‘జీవన్‌దాన్’ సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: కిడ్నీ బాధితులు జీవన్‌దాన్‌ను సద్వినియోగం చేసుకోవాలని నిమ్స్ అడిషనల్ ప్రొఫెసర్ డా.రాజాకార్తీక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని రిమ్స్‌లో డయాలసిస్ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. కిడ్నీ చెడిపోయినవారు జీవన్‌దాన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వారికి మరో కిడ్నీ ని అమర్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కుటుంబంలో ఎవరైన కిడ్నీ దానానికి ముందుకు వస్తే కూడా అమర్చుకోవచ్చన్నారు. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేసుకోవాలన్నారు. నీటిని తక్కువగా తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయన వెంట డా.శశాంక్, కిషన్, డయాలసిస్ విభాగం ఇన్‌చార్జి ప్రేందాస్ ఉన్నారు.


