 
													సాక్షి,విజయనగరం: నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి చేదు అనుభవం ఎదురైంది. మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆమెను స్థానికులు నిలదీశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బిక్కమోహం వేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
శుక్రవారం పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆమెను నిలదీశారు. తుపాను సాయం కింద బియ్యం పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే లోకం మాధవి గ్రామానికి వచ్చారు. అయితే లబ్ధిదారుల జాబితాలో కొందరికి 25 కేజీల చొప్పున,కొందరికి 50 కేజీల చొప్పున, మరికొందరు పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. ఇదే విషయంపై మత్స్యకార మహిళలు ఎమ్మెల్యేను గట్టిగా నిలదీశారు.
తుపాను నష్టం అందరికీ ఒకేలా ఇవ్వాలి గాని పార్టీల వారీగా వివక్ష చూపడం ఏంటని ప్రశ్నించారు. పరిహారం జాబితా గందరగోళంగా ఉండటంతో ఎమ్మెల్యే సమాధానం చెప్పలేకపోయారు. చివరికి ప్రభుత్వానికి నివేదిస్తామని సమాధానం చెప్పి కారు ఎక్కి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై అన్ని మత్స్యకార గ్రామాలలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
