రూ. 900 కోట్లు ఢమాల్‌ : ఎన్విడియా మాజీ సీఈఓకు భారీ షాక్‌, కానీ | Nvidia Exit Triggers Rs 900Crore Loss For Jensen Huang Yet 97pc Of His Wealth Remains Intact | Sakshi
Sakshi News home page

రూ. 900 కోట్లు ఢమాల్‌ : ఎన్విడియా మాజీ సీఈఓకు భారీ షాక్‌, కానీ

Nov 14 2026 6:17 PM | Updated on Nov 14 2026 6:24 PM

Nvidia Exit Triggers Rs 900Crore Loss For Jensen Huang Yet 97pc Of His Wealth Remains Intact

ఎన్విడియా (Nvidia) నుండి జెన్సెన్ హువాంగ్  రాజీనామా  ప్రభావంఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.   కంపెనీ నుంచి అనూహ్య నిష్క్రమణతో   63 ఏళ్ల   మాజీ సీఈఓ వ్యక్తిగత సంపదలో సుమారు రూ. 900 కోట్లు (108 మిలియన్ డాలర్ల ) నష్టపోయాడు . కంపెనీలో ఇంకా పూర్తిస్థాయిలో ఆయనకు చెందాల్సి ఉన్న (అన్‌వెస్టెడ్) స్టాక్ అవార్డులను ఆయన కోల్పోనుండటమే ఇందుకు కారణం. ఆయన మొత్తం సంపదతో పోలిస్తే ఈ ఆర్థిక నష్టం చాలా చిన్నది. ఈ చిప్ తయారీ సంస్థలో ఉన్న వాటాల రూపంలోనే ఆయన సంపదలో దాదాపు 97% ఉంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. హువాంగ్ అంచనా నికర విలువ 138.4 బిలియన్ డాలర్లు కాగా, అందులో ఆయన వదులు కోవాల్సిన ఈక్విటీ పరిహారం కేవలం 0.08శాతం మాత్రమే. మరో మాటలో చెప్పాలంటే, ఆయన నిష్క్రమణ వల్ల చెప్పుకోదగ్గ మొత్తంలోనే నష్టం వాటిల్లినప్పటికీ, అది  బిలియనీర్ హోదాపై పెద్దగా ప్రభావం చూపదు.

ఎన్విడియా ఈక్విటీ పరిహార విధానం ప్రకారం, ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీలో తమ నిరంతర సేవలను ముగించినప్పుడు, వారికి ఇంకా పూర్తిస్థాయిలో బదిలీ కాని రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లను (RSUs) కోల్పోతారు. ఈ నిబంధన కారణంగానే హువాంగ్ ఈ నష్టాన్నిఎదుర్కోవాల్సి వచ్చింది. హువాంగ్ వద్ద సుమారు 3,46,000 అన్‌వెస్టెడ్ RSUలు ఉన్నాయి. కంపెనీ ఈక్విటీ ప్రోత్సాహక ప్రణాళిక కింద నిర్దేశిత పనితీరు లక్ష్యాలను చేరుకున్నట్లయితే, ఇవి దాదాపు 3,10,000 ఎన్విడియా షేర్లుగా మారేవి. అయితే, ఆయన నిష్క్రమణతో ఈ షేర్లు ఇకపై ఆయనకు అందుబాటులో ఉండవు. స్టాక్ ఆప్షన్లు, ప్యాకేజీలు,  ఇతర పెట్టుబడుల రూపంలో సంపదను విస్తరించుకునే ఇతర టెక్ ఎగ్జిక్యూటివ్‌ల మాదిరిగా కాకుండా, హువాంగ్ సంపదలో అత్యధిక భాగం ఎన్విడియా షేర్ల యాజమాన్యంతోనే ముడిపడి ఉంది.

సహ-వ్యవస్థాపకుడైన హువాంగ్ కంపెనీలో దాదాపు 3.5శాతం ఓటింగ్ వాటాను కలిగి ఉన్నారని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఆయన అంచనా సంపదలో దాదాపు 97% ఒక్క ఎన్విడియా వాటాల నుండే వస్తోంది. ఎన్విడియాకు ఒకే తరగతి షేర్లు మాత్రమే ఉన్నాయి, అంటే ప్రత్యేక తరగతి స్టాక్ ద్వారా హువాంగ్‌కు ఎలాంటి ప్రత్యేక లేదా అదనపు ఓటింగ్ హక్కులు లేవు. మొత్తం సంపదతో పోల్చి చూస్తే ఆయన సాధారణ నగదు వేతనం కూడా చాలా తక్కువే. గత రెండేళ్లలో ప్రతి సంవత్సరం హువాంగ్ సుమారు 7.5 మిలియన్ డాలర్ల నగదు పరిహారం అందుకున్నారు, ఇది ఆయన మల్టీ-బిలియన్ డాలర్ల సంపదలో ఒక చిన్న భాగం మాత్రమే.

ఇదీ చదవండి: 21 ఏళ్ల క్రితం రూ. 14.5 కోట్ల ‘దీవి’ కొన్న హీరో.. ఇపుడెలా ఉంది?

మరోవైపు  హువాంగ్ రాజీనామా వార్తలతో న్యూయార్క్ ట్రేడింగ్‌లో ఎన్విడియా షేర్లు ఒక దశలో 14శాతం దాకా కుప్పకూలి పోయాయి. దీంతో హువాంగ్ నికర విలువ నుండి 6 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరైపోయింది. ఆయన కోల్పోతున్న 108 మిలియన్ డాలర్ల ఈక్విటీ అవార్డుల కంటే మార్కెట్ ఆధారితమైన ఈ నష్టం చాలా రెట్లు ఎక్కువ. ఎన్విడియా మార్కెట్ విలువతో ఆయన వ్యక్తిగత సంపద ఎంత లోతుగా ముడిపడి ఉందో ఇది స్పష్టం చేస్తోంది. 

ఇదీ చదవండి: హువాంగ్ రాజీనామా : అనూహ్య పరిణామం, బోర్డు అంగీకరిస్తుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement