దసరా హడావుడి అంతా అయిపోయింది. మళ్లీ ఎవరిపనుల్లో వాళ్లు పడిపోయారు. మరోవారం కూడా వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' రానుంది. దీంతో పాటే సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హీరోయిన్గా చేసిన కిల్లర్, చంద్రయాన్ అనే చిన్న చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

మరోవైపు ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో విజయ్ సేతుపతి 'బత్తా' అస్సలు మిస్ అవ్వొద్దు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుంది. దీనితో పాటు అవరచన్ & బాయ్స్, ఇమ్మోర్టల్ లాంటి డబ్బింగ్ మూవీస్తో పాటు కీర్తి సురేశ్ 'అక్క', రుద్రవనం పీఎస్ అనే తెలుగు సిరీస్లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 26 నుంచి నవంబర్ 01 వరకు)
సోనీ లివ్
ఇమ్మోర్టల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30
హాట్స్టార్
లవ్ ఆల్వేస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30
అబ్సెసన్: ద ఒరిజినల్ అన్ కట్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 30
నెట్ఫ్లిక్స్
మినిమమ్ వేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 26
ద వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - అక్టోబర్ 27
దిండోరా సీజన్ 1 (హిందీ సిరీస్) - అక్టోబర్ 28
బత్తా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 29
బలారా: ద బ్లడ్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 29
యూ, మీ, అజ్ (ఇటాలియన్ సిరీస్) - అక్టోబర్ 29
అవరచన్ & బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30
ఎస్ఐ యుగంధర్ (తెలుగు మూవీ) - అక్టోబర్ 30
అక్క (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30
సిగ్మా (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30
హౌ టూ రూయిన్ దివాళి: మీట్ ద పేరెంట్స్ (సౌతాఫ్రికన్ సిరీస్) - అక్టోబర్ 30
ఏ కపుల్ ఆఫ్ లైస్ (స్వీడిష్ సిరీస్) - అక్టోబర్ 30
కొలిజన్ కోర్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 30
డెడ్ ఎండ్ జాబ్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 30
మీథే మే క్యాన్ హై (హిందీ సిరీస్) - అక్టోబర్ 30
అబ్సెస్ (అరబ్ సిరీస్) - అక్టోబర్ 30
ఎస్సీటీవీ: ద గ్రేట్ షో యూ నెవర్ హెర్డ్ ఆఫ్ (కెనడియన్ షో) - అక్టోబర్ 30
అమెజాన్ ప్రైమ్
డ్రైవ్: ద ప్రెటెండర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 28
అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 30
జీ5
హాస్టల్ హడ్సా (హిందీ సిరీస్) - అక్టోబర్ 28
రుద్రవనం పీఎస్ (తెలుగు సిరీస్) - అక్టోబర్ 30
ఆపిల్ టీవీ ప్లస్
నోక్టర్న్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 30
(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' ఓటీటీ రివ్యూ)


