దుబాయ్ నుంచి స్వదేశానికి తీసుకెళ్లండి
లక్ష్మణచాంద: మండల కేంద్రానికి చెందిన సంగెం రాజు(32) బతుకుదెరువు కోసం గతేడాది దుబాయ్ వెళ్లాడు. అక్కడ అజ్మన్ ప్రాంతంలోని ఓ కంపెనీలో పని కుదిరాడు. గత రెండునెలల క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. తనను ఇంటికి పంపించాలని కొన్ని రోజులుగా కంపెనీ వాళ్లకు మొరపెట్టుకున్నా కనికరించలేదు. ఈ విషయంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చొరవ చూ పాలని సోషల్ మీడియా వేదికగా విన్నవించాడు. తనను స్వదేశానికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కుటుంబ సభ్యులు.. రాజును స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, రాజుకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.


