ఏలూరు: జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. కొయ్యలగూడెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న దంపతులు మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాడాల గ్రామం నుండి మనవరాలి అన్నప్రాసనకై జంగారెడ్డిగూడెం బైక్‌పై వస్తున్న ప్రత్తి జయరాజు(52), భార్య సత్యవతి(45) దంపతులు.. ట్రాలీ ఆటోని ఢీకొట్టి మృతిచెందారు.
కొయ్యలగూడెం శివారు పులి వాగు సమీపంలో బైక్‌ను ట్రాలీ ఆటో ఢీకొట్టింది. దాంతో ఘటనా స్థలంలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


