లైఫ్‌లో ఒకానొక టైంలో కష్టపడకపోతే..మనల్ని ఎవ్వరు రక్షించలేరు అన్నది జగమెరిగిన సత్యం. మన పెద్దలు కూడా వయసులో ఉన్నప్పడు ఏదైనా సంపాదించగలం, ఆ తర్వాత మనతరం కాదు అని అంటుంటారు. అలాగే కష్టబడి డిగ్రీలు చదివి..ఉద్యోగం సంపాదించక హమ్మయ్యా అనేస్తాం. కానీ అక్కడి నుంచే మన అభివృద్ధి, ఎదుగుదల మొదలవ్వుతుంది. అలాకాకుండా..చతికిలపడితే అంతే పరిస్థితి అంటూ నెట్టింట షేర్ చేసిన పోస్ట్ అందర్నీ అమితంగా ఆకర్షించడమే గాక ఆలోచింపచేసేలా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
26 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ఉద్యోగి నందిని శర్మ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గొప్ప కెరీర్ పాఠాన్ని షేర్ చేశారు. టీనేజ్ చివరలో.. 20ల ప్రారంభంలో ఉన్నవారికి ఉపయోగపడే అధ్బుతమైన కెరీర్ సలహాలను ఇచ్చారామె. కార్పోరేట్ లైఫ్ వాస్తవికంగా ఎలా ఉంటుందనేది ఒక్క మాటలో చెప్పేశారామె. కెరీర్ ప్రారంభ సవంత్సరాల్లో అందరి దృష్టి డబ్బు పైనే ఫోకస్ ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా విజయపరంపరతో జాబ్‌లో దూసుకోవడం అనేది ఎప్పటికీ శక్తిమంతమైనదని నొక్కి చెప్పారు.
అది ఇరవైలలోనే సాధ్యమని అప్పుడే మంచిప్రయోజనం పొందగలమని అన్నారు. ఎందుకంటే అప్పటికీ ఎలాంటి కుటుంబ ఒత్తిళ్లు, బాధ్యతలు ఉండవు, పైగా వారివద్ద చాలా సమయం ఉంటుంది. అందువల్ల దాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యక్తిగత డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెడితే రానురాను కష్టం అనే మాటే ఉండదని అన్నారు. ఇలాంటి ధోరణితో ఉంటే గనుక రిస్క్ తీసుకునేందుకు భయపడరు, నైపుణ్యాలను అందిపుచ్చుకునే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
మనం ఫ్రీగా ఉన్న టైంలోనే కష్టపడేందుకు ఆసక్తి చూపాలి..అప్పుడే మన కెరీర్ ఉన్నతంగా ఉంటుంది..అలాగే ఈ కార్పొరేట్ లైఫ్‌లో మన మనుగడ సాధ్యమని నొక్కి చెప్పారామె. లేదంటే మనల్ని కాపాడే వారెవ్వరూ లేరు అని గుర్తించుకోండి అని అన్నారామె. తాను మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నప్పటికీ..తన కెరీర్, ఫిట్‌నెస్ లక్ష్యాలు, సాధించాల్సిన ఆశయాలను ఎప్పటికీ గుర్తించుకుంటానని అన్నారు.
అంతేగాదు తన విజయవంతమైన కెరీర్ జర్నీని డాక్యమెంట్ చేయాలని భావిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఐటీలో పనిచేస్తూ కెరీర్‌పై ఎన్నో కలలతో ఉన్నవాళ్లకు ఈ సందేశం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ తన పోస్ట్‌ని ముగించారు శర్మ. కష్టే ఫలి అంటే ఇదేగదూ.! అంతేగాదు నెటిజన్లు సైతం ఇది ముమ్మాటికీ నిజం. ఎవ్వరికీ మన సమస్యను పట్టించుకునేంత సమయం లేదు. అందరూ వారివారి సమస్యలతో వాళ్లు బిజీగా ఉన్నారని కొందరూ. మరికొందరూ డెవలప్‌మెంట్ అనేది ఉద్యోగ ఆఫర్‌తో ముగిసిపోదని అక్కడ నుంచే ప్రారంభమని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
I'm 26 and i work at @Microsoft .
if you're in your late teens or early 20s, here are a few things i wish someone told me earlier:
1. Hard work compound - espcially early.
People talk a lot about money compounding, but effort compounds too.
But Consistency changed…— Nandani S (@TheDebugDiva) January 28, 2026
(చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్‌వీఓ అంటే..?)


