అమెరికానుపట్టికుదపిన లైంగిక నేరాల కోసేలో దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కుంభకోణానికి సంబంధించిన తాజా ఫైల్స్‌లో అనేక ప్రముఖుల పేర్లు ఉండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎప్‌స్టీన్ ఫైల్స్ పేరుతో 2,000 వీడియోలు, 1,80,000 చిత్రాలతో సహా 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను ఆమెరికా న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో టెస్లా అధినేత మస్క్‌పై తాజా ఆరోపణలతోపాటు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌పై సంచలన ఆరోపణలతో పాటు, న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరును కూడా చేర్చడం గమనార్హం.
బిల్ గైట్స్‌పై ఆరోపణలు
బిల్ గేట్స్ రష్యన్ మహిళలతో శారీరంగా సంబంధాలను కలిగి ఉన్నాడని, దీంతో లైంగికంగా సంక్రమించే వ్యాధి(ఎస్‌టీడీ) బారిన పడ్డాడని పేర్కొంది. ఆ తర్వాత తన భార్య మెలిండా గేట్స్‌కు రహస్యంగా ఇవ్వడానికి యాంటీబయాటిక్స్ కోరాడని ఆరోపించింది. ఈ వివాదానికి కేంద్రంగా ఉన్న ఈమెయిల్స్ 2013, జూలై 18 నాటివి. ఎప్‌స్టీన్ డ్రాఫ్ట్ సందేశాలుగా కనిపిస్తున్నాయి. కొన్ని గేట్స్ అప్పటి సలహాదారు బోరిస్ నికోలిక్ గొంతులో ఉన్నాయి. వాటిలో, గేట్స్ "రష్యన్ అమ్మాయిలతో" నిద్రపోతున్నాడని, లైంగిక సంక్రమణ వ్యాధి బారిన పడ్డాడని, దీంతో మెలిండా గేట్స్‌కు "రహస్యంగా" ఇవ్వగల యాంటీబయాటిక్స్ కోసం అడుగుతున్నాడని ఎప్‌స్టీన్ ఆరోపించాడు. దీనికి సంబంధించిన ఈమెయిల్స్‌ను డిలీట్ చేయమని గేట్స్ కోరాడని ఎప్‌స్టీన్ కోరాడని కూడా ఈ మెయిల్స్ సారాంశం.
ఇదీ చదవండి: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మస్క్ తాజా ఈమెయిల్స్ కలకలం
తీవ్రంగా ఖండించిన బిల్‌గేట్స్
ఈ ఆరోపణలపై గేట్స్ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా వాస్తవ దూరమైనవి, అసంబద్ధ మైనవి అని గేట్స్ ప్రతినిధి డైలీ మెయిల్‌తో అన్నారు. ఈ ఆరోపణలు ఎప్‌స్టీన్ ఫ్రస్ట్రేషన్‌కు నిరాశకు తార్కాణమని, అతని ఉచ్చులో చిక్కుకోవడానికి ,పరువు తీయడానికి ఎంత దూరం వెళ్లాడని ఆరోపించారు.
జోహ్రాన్ మమ్దానీ తల్లి
మరోవైపు ఈ ఆరోపణలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి చిత్రనిర్మాత మీరా నాయర్ కూడా చేర్చారు. 2009 అక్టోబర్ 21 న ప్రచారకర్త పెగ్గీ సీగల్ జెఫ్రీ ఎప్స్టీన్‌కు పంపిన ఇమెయిల్, దర్శకుడు మీరా నాయర్ తన సినిమా ఆఫ్టర్ పార్టీలో ఉన్నారని వెల్లడించింది. లైంగిక అక్రమ రవాణాదారు,దోషిగా తేలిన గిస్లైన్ మాక్స్‌వెల్ ఇంట్లో జరిగిన 2009 నాటి మూవీ "అమేలియా" ఆఫ్టర్ పార్టీకి హాజరైయ్యారని ఆరోపించింది.ఈ పార్టీకి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ , అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా హాజరయ్యారని పేర్కొంది.
ఇదీ చదవండి: డాక్టర్ కల చెదిరి, యూట్యూబర్‌గా మారి..కట్ చేస్తే!


