వరంగల్ : కాకతీయ మెడికల్ కాలేజీలో ఉత్కర్ష –2026 (Utkarsha-2026) వేడుకలు కొనసాగుతున్నాయి. సోమవారం ప్రత్యేకంగా ట్రెడిషినల్ డే నిర్వహించారు.
ఈసందర్భంగా వివిధ రాష్ట్రాల విద్యార్థులు తమ ప్రాంతాల సంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శనలిచ్చారు.
అదేవిధంగా సంగీత వాయిద్యాలు వాయించారు. ఏక పాత్రాభినయం, ఇతర సాంస్కృతిక పోటీలు ప్రదర్శించి అబ్బురపర్చారు.
చీరకట్టుతో విద్యార్థినులు ర్యాంప్ వాక్‌పై హొయలొలికారు.


