బీ ఫారంతోనే గుర్తుంపు..! | - | Sakshi
Sakshi News home page

బీ ఫారంతోనే గుర్తుంపు..!

Feb 1 2026 3:39 AM | Updated on Feb 1 2026 3:39 AM

బీ ఫా

బీ ఫారంతోనే గుర్తుంపు..!

● గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ ఎంపిక చేసిన వారికి బీ ఫారం అందజేస్తారు. ● నామినేషన్‌ సమర్పించే సమయంలో అభ్యర్థులు రాజకీయ పార్టీలు ఇచ్చిన బీ ఫారాన్ని దాఖలు చేస్తే వారికి ఆయా పార్టీల గుర్తులు కేటాయిస్తారు. నామినేషన్‌ సమయంలో బీ ఫారం లేకపోయినా, అందులో పార్టీ పేరు రాసి, నామినేషన్‌ ఉపసంహరణ సమయంలోగా బీ ఫారం ఇచ్చినా పార్టీ అభ్యర్థిగా గుర్తిస్తారు. ● బీ ఫారాన్ని పార్టీ అధ్యక్షుడు లేదా పరిశీలకుడు అభ్యర్థికి అందజేస్తారు. ● ఏ ఫారం కలిగి ఉండి పోటీ చేసే అ భ్యర్థులకు బీ ఫారం ఇచ్చే పూర్తి అధికా రాలు ఉంటాయి. బీ ఫారం ఇచ్చే ముందు పార్టీ అధ్యక్షుడు ఆమోదిస్తూ ప్రతిపాదించిన వ్యక్తి తన పేరుపై అందజేసిన ఏ ఫారాన్ని ఆయా ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంటుంది. ● బీ ఫారం లేకుండానూ పోటీ చేయవచ్చు. వారిని స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తిస్తారు. ఎన్నికల సంఘం నిర్ధారించిన గుర్తులను కేటాయిస్తారు.

అందరి నోటా ఇదే మాట ఎన్నికల్లో పార్టీ గుర్తు కావాలంటే కావాల్సిందే పార్టీ అధ్యక్షులకే జారీ అధికారం లేదంటే స్వతంత్ర అభ్యర్థి కిందే లెక్క.. ఫిబ్రవరి 3లోపు సమర్పిస్తే పార్టీ గుర్తు

మంచిర్యాలటౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఇటు అభ్యర్థులు.. అటు రాజకీయ పార్టీల నాయకుల అందరి నోటా వినిపిస్తున్న మాట ఒక్కటే.. బీ ఫారం. బల్ది యాల్లో పోటీకి ఆశావహులు వివిధ రాజకీయ పా ర్టీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఒ కే పార్టీ నుంచి వార్డు, డివిజన్లలో పోటీకి పార్టీ అభ్యర్థిత్వం తమకే వస్తుందనే ధీమాతో ఇద్దరు కంటే ఎక్కువమంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌, మున్సిపాల్టీల్లో పలు పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు. మరికొన్ని పార్టీలు ఖరారు చేయాల్సి ఉంది. కానీ అభ్యర్థుల చేతికి ఇంకా బీ ఫారం అందలే దు.శనివారం నామినేషన్లను అధికారులు పరిశీలించారు.తిరస్కరణ, ఉపసంహరణకు ఈనెల 3న మ ధ్యాహ్నం 3గంటలవరకు సమయం ఉంది. ఆలో పు బీఫారం అందజేసిన వారినే ఆయా పార్టీల అ భ్యర్థులుగా పరిగణిస్తూ బరిలో ఉన్నవారి జాబి తా ను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. బీ ఫారం ఇ వ్వనివారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు.

ఎవరు జారీ చేస్తారు..

పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు బీ ఫారం పొంది పోటీ చేయాల్సి ఉంటుంది.సర్పంచ్‌ మినహా, స్థానికసంస్థలు, మున్సి పాలిటీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి. బీ ఫారం లేకుండా పోటీచేస్తే ఎన్నికల అధికారులు వారిని స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తిస్తారు. వీరు కా కుండా పార్టీ పరిశీలకులుగా ఉన్న వారికి ‘ఏ’ ఫా రం ఇస్తారు. వారు కూడా బీ ఫారం ఇచ్చేందుకు అర్హులు. బీ ఫారాల కోసం పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉండాలనుకునే ఆశవాహులు బీఫారం పొందేందుకు నానా తంటాలు పడుతుంటారు. పార్టీ అధినేతలు నామినేషన్ల చివరి ఘట్టం వరకు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంటుంది. గెలుపు గుర్రాల కోసం పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి చివరికి బీ ఫారం అందజేస్తారు.

బీ ఫారంతోనే గుర్తుంపు..!1
1/1

బీ ఫారంతోనే గుర్తుంపు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement