అక్టోబర్ 15న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On October 15, a birthday celebration Celebrities | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 15న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Oct 15 2015 12:06 AM | Updated on Sep 3 2017 10:57 AM

అక్టోబర్  15న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

అక్టోబర్ 15న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
విక్టర్ బెనర్జీ (యాక్టర్), మీరా నాయర్ (దర్శక-నిర్మాత),

 
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. పుట్టిన తేదీ 15. ఇది కూడా శుక్ర సంఖ్యే కాబట్టి సృజనాత్మకత, కళాత్మక హృదయం కలిగి ఉంటారు. చక్కటి రూపం, శారీరక సౌష్టవం కలిగి ఉంటారు. అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి సంపన్న జీవితం గడుపుతారు. సంవత్సరమంతా ఉత్సాహకరంగా, ప్రోత్సాహవ ంతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం ఉండవచ్చు. కొత్త వాహనాలు కొంటారు. విలువైన వస్త్రాభరణాలకి ఖర్చు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో పడతారు. సంఘంలో గౌరవం, ఆర్థిక ఉన్నతి, రాజకీయాలలో ఉన్న వారికి పదవీప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకిది మంచి సమయం. వారు కోరుకున్న కోర్సులలో, కోరుకున్న విద్యాసంస్థలలో సీటు లభిస్తుంది. ఆగిపోయిన చదువును తిరిగి కొనసాగిస్తారు. పోటీపరీక్ష లలో విజయం, మంచి ఉద్యోగం సాధిస్తారు. అలంకారాలు, ఇంటీరియర్ డెకరేషన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. పాతవస్తువులను మార్చి, కొత్తవి కొంటారు.

లక్కీ నంబర్స్: 1,2,3,5, 6; లక్కీ కలర్స్: వైట్, ఎల్లో, రెడ్, ఆరెంజ్. లక్కీ డేస్: బుధ, గురు, శుక్రవారాలు. సూచనలు: శుక్రజపం చేయించుకోవడం, లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం. మద్యపానానికి దూరంగా ఉండటం, ఖర్చులను అదుపులో పెట్టుకోవడం, పేద అవివాహిత కన్యల పెళ్లికి తగిన సాయం చేయడం, మూగ జీవాలకు ఆహారం పెట్టడం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్
 
 

Advertisement
 
Advertisement
Advertisement