విశాఖ : కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి జరగలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నార్ మరోసారి ధ్వజమెత్తారు. ఐటీ కంపెనీల ముసుగులో ప్రజల ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కేసులు బనాయించడం, లప్పులు చేయడం, తండ్రీ కొడుకులు గొప్పలు చెప్పుకోవడం ఇవే మిగిలాయని ఎద్దేవా చేశారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 15వ తేదీ) అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వడం.. పెట్టుబడులను ప్రోత్సాహించడం సహజం. రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కట్టాబేడుతున్నారు. ఆ కంపెనిల్లో సత్వ ఒకటి. సత్త్వ కంపెనీకి 30 ఎకరాలు రిషికొండలో ఇచ్చారు.
మార్కెట్ విలువ రూ. 40 కోట్లు ఎకరా ఉంటుంది.మొత్తం 30 ఎకరాలు రూ. 45 కోట్లకే ప్రభుత్వం కేటాయించింది. సత్త్వ ఉద్యోగాలు ఇవ్వదు. ఇది ఒక అద్దెలకు ఇచ్చుకునే సంస్థ. భూమి కేటాయించిన 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఇప్పటి వరకూ డబ్బులు సత్త్వ కంపెనీ కట్టలేదు. డబ్బులు కట్టడానికి గడువు పెంచుతూ జిఓ ఇచ్చారు. వడ్డీ కూడా లేకుండా చేశారు.
రూ. 1500 కోట్లు విలువ చేసే భూమి 45 కోట్లకు కొట్టేసి.. ఆ డబ్బులు కూడా కట్టడం లేదు. సత్త్వ వెనక సీఎం చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. ఆ సంస్థ చేసే నిర్మానాలకు 50 శాతం మళ్ళీ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఒప్పందం ఉందా..?. 50% భూమిలో గృహ నిర్మానాలు చేసుకోడానికి అనుమతి ఇచ్చారు..ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా..?, సత్త్వ అన్ని రాష్ట్రల్లో వేలంలో భూములు కొనుక్కుంది’ అని స్పష్టం చేశారు.


