జనసేన మూకల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | YSRCP files complaint over derogatory remarks by Jana Sena mobs | Sakshi
Sakshi News home page

జనసేన మూకల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Nov 12 2026 5:48 PM | Updated on Nov 12 2026 6:09 PM

YSRCP files complaint over derogatory remarks by Jana Sena mobs

విజయవాడ:  జనసేన మూకల జుగుప్సాకర వ్యాఖ్యలపై సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది వైఎస్సార్‌సీపీ.  ఈ మేరకు జనసేన మూకల అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో, వీడియోలను సైబర్‌ క్రైం పోలీసులకు అందజేశారు వైఎస్సార్‌సీపీ నేతలు.  సైబర్‌క్రైమ్‌ పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతల్లోఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దొడ్డ అంజి రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. 

దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ.. ‘ జనసేన నేతలు మా పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ విషయంలో స్పందించవద్దని జగన్ ఆదేశించారు. కానీ  ట్విటర్‌ స్పేస్ లో 350 మంది జనసేన నేతలు ఇష్టానుసారం మాట్లాడారు. సైబర్‌క్రైమ్‌ పోలీసులకు వీడియో, ఆడియో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

దేవినేని అవినాష్, మాట్లాడుతూ.. ‘జనసేన పార్టీ వ్యక్తులు జగన్ కుటుంబ సభ్యులపై మాట్లాడిన తీరు ఆక్షేపనీయం. కేవలం ఫిర్యాదు మంత్రమే కాకుండా పూర్తి ఆధారాలు సమర్పించాం.  ట్విట్టర్ స్పేస్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి ఆధారాలు ఇచ్చాం. వాళ్లను అరెస్టు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పై ఉంది. హోస్ట్ చేసిన వారి వివరాలు మొత్తం అందించాం. మహిళల పట్ల తప్పు జరిగితే ఊరుకోం అని ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రక్షణ కరువైంది. సినిమా డైలాగులు చెప్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ట్విటర్‌ స్పేస్‌లో వైఎస్‌ జగన్‌పై అసందర్భంగా జనసేన నేతలు మాట్లాడారు. ఆర్గనైజ్డ్ గా మా పార్టీ అధినేతపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. పూర్తి వీడియో, ఆడియో ఆధారాలు సమర్పించాం. మా పార్టీ సోషల్  మీడియా నేతలపై గతంలో అకారణంగా 800 పైగా కేసులు పెట్టారు. ట్విటర్‌ స్పేస్‌లో జనసేన మూకల అనుచిత వ్యాఖ్యలపై 24 గంటల్లో చర్యలు తీసుకోకుంటే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం’ అని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ట్విటర్‌ స్పేస్‌ పేరుతో జనసేన మూకల దాష్టీకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement