సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్‌న్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. తనపై నమోదైన 9 అక్రమ కేసుల్లో సీబీఐ విచారణను కాకాణి కోరారు. రిట్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని.. ఏపీ ప్రభుత్వం, సీబిఐ, సిఐడీతో పాటు ప్రతివాదులను హైకోర్టు ధర్మాసనం అదేశించింది. గతంలో తనపై నమోదైన కేసులపై సీబీఐ విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు మెయిల్ చేశారు. సీఎం స్పందించకపోవడంతో కాకాణి.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
కాగా, చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్‌రెడ్డి.. బెయిల్ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వంపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు.


