న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి పండుగ వేళ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది.
గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పలు చోట్ల వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400 మార్కును దాటేసింది. స్వచ్ఛమైన గాలి లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీపావళి పండుగ ఒక్కరోజే ఏక్యూఐ 1,760గా నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మరోవైపు కాలుష్య నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, ఏక్యూఐ గణాంకాల వెల్లడిలో అవకతవకలు, పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనం వంటి అంశాలు రాజకీయ దుమారానికి దారితీశాయి.


