైన సహజసిద్ధమైన గడ్డి భూముల రక్షణకు అటవీ శాఖ ప్రాధాన్యతనిస్తోంది. 2018 నుంచి జన్నారం అడవుల్లో గడ్డి క్షేత్రాలను అభివృద్ధి చేస్తోంది. గడ్డి క్షేత్రాల నిపుణుడు మురద్కర్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇన్ని సంవత్సరాలు విత్తనాల ద్వారా గడ్డిని పెంచిన అధికారులు ఈసారి సహాజ సిద్ధమైన గడ్డిని అందించేందుకు చర్యలు చేపట్టారు. అటవీ ఆవాసాల్లో లభ్యమయ్యే పచ్చిక బయళ్లు తరించిపోకుండా, వాటిని ఆక్రమిస్తున్న కలుపు మొక్కలు తొలగించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వన్యప్రాణులు ఇష్టపడే సహజసిద్ధంగా మొలచిన గడ్డిని పెంపొందించి పిచ్చిమొక్కల తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డివిజన్లో 599 హెక్టర్లు జన్నారం అటవీ డివిజన్లోని 40 అటవీ బీట్లలో 599 హెక్టార్లలో గడ్డి క్షేత్రాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా ప్రతీ సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి గడ్డి విత్తనాలు తీసుకొచ్చి అడవుల్లో చల్లడం, గరక వంటి గడ్డిని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి కుంటల కట్టలు, వన్యప్రాణులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో నాటేవారు. కానీ ఈ సంవత్సరం సహజంగా పెరిగే గడ్డిని వన్యప్రాణులకు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. డివిజన్లోని 599 హెక్టర్లలో వ్యాపించిన గడ్డి క్షేత్రాల ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు తొలగించి నాణ్యమైన గడ్డిని అందించేందుకు పనులు ప్రారంభించారు. ఈ ఏడాది మరో 72 హెక్టార్లలో గడ్డి మైదానాలు పెంచనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గడ్డి క్షేత్రాల వైపు పశువులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బేస్‌క్యాంపు వాచర్లు, బీట్ అధికారులు వీటి సంరక్షణకు జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో అటవీ ప్రాంతాల్లో లాంటానా, పార్థీనియం, లాంటానా ఫిల్టర్ వంటి కలుపు మొక్కలు తీవ్రంగా విస్తరిస్తున్నాయి. ఇవి సహజ సిద్ధమైన గడ్డి పెరగకుండా అడ్డుకోవడమే కాకుండా, భూమిలోని తేమ, పోషకాలను వేగంగా పీల్చుకునే అవకాశం ఉన్నందున అటవీశాఖ అధికారులు కలుపు మొక్కలను ఏరివేసే పనిలో ఉన్నారు. జీవ వైవిధ్యానికి ఊపిరి సహజ పచ్చిక బయళ్లు అభివృద్ధి చెందడం వల్ల శాఖాహార జంతువులకు సమృద్ధిగా ఆహారం లభిస్తుంది. శాఖాహార జంతువుల సంఖ్య పెరిగితే, మాంసాహార జంతువులైన పులులు, చిరుతపులులకు కూడా ఆహార చక్రంలో సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మానవ–వన్యప్రాణి సంఘర్షణలు తగ్గుముఖం పడతాయని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అభివృద్ధికి తోడ్పాటుఅడవిలో సహజమైన పర్యావరణ వ్యవస్థ నిలబడాలంటే గడ్డి భూములు ఎంతో అవసరం. పిచ్చిమొక్కలను తొలగించి, వన్యప్రాణులకు నిరంతరం ఆహారం దొరికేలా చేయడమే అటవీ శాఖ ప్రధాన లక్ష్యం. గడ్డి మైదానాలు శాఖాహార జంతువుల అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది. శాఖాహార జంతువులు అభివృద్ధి చెందితే పులులు ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. – లక్ష్మీనారాయణ, ఎఫ్ఆర్వో, ఇందన్పల్లి -
అప్పుడు ఆబ్సెంట్.. విచారణలో ప్రజెంట్
దండేపల్లి: మండల కేంద్రానికి చెందిన సిద్ది అంజమ్మ 2025–26 విద్యాసంవత్సరంలో దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో గణితం, సామాన్యశాస్త్రం పరీక్షలు ఫెయిలైంది. హెచ్ఎం రాజేశ్వర్‌రావు ప్రత్యేక చొరవతో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించారు. జూన్‌లో మంచిర్యాలలోని బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాసింది. ఫలితాల్లో మాత్రం గణితం పరీక్షకు గైర్హాజరైనట్లు చూపింది. పరీక్ష రాసినా రాయనట్టు చూపడంతో న్యాయం చేయాలని అంజమ్మ తన తల్లి మల్లీశ్వరితోపాటు విద్యార్థిసంఘాల నాయకులు జిల్లా కలెక్టర్, డీఈవో, రామగుండం సీపీకి ఫిర్యాదు చేశారు. ఆమె పరీక్షకు హాజరు కాలేదని అప్పట్లో డీఈవో ప్రకటించారు. అంజమ్మ హైదరాబాద్‌లోని ఎసెస్సీ బోర్డు కార్యాలయానికి వెళ్లి తన గోడు వెల్లబోసుకుంది. విచారణ చేయగా ఆమెకు కేటాయించిన గదిలో కాకుండా మరో గదిలో కూర్చుని పరీక్ష రాసినట్లు తేలింది. ఫలితాలను పరిశీలించగా ఉత్తీర్ణత సాధించినట్లు తేల్చారు. ఈ విషయమై జిల్లా ఏసీజీఈ మల్లేష్‌ను సంప్రదించగా, అంజమ్మకు కేటాయించిన గదిలో కాకుండా మరో గదిలో కూర్చోవడంతో హాజరు నమోదు కాకపోవడంతో ఫలితం తారుమారైందని తెలిపారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని వైద్యులు, సిబ్బంది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు సరైన వైద్యం అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్‌రాథోడ్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని వైద్యాధికారులతో వైద్య, ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మాతాశిశు సంరక్షణ వందశాతం నమోదు, గర్భిణులకు పరీక్షలు, హైరిస్క్ గర్భిణులను గుర్తించి సకాలంలో వైద్యం అందించాలని తెలిపారు. జాతీయ క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, పోర్టబుల్ ఎక్స్‌రే ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. మానసిక ఆరోగ్యంపై పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ సుధాకర్‌నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్‌వో కాకిరాల వెంకటేశ్వర్లు, డీడీఎం ప్రవళిక పాల్గొన్నారు. -
రెండో ఠాణాకు మోక్షమెప్పుడో..!
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రమైన మంచిర్యాల నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. మున్సిపాల్టీ నుంచి నగర కార్పొరేషన్‌గా మారింది. సుమారు లక్షా యాభై వేల జనాభా నివాసం ఉంటోంది. నేరాలు, కేసుల సంఖ్య పెరుగుతోంది. టూటౌన్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాల కాలంగా ప్రతిపాదిస్తున్నా మోక్షం కలుగడం లేదు. మంచిర్యాల సబ్ డివిజన్లోని సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్, హాజీపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఏడు గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. కానీ పోలీసుస్టేషన్ల పరిధి మాత్రం ఎక్కడికక్కడే పాత పద్ధతిలోనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఒకే పోలీస్‌స్టేషన్ ఉంది. నగరంలోని 60 డివిజన్లు మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో విస్తరించి ఉన్నా యి. హాజీపూర్ ఠాణాలో 8, మంచిర్యాల ఠాణాలో 28, నాలుగు గ్రామ పంచాయతీలు, సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో 18, శ్రీరాంపూర్ స్టేషన్ పరిధిలో 6 డివిజన్లు ఉన్నాయి. హాజీపూర్, సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్ ఠాణాల్లో ఏడాదికి సగటున 200 నుంచి 400 వరకు కేసులు నమెదవుతున్నాయి. ఒక్క మంచిర్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలో సగటున 1000 కేసులు నమోదవుతున్నాయి. ప్రతిపాదనలకే పరిమితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలా బాద్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండేసి పోలీస్ేస్టేషన్లు ఉన్నాయి. మంచిర్యాలతో పోల్చి చూస్తే నిర్మల్, బెల్లంపల్లి, ఆదిలాబాద్‌లో నేరాల శాతం తక్కువే ఉంటుంది. అయినా మంచిర్యాలలో ఒకే ఠాణా ఉండడం, సిబ్బంది కొరతతో నెట్టుకొస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరిహద్దు కావడంతోపాటు రైలుమార్గం ఉన్నందున నేరాలు అధికంగా జరిగేందుకు ఆస్కారం ఉంది. దీంతో నేరాల శాతం పెరుగుతోంది. మంచిర్యాలలో మరో పోలీసుస్టేషన్(టూటౌన్) అనివార్యమని దశాబ్దాల కాలంగా ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. టౌటౌన్ ఏర్పాటుతోపాటు సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో పోస్టును సీఐ స్థాయి అధికారికి అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టేషన్ పరిధిలో కలెక్టరేట్, జిల్లా కోర్టు భవనం, సింగరేణి ప్రాంతం ఉన్నాయి. కలెక్టరేట్ ఎదుట ధర్నాలు, వీఐపీల తాకిడి, బందోబస్తు విధులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. -
ప్లాంటు పనులు గడువులోగా పూర్తి చేయాలి
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు విస్తరణలో భాగంగా చేపట్టిన మూడో యూనిట్ 800మెగావాట్ల పవర్ ప్లాంటు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) ఎం.తిరుమలరావు ఆదేశించారు. సోమవారం పవర్ ప్లాంటును సందర్శించిన ఆయన మూడో యూనిట్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా బాయిలర్, ట్రాక్హాపర్తోపాటు నిర్మాణ దశలో ఉన్న పనులు పరిశీలించి పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అడ్మిన్ భవన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్టీపీపీ ఈడీ సీహెచ్.చిరంజివి, జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్, సీఎంవోఏఐ బ్రాంచ్ అధ్యక్షుడు పంతులా, ఏజీఎం సూర్యనారాయణరాజు, కొత్త ప్లాంటు కోఆర్డినేటర్ వేణుగోపాల్‌రావు, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. -
కేకే–ఓసీని సందర్శించిన డైరెక్టర్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–ఓసీని సింగరేణి డైరెక్టర్(పీపీ) వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. ఏరియాలోని ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతపై ఏరియా జీఎం రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ త్రైమాసిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ఉత్పత్తి వేగాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. అనంతరం కేకే–ఓసీ సమీపంలో స్టౌవింగ్, సైడింగ్ పనులను తనిఖీ చేశారు. ఎస్వో టు జీఎం లలితేంద్రప్రసాద్, ఏజీఎం(ఈఅండ్ఎం) బాలాజీ భగవతీ ఝా, డీజీఎం(సర్వే) బుక్య దేశాయి, డీజీఎం(సివిల్)మదీనా బాష, క్వాలిటీ ఆఫీసర్ ప్రదీప్ పాల్గొన్నారు. -
విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపర్చాలి
మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపర్చేందుకు వినూత్న బోధన పద్ధతులు, ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యాజ్ఞానం, కార్యాచరణ ఆధారిత బోధన అంశాలపై ప్రత్యేక దృషి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు శిక్షణను 2026–27 విద్యాసంవత్సరంలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. పీజీఐ సూచికల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. హాజీపూర్ ఎంఈవో తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎంఓ జంబోజు సత్తయ్య, హాజీపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
ముధోల్: మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. సీఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని తానూర్ బైపాస్ రోడ్డు, హనుమాన్ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న దత్తాత్రి –కళావతి దంపతులు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. శనివారం రోజుమాదిరిగానే తమ ఇంటికి, గేటుకు తాళం వేసి ఉదయం కూలీకి వెళ్లారు. సాయంత్రం వచ్చి గేటు తాళం తీసి లోపలికి వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండడంతో పాటు బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించగా సీఐ రవీందర్ నాయక్ అక్కడికి చేరుకొని పరి శీలించారు. దొంగలు గేటుపై నుంచి వచ్చి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఉంటారన్నారు. బీరువాలోని 4 మాసాల బంగారు కమ్మలను దొంగిలించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఓ పత్రికలో 6 తులాల బంగారం చోరీ జరిగినట్లు వచ్చిన వార్తలో నిజం లేదన్నారు. -
హిట్ అండ్ రన్ కేసు నమోదు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ నెల 23న రోడ్డు ప్రమాదానికి సంబంధించి హిట్ అండ్ రన్ కేసు నమోదైనట్లు ఎస్సై మధుసూధన్ ఆదివారం తెలిపారు. తిర్యాణి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన మల్యాల మొగిళి(50) మంచిర్యాలలో దోభి(చాకలి) పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈక్రమంలో ఈ నెల 23న ఉదయం పని నిమిత్తం సైకిల్‌పై బస్టాండ్ వైపు నుంచి బెల్లంపల్లి చౌరస్తా వైపు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు మొగిళిని ఢీ కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తి కారులో నుంచి దిగి క్షతగాత్రుడిని చూసి అక్కడే వదిలేసి పారిపోయారు. అనంతరం స్థానికులు మొగిళిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. మొగిళికి భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
వాహన దొంగల ముఠా గుట్టురట్టు
ఆదిలాబాద్‌టౌన్: గత కొద్ది నెలలుగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో వాహన చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠా గుట్టును రట్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మొత్తం 16 మంది నిందితులపై కేసు నమోదు చేసి, పది మందిని అరెస్ట్ చేయగా, ఆరుగురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 21న రిమ్స్ ఎదురుగా పలువురు ఆటో దొంగతనానికి యత్నించిన అనంతరం ప్రత్యే క నిఘా ఏర్పాటు చేశామన్నారు. 24న కుప్టి ఘాట్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితులు పోలీసులపై కత్తితో బెదిరింపులకు పాల్పడి కారులో పరారయ్యారు. 25న వాంకిడి చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అదే కారును గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితులు యాసర్ అహ్మద్, సోహైల్ వాహన డ్రైవర్లుగా పనిచేస్తూ దొంగతనానికి అనువైన వాహనాలను గుర్తించి ముఠా సభ్యులకు సమాచారం అందించేవారు. అనంతరం సభ్యులు కారు ను అద్దెకు తీసుకుని పార్కింగ్‌లో ఉన్న వాహనాల ను దొంగిలించి ఇఫ్తేఖార్, షేక్ అబూతలాహాకు విక్రయించేవారు. అరెస్టు చేసిన పది మంది నిందితుల వద్ద నుంచి 7 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక కారు, 8 మొబైల్ ఫోన్లు, ఒక కత్తి, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ.17లక్షలు ఉంటుందని ఎస్పీ వివరించారు. పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, నేరడిగొండ ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.నిందితుల వివరాలు..నిర్మల్‌లోని రామ్‌నగర్‌కు చెందిన యాసర్ అహ్మద్, సోఫీనగర్‌కు చెందిన అక్బర్‌ఖాన్, మహ్మద్ అద్నాన్, ఆజామ్ ఖాన్, ఉమర్ ఖాన్, గుల్జార్ మార్కెట్‌కు చెందిన అబ్దుల్ ఫారూక్, బుధవార్‌పేట్‌కు చెందిన అర్బాస్ ఖాన్, ఆదర్శ్‌నగర్‌కు చెందిన నాసిర్ బిన్ జావీద్, షేక్ అబూతలాహా, మదీనా కాలనీకి చెందిన షేక్ ఇఫ్తేఖార్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిర్మల్‌కు చెందిన ఇమ్రాన్, నిజామాబాద్‌కు చెందిన జైన్, ఆదర్శ్‌నగర్‌కు చెందిన జునైద్, బుధవార్‌పేట్‌కు చెందిన సోఫియాన్, ఫర్దీన్, అద్నాన్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
అద్దె భవనాల్లో అవస్థలు
ఆదిలాబాద్‌రూరల్: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి బాపూలే గురుకులాలను సమస్యలు వెంటాడుతున్నాయి. ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో వీటిని ప్రారంభించింది. అప్పటి నుంచి చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఓ వైపు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆదరణ ఉండడంతో పాఠశాలలను కళాశాలలుగా కూడా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తున్నా సొంత భవనాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. పట్టించుకోని ప్రభుత్వంజిల్లాలో గురుకుల పాఠశాలలు, కళాశాలలకు అంతంత మాత్రంగానే అద్దె చెల్లిస్తుండడంతో విద్యార్థులకు సరిపడా భవనాలు లభ్యం కావడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దెతో ఇరుకై న భవనాలు అద్దెకు తీసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల శంఖుస్థాపనలు చేసిన వాటి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. ప్రహరీ కరువు..జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 44కు ఆనుకొని 2016లో మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను నిర్మించారు. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం 800 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నారు. కానీ ప్రహరీ నిర్మాణం చేపట్టలేదు. దీంతో బాలికలకు భద్రత లేకుండా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.బాలురు 13మొత్తం విద్యార్థులు 16,800ఇదీ పరిస్థితి..ఉమ్మడి జిల్లాలో మహాత్మా జ్యోతిబాపూలే గు రుకుల పాఠశాలలు, కళాశాలలు 26 ఉన్నా యి. ఇందులో ఐదో తరగతి నుంచి ఇంటర్మీ డియెట్ వరకు నాణ్యమైన విద్య అందిస్తున్నా రు. ఆదిలాబాద్ (బాలికలు), జైనథ్ బాలు రు, లక్సెట్టిపేట బాలుర పాఠశాల, కళాశాల కు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మి గతావి అద్దె భవనాల్లో కొనసాగుతుండగా వీ టిల్లో కొన్ని అరకొర వసతులతో ప్రభుత్వ కా ర్యాలయ భవనాల్లో కొనసాగుతున్నాయి. వి ద్యార్థులు ఇరుకు గదుల్లో ఉంటూ విద్య అభ్యసిస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల నూతన భవనాలకు శంకుస్థాపనలు చేసినా నిర్మాణాలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 26 మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాలల్లో మూడింటికే సొంత భవనాలు ఉన్నాయి. కొన్ని అద్దె భవనాలలో కొనసాగుతుండగా, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – శ్రీధర్, ఆర్సీవో, మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలు ఉమ్మడి జిల్లాలో మహాత్మా జ్యోతి బాపూలే గురుకులాలు -
దీపం అంటుకుని ఇల్లు దగ్ధం
తాంసి: భీంపూర్ మండలం టేకిడి రాంపూర్ గ్రా మానికి చెందిన ఆత్రం ధాంజీకి చెందిన ఇల్లు శని వారం రాత్రి దీపం మంటలు అంటుకొని దగ్ధమైంది. వివరా ల్లోకి వెళ్తే.. కు టుంబ సభ్యులు శనివారం సాయంత్రం దేవుని గది వద్ద దీపం వెలిగించి పూజలు చేశారు. అనంతరం దీపం అలాగే ఉంచి రాత్రి పక్కనున్న గదిలో నిద్రిస్తుండగా 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పూజ గదిలో మంటలు చెలరేగాయి. మంటలు ఇంట్లోని సామగ్రికి వ్యాపించగా చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. నీళ్లు చల్లి మంట లు ఆర్పివేశారు. మంటల్లో ఇంట్లో ఉన్న రూ.3వేల నగదుతో పాటు పిల్లల సర్టిఫికెట్స్, బట్టలు, వంట సామగ్రి కాలిపోయాయి. దాదాపు రూ.లక్ష ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వాపోయారు. గ్రామ సర్పంచ్ సిడాం కేశవ్, గ్రామ పెద్దలతో కలిసి కాలిపోయిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబానికి నిత్యావసర సామగ్రి అందజేశారు. -
వాహన తనిఖీలు.. కేసులు నమోదు
నర్సాపూర్(జి): మండల కేంద్రంలో పోలీసులు ఆదివారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న ముగ్గురు మైనర్లు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఇ ద్దరు, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడుతున్న ఇద్దరు, తప్పుడు నంబర్ ప్లేట్‌తో వాహనం నడిపిన నలుగురితో పాటు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గణేశ్ తెలి పారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురికి జరిమానాలు విధించామన్నారు. ఏఎస్సై శంకర్, హెడ్ కానిస్టేబుల్ చిన్నయ్య, కాని స్టేబు ళ్లు మోహన్, శంకర్, మొయిజ్ పాల్గొన్నారు. -
బ్రిడ్జి పైనుంచి దూకి వ్యక్తి బలవన్మరణం
వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పెద్దవాగు బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన పల్లపు భూమన్న (35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మానసిక స్థితి కూడా సరిగా ఉండడం లేదు. కుటుంబ సభ్యులతో గొడవపడుతుండేవాడు. ఈనెల 24న ఇంటి నుంచి వెళ్లిన భూమన్న వెల్గటూర్ శివారులోని పెద్దవాగు బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకాడు. ఆదివారం ఉదయం మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని బయటకు తీయించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేకనే బలవన్మరణానికి పాల్పడ్డాడని భూమన్న భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. మనస్తాపంతో ఒకరు.. లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయినగర్ కాలనీకి చెందిన అజ్మీరా శ్రీను (42) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఎస్సై గోపతి సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శ్రీను గత కొద్ది రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినడంలేదు. ఈక్రమంలో ఆదివారం మద్యం తాగొద్దని మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీను భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉరేసుకుని వృద్ధుడు.. లక్సెట్టిపేట: మండలంలోని గోదావరి రోడ్లో చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు పదకొండో వార్డుకు చెందిన లింగయ్య(60)గా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు ఉట్నూర్‌రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం ఉట్నూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్సెట్టిపేట గ్రామానికి చెందిన అర్కా ప్రభు ఇంద్రవెల్లి వైపు నుంచి ఉట్నూర్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మండలంలోని పులిమడుగు గ్రామం సమీపంలో వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం అతడి బైక్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో అర్కా ప్రభు తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించగా పోలీసులు అక్కడకు చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పిడుగుపాటుతో మహిళ మృతి ముధోల్: పిడుగుపాటుతో మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని గన్నో గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అప్పాల నర్మద(45), రక్మ అనే ఇద్దరు మహిళలు పత్తి చేనులో కలుపు తీస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4గంటల సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. దీంతో చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడడంతో అప్పాల నర్మద అక్కడికక్కడే మృతి చెందింది. రుక్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో రుక్మను భైంసా ఏరియాసుపత్రికి తరలించారు. కాగా నర్మద భర్త సాయారెడ్డి ఏడేళ్ల క్రితం మృతి చెందగా ఆమె ఇద్దరు కుమారుల్లో ఒకరు ట్రిపుల్‌ఐటీలో పని చేస్తున్నారు. మరొకరు టీచర్‌గా ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు. చికిత్స పొందుతూ యువకుడు.. మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అందుగుల పేట వద్ద నయార పెట్రోల్ బంకు సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూర వంశీ(20) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం బైక్‌పై బొక్కలగుంట నుంచి మందమర్రి వైపు వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో సూర వంశీ మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. -
● సిజేరియన్లకే మొగ్గు చూపుతున్న యాజమాన్యాలు, డాక్టర్లు ● ప్రభుత్వం చెబుతున్నా సాధారణ ప్రసవాలకు ‘నో’ ● ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నార్మల్ డెలివరీలు
మంచిర్యాల మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని వార్డులో బాలింతలుమంచిర్యాలటౌన్: సాధారణ ప్రసవాలు మాత్రమే చేయాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లకే మొగ్గు చూపుతున్నారు. సాధారణ ప్రసవాలు అంటే కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం అనే భావన కల్పించేలా ఆరేళ్లుగా జిల్లాలో జరిగిన ప్రసవాల గణాంకాలను చూస్తే అర్థం అవుతోంది. ప్రభుత్వం సాధారణ ప్రసవాలను మాత్రమే చేయాలని, సిజేరియన్ ప్రసవాలను చేపట్టవద్దన్న ఆదేశాలను ప్రైవే టు ఆస్పత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా, ప్రసవాలు అత్యధికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హైరిస్క్ కేసులకు మాత్రమే సిజేరియన్ల ద్వారా ప్రసవాలు చేస్తుండగా, ప్రైవేటులో మాత్రం సిజేరియన్ల ద్వారా ప్రసవాలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రసవం చేయలేనివి, హైరిస్క్ ఉన్న గర్భిణులను మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి రెఫర్ చేయడంతో అత్యవసర పరిస్థితుల్లో చేసే సిజేరియన్లే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నా, హైరిస్క్ కేసులతో సిజేరియన్ ప్రసవాలు కూడా జరుగుతున్నాయి. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం కొందరు గర్భిణులు తమకు సాధారణ ప్రసవం వద్దని, పురిటి నొప్పులను భరించలేమని చెబుతుండగా, మరికొందరు మంచి రోజులు చూసుకుని, వారు చెప్పిన తేదీ, సమయానికి సిజేరియన్ చేయాలని కోరుతున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరున్నరేళ్లలో సాధారణ ప్రసవాలు పది శాతంలోపే (9.22 శాతం) జరిగాయి. అంతేకాకుండా సాధారణ ప్రసవాల కంటే, సిజేరియన్ చేయడం వల్ల ఎక్కువ ఫీజు వస్తుండడంతో వైద్యులు ఆపరేషన్ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సమీక్షలతోనే సరిపెడుతున్నారా? ప్రసవాల్లో కడుపు కోతలను తగ్గించి, సాధారణ డెలివరీకి ప్రాధాన్యం ఇవ్వడం బాలింతలకు ఆరోగ్యకరమని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇది కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే పాటించాలని, తమకేం సంబంధం లేదన్నట్లుగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అవసరం ఉన్నా, లేకపోయినా సిజేరియన్ ద్వారానే ప్రసవాలు చేస్తుండడంతో, 10 శాతం లోపు మాత్రమే సాధారణ ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్నా కనీస చర్యలు లేవు. మూడేళ్లుగా ప్రభుత్వం సాధారణ ప్రసవాలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. నిత్యం ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. వారికి తగిన సూచనలు ఇస్తూనే సాధారణ ప్రసవాలు పెంచని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్న ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోకపోవడం వల్లే సాధారణ ప్రసవాలు చేసేందుకు ముందుకు రావడంలేదని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. -
సీహెచ్‌పీని సందర్శించిన కేంద్ర రైల్వేశాఖ ఈడీ
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని సీహెచ్‌పీ రైల్వే కోల్ సైడింగ్‌ను కేంద్ర రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టేషన్, కోల్) సయ్యద్ అబ్దుల్ రెహమాన్ ఆదివారం సందర్శించారు. బెల్లంపల్లి రీజియన్ పర్యటనలో భాగంగా ఇక్కడి రైల్వే సైడింగ్‌ను తనిఖీ చే శారు. బొగ్గు రేకుల లోడింగ్ వేగవంతం చేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ బొ గ్గు రవాణా, రేకుల లోడింగ్‌కు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీ, రక్షణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వోటు జీఎం కృష్ణ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ సురేష్, సీహెచ్‌పీ ఇన్చార్జి చంద్రలింగం, డీజీఎం(సివిల్) ఆనంద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
శుభ్రతతో కూడిన ఆహారం వడ్డించాలి
బెల్లంపల్లి: విద్యార్థులకు శుభ్రతతో కూడిన ఆహారం వడ్డించాలని బెల్లంపల్లి సివిల్ కోర్టు జడ్జి శాంతిసోని అన్నారు. ఆదివారం పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈనెల 22న గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 23 మంది బాలికలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు న్యాయవాదులతో కలిసి కిచెన్, స్టోర్ రూమ్, కూరగాయలు, పప్పు దినుసులు, ఇతర నిత్యావసరాలు, విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఫుడ్ ఫాయిజన్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. అంతకుముందు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, న్యాయవాదులు టి.గోపి కిషన్‌సింగ్, సీహెచ్.మనోహర్, ఎల్.రాము, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యూత్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.సాంబమూర్తి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో యువతకు భవిష్యత్ ఉంటుందన్నారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మారయ్య మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఆగస్టు 7, 8 తేదీల్లో హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి పి.శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఎం.బాబురావు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
‘ముఖ్యమంత్రితో ముఖాముఖి’కి ఆహ్వానం
జన్నారం: విదేశీ విద్య అధ్యయనానికి ఇటీవల ఫిన్లాండ్ వెళ్లివచ్చిన ఉపాధ్యాయులతో ఈ నెల 28న హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి జన్నారంలోని ఇద్దరు ఉపాధ్యాయులకు ఆహ్వానం అందింది. కిష్టాపూర్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ దాముక కమలాకర్, అక్కపెల్లిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్‌కు ఆదివారం ఆహ్వానం అందినట్లు పేర్కొన్నారు. మండల విద్యాధికారి బానవత్ రాజేందర్, కిష్టాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండ రాజన్న, జన్నారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విజయకుమార్ అభినందనలు తెలిపారు. -
ఫ్లైఓవర్ బ్రిడ్జి వెంటనే నిర్మించాలి
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ నుంచి రాజీవ్‌నగర్‌కు వెళ్లే వందఫీట్ల రోడ్డుపై వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ సెంట్రల్ జోన్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఎన్నికల్లో గెలిచిన నెలరోజుల్లోనే బ్రిడ్జీ నిర్మిస్తానని హామీ ఇచ్చారని, రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదన్నారు. దీంతో టూటౌన్ ప్రాంత ప్రజలు నిత్యం రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గాజుల నాయకులు ముఖేశ్ గౌడ్, రంగ శ్రీశైలం, గోపతి రాజయ్య, బొట్ల అనిత, వంగపల్లి వెంకటేశ్వర్రావు, వైద్య శ్రీధర్, బోయిని హరికృష్ణ, బెల్లంకొండ మురళి, తరుణ్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆరున్నరేళ్లుగా జిల్లాలో జరిగిన ప్రసవాల వివరాలు
ఏడాది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు సాధారణ సిజేరియన్ సాధారణ సిజేరియన్ 2020 2,486 2,331 376 5,064 2021 2,539 2,169 322 5,235 2022 3,106 2,645 438 4,132 2023 3,787 2,752 419 3,575 2024 3,146 2,688 361 3,535 2025 3,385 2,347 559 3,090 2026 1,354 1,052 195 1,652 (జూన్ వరకు) మొత్తం 19,803 15,984 2,670 26,283 -
జల సంరక్షణ.. మన సంరక్షణ
పాతమంచిర్యాల: భవిష్యత్ తరాలకు నీటి భద్రత, నీటి కొరతను తీర్చడానికి భూగర్భ జలాల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వం ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా నీటి నిలువ కార్యక్రమాలు చేపడుతోంది. వర్షపు నీరు వృధాకాకుండా వ్యవసాయానికి పనికి వచ్చేలా రైతుల పంట పొలాల్లో ఫారంపాండ్లు, ఊటకుంటలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘ఇంటింటా ఇంకుడు గుంత, ప్రతీ పొలానికి పంటకుంట, ప్రతీ ఊరికి చెక్‌డ్యాం’ అనే నినాదంతో ప్రతీ గ్రామ పంచాయతీలో నీటి సంరక్షణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో ప్రతీ జీపీకి 200 ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడుగుంత 1, ప్రతీ మండలానికి రెండు సేద్యపు బావులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బావి నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చుకాగా బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు జీపీకి ఒకటి, ఫారం పాండ్లు జీపీకి 4 ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఫారం పాండ్ నిర్మాణానికి రూ.2 లక్షలు వ్యయం చేయనున్నారు. రూఫ్‌టాప్ హార్వెస్టింగ్ వర్షపు నీరు వృధా కాకుండా రూ.35 వేల వ్యయంతో ఇంకుడు గుంతలు నిర్మించనున్నారు. వీటితో పాటు రాతి కట్టడాలు, ఖండిత కందకాలు, నిరవధిక సమతల కందకాలు, నీటి శోషణ కందకాల నిర్మాణాలు చేపట్టనున్నారు. జిల్లాలోని 16 మండలాలు, 306 గ్రామ పంచాయతీల్లో 1,408 ఫారంపాండ్లు, 306 ఊట కుంటలు, 61,200 ఇంకుడు గుంతలు, 306 సామూహిక ఇంకుడు గుంతలు, 306 బోర్వెల్ రిచార్జ్ స్ట్రక్చర్లు, 32 సేద్యపు బావుల నిర్మాణాలు చేపట్టనున్నారు. జలసిరి ద్వారా నీటి సంరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపర్చడానికి జల సంరక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడతుందని అధికారులు తెలిపారు. వీబీజీ రాంజీ, ప్రధాన మంత్రి కృషి సంచాయ్యోజన, నాబార్డు, ఎన్జీవో, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు (సీఎస్సార్) రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంస్థల నిధులతో పనులు చేపట్టనున్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఉన్న బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్‌లోని ఆ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి పర్యటనలు చేయడంతో సంస్థకు ఒరిగేదేం లేదని, ప్రస్తుత పరిస్థితిలో కంపెనీకి రావాల్సిన రూ.53వేల కోట్లను వెంటనే చెల్లిస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. కొత్త గనుల అనుమతి కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రతీనెల మెడికల్ బోర్డు నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో జాప్యం చేస్తున్నారన్నారు. ఇటీవల మెడికల్ బోర్డు నిర్వహించినా అందులో అర్హులకు న్యాయం జరగలేదన్నారు. సింగరేణిలో కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను అధికారుల చేతనే ఇప్పించాలని ప్రజాప్రతినిధుల జోక్యాన్ని రూపుమాపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్, బ్రాంచ్ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, నాయకులు నరెడ్ల వెంకటరెడ్డి, పెరిక సదానందం, తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మంచిర్యాలటౌన్: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతన పాలకవర్గం రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా పనిచేసి మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం కమిటీ చైర్మన్‌గా రామగిరి బానేష్, వైస్ చైర్మన్‌గా జాలే రాయలింగు, డైరెక్టర్లుగా బండి తులశేఖర్ గౌడ్, బద్రి ప్రకాశ్, దోమల రమేశ్, పురెల్ల పోచమల్లు, బొల్లం సత్యనారాయణ, లగిశెట్టి మనోజ్, కొడప కమల, మారు మల్లయ్య, మహ్మద్ ఇర్ఫాన్, ముడిమడుగుల శ్రీనివాస్, అశోక్ కుమార్ లడ్డ, రావుల మహేశ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటి మేయర్ సల్ల రమ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ సల్ల మహేశ్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, తదితరులు పాల్గొన్నారు. సైనికుల త్యాగం ఎనలేనిదిమంచిర్యాలటౌన్: కార్గిల్ పోరాటంలో భారత సైనికులు చేసిన త్యాగం ఎనలేనిదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి చౌరస్తాలో భారత సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి కార్గిల్ వీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేశ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు. -
సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు
జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కన్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉంది. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం జరిగే వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేస్తుండగా హైరిస్క్ కేసులు మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వస్తున్నాయి. సాధారణ ప్రసవం కాని పక్షంలోనే సిజేరియన్ చేస్తున్నారు. ప్రైవేటులో జరిగే ప్రసవాలపై సమీక్ష నిర్వహించి, సిజేరియన్లను చేయడంపై ఎప్పటికప్పుడు రిపోర్టు తీసుకుని విచారణ చేస్తున్నాం. సాధారణ ప్రసవాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
1098కి స్పందించి..చిన్నారిని బాలసదన్‌లో చేర్పించి..
భీమిని: దత్తత పేరుతో బాలుడిని తీసుకువచ్చారనే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదుకు స్పందించిన అధికారులు శుక్రవారం రాత్రి బాలసదన్‌కు చేర్చారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నెపల్లి మండలం గొల్లగట్టు గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు దత్తత పేరుతో వారం క్రితం ఆరునెలల చిన్నారి(మగ) తీసుకువచ్చారు. ఈ విషయమై గ్రామస్తులు 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. స్పందించిన ఐసీడీఎస్ అధికారులు పోలీసులతో కలసి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. దత్తతకు సంబంధించిన ఆధారాలు ఏమి లేకపోవడంతో కుటుంబసభ్యులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కన్నెపల్లి ఎస్సై విక్రమ్ తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సూచనతో చిన్నారిని ఆదిలాబాద్ పిల్లల సంరక్షణ (బాలసదన్) కేంద్రానికి తరలించారు. -
నాడు తండ్రి, నేడు తల్లి తిరిగిరానిలోకాలకు
నార్నూర్: మూడు నెలల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. మండలంలోని మాలేపూర్ పంచాయతీ పరిధి చిత్తగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీడంపూర్ సోనుబాయి (28), తిరుపతి దంపతులు. మూడు నెలల క్రితం మద్యానికి బానిసై తిరుపతి మూడునెలల క్రితం ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌లో ఉరేసుకున్నాడు. అప్పటి నుంచి సోనుబాయి తన ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి గంటేవార్ సాదవ్ ఇంట్లో ఉంటోంది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. భర్త మృతితో మానసిక వేదనకు గురైన సోనుబాయి, ఇద్దరు చిన్నారుల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉండేది. శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆమె మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నాడు తండ్రి, నేడు తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం గ్రామస్తులను కలచివేసింది. మృతురాలి తల్లి రంజానబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీసాయి తెలిపారు. చిన్నారుల సంరక్షణ, భవిష్యత్‌కు ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. -
బందోబస్తు మధ్య మొక్కలు నాటి..
ఇచ్చోడ: మండలంలోని సిరిచెల్మ టైగర్‌జోన్ చెలుకగూడ అటవీప్రాతంలో శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య మొక్కలు నాటారు. టైగర్‌జోన్ అటవీశాఖ ఆధ్వర్యంలో 10 హెక్టార్లలో 12వేల మొక్కలు నాటారు. గతంలో ముల్తానీలు సాగు చేస్తున్న భూములను అటవీశాఖ భూములుగా గుర్తించి ఆ శాఖ ఆధ్వర్యంలో మూడేళ్లుగా అందులో మొక్కలు నాటుతున్నారు. అయితే గతేడాది జూలైలో ఈ ప్రాంతంలో మొక్కలు నాటడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులను అక్కడి ముల్తానీలు అడ్డుకొని పోలీసు వాహనంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసారి పోలీసు బందోబస్తు మధ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బీర్సాయిపేట్, ఉట్నూర్, నేరడిగొండ రేంజ్ అధికారులు 80 మందితోపాటు 50 మంది బేస్‌క్యాంప్ సిబ్బంది, 180 మంది పోలీసులు పాల్గొన్నారు. మొక్కలు నాటే ప్రాంతాన్ని ఎస్పీ అఖిల్‌మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్‌సాయి, ఉట్నూర్ టైగర్‌జోన్ ఎఫ్‌డీవో అరవింద్ సందర్శించారు. -
గురుకులాల తనిఖీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయం, గుడిపేటలోని ఎంజేపీ పీఎంశ్రీ బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, నంనూర్లోని అర్బన్ గురుకుల బాలుర పాఠశాలలను శనివారం హాజీపూర్ మండల ప్రత్యేకాధికారి, డీఆర్డీవో కిషన్ తనిఖీ చేశా రు. తరగతి, వసతి, వంట గదులు, భోజన శాలలు, మరుగుదొడ్లు, పాఠశాలల పరిశీలించి పలు సూచనలు చేశారు. పరిశుభ్రమైన వాతా వరణాన్ని కలిపిస్తూ విద్యార్థులకు చక్కని బోధ న అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సాయివెంకటరెడ్డి, ఏఈవో తిరుపతిరెడ్డి, ఆయా ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
బైక్‌లు ఎత్తుకెళ్లిన ఐదుగురు బైండోవర్
జన్నారం: అటవీ అధికారులు సీజ్ చేసిన బైక్‌లను చోరీచేయడమే కాకుండా అడ్డువెళ్లిన సి బ్బందిపై దాడి చేసిన ఐదుగురిని శనివారం తహసీల్దార్ బక్కయ్య ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 21న అటవీ అధికారులు కవ్వాల్ ఫారెస్ట్ క్వార్టర్లో రెండు బైక్‌లను సీజ్ చేసి ఉంచారు. దేవునిగూడకు చెందిన లాకవత్ ఉపేందర్, గవ్వల మురళీకృష్ణ, బుక్య సాయి, లాకవత్ విక్రం, లాకవత్ రాహూల్నాయక్ కలిసి శుక్రవారం రాత్రి సమయంలో క్వార్టర్లోకి చొరబడ్డారు. బేస్‌క్యాంపు వాచర్లపై దాడి చేసి, బైక్‌లను ఎత్తుకెళ్లారని అటవీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్లాస్టిక్‌పై నియంత్రణేది?
మంచిర్యాలటౌన్: పర్యావరణానికి, ప్రజలకు, ఇతర ప్రాణుల ఆరోగ్యానికి నష్టదాయకమనే కారణంతో పాలిథిన్‌తో తయారయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం నిషేధించాలన్న జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సూచనను అన్ని మున్సిపాలిటీల్లో అమల్లోకి తెచ్చినా, పూర్తిస్థాయిలో అరికట్టలేక పోతున్నారు. పాలిథిన్ సంచులు, నీటిసీసాలు, ఆహారం ప్యాక్ చేసే కవర్లు, ప్లాస్టిక్ విస్తర్లు తదితర వస్తువులు క్షేమదాయకం కాదని తెలిసినా.. పరిస్థితుల కారణంగా ప్రజలు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యామ్నయం లేకపోవడంతో పాటు, ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపట్టక పోవడంతోనే ఆశించిన ఫలితాలు అంతగా కనిపించడం లేదు. గతంలో ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపాలిటీల్లో అధికారులు తనిఖీలు చేపట్టడం, జరిమానా విధించడంతో కొంత వరకు ప్లాస్టిక్ వినియోగం తగ్గింది. కొంత కాలంగా ప్లాస్టిక్ నిషేధంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విక్రయాలు మాత్రం యథేచ్చగా సాగిపోతున్నాయి. వీటి వినియోగం ఎక్కువ కావడంతో మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీల్లోని వీధుల్లో వేస్తున్న చెత్తకుప్పల్లో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. పశువులు ప్లాస్టిక్ కవర్లను తిని మృత్యువాత పడుతున్నాయి. పర్యావరణ కాలుష్యానికి ప్లాస్టిక్ కవర్లు కారణమవుతున్నాయి. కనీస తనిఖీలు చేపట్టక పోవడం, జరిమానా విధించక పోవడం, వ్యాపారుల్లో మార్పు తీసుకువచ్చే ప్రయత్నాలు చేయకపోవడం, ప్రత్యామ్నాయం చూపకపోవడంతో జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం యథేచ్చగా సాగుతోంది. తనిఖీలు, జరిమానాలతోనే .. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న పాలిథిన్ను పూర్తిగా నిషేధించారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ (1986) ప్రకారం సీడీఎంఏ హైదరాబాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సామగ్రి జప్తు, రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా, లైసెన్సు రద్దుతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వ్యాపారులు, ప్రజల్లోనూ మార్పు వచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలి. చేతి సంచితోనే కూరగాయల మార్కెట్‌కు రావాలని, ఎవరూ ప్లాస్టిక్‌ను వినియోగించినా మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించాలి. ఎప్పుడో ఒకసారి ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలు చేపట్టి వదిలేస్తున్నారు. ఇటీవల మంచిర్యాల కార్పొరేషన్‌లోనూ ప్లాస్టిక్‌ను విక్రయిస్తున్న పలు దుకాణాలను తనిఖీ చేసి జరిమానా విధించారు. ఆ తర్వాత తనిఖీలు చేపట్టకుండా వదిలేయడంతో మళ్లీ ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు ఊపందుకున్నాయి. చెత్త కుప్పల్లో ప్లాస్టిక్ మున్సిపాలిటీల్లోని పలు కాలనీల్లో వేసే చెత్త కుప్పల్లో సగం ప్లాస్టిక్ కవర్లే కనిపిస్తున్నాయి. ప్రతీరోజు దాదాపు 150 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడితే అందులో నాలుగోవంతు ప్లాస్టిక్ కవర్లే ఉంటున్నాయి. ఇళ్లల్లో నుంచి వెలువడే చెత్తలో తడి, పొడి చెత్త వేర్వేరుగా ప్లాస్టిక్ కవర్లలోనే వేసి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అందిస్తున్నారు. దుకాణాల నుంచి బ యటపడేసే చెత్తలోనూ ప్లాస్టిక్ కవర్లు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. వాటిని బయట పడేయడంతో చెత్తతో పాటే ప్లాస్టిక్ కూడా కలుస్తుంది. జిల్లాలో దా దాపు 95 వేలకు పైగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని అంచనా. పశువులు రోడ్డు పక్కన ఉండే చెత్త, అందులోని ప్లాస్టిక్ కవర్లను తినడంతో జీర్ణం చేసుకోలేక అనారోగ్యం బారిన పడుతున్నాయి.జిల్లాలోని మున్సిపాలిటీల్లో సేకరిస్తున్న చెత్తలో మూడోవంతు ప్లాస్టిక్దేమున్సిపాలిటీ సేకరించే చెత్త (మె.ట) మంచిర్యాల కార్పొరేషన్ 60 మందమర్రి 18 బెల్లంపల్లి 20 క్యాతన్‌పల్లి 15 చెన్నూర్ 18 లక్సెట్టిపేట 17 -
తెల్లమద్ది @150 ఏళ్లు!
దండేపల్లి: తాళ్లపేట రేంజ్ పరిధి దండేపల్లి అటవీ బీట్‌లో సుమారు 150 ఏళ్ల భారీ వృక్షాలు ఉన్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. సూదులొద్దీ అటవీ ప్రాంతంలో సుమారు 450 సెం.మీటర్ల చుట్టుకొలత ఉన్న భారీ తెల్లమద్ది(టెర్మినాలియా అర్జున) వృక్షాలు ఉన్నాయి. వీటిని ఏరుమద్ది అని పిలుస్తారని జన్నారం అటవీ డివిజన్ అధికారి రాంమ్మోన్ తెలిపారు. ఇవి ఎక్కువగా సెలయేరు ప్రాంతాల్లో పెరగడం వల్ల ఏరుమద్ది అని, తొడుగు తెల్లరంగులో ఉండటంతో తెల్లమద్ది అంటారని పేర్కొన్నారు. దీనికి నీటి ప్రవాహాన్ని, నీటి నిల్వలను తట్టుకుంటుందని తెలిపారు. నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో పెంచుతారని చెప్పారు. చెట్టు చుట్టూకొలతను బట్టి దాని వయస్సును చెప్పవచ్చని పేర్కొన్నారు. పేకాడుతున్న 8 మంది అరెస్టు మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో జోరుగా పేకా ట సాగుతుందని సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ‘ఆపరేషన్ పేకాట’నిర్వహించారు. శనివారం సాయంత్రం గాంధీనగర్ శివారులోని పేకాటస్థావరం టాస్క్‌ఫోర్స్ ఎస్సై డీకొండ రమేశ్ బృందం, స్థానిక ఎస్సై రమేష్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. పేకాడుతున్న 8 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.లక్ష రెండు వేలు నగదు, ఆరు సెల్ఫోన్లు, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో సీఐ ప్రమోద్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘సర్కారు’పై ప్రజలకు విశ్వాసం
విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో జిల్లా రాష్ట్రంలోనే ప్రఽథమస్థానం సాధించింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనం. మౌలిక వసతుల కల్పన, అత్యున్నత అర్హతలు కలిగిన ఉపాధ్యాయులతో డిజిటల్ బోధన జరుగుతోంది. 8 అకాడమిక్ పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. – కుమార్‌దీపక్, జిల్లా కలెక్టర్ నాణ్యమైన విద్యఇంటిరాక్టివ్ ప్లాట్ ప్యానెల్, ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ బోధన అందించారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్లు తగ్గించేందుకు 5,7,8 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలల్లో, పదో తరగతి పూర్తి చేసిన బాలికలను కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చేర్పించేలా ఆదేశాలు ఇచ్చాం. – చంద్రయ్య, అదనపు కలెక్టర్, డీఈవో -
జిల్లాకు చేరిన ‘జనజాగరణ యాత్ర’
మంచిర్యాలటౌన్: సీపీఎస్ రద్దు.. పాత పెన్షన్ పునరుద్ధరనే ధ్యేయంగా చేపట్టిన జన జాగరణ యాత్ర బైక్ ర్యాలీ శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) నాయకులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును కలిసి తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మౌనదీక్ష చేపట్టారు. టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆగస్టు 23 న హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు అల్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి కల్వ ల శ్రీకాంత్, నాయకులు గడ్డం వెంకటేశ్, చంద్రకాంత్, సత్యనారాయణ, అంజన్న పాల్గొన్నారు. -
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు
ఆదిలాబాద్‌టౌన్: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్ర యత్నం చేసిన ఇద్దరితోపాటు ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. శనివారం ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ టైమ్స్ పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపులో అభ్యంతరకర పోస్టులు చేసిన బండారి సంతోష్, రాథోడ్ గజానన్, గ్రూప్ అడ్మిన్ వేణుగోపాల్ యాదవ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోష ల్ మీడియా గ్రూప్ అ డ్మిన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించా లని, రెచ్చగొట్టే లేదా విద్వేషాలు రేకెత్తించే పోస్టులను వెంటనే తొ లగించాలని సూచించారు. ప్రజల్లో భ యాందోళనలు సృష్టించే పోస్టులు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. -
చర్యలు తీసుకుంటాం
ఇటీవల ప్లాస్టిక్ విని యోగంపై తనిఖీలు చేపట్టి, పలువురికి జరిమానా విధించాం. ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించి, వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజల్లో సరైన అవగాహన లేక ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోంది. ఇకపై ప్రతినెలా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టి కార్పొరేషన్ పరిధిలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, వినియోగించినా మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – అన్వేష్, కమిషనర్, మంచిర్యాల కార్పొరేషన్ -
‘విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడొద్దు’
మంచిర్యాలటౌన్: విద్యార్థులకు అన్నివేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. నీట్ పేపర్ లీక్, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు. విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరా ల సురేఖ, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయ ర్ సల్ల రమ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి పాల్గొన్నారు. పేదల అభివృద్ధికి కృషి లక్సెట్టిపేట: పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నా రు. మండల కేంద్రంలోని ఎస్ పీఆర్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారో త్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అక్కల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్‌గా చాతరాజు రాజేశ్, డైరెక్టర్లుగా మల్లేశ్, చందు, శ్రీనివాస్, లచ్చన్న, శర త్, భారతమ్మ, నవాబ్ఖాన్, తిరుమలరావు, బొజ్జురావు, కట్ల శ్రీనివాస్ చేత మార్కెట్ అధికారి షాబొద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఆర్టీయే మెంబర్ శ్రీనివాస్, జిల్లా ఆర్జీపీఆర్ఎస్ నాయకులు గడ్డం త్రిమూర్తి, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి, వైస్ చైర్మన్ రాజేశ్వరి పాల్గొన్నారు. -
ఆ ఊరే కుటుంబమైంది
నేరడిగొండ: నిజమైన బంధం అంటే రక్త సంబంధం మాత్రమే కాదు.. ఒకరి కష్టాన్ని చూసి కదిలిపోయే గుణమని వెంకటాపూర్ గ్రామస్తులు నిరూపించారు. దయనీయ స్థితిలో ఉన్న ని రుపేద కుటుంబానికి ఆ ఊరి ఉద్యోగులు, ప్ర జలు కొండంత అండగా నిలిచి మానవత్వాన్ని చాటారు. మండలంలోని వెంకటాపూర్‌లో అడెల్లి అనే వృద్ధురాలు ఈనెల 21న మృతిచెందింది. ఆమె మరణం ఆ ఇంటా తీవ్ర విషాదాన్ని నింపడమే కాకుండా, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసింది. అంత్యక్రియల ని ర్వహణకు, ఇతర ఖర్చులకు పైసా లేక ఆమె కోడలు వసంత దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆమె ఆవేదనకు చలించిన గ్రామస్తులు, ఉద్యోగులు, యువకులు, పెద్దలు అంతా కలిసి రూ. 25వేల నగదు సేకరించారు. ఆ మొత్తాన్ని మృతురాలి కోడలు వసంతకు శనివారం అందజేశారు. నగదు అందజేస్తున్న గ్రామస్తులు -
‘తొలి’పూజలు
దండేపల్లి: గూడెంలో సత్యదేవున్ని దర్శించుకుంటున్న భక్తులువిశ్వనాథస్వామి ఆలయంలో అదనపు కలెక్టర్ దంపతులుదండేపల్లి: మార్కండేయ ఆలయంలో..తొలి ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంచిర్యాలలోని విశ్వనాథస్వామి ఆలయానికి వేకువ జామునుంచే భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో ఓపికగా వేచి ఉండి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ చంద్రయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీహరి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు సత్యదేవున్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చెన్నూర్‌లోని శివాలయంలో అఖండ అభిషేక పూజలు నిర్వహించారు. – మంచిర్యాలఅర్బన్ -
గొల్లవాగు..ఖాళీ!
భీమారం: భీమారం సమీపంలోని గొల్లవాగు ప్రాజెక్ట్‌లో నీరు లేక వెలవెలబోయింది. ఎల్‌నినో తీవ్ర ప్ర భావం, వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టు బోసిపోయింది. నీటిమట్టం అడుగుభాగాలకు చేరింది. ఖరీ ఫ్ సీజన్లో ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భీమారం, చెన్నూరు మండలాల్లోని 9500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం గొల్లవాగు ప్రాజెక్టును నిర్మించింది. దీని ద్వారా సాగునీరందించడంతోనే రైతులు పంటలు పండించేవారు. వేసవిలో నీరు లేకపోవడం, ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా ఇప్పటికి అదే పరిస్థితి ఉంది. అయితే భీమారం మండలం ఆర్కెపల్లి, అంకూసాపూర్, ఎలకేశ్వరం, కొత్తపల్లి, మద్దికల్ శివారుల్లో రైతులు కాలువ ఆధారంతో వరిసాగు చేస్తున్నారు. భూములు..బీళ్లుగానేప్రాజెక్టులోకి నీళ్లు వచ్చే అవకాశం లేకపోవడంతో రైతుల ఇప్పటికి దుక్కులు దున్నించకుండా బీడుగానే ఉంచారు. ఏటా ఇప్పటికే జూలైలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్ట్ జలకళ సంతరించుకునేది. ప్రసుత్తం వర్షం ఎప్పుడు వస్తుందోనని ఆకాశం వైపు ఎదురుచూసే పరిస్థితి ఉంది. ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో పశువులు మేతకోసం వెళ్తున్నాయి. అయితే వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వస్తే ఆలస్యమైన వరి సాగు చేయవచ్చునని రైతులు అంటున్నారు. -
మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
జైపూర్: మండలంలోని పెగడపల్లి ఽశివారులో ఓ చెరువు నుంచి శనివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నా రు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తుండగా మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీని పట్టుకున్నారు. జేసీబీని పోలీస్ స్టేషన్ తరలించగా ట్రాక్టర్లను డ్రైవర్లు వదిలిపెట్టి పరారైనట్లు తెలిసింది. పట్టపగలే చోరీ బాసర: మండల కేంద్రంలోని శారదానగర్ కాలనీలో శనివారం ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. షేక్ రావుఫ్ వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఉదయం ధర్మాబాద్‌కు వెళ్లారు. దుండగులు ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి చొరబడ్డారు. బీరువాలో సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు, 19 తులాల వెండి, రూ.5 వేల నగదును ఎత్తుకెళ్లారు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. బాసర సీఐ దీపక్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. షేక్ రావుఫ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అందుగులపేట వద్ద నయార పె ట్రోల్ బంకు సమీపంలో శనివారం జరిగిన రో డ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై నరేశ్ తెలిపిన వివరా ల ప్రకారం.. పట్టణానికి చెందిన సూర వంశీ, మిరియాల రాజ్‌కుమార్, రామంచ సందీప్ బొక్కలగుంట గాంధారి మైసమ్మ ఆలయం వద్ద విందు చేసుకున్నారు. బైక్‌పై మందమర్రికి వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నా రు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు ఆటోలు ఢీ.. బోథ్: మండలంలోని ధన్నూర్(బి) సమీపంలో శనివారం ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఓ ఆటో కూరగాయలతో ఉండగా, మరో ఆటోలో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన సుమను మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. -
శివ్వారంలో పైపులైన్ వేలంపై విచారణ
జైపూర్: మండలంలోని శివ్వారంలో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. గ్రామంలో గోదావరి నది నుంచి ప్రజలకు తాగునీటికోసం నిర్మించిన మిషన్ భగీరథ పైపులైన్‌ను అక్రమంగా సాగునీటికోసం వేలం వేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు శనివారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటేశ్వర్, డిప్యూటీ ఈఈ కిరణ్, ఎంపీడీవో సత్యనారాయణతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. మిషన్ భగీరథ పైపులైన్ పరిశీలించారు. ప్రజలకు తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన పైపులైన్‌ను సాగునీటికోసం వేలం పాట నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీపతి బాపురావు, ఏఈ రాజమల్లయ్య, సర్పంచ్ అంజన్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి సృజన, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


