తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్‌ ఫోన్‌ అయితేనేం.. | Man films daughters Republic day school performance on basic keypad phone | Sakshi
Sakshi News home page

తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్‌ ఫోన్‌ అయితేనేం..

Feb 1 2026 12:51 PM | Updated on Feb 1 2026 1:02 PM

Man films daughters Republic day school performance on basic keypad phone

ఎన్ని డబ్బులున్న కొనలేనివి చాలనే ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రేమ.. నోచుక్నుపిల్లలందరూ చాలా అదృష్టవంతులే. కంటిపాపలా కాచుకునే వాళ్లకు మించిన స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ కానరాదు. అలాంటి భావోద్వేగ సన్నివేశమే నెట్టింట వైరల్‌గా మారింది. అతడి వద్ద ఖరీదైన గాడ్జెట్‌ లేకపోతేనేం..తన కూతురి కళను పొందుపర్చుకోవాలన్న అతడి తాపత్రయం అందరి మనసులను గెలుచుకుంది. ఇది కథ తండ్రి ప్రేమ అనిపించేలా ఉంది ఆ ఘటన.

అందుకు సంబంధించిన వీడియోని జితేందర్‌ సారస్వత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. రిపబ్లిక్‌ డే వేడుకల నేపథ​ంయలో కూతురు పాఠశాలలో పలు ఈవెంట్లు నిర్వహించారు. అందులో భాగంగా ఒక డ్యాన్స్‌ కార్యక్రమంలో కూతురు అద్భుతంగా నృత్యం చేస్తోంది. అయితే ఆ తండ్రి తన కూతురు డ్యాన్స్‌ని ఓ చిన్న కీప్యాడ్‌ఫోన్‌లో రికార్డు చేసేందుకు అక్కడే ఉన్న చిన్నారుల జన సముహానికి వెనుకవైపు నిలబడి ప్రయత్నిస్తున్నాడు. 

ఆ ఫోన్‌ని చూసి ఎగతాళి చేస్తారేమోనన్న భయంతో జాగ్రత్తగా రికార్డు చేసుకుంటున్న తీరు అందరి హృదయాలను తాకింది. ఆ వీడియోకి జితేందర్‌ మా సోదరు అందరు హృదయాలను గెలుచుకున్నాడు. అతడు కొత్త ఫోన్‌ తీసుకోవాలంటారా..మా ఈ కొత్త రీల్‌ని చూసి చెప్పండి అంటూ పోస్ట్‌ చేశాడు. తల్లిదండ్రుల ప్రేమ ముందు ఖరీదైన గాడ్జెట్లతో పని ఏమందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తూ పోస్ట్‌ చేయడం విశేషం.

 

(చదవండి: హార్డ్‌వర్క్‌ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..! నెట్టింట వైరల్‌గా పోస్ట్‌)

 

Advertisement
 
Advertisement
Advertisement