జై హనుమాన్‌ | - | Sakshi
Sakshi News home page

జై హనుమాన్‌

Apr 3 2026 8:02 AM | Updated on Apr 3 2026 8:02 AM

మంచిర్యాలఅర్బన్‌: జిల్లాలో హనుమాన్‌ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్‌ నామ స్మరణ మారుమోగింది. మంచిర్యాలలోని విశ్వనాథ స్వామి దేవస్థానంలోని ఆంజనేయ ఆలయంలో గణపతి పూజ, అభిషేకం, నివేదన, మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తమలపాకులతో హనుమాన్‌కు అభిషేకం చేశారు. గౌతమినగర్‌ కోదండ రామాలయం, గర్మిళ్ల భక్తాంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హమాలీవాడ, తిరుమలగిరి కాలనీలో జయంతి వేడుకలు జరిపారు. గౌతమినగర్‌ రాళ్లపేట్‌ రోడ్‌ నంబరు–1లో శివపంచాయతన ఆలయంలో అర్చకుడు శంశాక్‌శర్మ ఆధ్వర్యంలో మన్యుసూక్త సహిత ఆంజనేయ మూలమంత్ర హోమం జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement