ఇసుక నుంచి తైలం తీశారు! | TGMDCL generates record revenue of Rs 1008 crore in FY 2025-26 | Sakshi
Sakshi News home page

ఇసుక నుంచి తైలం తీశారు!

Apr 3 2026 5:21 AM | Updated on Apr 3 2026 5:21 AM

TGMDCL generates record revenue of Rs 1008 crore in FY 2025-26

అమ్మకాలతో రూ.1008 కోట్లు..

రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ టీజీఎండీసీకి రికార్డు ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎండీసీ) ఇసుక విక్రయాల్లో చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ రూ.1008 కోట్ల ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంతో (2024–25) పోలిస్తే ఇది 36 శాతం వృద్ధి కావడం విశేషం.ఇసుక నిర్వహణలో పారదర్శకత, కఠినమైన అమలు చర్యలు, సాంకేతిక వినియోగం వంటి చర్యలు అధిక ఆదాయానికి ప్రధాన కారణాలుగా సంస్థ వెల్లడించింది.

జిల్లాల్లో ఇసుక తవ్వకాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ, అక్రమ రవాణా నియంత్రణకు బలమైన యంత్రాంగం ఏర్పాటు చేయడం వల్ల ఆదాయం పెరిగినట్లు టీజీఎండీసీ తెలిపింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థను సంవత్సరమంతా అందుబాటులో ఉంచి, వినియోగదారులకు సమాన అవకాశాలు కలి్పంచడం జరిగిందని టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement