కాంగ్రెస్‌ది భారత వ్యతిరేక వైఖరి: కిషన్ రెడ్డి | Kishan Reddy Fires On Congress Bharat Summit | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ది భారత వ్యతిరేక వైఖరి: కిషన్ రెడ్డి

Nov 12 2026 6:31 PM | Updated on Nov 12 2026 6:39 PM

Kishan Reddy Fires On Congress Bharat Summit

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ష్ర్ట ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక ‘భారత్ సమ్మిట్’పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ నిధులతో కాంగ్రెస్ కార్యక్రమమైన భారత్ సమ్మిట్‌ను ఎలా నిర్వహిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు దేశంపై విషం చిమ్మే వ్యక్తులకు వేదిక కల్పించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది భారత వ్యతిరేక సమ్మిట్ అని, కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఎలాంటి విజన్ లేదని విమర్శించారు. దేశానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకే ఈ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.

సమ్మిట్ పేరుతో భారత్‌పై దాడి చేసే కుట్రలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు దేశ అభివృద్ధిని రాహుల్ గాంధీ ఎన్నడూ హర్షించలేదని ఆయన మండిపడ్డారు.

ఇదీ చదవండి: లోకల్ రైలులో మహిళపై దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement