మంచి ఫిట్‌నెస్‌ అంటే..? | Health tips: what is good fitness How to Improve | Sakshi
Sakshi News home page

మంచి ఫిట్‌నెస్‌ అంటే..?

Oct 4 2026 11:39 AM | Updated on Oct 4 2026 11:44 AM

Health tips: what is good fitness How to Improve

మంచి ఫిట్‌నెస్‌ను తేలిగ్గా తెలియజెప్పడానికి ఏ అంశాలు కారణమవుతాయో అమెరికన్‌  హార్ట్‌ అసోసియేష  (ఏహెచ్‌ఏ)కు చెందిన అధ్యయనవేత్తలు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో 14,345 మంది పాల్గొన్నారు. దాదాపు ఆరేళ్లకు పైగా సాగటంతో పాటు మరో పదకొండేళ్ల ఫాలో అప్‌ తర్వాత ‘ఫిట్‌నెస్‌’ గురించి నిపుణులు చెబుతున్నదేమిటంటే... 

రోజులోని ఏ సమయంలోనైనా ఆయాసపడకుండా పది నిమిషాలు పరుగెత్తగలగడం 

తమ రోజువారీ పనులు చురుగ్గా చేసుకోగలగడం 

అవన్నీ పూర్తి చేశాక... సాయంత్రం ఏవైనా వినోద కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తే అలిసిపోయాననే సాకు చెప్పకుండా వాటిలోనూ హుషారుగా పాల్గొనడం 

అనుకోని ఘటన (అన్‌ఫోర్‌సీన్‌ ఇన్సిడెంట్‌) ఏదైనా జరిగితే రోజంతా పనిచేసిన అలసటను సాకుగా తీసుకోకుండా దాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేయడం... ఈ నాలుగు పనులూ సునాయాసంగా చేయగలిగితే   వారు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టేనన్నది నిపుణులు మాట.

ఇదీ చదవండి:   హైబీపీని అదుపులో పెట్టే పొటాషియమ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement