క్షమించి..ఓడించడమే దీర్ఘాయువు..! బ్రయాన్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు | Health Tips: Bryan Johnson Shares His Art Of Longevity | Sakshi
Sakshi News home page

Bryan Johnson: క్షమించి..ఓడించడమే దీర్ఘాయువు..! బ్రయాన్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు

Nov 17 2026 6:22 PM | Updated on Nov 17 2026 6:49 PM

Health Tips: Bryan Johnson Shares His Art Of Longevity

ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ పారిశ్రామికవేత్త, బయోహ్యాకర్ బ్రయాన్ జాన్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టి..దీర్ఘాయువతో ఉండాలనే ప్రాజెక్టుతో వార్తల్లో నిలిచాడు. అందుకోసం తనపైనే పలు ప్రయోగాలు చేసుకుంటూ..చుట్లు వందలాది మంది డాక్టర్లతో కోట్లు వెచ్చించాడు. ఇప్పటికీ ఆ ప్రయోగాలతోనే సాగుతున్న అతడు తాజగా మన వేదాలు, భగవద్గీత, పురాణాలు ముక్తకంఠంతో నొక్కి చెప్పే సందేశాన్ని చెప్పి..అదే ‘దీర్ఘాయువు కళ’ అంటూ ఆశ్చర్యపర్చాడు. అతడి కారణంగా మరోసారి మన ఆధ్యాత్మికత గొప్పతనం వెలుగులోకి వచ్చింది. 

Longevity, Says Forgive Your Enemy: ఇదేంటి అనుకోకండి శత్రువుకి సైతం క్షమాభిక్ష పెట్టే దేశం మనది. వేద భూమి, కర్మభూమి. ఇక్కడ టెక్‌ మిలియనీర్‌ కూడా అదే అంశాన్ని ప్రస్తావించడంతో మన ఆధ్యాత్మిక శక్తి గొప్పతనం అఖండ జ్యోతిలా దశదిశలా వ్యాపిస్తూనే ఉందనడానికి తార్కణంగా నిలిచింది అతడి వ్యాఖ్యలు. ఇంతకీ బ్రయాన్‌ జాన్సన్‌ ఏమన్నారంటే..మీ శత్రువుని క్షమించండి. తద్వారా మీలో ఉన్న నెగిటివిటీ(ప్రతికూల శక్తిని)ని తొలగించుకోండి. అతడిపై ‍ప్రతీకారం లేదా రియాక్షన్‌ని మీ లక్ష్యంపై లేదా దృఢ సంకల్పంపై పెట్టండి. 

తద్వారా అతడిని ఓడించండి అని పిలుపునిస్తున్నాడు. మనల్ని వ్యతిరేకించేవారికి ప్రతిస్పందన అంటే కీడు తలపెట్టడమో..రివైంజ్‌ తీర్చుకోవడమో కాదు. మన అభ్యున్నతి, బాగుండడమే అని చాలా చక్కగా చెప్పాడు. అదే దీర్ఘాయువుకి దోహదం చేస్తుందన్నాడు. అంతేగాదు ఆ విధానాన్ని దీర్ఘాయువు కళగా అభివర్ణించాడు. ‘క్షమించు, చర్య తీసుకో’ అనే నినాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. అంటే.. "క్షమించి సానుకూల శక్తిని ఆహ్వానించు. 

అది ఎదుగుదలపై ఏకాగ్రతతో ఫోకస్‌ పెట్టేలా చేసే చర్యగా మారుతుంది. అంతేతప్ప ప్రతికూలత భారాన్ని మోసి అనారోగ్యం పాలు కావొద్దని పిలుపునిస్తుండటం విశేషం.". ఇది మన వేదాలు, పురాణలు ఘోషించే చెప్పే ‘క్షమయే దైవం’ అన్న మాటను బ్రయాన్‌ ఇలా చెప్పాడని అధ్యాత్మిక వేత్తలు అనడం కొసమెరుపు.

ఇదీ చదవండి: విడాకులు కూడా వివాహంలా వేడుకలు..! కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement