'ఫౌజీ'లో సుభాస్ చంద్రబోస్ పాత్ర చేసింది ఎవరంటే? | Fauzi Subhash Chandra Bose Actor Details | Sakshi
Sakshi News home page

Fauzi Subash Chandra Bose: 'ఫౌజీ'లో బోస్.. ఏఐ కాదు నిజమైన నటుడే

Oct 24 2026 9:03 AM | Updated on Oct 24 2026 9:07 AM

Fauzi Subhash Chandra Bose Actor Details

డార్లింగ్ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'ఫౌజీ' గ్లింప్స్ ఎట్టకేలకు వచ్చేసింది. రాత్రి తొమ్మిదిన్నర టైంలో రిలీజ్ చేశారు. ప్రభాస్‌కి ఎలివేషన్స్ ఉన్నప్పటికీ వాటిని సుభాష్ చంద్రబోస్ పాత్రతో చెప్పించడం క్రేజీగా అనిపించింది. హిట్లర్, బోస్ కలిసి భారతీయ గూఢచారి గురించి మాట్లాడుకుంటారు. అతడెవరో కాదు ఫౌజీ. ఫైల్ నం.25 పేరిట రెండున్నర నిమిషాల గ్లింప్స్‌లో కథ ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు.

(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ))

‍అయితే హిట్లర్, సుభాష్ చంద్రబోస్ విజువల్స్ చూసిన చాలామంది వాటిని ఏఐ అనుకుంటున్నారు. కానీ నిజమైన నటులే ఈ పాత్రల్ని పోషించారు. ముఖ్యంగా బోస్ పాత్రలో మరాఠీ నటుడు సుభోద్ బావే అచ్చుగుద్దినట్లు సరిపోయాడనే చెప్పొచ్చు. ఇతడెవరా అని చూస్తే మరాఠీ ఇండస్ట్రీలో నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లోనే కాదు టీవీ, నాటక రంగంలోనూ ఇతడికి మంచి పేరుంది.

1990ల నుంచి నాటకాల్లో నటించిన సుభోద్.. 2002 నుంచి మరాఠీ, హిందీ సినిమాలు చేస్తూ వచ్చారు. కొంకణీ, మలయాళంలోనూ మూవీస్ చేశారు. కత్యర్ ఖల్జత్ గుసాలీ అనే సినిమాతో దర్శకుడిగానూ మారారు. 2015లో వచ్చిన 'లోక్‌మాన్య: ఏక్ యుగపురుష్'లో స్వాతంత్ర్య సమరయోధుడైన బాలగంగాధర తిలక్ పాత్ర చేసిన సుభోద్.. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పాత్రతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు.

మార్చి 19న 'ఫౌజీ' రిలీజ్ కానుంది. దీని తర్వాత సుభోద్‌కి దక్షిణాదిలో మరింత పేరు రావడం గ్యారంటీ. వ్యక్తిగత విషయానికొస్తే.. తన చిన్ననాటి స్నేహితురాలు మంజశ్రీ దేశ్‌పాండేని 2001లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. ఇక 'ఫౌజీ'లో బోస్ పాత్ర చేయడంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఇతడు.. ఇది చేస్తున్నందుకు తాను చాలా లక్కీ అని రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement