నేడు డీసీసీ సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు డీసీసీ సమావేశం

Apr 3 2026 8:02 AM | Updated on Apr 3 2026 8:02 AM

రామకృష్ణాపూర్‌: క్యాతనపల్లిలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావద్‌, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు హాజ రుకానున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకా రంతోపాటు నియామకపు ఉత్వర్వులు అందజేస్తారు. ఎంఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి గురువారం పరిశీలించారు. శ్రీనివాసగార్డెన్స్‌ నుంచి మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తామని, సమావేశానికి పార్టీ జిల్లా కమిటీ బాధ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పీసీసీ సభ్యులు హాజరుకావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement