ఢిల్లీ: రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చర్చలో పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలన్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లలో అనేక తేడాలు వచ్చాయన్న వైవీ సుబ్బారెడ్డి.. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలన్నారు.
సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో ఉంచాలి. ఈవీఎంలను నమ్మలేము. పేపర్ బ్యాలెట్ సిస్టంపైనే అందరికీ నమ్మకం ఉంది. స్వతంత్ర సంస్థ ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై స్వేచ్ఛగా, పారదర్శకంగా ఉండాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


