పాలిటిక్స్‌కు బ్రాండ్‌నేమ్‌ | - | Sakshi
Sakshi News home page

పాలిటిక్స్‌కు బ్రాండ్‌నేమ్‌

Feb 1 2026 3:39 AM | Updated on Feb 1 2026 3:39 AM

పాలిట

పాలిటిక్స్‌కు బ్రాండ్‌నేమ్‌

● ఒకే కుటుంబంలో ముగ్గురు మున్సిపల్‌ చైర్మన్లు ● నిర్మల్‌లో అరుదైన ఘనత ● నాలుగోసారి మళ్లీ బరిలో..

నిర్మల్‌టౌన్‌: రాజకీయాల్లో ఒకతరం గెలవాలంటే ఎంతో కష్టపడాలి. అలా కష్టపడిన పదవి భరిస్తుందని గ్యారంటీ లేదు. అలాంటిది ఇప్పటివరకు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్లు పనిచేశారు. నిర్మల్‌ రాజకీయాల్లో ఇలాంటి అరుదైన ఘనత వారికే దక్కింది. తాతబాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన మనుమడు ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతూ..మున్సిపాలిటీ పరిపాలనలో కీలకపాత్ర పోషించారు. వేరువేరు కాలాల్లో చైర్మన్లుగా పనిచేస్తూ.. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజాసమస్యల పరిష్కారంలో తమదైన ముద్రవేశారు. ఒక్క కుటుంబానికి వరుసగా ప్రజలు అవకాశమివ్వడం, వారిపై నమ్మకానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

మొదటగా అప్పాల నర్సయ్య..

మొదటిగా అప్పాల నర్సయ్య 1981 నుంచి 1982 వరకు నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు. చేసిన రెండేళ్లలో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నిలకడమై పోరాడారు. మున్సిపాలిటీ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత 2006లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్‌ రావడంతో నర్సయ్య కుమారుడు అప్పాల మహేశ్‌ భార్య అనురాధ కౌన్సిలర్‌గా గెలిచి చైర్మన్‌ పదవిని అధిరోహించింది. ఐదేళ్లు పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టించారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యలు భూకబ్జాల నియంత్రణ వంటి సున్నిత అంశాల్లో వీరి నిర్ణయాలు ప్రశంసలు పొందాయి.

మూడోసారి అప్పాల గణేశ్‌ చక్రవర్తి

నర్సయ్య పెద్ద కుమారుడైన చక్రపాణి కొడుకు అప్పాల గణేశ్‌ చక్రవర్తి తాత బాటలో నిర్మల్‌పై పట్టు సాధించాడు. తాత వేసిన పునాదులపై నిలబడి రాజకీయ రంగ ప్రవేశం చేసి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకున్నారు. నిర్మల్‌ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. రాజకీయ బలం, క్యాడర్‌పై పట్టు పెంచుకున్నారు. ఈయన 2014 నుంచి 2019 వరకు నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు.

మళ్లీ ఈసారి బరిలో..

2026 మున్సిపల్‌ ఎన్నికల వేళ మున్సిపల్‌ చైర్మన్‌ (జనరల్‌ బీసీ మహిళ) రిజర్వేషన్‌ కావడంతో.. మరోసారి బరిలో దిగారు. మాజీ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి భార్య కావ్యను అధికార కాంగ్రెస్‌ నుంచి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ప్రత్యర్థులు ఎంత వ్యూహాలు రచించిన ఈ కుటుంబ రాజకీయ పట్టు చదరకపోవడం, మున్సిపాలిటీ రాజకీయాల్లో ఇప్పటికీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ కుటుంబ ప్రత్యేకత అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నిలకడైన పోరాటంతో మున్సిపాలిటీ పనుల్లో తనదైన ముద్రవేసింది. ఇలాంటి రాజకీయ వారసత్వం నిర్మల్‌ మున్సిపల్‌ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.

పాలిటిక్స్‌కు బ్రాండ్‌నేమ్‌1
1/3

పాలిటిక్స్‌కు బ్రాండ్‌నేమ్‌

పాలిటిక్స్‌కు బ్రాండ్‌నేమ్‌2
2/3

పాలిటిక్స్‌కు బ్రాండ్‌నేమ్‌

పాలిటిక్స్‌కు బ్రాండ్‌నేమ్‌3
3/3

పాలిటిక్స్‌కు బ్రాండ్‌నేమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement