బ్లేడ్‌తో గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

బ్లేడ్‌తో గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Feb 1 2026 3:39 AM | Updated on Feb 1 2026 3:39 AM

బ్లేడ్‌తో గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

బ్లేడ్‌తో గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఇంద్రవెల్లి: బ్లేడ్‌తో గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఏమాయికుంట పంచాయతీ పరిధి రమాయినగర్‌కు చెందిన రాందాస్‌ కూలీ పనిచేసుకుని జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. కూలీ పనిచేసి వచ్చిన డబ్బులతో మద్యం తాగేవాడు. శుక్రవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. శనివారం మళ్లీ మద్యం తాగి క్షణికావేశంలో బ్లేడ్‌తో గొంతుకోసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే అంబులెన్స్‌ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైలెట్‌ రాజేష్‌, ఈఎంటీ రాందాస్‌ అతనికి ప్రాథమిక చికిత్స అందించి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement