3 అంతస్థులు, 60 గదులు, 152 ఏళ్ల ఆలయం గురించి తెలుసా? | 3 Storeys 60 Rooms Inside 152 Year-Old Temple In Nepal Dedicated To Sita | Sakshi
Sakshi News home page

3 అంతస్థులు, 60 గదులు, 152 ఏళ్ల ఆలయం గురించి తెలుసా?

Nov 13 2026 4:20 PM | Updated on Nov 13 2026 4:32 PM

3 Storeys 60 Rooms Inside 152 Year-Old Temple In Nepal Dedicated To Sita

ప్రస్తుతం ఎక్కడ చూసినా  ‘రామాయణం’  మూవీ గురించే చర్చ నడుస్తోంది.  ఈ క్రమంలో నేపాల్‌లోని  కొలువై ఉన్న సీతమ్మ వారి ఆలయం ఆసక్తి కరంగా మారింది. 152 ఏళ్ల పురాతన జానకి మందిరాన్ని  1874లో నిర్మించారట. స్థానిక, మొఘల్ వాస్తుశిల్ప శైలుల సమ్మేళనంతో నిర్మితమైన ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. 4,860 చదరపు అడుగుల వైశాల్యం, 50 మీటర్ల ఎత్తు, 3 అంతస్థులు, మొత్తం 60 గదులతో నిర్మితమైంది. అలాంటి దివ్యమైన ఆలయం విశేషాలు మరిన్ని తెలుసుకుందాం.

రామాయణంలో దాదాపు 300 రకాల వెర్షన్లలో ఏది తీసుకున్నా,  శ్రీరాముడు సతీమణి సీతమ్మను భూమి పుత్రికగా, జనక మహారాజు దత్తపుత్రిక కాబట్టి 'జానకి'గా, లవకుశుల తల్లిగా సీతమ్మగానే పరిచయం. పురాణ విశ్వాసాల ప్రకారం, శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి అర్ధాంగి, లక్ష్మీదేవి అవతారమే జానకి.  వాల్మీకి రామాయణం ప్రకారం, మిథిలా నగర రాజు జనకుడు పొలం దున్నుతుండగా ఒక మట్టి కుండలో ఆమె లభించింది. జనక మహారాజు, ఆయన భార్య సునయనలకు సంతానం లేకపోవడంతో ఆమెను దత్తత తీసుకుని పెంచారు.

భారతదేశంలో రాముడికి ఎన్నో గుడులున్నాయి.కానీ నేపాల్‌లో సీతాదేవికి ఒక ప్రత్యేక ఆలయం ఉండటం విశేషమే మరి.  దక్షిణ నేపాల్ , తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్న ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక మరియు భాషా ప్రాంతమైన మిథిలలో సీతాదేవి పెరిగింది.

నేపాల్‌లోని 152 ఏళ్ల పురాతన జానకి మందిర విశేషాలు
ప్రాంగణంలో 60 గదులతో ఉన్న ఈ ఆలయం నేపాల్‌లోనే అతిపెద్ద దేవాలయం. ఇందులో సీతాదేవి విగ్రహం కొలువై ఉంది.  ఈ విగ్రహం 17వ శతాబ్దంలో శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య సమీపంలో లభించిందని చెబుతారు. ధనుషా జిల్లాలోని జనక్‌పూర్‌లో ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం (సాధారణంగా డిసెంబర్‌లో వచ్చే) వివాహ పంచమి నాడు సీతారాముల కళ్యాణ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయ నిర్మాణ, వాస్తుశిల్ప  నైపుణ్యంతోపాటు, ఆలయానికి నైరుతి మూలలో 'వివాహ మండపం' మరో  ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు ఈ ఆలయం చుట్టూ నిర్మితమైన పరశురామ సాగర్, ధనుష్ సాగర్, గంగా సాగర్ మొదలైన 115 సరస్సులు  మరో పెద్ద ఆకర్షణ.సీతారాముల వివాహం జరిగిన ప్రదేశం ఇదేనని భక్తులు విశ్వసిస్తారు. ప్రతీ ఏటా నేపాల్ ప్రభుత్వమే వివాహపంచమి పేరిట సీతారాముల కల్యాణం జరిపిస్తుంది.

నౌ లఖా మందిరం
1,480 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం సున్నితమైన రాతి, పాలరాతి శిల్పకళల మేళవింపుతో బహుర​మ్యంగా అలరారుతోంది. నేపాల్ ప్రభుత్వం 1956 నాటి పురాతన స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం కింద ఈ ప్రాంతాన్ని రక్షిత స్మారక మండలంగా ప్రకటించింది. దీని నిర్మాణానికి సుమారు తొమ్మిది లక్షల బంగారు నాణేలు ఖర్చయినందున స్థానికంగా దీనిని 'నౌ లఖా మందిరం' (Nau Lakha Mandir) అని కూడా పిలుస్తారు. జానక మహారాజు ఇక్కడే పరమశివుని ధనుస్సును పూజించారని జానపద కథనాలు చెబుతున్నాయి.

శ్రీరామ మందిరం:  జానకి మందిరానికి సమీపంలోనే శ్రీరాముడికి అంకితం చేయబడిన మరో ఆలయం ఉంది. పగోడా (Pagoda) శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం జనక్‌పూర్‌లోని ఇతర దేవాలయాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో 'యోగమాయ'కు ప్రతీకగా భావించే ఒక స్త్రీ విగ్రహం ఉంది, దీనిని నేపాల్‌లోని అత్యంత సుందరమైన స్త్రీ రూప శిల్పాలలో ఒకటిగా పరిగణిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement