శబరిమల: ఎరుమేలి నుంచి పంబ వరకు యాత్ర విశేషాలు | Sabarimala Highlights of the journey from Erumely to Pamba | Sakshi
Sakshi News home page

శబరిమల: ఎరుమేలి నుంచి పంబ వరకు యాత్ర విశేషాలు

Nov 13 2026 2:55 PM | Updated on Nov 13 2026 3:00 PM

Sabarimala Highlights of the journey from Erumely to Pamba

తిరువనంతపురం: శబరిమల యాత్రలో అత్యంత ప్రాచీనమైనది, పవిత్రమైనది ఎరుమేలి నుంచి పంబ వరకు సాగే సంప్రదాయ అటవీ మార్గం (పెరువళి). వాహనంలో ఎరుమేలి నుంచి పంబకు చేరుకోవడానికి సుమారు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. అయితే , అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తే ఒకటి నుంచి రెండు రోజులు పడుతుంది. సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర అడవులు, కొండలు దాటుకుంటూ ఈ యాత్ర సాగుతుంది.

సంప్రదాయ అటవీ యాత్రా మార్గం
ఎరుమేలి: ఇక్కడి నుంచే సంప్రదాయ యాత్ర ప్రారంభమవుతుంది. పేటతుళ్లల్ నిర్వహించిన అనంతరం ధర్మశాస్తా ఆలయం, దర్శించుకుంటారు.

పెరూర్ తోడు: ఇక్కడ చేపలకు బియ్యం సమర్పించి అటవీ మార్గంలోకి ప్రవేశిస్తారు.

కాళకెట్టి: ఈ మార్గంలో ముఖ్యమైన ప్రాంతం. ఇక్కడి నుంచి పెరియార్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది.

అళుత నది: నదిలో స్నానం చేసి ఒక రాయిని తీసుకుని కొండపైకి ఎక్కుతారు. అనంతరం 'కల్ ఇడుంకున్ను' వద్ద ఆ రాయిని విడిచిపెడతారు. ఇది యాత్రలో పాటించే సంప్రదాయం.

ముక్కుజి: అటవీ మార్గంలో ముందుకు సాగుతూ ఈ ప్రాంతానికి చేరుకుంటారు.

కరిమల: యాత్రలో అత్యంత కష్టతరమైన కొండ ఎక్కే మార్గం. నిటారుగా ఉండే కొండను అధిరోహించడం భక్తులకు పెద్ద పరీక్ష.

వలియానవట్టం – చెరియానవట్టం: కరిమల దిగిన తర్వాత ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణించి చివరకు పంబకు చేరుకుంటారు.

అటవీ శాఖ నిబంధనలు: అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడానికి నిర్దిష్ట సమయ పరిమితులు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద నుంచి భక్తులను అనుమతించరు.

ప్రస్తుత శబరిమల యాత్ర మార్గం 
ప్రస్తుతం ఎక్కువమంది భక్తులు రోడ్డు మార్గంలో ఎరుమేలి, కాణనమల , నిలక్కల్ మీదుగా పంబకు చేరుకుంటున్నారు. నిలక్కల్ ప్రధాన బేస్ క్యాంపుగా పనిచేస్తుంది.

పంబ నుంచి నీలిమల , అప్పాచిమేడు , శబరిపీఠం మీదుగా శరంకుత్తికి చేరుకుంటారు.

కన్నిస్వాములు తమ వెంట తెచ్చుకున్న శరాలను శరంకుత్తిలో సమర్పించిన అనంతరం , ఇరుముడితో పవిత్రమైన పద్దెనిమిది మెట్లు (పదినెట్టాంపడి) ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు.

మండల మకరవిళక్కు యాత్ర కాలం: నవంబర్ 16న శబరిమల ఆలయం తెరుచుకోనుండటంతో మండల మకరవిళక్కు తీర్థయాత్రకు ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి.

ఇదీ చదవండి: శబరిమలలో ట్రాన్స్‌జెండర్లకు నో.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement