మాజీ ఎమ్మెల్యే బర్త్‌ డే వేడుకలో బన్నీ ఫ్యామిలీ సందడి | Icon Star Allu Arjun Family attended nandyal Ex YSRCP MLA birthday | Sakshi
Sakshi News home page

Allu Arjun Family: మాజీ ఎమ్మెల్యే బర్త్‌ డే వేడుకలో బన్నీ ఫ్యామిలీ

Oct 26 2026 4:31 PM | Updated on Oct 26 2026 4:36 PM

Icon Star Allu Arjun Family attended nandyal Ex YSRCP MLA birthday

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యామిలీ బర్త్‌ డే వేడుకలో సందడి చేశారు. నంద్యాల వైకాపా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. అల్లు అర్జున్‌ భార్య స్నేహరెడ్డితో పాటు పిల్లలు అయాన్, అర్హ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర కిశోర్ రెడ్డి.. అల్లు అర్హతో కేక్ కట్ చేయించారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా.. బన్నీ.. రవిచంద్ర కిశోర్ రెడ్డి మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో రవి తరఫున ‍అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు నుంచే వీరిద్దరి కుటుంబాలకు మంచి సంబంధాలు ఉన్నాయి. తాజాగా రవిచంద్ర కిశోర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో బన్నీ ఫ్యామిలీ సందడి చేసింది.

b

ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాకా మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement