మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా.. | UK Woman Born Without Womb After Sister Donates Uterus | Sakshi
Sakshi News home page

మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..

Aug 19 2026 12:42 PM | Updated on Aug 19 2026 1:12 PM

UK Woman Born Without Womb After Sister Donates Uterus

కొన్ని అరుదైన వ్యాధులు శాపంగా మారతాయి. వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. అలాంటి వాటిని కూడా ఆధునిక వైద్యం సరికొత్త ఆశను అందించి ఊపిరిపోస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న మహిళకు అక్క ఉదారత, ఆధునిక వైద్య ఆమె జీవితంలో నవ్వులు విరబూసేలా చేశాయి. 

అసలేం జరిగిందంటే..యూకేకు చెందిన 36 ఏ‍ళ్ల లారెన్ ఫౌలర్ అనే మహిళ 20 ఏళ్లుగా మాతృత్వం కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆమెకు 'మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా గర్భశయమే లేకుండా పుట్టింది. ఆ కారణంగా ఆమెకు పీరియడ్స్‌ లాంటివి ఉండవు. అందువల్ల సహజపద్ధతిలో పిల్లల్లను కనే సామర్థ్యం ఉండదామెకు. 

నిజానికి ఆ అరుదైన జన్యుపరమైన వ్యాధిలో గర్భాశయం అభివృద్ధి చెందదు కానీ ఆరోగ్యకరమైన అండాశయాలు ఉంటాయి. అలాగే అందరి అమ్మాయిల్లా..మిగతా అవయవాలన్నీ అభివృద్ధి చెందుతాయి తప్ప రుతక్రమం అనేది ఉండదు. అనేపథ్యంలోనే లారెన్‌కు గర్భం దాల్చే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఆమెకు టైప్‌1 డయాబెటిస్‌ పేషెంట్‌ కూడా. 

దాంతో ఆమె 40 ఏళ్ల అక్క కెల్లీ తన సోదరి లారెన్‌కి గర్భశయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఆమెకు ముగ్గురుపిల్లలకు కూడా ఉండటంతో సోదరి కోసం ఈ త్యాగం చేసేందుకు ముందుకొచ్చిందామె. ఇక లారెన్‌ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్‌లో గర్భశయ మార్పిడకి సంబంధించిన శస్త్ర  చికిత్స గురించి కూడా ఇలా రాసుకొచ్చింది లారెన్‌. ఇది తన జీవితంలో ఎదుర్కోబోయే అతిపెద్ద అత్యంత కఠినమైన కోలుకునే ప్రక్రియగా పేర్కొంది. 

దీనికోసం శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా సిద్ధంగా ఉండాలనే ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ శస్త్ర చికిత్స ఎలం క్లిష్టమైనదో అందరూ ముందుగానే హెచ్చరించారని, వాళ్లు అన్నట్లుగానే ఇది తనకు చాలా ఛాలెంజ్‌లు విసిరిందని చెప్పుకొచ్చింది. తన ప్రతి భావోద్వేగాన్ని, తన శరీరంలోని ప్రతి అణువు బలాన్ని గట్టిగానే పరీక్షించిందని ఆవేదనగా రాసుకొచ్చింది పోస్ట్‌లో. నిజంగానే ఇది తనను పరీక్షించి, ప్రతి కణాన్ని హరించేసి, తనలో ఎంత బలం ఉందో పరీక్ష పెట్టిందని అంటోంది. 

అయితే తాను 20 ఏళ్లుగా మాతృత్వం కోస పడుతున్న తపన ముందు ఈ బాధ ఎంత అని వెనక్కి తగ్గకుండా ముందుక సాగానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, అక్టోబర్‌లో సిజేరియన్‌చేసి బిడ్డను బయటకు తీయాలని వైద్యులు ప్లాన్‌ చేస్తున్నట్లు వెల్లడిస్తూ పోస్ట్‌ని ముగించింది. 

ఇక ఆమె సోదరి కూడా తన పిల్లలు కూడా తన చెల్లెలు కనబోయే బిడ్డ కోసం ఆత్రుతుగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఒకే గర్భం నుంచి పుట్టిన పిల్లలు కాబట్టి వీరందరి మధ్య విడదీయరాని బంధమే ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొంది ఆమె అక్క కెల్లీ.

Source: పీపుల్స్‌ డాట్‌ కామ్‌ ఆంగ్ల వెబ్‌సైట్‌ ఆధారంగా ఇచ్చిన కథనం ఇది. 

(చదవండి: ఆ బుడ్డోడు పాటపాడిన తీరుకి..పర్యాటక ప్రేమికులంతా..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement