breaking news
Janasena
-
డీఎస్సీపై ప్రశ్నిస్తే దాడులా?.. ‘క్రిమినల్స్ అడ్డా’ ఎవరిది బాబు?
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు తన అనుచరులతో కలిసి గత గురువారం నాడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరంపై దాడి చేశారు. టెంట్ పీకేశారు. అక్కడ కొందరు టీడీపీ గూండాలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సరిగ్గా అదే టైమ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. బోండా ఉమ అరాచక ప్రవర్తనపై ఆయనకు సమాచారం అందే ఉండాలి. అయినా అలాంటివి చేయవద్దని చెప్పకపోగా, వైఎస్సార్‌సీపీవారిని ఉద్దేశించి గొడ్డలి పార్టీ, క్రిమినల్స్ తయారీ అడ్డా అంటూ చంద్రబాబు విమర్శించారట.కొన్నాళ్ల క్రితం బోండా ఉమ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కన కూర్చుంటే చంద్రబాబుకు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కమిటీ వేసి మందలించే ఏర్పాటు చేశారు. తదుపరి తన కుమారులతో కలిసి బోండా ఉమ చంద్రబాబును కలిశారు. అక్కడ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కాని, మరుసటి రోజే ఉమా విజయవాడలో గూండాయిజానికి బరి తెగించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆయన అనుచరులు దాడి చేశారు. విజిటేరియన్ అయిన విష్ణుపై కోడిగుడ్లు విసిరారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. వారు తమ డిమాండ్‌తో ప్రశాంతంగా దీక్షలు చేస్తున్నారు. దీనిని భరించడం టీడీపీ నాయకత్వానికి కష్టంగా మారింది.నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. జార్ఖండ్‌లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వాటికి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మద్దతు ఇస్తున్నారు. ఏపీలో కూడా డీఎస్సీ టీచర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ ఆధార సహితంగా ఆరోపణలు చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ పక్షాన సరైన జవాబు ఇవ్వలేకపోతున్నారు. పలువురు డీఎస్సీ అభ్యర్ధులు తమకు అన్యాయం జరిగిందని సాక్ష్యాలు చూపుతున్నారు. అయినా ప్రభుత్వం డబాయించి తప్పించుకోవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ వివిధ రూపాలలో ఆందోళనలు సాగిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై జరుగుతున్న ప్రచారం ప్రజలలోకి వెళుతుండడంతో చంద్రబాబు, లోకేష్‌లు అసహనానికి గురవుతున్నారు. అందువల్లే ప్రభుత్వం అనుకుంటే రెండు నిమిషాలలో అణచివేయగలదని బెదిరించడం, ఆందోళన చేస్తున్న రైతులను, నిరుద్యోగ యువతను గంజాయి బాచ్ అని అనడం వంటివి చేశారనిపిస్తుంది. ఇవన్ని ముఖ్యమంత్రి స్థాయికి తగనివని ఆయనకు తెలిసినా ఏదో నిస్సహాయ స్థితిలో పడ్డారనిపిస్తుంది. ఎదురుదాడిలో భాగంగా కర్నూలులో కొందరితో ప్రదర్శన చేయించారు. వారు ఏ తరహా వారో తెలియదు. ఎల్లో మీడియా ప్రముఖంగా ఆ కథనాన్ని ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ర్యాలీ చేస్తే వారు పవిత్రులు, వ్యతిరేకంగా చేస్తే గంజాయి బాచ్లని ప్రచారం చేస్తారన్నమాట. తనవైపు వాదన సరిగా లేనప్పుడే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడతాయన్న అబిప్రాయం ఉంది. దేవరపల్లిలో జగన్ టూర్లో ఒక చిన్న హోటల్లో జరిగిన ఉదంతాన్ని కూడా పెద్దదిగా ఫోకస్ చేయాలని యత్నించి చంద్రబాబు అండ్ కో భంగపడ్డారు. ఆ హోటల్ యజమానురాలు లక్ష్మి వచ్చి జగన్‌ను కలిశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోకపోవడం గొప్ప విషయమే. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్‌లను సంతృప్తిపరచడానికి బోండా ఉమా కాని, మరికొన్ని చోట్ల ఇతర టీడీపీ నేతలు కాని దాడులు చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దానికి తగినట్లే ఉమా మాట్లాడుతూ లోకేష్‌ను విమర్శిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా దీక్ష శిబిరాలు నిర్వహిస్తారా అని అంటున్నారు.నిజానికి విష్ణు పోలీసులకు చెప్పే దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. చిత్రంగా శిబిరానికి రక్షణ కల్పించవలసిన పోలీసులు దాడికి పాల్పడ్డ ఉమాను కాకుండా, శాంతియుతంగా కూర్చుని ఉన్న విష్ణును వాహనం ఎక్కించి తరలించారు. అదే టీడీపీ ఎక్కడైనా సభ పెడితే ఆ సమీపంలోకి అయినా విపక్షాలను రానిస్తారా? ఇప్పుడు చెప్పండి.. క్రిమినల్స్ తయారీ అడ్డాగా టీడీపీ ఉందా? వైఎస్సార్సీపీ ఉందా? ఈ దాడుల ద్వారా డీఎస్సీ అక్రమాల వ్యవహరం మరింతగా ప్రజలలోకి వెళుతుంది. ప్రభుత్వ తీరుపై మరిన్ని అనుమానాలు బలపడతాయి. మరికొన్ని ఉదాహరణలు గమనించండి.ఒక మంత్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ స్వయంగా లోకేష్‌కు ఫిర్యాదు చేశారట. అయినా ఆ మంత్రిపై చర్య తీసుకోలేదే? అంటే ఎవరు క్రిమినల్స్ అడ్డాలో ఉన్నట్లు అవుతుంది! ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేశారే. ఒక టీడీపీ నేత తన భార్య నైటీని తానే చించి ఎమ్మెల్యేపై ఆరోపించిన విషయం వీడియో సహితంగా బయటపడి ఉండకపోతే, ఎమ్మెల్యేపై ఆరోపణలను నమ్మే పరిస్థితి వచ్చేది కదా? ఇలాంటివాటిని చేసేవారిని కదా క్రిమినల్స్ అనాల్సింది. అలాంటివారిని ఎంకరేజ్ చేసే పార్టీని కదా క్రిమినల్స్ తయారు చేసే అడ్డా అనాల్సింది అని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. దానిని కాదనగలరా?ఈ మధ్యనే గుంటూరులో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసింది కూడా టీడీపీ నేతే కదా! అంతేకాదు. కొందరు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడింది ఫిర్యాదులు వచ్చాయే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన ఘట్టం మరిచిపోయారా? ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతిని నడిరోడ్డులో పోలీసు లాఠీతో కొట్టింది జనసేన నేత కదా! ఆ ఎమ్మెల్యేపై కాని, దౌర్జన్యం చేసిన జనసేన నేతపై కాని ఏమైనా చర్య తీసుకున్నారా? పలు చోట్ల బాధితులపైనే కేసులు పెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్‌లు ఇలాగే క్రిమినల్స్ అంటూ ఆరోపణలు చేసేవారు. ఎన్నికల సమయానికి వారిలో పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు. అంటే టీడీపీ క్రిమినల్స్ అడ్డాగా మారిందని ఒప్పుకుంటున్నటా?కాదా? డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. దానికి సమాధానం ఉంటే చెప్పాలి. లేదా ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవచ్చు.గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన వెంటనే తన కుమారుడు జగన్‌పై సీబీఐ విచారణకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పుకున్న ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడిపై డీఎస్సీ ఆరోపణలు వస్తే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన జరిగిన హత్యలు, హత్యాయత్నం ఘటనలు, టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇవన్ని చూస్తుంటే 1983లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు చెప్పిన ఆదర్శాలు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి?ఒక వైపు క్రిమినల్స్‌ను ప్రోత్సహిస్తూ మరో వైపు వైఎస్సార్సీపీపై అదే విమర్శ చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పే అని, నిష్ఫక్షపాతంగా పనిచేయండని పోలీసులకు చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు ఈ వయసులో కూడా ఇలాంటి ప్రమాణరహిత రాజకీయాలు చేయడం వల్ల ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెడ్‌బుక్ అరాచకాలకు స్వస్థి పలికి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే నష్టం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మంత్రి దుర్గేష్ ను అడ్డుకున్న రఘురామకృష్ణంరాజు గన్ మెన్
-
కడపలో మళ్లీ ఫ్యాక్షన్. కూటమి ఎమ్మెల్యేల గూండాగిరి
-
అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో రచ్చ
సాక్షి, గుంటూరు: అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో రగడ చోటుచేసుకుంది. స్టాల్స్‌ను తిలకించడానికి వచ్చిన మంత్రి దుర్గేష్‌ను డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు గన్‌మెన్ అడ్డుకున్నారు. జనసేన నేతలను రఘురామకృష్ణరాజు గన్‌మెన్ పక్కకు నెట్టేశారు. దీంతో రఘురామకృష్ణ రాజు గన్‌మెన్‌తో జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. అరుపులు, కేకలతో ప్రాంగణం దద్దరిల్లింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముందే గొడవ జరిగింది. -
శ్వేతపత్రం గేమ్ ఇందుకేనా చంద్రబాబు ?
సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలను ఎలా గందరగోళ పరచాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. రెండేళ్ల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై శ్వేతపత్రం ఇవ్వవలసిన అవసరం ఏమి వచ్చింది? రానున్న రోజుల్లో ప్రజల నడ్డి విరిచే విధంగా అదనపు భారం పడే అవకాశం ఉంటుందా? లేక తను ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదని సంకేతం ఇవ్వడమా? టీడీపీ, జనసేన కలిసి బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేసినట్లు భ్రమ పడాలనా? ఉద్యోగులు ఇకపై తమ డిమాండ్లను అడగకుండా బెదిరించడమా? 2024 ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన రీతిలో ఈ రెండేళ్లలో ఎంత సంపద సృష్టించారో ఎందుకు చెప్పలేకపోతున్నారు? పైగా అప్పులు చేయకపోతే సంక్షేమ స్కీములు ఇవ్వలేమన్న సందేశం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది. జగన్ టైమ్ లో రెండేళ్ల కరోనా ఉన్నా,ఎన్నడైనా ఆర్ధిక పరిస్థితిపై ప్రజలను బేజారెత్తించేలా మాట్లాడారా? ఆయన టైమ్ లో ఓడరేవులు, మెడికల్ కాలేజీలు,ఊరూరా సచివాలయ భవనాలు వంటి ఎన్నిటినో నిర్మించి సంపద సృష్టిస్తే, కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన ప్రగతి ఏమిటి?ప్రైవేటువారు తప్ప, ప్రభుత్వం ఏమి చేయలేదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడడం బలహీనతగా కనిపించదా?అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా గత ప్రభుత్వంపైన విమర్శలు చేసి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా?లేదా?ఏతావాతా చూస్తే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఏభై ఏళ్లకే ఎస్సి,ఎస్టి,బిసి లకు పెన్షన్, ఉద్యోగులకు పిఆర్సి వంటివి ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ శ్వేతపత్రం కధను నడిపారా?అన్న ప్రశ్న వస్తోంది.అయితే ఆ విషయం మనసులో పెట్టుకుని పైకి మాత్రం సంక్షేమ కార్యక్రమాలు ఆపబోమని చెబుతున్నా,ఏదో జరగబోతోందన్న అనుమానం కలుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎపిలో ఎక్కడకు వెళ్లినా జన ప్రభంజనం కనిపిస్తుండడంతో, చంద్రబాబు తన మానిఫెస్టోలోని కొన్నిటిని అయినా, కొంతమేర అయినా అమలు చేశారనిపిస్తుంది. గతంలో ఆయన ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, విభజిత ఎపికి 2014 టరమ్ లో సి.ఎమ్.గా పనిచేసినప్పుడు కాని ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి.2014 ఎన్నికలకు ముందు రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక కొద్ది మొత్తం చేసి ఆశకు హద్దు ఉండాలని వ్యాఖ్యానించారు. పలుహామీలను ఎగవేశారన్న విమర్శను ఎదుర్కున్నారు. 1995 లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావును కుర్చీ నుంచి దించేసి తాను సి.ఎఎమ్ అయ్యాక చేసిన డబుల్ గేమ్ ఒక ఉదాహరణ అవుతుంది. అప్పట్లో కిలో సబ్సిడి బియ్యం ధర రెండు రూపాయలు ఉండేది. ఎన్.టి.ఆర్. మద్య పాన నిషేధం అమలు చేశారు.ఇలాంటివి మరికొన్ని కూడా ఉన్నాయి. ఎన్.టి.ఆర్. 1996 జనవరిలో మరణించారు. అదే సంవత్సరం లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల ప్రచారంలో తాము గెలిస్తేనే ఈ స్కీములన్నీ కొనసాగించగలగుతామని చెప్పేవారు.మద్య నిషేధం మరింత గట్టిగా అమలు చేస్తానంటూ హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు. ఎన్నికలు పూర్తి అయ్యాక రాష్ట్ర ఆర్దిక పరిస్థితి బాగోలేదంటూ జనానికి చెప్పడం ఆరంభించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ సమావేశాలు పెట్టించారు.ఆయన కూడా స్వయంగా కొన్నిటిలో పాల్గొనేవారు. ఉదాహరణకు ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో జరిగిన మీటింగ్ లో మద్య నిషేధంపై అభిప్రాయం అడిగారు.మద్య నిషేధాన్ని సరిగా అమలు చేయలేకపోతున్నామని, అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోందని చెప్పేవారు. 1994 ఎన్నికలకు ముందు ప్రజలను , వివిధ వర్గాలవారిని అడిగి వాగ్దానాలు ఇవ్వలేదు .ఎన్.టి.రామారావు వాటిని అమలు చేసిన నేపధ్యంలో తనపై వ్యతిరేకత రాకుండా ఉండడానికి చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేసేవారు.తదుపరి కిలో రేషన్ బియ్యాన్ని 5.50 రూపాయలకు పెంచారు. మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. ఇలా పలు నిర్ణయాలను తిరగదోడారు. అయితే ఇదంతా ప్రజల ఆమోదంతోనే జరిగిందన్న భావన కల్పించడానికి యత్నించారు. సరిగ్గా అదే పంధాలో ప్రస్తుతం కూడా ఆయన వెళ్లే యత్నం చేస్తున్నారా అన్న సందేహం వస్తుంది.అప్పటి రాజకీయ పరిస్థితులు, సమాచార వ్యవస్థ, ఇప్పుడున్న పరిస్థితి, సోషల్ మీడియా వేరు.అందువల్ల కొంత జంకుతున్నట్లు అనిపిస్తుంది. 2024 ఎన్నికలకు ముందు కూడా ఆకాశమే హద్దుగా వరాలు ప్రకటించారు.అదేమంటే సంపద సృష్టించడం తెలుసునని అన్నారు. తీరా చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. జగన్ టైమ్ లో రెండేళ్ల కరోనా ఉన్నప్పటికీ మొత్తం ఐదేళ్లలో సుమారు 35వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చగలిగితే ,ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కేవలం 600 కోట్ల అదనపు ఆదాయమేనని వైసిపి నేతలు లెక్కలు చెబుతున్నారు. అయినా గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని, దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందన్న ప్రచారం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. ఆ విధ్వంసం ఏమిటో ఎంతకీ చెప్పకపోవడం విశేషం.చంద్రబాబు ఈసారి ఒక సంగతి చెప్పారు. రెండు హామీలు తప్ప మిగిలినవి అమలు చేశామని అన్నారు.ఇంతకుముందు అన్ని చేసేశామని, ఎవరైనా ఇంకేమైనా అడిగితే వారి నాలుక మందమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మాత్రం రెండు హామీలు అమలు చేయలేదని అంగీకరించడం విశేషం. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు.దానికి ప్రత్యామ్నాయంగా పి-4 అమలు చేస్తున్నామని కొన్నాళ్లు చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదన్న సంగతి అర్దం అయి ఉండాలి. అలాగే 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని, 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని అన్నా,కేంద్రం వాటిలో ఉన్న సత్యం ఏమిటో చెప్పేసింది. కేవలం ఏడువేల కోట్ల లోపే పెట్టుబడులు వచ్చాయని, వాటివల్ల 22 వేల ఉద్యోగాలు వస్తాయని ఒక జవాబులో వెల్లడించింది. చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన హామీల ప్రకారం ఏడాదికి సుమారు లక్షన్నర కోట్లు సంక్షేమ స్కీములకు వెచ్చించాలని అంచనా.కాని రెండేళ్లకు కలిపి అంత చేశానని ఆయన తెలిపిన లెక్కలను బట్టి అర్ధం అవుతుంది. మొదటి సంవత్సరం ఒక్క పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మరే స్కీమ్ అమలు చేయలేదు. ఆ తర్వాత అమలు చేస్తున్నా,అనేక పరిమితులు, కోతలు పెడుతున్నారన్న విమర్శ ఉంది. ఇక ఉద్యోగ సంఘాలు తమకు చేసిన వాగ్దానాల గురించి అడుగుతుంటే,ఇప్పటికే మొత్తం రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే పోతున్నదని ప్రకటిస్తున్నారు. అంటే ఇది ఒకరకంగా వారిని బెదిరించడమే అవుతుంది కదా అని అంటున్నారు.ఆయన ఎన్నికల మానిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఎందుకు మాట్లాడరో ప్రజలు అర్ధం చేసుకోలేరా? అప్పుల గురించి నేరుగా వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. కాగా ద్రవ్యలోటు అన్నది మిద్య అని,కాకి లెక్కలు అని చంద్రబాబు వ్యాఖ్యానించడం విన్నవారికి మతిపోయినంత పని అయింది. అంటే బడ్జెట్ మిద్య, సంపద సృష్టి అన్నది మిద్య అని అనుకోవాలా? ఇంతకీ ఈ శ్వేత్రపత్రం విడుదలలో అసలు లక్ష్యం ఏమిటో తెలియడానికి మరికొంత సమయం పడుతుందేమో చూడాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మరోసారి కేబినెట్ భేటీకి పవన్ గైర్హాజరు
సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ మరోసారి గైర్హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడం ఇది వరుసగా మూడోసారి. గతంలో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన రాలేదు.గతంలో రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరవుతుండటం కూటమి సర్కార్‌లో అసలేం జరుగుతోంది?. అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలకు తావిస్తోంది. వరుసగా మూడు కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం
-
తాడికొండలో వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం
సాక్షి, గుంటూరు: తాడికొండ నియోజకవర్గంలో దారుణం జరిగింది. మేడికొండూరు మండలం డోకిపర్రులో వైఎస్సార్సీపీ నేత రత్తయ్యను చంపేందుకు జనసేన నేతలు యత్నించారు. రత్తయ్య తల, ముఖంపై రాళ్లతో దాడి చేసిన జనసేన మూకలు.. ఆయన చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తుపట్టి.. రత్తయ్యను ఆసుపత్రికి తరలించారు.20 రోజుల క్రితం రత్తయ్య ఇంటిపై జనసేన మూకలు దాడి చేశారు. రత్తయ్య తన ఇంటి ముందు వైఎస్సార్సీపీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ తీసేయాలని రత్తయ్యను జనసేన నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలో జనసేన నేతలపై ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో జనసేన నేతలపై గ్రీవెన్స్‌లో రత్తయ్య ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రత్తయ్యపై రాత్రి విచక్షణారహితంగా రాళ్లు, కర్రలతో దాడి చేశారు. రత్తయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
జనసేన పార్టీ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులను పవన్ కల్యాణ్ రద్దు చేశారు. పార్టీ నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరు టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని పవన్ ఆదేశించారు. నూతన కమిటీలు ప్రకటించే వరకు మీడియాలో జనసేన పార్టీ పేరుతో పాల్గొనవద్దంటూ జనసేన పేర్కొంది. నూతన కమిటీ నియామకం తర్వాతే టీవీ డిబేట్లలో పాల్గొనాలని పేర్కొన్న పవన్ కల్యాణ్.. మీడియాలో జనసేన పేరు వాడకూడదంటూ ఆదేశాలు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. -
గొప్పల కోసం అప్పులు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న కూటమి
-
బూతులు తిట్టి.. మర్మాంగంపై కొట్టి..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో పాలక పార్టీల నేతల సేవలో తరిస్తూ పలువురు పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగమే పరమావధిగా రెచ్చిపోతున్నారు. వారి నుంచి ఫిర్యాదు వచ్చిందే తడవుగా విచక్షణ మరచి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వారే శిక్షలు విధిస్తున్నారు. వరుస లాకప్ మరణాలతో రాష్ట్రం హోరెత్తి పోతున్నా కొందరు ఖాకీల్లో ఇసుమంతైనా మార్పు రావడం లేదు సరికదా.. మరింత రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండల పోలీసుల దాష్టీకానికి ఓ నిండు ప్రాణం బలైంది. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం మేరకు.. రామచంద్రాపురం మండలం రాయలచెరువులో నివాసముంటున్న సుబ్రమణ్యం (51)కు, పక్కనే నివాసముంటున్న జనసేన మండల అధ్యక్షుడు సంజీవని హరికి శనివారం ఇంటి ముందు నీళ్లు నిలవడంపై చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో హరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దేవర మనోహర్ సాయంతో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. ఆపై చంద్రగిరి డీఎస్పీ ద్వారా ఎస్ఐకు ఫోన్ చేసి సుబ్రమణ్యంపై తప్పుడు కేసులు బనాయించారు. ఈ క్రమంలో శనివారం గ్రామానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల ఎదుటే సుబ్రమణ్యంను బూటు కాలితో తన్నుకుంటూ.. బూతులు తిడుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. హెడ్‌కానిస్టేబుల్ రాజశేఖర్.. పిడిగుద్దులు గుద్దుతూ.. బూటు కాలితో తంతూ, పరుష పదజాలంతో దూషించారు. అనంతరం సుబ్రమణ్యంను దేశ ద్రోహి తరహాలో బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. విచక్షణా రహితంగా కొట్టి వదిలిపెట్టారు. అంతటితో ఆగకుండా ఆదివారం మరోసారి సుబ్రమణ్యంను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎలాంటి మహిళా పోలీసులు లేకుండానే ఆయన భార్య నిర్మల, మైనర్ కొడుకు, కూతురు ప్రశాంత్, జయమ్మలను సైతం బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆపై ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ వీరిని అసభ్య పదజాలంతో దూషించారు. తండ్రిని కళ్లెదుటే కొడుతుంటే తట్టుకోలేక కుమారుడు అడ్డుకోబోగా.. అతడ్ని సైతం కొట్టారు. ఆపై వారి కళ్లెదుటే సుబ్రహ్మణ్యం మర్మాంగంపై లాఠీలతో కొట్టారు. ఆదివారం రాత్రి కదల్లేని స్థితిలో అతికష్టంగా ఇల్లు చేరుకున్న బాధితుడు.. అవమాన భారం తట్టుకోలేక సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికీ సర్కారు అండ చూసుకుని పోలీసులు చేసిన హత్యే అని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రమణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.సెటిల్మెంట్కు పోలీసుల యత్నం ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తడంతో పోలీసు పెద్దలు ఆందోళనకు గురయ్యారు. బాధిత కుటుంబంతో మాట్లాడి పరిహారం ఇచ్చేలా సెటిల్మెంట్ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో జనసేన నేత సంజీవని హరి కొంత డబ్బు ఇచ్చేలా ప్రామిసరి నోట్లు రాయించి బాధితులకు అందజేసేందుకు యత్నించారు. తాము కూడా కొంత డబ్బు ఇస్తామని బాధితులతో పోలీసులు బేరాలాడారు. ఎలాగైనా కేసును నీరుగార్చేందుకు పోలీసులు, కూటమి నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. -
తిరుపతిలో జనసేన నాయకుడు ఆత్మహత్య
-
జనసేన నేత అనుమానాస్పద మృతి
సాక్షి,తిరుపతి: జనసేన పార్టీ రాజంపేట సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శివకుమార్ (48) తిరుపతిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనడీ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నూనెవారిపల్లికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.శివకుమార్ ఈనెల 26న తన ఇంటి నుండి బయలుదేరి తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించారు. అనంతరం తిరుపతి కెనడీ నగర్లో ఉంటున్న తన బంధువు చింతల రమణమూర్తి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇంటి బాత్రూంలో శివకుమార్ ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మృతుడి భార్య కళ్యాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఈస్ట్ ఎస్ఐ రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.మృతిపై ముసురుతున్న అనుమానాలు శివకుమార్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు పర్యటనలో ఉన్న సమయంలో పెరియపాలెంలో ద్విచక్ర వాహనాన్ని వదిలేశారని, అక్కడే ఇద్దరు వ్యక్తులు తమ సిమ్ కార్డులను పారేసినట్లు శివకుమార్ బంధువు పవన్ తెలిపారు. నిన్న తిరుపతిలోని రమణమూర్తి ఇంటికి శివకుమార్, పవన్ కలిసి వచ్చారు. ఈరోజు ఉదయం వైఫై కనెక్ట్ అవ్వడంతో, వాట్సాప్ కాల్ ద్వారా పవన్‌తో శివకుమార్ భార్య కళ్యాణి మాట్లాడారు. ఆ మాట్లాడిన కొద్దిసేపటికే శివకుమార్ బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. -
పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z
-
కూటమిలో చిచ్చు.. మాకే ఆహ్వానం లేదా!?
సాక్షిప్రతినిధి, విజయనగరం: మన ఊరిలో మీటింగ్ పెట్టి మనకు ఆహ్వానం లేకపోవడమా..? వంటలన్నీ మనతో చేయించి మనకు పళ్లెం వేయకపోవడమా? మనతో ఫంక్షన్ కుర్చలు సర్దించి మనను చివరకు గుమ్మం బయట నిలబెడితే ఎలా ఉంటుంది? అచ్చం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరిస్థితిలానే ఉంది. బయటకు చెప్పలేక.. ఎవరికీ చెప్పుకోలేక.. క్యాడర్ ముందు బిల్డప్ కొట్టుకోలేక.. అబ్బబ్బ ఈ కష్టాలు.. అవమానాలు పగవాడిక్కూడా రావద్దు సుమీ..! అన్న వ్యాఖ్యలు నెల్లిమర్ల నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు వస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనుండగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు పాల్గొంటున్నట్టు ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ జీఎమ్మార్ ఆహ్వాన పత్రికను విడుదల చేసింది. అందులో స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి పేరులేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎయిర్‌ఫోర్ట్ ప్రారంభానికి ముందు ప్రధాని పర్యటన ఏర్పాట్లు అంటూ రోజూ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లడం.. ఏర్పాట్లు.. పర్యవేక్షణ అంటూ హడావుడి చేయడం తప్ప ఆఖరుకు జీఎంఆర్ వారు వేసిన ఆహ్వాన పత్రంలో కూడా ఎమ్మెల్యే పేరు లేకపోవడం పార్టీ క్యాడర్‌ను ఆవేదనకు గురిచేస్తోంది. ఎయిర్‌పోర్టు రానీయండి.. వేలల్లో ఉద్యోగాలు..ఇక మీ జీవితాలు మారిపోతాయి.. ఇంటికో ఉద్యోగం.. రెండు చేతుల్లో డబ్బులు గలగలా అంటూ చెప్పుకొచ్చిన ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రంలో పేరు లేకపోవడం చూసి.. ఆమె స్థాయి ఇంతేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, దీనివెనుక స్థానిక టీడీపీ నేతల కుతంత్రం ఉందన్న వ్యాఖ్యలు జనసేన క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు లేని ప్రాధాన్యం లోకేశ్‌కు ఎలా ? ఎంతపెద్ద నాయకుడు వచ్చినా స్థానిక నాయకత్వానికి అయితే ప్రత్యేక ప్రొటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు వేదిక మీద సీట్లు ఉంటాయి. కానీ ప్రధాని కార్యక్రమానికి మాత్రం స్థానిక ఎమ్మెల్యే మాధవికి ప్రత్యేక ఆహ్వానం లేకపోవడం ఆమెను జీఎమ్మార్ లైట్ తీసుకున్నట్లే అంటున్నారు. ఇదిలా ఉండగా అసలు ఈ ప్రాంతానికి, ఆ ప్రాజెక్టుకు సాంకేతికంగా ఎలాంటి అనుబంధం లేని లోకేశ్, పవన్ కల్యాణ్ వంటివారికి ఎలా ప్రాధాన్యం ఇచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి. -
ప్రశ్నిస్తే జైలు.. పొగిడితే జేజేలా?
సోషల్ మీడియాలో పెడధోరణులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ వేస్తుందట. ప్రభుత్వం మీద వచ్చే నెగిటివ్ వార్తలపై నిఘా పెడతారట. అసభ్య పోస్గింగులను అరికట్టే నెపంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అడుగులు వేస్తోందా అన్న సందేహాన్ని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు.అసభ్య పోస్టులు ఎవరు పెట్టినా తప్పే. వాటిని కచ్చితంగా కంట్రోల్ చేయవలసిందే. కాని ఇప్పటికే అందుకు తగిన వ్యవస్థ ఏపీలో ఉంది. అయినా అది సరిపోవడం లేదని ప్రభుత్వం ఎందుకు అంటోంది? పోలీసు వ్యవస్థ సమర్థంగా ఆ దిశలో పనిచేయడం లేదని భావిస్తున్నారా? అసభ్య పోస్టింగ్‌లను ఎలాగైనా ఆపవచ్చు. అసలు సమస్య ఏమిటంటే కూటమి సర్కార్‌పై పెరుగుతున్న వ్యతిరేకత సోషల్ మీడియాలో ప్రతిబింబిస్తుండడం కావచ్చు. దానిని కంట్రోల్ చేస్తే వచ్చే ఎన్నికలలో నెగ్గగలమన్న ఆశ ఉండవచ్చు. నిజానికి సోషల్ మీడియాతోనే గెలుపు ఓటములు నిర్ణయం కావు. ప్రభుత్వం అనుసరించే విధానాలు, ఇచ్చిన హామీలు అమలు చేసే తీరు మొదలైనవి ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అయితే అసత్య ప్రచారాల వల్ల నష్టం జరగదా అంటే కాదని అనలేం. కాని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వైఎస్సార్సీపీకు చెందినవారు కాని, వారి సోషల్ మీడియా కాని అబద్దాలు చెప్పే అవకాశం తక్కువ. నిజాలు చెబుతుంటేనే పోలీసు వ్యవస్థను ఉపయోగించి వైఎస్సార్సీపీవారిపై ఎన్ని కేసులు పెడుతున్నది కనబడుతున్న తరుణంలో కోరికోరి ఎవరు సమస్య తెచ్చుకుంటారు? సోషల్ మీడియా పోస్టులలో పచ్చి బూతులు పెట్టిన కొందరిని టీడీపీ ఎంకరేజ్ చేస్తున్నదన్న ఆరోపణ ఉంది.జగన్ ప్రభుత్వ సమయంలో అలాంటివారిపై ఏవైనా చర్య తీసుకోబోతే ఇంకేముంది ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు, వాక్ స్వాతంత్రం, మీడియా స్వాతంత్రం పూర్తిగా పోయాయి అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారితో పాటు ఎల్లో మీడియా వారు ఎన్ని ఆరోపణలు చేసేవారు? బహుశా వారు ఆ సంగతులు మర్చిపోయి ఉండవచ్చు. అరాచక పోస్టులు పెట్టిన ఒక వ్యక్తితో మహానాడులో ప్రసంగమే ఇప్పించారే! అది ఏపాటి మర్యాద అవుతుంది? వైఎస్ జగన్ కుటుంబంపైన, వైఎస్సార్సీపీ నేతల కుటుంబాలపైన, ఆ పార్టీ మహిళా నాయకులపై ఎంత దారుణమైన వ్యాఖ్యలను టీడీపీ మద్దతుదారులు కొందరు ఎలా చేశారో అందరికి తెలుసు. వారిలో కొందరికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. మరికొందరు అంతకన్నా పెద్ద పదవులలోనే ఉన్నారు కదా! బహుశా తమ అనుభవం రీత్యా, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను అణచివేయడమే మార్గంగా భావించినట్లు ఉన్నారు.మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియాపైనే ఎక్కువగా చర్చ జరిపే పరిస్థితి వచ్చిందంటేనే ఈ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు సాధారణంగానే అభ్యంతరకరంగా ఉండే సోషల్ మీడియాపై కేసులు పెడుతుంటారు. కాని వారి బాధ్యత ఈ ప్రభుత్వం వచ్చాక మారిపోయింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్‌గా ఉండే ప్రభుత్వ లోటుపాట్లపైన, వైఫల్యాపైన ప్రశ్నిస్తారో వారందరిపై ఏదో రూపేణా కేసులు పెట్టడమే పోలీసుల విధిగా మారిపోయినట్లుంది. అందుకే ఏకంగా సుమారు 1500 కేసులు సోషల్ మీడియాపై పెట్టారు. ఆ కేసులో 1300 మందిని అరెస్టు చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని సీపీఎం కార్యదర్శి వి. శ్రీనివాసరావు వంటివారు గొంతెత్తి చెబుతున్నారు.రావణ్ అనే యూట్యూబర్‌పై దేశద్రోహ కేసు పెట్టి కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. టీడీపీ మద్దతుదారుగా భావించే మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా రావణ్‌పై ఆ చట్టాన్ని ప్రయోగించడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. వీరెవ్వరిని తప్పుపట్టని చంద్రబాబు ఈ కేసును వైఎస్సార్సీపీకి రుద్దాలని ప్రయత్నించడమే ప్రభుత్వ బలహీనతగా తీసుకోవాలి.ఒకప్పుడు కులమతాలను రెచ్చగొడుతూ టివీలో నిత్యం మాట్లాడే ఒక నాయకుడిమీద ఆనాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెడితే దానిపై ఆ రోజుల్లో తెలుగుదేశం ఇంతెత్తున ఎగిరిపడింది. ఈ రోజుల్లో కూడా రాజద్రోహం ఏమిటి అని ప్రశ్నించింది. కాని తాను అధికారంలోకి రాగానే సోషల్ మీడియాపై దాడి చేయడమే కాదు.. ఒక చిన్న యూట్యూబర్‌పై రాజద్రోహం కేసు పెట్టి కూటమి సర్కార్ తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సంతృప్తిపరచడానికా? లేక సోషల్ మీడియాను భయపెట్టడానికా అన్నది వేరే సంగతి.నిజానికి చంద్రబాబు ప్రభుత్వం దేనిమీద టాస్క్ ఫోర్స్‌లు వేయాలి? టీడీపీ, జనసేనలు కలిసి ఇచ్చిన ఎన్నికల హామీలు ఎన్ని అమలు చేశాం. ఇంకెన్ని చేయాలి? వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఎలాంటి పద్దతి అనుసరించాలి? అన్నవాటి మీద కదా! పెన్షన్ నాలుగువేలు చేయడం, మరికొన్నిటిని అరకొరగా అమలు చేయడం మినహా ఎన్నికల మానిఫెస్టోని తుంగలో తొక్కినట్లుగా వ్యవహరిస్తూ, సోషల్ మీడియాతో ఏదో ప్రమాదం ముంచుకువస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని అరికట్టాలట. ఇది తప్పు కాదు. కాని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎన్ని అబద్దాలు ప్రచారం చేశారో జనానికి తెలియదా?కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీసర్వే చేస్తుంటే, జగన్ ప్రజల భూములు కాజేస్తున్నారని చేసిన ప్రచారాన్ని ఏమంటారు?ఇప్పుడు అదే రీసర్వే తమ ఘనత అని ఎలా చెప్పుకుంటున్నారు? 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని, అందుకు వలంటీర్లు బాద్యులని చెప్పిన సంగతి నిజమా? అబద్దమా? కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అంటూ చంద్రబాబు అచ్చంగా వాటి గురించి పలుమార్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే సీనియర్ నేతలలో ఒకరైన చంద్రబాబు వీటిగురించి పదే, పదే మాట్లాడడం సరైనదేనా. తనకు ఫలానా కులం వారైనా ఓట్లు వేయరా అని అడిగిన వ్యక్తిని పక్కనబెట్టుకున్నదెవరు?ఒక సభలో మాట్లాడుతూ గతంలో శ్రీరాముడి తల తొలగించారని ఆరోపించడం సరైనదేనా? ఆ కేసులో పట్టుబడిన వ్యక్తి టీడీపీ మద్దతుదారు అని అప్పట్లో పోలీసులు వెల్లడించారే. ఆ వ్యక్తికి కూటమి అధికారంలోకి వచ్చాక ఐదు లక్షలు ఇచ్చారని వార్తలు వచ్చాయే! ఆదోనిలో శివాలయంలో ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించుకున్నాడని చంద్రబాబు చెప్పారు. దీనిపై చర్య తీసుకోవలసింది ఎవరు? పైగా అతను జనసేనకు చెందినవాడని వెల్లడైంది కదా! పదే, పదే ఇలాంటి విషయాలను ప్రస్తావించడం సమాజానికి మంచిదా? ఇవన్ని ఎందుకు! ఇతర మతాలను దూషిస్తున్న ఒక వ్యక్తి జోలికి ఎందుకు ప్రభుత్వం వెళ్లడం లేదు? ముఖ్యమంత్రి, లేదా కీలకమైన పదవులలో ఉండి మీ మతం, మా మతం, మీ దేవుడు, మా దేవుడు అంటూ మాట్లాడడం ద్వారా టీడీపీ నేతలు సమాజానికి ఏమి సందేశం ఇవ్వదలిచారు?తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి మతానికి అపచారం చేశారా? మంచి చేశారా? మతం గురించి ఇంతగా బాధపడుతున్నవారు అయోధ్య రామాలయంలో డోనేషన్ల స్కామ్ గురించి ఎందుకు పెదవి విప్పలేకపోతున్నారు. అది మతానికి జరిగిన నష్టం కాదా? కొద్ది రోజుల క్రితం ఒక సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను చెప్పిన విషయంపై సభలో ఉన్న మహిళలు చప్పట్లు కొట్టరా అని బాధపడ్డారు.. ఉచిత బస్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే సదుపాయం కల్పించామని ఆయన తన ప్రసంగంలో చెబుతుంటే ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో ఆయన అసంతృప్తి చెంది తాను మంచి పనిచేస్తే చప్పట్లు కొట్టరా అని అడిగారు. నిజంగా ఫ్రీబస్ స్కీమ్‌పై ఇచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు అమలు చేస్తున్నదేమిటి?తిరుపతి, అన్నవరం ఏ క్షేత్రానికి అయినా, రాష్ట్రంలో ఏమూల నుంచి ఏ మూలకైనా ఏ బస్ అయినా ఎక్కి వెళ్లవచ్చని కూటమి పార్టీలు ప్రచారం చేశాయా? లేదా? ఇప్పుడు అదేమాదిరి అమలు చేస్తున్నారా? లేక పలు షరతులు పెట్టారా? ఆడబిడ్డ నిధి, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీల మాటేమిటి? వలంటీర్లకు ఏమి చెప్పారు. ఆ తర్వాత ఎలా ఎగవేశారు? ఇలాంటివన్ని ప్రజలకు గుర్తున్నాయి కనుకే సభకు వచ్చినవారు చప్పట్లు కొట్టడం లేదేమో అన్న సంగతి చంద్రబాబు, ఇతర కూటమి నేతలు గుర్తిస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లేఖలతో షాక్ ఇస్తున్న జనసేన ఎమ్మెల్యే..
-
బాబుకు పవన్ బిగ్ షాక్
-
ముద్రగడ మృతిపై టీడీపీ, జనసేన నీచ రాజకీయం..
-
జనసేన కార్యకర్తపై భార్య ఫిర్యాదు
ఏలూరు: కైకలూరులో రాజ్యాంగేతర శక్తిగా మారిన జనసేన కార్యకర్త కొల్లి వీర వెంకట సత్య వరప్రసాద్ (బాబీ) నిజస్వరూపాన్ని అతని భార్య దుర్గాదేవీ మీడియా ముందు మంగళవారం బట్టబయలు చేసింది. ఇటీవల కైకలూరు దానిగూడెం దళితుల దాడి కేసులో జైలు జీవితం అనుభవించి వచ్చిన కొల్లి బాబీ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న ఇతనిపై మట్టిదందా, పేకాట నిర్వాహణ వంటి పలు ఆరోపణలు ఉన్నాయి. కైకలూరు టౌన్ స్టేషన్లో బాబీపై అతని భార్య వరకట్న వేధింపులు, అక్రమ సంబంధం, పిల్లలను కలవనివ్వడం లేదంటూ వంటి వాటిపై తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. కొల్లి బాబీకి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన దుర్గాదేవీతో వివాహ సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చారు. మరింత కట్నం కోసం వేధిస్తుంటే అదనంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. కొల్లి బాబీ వ్యసనాలకు బానిసై తనను మానసికంగా వేధించాడని ఆమె పేర్కొంది. తన పుస్తెలు, పదో తరగతి సర్టిఫికెట్లపై లోను తీసుకుని కార్లలో తిరుగుతూ తనను మనిషిగా చూసేవాడు కాదని వాపోయింది. తనను 5 సంవత్సరాలుగా దూరం పెట్టి ఇంటికి పంపారన్నారు. తన బిడ్డలను సెలవులకు తీసుకొచ్చి ఏలూరు సిద్దార్థ హాస్టల్లో పెట్టారని వారిని చూడనివ్వకుండా చేస్తున్నారని వాపోయింది. తన భర్తతో ప్రాణభయం ఉందని, అతనికి వివాహేతర సంబంధం ఉందని ఆమె తెలిపింది. ఇంటికి వస్తే నరికేస్తా అంటూ బెదిరిస్తున్నాడని, తన భర్తతో పాటు, నా బిడ్డలతో కలసి జీవించే విధంగా న్యాయం చేయాలని కోరింది. ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదన్నారు. దుర్గాదేవి ఫిర్యాదుపై టౌన్ సీఐ ఏవీఎస్ రామకృష్ణను వివరణగా కోరగా ఫిర్యాదు అందిందని, ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. -
కబ్జాదారులకు ఎమ్మెల్యే అండ?.. జనసేనలో రచ్చ రచ్చ!
డాబాగార్డెన్స్: విశాఖ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేపై మాజీ కార్పొరేటర్ సంచలన ఆరోపణలు చేయడం జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. కబ్జాదారులకు మద్దతుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణకు సిఫార్సు లేఖ రాశారని ఆ పార్టీ నేత పీతల మూర్తి యాదవ్ బాంబ్ పేల్చారు. నగరంలో సుమారు రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ, జీవీఎంసీ ఆస్తులను కబ్జాదారులకు కట్టబెట్టేందుకు కొందరు అధికారులు తప్పుడు నివేదికలతో ఫైళ్లు కదుపుతుంటే, వారికి మద్దతుగా ఎమ్మెల్యే లేఖలు రాసినట్లు బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. సోమవారం జీవీఎంసీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో మూర్తియాదవ్ ఈ వ్యవహారంపై అధికారులకు వినతిపత్రం అందించి, సొంత పార్టీ ఎమ్మెల్యే తీరును ఎండగట్టడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారుల కన్ను విశాఖలో కొందరు అవినీతి అధికారుల స్వార్థం వల్ల విలువైన ప్రభుత్వ స్థలాలు ప్రైవేటుపరం అయిపోతున్నాయని మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆస్తులుగా ఉన్న స్థలాలను కాజేసేందుకు ప్రయతి్నస్తున్న ప్రైవేటు వ్యక్తులకు స్వయంగా కూటమి ప్రజాప్రతినిధి వత్తాసు పలుకుతూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులో దశాబ్దాలుగా జీవీఎంసీ వినియోగంలో ఉన్న సర్వే నెంబరు 6/2 లోని ఎకరా 25 సెంట్ల విలువైన స్థలంపై ప్రైవేటు వ్యక్తుల కన్ను పడిందని, వేలాది మందికి నీరందించే ఓవర్ హెడ్ ట్యాంకులు, కార్యాలయం, సులభ్ కాంప్లెక్స్ ఉన్న ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర నియోజకవర్గ పరిధిలోని ఈ స్థలం తన సన్నిహితురాలైన ఎన్.వల్లికి చెందినదని, ఆమెకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ నెల 9న మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణకు లేఖ రాయడంపై మూర్తియాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులను కాదని సిఫార్సులు ఇదే తరహాలో విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈస్ట్ పాయింట్ కాలనీలో కోర్టు కేసుల్లో గెలిచి జీవీఎంసీ దక్కించుకున్న వాల్తేర్ వార్డు టౌన్ సర్వే నెంబరు 124, 125/2 లోని 3,660 చదరపు గజాల పార్కు స్థలాన్ని సైతం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే ప్రయతి్నస్తున్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు. అక్కడ లెండి వనం, బాబా చావిడి పార్కులు ఉన్నాయని, గతంలో ఈ స్థలం జీవీఎంసీదేనని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, సదరు స్థలం తనకు తెలిసిన విజయలక్ష్మికి చెందినదంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ మంత్రికి మరో లేఖ రాయడం గమనార్హమన్నారు. ఆ కుటుంబం అమెరికా, జైపూర్‌లో సెటిల్ అయిందని, మానవతా దృక్పథంతో ఆ స్థలాన్ని వారికి అప్పగించడమో లేదా నష్టపరిహారం ఇవ్వడమో చేయాలని ఎమ్మెల్యే కోరడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలి ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా ఉద్యానవనాలను కాపాడాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదే పదే పిలుపునిస్తున్నప్పటికీ, సొంత పార్టీ ఎమ్మెల్యే దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటే స్థానిక ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటాన్ని కూడా మూర్తి యాదవ్ తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణమే జోక్యం చేసుకుని, ఎమ్మెల్యేల వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు అడ్డుకట్ట వేసి, రూ.150 కోట్ల విలువైన జీవీఎంసీ స్థలాలను, పార్కులను కబ్జాదారుల బారి నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడిపైనే మాజీ కార్పొరేటర్ ఈ స్థాయిలో బహిరంగంగా తిరుగుబావుటా ఎగరేయడం.. జన సేన పారీ్టలో రేగుతున్న అంతర్గత ముఠా తగాదాలను తేటతెల్లం చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే సొంత పార్టీ నేతల మధ్యే రూ.150 కోట్ల భూవివాదంపై ఇంతటి తీవ్రస్థాయిలో రచ్చకెక్కడం జిల్లా జనసేన శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. -
ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కేసులు పెట్టిన YSRCP కార్యకర్త అనేవాడు తగ్గడు
-
సొంత పార్టీ MLAపైనే తిరుగుబాటు.. కారు టాప్ ఎక్కి ఓవరాక్షన్!
-
బాబు, పవన్ ఒక్కసారి ఈ రోడ్లని చూడండి
-
పంతం నానాజీకి ఓరేంజ్ లో ఇచ్చిపడేసిన కొడాలి నాని
-
శ్రీకాకుళం జనసేనకు బిగ్ షాక్.. YSRCPలోకి పవన్ వీరాభిమాని
-
దొరల పాలనకు ముగింపు చెప్తా.. ఆడియో వైరల్
-
పవన్‌కళ్యాణ్ నమ్మక ద్రోహం
గన్నవరం: అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె కృష్ణా జిల్లా గన్నవరంలో పవన్‌కళ్యాణ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పలు బహిరంగ సభల్లో సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం గురించి పవన్‌కళ్యాణ్ ప్రస్తావించారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే తాము చేపట్టే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదేనని కూడా ఆయన హామీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు ముగిసిపోయినా సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరమన్నారు. ఐదు రోజులుగా దాదాపు ఐదు వందల మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించి యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేశారని, అందులో కనీసం పది శాతం శ్రద్ధ పెట్టినా తమ కుటుంబానికి న్యాయం జరిగి ఉండేదన్నారు. నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా తమ కళ్ల ముందే తిరుగుతున్నారని వాపోయారు. ఎందుకీ వివక్ష? అని నిలదీశారు. సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు తారుమారయ్యాయని ఏ ఆధారంతో పవన్ చెబుతున్నారని పార్వతి ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా మాట్లాడిన ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలని నిలదీశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక దివ్యాంగురాలికి మాట ఇచ్చి మర్చిపోవడం చీటింగ్ కాదా? అని ప్రశ్నించారు. ముద్దాయిలకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ క్లీన్చిట్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. చివరికి దివ్యాంగురాలైన తనను జనసేన నేతలు, వీర మహిళలతో బాడీ షేమింగ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. -
మేము లేకపోతే నువ్వు గెలిచే వాడివా.. పోలవరం జనసేన MLAకి ఇచ్చిపడేసిన జనసైనికులు
-
జనసేన ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత సవాల్
ఏలూరు జిల్లా: పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు బుట్టాయిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు బుచ్చిరాజు సవాల్ విసిరారు. పోలవరం నియోజకవర్గంలో పెత్తందారులు తనని అణిచివేశారంటూ రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో పెత్తందారులు ఎమ్మెల్యేను అణిచివేస్తే కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడా పెట్టాడని ఆదివారం బుచ్చిరాజు ప్రశ్నించారు. ‘‘విలాసవంతమైన ఇల్లు, స్కూళ్లు, రెస్టారెంట్లు, భూములు ఎలా సంపాదించాడు? పోలవరం ఏఎంసీ చైర్మన్ పదవి కోసం నన్ను రూ.50 లక్షలు అడిగింది నిజం కాదా? ఆ పెత్తందారులే లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడివా? నువ్వు ఎమ్మెల్యే అవ్వడం కోసం వారి చుట్టూ ఎన్నిసార్లు తిరగలేదు? నియోజవర్గంలో జన సైనికులకు, వీర మహిళలకు నువ్వు ఏం న్యాయం చేశావ్? బుట్టాయిగూడెంలో మట్టి తవ్వకాలకు సంబంధించి జేసీబీలు, టిప్పర్లు రెవెన్యూ వాళ్లతో దాడులు చేయించింది నువ్వు కాదా..? ఆ తర్వాత ఒక్కో వాహనానికి రూ.2 లక్షలు వసూలు చేయలేదా? నామినేటెడ్ పోస్టులు డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చావా...? నామినేటెడ్ పోస్టులు పొందిన వారిలో పార్టీ కోసం కష్టపడిన వారికి ఎంతమంది ఉన్నారు? నీపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించగలం. పెత్తందారులు నిన్ను అణిచివేశారని నువ్వు నిరూపించగలవా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. -
పైకి పవనిజం... లోపల బానిసిజం.. గబ్బర్ సింగ్ కు గట్టి షాక్
-
రావణ్‌పై రాజద్రోహం కేసు
సాక్షి, కృష్ణా: ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రావణ్‌పై కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతోంది. తాజాగా రావణ్‌పై గన్నవరం పోలీసు స్టేషన్లో జనసేన నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. యలమంచిలి కోర్టు నిన్న(శనివారం) రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. కాగా, బెయిల్ వచ్చిన కాసేపటికే వేంపాడు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు రావణ్‌ను మళ్లీ అరెస్ట్ చేశారు. జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ నిన్న రావణ్‌పై గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శివశంకర్ ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విశేషం.దీంతో, హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. అర్ధరాత్రి రావణ్‌ను గన్నవరం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు.. స్టేషన్ లోపలికి ఎవరిని అనుమతించన లేదు. అనంతరం, గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే, రావణ్‌ను మొదట ఏలూరు తీసుకువెళతారని ప్రచారం జరిగినప్పటికీ అర్ధరాత్రి గన్నవరం స్టేషన్‌కి తీసుకువచ్చారు. అయితే, శివశంకర్ ఫిర్యాదుతో రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద U/s 147,148,152,192,197(1)(d),353(1)(b) & Sec 13, 39 of Unlawful Activity Prevention Act 1967 (UAPA Act) కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దేశసార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం, దేశద్రోహ పూరిత, తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపధ్యంలో కేసు నమోదు చేశారు. -
కక్ష సాధింపు.. మళ్లీ రావణ్ అరెస్ట్
అనకాపల్లి : ప్రశ్న యూట్యూబర్ రావణ్‌పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ కేసులో బెయిల్ వచ్చిన కాసేపటికే రావణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వేంపాడు టోల్‌ప్లాజా వద్ద రావణ్‌ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు రావణ్‌కు యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఆపై కాసేపటికే మళ్లీ అరెస్ట్ చేశారు. తెలుగు యూట్యూబర్ రావణ్‌కు నేడు(శనివారం) యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో రావణ్ రిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. రావణ్‌పై పెట్టిన కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేయడం వరుసగా ఇది నాలుగోసారి. అయితే మళ్లీ రావణ్‌ను అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషించాడని ఆరోపిస్తూ రావణ్‌పై జనసేన నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. కోర్టుల్లో రావణ్‌కు వరుసగా బెయిల్ దక్కుతోంది. అయినప్పటికీ, మరో కేసు అంటూ రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. -
విడుదల తర్వాత ప్రశ్నరావణ్ బిగ్ స్టేట్మెంట్!
-
రావణ్ రిమాండ్‌ను తిరస్కరించిన న్యాయమూర్తి
అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు యూట్యూబర్ రావణ్‌కు ఎలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రావణ్ రిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. వరుసగా కోర్టులు బెయిల్ మంజూరు చేయడం ఇది నాలుగోసారి. రావణ్‌పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషించాడని ఆరోపిస్తూ రావణ్‌పై జనసేన నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. కోర్టుల్లో రావణ్‌కు వరుసగా బెయిల్ దక్కుతోంది. అయినప్పటికీ, మరో కేసు అంటూ రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు: జడ శ్రవణ్ రావణ్‌ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. రావణ్ మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండని అన్నారు. ‘‘మాకు సమయం వచ్చినప్పుడు మీ సంగతి తేలుస్తా. శంకరగిరి మాన్యాలు పట్టిస్తా. ప్రభుత్వ తీరును చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు. కోర్టులు బెయిల్ ఇవ్వడమేంటి, పోలీసులు మళ్లీ అరెస్టులు చేయడమేంటి? రావణ్ తప్పేమీ మాట్లాడలేదు. పవన్ మాట్లాడిన మాటలను ప్రస్తావించారు. నన్ను లిల్లీపుట్, అరకోటు న్యాయవాది అంటూ విమర్శలు చేస్తున్నారు. 76 ఏళ్ల వ్యక్తి ఉన్న చంద్రబాబు ఈ విధమైన విమర్శలు చేయవచ్చా?’’ అని అన్నారు. -
రెచ్చిపోయిన జనసేన నేతలు, రావణ్‌ను తరలిస్తున్న వాహనంపై చెప్పులతో దాడి
-
రావణ్ మద్దతుదారులపై.. కోడి గుడ్లతో అటాక్ జనసేన గూండాల దాడి
-
రావణ్ మద్దతు దారులపై జనసేన దాడి
-
రావణ్ అరెస్ట్ పై పేర్ని ఫస్ట్ రియాక్షన్
-
రావణ్ ని మాకు అప్పగించండి.. నక్కపల్లి పోలీసు స్టేషన్ వద్ద జనసేన నేతలు హల్ చల్
-
రావణ్‌ను మాకు అప్పగించాలి.. జనసేన కార్యకర్తల ఓవరాక్షన్
సాక్షి, పాయకరావుపేట: ఏపీలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను టార్గెట్ చేసి దాడి చేయాలనే ఉద్దేశ్యంతో హల్చల్ చేస్తున్నారు. తాజాగా నక్కపల్లి పోలీసు స్టేషన్ వద్ద జనసేన కార్యకర్తలు గుమ్మిగూడి.. రావణ్‌ను తమకు అప్పగించాలని నినాదాలు చేస్తున్నారు.ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు కొనసాగుతోంది. రావణ్‌పై వరుస కేసుల్లో భాగంగా పోలీసులు.. నక్కపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. దీంతో, జనసేన కార్యకర్తలు.. నక్కపల్లి పీఎస్ వద్దకు చేరుకుని అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్‌ను తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. రావణ్‌పై దాడి చేసేందుకు వారంతా కోడిగుడ్లతో అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. రావణ్ వ్యవహారంలో పోలీసుల పక్షపాత ధోరణి చూపిస్తున్నారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ ముందు జనసేన కార్యకర్తలు ఓవరాక్షన్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించినా వారి వైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. కానీ, రావణ్ చూసేందుకు వచ్చిన వారిపై మాత్రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్ మనుషులు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారిని బలవంతంగా కారు ఎక్కించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, రావణ్ మనుషులపై జనసేన శ్రేణులు బూతులతో రెచ్చిపోతున్నారు. అంతటితో ఆగకుండా రావణ్ మనుషులపై దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం.. జనసేన నేతల వ్యవహార శైలిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. -
ప్రశ్న రావణ్ కు ఏమైనా జరిగితే... గుర్తుపెట్టుకోండి రేపు జరిగేది ఇదే
-
‘రావణ్‌పై మరో కేసు.. దాడికి జనసేన ప్లాన్?’
కృష్ణా జిల్లా: ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు బెయిల్ రాగానే మరో కేసు అంటూ పోలీసులు.. రావణ్‌ను అరెస్ట్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి మచిలీపట్నంలో బెయిల్ రాగానే రావణ్‌ను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు రావణ్‌ను మళ్లీ అరెస్ట్ చేశారు. కేసు నమోదైనట్టు చెబుతూ మచిలీపట్నం నుంచి పాయకరావుపేటకు తరలించారు. ఇప్పటికి మూడు కేసుల్లో రావణ్‌కు బెయిల్ వచ్చినప్పటికీ కొత్త కేసులతో పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.ఈ సందర్భంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతీ సందర్భంలో ఒక దాని వెంట మరో కేసు పెడుతున్నారు. బెయిల్ రాగానే పోలీసులు మరో స్టేషన్‌కు తీసుకెళుతున్నారు. రావణ్ నిజంగా తప్పు చేసుంటే చట్టప్రకారం అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. తప్పు చేశాడో లేదో తెలియదు బెయిల్ రాగానే అరెస్ట్ చేస్తున్నారు. జనసేనకు పట్టున్న ప్రాంతంలోని స్టేషన్‌కు తరలిస్తున్నారు. అక్కడ జనసేన కార్యకర్తలు వెంటాడి వేటాడి కొడుతున్నారు. ఇది మీకు హీరోయిజం కింద కనిపిస్తుందా?. గత ఐదేళ్లలో తాను మాట్లాడిన నీతి కబుర్లు పవన్‌కు గుర్తులేవా?.మచిలీపట్నంలో రావణ్ కు బెయిల్.. మళ్లీ మరో కేసులో అరెస్ట్రావణ్ పై అనకాపల్లి జిల్లా పాయకాపురంలోకూడా కేసు నమోదవ్వగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.వరుసగా 4 అరెస్ట్ లు మూడు బెయిల్ తో సాగుతున్న రావణ్ పరిస్థితి pic.twitter.com/88BW8b6dbd— greatandhra (@greatandhranews) July 3, 2026పవన్ సుద్ధ పూస కబుర్లు చెబుతున్నాడు. కసబ్‌కి కూడా పదేళ్ల తర్వాతే ఉరిశిక్ష వేశారు. జనసేన కార్యకర్తలను అదుపు చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌కు లేదా?. అధికారంలో ఉన్నామని విర్రవీగితే ప్రజాస్వామ్యంలో తొక్కి నార తీస్తారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని సీఎం, డిప్యూటీ సీఎంను కోరుతున్నాను. 2029లో ప్రభుత్వం మారి ప్రతిపక్షంలోకి వెళితే తూర్పుకు తిరిగి దండం పెట్టడమే’ అంటూ హెచ్చరించారు. -
జనసైనికులా? గూండాలా?.. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం..
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. ఈ కేసులో జన సైనికుల ఓవరాక్షన్ చేస్తున్నారంటూ మరో వీడియో రిలీజ్ చేశారు. జన సైనికుల తీరుపై ఆయన మండిపడ్డారు. జనసైనికులు గూండాల్లా రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించేవాళ్లను చంపేస్తారా ఏంటి? అని నిలదీశారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇదంతా దేశం చూస్తోందని ఆయన అన్నారు. బిహేవియర్ యువర్ సెల్ఫ్ అంటూ జన సైనికులను ఉద్దేశించి మరో వీడియో రిలీజ్ చేశారు. కాగా.. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో రావణ్‌ని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అతడిని కాకినాడ జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే విచారణ తర్వాత పిఠాపురంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలోనే వెంటనే మరో కేసులో రావణ్‌ని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నించగా తీవ్ర హైడ్రామా నెలకొంది. ఆ తర్వాత రావణ్‌ని మచిలీపట్నం తరలించారు. What is this act of your janasena party cadres . ప్రశ్నిస్తే చంపేస్తారా ???. @ncbn @PawanKalyan … Will you take action against this Rogue behaviour. #justasking pic.twitter.com/HZYEIaKbfp— Prakash Raj (@prakashraaj) July 3, 2026 -
హోంమంత్రి అనిత శాఖలో పవన్ కల్యాణ్ జోక్యం
సాక్షి, విజయవాడ: ఏపీ మంత్రుల తీరు విడ్డూరంగా మారింది. హోంమంత్రి అనిత శాఖలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఈగల్ చీఫ్ రవికృష్ణ భేటీ అయ్యారు. రెండు రోజుల కిందటే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా కేసులు పెట్టించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ డిప్యూటీ సీఎంతో ఐజీ రవికృష్ణ సమావేశమయ్యారు.వేరే శాఖ మంత్రికి నివేదిక ఇవ్వడంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. హోంమంత్రి అనితను డమ్మీని చేసేశారంటూ చర్చ నడుస్తోంది. ఇటీవలే హోంశాఖ తన దగ్గర లేదంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు తర్వాత సోషల్ మీడియా కేసుల కోసం వింగ్ ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్.. హోంశాఖ వింగ్ ఏర్పాటు చేశారు. మంత్రుల పంచాయితీపై అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. -
తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన
-
బారు గేట్లు తోసుకుంటూ రావణపై జనసేన నేతల దాడులు
-
చేతులెత్తేసిన పోలీసులు.. స్టేషన్లోకి దూసకెళ్లిన జనసేన కార్యకర్తలు
సాక్షి,కృష్ణా: మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసేన కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి రావణ్‌పై దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని స్టేషన్ పైకే దూసుకొచ్చిన జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.సాధారణంగా పోలీస్ స్టేషన్ పై దాడి జరిగితే ఉక్కుపాదంతో అణచివేయాల్సిన ఖాకీలు, ఇక్కడ మాత్రం పూర్తిగా 'లైట్' తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్లోకి దూసుకెళ్లిన జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులు అత్యంత సున్నితంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.లాఠీఛార్జ్ చేయకుండా, కేవలం రోప్‌లతో సర్దిచెప్పే ప్రయత్నం చేయడం పోలీసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చింది.సొంత పార్టీ నేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారంలో ఉన్నారనే ధీమాతోనే కార్యకర్తలు ఇంతలా రెచ్చిపోయారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలను, బారికేడ్లను సైతం లెక్కచేయకుండా స్టేషన్ వైపు దూసుకొచ్చినా ఖాకీలు మౌనప్రేక్షకులుగా ఉండిపోవడం శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోంది. అధికార పక్షానికి చెందిన వారైతే చట్టం చుట్టంగా మారిపోతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, ఆ ప్రాంతమంతా రణరంగంగా మారడానికి పోలీసుల అలసత్వమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అరవ శ్రీధర్‌పై చర్యలు ఏమయ్యాయో?
రైల్వేకోడూరు అర్బన్: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీధర్ ఎటువంటి అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని జనసేన పార్టీ అధిష్టానం ఆదేశించింది. తరువాత ఎమ్మెల్యేపై ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ముగ్గురితో కూడిన కమిటీని ఏర్పాటుచేసింది. నిర్ణయం తీసుకునేంతవరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆయనకు స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. అయితే గురువారం ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లిలో జరిగిన విబీజీ రామ్‌జీ ప్రారంభ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని వేదికపై ప్రసంగించడం చూస్తుంటే మహిళా ఉద్యోగి కేసు మూలనపడిపోయిందని ప్రతి ఒక్కరూ చర్చించుకుటున్నారు. దీనిపై స్వయంగా అధినేత పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉందంటున్నారు. -
ప్రశ్న రావణ్ పై దాడికి ప్లాన్.. జనసేన నేత సంచలన ఆడియో
-
ఎమ్మెల్యే పులివర్తి నానిపై పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి కూటమిలో విభేదాలు ముదిరాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అక్రమాలపై డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ చేస్తూ.. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. పులివర్తి నాని భారీగా కమీషన్లు తీసుకుంటూ అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ మనోహర్ ఫిర్యాదు చేశారు.కాగా, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండాపోతోంది. అవినీతి, అక్రమాలతో పాటు కనిపించిన భూమినల్లా ఆక్రమిస్తూ సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్న పచ్చ మూకలు ఇప్పుడు న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం విస్తుగొలుపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ఆక్రమణలకు, అవినీతికి, దౌర్జన్యాలకు మారుపేరుగా మారిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని ఓ విశ్రాంత జిల్లా జడ్జిని అత్యంత జుగుప్సాకరంగా బూతులు తిడుతూ, అంతు చూస్తానంటూ బెదిరించడంపై న్యాయ వర్గాలు మండి పడుతున్నాయి.గౌరవ ప్రదమైన జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన న్యాయాధికారిని ఈ విధంగా బూతులు తిడుతూ మాట్లాడటంపై అటు విశ్రాంత న్యాయాధికారులు, ఇటు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని భూ ఆక్రమణలను ప్రశ్నించినందుకు రిటైర్డ్ జడ్జిని బూతులు తిడుతూ బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
పాదరక్షలతో జనసేన ఎమ్మెల్యే దీక్ష?
తూర్పు గోదావరి జిల్లా: సనాతన ధర్మం గురించి జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఊగిపోతూ స్పీచులిస్తూంటారు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. వివరాలివీ.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాదరక్షలు ధరించి చండీ దీక్షలో ఉండటం సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. రాజానగరం మండలం దివాన్ చెరువులో బుధవారం జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీలో పార్టీ శ్రేణులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల పాల్గొన్నారు. అయితే, ఆ సమయంలో ఆయన పాదరక్షలు ధరించి ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దేవాలయాలకు వెళ్లిన సమయంలో పలు విమర్శలు గుప్పించే కూటమి నేతలు హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
దీక్షలోనూ రాజకీయాలేనా? పవన్ సత్యనిష్ఠపై ప్రశ్నలు
సాధారణంగా ఏ మతంలో అయినా కొన్ని పవిత్ర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అత్యంత నిష్ఠతో ఉండడానికి ప్రయత్నిస్తారు. అందులోనూ హిందూ మతంలో ఈ ధర్మాలు మరీ ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా రాజకీయాలకు దూరంగా ఉండడం, దీక్షను కడు శ్రద్ధతో నిర్వహించడం, అబద్ధాలు చెప్పకుండా ఉండడం, ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండడం వంటి వాటిని ఆచరిస్తుంటారు. కానీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీక్ష తీసుకున్నా, లేత పసుపురంగు లుంగీ, పైన కండువా వేసుకుని పూజాధికాలు చేసిన తర్వాత కూడా రాజకీయ ప్రకటనలు చేయడం, అందులోనూ అసత్య వచనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కనిపిస్తుండడం భక్తుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ దీక్ష తీసుకున్నారు. ఈ వస్త్రధారణలో ఆయన ఏటా నాలుగు నెలలపాటు ఈ దీక్ష చేపడుతుంటారట.. మంచిదే. అది ఆయన నమ్మకం, విశ్వాసం, దైవభక్తికి సంబంధించిన అంశంగా బావించవచ్చు. దీక్షలు తీసుకున్నవారు చాలా పవిత్రంగా ఉండడానికి యత్నిస్తారు. ఉదాహరణకు అయ్యప్ప దీక్ష చేసేవారు నల్ల దుస్తులు ధరించి, ఇరుముడి సహా రకరకాల సంప్రదాయాలు పాటిస్తారు. కేవలం శాఖాహారమే భుజిస్తారు. మద్యం వంటివాటిని స్వీకరించరు. కొందరు కాలినడకన శబరిమలైకి వెళతారు. విజయవాడ కనకదుర్గమ్మ భక్తులు భవానీ దీక్షను తీసుకుని అన్ని నియమాలను పాటిస్తారు. చాలామంది కాలి నడకన సుదూర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చి దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. శైవభక్తులు కూడా పాదయాత్రలు చేసుకుంటూ శ్రీశైలం వెళ్లి పూజలు చేసి దీక్షను విరమిస్తారు. హిందూ మతంలోనే కాదు.. ఇతర మతాలలో కూడా ఇలాంటి ఆచారాలు ఉంటాయి. తనకు తానుగా అన్ అపాలిజిటిక్ హిందూ అని, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తినని ప్రకటించుకున్న పవన్ కల్యాణ్ కూడా ఇదే తరహాలో నిబద్దతతో ఉంటారని మత విశ్వాసకులు భావిస్తారు. పవన్ కల్యాణ్ దీక్ష ఆరంభించిన తర్వాత జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దీనిని కూడా ఆక్షేపించనక్కర్లేదు. ఆయన పార్టీ అధినేత కనుక కొన్ని తప్పవని అనుకోవచ్చు. అయితే, ఆ సందర్భంలో ఆయన చేసే ఉపన్యాసంలో సత్యనిష్ఠత, నిబద్ధత , నిజాయితీ కొరవడితే అక్కడ ఉన్న సభికులకే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఒక తప్పుడు సంకేతం వెళ్లదా? ఆయన విమర్శకులు వీటిని ప్రస్తావించరా?అందుకే వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టి కూడా అబద్ధాలు చెప్పడం దురుదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడారు? అధికారం కోసం కులాలతో రాజకీయ క్రీడ ఆడుతున్నారని ఆయన వైసీపీపై విమర్శ చేశారు. కాపులను బూతులు తిట్టేవాళ్లుగా, క్రిమినల్స్ గా ప్రొజెక్టు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇందులోనే కులతత్వం కనబడుతోందన్న సంగతి ఆయన గుర్తించలేకపోయారు. ప్రత్యేకించి ఒక కులం గురించి వైసీపీ నేతలు ఎవరైనా విమర్శ చేసి ఉంటే దానిని ప్రస్తావించి చెప్పాలి కదా! అదేమీ లేకుండా జనరల్ గా మాట్లాడుతున్నారంటే ఆయనలో నిబద్ధత లేదనిపించదా! కాపులను క్రిమినల్స్ గా ఎవరూ చూపించలేదు. కాకినాడ సభలో గాదె సాయికృష్ణ గురించి మాట్లాడుతూ రౌడీ అని ఆరోపించింది ఆయనే. అలాగే మరో సభలో సాయికృష్ణపై పోక్సో కేసు ఉందని చెప్పింది పవన్ కల్యాణే. అది తప్పుడు కేసు అని, దానిని కోర్టు కొట్టేసిందని అతని మరదలే చెబుతున్నా, ఆ కేసు గురించి ప్రచారం చేసింది ఆయనే కదా! ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. సాయికృష్ణ పేద కాపు. అతను తప్పు చేస్తే శిక్షార్హుడు. అదే సీఐ నాగరాజు ధనిక కాపు కనుక, పోలీసు అధికారి కనుక ఆయన ఎంత ఘోరం చేసినా సమర్ధిస్తారా? అసలు లాకప్ హత్యలపై పవన్ కు ఒక విధానం ఉందా? అన్నది చర్చనీయాంశం. అంతే తప్ప ఇక్కడ కులం కోణం ఏమీ లేదు. జగన్ టైమ్ లో ఎన్నిసార్లు కులం కోణంలో చంద్రబాబు, పవన్ ఆరోపణలు చేశారో రికార్డులు చూస్తే తెలుస్తుంది. వైసీపీ వారు కాపు నాయకులతో తనను తిట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి కాకినాడలో వైసీపీ నేతలను గూండాలు, రౌడీలు, తొక్కి నార తీస్తా అంటూ అనుచిత భాష వాడిందే పవన్ కల్యాణ్. గతంలో వైసీపీ నేతలను ఉద్దేశించి అసభ్య భాష వాడిన విషయం, చెప్పు చూపించిన ఘటనలను ఆయన మర్చిపోయి ఉండవచ్చు. కాకినాడ స్పీచ్ తర్వాత మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ,అంబటి రాంబాబు, కన్నబాబు, త్రిమూర్తులు తదితరులు దానికి జవాబు ఇచ్చి పవన్ కల్యాణ్ గతంలో కులం పేరుతో ఎలా రాజకీయం చేసింది సోదాహరణంగా వివరించారు.అయినా అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే పవన్ కల్యాణ్ ఎదుటివారిపై బురద వేయడానికి యత్నించారు. అంతేకాదు..కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దుర్భాషలాడితే దానిని నిర్ ద్వంద్వంగా ఖండించి ఉంటే పవన్ కు మంచి పేరు వచ్చేది. అలాకాకుండా తాను ప్రోత్సహించను అంటూనే గత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఇంతకన్నా అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. మాజీ మంత్రి కన్నబాబు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మాజీ జర్నలిస్టు కూడా. ఆయన ఎప్పుడూ అపసవ్య భాష వాడరు. అయినా పవన్ ఆరోపణ చేయడం అంటే ఏదో రకంగా తన ఎమ్మెల్యే చేసిన తప్పును కప్పిపుచ్చుకునే యత్నమే కదా! తాను కుల రాజకీయాలు చేయలేదని ఆయన అంటున్నారు. ఇకపై కుల రాజకీయం చేయబోనని చెప్పి ఉంటే గౌరవంగా ఉండేది. అలా కాకుండా అసలు కులం గురించి తానెప్పుడు మాట్లాడనట్లు ఉపన్యాసం చెబితే వినే జనం చెవిలో పూలు పెట్టడమే కదా! ఆయన ఎన్నికల సమయంలో కాపులను ఎలా ఓట్లు అడిగింది, తనకు కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలు మద్దతు ఇస్తే ముఖ్యమంత్రి అయి చూపిస్తానని చెప్పిన సంగతులు, ఆంధ్ర భావన లేకపోతే మానే.. కుల భావన అయినా తెచ్చుకోవాలని కోరిన విషయాలన్నీ వీడియోల రూపంలో ప్రత్యక్షం అయ్యాయి. మరో వైపు బీసీ కులాలైనా, కాపులైనా ఎవరో అధికారం ఇవ్వాలని కోరుకూడదు, 50 శాతంగా వారు.. వేరే వాళ్లను అధికారం కోసం అడగడం ఏమిటి అని, కలిసి ఉంటే అధికారం వస్తుందని ఆయన సెలవిచ్చారు. మరి దానికి కట్టుబడి ఉండి ఆ దిశలో ప్రయయత్నించకుండా తెలుగుదేశంతో ఎందుకు కలిసి ప్రయాణం చేస్తున్నారని ఎవరైనా అడిగితే ఏం జవాబు ఇస్తారు. తెలుగుదేశంలో ఎవరి ఆధిపత్యం ఉన్నది ఆయనకు తెలియదా? కులం గురించి ఆలోచించే వ్యక్తిని అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి ఎందుకు వస్తారని పవన్ కల్యాణ్ అమాయకంగా ప్రశ్నించినా, కూటమి ప్రభుత్వ కక్ష, వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఆ పార్టీలో చేరింది అందరికి తెలుసు! మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. సంక్షేమ పథకాలతోనే అదికారం రాదని ఆయన అంటున్నారు. అలాంటప్పుడు ఆచరణ సాధ్యంకాని సంక్షేమ స్కీములను చంద్రబాబుతో కలిసి ఎందుకు ప్రకటించారో వివరించగలుగుతారా?వలంటీర్ల పొట్ట కొట్టేవాడిని కానని, వారికి ఐదువేలు కాదు.. పదివేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగవేయడం గురించి ఏమంటారు? వీటి సంగతి పక్కనబెడితే ఆధ్యాత్మిక వస్త్ర ధారణలో ఉన్నప్పుడైనా పవన్ కల్యాణ్ నిష్ఠతో, సత్యవచనాలకు కట్టుబడి ఉంటే మంచిది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తెర వెనుక అసలు కథ ఇదన్నమాట!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసే వ్యూహాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిపై ఎవరైనా పీహెచ్డీ చేస్తే కచ్చితంగా డాక్టరేట్ వస్తుందేమో! కొందరు విశ్లేషకులు చంద్రబాబువి వ్యూహాలు అంటారు.. మరికొందరు కుట్రలు అంటారు. ఆ వ్యూహాలలో ఎటు తిరిగి తనకే రాజకీయ ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతుంటారు. ఆయనకు బాండ్ బాజా వాయించే ఎల్లో మీడియా ఎటూ ఉంటుంది. సాయికృష్ణ కుటుంబాన్ని మేనేజ్ చేయడానికి చంద్రబాబు ఆడిన గేమ్ కాని, తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆయన చేసిన కామెంట్లు కాని గమనిస్తే ఈ విషయం అర్దం అవుతుంది.అలాగే ఈ ఉదంతంలో చర్చ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నడిచేలా కథ ఎలా సాగించారో విశ్లేషించడం కూడా ఆసక్తికరమే. సాయికృష్ణ కేసులో సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టును కొన్ని రోజుల పాటు జాప్యం చేయడం, దర్యాప్తులో కీలకమైన అంశాలు రాకుండా జాగ్రత్తపడడం కనిపిస్తుంది. అన్నిటిని మించి నాగరాజుతో ప్రభుత్వ పెద్దలు ఒక డీల్ కుదుర్చుకుని కూటమి పెద్దల పేర్లు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు బయటకు రాకుండా చూడడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఆరోపించింది. న్యాయం అన్నది అధికారం, పలుకుబడిని పట్టి ఉంటుందని కూటమి ప్రభుత్వం పలుమార్లు రుజువు చేస్తున్నట్లు అనిపిస్తుంది.కాపు యువకుడు సాయికృష్ణ పోలీసుల హింస కారణంగా మరణించిన ఘటనలో చంద్రబాబు తెలివిగా చర్చను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు తిప్పారనిపిస్తుంది. అదేదో జనసేనకు, వైఎస్సార్సీపీకి మధ్య వివాదం అన్నట్లుగా ప్రచారం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది. ఆ సంగతి అర్థం అవుతున్నా, పవన్ కళ్యాణ్ నిస్సహాయంగా ఆ ట్రాప్‌లో నుంచి బయటపడలేకపోతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. సాయికృష్ణ కేసు అన్నది నిజానికి కులానికి సంబంధించిన సమస్య కాదు. ఏపీలో జరుగుతున్న పోలీసుల రాక్షస కృత్యాలకు, చట్టాలు, రాజ్యాంగంతో నిమిత్తం లేకుండా సాగుతున్న రెడ్‌బుక్ అరాచకాలకు సంబంధించిన అంశం. మానవహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై ప్రజలలో వస్తున్న తీవ్ర వ్యతిరేకత. వీటన్నిటిని కప్పిపుచ్చి రాజకీయ కోణంలో కేసును మలుపు తిప్పి పవన్ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని కథ నడపాలని చంద్రబాబు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఈ ప్రక్రియలో రాజకీయ లబ్ది జరిగితే తనకు, అప్రతిష్ట వస్తే అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లేలా వ్యూహాం పన్నారా అన్న అభిప్రాయాన్ని కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలాగే సాగితే పవన్ కళ్యాణ్ ఒక బకరా అయ్యే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, వారు కొందరు కాపు నేతలను ఆశ్రయించడం తదితర అంశాల వల్ల, కులం కోణం కూడా సహజంగానే వస్తుంది. అది ఎవరూ కాదనలేని సత్యం.విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కుల రాజకీయాలే కాదు.. మత రాజకీయాలు కూడా చేసి ప్రజలను ఎంత రెచ్చగొట్టాలో అంతా చేశారన్నది నిర్వివాదాంశం. సాయికృష్ణ కేసులో తప్పని స్థితిలో సీఐ నాగరాజును అరెస్టు చేయవలసివచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఈ కేసులో సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని వచ్చి హింసకు శ్రీకారం చుట్టారు. దానిని నాగరాజు కొనసాగించారన్నది అభియోగం.ఆ టాస్క్ ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధీనంలో ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర పెద్దలకు సన్నిహితుడన్న పేరు ఉంది. ఆయనను కాపాడుకోకపోతే, ఆ కేసు ఆ పై అధికారులు, తదుపరి ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. దాంతో సీఐ నాగరాజును పూర్తిగా మేనేజ్ చేసిన తర్వాతే, సిసిటీవీ ఫుటేజి మాయం అయ్యాకే కేసును ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసి ఉంటారన్నది జై భీమ్ అధ్యక్షులు జడ శ్రవణ్ తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల అభిప్రాయంగా ఉంది. అందులో వాస్తవం ఉండే అవకాశం కనిపిస్తుంది.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల ప్రస్తావన లేకుండా, మానవ హక్కుల కోణంలో సాయి కుటుంబాన్ని పరామర్శించినా తొలుత విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయించారు. అయినా పరిస్థితి చేయి జారిపోతోందని భయపడి స్వయంగా చంద్రబాబే కుటుంబాన్ని తనవద్దకు పిలిపించుకుని రాయబారం చేశారు. అక్కడ ఏమి జరిగిందో కాని ఆ కుటుంబం స్వరం మార్చేసింది. ఇది ఒక కోణం అయితే క్యాబినెట్ సమావేశంలో యధాప్రకారం క్రిమినల్స్‌కు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోందని చంద్రబాబు అన్నారని ఎల్లో మీడియా రాసింది. అది నిజమే అయితే, ఆ క్రిమినల్ కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పరామర్శించారు? విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆ కుటుంబంతో ఎందుకు మాట్లాడి ఓదార్పు మాటలు చెప్పారు. జనసేన నేత ఒకరు డబ్బు ఆఫర్ ఎందుకు ఇచ్చారు? ఇవేవి ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు మాట్లాడతారు. ఇది ఇలా ఉంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ తలాతోక లేకుండా వైఎస్సార్‌సీపీవారిని దూషించి రెచ్చగొట్టడం చంద్రబాబు ప్లాన్‌లో భాగమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం.రౌడీ షీటర్ చనిపోతే ఏమిటన్నట్లు పవన్ మాట్లాడడం ఎంత దారుణంగా ఉంది. అతను కాపు కులం వాడైతే మాత్రం అని ఆయన భావిస్తున్న తీరు పద్ధతిగా ఉందా? సీఐ నాగరాజు లేదా, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఒక వ్యక్తి చచ్చేలా హింసించడం నేరం కాదని చట్టబద్దమైన పదవులలో ఉన్న చంద్రబాబు, పవన్‌లు చెప్పదలిచారా? లేక సాయికృష్ణ పేదవాడు కనుక, అతనికి అండ లేదు కనుక, కేవలం జనసేనలో ఒక సామాన్య కార్యకర్త కనుక పట్టించుకోనవసరం లేదనుకున్నారా! అదే సీఐ కూడా కాపు వ్యక్తి అయినా, బాగా డబ్బు ఉన్న వ్యక్తి అవడం, అతని మేనమామ ఒక మాజీ డీజీపీ కావడం వల్ల అతనికి పవన్ అండగా నిలబడుతున్నారా అన్న విమర్శ రాదా? సాయిపై కేసులు ఉంటే, మరి పోలీసులకు హత్యలు చేసే అధికారం ఉండదు కదా! అంటే వారు కూడా నేరం చేసినట్లే అవుతుంది కదా! ఆ ప్రస్తావన ఎందుకు క్యాబినెట్లో రాలేదు. తాను ఎందుకు సాయి కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడింది చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు?బాధిత సాయి కుటుంబంతో రాజీచేసుకుని, కేసులో నిందితుడుగా ఉన్న నాగరాజుతో కూడా డీల్ కుదుర్చుకోవడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందేమో! పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే స్పందించరేమిటని, కుల రాజకీయాలను తిప్పి కొట్టాలి కదా అని ఆయన అన్నారట. వైఎస్సార్సీపీ పవన్ కళ్యాణ్‌పై తొలుత ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు పైన, పోలీసు అధికారులపైన ఆరోపణలు చేసింది. దానికి జవాబుగా రౌడీలకు మద్దతు ఇస్తారా అని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా రౌడీ కుటుంబంతో భేటీ అయ్యారు. దానిని ప్రస్తావంచకుండా పవన్ కళ్యాణ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.కాకినాడలో పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీవారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ అనుచితంగా మాట్లాడారు. దానికి జవాబుగా టీడీపీ, జనసేనలలో ఉన్న రౌడీలు, గూండాల గురించి వివరాలను వైఎస్సార్సీపీ బయటపెట్టింది. టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో క్రిమినల్ కేసులు ఉన్నవారు 115 మంది అట. అందులో తీవ్రమైన అభియోగాలు ఉన్నవారి సంఖ్య 82. జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే పది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఏడుగురిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను దాచేసి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది చంద్రబాబు లక్ష్యం. కాని సోషల్ మీడియాలో అన్ని వివరాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాలపై మాత్రం టీడీపీ, జనసేనలు నోరు పెగల్చవు.ఈ కేసులో పవన్‌ను ఇరికించాలని జగన్ తన పార్టీ నేతలతో అన్నారని ఒక ఊహాగానాన్ని సృష్టించి దుష్ప్రచారం చేసిది. నిజానికి పవన్ పద్దతిగా వ్యవహరించకుండా చేసింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఒకప్పుడు పోలీసులు ఎలా నిందితులను కొడతారంటూ ప్రశ్నలు వేసిన పవన్‌తోనే, లాకప్ డెత్‌లకు బాధ్యులైన పోలీసులకు మద్దతుగా మాట్లాడించి ఆయన పరువు తీశారు. ఇక నాగరాజుపై అన్ని ఆరోపణలు వస్తే కొంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నారంటూ 'నాగరాజుకు జేజేలు' అన్న హెడింగ్ పెట్టి ఇలాంటి హత్యలను కూడా సమర్థించే దుస్థితిలోకి ఎల్లో మీడియా వెళ్లిందంటే వారికి ఉన్న ప్రయోజనం ఏమిటో జనం ఊహించుకోలేరా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పంతం బూతులకు పవన్ మద్దతు
-
MLA పంతం నానాజీపై కేసు నమోదు
-
జనసేన నేత సంచలన వీడియో లీక్.. ఇది చూసి షాక్ అవుతున్న జనం
-
నోటి దూల తగ్గించుకుంటే మంచిది.. నానాజీపై పవన్ సీరియస్
-
కాపులను ఉద్ధరించేందుకు జనసేన పెట్టలేదు
గుంటూరు ఎడ్యుకేషన్: ‘కాపులను ఉద్ధరించేందుకు పవన్‌కళ్యాణ్.. జనసేన పార్టీని పెట్టలేదు. రాష్ట్రంలో రోజూ ఎంతో మంది చస్తూ ఉంటారు. అందుకని రోడ్డెక్కాలా?’ అని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సోమవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్సార్సీపీలోని కాపు నేతలను తాము కాపు సామాజికవర్గం నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. కాపులతో వారికి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వంలో కాపులకు ఏం చేశారో చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలను ప్రశి్నంచారు. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాపులకు చేకూర్చిన సంక్షేమం, విడుదల చేసిన నిధుల వివరాలను ఆ పార్టీ కాపు సామాజిక నేతలు ప్రకటించారు కదా.. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేశారో చెప్పాలని విలేకరులు వెంకటేశ్వరరావును ప్రశి్నంచారు. ఆయన స్పందిస్తూ.. ఒక్క కాపులకే మేలు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదన్నారు. -
దమ్ముంటే నాపై పోటీచేయి నానాజీ.. MLC త్రిమూర్తులు సవాల్
సాక్షి, కాకినాడ: జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు. తను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తానన్నారు. పంతం నానాజీ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీచేయాలన్నారు. ఒకవేళ నానాజీపై తాను గనుక ఓడిపోతే రాజకీయల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. తాను కూడా నానాజీ కంటే ఎక్కువగా మాట్లాడగలనని కానీ తనకు సంస్కారం అడ్డువస్తోందన్నారు. -
ఎవడివి రా నువ్వు.. నువ్వెంత నీ బతుకెంత.. పంతం నానాజీపై రెచ్చిపోయిన కారుమూరి
-
లాకప్‌డెత్ సాక్షిగా హైడ్రామా..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సరికొత్త డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా మరోవైపు పోలీసు బాస్‌ను కాపాడేందుకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. సాక్ష్యాలు, ఆధారాలు ధ్వంసమయ్యాక 40 రోజుల తరువాత తాపీగా సిట్ ఏర్పాటు పేరుతో చేతులు దులుపుకొంటోంది. ఈ ఘటనను సీఐ నాగరాజుకు ఆపాదించి తూతూమంత్రంగా దర్యాప్తు ముగించే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మంటగలిసి పోవడంతో దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు పడరాని పాట్లు పడుతోంది. సాయికృష్ణ ఉదంతంపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘ఎవరో కులం వాడు క్రిమినల్ పనులు చేస్తే నేను బాధ్యత వహించాలా? ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పరా..?’ అంటూ సాయికృష్ణ మిస్సింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో సాయికృష్ణ కుటుంబం జనసేన తరపున పని చేయలేదా? అని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఏమైంది? తొలుత తాము సాయికృష్ణను తీసుకురాలేదని బుకాయించినా తరువాత విధిలేని పరిస్థితుల్లో టాస్‌్కఫోర్స్, కృష్ణలంక పోలీసులు కలిసి వెళ్లి మార్కాపురం నుంచి మే 9న సాయికృష్ణను విజయవాడకు తెచ్చామని ఒప్పుకోక తప్పలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే విచారణాధికారి ఎదుట వెల్లడించినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దలకు, పోలీసు బాస్‌కు ముందుగానే దీనిపై సమాచారం ఉందని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చామని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, 70 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ప్రత్యేకించి విజయవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వాడటంలో దిట్టలు అని, నగరంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎన్నో కేసులు చేధించామని ప్రకటించే ఉన్నతాధికారులు సాయికృష్ణ ఆచూకీపై నోరు మెదపకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీన్నిబట్టి ఈ వ్యవహారం అంతా ప్రభుత్వ పెద్దలు, పోలీసు బాస్ కనుసన్నల్లోనే జరిగినట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. కరుడు గట్టిన నేరస్తుల నుంచి సమాచారాన్ని రాబట్టే పోలీసులు సాయికృష్ణ అదృశ్యంపై వివరాలను సేకరించడం పెద్ద కష్టమేమి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కానిస్టేబుళ్లను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టి సారించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్ డీల్ వ్యవహారమేనా..! సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చి రోజుల తరబడి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏముందనే కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక భూ వివాదం దీనికి కారణమని.. ఎంపీ, పోలీసుబాస్ పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రాంతి కుమార్ ఆత్మహత్య... సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియోలో వెల్లడించినా ఇంతవరకు దీనిపై పోలీసులు విచారణ చేపట్టలేదు. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారకుడైన సీఐ నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సీఐ ఇంటి వద్ద హైడ్రామా.. తనపై కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు సీఐ నాగరాజు ఇంటి వద్ద హైడ్రామా నడుపుతున్నారు. సీఐపై చర్యలు తీసుకోవద్దంటూ కొందరు యువకులు, మహిళలను పోగు చేసి ఆదివారం ఆందోళన చేయించారు. కొందరు పోలీసులు నాగరాజు ఇంటికి చేరుకుని విచారణ పేరుతో మంతనాలు సాగించారు. ఇక సాయంత్రం ధర్నా చౌక్ ప్రాంతం వద్ద సీఐకు అనుకూలంగా ధర్నా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినా పోలీస్ బాసులు వారించడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం గమనార్హం. ఇవన్నీ కేసును పక్క దారి పట్టించేందుకు చేస్తున్న కుట్రలేనని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
‘బాబుకు బీపీ డౌన్ కాగానే.. పవన్‌కు బీపీ పెరుగుతోంది’
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్‌కి మతి భ్రమించిందని.. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బీపీ డౌన్ కాగానే, పవన్ కళ్యాణ్‌కి బీపీ పెరుగుతోందన్నారు.‘‘పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడటం లేదు. వైఎస్సార్సీపీ నేతలను గూండాలతో పోల్చటం సిగ్గుచేటు. మమ్మల్ని తొక్కి నార తీస్తా అనటం ఏంటి?. ప్లేస్, టైం చెబితే మేమే వస్తాం.. నార తీయండి చూస్తాం. సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేస్తున్నారనంటూ అతని తల్లి చేసిన రోదనలు వినపడలేదా పవన్?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘తన బిడ్డను చంపేశారని, కనీసం బూడిదనైనా ఇప్పించమని అడిగారు. ఆ తల్లికి మద్దతుగా వైఎస్ జగన్ నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు సాయికృష్ణ తల్లిని ఓదార్చితే కుల రాజకీయం అంటూ విమర్శిస్తున్నారు. సాయికృష్ణ నేరగాడనైతే మరి అతని కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పిలిపించారు?. జనసేన నేత ఉదయభాను.. సాయికృష్ణ ఇంటికి ఎందుకు పంపించావ్ పవన్?. అంతకంటే ముందు తూర్పు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్‌ను పంపలేదా?. కేసును రాజీ చేసుకోవాలని కోరలేదా?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు.‘‘సాయికృష్ణ నేరస్తుడైతే మాత్రం పోలీసులతో చంపేస్తారా?. మరి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంగతేంటి?. ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తున్న చింతమనేనిపై ఏం చర్యలు తీసుకున్నారు?. కనీసం కేసు కూడా పెట్టలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇదికాదా పవన్?. కాపులంతా తనకు మద్దతుగా నిలబడితే సీఎం అవుతానని పవన్ చెప్పలేదా?. మరి తన సినిమాలను కూడా కాపులు మాత్రమే చూడాలని ఎందుకు చెప్పలేదు?. రాజకీయాలకు మాత్రం కులం కావాలా?..కుల రాజకీయాలు చేస్తూ ఇతరులను విమర్శించటం ఎందుకు?. ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబానికి పవన్ ఎందుకు సానుభూతి చెప్పలేదు?. దళితుడైన క్రాంతికుమార్ పవన్‌కు కనపడలేదా?. హోంమంత్రి పదవి మీద పవన్‌కు మనసు పడింది. అందుకే పదేపదే నేను హోంమంత్రినైతే.. అంటున్నారు. దళితురాలు అనిత హోంమంత్రిగా పనికి రాదని పవన్ చెప్తున్నారు. ముందుగా సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయండి. అతని మిస్సింగ్ వెనుకున్న పోలీసు పెద్దల పాత్రను బయట పెట్టండి’’ అని టీజేఆర్ సుధాకర్ బాబు హితవు పలికారు. -
సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు
సాక్షి, కాకినాడ: సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారు కాగా, గత ప్రభుత్వంలో తారుమారు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సుగాలి ప్రీతి తల్లిని వంచించేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్‌లోనే చెరిపేశారు. పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలేం. ఫాల్స్ డీఎన్ఏ పెట్టేశారు. క్రైమ్ సీన్లో సాక్ష్యాధారాలు కీలకం. నిర్థారించడానికి కోర్టులు అడిగేవి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్.. ఎవిడెన్స్ లేకపోతే మాత్రం మనం ఎవరిని కూడా మన కళ్ల ముందు తెలిసినా సరే మనం ఏమీ చేయలేం’’ అంటూ సుగాలి ప్రీతి కేసు విచారణపై పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. -
రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు
-
రూ.50 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకుందామంటూ 'జనసేన' బెదిరింపు
నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇవ్వండి..! సీఐ నాగరాజు నా కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడు. ఫొటో చేయించి దండేసుకో అన్నాడు. చివరకు కనిపించకుండా చేశాడు. నా కుమారుడిని కొట్టి పోలీస్‌స్టేషన్ బాత్రూమ్లో పడేశారు. స్టేషన్లో చంపేసి, ఇద్దరు పోలీసులు బైక్‌పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు’ అంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది.లబ్బీపేట/కృష్ణలంక (విజయవాడ తూర్పు): ‘నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇవ్వండి..!’ అంటూ విజయవాడ కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆక్రోశించారు. తమ బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే..రూ.50 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకుందామంటూ జనసేన తూర్పు ఇన్‌ఛార్జి అమ్మిశెట్టి వాసు బెదిరిస్తున్నారని కంటతడి పెట్టారు. ‘మేం జనసేనకు చెందిన వాళ్లమే.. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ ఈ విషయంలో స్పందించాలి..’ అని సాయికృష్ణ చిన మేనమామ ముళ్లపూడి నవరంగ్ కోరారు. బుధవారం విజయవాడలో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులైతే... చంపి తగలబెడతారా? సీఐ నాగరాజు తన కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడని, ఫొటో చేయించి దండేసుకో అన్నాడని, చివరకు కనిపించకుండా చేశాడంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా బిడ్డకోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లా.. అక్కడ కుర్రాళ్లను కొడుతుంటే తట్టుకోలేకపోయా. నా కుమారుడిని చూపించమంటే చూపించలేదు. నా కుమారుడిని కొట్టి బాత్రూమ్లో పడేశారు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్లో చంపేసి.. ఇద్దరు పోలీసులు బైక్‌పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు. పిల్లోడిని చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సీఐకి ఎవడు ఇచ్చాడు అధికారం చంపేయమని? పోలీసులు అయినంత మాత్రాన చంపి తగలబెడతారా? నాకు మద్దతుగా నిలిచిన వారిపై నిందలు వేస్తున్నారు. నా కుమారుడికి రాజకీయాలు అంటగట్టొద్దు. న్యాయం చేయమని కోరుతున్నాం’ అని విజయలక్ష్మి విలపించారు.మాఫియా, గంజాయి డాన్ అయితే రూ.350కి పని చేస్తాడా? పోలీసులు అన్ని కేసులు ఉన్నాయి.. ఇన్ని కేసులు ఉన్నాయని చెబుతున్నారు. మరి అలాంటి వాడిపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేదు? ఫోటోల్లో గొడ్డలి పెట్టి ట్రోల్ చేస్తున్నారు. కోర్టు వాయిదాకి వచ్చి కనిపిస్తే కొడతారని భయపడి మార్కాపురం వెళ్లి జొమాటోలో పనిచేస్తూ రోజుకు రూ.350 ఆదాయంతో బతికాడు. అంత పెద్ద మాఫియా డాన్, గంజాయి డాన్ అయితే రూ.350కి పని చేస్తాడా? గంజాయి ఫాల్స్ కేసులు పెట్టారు. ఆ కేసులు ఏవీ నిరూపణ కాలేదు. మా పిల్లోడిని మాకు అప్పగించాలి. చనిపోతే బాడీ అయినా ఇవ్వండి. పోలీసులు అంబేడ్కర్ విగ్రహం వద్దకి వచ్చి కేసులు ఉన్నాయని నిరూపించాలి. – ముళ్లపూడి నాగేశ్వరరావు, సాయికృష్ణ మేనమామరెండు కేసులే ఉన్నాయి: కనకదుర్గ, అడ్వొకేట్ సాయికృష్ణపై రెండు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ రెండు కేసుల్లో వాయిదాలకు హాజరు కాలేదని తీసుకొచ్చి కొట్టారు. బందర్ రోడ్డులో కూర్చుంటా. పోలీసులు వచ్చి ఎన్ని కేసులు ఉన్నాయో నిరూపించాలి. సాయికృష్ణకు రాజకీయాలతో సంబంధం లేదు. ప్రశ్నిస్తానన్న పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? ప్రశ్నిస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అనేక కేసుల్లో ఆందోళనలు చేశారు. మా అబ్బాయి విషయంలో ఏం చేస్తారు? మేమంతా జనసేనలో ఉంటూ పవన్ కళ్యాణ్, లోకేశ్ కోసం పని చేశాం. పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలి. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చి చంపేస్తే డీజీపీ అడగరా..? కేసు సెటిల్ చేసుకుందామని, రూ.50 లక్షలు ఇప్పిస్తామని జనసేన నేత అమ్మిశెట్టి వాసు బెదిరించినా మేం ఒప్పుకోలేదు. మేం పోలీసులకు వ్యతిరేకం కాదు.. నాగరాజు చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నాం. ఈ కేసుతో సంబంధం ఉన్న సీఐతో పాటు అశోక్, బాబూరావు, సుబ్రహ్మణ్యం, మురళీకృష్ణ, మరికొంతమంది స్టేషన్లో ఉన్న వాళ్లను సస్పెండ్ చేయాలి. కేసులు ఉన్నాయని ఇష్టారాజ్యంగా తీసుకొచ్చి కొట్టి చంపేస్తారా? మావాడు రౌడీ అంటున్నారు. మీరు చేసిందేమిటి? మీరు హంతకులు కాదా? సామాన్యులకు న్యాయం జరగదా? అన్యాయం జరిగిందని మాకు అండగా నిలుస్తున్న వారికి పారీ్టలను అంటగడతారా? మాకు పారీ్టలు లేవు.. కులం లేదు. మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. మాకు న్యాయం చేయండి. విజయవాడలో వందల మంది రౌడీ షీటర్లు ఉన్నారు. కానీ మావాడినే తీసుకొచ్చి చంపేశారు. మేం రాజకీయాలు చేసే వాళ్లం కాదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, లోకేష్, హోం మంత్రి అనిత స్పందించాలి. మేం పనిచేసిన పార్టీ వాళ్లు మా కోసం ఏమీ చేయలేదు. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాకు అండగా నిలుస్తూ, న్యాయం కోసం పోరాడుతున్నారు. – ముళ్లపూడి నవరంగ్, సాయికృష్ణ మేనమామ -
కుక్కలకు ఇంచార్జ్ పదవులు ఇస్తారా..? లైవ్ లో పవన్ కళ్యాణ్ ను కడిగి పడేసిన సాయి కృష్ణ మేనమామ..
-
viral video: వాడికే దిక్కులేదు, పచ్చి బూతులు తిడుతూ జనసేన వీడియో
-
జిత్తులమారి లెక్కలు.. కూటమి అవినీతి బయటపెట్టిన కేంద్రం
-
ప్రమాదం వెనుక నిజం.. మీ ఇంట్లో వాళ్లు చనిపోలేదు కదా లోకేష్.. పవన్ కామెంట్స్ వైరల్
-
కారులో గన్ తీసుకురండిరా.. కాల్చేద్దాం.. జనసేన MLAకు కార్యకర్త సవాల్
-
Balaraju: కారులో గన్ తీసుకురండిరా.. కాల్చేద్దాం
-
పవన్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేకు కార్యకర్త సవాల్!
సాక్షి, ఏలూరు జిల్లా: పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసేన కార్యకర్త పూనెం వంశీ తీవ్ర ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఆయన క్యాంపు కార్యాలయ సిబ్బందిపై తాను దాడి యత్నం చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఒక సాధారణ కార్యకర్తగా తాను.. ఎమ్మెల్యేపై దాడి చేయగలనా అని ప్రశ్నించారు. తన బైక్‌ను పోలీస్ స్టేషన్లో ఉంచి ఇబ్బందులకు గురిచేయడంతో ఆ విషయంపై వివరణ కోరేందుకే ఎమ్మెల్యే వద్దకు వెళ్లానని చెప్పారు.అయితే సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఎమ్మెల్యే, ఆయన అనుచరులే తనపై దాడి చేశారని వంశీ ఆరోపించారు. అంతేకాకుండా కారులో నుంచి తుపాకీ తీసుకువచ్చి తనను కాల్చేయాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. తాను కేవలం "నేను చేసిన తప్పేంటి?" అని మాత్రమే ప్రశ్నించానని, దానికి బదులుగా ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేసి తనను జైలుకు పంపించాలని ప్రయత్నించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన ఆరోపణలకు సంబంధించిన మూడు అంశాలను నిరూపించాలని వంశీ డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేశానని, మాజీ ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయని, తనకు రూ.1 లక్ష ఇచ్చారని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకోసం మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిరూపించలేకపోతే ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని కలవడానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని వంశీ తెలిపారు. తన తరఫున కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేస్తారని చెప్పారు. జనసేన కార్యకర్తగా తనకే న్యాయం జరగడం లేదని, అలాంటప్పుడు ఇతర కార్యకర్తలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ అంశంపై నియోజకవర్గంలోని జనసేన నాయకులు స్పందించాలని కోరారు. వంశీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పోలవరం జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. -
కన్నీటి ఆవేదన! ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరిక..
-
వెలుగులోకి మరో జనసేన నేత మోసం
సాక్షి, విజయవాడ: మరో జనసేన నేత మోసం వెలుగులోకి వచ్చింది. జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ తనను మోసం చేశాడంటున్న ఓ మహిళ.. కాంట్రాక్టులు ఇప్పిస్తానని చేశాడని పేర్కొంది. ఆ మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. కరోనా సమయంలో పరిచయమైన విజయ్ శేఖర్.. రాబోయేది మన ప్రభుత్వమేనని తన నుంచి భారీగా డబ్బు తీసుకున్నాడని ఆ మహిళ చెబుతోంది.2024లో ప్రభుత్వం రాగానే ఇసుక క్వారీలు, గ్రానైట్, వైన్ షాపులు మనవేనంటూ విజయ్ శేఖర్ ఆ మహిళను నమ్మించాడు. ఆయన్ని నమ్మి రూ.కోటి 75 లక్షలు ఇచ్చింది. ఆ మహిళ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టించిన విజయ్ శేఖర్.. అధికారంలోకి రాగానే మోహం చాటేశాడు. తన డబ్బు ఇవ్వమని అడిగితే ఆ మహిళపై విజయ్‌శేఖర్ దాడి చేశారు.బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంగళగిరిలో బేతపూడి విజయ్ శేఖర్‌తో పరిచయమైంది. అధికారంలోకి వస్తే ఇసుక క్వారీలు, గ్రానైట్, బిజినెస్, వైన్ షాప్ మనవేనని నమ్మించాడు. ముందుగా కొంత పెట్టుబడి పెట్టాలని నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా విజయ్‌శేఖర్‌కు నామినేటెడ్ పదవి వచ్చింది. నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు. నా డబ్బుల గురించి అడిగితే నీ దిక్కున్నచోట చెప్పుకోమంటున్నాడు..నాకు న్యాయం చేయమని అందరి దగ్గరికీ వెళ్లా. జనవాణిలో మూడుసార్లు దరఖాస్తు పెట్టుకున్నా. నాకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌కు తప్ప అందరికీ తెలుసు. మంత్రి కందుల దుర్గేష్‌కు కూడా తెలుసు. నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించి న్యాయం చేయండి. నాకు న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్ సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటా. నా చావుకి జనసేనలో ఉన్నవారంతా బాధ్యులే’’ అంటూ ఆమె హెచ్చరించింది. -
రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి టీడీపీ తరఫున చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, జనసేన తరఫున లింగమనేని రమేష్ దాఖలు చేసిన నామినేషన్లను ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి వెల్లడించారు. -
స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు
-
అత్తారింటికి దారేది సీన్ గుర్తొస్తోందా?.. పవన్‌పై విమర్శలు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను నటించిన సినిమాలలోని కొన్ని సన్నివేశాలను గుర్తుంచుకునైనా మాట్లాడితే ఇంత అప్రతిష్ట మూట కట్టుకునేవారు కారన్న మాట రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. అందులో హాస్య నటుడు బ్రహ్మానందం అబద్ధాలు చెబితే ఒక చెట్టు ఆకులు రాలుతుంటాయి. దాంతో ఆయన ఇరుకున పడతారు. ఇది పవన్ కళ్యాణ్ కు వర్తిస్తుందనిపిస్తుంది. అబద్దం చెబితే అతికినట్లు ఉండాలన్నది ఒక సామెత. ఈ విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న నేర్పరితనం పవన్ కు ఇంకా రాలేదనుకోవాలి. చంద్రబాబు ప్రత్యర్థులు ఈ విషయం ప్రస్తావిస్తుంటారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగల శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందని ఎద్దేవ చేసేవారు. అది వేరే కథ. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఏదో ఒక ప్రకటన చేయడం, ఆ తర్వాత అనతికాలంలోనే దానికి విరుద్ధంగా మాట్లాడడం వంటివి తరచు చేస్తుంటారన్న విమర్శ ఉంది. వాటిని నిర్ధారించే వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపిస్తాయి. గతంలో కాపుకులం వారైనా తనకు మద్దతు ఇవ్వాలని బహిరంగంగా కోరడం, ఇప్పుడేమో, తాను కాపులకోసమే పార్టీ పెట్టలేదన్నట్లుగా మాట్లాడడం, కాపులు మద్దతు ఇస్తే సీఎం అయి చూపుతానని ఒకసారి, తనకు అంత శక్తి ఎక్కడిదని ఇంకోసారి మాట్లాడారు.కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తనకు ఏపీలోనే దిక్కులేదని, తెలంగాణలో సీఎం అవుతానా అని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరిచారు. అది ఫ్రస్టేషనా? లేక ఇంకేదైనా కారణమో తెలియదు. ఈ క్రమంలోనే దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై పవన్ కళ్యాణ్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తారేమో అన్న అనుమానంతో ఆయనను ఇబ్బంది పెట్టాలని వైఎస్ అనుకున్నట్లు, ఆ విషయాన్ని ఒక పోలీసు అధికారి చెప్పినట్లు పేర్కొన్నారు. రోడ్డుపైకి వస్తే కాల్చేసే రోజులని, తాను తుపాకి పోలీసులకు ఇచ్చేసి ప్రాణాలకు తెగించి రాజకీయాలలోకి వచ్చానని ఆయన తెలిపారు. ఇది విన్న కొత్త తరం వారికి అందులో నిజం ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది. కాని అప్పటి నుంచి రాజకీయాలను చూస్తున్న వారికి పవన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.ఇంత ఘోరంగా అసత్యాలు చెప్పవలసిన అవసరం ఏమి ఉంది అన్న ప్రశ్న వచ్చింది. దీనిని ఖండించి, ఎవరూ వాస్తవాలు చెప్పలేరులే అన్న ధైర్యమో, లేక నిజాలు తెలిసినా పర్వాలేదులే.. తాను చెప్పినవాటిని నమ్మే జనం ఉంటారులే అన్న భావమో తెలియదు. కాని దీనివల్ల తన పరువుకు భంగం అని ఆయన ఆలోచించలేకపోతున్నారు. ఆ వెంటనే కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు పాత చరిత్రను తవ్వారు. పవన్ తుపాకి కథకు సంబంధించిన వీడియోలను వెలికి తీశారు. వాటిని చూస్తే పవన్ కళ్యాణ్ అనవసరంగా గెలుక్కున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. పైగా అసందర్భంగా మాట్లాడినట్లు కూడా అర్థం అవుతుంది.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఈ నేపథ్యంలోనే ఆయనకు సవాల్ విసిరారు. 2005 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పెద్దగా జనంలో ప్రాచుర్యం పొందిన నేతకాదు. కేవలం ఒక సినిమా నటుడిగా, అది కూడా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత పవన్ ను యువరాజ్యం అధ్యక్షుడిని చేశారు. ఆ తర్వాత ఇందిరాపార్క్ వద్ద జరిగిన ఒక ధర్నాలో కాంగ్రెస్ వాళ్ల పంచెలూడదీసి కొట్టాలి అన్న వివాదాస్పద డైలాగుతో పవన్ బాగా ప్రచారంలోకి వచ్చారు. ఆ తర్వాత పరిణామాలలో 2014లో జనసేన ఆవిర్భావంతో ఒక ప్రముఖ రాజకీయ నేతగా అవతరించారు.2005 ప్రాంతంలో చిరంజీవి కుమార్తె ఒకరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి కుటుంబపరంగా ఏవో సమస్యలు వచ్చాయి. ఆ క్రమంలో ఆమె పవన్ పై ఒక ఆరోపణ చేశారు. ఆయన వల్ల తమకు ప్రమాదం ఉందని అన్నారు. దాంతో పవన్ తన వద్ద ఉన్న తుపాకిని తెచ్చి పోలీసులకు అందచేశారు. ఆ టైమ్ లో అవే విషయాలను ఆయన మాట్లాడారు. కాని రెండు దశాబ్దాల తర్వాత ఆ ఉదంతాన్ని వక్రీకరించి వైఎస్ఆర్పై నింద మోపడంతో మరోసారి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్తారింటికి దారేది సినిమాలో అబద్ధాలు ఆడితే ఆకులు రాలినట్లుగా, వీడియోలతో అసలు సన్నివేశం తెలిసిపోయింది. దీనిపై తొలుత వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్పందిస్తూ పవన్ కళ్యాణ్ రౌడీయిజం చేయబోతే చిరంజీవి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసిందని వ్యాఖ్యానించారు.కాస్త ఆలస్యంగా కేవీపీ రామచంద్రరావు ఒక లేఖను పవన్ కు రాస్తూ తన ఆక్షేపణ తెలిపారు. పవన్ అసత్యాలు చెబుతున్నారని అందులో స్పష్టం చేశారు. వైఎస్ పై ఆరోపణలను రుజువు చేస్తే పది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి, లేదా స్వచ్ఛంద సంస్థకు అందచేస్తామని సవాల్ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుటుంబపరంగా మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప, ఎలాంటి రాజకీయ కేసులు లేవని కేవీపీ స్పష్టం చేశారు. సంబంధిత పోలీసు అధికారి ఎవరో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడితే ఈ చాలెంజ్ స్వీకరించాలని అన్నారు. పవన్ కాంగ్రెస్ వారిని ఉద్దేశించి అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు(పంచెలూడగొట్టాలని) చేస్తేనే కేసు పెట్టలేదని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంలో కేవీపీ కూడా బహుశా కంపల్షన్ రీత్యా ఒక వ్యాఖ్య చేసినట్లు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డికి, వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని చాలామందిలాగానే పవన్ కూడా గుర్తించడంలో విఫలం అయ్యారని కేవీపీ అన్నారు. వైఎస్ ఆర్ మరణించాక ఆయన పేరు చార్జీషీట్ లో చేర్చిన రోజే కాంగ్రెస్ తో బంధం తెగిపోయిందని చాలామంది నమ్ముతారు. వైఎస్ వారసత్వాన్ని జగన్ కొనసాగించి ఉండకపోతే ఈపాటికి కాంగ్రెస్ పార్టీ ఆయనను పూర్తిగా వదలివేసి ఉండేదేమో!ఈ మధ్యకాలంలో వైఎస్ ఆర్ పైన, ఆయన కుటుంబంపైన అంత నీచంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా జవాబు ఇచ్చి ఖండించిందా? లేదే! పైగా ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో మిలాఖత్ అయిందన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి కదా! పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరో అడిగితేనే కాని స్పందించలేదని ఆయనే చెప్పడం కూడా గమనించదగిందే! కనీసం ఇప్పటికైనా స్పందించి అప్పటి పరిస్థితులను వివరించడం ద్వారా తన ఆప్త మిత్రుడైన వైఎస్ కు కేవీపీ కొంతలో కొంత న్యాయం చేసినట్లయింది.కేవీపీ చేసిన ఈ సవాల్ ను పవన్ స్వీకరిస్తారా అన్నది అనుమానమే. దానికి తగినట్లే ఆయన జవాబిచ్చినట్లు కనిపించలేదు. ఎందుకంటే ఈ పన్నెండేళ్లలో పవన్ కళ్యాణ్ చేసిన అనేక ప్రకటనలు, ఆ తర్వాత వాటికి విరుద్ధంగా ఆయనే మాట్లాడిన వీడియోలు కోకొల్లలుగా కనిపిస్తాయి. గతంలో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడిన పవన్, తెలంగాణలో మాత్రం రేవంత్, కేటీఆర్ తదితరులను పొగుడుతున్న తీరును జనం గమనించకపోలేదు. ఎప్పటికీ అది ప్రస్తుతమో అన్నట్లుగా కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తుంటారన్న భావన ఉంది. వైఎస్ పై కూడా దురుద్దేశంతో చేసిన వ్యాఖ్య ఆయనకే తగిలినట్లయింది. పవన్ కళ్యాణ్ అనవసరంగా తెలంగాణలో వేలుపెట్టి వివిధ వర్గాలవారిని రెచ్చగొట్టి ఆంధ్రులకు ఇక్కట్లు తెచ్చి పెట్టకుండా ఉంటే అదే పదివేలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
డబ్బులున్న వారికే టికెట్.. జెండా మోసిన కూలీలు బానిసలు..
-
పాపం లింగమనేని.. ఎన్నికల అఫిడవిట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే
-
పైరవీల ‘రాజ్యం’!.. టీడీపీ, జనసేనలో రాజుకున్న సెగలు
సాక్షి, అమరావతి: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అటు టీడీపీ ఇటు జనసేనలో కాక రేపుతోంది. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు టీడీపీ సీనియర్ నేతలు రగిలిపోతుండగా.. జనసేనలో పైరవీకారులు, ఆఖరి నిమిషంలో పార్టీలో చేరే నేతలకు మాత్రమే పదవులు దక్కుతాయని మరోసారి తేటతెల్లమైందని, ఇలాగైతే పార్టీ ఎలా బలపడుతుందని ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల సమయంలో అత్యధిక చోట్ల ఆఖరి నిమిషంలో జనసేనలో చేరిన టీడీపీ నేతలకే సీట్లు దక్కాయని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నారు. లాబీయిస్టు సానా సతీష్, కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతి భాష్యం రామకృష్ణ, స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్‌కి పదవుల పందేరంపై టీడీపీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. టీడీపీ రాయలసీమ కోఆర్డినేటర్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులరెడ్డి చంద్రబాబు వైఖరిని బహిరంగంగానే తప్పుబడుతూ ఆదివారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. 13 ఏళ్ల పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేసినా రాజ్యసభ హామీని నెరవేర్చకుండా చంద్రబాబు తనకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇక వర్ల రామయ్యకు అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీలో దళిత సామాజికవర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రతిసారీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో వర్ల రామయ్య పేరును తెరపైకి తేవడం చివరకు సామాజిక సమీకరణాల పేరుతో పక్కనపెట్టి అవమానించడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని మండిపడుతున్నారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అనే విషయం మరోసారి రుజువైందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అహర్నిశలు పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు లేకపోగా పదవుల విషయంలో తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని రామయ్య సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. యనమల గుర్రు.. కంభంపాటి కస్సు..! సీనియర్ నేత యనమల రామకృష్ణుడి బాధ వర్ణనాతీతమని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పెద్దల సభకు పంపాలని పదేపదే ప్రాథేయపడినా చంద్రబాబు పట్టించుకోకపోవడంపై యనమల తీవ్రంగా కలత చెందుతున్నట్లు చెబుతున్నారు. ఏ క్షణమైనా ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నారా లోకేష్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ధన బలం ఉన్న వారిని పార్టీ నేతలుగా చిత్రీకరించి ఉన్నత పదవులు కట్టబెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు సైతం తనను అవమానించారని ఆవేదనతో రగిలిపోతున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిని అయినప్పటికీ పదవుల విషయంలో వంచించారని ఆయన వాపోతున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక గల్లా జయదేవ్, టీడీ జనార్థన్, ఎంఏ షరీఫ్ తదితర నేతలు సైతం తమకు అన్యాయం చేశారని నైరాశ్యంలో కూరుకుపోయారు. ఒక్క మహిళా కనపడలేదా? మూడు స్థానాల్లో టీడీపీ ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజ్యసభ సీటు ఇచ్చేందుకు చంద్రబాబుకు ఒక్క మహిళ కూడా కనిపించలేదా? అని మహిళా లోకం నిలదీస్తోంది. మహిళల కోసమే టీడీపీ ఉందని మహానాడులో తీర్మానాలు చేసి తీరా రాజ్యసభ సీటు ఇవ్వకుండా చంద్రబాబు మరోసారి తన నైజం బయటపెట్టుకున్నారని మహిళా నేతలు మండిపడుతున్నారు. కార్పొరేట్ వైపే మొగ్గు.. తన కుమారుడి కోటరీలో కీలక వ్యక్తిగా ఉన్న సానా సతీష్‌కి మరోసారి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా తాను లాబీయిస్టుల వైపే మొగ్గు చూపుతానని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సతీష్ వివాదాస్పద వ్యక్తి అని, అతడితో కలిసి తిరిగితే జనం ఏమనుకుంటారని ఎల్లో మీడియాకు చెందిన ఏబీఎన్ రాధాకృష్ణ తన తొలి పలుకులో ప్రశ్నించారు. టీడీపీలో సీనియర్లంతా వ్యతిరేకించినా సతీష్‌కు పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రెండోసారి ఆయన రాజ్యసభకు పంపుతుండటాన్ని బట్టి తమ బంధం ఎంత బలమైందో రుజువు చేశారు. భాష్యం రామకృష్ణ కంటే సీనియర్లు టీడీపీలో చాలామంది ఉన్నా ఆయనకే అవకాశం ఇవ్వడం ద్వారా కార్పొరేట్ శక్తులంటే తనకు మక్కువని చంద్రబాబు తేల్చేశారు. ఇక స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ దురహంకారి కావడంతో పార్టీలో ఆయన పట్ల పూర్తి ఆమోదం లేదు. అందుకే పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యతల నుంచి చాలాకాలం క్రితమే ఆయన్ను తప్పించారు. అయితే లోకేష్‌కి సన్నిహితుడు కావడం, ధన బలం ఆధికంగా ఉండడంతో ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఒక కుటుంబంలో ఒక్కరికే పదవి అని తరచూ చెబుతూ తండ్రికి స్పీకర్ పదవి, కుమారుడికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని టీడీపీలో ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. నాలుగింటిలో రెండు సొంత వర్గానికే.. కూటమి తరఫున నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతుండగా రెండు సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడం ద్వారా తన ప్రాధాన్యతను చంద్రబాబు మరోసారి చాటుకున్నారనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలోనూ వినిపిస్తోంది. జనసేన తరఫున సీటు పొందిన లింగమనేని, టీడీపీ తరఫున సీటు దక్కించుకున్న భాష్యం రామకృష్ణ.. వీరిద్దరూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే కావడం, ఆయనకు సన్నిహితులనే విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. విజయ్ సత్తా చూశాకైనా మారకుంటే ఎలా? జనసేన అంటే టీడీపీకి బీ టీమ్ అని ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండగా పార్టీకి దక్కిన రాజ్యసభ సీటును సైతం చంద్రబాబు సన్నిహితుడిగా ముద్రపడిన వ్యక్తికే కేటాయించడం పట్ల జన సైనికుల్లో తీవ్ర నిరుత్సాహం వ్యక్తమవుతోంది. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి పనిచేసిన వారిని పక్కనపెట్టి ఓ బడా వ్యాపారవేత్తను పెద్దల సభకు పంపడం వెనుక అంతర్యమేమిటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నేతల్లో ఎవరికైనా ఆ పదవి ఇచ్చి ఉంటే జనసేన క్యాడర్ చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉండేదనే చర్చ జరుగుతోంది. ‘కష్టపడేవారికి గుర్తింపు లేకుండా.. పైరవీలు, ఆర్థిక అండదండలు ఉన్నవారికే పదవులు కట్టబెడితే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు? ఇలాగైతే జనసేన బలపడేదెలా?’ అంటూ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో రెండేళ్లలోనే అధికారంలోకి రాగలిగిన సీఎం విజయ్ ఎక్కువగా కొత్త వ్యక్తులకే అవకాశం కల్పించారని.. దళపతి సత్తా, ఆ పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం చూసిన తర్వాత కూడా పవన్‌కళ్యాణ్ మారకపోతే ఎలా? అని జనసేన సైనికులు ప్రశ్నిస్తున్నారు. -
మహిళలపై కక్ష కట్టిన బాబు, పవన్ కళ్యాణ్
-
దేవుడితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు..! పోతిన మహేష్ మాస్ వార్నింగ్!
-
నాలుగు సీట్లు టీడీపీ ఖాతాలోనే !
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి భర్తీ అవుతున్న నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. అధికారికంగా మూడు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకి కేటాయించుకున్నారు. కానీ, జనసేన అభ్యర్థిగా చంద్రబాబుకు బినామీగా ప్రచారంలో ఉన్న లింగమనేని రమేష్ ని ఎంపిక చేయడంతో నాలుగు స్థానాలూ టీడీపీయే తీసుకున్నట్లయిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కూటమి పొత్తులో భాగంగా నాలుగింటిలో టీడీపీకి రెండు, జనసేన, బీజేపీ చెరొక స్థానం పంచుకోవాల్సి ఉంది. కానీ, కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న తమకు 3 సీట్లు ఇవ్వాల్సిందేనని బీజేపీని ఒప్పించి టీడీపీకి చంద్రబాబు మూడు స్థానాలు కేటాయించుకున్నారు. గతంలో భర్తీ అయిన 4 స్థానాల్లో బీజేపీ రెండు తీసుకోవడంతో మిగిలిన ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించేలా చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ పార్టీ తరఫున తన మనిషిని అభ్యర్థిగా పెట్టి మొత్తం నాలుగింటిని టీడీపీకే దక్కేలా చేసుకున్నారు. టీడీపీలో భారీ లాబీయింగ్ టీడీపీకి దక్కనున్న మూడు స్థానాల కోసం ఆ పార్టీలో పెద్దఎత్తున లాబీయింగ్ జరుగుతోంది. సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ కి ఆ పదవి రెన్యువల్ చేయడం ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రెండు స్థానాలకు మంత్రి నారా లోకేశ్ అనుయాయుడు కిలారు రాజేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజేష్, విజయ్ పేర్లు ఖరారైనట్లు శుక్రవారం అంతా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో భాష్యం రామకృష్ణ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి తన మద్దతుదారులను తీసుకువచ్చి బలప్రదర్శన చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.అయితే అక్కడున్న నేతలు ఆయనకు సర్దిచెప్పినట్లు సమాచారం. ఒకవేళ చివరి నిమిషంలో సామాజిక సమీకరణలు మార్చాలని చంద్రబాబు భావిస్తే బీసీ, ఎస్సీ నేతలకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. అందులో మహిళా నేతలు గుండా లక్ష్మీదేవి, సజ్జా హేమలత, ఉండవల్లి శ్రీదేవి పేర్లను పరిశీలించినా వారు ఆర్థికంగా టీడీపీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన డాక్టర్ దేవయ్య, కంభంపాటి రామ్మోహనరావు పేర్లను పరిశీలించినా చివరికి వారినీ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్థరాత్రి గానీ శనివారం గానీ అధికారికంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తమకు రాజ్యసభ ఎంపీ అవకాశం ఇవ్వాలని కోరుతున్న సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. బాబు సొంత మనిషి.. ఇప్పుడు పవన్‌కి ఆప్తుడులింగమనేని రమేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉంటున్నా నిజానికి ఆయన చంద్రబాబు సొంత మనిషిగా, బినామీగా పేరు పడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లి కరకట్ట నివాసం ఆయనదే. రమేష్ దాన్ని చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారనే ప్రచారం ఉంది. టీడీపీ, జనసేన పొత్తు కుదిరాక పవన్ కళ్యాణ్‌తో సైతం రమేష్ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపాలని పవన్ నిర్ణయించారు. రమేష్ జనసేన తరఫున ఎంపీ అయినా చంద్రబాబు జేబులో మనిషేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వ్యూహం ప్రకారమే రమేష్ జనసేన తరఫున రాజ్యసభ రేసులోకి వచ్చినట్లు సమాచారం. మొత్తంగా నాలుగు రాజ్యసభ స్థానాలను చేజిక్కించుకోవడానికి చంద్రబాబు పన్నిన వ్యూహం ఫలించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
సాక్షి,అమరావతి: జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ను ఖరారు చేసింది. అధికారికంగా జనసేన ప్రకటించిన ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో లింగమనేని రమేష్‌కు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. చంద్రబాబుకు లింగమనేని కరకట్ట వద్ద గెస్ట్ హౌస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ భవనం అక్రమ నిర్మాణమని గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ధారించింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్‌తో పాటు లింగమనేని రమేష్‌కు లావాదేవీలు ఉన్నాయి. లింగమనేని రమేష్ రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలోనే పవన్ కళ్యాణ్ నివాసం, అలాగే జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. టీడీపీ కోటాలో చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో, జనసేన కోటాలో పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడికి రాజ్యసభ స్థానం కల్పించారు. సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా లింగమనేని రమేష్‌కు అవకాశం ఇచ్చినట్లు జనసేన ప్రకటించింది. -
ఏపీలో జనసైనికులను ఎగిరెగిరి తన్నుతుంటే దిక్కులేదు తెలంగాణాలో మీటింగ్ పెడతాడంటా..!
-
‘అక్కడ టెర్రరిస్టులున్నారా?’.. ఇంటి కూల్చివేతపై బాలశౌరి ఆగ్రహం
మచిలీపట్నం జనసేన లోక్ సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఒక అధికారిక సమావేశంలో బందరు మున్సిపల్ కమిషనర్ ను నిలదీసిన వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎపిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత ఆరాచకపాలన చేస్తున్నదో ఆయన మాటలను బట్టి అర్దం అవుతుంది. మచిలీపట్నంలో జనసేన స్తానిక నేత ఒకరి ఇంటిని మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు కూల్చివేయించారు. అందుకు సుమారు 200 మంది పోలీసుల సాయం కూడా తీసుకుని కమిషనర్ ఆ విధ్వంసానికి పాల్పడ్డారట. ఈ విషయాన్ని బాలశౌరి ప్రస్తావించి ఎవరు చెబితే నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చారని, అతనికి దీనివల్ల నలభై లక్షల నష్టం వచ్చిందని సమాధానం ఇవ్వాలని కోరారు మచిలీపట్నం పౌర సమాజం మంచిది కాబట్టి సైలెంట్ గా ఉన్నారని, మరో చోట అయితే ఇంకో రకంగా ఉండేదని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయా అని ఆయన అడిగారు. అక్కడేమైనా టెర్రరిస్టులు ఉన్నారా. ఇల్లు కూల్చడమన్నది చిన్న విషయం కాదని, ఇద్దరు వ్యక్తుల మద్య ఉన్న ప్రైవేటు తగాదాలో మీరెలా జోక్యం చేసుకున్నారని ఆయనఅడిగారు.మహిళలు కాళ్లమీద పడి బతిమలాడుతున్నా పోలీసులు వినిపంచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకుని ఏమైనా చేశారా.పోలీసుల పాయం కావాలని ఏ ప్రాతిపదికన లెటర్ రాశారు. అదేమి మున్సిపల్ ఆస్తి కాదు కదా అని,ఇంటిలో పెళ్లి చేసుకోవడానికి ఇల్లు కట్టుకుటుంటే దానిని కూల్చుతారా? ఇదేనా ప్రెండ్ లీ ప్రభుత్వం అని ఆయన ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఎంపీ అడిగినా కమిషనర్ మాత్రం మౌనంగా నిలబడిపోయారు తప్ప జవాబు ఇవ్వలేదు.దాంతో కలెక్టర్ దీనిని తేల్చాలని బాలశౌరి కోరారు. జనసేన కు చెందిన వ్యక్తి ఇంటిని కూల్చడం బందరులో టీడీపీ, జనసేన ల మధ్య రచ్చ రాజుకుంది. ఈ నేపధ్యంలో బాలశౌరి అధికారిక సమావేశంలో కడిగిపారేయడం చర్చనీయాంశం అయింది. జనసేన కార్యకర్తలు తమకు టీడీపీ నుంచి ఇబ్బంది వచ్చినా మౌనంగా భరించాలన్నట్లుగా పార్టీ అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినా ,బాలశౌరి మాత్రం కార్యకర్తల తరపున మాట్లాడడం ఆసక్తికరమైన అంశమే. ఈ ఇంటిని పడగొడుతున్న సమయంలో వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టూ అడ్డుకోవడానికి యత్నించినా అధికారులు వినిపించుకోలేదు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేనల మధ్య పలు చోట్ల ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ఇదే మచిలీపట్నంలో ఒక జనసేన నేత ఏదో వ్యాఖ్య చేశారని ,టీడీపీ స్థానిక నాయకులు అతనిపై దౌర్జన్యం చేసి మోకాలిపై కూర్చోబెట్టిన ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో కలకలం సృష్టించింది. కొల్లూరు వద్ద జనసేన కార్యకర్తపై టీడీపీ మూకలు దాడి చేశాయట. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే , టీడీపీ వారు పోలీస్ స్టేషన్ లో బీతావహ వాతావరణం సృష్టించారని వార్తలు వచ్చాయి. గతంలో శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత ఒకరికి సంబంధించి వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.అప్పటి నుంచి అనేక చోట్ల ఘటనలు జరగకపోలేదు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ జనసేన తరపున సూటిగా టీడీపీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించడం లేదన్న ఆవేదన జనసేన క్యాడర్ లోను, ఆయన అభిమానులలోను నెలకొంది. మరో విశేషం చెప్పాలి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై లైంగిక వేధింపులు చేశారని, అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చినా ఆయనపై చర్య తీసుకోలేదు. చంద్రబాబును విమర్శిస్తూ వేస్ట్ అని శ్రీధర్ వ్యాఖ్య చేసిన వీడియో బయటకు రాగానే అతని విప్ పదవికి పవన్ రాజీనామా చేయించారు. ఈ అంశం కూడా జనసేనలో చర్చకు దారితీసింది. అంతేకాదు.పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు అమిత్ షా తో భేటీ అయిన సందర్భంలో వచ్చిన ఒక సమాచారాన్ని ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించడంపై జనసేన కార్యకర్త కేసు పెట్టడం కూడా వివాదంగా మారింది. రాజకీయ అంశాలపై విశ్లేషణలు వచ్చినా, చర్చలు జరిగినా పోలీసు కేసులు పెట్టడం అంటే పార్టీ అంత బలహీనంగా మారిందా అన్న వ్యాఖ్యకు ఆస్కారం ఇచ్చారు. ప్రోఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా కేసు ఎలా పెడతారని అనేక మంది ప్రశ్నించారు. ఇలాంటివాటిపై కేసులు పెట్టవలసి వస్తే ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు పెట్టవలసి ఉంటుందో కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు గతంలో పొత్తు పెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారంటూ ఆంధ్రజ్యోతి ఓ కధనాన్ని ఇచ్చింది. అది పవన్ ను బాగా డామేజీ చేసింది. అయినా ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్న వస్తుంది. జగన్ పై అయితే ఎల్లో మీడియా రాసినన్ని కల్పిత కధలు ఇన్నీ అన్నీ కావు. ప్రధాని మోడీని, అమిత్ షాను కలిసిన దాదాపు ప్రతి సందర్భంలోను ,అక్కడ కూర్చుని చూసినట్లు,విన్నట్లు రాసిన స్టోరీలు ఎన్నో ఉన్నాయి. అయినా వైఎస్సార్సీపీ ఎన్నడూ కేసులు పెట్టలేదు.కాని ఇప్పుడు తెలివిగా జనసేనను టీడీపీ ఇరికించి నాగేశ్వర్ పైన,కొన్ని మీడియా సంస్థలపైన టీడీపీ నాయకత్వం కేసులు పెట్టించిందని,దీనివల్ల జనసేనకే తీరని నష్టం వచ్చిందని ఆ పార్టీ వారే బాధపడుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా నాగేశ్వర్ పై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ సీనియర్ నేత మురళీధరరావు సైతం కూటమి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్లపల్లి గ్రామంలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతులను ఎమ్మెల్యే నరేంద్ర అనుచరులు నానా పాట్లకు గురి చేయడంపై ఆందోళన చెలరేగింది. రైతులు తమ మొక్కజొన్న ఉత్పత్తులను ఒక గోడౌన్ లో దాచుకుంటే అది వైఎస్సార్సీపీ నేత అంబటి మురళీదని ఆరోపిస్తూ దానికి సీల్ వేశారు.అది పెద్ద ఉద్యమంగా మారింది. వైఎస్సార్సీపీ నేతలు పరామర్శకు వెళుతుంటే పోలీసులు అడ్డుకుని నానా రచ్చ చేశారు.తీరా చివరికి ఆ పంట అంతా రైతులదే అని తేలడంతో సీల్ తీయకతప్పలేదు.బాలశౌరి బందరులో జరిగిన ఘటనకే పరిమితం అయినా, వైఎస్సార్సీపీపైన ఈ రెండేళ్లలో జరిగినన్ని దాడులు ఇన్నీ అన్నీ కావు.వైఎస్సార్సీపీ తర్వాత జనసేనపై టీడీపీ రెడ్ బుక్ ప్రభావం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా జనసేన ఎంపీ బాలశౌరి ఈ మాత్రం అయినా ప్రతిఘటించి, గట్టిగా మాట్లాడినందుకు అభినందించాలేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తెలంగాణలో తిట్టించుకుని.. AP పరువు తీసిన పవన్
-
బీజేపీకి ఝలక్.. టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీ మూడు, జనసేన ఒక స్థానం కేటాయించుకున్నాయి. నాలుగింటిలో బీజేపీకి ఒక్క స్థానం ఇస్తారని ప్రచారం జరిగినా.. అది జరగలేదు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గురువారం జరిగిన ఎన్డీయే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రాజ్యసభ స్థానాల కేటాయింపు, రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆ వివరాలను పల్లా, మాధవ్, నాదెండ్ల కలిసి మీడియాకు వివరించారు. మూడు స్థానాలు టీడీపీ, ఒక స్థానం జనసేనకి కేటాయించాలని నిర్ణయించినట్టు చెప్పారు. జనసేన రాజ్యసభ అభ్యర్థిని పవన్‌కళ్యాణ్ ప్రకటిస్తారని మనోహర్ చెప్పారు. టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకీ ఉన్నట్టేనని మాధవ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై 9న తిరుపతి, 12న అమరావతి, 15న విశాఖపట్నంలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13, 16, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లాల్లో రెండేళ్ల పాలనపై కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని, త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. ‘సర్’ గురించి కూడా సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. గతంలో రెండు, రెండు గతంలో నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అయినప్పుడు టీడీపీ, బీజేపీ రెండు చొప్పున పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఖాళీ అవుతున్న నాలుగింటిలో మూడు తమ పార్టీకి కేటాయించాలని చంద్రబాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. గతంలో తమకు ఒక స్థానం కూడా దక్కలేదు కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వాలని పవన్‌కళ్యాణ్ కోరడంతో జనసేనకు ఒక స్థానం కేటాయించారు. టీడీపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కుతుండడంతో సానా సతీష్, కిలారు రాజేష్ కు ఇవ్వాలని ఈ సమావేశంలో లోకేశ్ చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ సతీష్, రాజేష్లలో ఒకరికే అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే కంభంపాటి రామ్మోహనరావు, భాష్యం రామకృష్ణ, డాక్టర్ దేవయ్య, ఓ మహిళా నేతల్లో ఒకరికి చాన్స్ ఉండొచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. గురువారం రాత్రి అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. జనసేనకు దక్కనున్న ఒక స్థానాన్ని పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు ఇవ్వనున్నట్టు తెలిసింది. -
AP క్యాబినెట్ మధ్య నుంచే వెళ్లిపోయిన పవన్.. ఎందుకంటే..!
-
తెలంగాణలో ఏం వాగుతున్నావ్!? పవన్ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ స్ట్రాంగ్ రియాక్షన్
-
పవన్ కల్యాణ్‌కు అస్వస్థత
సాక్షి,అమరావతి: పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశం కొనసాగుతుండగా మధ్యలోనే పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. అయితే కేబినెట్ సమావేశం మధ్యలో పవన్ అస్వస్థతకు గురైనట్లు జనసేన నేతలు చెబుతున్నారు. వెన్నునొప్పితో కేబినెట్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు వెళ్లిపోయారు. -
వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ‘సర్’ ప్రభావంతోనే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రంలో సీఎంలుగా ఉన్న మమత బెనర్జీ, స్టాలిన్లు ఓడిపోయారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని.. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమన్న రోజా.. సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘రాష్ట్రంలో జగనన్న పాలన దూరం చేసుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అందడం లేదు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 30 లక్షలు తల్లులకు అమ్మఒడి దూరం చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ రంగాకు టీ ఇచ్చాను.. గద్దర్‌కు కారు కొనిచ్చా అని చెప్పుకుంటున్నాడు...మంత్రి నారా లోకేష్ లీకేజీ స్టార్ అయ్యారు. వైఎస్సార్సీపీ నేతలను జైల్లో పెట్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు తుడవటానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు కనీసం పట్టించుకోలేదు’’ అని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. -
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు సంచలన కామెంట్స్
-
నువ్వేంటో, నీ స్థాయేంటో తెలుసుకో..! పవన్ పై అడ్వకేట్స్ కేసు
-
ఉరికించి ఉరికించి తంతం..! నువ్వు తెలంగాణ వచ్చి ఏం పీకుతావ్...
-
పవన్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె వెన్నెల స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే. తెలంగాణ గడ్డ ఈరోజు మా జాగీరు. రేపు మా బిడ్డల జాగీరు. తెలంగాణ గడ్డ ముమ్మాటికీ మా జాగీరే. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటం’’ అని వెన్నెల పేర్కొన్నారు.‘‘ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం కానీ ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్కౌంటర్ చేశారు. ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు’’ అని వెన్నెల అన్నారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై.. గద్దర్ కూతురు వెన్నెల .. pic.twitter.com/oSdScmlfm5— Prabhakar Venavanka (@Prabhavenavanka) June 3, 2026ఆ రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?: కేటీఆర్కాగా, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరే. పవన్ కల్యాణ్‌ను ఎవరు అడ్డుకున్నారు?. జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది?. 2023లో జనసేన పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ ఆవిర్భావం రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?. జాతీయ వాదంపై ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవు: పొన్నంకాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న(మంగళవారం) పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కల్యాణ్‌కు లేదని, వెంటనే గద్దర్ ఆత్మకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.12 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను పాకిస్తాన్లా చిత్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. -
జగన్.. జగన్.. అని గొంతు చించుకున్నాడు... తెలంగాణలో మీటింగ్ పెడతాడట
-
సీఎం రమేష్‌కు షాకిచ్చిన జనసేన నేత
సాక్షి, అనకాపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనలో కూటమి నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలే.. పాలకుల అరాచకాలను బయటపెడుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్‌పై జనసేన నేత వంశీ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని వంశీ డిమాండ్ చేశారు.వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లాలోని రాంబల్లిలో ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్‌పై జనసేన నేత వంశీ వీడియో విడుదల చేశారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి వీడియో విడుదల చేశారు. ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ..‘అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటే లారీలతో తొక్కి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ పేరు చెప్పి తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ మైనింగ్ దగ్గరకు వచ్చిన నన్ను చంపాలనుకుంటున్నారు అని ఆరోపించారు.అలాగే, అక్రమ మైనింగ్ జరగలేదని పైకి చెబుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వ హయాంలోనే పంచదార్ల కొండపై మైనింగ్ జరుగుతుంది. నెంబర్ ప్లేట్లు లేని లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్ పాల్పడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలి’ అని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో జనసేన ఉంటుంది..!
-
పర్మిషన్ ఇవ్వు లేకపోతే ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టుకుంటా..
-
జనసేన నేత కాబట్టే చర్యలు లేవా?
పిఠాపురం రూరల్ : తనకు రావాల్సిన ఆస్తి అడుగుతుంటే తన మామ, జనసేన నాయకుడు అయిన గరగ సత్యానందం వేధింపులకు గురి చేస్తున్నారని పిఠాపురం మండలం గోకివాడకు చెందిన గరగ కృష్ణ స్వాతి ఆరోపించారు. తనకు న్యాయం కావాలని, తన కుమార్తెతో కలిసి పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ చట్టబద్ధంగా తనకు రావలసిన ఆస్తి హక్కులను కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భర్త గరగ జగన్నాథ్ 2021లో కోవిడ్‌తో మరణించారని, భర్త మరణానంతరం తనను మానసికంగా, ఆర్థికంగా మామ సత్యానందం వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన పిఠాపురం జనసేన నాయకుడు కావడంతో జనసేన కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కుమార్తెను పోషించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కృష్ణ స్వాతి తెలిపారు. భర్త చనిపోయిన సమయంలో తన వద్ద నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, మామగారే కదా అని నమ్మి సంతకం పెట్టానని, ఆస్తి కోసం ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని కంటతడి పెట్టారు. స్థానిక జనసేన నాయకులు తనకు అండగా నిలవకుండా మామ సత్యానందానికే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, చేబ్రోలులోని పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశానని, హైదరాబాద్‌లో పవన్ నివాసానికి రెండుసార్లు వెళ్లానని అయినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన చిన్న కుమార్తెకు రక్షణ కల్పించి జీవన భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. -
తెలంగాణ నవ నిర్మాణ సభవెనుక భారీ కుట్ర..
-
పోస్టింగ్ ఇస్తామన్నా ‘వద్దు సార్’ అంటున్న అధికారులు
ధర్మవరంలో పోస్టింగ్ కోసం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్సాహం చూపేవారు. సిఫార్సు లేఖల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘కూటమి’ నాయకుల ఒంటెత్తు పోకడలు, ఒత్తిళ్ల గురించి తెలుసుకుని అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నతాధికారులు తమ వద్దకు పిలిచి మరీ పోస్టింగ్ ఇస్తామన్నా ‘మాకొద్దు సార్’ అంటూ చేతులెత్తేస్తున్నారు. కాదని బదిలీ ఉత్తర్వులు ఇచ్చినా వాటిని రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ధర్మవరం: మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా 5 నెలలుగా ఇక్కడ ఇన్చార్జ్ ఆర్డీఓ, ఇన్చార్జ్ డీఎస్పీతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యంత సమస్మాత్మక ప్రాంతాల్లో ధర్మవరం ఒకటి. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఇక్కడి పోలీస్ సబ్ డివిజన్‌కు 5 నెలలుగా రెగ్యులర్ డీఎస్పీ లేకపోవడం గమనార్హం. పెనుకొండ డీఎస్పీ నర్సింగప్పను ఇన్చార్జ్గా నియమించినా, రెండు సబ్ డివిజన్లను పర్యవేక్షించడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కిందిస్థాయి సిబ్బందిపై అజమాయిషీ సక్రమంగా లేక అంతా ఇష్టారాజ్యంగా మారింది. ఇదే అదనుగా అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇటీవల వరుసగా ఏటీఎంలలో దొంగతనాలు, పట్టపగలే రైతు కిడ్నాప్, సచివాలయంలో చోరీ ఘటనలు చోటుచేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అవస్థల పర్వం.. ధర్మవరం రెవెన్యూ డివిజన్లో సైతం పాలన అటకెక్కింది.తాడిమర్రిలో రెండేళ్లుగా, ధర్మవరంలో ఏడాదిగా తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో రెండేళ్లుగా ఆర్ఐలు కూడా లేరు. ఇక.. నియోజకవర్గానికి రెగ్యులర్ ఆర్డీఓను నియమించకుండా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఆమె ఎప్పుడో ఒకసారి ధర్మవరం వచ్చి వెళ్తుండటంతో రెవెన్యూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదు. భూముల రీ సర్వేలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తహసీల్దార్లు స్పందించకపోతే చెప్పుకునేందుకు ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్న పని కోసం కూడా ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. అంతులేని అవినీతి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికీ రేటు ఫిక్స్ చేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మట్టి, ఇసుక అక్రమ రవాణాను ‘మామూలు’గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి నాయకుల ఒత్తిళ్లతోనే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ అధికారులపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తమ మాటంటే తమ మాటే జరగాలంటూ ‘కూటమి’ పారీ్టలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఇన్‌చార్జ్‌లు ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. మంత్రి సత్యకుమార్ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే పాటించాలని ఇప్పటికే హుకుం జారీ చేసినట్లు తెలిసింది. టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్చార్జ్ చిలకం మధుసూధన్‌రెడ్డి సైతం పెత్తనం కోసం ప్రయతి్నస్తుండడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం ఉన్నతాధికారులు లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది సరిగా స్పందించడం లేదు. ఆర్ఐలు అందుబాటులో లేకపోవడంతో కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నాం. వారాల తిరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. –గుండా ఈశ్వరయ్య, ధర్మవరంవాసిప్రజల్లో భయాందోళన ఏటీఎంలలో చోరీలు, రైతు కిడ్నాప్, సచివాలయంలో విధ్వంసం వంటి ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిజాయితీ గల అధికారులను నియమించకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. –చందమూరి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం -
బాలినేని ఎంట్రీతో రియాజ్ విఫలమయ్యారా..?
-
లైన్ మెన్ పై బూతులతో రెచ్చిపోయిన జనసేన నేత
-
కాపులను బెదిరిస్తున్న పవన్ కళ్యాణ్
-
ప్రశ్నలకు పారిపోయిన సంపత్ నాయక్
-
జనసేన సంపత్ ను తరిమి తరిమి కొట్టిన జర్నలిస్టులు
-
కులాల కోసం మాట్లాడింది నువ్వు... దమ్ముంటే అరెస్ట్ చేయండి ప్రో. కే నాగేశ్వర రావు ఛాలెంజ్
-
జనసేన స్టార్.. కన్ఫ్యూజన్ మాస్టర్!
కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలోని ఆయన ప్రసంగంలో ఒక్క విషయంపై మాత్రం ఆయన చాలా స్పష్టత ఉన్నట్లు తెలిసింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాల్లోనూ టీడీపీతోనే కొనసాగాలని ఆయన కాంక్షిస్తున్నట్లు స్పష్టమైంది. కేడర్‌కు అసౌకర్యం, అవమానాలు ఎదురైనా భరించాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారని విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ సీఎం కావడం తనకు అసూయ కలిగించిందని చమత్కరిస్తూనే.. అక్కడ అభిమానులు ఏకతాటిపై ఉండి గెలిపించారని, కానీ ఏపీలో మాత్రం తాను స్వయంగా 15 ఏళ్లు రోడ్లపై దేకినా అవకాశం ఇవ్వలేదని అన్నారు. చిత్రంగా.. ఇందుకు కొద్దిరోజుల ముందే విజయ్ గెలుపును ఉద్దేశించి పవన్ ‘‘ఊళ్లో పెళ్లి అవుతుంటే..’’ సామెతను ప్రయోగించి కార్యకర్తలను విస్తుపరిచారు. ఒంటరిగా పోటీచేయడం సంగతి ఎలా ఉన్నా, ఆయన సీఎం కావాలని కోరుకుంటున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటా అన్న బాధను పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేశారు.ఇప్పుడేమో ఇంకోరకంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖునిగా పేరొందిన ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణపై ఆయన స్పందించిన తీరు కూడా అంత అర్థవంతం అనిపించదు. అమిత్ షాతో భేటీ కి సంబంధించి నాగేశ్వర్ వెల్లడించిన విషయాలపై అభ్యంతరం ఉంటే చెప్పవచ్చు కానీ.. కేసు పెట్టడాన్ని పవన్ ఎలా సమర్థిస్తారో? దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్లేస్తామంటే ఊరికే ఉండమని, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవని ఆయన హెచ్చరించడం అంత బాగోలేదు. రాజకీయ విషయాలపై, విశ్లేషణలపై కేసు పెట్టిన సందర్భం ఇదొక్కటే కావచ్చు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒక వ్యక్తి చెప్పిన అంశం నచ్చకపోతే, కరెక్ట్ కాదని భావిస్తే ఖండించవచ్చు. లేదా డామేజీ కోరవచ్చు. కానీ... కేసులు పెట్టి వేధించాలని అనుకుంటే అది ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించడమే! పవన్ కళ్యాణ్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని ఏ ఆధారంతో చెప్పారని, పైగా అది ఏపీ మహిళల పరువుకు సంబంధించినందని పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. అలాగే తిరుమల లడ్డూ వివాదంలో పవన్ ఎంత అభ్యంతరకరంగా వ్యవహరించింది గుర్తు చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజానికి హాని కలుగుతుంది కాని, అమిత్ షాతో భేటీలో పవన్, మనోహర్‌లు ఫలానాది కోరారని అని చెబితే దానివల్ల కలిగే ప్రమాదం ఏమిటో తెలియదని వారు అంటున్నారు. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా పవన్ ఎందుకు ఇలా స్పందించారన్నది చర్చనీయాంశంగా ఉంది. బీజేపీ పెద్దలు ఖండించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవైపు నాగేశ్వర్ అంటే గౌరవమని చెబుతూనే అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటకు ఎలా తెలుస్తాయని ఆయన అన్నారు. ఇంకోసారి అదేమీ జరగలేదని అన్నారు. విశ్లేషకులు వదంతులు మాట్లాడకూడదని అన్నారు. అది ఎవరికైనా వర్తిస్తుంది కదా! ఎల్లో మీడియా ఇలాంటి కథనాలు ఎన్ని వండి వార్చిందో పవన్‌కు తెలియదా! అమ్మ జగనా అంటూ బ్యానర్ కథనాలు ఇచ్చారే. ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయినప్పుడల్లా ఇలాంటి స్టోరీలు అల్లారే. అప్పుడు వారెవ్వరి మీద కేసులు పెట్లలేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. చివరికి జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ పిచ్చి వార్తలు రాసిన టీడీపీ మీడియాపై ఏమైనా కేసులు పెట్టారా? జగన్ జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని పవన్ అన్నారు. ఇంతవరకు సమంజసంగానే ఉంది. కాని జగన్‌ను గతంలో రాజకీయంగా అష్ట దిగ్బంధనం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కలిసి అక్రమ కేసులు పెట్టిన సంగతి ఆయనకు తెలియదా? ఒకరు జైలుకు వెళితే జనసేన ఎదుగుతుందా! క్రైం చేసినోడి గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా అంటూ మాట్లాడారు. దీని భావమేమిటో అర్థం కాదు. అవినీతి కేసులలో చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంలో రోడ్డుపై కూడా పడుకుని రచ్చ చేసింది ఎవరు? జైలుకు వెళ్లి ఆయనతో పొత్తు ప్రకటన చేసింది ఎవరు? ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకంగా వ్యవహరించడం నేతలకు మామూలే అన్న విమర్శకు ఆస్కారం ఇవ్వడం లేదా?కులం, ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తున్నారంటూ పవన్ బాధపడ్డారు.ఆయన నిజంగా వాటి జోలికి వెళ్లకపోతే అభినందించవచ్చు. కాని ఆయన గత కొన్నేళ్లలో చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాల వీడియోలు చూస్తే కులం గురించి, సీఎం పదవి గురించి, ఎన్నిసార్లు మాట్లాడింది కనిపిస్తూనే ఉంటుంది కదా? ఒక వైపు జనసేన కేడర్‌పై జరుగుతున్న దాడులను పరిష్కరించకపోగా, చిన్న, చిన్న వాటి గురించి పట్టించుకోరాదని, సర్దుకుపోవాలని చెప్పడాన్ని వారు ఎలా జీర్ణించుకోగలుగుతారు. బందరులో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు జనసేన నేతకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికారులు, పోలీసులను ప్రయోగించి కూల్చివేస్తే జనసేన ఎంపీ బాలశౌరి అధికారిక సమావేశంలోనే నిలదీశారు. కొల్లూరులో టీడీపీ వారు జనసేన వారిపై దాడి జరిపిన ఘటన కలకలం సృష్టించింది. వీటన్నిటిపై నేరుగా స్పందించలేదు. తాను కమాండర్ అని, తాను చెప్పినట్లు వినాల్సిందేనని, లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని చెప్పక తప్పదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నా బిడ్డ పేరు వాడుకుని గెలిచావ్.. ఇప్పుడు తప్పించుకుంటున్నావ్
-
నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఎంత మొత్తుకున్నా ఏం లాభం? జవాబు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్‌లు ఎప్పటికప్పుడు ఆవు కథ వల్లెవేస్తూ ప్రజలను పదే పదే మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ లేవనెత్తిన అంశాలపై ఈ కూటమి నిర్దిష్ట, నిర్దుష్ట సమాధానం చెప్పలేకపోతోంది.రాజధాని పేరుతో అమరావతిలో జరగుతున్న ధన దోపిడీపై జగన్ కొన్ని రోజుల క్రితం విస్పష్టమైన సమాచారం, గణాంకాలతో వివరించారు. ఇదే సందర్భంలో హత్యా రాజకీయాలు ఎవరివో బాబు అండ్ కో స్పష్టం చేయాలని ప్రశ్నించారు కూడా. పెట్రోలు, డీజిల్ ధరలపై వీరు గతంలో ఇచ్చిన హామీలు.. ప్రస్తుత పరిస్థితులను పోల్చి విమర్శించారు. ‘‘బోత్ ఆర్ నాట్ ద సేమ్’’ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యకు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం, పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్సలు పొంతనే లేదని స్పష్టం చేశారు... ‘‘అవును.. బోత్ కేన్ నెవ్వర్ బీ ద సేమ్’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్‌మీడియాలో హైలైట్‌గా నిలుస్తోంది.జగన్ అన్ని రకాల ఆధారాలతో చేసిన ఆరోపణలకు లోకేశ్, మంత్రి అచ్చెన్నాయుళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటి? వ్యక్తిగతంగా జగన్‌ను విమర్శించడం. దూషణలకు దిగడం. తమ భుజాలు తామే చరచుకుని ‘‘శెభాష్’’ అనుకోవడం. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జగన్ మాట అక్షరసత్యమవుతోంది. లోకేశ్ ఈ మధ్య తన ప్రసంగాల్లో జగన్‌పై కొన్ని విమర్శలు చేశారు.‘‘బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైందా రాజా...’’ అంటూ సినిమా డైలాగు ఒకటి వదిలారు. చేసిన విమర్శలకు ఆధారాలు చూపిస్తే ఓకే కానీ... 99 శాతం అర్ధ సత్యాలుతో వాగడమే సమస్య. అచ్చం తన తండ్రి చంద్రబాబు మాదిరిగానే జగన్ అడిగిన వాటికి సూటిగా జవాబివ్వకుండా ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమవుతున్నారు. హుందా రాజకీయాలు చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షం చేసే ఆరోపణలకు బాధ్యతాయుతంగా జవాబు ఇస్తే గౌరవం కానీ... గొడ్డలి పార్టీ అని, మరొకటి అని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి, చుట్టుపక్కల ఉన్న వారితో ఆహా.. ఓహో అనిపించుకుని మురిసిపోతే ఆయనకే నష్టం.లోకేశ్ వ్యాఖ్యలకు జగన్ దీటుగా ఇచ్చిన సమాధానంతో ఎవరి తీరు ఏమిటన్నది స్పష్టమైపోయింది. వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు... ప్రజాబలంతో గద్దెనెక్కిన తామూ....‘నెవ్వర్ కేన్ బీ ద సేమ్’’ అని స్పష్టం చేశారు. అలాగే.. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ఎలా ఎగవేసింది.. తాము ఎలా నూటికి నూరుశాతం అమలు చేసింది ప్రస్తావించి లోకేశ్ వ్యాఖ్యను పూర్వపక్షం చేశారు. 2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీతోపాటు అనేకానేక ఇతర వాగ్ధానాలిచ్చిన అధికారంలోకి రావడం.. ఆ తరువాత కొంత కాలానికి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్సైట్ నుంచి తొలగించడం తెలిసిందే. 2024లో సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి చాలావాటిని అమలు చేయకుండానే చేసేసినట్లు ప్రచారం చేసి టీడీపీ నేతలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే జగన్ తన మానిఫెస్టోని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టి అంతా దానిని ఫాలో అవ్వాలని ఆదేశించి కొత్త ట్రెండ్ సృష్టించారు. దీనిని చంద్రబాబు, లోకేశ్‌లు కాదనగలరా? దీనిపై వారు సమాధానం చెబితే బాగుంటుంది కదా! అందుకే బోత్ కెన్ నెవ్వర్ సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అవుతుంది.అమరావతి రోడ్లు, భవనాల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని జగన్ అంకెలతో సహా కడిగి పారేశారు. దీనికి లోకేశ్ సమాధానం ఇవ్వలేకపోయారు. కాని మంత్రి అచ్చెన్నాయుడుతో మాత్రం... ‘‘ఆవును అమరావతిలో అయ్యే ఖర్చు వేరు..ఇతర ప్రాంతాలలో అయ్యే ఖర్చు వేరు రెండిటిని ఎలా పోల్చుతారు’’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. కానీ ఏ కారణాల వల్ల చదరపు అడుగుకు రూ.ఇరవై వేలకు పైగా వ్యయం అవుతోందన్నది వివరించలేకపోయారు. జగనేమో నిర్మాణాలలో ఏ కాంపొనెంట్‌కు ఎంత ఖర్చు చేస్తున్నది వివరిస్తూ వివరంగా మాట్లాడారు.చంద్రబాబు, లోకేశ్ తదితరులు వైసీపీని తరచు గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ఏదో పరపతి పెరుగుతుందని, వైసీపీని ప్రజల్లో విలన్ మాదిరి చేసి చూపించవచ్చని తాపత్రయపడుతున్నారు. అయితే నిత్యం ఈ అబద్ధపు ప్రచారమే చేస్తూండటం సంస్కారయుతంగా అనిపించదు. అందుకే జగన్ దానికి బదులు ఇస్తూ టీడీపీపైన, చంద్రబాబు పైన వచ్చిన హత్యారాజకీయాల ఆరోపణల చిట్టాను చదివారు. వాటిలో ఒక్కోదానికి జవాబివ్వకుండా జగన్ తాతగారు రాజారెడ్డి హత్య తర్వాత నిందితులు హత్యకు గురయ్యారని, ఇళ్లు కూల్చారని ఏవేవో ఆరోపణలు చేశారు. వాటిలో నిజం ఉందా?చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది టీడీపీ వారు కాదని ఎన్నడైనా చంద్రబాబు చెప్పగలిగారా? రాజారెడ్డి హత్య జరగడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అయితే ఎదురు ఆరోపణలు చేయడం టీడీపీ ప్రత్యేకత. ఆ తర్వాత ఏమైనా అల్లర్లు జరిగి ఉంటే వాటిని నియంత్రించలేకపోవడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే అవుతుంది కదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చి విమర్శలు చేస్తే ఏమి ప్రయోజనం? చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం గురించి జగన్ ప్రస్తావించారు. అందులో చంద్రబాబువి ఎలాంటి హింసా రాజకీయాలో వెల్లడించారు.దానికి ఇన్నేళ్లకు కూడా చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేదన్నది ప్రశ్న. అలాగే మాజీ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్యకు సంబంధించి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్రపై రాసిన అంశంపై జగన్ నిలదీస్తే దాని గురించి నోరెత్తరు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యతో పలు అంశాలను జగన్ లేవనెత్తారు. అలాగే ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాపై కత్తికట్టి చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ గట్టిగా మాట్లాడారు.వాటన్నిటికి టీడీపీ నుంచి వచ్చే జవాబు ఒకే మాట గొడ్డలి పార్టీ, వివేక హత్య కేసు, తల్లి, చెల్లి.. వివేక హత్య కేసులో జగన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని సీబీఐ తేల్చినా వీరు మాత్రం తమ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తుంటారు. ఆ హత్యలో పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి తరఫున టీడీపీ కేసులు ఎక్కువగా వాదించే సిద్ధార్థ లూధ్రా ఎలా న్యాయవాది అయ్యారన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు.తమిళనాడులో విజయ్ గెలుపులో తన పాత్ర ఏమి ఉంటుందని చాలా హుందాగా జగన్ జవాబు ఇచ్చారు. విజయ్ ఒకచోట జగన్ ఫోటో పట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అమిత్ షాతో పవన్, నాదెండ్ల ల భేటీలో వచ్చిన అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు.అది జరిగిందా? లేదా? అన్నదాని జోలికి వెళ్లకుండా జగన్ గురించి జగన్ పాలన గురించి చంద్రబాబు గురించి, చంద్రబాబు పాలన గురించి, వ్యత్యాసం గురించి అమిత్ షాకు బాగానే తెలుసు అని వ్యాఖ్యానించి టీడీపీ, జనసేనలను డిఫెన్స్‌లో పడేసినట్లు అనిపించింది. జగన్ అప్పుడప్పుడో లేక నెలకోసారి ప్రెస్‌మీట్ పెట్టి వరసబెట్టి పలు అంశాలపై మాట్లాడి కూటమికి గుక్క తిప్పుకోనివ్వకుండా చేయగలుగుతున్నారన్నది మాత్రం నిజం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమిలో చీలికలు.. ఎమ్మెల్యే నానికి చెప్పు చూపించిన జనసేన నేత
-
బొచ్చులో పార్టీ.. మీకేంటి నొప్పి.. కొల్లు రవీంద్రపై జనసేన నేత ఆగ్రహం
-
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు
-
నువ్వు ఎవడివి వాళ్ళ ఇల్లు కూల్చడానికి..!? పోలీసులను ఎవరు తీసుకెళ్లమన్నారు..?
-
అప్పుడో న్యాయం.. ఇప్పుడో న్యాయమా..? అరవ శ్రీధర్ పై బాబు యాక్షన్
-
‘ఒక్కమాట మీకు నచ్చలేదని ప్రొ.నాగేశ్వర్‌ను వేధిస్తారా?’
సాక్షి, అమరావతి: రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జనసేన నాయకులు కేసులు పెట్టడాన్ని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీడియో విడుదల చేశారు. ‘ఆయన మాట్లాడిన మొత్తం అంశాలను పక్కన పెట్టి, అందులో ఒక లైను మాత్రమే పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, కేసులు, బెదిరింపులు... ఏమిటివన్నీ. ఇది ప్రజాస్వామ్యమా. లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనే రాజకీయ గూండాయిజమా?..మీకు నిజంగా ఒక్క మాట తప్పు అనిపిస్తే దానికి ఆధారం అడగండి. రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం.. ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి’ అంటూ తూర్పారపట్టారు. ‘ఓ రాజకీయ విశ్లేషకుడిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వాళ్లను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను ప్రశ్నిస్తూనే వస్తున్నారు. చంద్రబాబును ప్రశ్నించారు, పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌ను ప్రశ్నించారు, జగన్‌ను ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పటి ఆయన నిజాయితీ కూడా మీకు గుర్తుకు రాలేదు...ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయనపై యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా ? ప్రశ్నించే గొంతులను కేసులతో మూసేయాలని చూడడం ప్రమాదకరం. ఈ రోజు నాగేశ్వర్, రేపు ఇంకెవరో...’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో... ఎవరి పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. ఇలాంటి అర్థం లేని కార్యక్రమాలు దయచేసి వెంటనే ఆపండి’ అంటూ జనసేన నేతలకు సూచించారు. ‘నాగేశ్వర్.. మీకు అండగా మేం ఉన్నాం. కీప్ అప్ ది గుడ్ వర్క్’ అంటూ మద్దతు తెలిపారు. -
జనసేన కార్యకర్తపై... టీడీపీ మూకల దాడి
కొల్లూరు: పచ్చమూకల దాష్టీకానికి బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ రక్తసిక్తమైంది. టీడీపీ శ్రేణుల అరాచకపర్వంతో పోలీసులు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి తలెత్తింది. తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన జన సైనికుడు, అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లోనే టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేశారు. పచ్చమూకల విధ్వంసం కారణంగా పోలీసు స్టేషన్లో భీతావహ వాతావరణం నెలకొని స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఏమీ చేయలేక చేతులెత్తేసి ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కుకు వెళ్లిపోయారు. టీడీపీ నాయకుడిని విమర్శించాడన్న సాకుతో దాడి.. కొల్లూరులో నూడిల్స్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న జన సైనికుడు ఉప్పు జానకిరామయ్య టీడీపీ నాయకుడైన మాజీ ఎంపీపీ కనగాల మధుసూధన్ ప్రసాద్‌ను విమర్శించి, చులకనగా మాట్లాడాడన్న సాకుతో ఆ పార్టీ శ్రేణులు దాడి చేసినట్లు రేపల్లె డీఎస్సీ ఆవుల శ్రీనివాసరావు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ మూసేసి ఇంటికి వెళ్తున్న జానకిరామయ్యకు, టీడీపీ నాయకుడి అనుచరులైన కొల్లూరులోని ఓ కాలనీకి చెందిన వ్యక్తులు సమీపంలోని మద్యం దుకాణం వద్ద తారసపడ్డారు. ఈ క్రమంలో తమ నాయకుడిని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ ఆ కాలనీకి చెందిన కొండూరు సురేష్ ప్రశ్నించడంతో ఇరువురి నడుమ మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది.ఈ క్రమంంలో జానకిరామయ్య తలపై మద్యం సీసాతో సురేష్ దాడి చేయడంతో గాయమైంది. వెంటనే బంధువులు, స్నేహితుల సాయంతో ఫిర్యాదు చేసేందుకు జానకిరామయ్య కొల్లూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. తీవ్ర రక్త స్రావమవుతున్న జానకిరామయ్యను వైద్యశాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అతడిని తెనాలి తరలించేందుకు 108 వాహనం వస్తున్న సమయంలో కాలనీ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా పోలీసులతోపాటు, బాధితుడు జానకిరామయ్య, వారి బంధువులపైనా దాడి చేశారు. జానకిరామయ్య మేనల్లుడు రాము బాలశివగంగాధర్ ఆ కాలనీకి వెళ్లి తన మేనమామను కొడతారా... చూసుకుందాం రండి అనడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాలనీకి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు దూసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని తెలుస్తోంది.పోలీసుల జీపు దహనానికి యత్నంవేమూరు సీఐ పీవీ.ఆంజనేయులుతోపాటు, పోలీసు సిబ్బంది కూడా టీడీపీ శ్రేణుల దాడికి గురయ్యారు. స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీసు జీపును రోడ్డుపైకి నెట్టుకెళ్లిన పచ్చ మూకలు ధ్వంసం చేసి దహనం చేసేందుకు ప్రయతి్నంచారు. దాన్ని తిరిగి ఆవరణలోకి తీసుకొచ్చేందుకు వెళ్లిన హోంగార్డు నాగరాజుపై ఇష్టానుసారంగా దాడికి తెగబడి దుస్తులు చింపేశారు. ఇదే క్రమంలో వేమూరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రసాద్‌పైనా దాడి చేశారు. ఈ దాడిలో ఇరువర్గాల వారూ గాయపడడంతో గుంటూరు, తెనాలి వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉప్పు జానకిరామయ్యతోపాటు, అతని సోదరి రాము వెంకటలక్ష్మి, అతని బావ, రాము శివనారాయణ, మేనల్లుడు రాము బాల శివగంగాధర్ గాయాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన గొడవర్తి తేజ, దున్నా చింతయ్య, చొప్పర చింతయ్య గాయాలతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కొల్లూరులో పోలీసుల పహారాకొల్లూరు పోలీస్ స్టేషన్లో దాడి సమాచారంతో రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావుతోపాటు, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు కొల్లూరు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇరు సామాజికవర్గాల నడుమ జరిగిన వివాదం కారణంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కొల్లూరులోని పలు ప్రాంతాల్లో పికెట్ ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.వేమూరు, చుండూరు, రేపల్లె టౌన్, రేపల్లె రూరల్ సీఐలు పీవీ.ఆంజనేయులు, ఎం.ఆనందరావు, బి.అశోక్‌కుమార్, సురేష్‌బాబు, పలు స్టేషన్ల ఎస్ఐలు కొల్లూరులో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు పోలీసు స్టేషన్‌పై చేసిన దాడి ఘటనలో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడి పోలీసు వ్యవస్థకే సవాలుగా మారిందని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అందరిపైనా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి వెనుక రాజకీయ నాయకుల పాత్రపైనా విచారణ చేపడతామని పేర్కొన్నారు. -
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా..!
-
చంద్రబాబు వేస్ట్.. అరవ శ్రీధర్ మాట్లాడిన సంచలన వీడియో విడుదల చేసిన హర్షవీణ
-
మరొక వివాదంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. ముస్లిం మహిళపై వ్యాఖ్యలు
-
అరవ శ్రీధర్ మరో సంచలన వీడియోను విడుదల చేసిన హర్ష వీణ
-
పవన్ సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని డబ్బుల దందా..?
ఉమ్మడి జిల్లా కూటమిలో కుంపట్లు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పేరుకే జనసేనలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెర వెనక ఆట ఆడిస్తున్నది మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంను కలిసిన 24 గంటలు గడవకముందే జనసేన నాయకుడు ఆరోపణలు గుప్పించడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణల వెనుక టీడీపీ ముఖ్యనేత హస్తం ఉందని బాలినేని వర్గం ఆరోపణలు చేస్తోంది. సాక్షి ప్రకాశం : జిల్లా కూటమిలో వర్గ రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. జనసేన ఇప్పటికే రెండు ముక్కలుగా విడిపోవడం తెల్సిందే. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆరు జిల్లాల డీ లిమిటేషన్ సమావేశం బాధ్యతలు అప్పగించడంతో అటు జనసేనలోనే కాకుండా ఇటు టీడీపీలో కూడా అలజడి రేగుతోంది. ఆ సమావేశానికి జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ వర్గం గైర్హాజరవడం ద్వారా బాలినేని ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం చేసింది. బాలినేని ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడంతో ఆందోళనకు పచ్చనేతలు జడా బాల నాగేంద్రం ద్వారా తీవ్రమైన ఆరోపణలు చేయించిందని ఒక వర్గం ఆరోపిస్తోంది. రెండు వర్గాలు పోటా పోటీగా విలేకరుల సమావేశం పెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతో జిల్లా కూటమి నాయకులు ఎండలకు మించి ఉక్కపోతకు గురవుతున్నారు. అధిష్టానాన్ని లెక్క చేయకుండా.... స్థానిక సంస్థల డీ లిమిటేషన్ సమావేశం బాధ్యతలను బాలినేనికి అప్పగించారు. దీంతో ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల సమావేశం ఒంగోలులో నిర్వహించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అండ్ కో ఆ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. తమకు పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన డీ లిమిటేషన్ సమావేశాన్ని స్వయంగా జిల్లా అధ్యక్షుడే బాయ్ కాట్ చేసినప్పటికీ జనసేన అధిష్టానం ఏమీ చేయలేక పోయింది. దీంతో పారీ్టపై జనసేన అధిష్టానం పట్టు కోల్పోయిందన్న విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉండగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులతో తమను ఇబ్బంది పెట్టిన బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై రియాజ్ వర్గం రగిలిపోతున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబును కలిశాక... ఒకవైపు జిల్లా కూటమిలో టీడీపీ, జనసేనలోని వర్గాలు బాలినేనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే బాలినేని కలవడం పచ్చశిబిరంలో అలజడి రేపింది. దీంతో బాలినేనికి చెక్ పెట్టకపోతే ఇక లాభం లేదని భావించిన ఆ వర్గం వ్యూహాత్మకంగా జడా బాల నాగేంద్రంను రంగంలోకి దింపిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాల నాగేంద్రం మొదట్నుంచి బాలినేని ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యే దామచర్ల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన డీ లిమిటేషన్ సమావేశంలో కూడా బాలినేని వెంట ఉన్న బాల నాగేంద్రం ఉన్నట్టుండి ఆయనపైనే ఆరోపణలు చేయడంపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బాలినేని వర్గం ప్రతి విమర్శలు... ఉదయం బాల నాగేంద్రం బాలినేని మీద విమర్శలు గుప్పించారు. సాయంత్రం అయ్యేసరికల్లా బాలినేని వర్గం ప్రెస్‌మీట్ పెట్టి ప్రతి విమర్శలు చేసింది. ఇతర పార్టీ నాయకులు తెర వెనక ఉండి బాలినేని మీద విమర్శలు చేయిస్తున్నారని జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ ఆరోపణలు చేయడం గమనార్హం. సీఎం చంద్రబాబుతో కలిసి జిల్లా పరిస్థితులు చర్చించిన విషయం బయటకు వచ్చిన వెంటనే కొందరు నాయకులు బాలినేని మీద తప్పుడు ఆరోపణలతో ప్రెస్ మీట్ పెట్టించారని అనుమానం వ్యక్తం చేశారు. నాగేంద్రం వెనక ఉన్న వ్యక్తి ఏమీ పీకలేరని ఆమె విరుచుకుపడ్డారు. ఇతర పారీ్టల నాయకులు జనసేనపై పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. ఇరు పార్టీల అధినేతలు మౌనం... జిల్లాలో కూటమి పారీ్టల్లో ఎత్తులు, పై ఎత్తులతో స్థానిక నాయకులు తరచూ వీధిన పడుతున్నారు. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత జనసేన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాలినేనికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయినా టీడీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. జనసేన పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మొదట రియాజ్, అరుణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అరుణను వెంటాడి మరీ దాడి చేసినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఇప్పుడు బాలినేని కార్యక్రమాలను రియాజ్ అండ్ కో బాయ్ కాట్ చేసింది. అయినా సరే జనసేన అధినేత పట్టించుకోవడం లేదు. ఇరు పారీ్టల అధినేతల మౌనం వెనక ఉన్న మతలబు ఏమిటో అర్థం కాక సామాన్య కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పదవులు అమ్ముకుంటున్న బాలినేని...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పదవులు అమ్ముకుంటున్నారని జడా బాల నాగేంద్రం చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ తాల్లూరి, లింగమనేని రమేష్ లతో కుమ్మక్కై పదవులు అమ్ముకుంటున్నారని బాల నాగేంద్రం విమర్శలు చేయడం గమనార్హం. నియోజకవర్గ ఇన్చార్జి పదవికి రూ.10 లక్షలు, జిల్లా అధ్యక్ష పదవికి రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని, ఒంగోలు జిల్లా అధ్యక్ష పదవి ఇప్పిస్తామంటూ ఎన్ఆర్ఐలకు ఫోన్లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో, ఒంగోలు నియోజకవర్గానికి బాలినేని, ఆయన కుమారుడ్ని దూరంగా పెట్టాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రెస్ మీట్ వెనక అధికార పార్టీకి చెందిన కీలకనేత వర్గం హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. -
అరవ శ్రీధర్ కోసం పాట పాడిన హర్ష వీణ
-
మైనర్ బాలికపై జనసేన నేత అత్యాచారయత్నం..
-
పార్టీ కోసం కష్టబడ్డ మాలాంటి వాళ్ళను 2 ఆఫీస్ గేటు దగ్గరకు కూడా రానివ్వడం లేదు
-
కుక్కలాగా.. గుంట నక్క లాగా పడి ఉంటా.. సిగ్గులేకుండా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్
-
కుల పిచ్చి కామెంట్స్... ఆంధ్రా భావన ఎలాగూ లేదు.. కులం కోసమైనా గెలిపించండి
-
ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారు కదా..! ట్రోల్స్ పై పవన్ రియాక్షన్
-
టీడీపీ, జనసేన పార్టీలో చీలికలు
-
అంతర్జాతీయ నగరమని ఊదరగొట్టి.. మున్సిపాలిటీతో సరిపెట్టి..
వెనకటికి ఒక సామెత ఉంది. ఏమి చేస్తున్నావురా అని అంటే పారబోసి, ఎత్తుకుంటున్నానని చెప్పాడట. ఇప్పుడు అమరావతి రాజధానిలో టీడీపీ,జనసేన, కూటమి సర్కార్ తీరు అలాగే ఉంది. చేసిన పనులే మళ్లీ చేయడం,ఇప్పటికే ఉన్న నిర్మాణాలనే మళ్లీ చేపట్టడం, కోట్లు వ్యయం చేసి కంప కొట్టిస్తుండడం, వరద వస్తే నీళ్లు తోడుతుండడం..ఇలాంటి వైనం అందరిని విస్తుపోయేలా చేస్తోంది. ఫలానా ప్రాంతం వరద వస్తే మునిగిపోతుందని తెలిస్తే ఎవరైనా అక్కడ ఇల్లు కట్టుకుంటారా? కాని ఏపి ప్రభుత్వం మాత్రం వరద వచ్చినా ఫర్వాలేదు..వేల కోట్లు వ్యయం అయినా ఫర్వాలేదు..తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. తొలుత 34వేల ఎకరాలు భూముల నుంచి సమీకరించి అంతర్జాతీయ రాజధాని నగరం అవుతుందని ఊదరగొట్టారు. ఇప్పుడు అది కేవలం మున్సిపాల్టీగానే ఉంటుందని, ఇంకా మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.అందులో భాగంగా ఏభైవేల ఎకరాలకు టెండరుపెట్టారు. ఒకప్పుడు చంద్రబాబుకు, టీడీపీకి వీర మద్దతుదారులుగా ఉన్న పలువురు రైతులు, ఆ ప్రాంత గ్రామాలవారు ఈ పరిస్థితిపై మండిపడుతున్నారు.తాము భూములు ఇవ్వబోమని కరాఖండిగా చెబుతున్నారు. టీడీపీ మద్దతుదారు అయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంటివారే రెండో దశ భూమి సమీకరణ ఒక పెద్ద స్కామ్ అని అన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు. వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు నెత్తి,నోరు మొత్తుకుని ఇదంతా భూ దందానే అని,ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా ఉందని వాపోతున్నారు. అయినా వీటన్నిటిని పెడచెవిన పెట్టి కూటమి సర్కార్ వేల కోట్ల వ్యయం చేసే పనిలో పడింది. కొద్ది రోజుల క్రితం అమరావతి గ్రామాలకు ప్రపంచ బ్యాంక్ బృందం ఒకటి వచ్చింది. అక్కడ వరద నియంత్రణకు జరుగుతున్న పనులను పరిశీలించిందట. అమరావతి అభివృద్ది సంస్థ చైర్ పర్సన్ లక్ష్మీ పార్దసారధి వారికి వరద నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.కొండవీటి వాగు 24 కిలోమీటర్లు, పాలవాగు 17 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాన్ని సుందరమైన ఎవెన్యూ ప్లాంటేషన్ తో అభివృద్ది చేస్తామని చెప్పారట.పెనుమాక, శాఖమూరు, నీరుకొండ, లలో కొత్తగా నాలుగు రిజర్వాయిర్లు కడుతున్నామని తెలిపారట.దీనికి మళ్లీ ఈకో టూరిజం అని కలరింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఇక్కడే ఎవరికైనా సందేహం రావాలి!అసలు వరద ప్రాంతంలో భారీ నిర్మాణాలు ఎందుకు కడుతున్నట్లు? ఆ నీటిని మళ్లించడానికి వేల కోట్లు ఎందుకు వ్యయం చేస్తున్నట్లు? ఈ ప్రశ్నను ప్రపంచ బ్యాంక్ బృందం వేయలేదు. ఎందుకంటే వారి వ్యాపారం వారిది. ఇదంతా ఏపీ ప్రజలపై పడే భారమే కదా!అంతేకాదు..కృష్ణ పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడ నేల స్వభావం బహుళ అంతస్థుల భవనాలకు అంత అనువైనవి కావని నిపుణులు మొత్తుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ రాజధాని నగరంలో ఇలా వరద ఎత్తిపోయడానికి లిఫ్ట్ లు ,రిజర్వాయర్ల నిర్మాణం జరగలేదని అర్బన్ వ్యవహారాల నిపుణుడు రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.ఇక్కడ 84 శాతం సాగు,పర్యావరణ భూములు ఉన్నాయని, మూడు పంటలు పండే భూములను నాశనం చేసి పర్యావరణాన్ని దెబ్బ తీశారని మాజీ జనసేన నేత, పర్యావరణవేత్త అయిన బొలిశెట్టి సత్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత పదేళ్లలో పలువురు పర్యావరణవేత్తలు సైతం ఇదంతా పర్యావరణ విధ్వంసం అని హెచ్చరించారు. కేంద్రం గతంలో నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ పంట భూములలో రాజధాని వద్దని స్పష్టంగా చెప్పినా, చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు.ఇటు రేగడి భూములలో కాకుండా,నాగార్జున యూనివర్శిటీ చెంత ఉన్న ప్రభుత్వానికి చెందిన గట్టి భూములలో అవసరమైన నిర్మాణాలు చేసుకుంటే సరిపోతుందని ఎంతోమంది చెప్పినా, చంద్రబాబు వినిపించుకోలేదు. లక్షల కోట్లు ఒకే చోట కుమ్మరించడానికి రెడీ అయిపోయారు.అందులో భాగంగా ఇప్పటికే 47 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు.వేల కోట్ల రూపాయలతో రిజర్వాయిర్లు నిర్మిస్తూ ,వరద ప్రాంతంలో లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం రెండేళ్ల క్రితం వచ్చిన బుడమేరు వరద కారణంగా పడిన గండ్లనే ఇప్పటికీ పూడ్చలేదట. విజయవాడ మునిగిపోకుండా 35 కోట్ల రూపాయలతో 500 మీటర్ల రక్షణ గోడ కడతామని గతంలో హామీ ఇచ్చారు.దానికే దిక్కులేదట.అమరావతిలో మాత్రం అంతర్జాతీయ టూరిజం ఏర్పాటు చేస్తారట.చిత్రమేమిటంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటినే కాదు.. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ లు వంటివాటిని మళ్లీ కొత్త డిజైన్ లతో నిర్మిస్తారట.ఏపీ ఆర్దికంగా అంత పటిష్టంగా ఉంటే ఏమి చేసుకున్నా ఎవరూ కాదనరు,కాని ఒక పక్క చెప్పిన హామీలకు డబ్బులు లేవని పదే,పదే వాపోయే ప్రభుత్వం, అనేక వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరిపై లక్షల కోట్ల అప్పు భారాన్ని మోపడం సరైనదేనా అన్నది చర్చ. మొదటి దశ లో సమీకరించిన భూములకు సంబందించి రైతులకు ప్లాట్లు ఇంతవరకు అభివృద్ది చేసి ఇవ్వలేదు.దానికి ఎన్నివేల కోట్ల వ్యయం అవుతుందో ఎవరూ చెస్పలేరు.ఎప్పటికి ఇస్తారో తెలియదు.దేశంలో ఎక్కడా లేని విధంగా 140 మీటర్ల వెడల్పుతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారట. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.దీనికోసం తమ భూములను గుంజుకుంటున్నారని వారు నిరసన తెలుపుతున్నారు. దేశంలో ఎక్కడా 70 మీటర్లు మించి అవుటర్ రింగ్ రోడ్లు లేవు.కానీ జనమే పెద్దగా లేని ఇక్కడ మాత్రం ఈ స్థాయిలో రింగ్ రోడ్డు వేసి ఏమి సాధిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుకే రెండో దశ భూముల సమీకరణను రైతులు అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండో దశ భూ సమీకరణకు వ్యతిరేకమని ఆ పార్టీ నేత,మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.ఆ ప్రాంత ప్రజలు కూటమి నేతల తీరుపై మండిపడుతూ తమకు మద్దతు ఇచ్చే వారివైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇవన్ని ఒక ఎత్తు అయితే తొలిదశలో ప్లాట్ల కేటాయింపు తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పలుకుబడి కలిగిన ఎల్లో మీడియా పెద్దలకు, ముఖ్యమంత్రి సన్నిహితులకు జగన్ టైమ్ లో దాదాపు పూర్తి అయిన వెస్ట్ బైపాస్ రోడ్డు పక్కన,లేదా ఇతర కూడలి ప్రదేశాలలో వారు కోరుకున్నచోట ప్లాట్లు వస్తున్నాయట.అదే సామాన్య రైతులకు మాత్రం మారుమూల,చివరికి స్మశానాలలో ,వాగులలో ప్లాట్లు ఇస్తున్నారట.దీని గురించి ఆందోళన చెందిన ఒక రైతు కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే.ఇవన్ని ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఐదెకరాల విస్తీర్ణంలో గృహాన్ని ఎలా నిర్మించుకోగలుగుతుందని, అంత పెద్ద ప్లాట్లు ఎలా కొనుగోలు చేయగలిగారని మీడియాలో ప్రశ్నలు వచ్చాయి.ఎకరా 20 కోట్లు ఉందని ఆయన ప్రచారం చేస్తున్నారు కాని, తన వరకు వచ్చేసరికి 3.6 కోట్లకే ఎలా కొనుగోలు చేశారన్న మరో సందేహానికి ఆయన వైపు నుంచి సమాధానం రావడం లేదు. ఆయన ఇంటి పరిసరాలలో మరొకరికి ప్లాట్ రాకుండా దక్షిణవైపు గ్రీన్ జోన్ అని ప్రకటించేశారట.ధనికులు, పలుకుబడి కలిగిన పెద్దలకు ఇదంతా టూరిజంగా కనిపించవచ్చేమో కాని, సామాన్యుడికి మాత్రం కన్నీటి సుడులు సృష్టిస్తుందా అన్న భయం వెంటాడుతోంది.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అసలు జరిగింది ఏంటంటే..?
-
రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే మేనల్లుడు
సాక్షి టాస్క్‌ఫోర్స్: అనకాపల్లిలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడి అనుచరులు ఓ కాలనీ గోడను కూల్చివేయడమే కాకుండా ఇదేమని ప్రశ్నించిన కాలనీవాసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నానితోపాటు ఎమ్మెల్యే బంధువైన కొణతాల బాల సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లిలో విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనుమతి పొందిన లేఅవుట్లో కాలనీ వాసులు నిర్మించుకున్న గోడను జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నాని, ఎమ్మెల్యే బంధువు కొణతాల బాల, విల్లూరి గణేష్, ఆడారి శంకరరావు, శరగడం రమేష్, బుద్ద మురళీ తాతారావు తదితరులు ఈ ఏడాది ఫిబ్రవరి 18న అర్ధరాత్రి పొక్లెయిన్ సాయంతో కూల్చివేశారు.కాలనీ వాసులు తమ రక్షణ కోసం చాలాకాలం క్రితం ఆ గోడను నిర్మించుకోగా.. ఆ గోడ అవతల ఉన్న స్థలంపై జనసేన పార్టీకి చెందిన వ్యక్తులు కన్నేశారు. కాలనీ వాసులు అడ్డు చెప్పేలోపే పాత గోడను తొలగించి.. పక్కన మరో గోడ నిర్మించారు. గోడ తొలగించిన స్థలంలో అది తమ స్థలమేనంటూ బోర్డులు పెట్టారు. గోడ కూల్చివేత, స్థలాన్ని ఆక్రమించడంతోపాటు పక్కనే అక్రమ కట్టడం నిర్మించడంపై కాలనీవాసులు అప్పట్లోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పోలీసులు స్పందించడానికి చాలా సమయం తీసుకున్నారు.ఎమ్మెల్యే బంధువు ఈ వ్యవహారంలో ఉండటంతో కేసు నమోదులో జాప్యం జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు శనివారం (ఈ నెల 9న) బాధితులలో ఒకరైన కాండ్రేగుల బాల వెంకట పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడు, బంధువుపై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే మేనల్లుడు తదితరులు కాలనీవాసులపై శనివారం రాత్రి దౌర్జన్యానికి దిగటం కలకలం రేపింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జనసేన నేతలపై తిరుగుబాటు బావుటా!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనసేన నాయకులపై ఆ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు మాకొద్దంటూ డిమాండ్ చేశారు. నాయకులు సొంత వ్యాపారాలు, పనుల్లో బిజీగా ఉంటూ.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు తమకు వద్దంటూ సీనియర్ నాయకుల సమక్షంలోనే నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తంపై ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మరి కొందరు ముఖ్య నాయకులు హాజరయ్యారు. కొద్ది సేపటికి జిల్లా అధ్యక్షుల నియామకంపై చర్చ ప్రారంభమైంది. వెంటనే వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాము ఫోన్‌చేసినా, ఏదైనా చెప్పుకునేందుకు వెళ్లినా స్పందించరని మండిపడ్డారు. ఆ వెంటనే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నాయకత్వం పైనా నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేని నాయకులు, స్పందించని జిల్లా అధ్యక్షులు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపాదిత పేర్లపైనా అభ్యంతరం ప్రస్తుతం సూచించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో డాక్టర్ హరిప్రసాద్, కిరణ్‌రాయల్, విజయ్ పేర్లు ప్రస్తావించడంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, విజయ్‌కి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తలు ఒకానొక సమయంలో కొట్టుకునే స్థాయికి వెళ్లారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా కార్యకర్తలంతా లేచి.. జిల్లా అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేస్తామని తేల్చిచెప్పారు. అప్పటి వరకు జిల్లా అధ్యక్షుల ఎంపిక జరగటానికి వీల్లేదని పట్టబట్టారు. దీంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా వేయాల్సి వచ్చింది. -
దయచేసి వైద్యాన్ని పేదవాడికి దూరం చేయకండి.. కన్నీరు పెట్టిన రజని
-
సుగాలి ప్రీతి కేసు ఏం చేశావ్!..పవన్ కు పూనమ్ కౌర్ కౌంటర్
-
జనసేన పార్టీ సర్వసభ సమావేశంలో గందరగోళం
-
జనసేన Vs టీడీపీ.. ఫ్లెక్సీలో ఫొటోపై రచ్చ..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ, జనసేనలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల నేతలు మాటల దాడి చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.విశాఖ సౌత్ నియోజకవర్గంలో కనకమహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ఫొటోలు కనిపించలేదు. జనసేన నేతలు టీడీపీ నాయకుడి ఫొటోలను పెట్టలేదు. దీంతో, రాజకీయ దుమారం రేగింది. జనసేన నేతల వైఖరిపై సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే, విశాఖ సౌత్‌లో గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యే వంశీ, సీతంరాజు సుధాకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన నేతల తీరుపై టీడీపీ అధిష్టానానికి సుధాకర్ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ నేతలు.. జనసేన కేడర్‌పై మండిపడుతున్నారు. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . -
సినిమా సూపిత్త మామా..
కాకినాడ జిల్లా: పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్ నటుడు. మేకప్.. పేకప్ ఆయనకు బాగా పరిచయమైన పదాలు. అందుకేనేమో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అధికార యంత్రాంగం కూడా పైపై మేకప్పులకే పరిమితమై పట్టణ సుందరీకరణకు పేకప్ చెప్పడానికి సిద్ధమైంది! స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర పేరుతో పిఠాపురం పట్టణ సుందరీకరణ పనులు ప్రారంభించారు. గోడలపై చిత్రాలు వేయడం, ప్రభుత్వ భవనాలకు రంగులు వేసి సుందరంగా అలంకరించడం వంటి పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాలం చెల్లిన భవనాలకు సైతం మాం...చి మేకప్ వేసి జనాలకు సినిమా చూపించాలనుకుంటున్నారు. మున్సిపల్ పార్కులో ఉన్న మస్తరు కార్యాలయం పూర్తిగా శిథిలమై తుప్పలు, డొంకలతో ప్రమాద స్థితిలో ఉంది. రేపో మాపో కూలి పోయే ఆ భవనానికి మరమ్మతులు చేయకుండా పగిలిపోయిన గోడలకే రంగులు వేసి బొమ్మ చూపిస్తున్నారు. ఇది చూసిన జనం ‘ఇదేనా సుందరీకరణ అంటే’ అని ముక్కున వేలేసుకుంటున్నారు! -
నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్పుతో... పవన్‌పై రెచ్చిపోయిన జనసైనికుడు
-
విజయలో ఉన్నదేంటి..? పవన్ లో లేనిదేంటి..?
-
పవన్ సార్.. మమ్మల్ని బానిసలుగా మార్చకండి!
సాక్షి ప్రతినిధి, కడప: తమిళనాడుకి కాబోయే సీఎం విజయ్‌కు శుభాకాంక్షలంటూనే, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై జనసేన నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘‘విజయ్ వెనుక కులం లేకపోయినా సీఎం అవుతున్నారు. 25శాతం ఓట్లు ఉన్న కులం మీ వెంట ఉన్నప్పటికీ మీరెందుకు పోరాటం చేయలేకున్నారు. మీరెందుకు సీఎం కాలేకున్నారు. మమ్మల్ని బానిసలుగా ఎందుకు మారుస్తున్నారు’’ అంటూ నిలదీస్తున్నారు. తాజాగా రాజంపేట జనసేన ఇన్చార్జి కొనిశెట్టి హరి రాయల్ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరి రాయల్ వీడియో సారాంశం ఇలా ఉంది. పవన్ సార్ విజయ్ను చూడండి.. ''పవన్‌కళ్యాణ్ సార్ మిమ్మల్ని తప్పుబట్టట్లేదు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాం. ఈ జనసేన బిళ్లను చూడండి. 2014లో పార్టీ పెట్టారు. ఆరోజు నుంచి బిళ్లను మోస్తున్నాం. కానీ మా బతుకులు చూడండి, కుక్కల్లాగా బతుకున్నాం. మాది కూడా ఒక బతుకేనా! మాకు ఆత్మగౌరవం లేదు. అధికారంలో ఉన్నా గుర్తింపు లేదు. పార్టీ గెలవకపోయినా వందేళ్లు మీతో నడుస్తాం. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కడప జిల్లాకు వస్తే, వారి పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడతారు. అలాంటిది మీరు ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టుకోరు. పార్టీ కోసం కష్టపడే నాయకులను ఎందుకు కలవరు? నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బందేమిటీ? పార్టీని నిర్మాణం చేసుకుని జనాల్లోకి తీసుకు వెళ్లకుండా ఇలా ఎందుకు సార్! జనాల్లో నమ్మకం పోయింది.ఎవరూ గుర్తించడం లేదు. ఇప్పటికైనా పార్టీ నిర్మాణం చేసి కమిటీలు, ఇన్చార్జీలను వేయండి సార్. పార్టీ పెట్టి 15 ఏళ్లు అయింది. ఎందుకు ఇలా ఒక తరాన్ని బానిసత్వంలోకి నెడుతున్నారు? తమిళనాడులో విజయ్ వెనుక ఎలాంటి కులం లేదు. కానీ మీ వెనుక 25 శాతం ఓట్లు ఉన్న కులం ఉంది. విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లలో అధికారంలోకి వచ్చారు. విజయ్ మాలాంటి వారికి నమ్మకం కలిగించారు. ఇప్పటికైనా పార్టీని ముందుకు నడిపించి మీరు సీఎం అవ్వండి సార్. మీ కాళ్లు పట్టుకుంటాం. మా జీవితాలను నాశనం చేయవద్దు. మాట్లాడితే సస్పెన్షన్లు తగవు. జనసేన పార్టీ మాది. మెగా ఫ్యామిలీతో మాది పేగు బంధం. మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి పోతాం. మీరు ముంచినా మునిగేందుకు మీ వెంట నడుస్తున్నాం. కష్టపడే వారికి అవకాశం ఇవ్వండి సార్..'' అంటూ హరిరాయల్ పవన్‌ను వేడుకుంటూ వీడియోను ముగించారు. -
DMK, AIADMK పట్టిన గతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు
-
పవన్ తలదించుకో విజయ్ ని చూసి నేర్చుకో..
-
పిఠాపురం వర్మపై దాడి.. సీఎం చంద్రబాబు రియాక్షన్
-
పిఠాపురంలో జనసేన మట్టి మాఫియా.. పట్టుకొని దుమ్ము దులిపేసిన వంగా గీత
-
అమ్మ మీద దాడి చేసింది వాడే.. పోలీసుల ముందే దౌర్జన్యం
-
జనసేన మహిళపై.. పచ్చి బూతులతో TDP నేతల దాడి


