‘తెలంగాణలో బీజేపీకి స్థానంలో లేదు’ | TPCC Chief Mahesh Kumar Goud Slams BRS And BJP | Sakshi
Sakshi News home page

‘తెలంగాణలో బీజేపీకి స్థానంలో లేదు’

Apr 3 2026 3:58 PM | Updated on Apr 3 2026 4:29 PM

TPCC Chief Mahesh Kumar Goud Slams BRS And BJP

మంచిర్యాల:  తెలంగాణాలో బీజేపీకి స్థానం లేదని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ ఆరోపించారు. ఎన్నికలొస్తే దేవుళ్ల పేరు చెప్పడం బీజేపీకి అలవాటని ఎద్దేవా చేశారు. ఇక బీఆర్‌ఎస్‌పై కూడా మహేష్‌ గౌడ్‌ విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌, హరీష్‌ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్నారు. కవిత వేరుకుంపటితో బీఆర్‌ఎస్‌ రోడ్డున పడిందన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్నారు. 

‘ బీఆర్‌ఎస్‌ పాలనలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కేసుల పాలయ్యారు.. లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ రోజు మేము పదవుల్లో ఉన్నామంటే అది కార్యకర్తల కష్టమే. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే. కేసీఆర్‌ శృతి లేని పాలన చేసిండు. వారి హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ. 6 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం . తెలంగాణాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సిట్లకు పైగా గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement