గుళికల యూరియా బదులు గ్రీన్‌ అమ్మోనియా గ్యాస్‌! | Sagubadi: Green Ammonia ecosystem under NGHM | Sakshi
Sakshi News home page

గుళికల యూరియా బదులు గ్రీన్‌ అమ్మోనియా గ్యాస్‌!

Nov 17 2026 2:30 PM | Updated on Nov 17 2026 2:51 PM

Sagubadi: Green Ammonia ecosystem under NGHM

పంటలకు గుళికల యూరియాపై ఆధారపడటాన్ని తగ్గించి, రైతులకు ఆర్థిక ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్నమైన ‘గ్రీన్‌ అమ్మోనియా గ్యాస్‌’ను వాడాలని భావిస్తోంది. సుమారు రూ. 600 కోట్ల వ్యయంతో పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలుకు ఇటీవల శ్రీకారం చుట్టింది. ఉత్తరప్రదేశ్‌లో ఎంపిక చేసిన 6 జిల్లాల్లో.. ఒక్కో చోట 300 ఎకరాల్లో  రబీ పంటల్లో ఈ విధానాన్ని పరీక్షిస్తున్నారు. 

ఈ విధానంలో పంటలకు సాధారణ గుళికల రూపంలో ఉండే యూరియా వేయరు. దానికి బదులుగా ద్రవ రూపంలో ఉన్న అమ్మోనియాను వాయు (గ్యాస్‌) రూపంలోకి మార్చి, సిలిండర్ల ద్వారా ట్రాక్టర్ల సహాయంతో నేరుగా నేలలోకి ఇంజెక్ట్‌ చేస్తారు. దీనివల్ల పంటలకు అవసరమైన నత్రజని నేరుగా పంటల వేర్లకే, అదికూడా దీర్ఘకాలం పాటు అందుతుందని చెబుతున్నారు. 

యూరియా గ్యాస్‌ ప్రభావం ఆర్నెల్లు!
యూరియా గుళికలు పొలంలో వేస్తే కొద్ది వారాల్లోనే దాని ప్రభావం ముగుస్తుంది. అయితే, ద్రవ రూపంలోని అమ్మోనియాను వాయువుగా మార్చి ట్రాక్టర్‌ నాగలి ద్వారా నేలలోకి పంపటం వల్ల, ఆరు నెలల టు నేల సారవంతంగా ఉండటమే కాకుండా పంటకు అవసరమైన పోషకాలు ఆర్నెల్లపాటు నిరంతరం అందుతాయని కృషి విజ్ఞాన కేంద్రం నిపుణులు డాక్టర్‌ ఎస్‌.ఎస్‌. ఢాకా వివరించారు. 

దీనివల్ల పంటకు మళ్ళీ మళ్ళీ యూరియా వేయాల్సిన అవసరం తప్పుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రయోగాత్మక సాగు ఫలితాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. యూపీలోని 6 జిల్లాల్లో సానుకూల ఫలితాలు వస్తే యూరియా చల్లటానికి బదులు అమ్మోనియా గ్యాస్‌ సిలిండర్లు వాడే పద్ధతి దేశవ్యాప్తంగా అమల్లోకి రావచ్చు.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌ 

ఇదీ చదవండి: దేవదారుతో ఇన్ని ఉపయోగాలా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement