breaking news
Akka
-
ఇక ‘అక్కా కేఫ్’లు.. ఎక్కడంటే..
కర్ణాటక రాష్ట్రంలో ఇక మరిన్ని ‘అక్కా కేఫ్’లు ప్రారంభం కానున్నాయి. 2025లో ప్రారంభించి స్వయం సహాయక బృందాల (SHGs) మహిళల ద్వారా నిర్వహిస్తున్న కాఫీ వ్యవస్థాపకత కార్యక్రమం ‘అక్కా కేఫ్’ చొరవను విస్తరించేందుకు కర్ణాటక ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. 16వ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రాజెక్టును ప్రకటించారు.బెంగళూరులో తాజాగా జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్ర కాఫీ వ్యాల్యూ చెయిన్నుబలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఏమిటీ ‘అక్కా కేఫ్’?‘అక్కా కేఫ్’ ప్రోగ్రామ్ అనేది జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో అమలవుతున్న జీవనోపాధి, వ్యవస్థాపకత పథకం. ఇది నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, జీవనోపాధి విభాగం ద్వారా అమలవుతోంది.ఈ చొరవ ద్వారా కర్ణాటక అంతటా మహిళలు నడిపే కాఫీ కియోస్కులు, కేఫ్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయడం లక్ష్యం. స్వయం సహాయక సంఘాల మహిళలు మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇది తోడ్పడుతుంది.కర్ణాటక ప్రభుత్వ తాజాగా ప్రకటించిన రూ.25 కోట్ల కేటాయింపుతో కియోస్క్ మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్కు సహకారం అందించనున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద 2,500 ‘అక్కా కేఫ్’ కాఫీ కియోస్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కియోస్క్‌ల రూపకల్పన, సరఫరా, నిర్మాణం, ప్రారంభానికి టెండర్లు ఇప్పటికే పిలిచినట్లు సమాచారం.దశలవారీ అమలుప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తారు. మొదటి దశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 50 ఆధునిక కేఫ్‌లు ఏర్పాటు చేస్తారు. అర్హులైన మహిళలకు మౌలిక సదుపాయాలు, సెటప్ కోసం రూ.15 లక్షల వరకు గ్రాంట్లు అందించనున్నారు.ఎక్కడెక్కడ?ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ‘అక్కా కేఫ్’లు పనిచేస్తున్నాయి. వీటిలో బెంగళూరులో రెండు, బీదర్‌లో రెండు, కార్వార్లో ఒకటి ఉన్నాయి. త్వరలో మైసూరులో మరో రెండు కేఫ్‌లు ప్రారంభం కానున్నాయి. బెంగళూరులోని గాంధీనగర్, దేవనహళ్లి ప్రాంతాలలో అక్కా కేఫ్‌లను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు.మెనూలో ఏమేముంటాయంటే..‘అక్కా కేఫ్’ల్లో ప్రధానంగా కాఫీ లభిస్తుంది. అదనంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మెనూలో సాధారణంగా కాఫీతోపాటు ఇడ్లీ, వడ, ఉప్మా, పులావ్, టీ ఉంటాయి. చౌకైన ధరల్లో అల్పాహారం, తేలికపాటి భోజనం కూడా లభిస్తాయి.లక్ష మంది మహిళలకు శిక్షణకాఫీ బోర్డు ఆఫ్ ఇండియా, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ సహకారంతో లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణలో ప్రధానంగా ప్రామాణిక ఫిల్టర్ కాఫీ తయారీ, కేఫ్, కియోస్క్ నిర్వహణ, వ్యవస్థాపకత, సూక్ష్మ ఎంటర్ప్రైజ్ అభివృద్ధి వంటి అంశాలు ఉంటాయి.తొలుత సుమారు 400 మంది మహిళలకు బెంగళూరులోని కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షకులు తాలూకా, గ్రామ స్థాయిలలో మిగిలిన మహిళలకు శిక్షణ అందిస్తారు. శిక్షణ , అమలుకు కాఫీ బోర్డు అటల్ ఇంక్యుబేషన్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్ సహకారం అందిస్తుంది. -
ఆటో ఆపద్బాంధవి!
‘ఓహో.. ఈ చెన్నై అర్ధరాత్రి వీ«థుల్లో ఒంటరిగా ఏలారా వెళ్లడం!’ అని మీరు ఆలోచిస్తున్న సమయానికే, పసుపు, ఆకుపచ్చ ఆటో ఒక సూపర్ హీరో ఎంట్రీ ఇచ్చినట్టుగా బ్రేక్ వేసి మీ ముందుకు ఆగుతుంది. అదే మన రాజి అక్క!రాజి అక్కకి ఆటో అంటే వాహనం మాత్రమే కాదు, అది ఒక ఇల్లులాంటిది. అంతకంటే, ఎక్కువగా ఆ ఆటోలో ప్రయాణం కొండంత భరోసా, భద్రత! ఇరవై ఏళ్లకు పైగా ఆటో నడుపుతున్న ఆమె, ఒక డ్రైవర్ మాత్రమే కాదు; వేలమంది మహిళలకు రక్షకురాలు, ఆపద్బాంధవురాలు కూడా! ఒక భయంకరమైన ఘటన తన కళ్ల ముందే జరగడం చూసి, నిర్ణయించుకుంది ‘ఇకపై ఒక్క మహిళ కూడా భయపడుతూ ఇంటికి చేరకూడదు’ అని. అప్పటి నుంచి ఆమె ఆటో చక్రాలు కేవలం మీటరు చూపించడం మాత్రమే కాదు; భద్రత, స్నేహం, మనసులో నమ్మకం కూడా అందిస్తున్నాయి. ఆమె ఆటోలో కూర్చుంటే అందులో ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాటర్ బాటిల్, బిస్కట్ ప్యాకెట్, సానిటరీ న్యాప్కిన్ అలా అలా! చాలా కనిపిస్తాయి. అప్పుడు అడుగుతారు ‘అక్కా, నువ్వు డ్రైవరా లేక ట్రావెల్ మమ్మీనా?’ అని, దానికి అక్క నవ్వుతూ ‘ఇవి ఉంటే ఎవరికైనా కష్టంలో ఉపయోగపడతాయి. అంతే, సేల్స్ కాదు, ప్రమోష¯Œ ్స కాదు మచ్చీ!’ అని చెబుతుంది. ఇలా ఆడుతూ పాడుతూ రోజుకు ముప్పై ట్రిప్స్ పూర్తి చేసి, శరీరం అలసిపోయినా సరే, అర్ధరాత్రి ఎవరో ఒక అమ్మాయి కాల్ చేస్తే? రాజి అక్క వెంటనే ఆటో స్టార్ట్ చేస్తుంది. ‘మహిళలు సేఫ్‌గా ఇంటికి చేరితేనే నాకు నిద్ర వస్తుంది’ అంటుంది. అంతేకాదు సీనియర్ సిటిజన్ ఎక్కితే ఫ్రీ. పిల్లాడు స్కూల్‌కి ఆలస్యమైతే ఫ్రీ. ఎవరికైనా సడెన్ ఎమర్జెన్సీ అయితే ‘మీటర్ ఆఫ్, హాస్పిటల్ ఆన్!’ ఇంతా చేస్తుంది తన ఖాళీ సమయంలో కాదు, తన జీవిత పోరాటంలో భాగంగానే!ఆమె కష్టాలకు కుటుంబమే సాక్ష్యంరాజి అక్కకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇంజినీర్ అయ్యాడు, కూతురు నర్సింగ్ చదువుతోంది. భర్త అనారోగ్యం వల్ల పని మానేశాడు. అప్పటి నుంచి ఈ ఆటోనే వారికి అన్నం పెడుతోంది. కానీ రాజి అక్క ధైర్యం ముందు ఇవేమీ ఇబ్బంది కాలేదు. ‘ఈ చక్రాలు తిరిగేంత వరకు నా ఫ్యామిలీకి ఏ భయం లేదు’ అని గర్వంగా చెబుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘ఎనయుమ్ కైకల్’ అనే మహిళా ఆటో డ్రైవర్ల గ్యాంగ్ లీడర్ కూడా రాజి అక్కే! ఆమె ఆటోకి పంక్చర్ అయితే, ఐదు ఆటోలు సూపర్ ఫాస్ట్‌గా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టయిల్లో వచ్చేస్తాయి. మరెంతోమందికి ఉచిత డ్రైవింగ్ క్లాసులు కూడా ఇస్తుంది. ఆటో నడపడం నేర్చుకోవాలనుకునే మహిళలకు ఆమె గురువు. ప్రస్తుతం అక్క ఆటో ప్రయాణ కథలను విన్నవారంతా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని నగరాల్లోనూ ఇలాంటి అక్క ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. ఎందుకంటే, రాజి అక్క డ్రైవర్ మాత్రమే కాదు ఆపదలో ఆదుకునే అక్క, అమ్మ, ఫ్రెండ్, బాడీగార్డ్ అన్నీ. నారీ భగీరథ! కర్నాటకలోని సిర్సి దగ్గర ఒక చిన్న గ్రామం. అక్కడ ఒకప్పుడు నిత్యం నీటి కొరత, ఎండిన పంటలు, దాహంతో అలమటిస్తున్న జీవులు కనిపించేవి. అలాంటి సమయంలో చాలామంది ‘ఎవరైనా వచ్చి పరిష్కరిస్తారు’ అని చేతులెత్తేసి కూర్చుంటే, యాభై మూడు ఏళ్ల గౌరి నాయక్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. తన పంటలు పచ్చగా మారాలని తపనతో ముందడుగు వేసింది. స్వయంగా తన చేతులతో బావి తవ్వడం మొదలుపెట్టింది. యంత్రాలు లేవు, సహాయం లేదు, కేవలం ఒక గిలక, తాడు, బకెట్ మాత్రమే. రోజూ ఆరు గంటలపాటు కష్టపడి, ఆరు నెలల పాటు శ్రమించింది. పక్కవాళ్లు ‘ఇది అసాధ్యం’ అన్నారు. కాని, గౌరి మాత్రం ఆగలేదు. ఆమె పట్టుదల ఫలించింది. అరవై అడుగుల లోతులో నీరు దొరికింది. ఆ నీటితో ఆమె పంటలు తిరిగి పచ్చగా మారాయి. అక్కడితో ఆగిపోకుండా, మరో బావి తవ్వింది. ఈసారి తనకోసం కాదు– పొరుగువారి కోసం. ‘నా పంటలు బతికితే సరిపోదు, నా ఊరి ప్రజలందరికీ జీవం రావాలి’ అని అనుకుంది. పాఠశాల దగ్గర బావి తవ్వొద్దని అధికారులు ఆపినా, గౌరి వెనక్కి తగ్గలేదు. స్కూల్ పిల్లలకు కూడా నీరు అందేలా చేసింది. మధ్యలో ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, అలసట– అన్నింటినీ తట్టుకుంది. అందుకే, ఈరోజు అందరూ ఆమెను ‘లేడీ భగీరథ’ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఆమె బావులు రైతులకు, పిల్లలకు, జంతువులకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. ఇంకా గౌరి ఆగలేదు. గ్రామస్తులు దూరంగా నడుస్తూ నీరు తెచ్చుకోకూడదనే తపనతో, మూడో బావిని కూడా తవ్వుతోంది. -
వెబ్ ఎంట్రీ
కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్ రివేంజ్ థ్రిల్లర్‌గా ‘అక్క’ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ధర్మరాజ్ శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు బాలీవుడ్ సమాచారం. ‘‘ఇందులో కీర్తీసురేష్, రాధికా ఆప్టే పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వీక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్ సాగుతుంది’’ అనియూనిట్ పేర్కొంది. కాగా కీర్తీ సురేష్‌కు తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘అక్క’. వరుణ్ధావ¯Œ హీరోగా నటిస్తున్న ఓ బాలీవుడ్ సిని మాలో Mీ ర్తి ఓ హీరోయి¯Œ గా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. -
మంచు లక్ష్మీ పేరు మార్చుకుంటుందట..!
స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి.., టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగానే కాదు నిర్మాతగానూ, బుల్లితెర యాంకర్ గానూ ఆకట్టుకుంటున్న లక్ష్మీ ప్రసన్నకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఎక్కువగా మంచువారమ్మాయిని అక్క అని సంబోధిస్తుంటారు జనాలు. కొంత మంది సరదాగా అక్కా అని పిలుస్తే.., మరి కొంత మంది గౌరవంతో పిలుస్తున్నారు. ఇన్నాళ్లు ఆ పిలుపును సరదాగానే తీసుకున్న లక్ష్మీ ప్రసన్నకు గత వారాంతంలో ఎదురైన అనుభవం చిరాకు తెప్పించింది. దీంతో తన సోషల్ మీడియా పేజ్‌లో అక్క అన్న పిలుపుపై ఘాటుగా స్పందించింది. 'ఓ పళ్లు లేని ముసలాయన అక్కా అని పిలవటంతో నేను నా పేరును అక్క అని మార్చుకోవాలని నిర్ణయించుకున్న. అక్క తొక్కా' అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఆ పిలుపు తనకు ఎంత చిరాకు తెప్పించిందో రకరకాల ఎమోట్ ఐకాన్ల రూపంలో చూపించింది. మరి లక్ష్మీ మెసేజ్ చూసాక అయినా జనాలు అక్క అని పిలవటం మానేస్తారేమో చూడాలి. I'm seriously contemplating to changing my name to AKKA after an old man(w no teeth) over the weekend called me that.


