హైదరాబాద్: శబరిమల అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 54 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ముందస్తు టికెట్ బుకింగ్స్ రేపు (నవంబర్ 13) ఉదయం 8:00 గంటల నుండి ప్రారంభమవుతాయి.
మండల-మకరవిళక్కు సీజన్‌లో భాగంగా ఈ రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, చర్లపల్లి, హజూర్ సాహిబ్ నాందేడ్ స్టేషన్ల నుండి కేరళలోని కొల్లాం వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, కాజీపేట, వరంగల్, విజయవాడ, గుంటూరు తదితర ముఖ్య స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి.
ఇదీ చదవండి: TG: ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే!


