వరంగల్ : హసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రత్యేక దీపావళి బతుకమ్మ వేడుకలు మంగళవారం ముగిశాయి.
చివరి రోజు నేతకాని ఆడపడుచులు, మగవారు బతుకమ్మలతో గ్రామంలో ప్రదర్శన నిర్వహించి స్థానిక చెరువు వద్ద ఆడారు. అనంతరం నిమజ్జనం చేశారు.
వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


