భారతీయ అల్ట్రా-డిస్టెన్స్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుఫియా వంద గంటల్లోపూ కఠినమైన మనాలి-లేహ్ హై-ఆల్టిట్యూడ్ రన్‌ను పూర్తి చేసి గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇంతవరకు ఏ మహిళ సాధించిన ఘనత ఇది. హిమాలయాల్లో మొత్తం ఐదు ఎత్తైన పర్వత పాస్‌ల మీదుగా దాదాపు 470–480 కి.మీ. దూరం వేగవంతంగా రన్ చేసి రికార్డు సృష్టించింది. వంద గంటల లక్ష్యాన్ని తృటిలో అధిగమించి..కేవలం 98 గంటల 27 నిమిషాల్లో పరుగును పూర్తి చేసింది. ఈ మేరకు సూఫీ తాను సాధించిన ఘనతను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఇలా వివరించింది.
తాను ఈ రికార్డును 2023లో అధికారికంగా ఆమోదించారని, కానీ సర్టిఫికేట్ రావడానికి ఇంత సమయం పట్టిందని చెప్పుకొచ్చిది. ఐదు హై పాస్‌ల ద్వారా మనాలి నుంచి లేహ్ వరకు అత్యంత వేగవంతమైన పరుగు, హై-ఆల్టిట్యూడ్ ఎండ్యూరెన్స్ రన్నింగ్ ఛాలెంజ్… లక్ష్యం: 100 గంటలు. ఇక్కడ సూఫీ దాన్ని 98 గంటల 27 నిమిషాల్లో పూర్తి చేసింది. అయితే అధికారిక సర్టిఫికేట్ ఇండియన్ కస్టమ్స్ ద్వారా చేరుకోవడానికి చాలా సమయం తీసుకోవడం విశేషం.
ఈ పోస్ట్‌పై నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తాయి. సూఫీ సాధించిన విజయం నిజంగా ప్రశంసనీయం. తదుపరి ఛాలెంజ్ ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కూడా. కాగా సూఫీకి ప్రపంచ రికార్డులు కొత్తేమి కాదు. ఆమె గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగవంతంగా పరిగెత్తిన మహిళగా, అలాగే భారతదేశం అంతటా 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రన్‌ను తదితరాలను పూర్తిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులను నెలకొల్పొందామె. ఇవేగాక దేశంలో కఠినమైన భూభాగాల్లో అల్ట్రా-డిస్టెన్స్ రన్‌లను కూడా చేపట్టింది.
(చదవండి: తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్ ఫోన్ అయితేనేం..)


