వివాదంలో 'ఫౌజీ'.. బోస్ మనవడి 'క్షమాపణ' డిమాండ్ | Fauzi Movie Issue And Subhash Chandra Bose Grand Nephew Demand Apology | Sakshi
Sakshi News home page

Fauzi Movie Controversy: చిక్కుల్లో ప్రభాస్ సినిమా.. అసలేమైంది?

Oct 26 2026 1:21 PM | Updated on Oct 26 2026 1:38 PM

Fauzi Movie Issue And Subhash Chandra Bose Grand Nephew Demand Apology

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఫౌజీ'. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమా నుంచి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేశారు. అభిమానులకు ఇది నచ్చేయగా.. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రని వక్రీకరించిన దర్శకుడు.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

(ఇదీ చదవండి: 'ఫౌజీ'లో సుభాష్‌ చంద్రబోస్ పాత్ర చేసింది ఎవరంటే?)

'నాకు తెలిసి 'ఫౌజీ' దర్శకుడు.. సుభాష్ చంద్రబోస్ పరిచయాన్ని సెన్సేషనల్ చేయాలనుకుని వివాదాన్ని రేపాడు. బోస్.. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. హిట్లర్‌తో మాట్లాడినప్పుడు ఆయనపై కమాండ్ చేసిన విధానాన్ని సినిమాలో చూపించలేదు. ఇది బోస్‌ని అవమానించడం లాంటిదే. అందుకే దర్శకుడు.. భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. అలానే సినిమాల్లో సుభాష్ చంద్రబోస్.. హిట్లర్‌తో సమంగా మాట్లాడినట్లు సీన్స్ మార్చాలి' అని చంద్రకుమార్ బోస్ డిమాండ్ చేశారు.

చరిత్రని వక్రీకరించి, నేతాజీ గౌరవాన్ని తగ్గించేలా చిత్రీకరించడం సరికాదని చంద్రకుమార్ బోస్ అన్నారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రను తెరకెక్కించేటప్పుడు వాస్తవాలను వక్రీకరించకూడదని పేర్కొన్నారు. నేతాజీ ఫాసిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని, ప్రజాస్వామ్య హక్కులను విశ్వసించారని చెప్పారు. మరోవైపు టీజర్‌లో నేతాజీ పాత్రని ఉపయోగించి హీరో పాత్రకు ఎలివేషన్ ఇవ్వడంపైనా సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement