పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్‌వీఓ అంటే..? | Imran Khan Underwent Procedure For Retinal Vein Occlusion | Sakshi
Sakshi News home page

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్‌వీఓ అంటే..?

Jan 30 2026 11:30 AM | Updated on Jan 30 2026 11:59 AM

Imran Khan Underwent Procedure For Retinal Vein Occlusion

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రమాదకరమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని, అందుకోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చికత్స తీసకుంటున్నట్లు స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. పైగా ఇమ్రాన్‌ ఎదుర్కొంటుంది ప్రమాదకరమైన కంటి వ్యాధి అని, సకాలంలో వైద్యం అందించకపోతే కంటి చూపే పోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. అసలు ఇమ్రాన్‌కు వచ్చిన తీవ్రమైన కంటి వ్యాధి ఏంటి..ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా..!.

రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌ని అక్కడ వైద్యులు పరీక్షించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖాన్‌కు రెటీనా సిర మూసివేత(రెటీనా నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే చిన్న సిరలు మూసివేత) ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలిందని అధికారులు తెలిపారు. ఆయన్ను ప్రభుత్వాస్పత్రికి తరలించి ఓ 20 నిమిషాల పాటు చికిత్స అందించి తిరిగి జైలుకు తరలించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించారు కూడా. ఇంతకీ అసలేంటి రెటీనా సిర మూసుకుపోవడం..

రెటీనా సిర మూసుకుపోవడం అంటే..
రెటీనా సిర మూసుకుపోవడం లేదా ఆవీఓ అనేది రెటీనా నుంచి రక్తాన్ని బయటకు పంపే సిరలో పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుపడటం. దీని వల్ల కంటి వెనుక భాగంలో ఉన్న కణజాల పొర, కాంతిని మనం చూడగలిగే చిత్రాలలోకి అనువదిస్తుంది.

రెటీనా సిరలో అడ్డంకి రెటీనా నుంచి రక్తం బయటకు రాకుండా నిరోధిస్తుంది.దాంతో కంటిలో ఒత్తిడి పెరిగి వాపు వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఫలితం దృష్టి సమస్యలు లేదా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. రోగి కంటి పరిస్థితి దృష్ట్యా ఇంజెక్షన్ల ద్వారా చికిత్స నుంచి శస్త్రచికిత్స వరకు ఏదైనా చేయాల్సి ఉంటుంది. అదంతా రోగి కంటి సమస్యపై ఆధారపడి ఉంటుందట. 

ఈ పరిస్థితి ఎందువల్ల అంటే..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన అధ్యయనాలు ప్రకారం..ఈ పరిస్థితి రెటీనా సిర ద్వారా సాధారణ రక్త ప్రవాహానికి అంతరాయం వల్ల సంభవిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కారణాలు..

  • రక్తం గడ్డకట్టడం

  • రక్త ప్రవాహం మందగించడం

  • రెటీనా సిర, రెటీనా ధమనితో కలిసే చోట కుంచించుకుపోవడం.

  • ఇది ఎక్కువగా 40 ఏళ్లు పైబడిన యువకులలో, ముఖ్యంగా డయాబెటిస్, గ్లాకోమా లేదా అధిక రక్తపోటు వంటి కొన్ని వైద్య పరిస్థితులు ఉంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువ.

రెటీనా సిర మూసుకుపోవడంలో సంకేతాలు, లక్షణాలు

  • అస్పష్టమైన దృష్టి లేదా దృష్టి నష్టం

  • నల్ల మచ్చలు లేదా గీతలు

  • కంటిలో నొప్పి, ఒత్తిడి

ఎలా నిర్ధారిస్తారు..
కంటి సంరక్షణ నిపుణులు కంటి పరీక్ష, రెటీనా ఇమేజింగ్ పరీక్షల ద్వారా  కనుపాపలను విస్తరించి ఆవీఓని నిర్ధారిస్తారు. 

చికిత్స..
రెటీనా సిరలో అడ్డంకిని తిప్పికొట్టడానికి లేదా నయం చేయడానికి ప్రస్తుతం ఎటువంటి మార్గం లేదు. కానీ కంటి సంరక్షణ నిపుణులు యాంటీ-VEGF ఇంజెక్షన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్యాన్రెటినల్ ఫోటోకోగ్యులేషన్‌తో రెటీనా సిర మూసుకుపోవడం వల్ల కలిగే సమస్యలను నివారించవచ్చు లేదా చికిత్స చేయవచ్చు.

రెటీనా సిర మూసుకుపోయే ప్రమాదాన్ని నివారించడానికి మొదటి సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం. ఈ సమస్య బారినపడకూడదంటే..ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడం వంటివి చేయాలి. అలాగే ధూమపానం, పొగాకు వంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి..  

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులును సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: అడవి బిడ్డలే ఆరాధ్య దైవాలై..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement