breaking news
Mira Nair
-
న్యూయార్క్ మేయర్ రేసులో మీరా నాయర్ కుమారుడు
ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, ఇండియన్–అమెరికన్ రాజకీయ నాయకుడు జోహ్రాన్ క్వామి మమ్దానీ అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ పడుతున్నాడు. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్ ‘మీరాబాయి ఫిలిమ్స్’బ్యానర్ కింద పలు చిత్రాలు నిర్మిండడంతోపాట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కామసూత్ర, మాన్సూన్ వెడ్డింగ్, సలామ్ బాంబే వంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీ సభ్యుడైనా ఆమె కుమారుడు మమ్దానీ ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. ఈ పదవికి మాజీ గవర్నర్ ఆండ్రూ కౌమో పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయనకు మమ్దానీ గట్టి పోటీనిస్తున్నాడు. నిధుల సేకరణ, నూతన ఆలోచనలు, ఆశయాలతోపాటు టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ జనాదరణ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఆండ్రూ కౌమోను ఓడించడం ఖాయమని ధీమాగా చెబుతున్నాడు. ఒకవేళ మమ్దానీ అనుకున్న లక్ష్యం సాధిస్తే.. న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఎవరీ మమ్దానీ? జోహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ, తల్లి మీరా నాయర్. మహమూద్ మమ్దానీ ఉగాండాతో ప్రముఖ మార్క్సిస్ట్ పండితుడు. జోహ్రాన్‌కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్‌టౌన్‌కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్‌తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించేవాడు. స్థానికంగా రాజకీయ, సేవ కార్యక్రమాల్లో వాలంటరీగా సేవలందించేవాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. క్వీన్స్ 36వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టసభల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 20 బిల్లును ప్రతిపాదించగా, అందులో మూడు బిల్లులు చట్టాలుగా మారాయి. న్యూయార్క్ మేయర్ రేసులో 2024 అక్టోబర్ 23న అడుగుపెట్టాడు. జోహ్రాన్ మమ్దానీలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. 2019లో ‘నానీ’పేరిట ఒక మ్యూజిక్ వీడియో విడుదల చేశాడు. షియా ముస్లిం మతస్థుడైన మమ్దానీ ఇటీవలే రమా దువాజీని వివాహం చేసుకున్నాడు. ఆమె సిరియాలో జన్మించారు. పలు పత్రికల్లో చిత్రకారిణిగా పనిచేశారు. మమ్దానీ దంపతులు క్వీన్స్‌లోని అస్టోరియాలో నివాసం ఉంటున్నారు. పాలస్తీనాకు మద్దతు మమ్దానీ ఎన్నికల అజెండా ప్రజలను ఆకట్టుకుంటోంది. నగరంలో అద్దెలపై ఫ్రీజింగ్ విధిస్తానని, రవాణా, శిశు సంరక్షణ సేవలు ఉచితంగా అందిస్తానని, కనీస వేతనాన్ని 30 డాలర్లకు పెంచుతానని మమ్దామీ హామీ ఇస్తున్నారు. ఇక ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదంలో మమ్దానీ పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నాడు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాల వివక్షకు ఆయన బద్ధవ్యతిరేకి. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను మమ్దానీ నిశితంగా విమర్శిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో తన దక్షిణాసియా మూలాలను పదేపదే గుర్తుచేస్తున్నాడు. హిందీ భాషలో ఒక వీడియో విడుదల చేశాడు. ఇందులో బాలీవుడ్ సినిమాలు, డైలాగ్‌ల ప్రస్తావన ఉంది. బిలియనీర్స్ కే పాస్ ఆల్రెడీ సబ్ కుచ్ హై, అబ్ ఆప్కా టైమ్ ఆయేగా(ధనవంతులకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ వంతు వస్తుంది) అని ఓటర్లకు చెబుతున్నాడు. ఈ నెల 24న మేయర్ ఎన్నిక జరుగనుంది. ర్యాంక్డ్–చాయిస్ వోటింగ్ సిస్టమ్ ద్వారా మేయర్‌ను ఎన్నుకుంటున్నారు. అంటే ఓటర్లు తమ ప్రాధాన్యత ప్రకారం ఐదుగురు అభ్యర్థులకు ర్యాంకులు ఇస్తారు. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థికి మేయర్ పదవి లభిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆమె కంటే నేనేం తక్కువ? నిలదీసిన హీరోయిన్
ఫలానా హీరోతో పని చేయాలని దర్శకనిర్మాతలు కలలు కన్నట్లే ఫలానా ఫిలిం మేకర్స్‌తో పని చేస్తే బాగుండని హీరో హీరోయిన్లు కూడా అనుకుంటారు. అదే విధంగా దర్శకనిర్మాత మీరా నాయర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని తహతహలాడింది సీనియర్ కథానాయిక షబానా అజ్మీ. కానీ ఆమె కోరిక నెరవేరనేలేదు.రేఖ, షబానా అజ్మీమీరా డైరెక్ట్ చేసిన 'ద రెలక్టెంట్ ఫండమెంటలిస్ట్'(2012) అనే సినిమాలో కేవలం చిన్న పాత్ర వరించింది. ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తుందనుకుంటే ఏదో చిన్న పాత్ర ఆఫర్ చేసిందని బాధపడింది. దర్శకురాలికి తన మీద నమ్మకమే లేదని విచారం వ్యక్తం చేసింది. ఈ విషయాలను మీరా నాయర్ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. దర్శకనిర్మాత మీరా నాయర్ఆమె మాట్లాడుతూ.. 'ముంబై జుహులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో వాష్‌రూమ్‌కు వెళ్తుంటే షబానా నా వెంటే వచ్చింది. నా కంటే రేఖ గొప్పగా చేసిందేముంది? అంటూ రెస్ట్ రూమ్‌లోనే గొడవపెట్టుకుంది. ఎందుకు నాకు పెద్ద రోల్ ఇవ్వవని నిలదీసింది. నిజంగానే ద రెలక్టెంట్.. సినిమాలో షబానాకు ఇచ్చిన పాత్ర చాలా చిన్నది.. మరో ప్రాజెక్ట్‌కు తప్పకుండా కలిసి పని చేద్దామని నచ్చజెప్తేగానీ ఊరుకోలేదు' అని మీరా నాయర్ పేర్కొంది. కాగా మీరా.. రేఖతో కలిసి కామసూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్ (1996) అనే సినిమా చేసింది. 2012 తర్వాత ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన ఆమె అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో షబానాతో సినిమా చేస్తానన్న హామీ కూడా అటకెక్కింది.చదవండి: అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్ -
ఆయన బతికే ఉంటారు: మీరా నాయర్
‘‘ఇర్ఫాన్ ఖాన్ ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారు. స్నేహం, ప్రేమ రూపంలో బతికే ఉంటారు. వీధి బాలల ఆలోచనల్లో ఆయన ఉంటారు. కాబట్టి ఆయనను గతం అని సంబోధించలేను’’ అంటూ దర్శకురాలు మీరా నాయర్ ఇర్ఫాన్ ఖాన్ గురించి ఉద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో హోం టూ హోం ఫండరైజర్ కార్యక్రమం.. ‘‘ఐ ఫర్ ఇండియా’’ ఫేస్బుక్ లైవ్‌లో ఆదివారం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా... ఇర్ఫాన్ ఖాన్‌కు నివాళులు అర్పించారు. విలక్షణ నటుడిగా పేరొందిన ఇర్ఫాన్ తొలి సినిమా సలాం బాంబేకు మీరా నాయర్ దర్శకురాలన్న సంగతి తెలిసిందే.(దేశ ప్రతిష్టను పెంచిన నటుడు.. పోరాడి ఓడిపోయాడు) ఈ క్రమంలో కెరీర్ తొలినాళ్ల నుంచే అతడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే వాడని మీరా తెలిపారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఇర్ఫాన్ ఇప్పుడు ఈ లోకాన్ని వీడినా.. అతడి స్ఫూర్తితో నటులు ముందుకు సాగాలన్నారు. ‘‘ఉపఖండంలో ఎంతో మంది నటులపై నీ ప్రభావం ఉంది. నిన్ను చూసి ఈ రంగంలోకి అడుగుపెట్టిన వారిలో నీ స్ఫూర్తి రగిల్చిన జ్వాల ఆరిపోలేదు. సినీ పరిశ్రమకు నువ్వు చేసిన సేవ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అని నీకు తెలుసు. నువ్విచ్చిన వారసత్వాన్ని ఇక్కడున్న వాళ్లు కొనసాగిస్తారు. నిన్ను చాలా మిస్సవుతున్నాం’’ అని మీరా నాయర్ ఇర్ఫాన్ ఖాన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. కాగా కొంతకాలంగా కాన్సర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ గత బుధవారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం విదితమే.(ఇర్ఫాన్ భార్య సుతప భావోద్వేగ పోస్టు) -
నిర్మాతగా ఇర్ఫాన్‌ఖాన్...
నటుడిగా 2015లో అందరి కంటే ఎక్కువ మార్కులు కొట్టేసిన ఇర్ఫాన్‌ఖాన్ ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తున్నాడు. నిర్మాతగా మారి తన అభిరుచి చాటుకోనున్నాడు. ఎవరితోనో తెలుసా? ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్‌తో కలిసి. మీరా నాయర్ తన మేనల్లుడు ఇషాన్ నాయర్ దర్శకుడిగా ఒక సినిమా తీయనుంది. ఈ కథ ఇర్ఫాన్‌ఖాన్‌కు నచ్చింది. తాను కూడా సహ నిర్మాతగా మారి భాగం పంచుకుంటున్నాడు. ‘నేను నిర్మించే సినిమా తాజా కథతో ఉండాలనుకున్నాను. ఈ కథ అలాంటిదే’ అన్నాడతను. సినిమా పేరు ‘కాష్’ (బహుశా). ఇందులో ‘దేవ్ డి’, ‘జిందగీ న మిలేగీ దొబారా’ ఫేమ్ కల్కి ముఖ్యపాత్ర పోషిస్తోంది. ‘నిర్మాతగా నేను డబ్బు లెక్కలు చూసుకోకపోయినా సృజనాత్మక విషయాల్లో మంచి సలహాలు ఇవ్వగలను’ అంటున్నాడు ఇర్ఫాన్. ‘పికు’, ‘జురాసిక్ వరల్డ్’ వంటి సినిమాలతో ఇర్ఫాన్ అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఎంతగా అంటే ఇతడు జపనీస్‌లో ఒక టెలివిజన్ షో కూడా చేయబోతున్నాడు. ఎక్కడ తను పుట్టిన రాజస్తాన్‌లో ఎడారి ప్రాంతం. ఎక్కడ జపాన్! ప్రతిభను ఎవరూ ఆపలేరు అనడానికి ఇదే ఉదాహరణ. బాలీవుడ్ బాత్ -
అక్టోబర్ 15న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: విక్టర్ బెనర్జీ (యాక్టర్), మీరా నాయర్ (దర్శక-నిర్మాత), ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. పుట్టిన తేదీ 15. ఇది కూడా శుక్ర సంఖ్యే కాబట్టి సృజనాత్మకత, కళాత్మక హృదయం కలిగి ఉంటారు. చక్కటి రూపం, శారీరక సౌష్టవం కలిగి ఉంటారు. అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి సంపన్న జీవితం గడుపుతారు. సంవత్సరమంతా ఉత్సాహకరంగా, ప్రోత్సాహవ ంతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం ఉండవచ్చు. కొత్త వాహనాలు కొంటారు. విలువైన వస్త్రాభరణాలకి ఖర్చు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో పడతారు. సంఘంలో గౌరవం, ఆర్థిక ఉన్నతి, రాజకీయాలలో ఉన్న వారికి పదవీప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకిది మంచి సమయం. వారు కోరుకున్న కోర్సులలో, కోరుకున్న విద్యాసంస్థలలో సీటు లభిస్తుంది. ఆగిపోయిన చదువును తిరిగి కొనసాగిస్తారు. పోటీపరీక్ష లలో విజయం, మంచి ఉద్యోగం సాధిస్తారు. అలంకారాలు, ఇంటీరియర్ డెకరేషన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. పాతవస్తువులను మార్చి, కొత్తవి కొంటారు. లక్కీ నంబర్స్: 1,2,3,5, 6; లక్కీ కలర్స్: వైట్, ఎల్లో, రెడ్, ఆరెంజ్. లక్కీ డేస్: బుధ, గురు, శుక్రవారాలు. సూచనలు: శుక్రజపం చేయించుకోవడం, లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం. మద్యపానానికి దూరంగా ఉండటం, ఖర్చులను అదుపులో పెట్టుకోవడం, పేద అవివాహిత కన్యల పెళ్లికి తగిన సాయం చేయడం, మూగ జీవాలకు ఆహారం పెట్టడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
ప్రశంసలు ఇచ్చే కిక్కే వేరబ్బా!
లైఫ్‌బుక్: అదితీరావ్ హైదరి చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ ఒక విషయం చెప్పేవారు... ‘‘మిమ్మల్ని ఎవరైనా ప్రశంసిస్తే...వాటిని జాగ్రత్తగా మనసులో దాచుకోండి. మీలో ఎప్పుడైనా ఉత్సాహం తగ్గినప్పుడు వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎంతో శక్తి వచ్చినట్లుంటుంది’’ అని. ఈ సూత్రాన్ని నేను ఇప్పటికీ అనుసరిస్తుంటాను. అమితాబ్, మీరా నాయర్, అనురాగ్ కశ్యప్...మొదలైన వారు మెచ్చుకున్న సందర్భాలను తరచుగా గుర్తు తెచ్చుకుంటాను. యౌవనం అంటేనే పెద్ద అలంకరణ. మళ్లీ ప్రత్యేకంగా అలంకరించుకోవడం ఎందుకనేది నా భావన. వీలైనంత ఎక్కువగా మేకప్‌కు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉంటే అందంగా కనిపిస్తాం. నేను నటించిన సినిమాలు నాకు ఒక విషయాన్ని చెప్పాయి. ‘‘స్వేచ్ఛగా జీవించు. గౌరవంగా జీవించు’’ అని. అలా అని విశృంఖలమైన స్వేచ్ఛను ఇష్టపడను. గౌరవంగా జీవించగలిగే స్వేచ్ఛను ఇష్టపడతాను. సిఫారసులతో మంచి పాత్రలు వస్తాయని నేను అనుకోను. మనలో నటించే సత్తా ఉంటే ఎలాంటి సిఫారసులూ అక్కర్లేదు. అయితే విధి కూడా మన విషయంలో కాస్త చల్లని చూపు చూడాలి. ‘నేను ఇలా ఉండాలనుకుంటున్నాను’ అని కొన్ని నియమాలు పెట్టుకున్నాను. కొన్ని సందర్భాలలో వాటి వల్ల కెరీర్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా పట్టించుకోను. మనసుకు నచ్చని పని చేయను. శక్తిసామర్థ్యాలు ఎక్కడి నుంచో రావు. మన ఇష్టం నుంచే వస్తాయి. మనకు ఒక పని మీద ఇష్టం ఉంటే, శక్తిసామర్థ్యాలు వాటంతట అవే బయటపడతాయి. ఇష్టం లేక పోతే ఉన్నవి కూడా వెనక్కి పోతాయి.