ఈసారి దీపావళి ముందు రోజు నగరంలో పెద్ద మార్పు కనిపించింది. ఒకప్పుడు బేగంబజార్, సిద్దిఅంబర్‌బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లలో టపాసుల కోసం కిలోమీటర్ మేర క్యూలు ఉండేవి. ఇప్పుడు ఆ హడావుడి తగ్గింది.
దీపాలు, మట్టి ప్రమిదలు, పూలు, స్వీటు షాపుల వద్దే జనం ఎక్కువగా కనిపించారు. వ్యాపారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది నగరంలో టపాసుల అమ్మకాలు గత 3– 4 ఏళ్లతో పోలిస్తే 20 నుంచి 25 శాతం వరకు పడిపోయాయి. ఖర్చు తగ్గడం ఒక్కటే కారణం కాదు.
పర్యావరణ స్పృహ పెరగడం కూడా ప్రధానంగా పెరిగింది. గ్రీన్ టపాసులకే ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఈసారి స్వీట్ల ధరలు 20–25 శాతం పెరిగాయి. మొత్తంగా ఈసారి దీపావళి నగరంలో శబ్దం తగ్గి, వెలుగు పెరిగిన పండుగగా మారనుంది.


