రెండేళ్లు స్నానం లేదు, ఆయన చావును కోరుకున్నారు : హేమా చౌదరి సంచలన వ్యాఖ్యలు | Sharad Kapoor Hadnt Bathed For 2 Years Friend Says Some Wanted Him To Die | Sakshi
Sakshi News home page

రెండేళ్లు స్నానం లేదు, ఆయన చావును కోరుకున్నారు : హేమా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Nov 18 2026 4:44 PM | Updated on Nov 18 2026 4:50 PM

Sharad Kapoor Hadnt Bathed For 2 Years Friend Says Some Wanted Him To Die

బాలీవుడ్ నటుడు శరద్ కపూర్ (Sharad Kapoor) అనారోగ్యంతో బాధపడుతున్న వార్తలు, వీడియోలు నెట్టింట సంచలనంగా మారాయి. అలాగే సినీ పరిశ్రమలోని తన సీనియర్ సహచరులను ఉద్దేశించి, తనకు సినిమాల్లో అవకాశంతోపాటు,  ఆర్థిక సహాయం అందించాలంటూ భావోద్వేగపూరిత విజ్ఞప్తి, దీనస్థితి గురించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో సినీ పరిశ్రమ స్పందించింది. నటులు సోనూ సూద్, సల్మాన్ ఖాన్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు అండగా నిలిచారు. మరోవైపు జంతు సంరక్షణ సంస్థ (బెజుబాన్ ట్రస్ట్) నిర్వాహకురాలు, శరద్ కపూర్ స్నేహితురాలు హేమా చౌదరి (Hema Chaudhary) వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

బాలీవుడ్ కట్ అన్‌కట్' (Bollywood Cut Uncut) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ముంబైలోని ఆయన నివాస భవనంలో కుక్కలను రక్షించే (డాగ్ రెస్క్యూ) క్రమంలో కపూర్‌ను తాను ఎలా కనుగొన్నారో గుర్తుచేసుకున్నారు. ఆయన పరిస్థితి చూసి తాను షాక్ అయ్యానని హేమా చౌదరి వెల్లడించారు. దాదాపు రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యం, డిప్రెషన్ కారణంగా మంచానికే పరిమితమై, కనీసం స్నానం కూడా చేయలేని దయనీయ స్థితిలో  తెలిపారు. అంతేకాదు ఆయన చనిపోవాలని కొందరు ఎదురుచూశారని వ్యాఖ్యానించడం దిగ్భ్రాంతి రేపింది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం హేమ ఆ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, "అప్పటికే ఆయనకు సినిమా అవకాశాలు రావడం ఆగిపోయి ఉండవచ్చు. నేను ఆయన సోదరుడితో మాట్లాడినప్పుడు, వారి తమ్ముడిని కలవడానికి శరద్ వచ్చారని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఆయన సోదరుడికి ఫోన్ చేయడానికి ప్రయత్నించి నప్పుడు, ఆయన సరిగ్గా స్పందించలేదు. 'ఆయనకు మీ అవసరం ఉంది' అని నేను చెప్పినా, తిరిగి ఫోన్ చేయలేదు. బహుశా ఆయనకు ఆసక్తి లేదేమో. ఆస్తి వివాదమో లేదా మరేదైనా కారణం అయి ఉండవచ్చు" అని అన్నారు.

ఆయన దాదాపు 99 శాతం ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారనీ, కానీ ఆ కుక్కలే  తనను ఆయన వద్దకు తీసుకెళ్లాయనీ,  నోరులేని జీవుల మాటను తానెప్పుడూ వింటాను. కుక్కలను రక్షించే సమయంలోనే ఆయన కలిసానని తెలిపారు. రెండేళ్లుగా స్నానం చేయకుండా, మంచం కూడా దిగలేని పరిస్థితిలో ఉన్న ఆయనకు ఎవరూ ఫోన్ చేయలేదు, కనీసం తిన్నారా లేదా అని కూడా అడగలేదు. దాంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చిందంటూ ఆమె  ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దాదాపు రెండేళ్లుగా నరాల సంబంధిత సమస్య (న్యూరోలాజికల్ కండిషన్) కాలు విరగడం  సహా పలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి: International Men’s Day 2026: పెళ్లే పురుషుడి జీవిత లక్ష్యమా?

అలాగే ఇప్పటికే కష్టకాలంలో ఉన్న వ్యక్తిని పదేపదే ప్రశ్నలు అడగడం వల్ల మరింత మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉందని వివరిస్తూ, దయచేసి ఆయనను సంప్రదించవద్దని హేమ మీడియాకు విజ్ఞప్తి చేశారు. శరద్‌కు త్వరలోనే సినీ పరిశ్రమ సభ్యుల నుండి గణనీయమైన మద్దతు లభిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు, రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో నటుడికి అండగా నిలవాలని హేమ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రస్తుతం కోలుకుంటున్న శరద్ కపూర్, తనకు సినిమా అవకాశాలిచ్చి ఆదుకోవాలని కోరారు.  వచ్చే ఏడాది జనవరిలో తిరిగి నటనలోకి అడుగుపెడతానని ఆయన అభిమానులకు హామీ ఇచ్చారు. 

ఇదీ చదవండి: కొలెట్ క్రెస్ Vs మాడిసన్ హువాంగ్ : ఏం జరగబోతోంది?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement